31, జనవరి 2021, ఆదివారం

దేవాలయం

 🙏💐👏👍😊🤝🙏


*మీరు నూతన దేవాలయం నిర్మించదలచినప్పుడు దయచేసి ఈ ముఖ్య  విషయాలని గుర్తుపెట్టుకోండి.*


🤔🙏 *హిందువులకి ఇది పూర్తిగా చదివితేనే అర్థమవుతుంది. చదవడానికి మీకు తీరిక‌ ఓపిక ఉంటే, చదివి ఇంకా ఏం చేయాలో అందరికీ చెప్పండి.* 😊💐


మొట్టమొదట దేవాలయం పేరుతో ఒక ట్రస్టును రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తరువాత కరంట్ ఎకౌంట్ ని ఏదోఒక బ్యాంకు లో ఓపెన్ చేయండి. 


మీ ట్రస్టులోకి వీరందరినీ సగౌరవంగా ఆహ్వానించండి.....

ఇంట్రస్ట్ గా ఉన్నవారిని + మీకు సపోర్టుగా ఉన్నవారిని + మీ వార్డు, గ్రామ, టౌను, పట్టణంలోని ప్రముఖులని  + ప్రతి కులం నుంచి ఒక్కరు లేదా ఇద్దరిని +  వీలయితే  ఎన్నారైలని + ఫండ్స్ సమకూర్చేవారిని, ఫండింగ్ చేసెవారిని + స్థలం సమర్పించినవారిని, etc., వీలయితే ఒక లీగల్ ఎడ్వైజరుని కూడా ఆహ్వానించండి. 


తరువాత ఆగమ శాస్త్రం తెలిసినవారితో ప్లానుని తయారుచేయించండి.


మీకు కావలసిన దేవతా విగ్రహంకోసము  తిరుమల తిరుపతి దేవస్థానం వారిని సంప్రదించండి. వారు  ఆగమ శాస్త్ర ప్రకారంగా ఉచితంగా లేదా అతి తక్కువ ఖరీదుకి ఇస్తారు.


మీ అనుకూలత ప్రకారంగా, మీకు వీలయినంత వరకూ ఆ దేవాలయం నిర్మాణం చేయబడే ప్రదేశంలోని వారిని ఎక్కువగా ఇన్వాల్వ్  చేయండి. అందువలన హిందూ మత జాగృతిలో అందరూ పాలుపంచుకుంటారు. 


*ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవలసన విషయం ఏమిటంటే... నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు వారి వంశంలోని వారంతా... ఖచ్చితంగా ఆ దేవాలయాన్ని, చిన్నదైనా లేక పెద్దదనా  సంరక్షించుకుంటారు. దేవాలయ నిర్మాణం పూర్తి చేసిన తరువాత ఆదాయం మొదలు అవుతుంది. దేవాలయానికి పరోక్ష ఆదాయాల కోసం అందరూ కలసి ప్లానింగ్  చేసుకోవచ్చును.


ఇంకా పూర్తగా చాలా వివరాలు క్రింద 👇🏼 ఉన్నాయి. చదవండి... 


(Post by the Group Admin. Read all details.)


T.S.Malleswara Prasad.

Chairman.

Bharathiya Vajra Party

National Vice Chairman.

National Consumer Rights Commission.


1-2-18/1/3, Sri Krishna Colony, Near Gateway International School, 

Cell : 9030362942

Budwel, 

Rajendra Nagar, Hyderabad-500030.


www.bharathiyavajraparty.com


1).  మీకు మీరే లీడర్లు.  మీరు తలపెట్టిన కార్యక్రమాలకోసం, ఇతర సంఘాలలో లేదా  కమిటీలలో మెర్జ్ కాకండి. అప్పుడు ఏ పనినీ మీరు చేయలేరు. మీది అటానమస్ కమిటీగా ఉంటేనే మీ పనులు అన్నీ చక్కగా కొనసాగుతాయి.

ట్రస్టు, కమిటీ వ్వహారాలలో       రాజకీయ నాయకులని  ఎట్టి పరిస్థితుల్లోనూ  ఇనవాల్వ్ చేయకండి. 


2).  ఎక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించడానికి అనువుగా ఉంటుందో మీకుమీరే నిర్ణయించండి


3). మీకు అనుకూలంగా‌, సహకారాన్ని అందించే కొద్ది మందితో కూడి  నూతన దేవాలయ నిర్మాణం గురించి మాట్లాడండి. ఏ దేవతా మందిరం అయితే తేలికగా  నిర్మాణానికి ఆ ప్రాంతాల్లోని ప్రజల నుండి సహకారం లభిస్తుందో ఆలోచించి నిర్ణయించుకోండి.


4). దేవాలయనిర్మణ కోసం స్థల సేకరణకి సహకరించేవారిని గుర్తించండి. వారిని ముందుగా కలసి సంప్రదించండి.


5). మరు తలపెట్టిన దేవాలయాన్ని 200 గజాలు లేదా 2 కుంటలు లేదా 4 సెంట్ల నుంచి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో నైనా నిర్మాణం చేయవచ్చు.


6). పర్మనెంట్ గా ట్రస్టుని  రిజిస్ట్రేషన్ చేయించండి.


ఈ ప్రపోజ్డ్ దేవాలయ ట్రస్ట్ లో ఉండవలసిన కమిటీలు.  

A.) దేవాలయ ఆధ్యాత్మిక కమిటీ. B.) దేవాలయ నిర్మాణం , రిపేర్స్  కమిటీ C.) దేవాలయ మేనేజింగ్ కమిటీ. D.) దేవాలయ పండుగల కమిటీ. E.) ప్రింటింగ్ అండ్ మీడియా కమిటీ. F.) ఇతర తాత్కాలిక అనుబంధ కమిటీలు.


ఈ కమిటీలలోని సభ్యులని, ట్రస్టు వారికి సమయానుకూలంగా మార్చుకునే అధికారం ఉంటుంది.


ఈ దేవాలయ  కమిటీలలోకి  అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ గ్రామ పెద్దలతోపాటూ,  ప్రతి హిందూ కులం నుండి ఒక్కో వ్యక్తికి ప్రాధాన్యతని ఇచ్చి కమిటీలోకి ఆహ్వానించండి.  


ట్రస్ట్ వారికి ప్రథమ తాంబూలాలు.

అర్చకులకి,  బ్రాహ్మణులకి దైవ తాంబూలాలు. కమిటీ వారికి ముఖ్య తాంబూలాలు ఇవ్వాలి. 

ఆ తాంబూలంతో పళ్ళు, బట్టలు etc ఇచ్చి వారిని సందర్భానుసారంగా పండుగ సమయాలలో సభాముఖంగా గౌరవించండి. ఇదే హిందూ మతంలో అన్ని వర్గాలలో ఉత్తేజాన్ని, భక్తిని నింపే, పెంచే దేవాలయ ఆచారం.


వీరందరికీ  దైవ దర్శనం చేసుకున్నప్పుడు ముఖ్యతాంబూలాలు ఇవ్వాలి.


So, మీకు అనుకూలంగా ఉన్న  ప్రాంతాలలో దేవాలయ నిర్మాణానికి మీరే ప్రాతినిధ్యం వహించండి. వీలయితే నాకు తెలియజేయండి.


ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఏమిటంటే మీరు తెలివిగా ఒక్కసారి ప్రారంభించితే...  అందరూ కలసికటుగా పూర్తిస్థాయిలో 1 నుండి 3 సంవత్సరాల సమయంలో  పూర్తి చేస్తారు. ఇది సత్యం. ఆ తరువాత కలసికట్టుగా దేవాలయాన్ని నిర్వహిస్తారు.


మీరు చేసే ఈ దైవకార్యాలకి ప్రజలు ఆకర్షితులై పాత దేవాలయాల  పునరుద్ధరణని కూడా ప్రారంభిస్తారు. 


ఈ నూతన లేదా పాత దేవాలయాల విషయంలో అంతరాయాలు ఏర్పడితే 99% మీరే పరిష్కరించుకోగలరు లేదా ....  నాకు తెలియజేయండి.  


హిందూ ధర్మం జాగృతి కోసం ఎల్లప్పుడూ మీ వెంట ఉండే.... 


మీరు నిర్ణయించుకుని చేయబోయే లేదా చేస్తున్న మీ కార్యక్రమాలని అందరికీ, అన్ని గ్రూపులవారికీ తెలియజేయండి.


💐💐💐💐🙏👏😊


ఇంకా క్రింద 👇🏼ఇచ్చిన పూర్తి వివరాలని చదవండి. 

అది దీని వెనుక ఉన్న రాజకీయ కోణము. మీ అందరికీ తెలియాలి.


🙏😊🙏🤝🏻💐


 *ఈ దేశంలో పఠిష్టమైన హిందూ జాగృతి ఏ విధంగా సాధ్యం ?? ఇదే అందరినీ వేధిస్తున్నటు వంటి అతి పెద్ద క్లిష్ట సమస్య. కాని ఇది మా "భారతీయ వజ్ర పార్టీ"  దృష్టిలో ఇది పరిష్కారం కాని సమస్యకానే కాదు.  చదవండి మీకే అర్థమవుతుంది.* 


....  Regarding Hinduism, ..  only some  people are  having psychologically disturbed imbalance mindset  in the country. It is not a problem. Facts and circumstances will restore them. Please read below all details.


T.S.Malleswara Prasad. 

BVP Chairman.

National Vice Chairman. 

National Consumer Rights Commission.

Cell : 9030362942.


* అందుకే హిందువులందరికీ ఇవి  చాలా చాలా ముఖ్యమైన విషయాలు....తెలుసుకుని, మా రాజకీయ ప్లానింగ్ లని పాటించండి. అదే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గము. 


ఈ భూప్రపంచంలో ఏ హిందువుకైనా కోపంవస్తే, గొప్ప అగ్నిజ్వాలగా మారుతాడు. ఆ కోపాగ్ని నుండి...  తనతోపాటుగా  తన హిందూజాతి రక్షణ కోసం  ఇంకా తేజోవంతంగా మారిపోతాడు. అందుకనే  హిందూజాతి, మతము....  చరిత్రకే అందనటువంటి అతి పురాతనమైనది. పళ్ళచెట్లకే రాళ్ళ దెబ్బలన్నట్లుగా, ఛాయాప్రమాణంగా మధ్యలో పుట్టిన ప్రతి అన్యమతముల వలన మనకి ఏదో విధమైన ఇబ్బందులు కొన్ని విధాలుగా కలుగుతూనే ఉన్నాయి. అలా వారు  ఇబ్బందులని కలుగచేసినప్పుడే మనలోని ఐకమత్యం బహిర్గతం అవుతుంది.


ముఖ్యంగా ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి మతపరమైన, వేద ప్రమాణంతో ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. 


జీర్ణదశలో ఉన్నటువంటి ఏ  దేవాలయాన్నైనా  పునరుధ్ధరించడంలో పాత్ర వహించినా లేదా నూతన దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకున్నా ..... వారితోపాటూ వారి కుటుంబ సభ్యులందరితో పాటూ, వారికి సంభందించిన అటుఇటు ఏడు తరాల పూర్వీకులు అందరికీ స్వర్గప్రాప్తి లభిస్తుందని వేదాలు ఘోషిస్తున్నాయి. అందుకే హిందువులు  దేవాలయ నిర్మాణానికి లేదా పునరుద్ధరణకి తమ ప్రాణాలకన్నా ఎక్కువగా  ఎంతో ప్రాధాన్యతని ఇస్తారు.. అదేవిధంగా దేవాలయ నిర్వహణని దేశప్రజలందరూ తమ జీవిత గమ్యంగా చూస్తారు. 


అందుకని మన దేశంలో ప్రజలు నివసించే ప్రతి గ్రామంలో, మండలంలో, టౌనులో, పట్టణంలో, మెట్రో పట్టణంలో ఉన్న ప్రతి సందు/వీధి/వార్డులో చెరువు దగ్గర/కొండలమీద/అడవిలో/కాలువ గట్లమీద/నదీ పరివాహక ప్రదేశాలలో/ ప్రతి కాలనీలో/ హాస్పిటల్స్ ప్రాంగణంలో/ తోటలలో/ మీకు నచ్చిన వివిధ  ప్రదేశాలలో .... మీకు ఇష్టమైనటువంటి హిందూ దైవ దేవాలయాన్ని అందరూ కలసి నిర్మించండి. 


మన హిందువులకి 3 కోట్ల దేవతలు ఉన్నారు. కాబట్టి మనకి దేవతలకి కొదువలేదు. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టండి. 


విస్తృతంగా నూతన దేవాలయాల నిర్మాణాలు, జీర్ణదేవాలయాల  పునరుద్దరణ కార్యక్రామాల వలన, మన దేశంలో ప్రతి సంస్కృతిలోనూ  భాగమయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వారు పాటించే ఆచార సంప్రదాయాలని కాపాడుకోగలుగుతారు. ఇందువలన, తరుచుగా కలవడం వలన, సమిష్టిగా ప్రతి ఒక్కరూ బలవంతులుగా  తయారవుతారు. 


అన్య మతమార్పిడిని ఈ విధమైన కార్యక్రమాల వలన మనం పూర్తిగా అరికట్టవచ్చు. 


ప్రతి ఇంటా ఉన్నటువంటి వారి వారి గ్రామ, కుల, ఇంటి, వంశ, ప్రాంతీయ, దేశీయ ఆచార సాంప్రదాయాలు పఠిష్టమైన రీతిలో కాపాడుకోగలుగుతరు. దీనివలననే హిందూ సంస్కృతి దేశంలో బలిష్టంగా తయారవుతుంది. 


మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ... ప్రతిఒక్కరికీ తను జన్మించిన, పెరిగిన , చదువుకున్న, తల్లిదండ్రులు తాత ముత్తాతలు జీవించిన ప్రదేశాలు,  అదేవిధంగా తన ఉద్యోగ వ్యాపార స్థలాలంటే ఏదో తెలియని అభిమానం, ప్రేమ, వాత్సల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ఇటువంటి ప్రతి కార్యక్రమాలకు ఆయా ప్రదేశాలకి సంభవించిన ప్రతి వారూ తమ పూర్తి సహకారాన్ని అందిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మనం విస్తృతంగా చేపట్టాలి. 


మన మతాన్ని, మన సాంప్రదాయాలని, మన  ఆచారాలని,  కాపాడుకునే స్థిరమైన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి. ప్రభుత్వాలు సహకరించవు. కారణం ...అన్ని మతాలని, కులాలని, జాతులని సమదృష్టితోనే ప్రభుత్వాలు చూడాలి కాబట్టి.


*మనదేశంలో..... .*


1.) 35 రాష్ట్రాలు ఉన్నాయి.

2.) 653 పైగా జిల్లాలు ఉన్నాయి.

3.) 6,577 పైగా బ్లాకులు ఉన్నాయి.

4.) 2,46,630 పైగా పంచాయితీలు ఉన్నాయి.

5.) 5,96,856 పైగా గ్రామాలు ఉన్నాయి.

6.) 40 కి పైగా  పట్టణాలలో .. 10 లక్షలకన్నా ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి.

7.)  396 కి  పైగానే పట్టణాలలో  1 లక్ష  నుండి 10 లక్షల జనాభాను కలిగి ఉన్నాయి.

8.)  2,500 కి పైగానే టౌన్లలో  10 వేల నుండీ  1 లక్ష  వరకూ జనాభాను కలిగి ఉన్నాయి.


కనుక మనమంతా కలసి, ప్రతిఒక్క ప్రదేశంలోనూ‌, దేశం నలుమూలలకి  మన హిందూ ప్రజలకి ఈ విధముగా దేవాలయ  నిర్మాణ సందేశాలను చేరవేయటం వలన అందరిలోనూ నూతన ఉత్సాహం, కదలికలు ప్రారంభమయి, ఇటువంటి  కార్యాచరణలకు కదం తొక్కి మొదలు పెడుతారు. 


 ప్రతి ఒక్కరిలో  నూతనోత్సాహంతో  ప్రవేశించి, ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ విధానాన్ని మనం అనుసరింపజేస్తే, దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దేవాలయాలని  1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలో నిర్మించడం జరుగుతుంది.


ప్రతీ చోటా    ఉత్సాహవంతులు పోటీలు పడితే ఈ నూతన దేవాలయాల సంఖ్య రెట్టింపుకు పైగానే అవుతుంది.  పోటీలు సహజమే కదా...  


So, ఈ విధంగా మన వీర కార్యకర్తలు కార్యక్రమాలని దేశవ్యాప్తంగా చేబడుతుంటే..... అన్యమతస్తులు ఈ దేశంలో ఎన్ని దేవాలయాలపైన దాడులు చేయగలరో ఇప్పడు  చెప్పండి ???


* * ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... దేశంలోని అన్ని ...

వీదులకు,  ఆన్ని  ప్రాంతాలకు, చెరువులకు, నీటిబావులకు, చిన్నా పెద్దా కొండలకు‌, వనాలకు, చిట్టడవులకు, పెద్ద అడవులకు, లోయలకు,  కాలువలకు, బ్రిడ్జీలకు, వంతెనలకు, మీరు చేపడుతున్న ప్రతి  స్కీములకు, పబ్లిక్ కుళాయిలకు,  ఇళ్ళకు, భవంతులకు, ఆట స్థలాలకు, పబ్లిక్ వాటర్ టాంకులకు, రహదార్లకు, విద్యాలయాలకు, సేవాకేంద్రాలకు, హాస్టళ్ళకు,  రచ్చబండలకు, కూడళ్ళకు,  సెంటర్లకు, గ్రంధాలయాలకు, మార్కెట్లకు, బస్సులు ఆగే ప్రదేశాలకు, టాక్సీలకు, ఆటోలకు, వాహనాలకు, ప్రైవేటు సర్వీసులకు, మొదలైన అన్నీటితోపాటూ  అక్కడ జరిగే ప్రతి వ్యాపార వ్యవస్థలకు మీకు  ఇష్టమైన దేవతల  పేర్లనే పెట్టండి.  లేదా మార్చేసేయండి.  


దేశంలో దేనికైనా సరే రాజకీయనాయకుల పేర్లను లేక వ్యక్తుల పేర్లను  మీరు ఆమోదించవద్దు.


*మన బలహీనమైన మనస్సు, నిర్లిప్తతతో మాట్లాడే మాటలు, నిర్వీర్యంచేసే చేతలు, వెనుకంజ వేసే విధానాల వలననే మనమంతా బలహీనంగా అందరికీ కనబడుతున్నాము. ఏ విషయంలోనైనా  బలహీనంగా కనబడితే - ఎదటివారు ఎటువంటివారైనా సరే , దాడులు చేయడానికి విశ్వప్రయత్నం చేస్తారు. కాబట్టి మనలో దాగి ఉన్న శక్తి సామర్ధ్యాలను గుర్తించి, మనం కార్యక్రమాలు నిర్వహించటం వలన, హిందూ మతం మీద ఎటువంటి దాడులూ జరుపలేరు.

 

 So, నివురుకప్పిన నిప్పుకణికల మీద ఉన్న ఛాందస బూడిదని వదిలించే విధమైన ఆలోచనలని ఆచరణలో పెట్టడానికి అందరం కృషి చేద్దాం.


ఏద కొన్నా లేదా అమ్మినా, మీరు ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా లేదా ఉద్యోగం ఇచ్చినా, మీరు కిరాయి ఇంట్లో ఉన్నా లేదా ఇచ్చినా, ఏదైనా సరే హిందూ సంబంధించిన వారితోనే కార్యకలాపాలు చేయండి. అదే విధంగా మీపిల్లల చదువులని కూడా హిందూ సమాజపు  బడుల్లో, కళాశాలలోనే పూర్తి చేయించండి.  మిషనరీ వాటిలో వద్దు. వాటిలో 90% విధ్యార్ధులు హిందూ పిల్లలే చదువుతున్నారు. మన ద్వారా లభించే ధనంతోనే మనకి, మన మతానికి శత్రువులుగా మారుతున్న విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. 


కాబట్టి మనం రాజకీయ విధానాలతో ముందుకు సాగితేనే ఫలితాలు వస్తాయి.


Kindly watch us and our all posts ...


ఇది మీకు నచ్చితే, మీకు తెలిసిన వారికి  ఫార్వార్డ్ చేయండి. వారి సలహాలనికూడా తీసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేద్దాం. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు చెప్పండి. మీ సలహాలు ఎప్పుడూ నాకు అమూల్యమే.. 


*T.S.Malleswara Prasad.*

*Cell: 9030362942.*

*Chairman.*

*Bharathiya Vajra Party.*

*And*

*National Vice Chairman.*

*National Consumer Rights Commission.*


You can contact me at any time please.

బ్రహ్మ స్థానే

 బ్రహ్మ స్థానే కృతం పాపం విష్ణు స్థానే వినశ్యతి

విష్ణు స్థానే కృతం పాపం శివ స్థానే వినశ్యతి


శివ స్థానే కృతం పాపం గురు స్థానే వినశ్యతి

గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి..


బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు 

విష్ణువు వద్ద చేసుకున్న తప్పులు శివుని వద్దచెప్పి దిద్దు కొనవచ్చు 

శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు 

గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పిదిద్దు కొనలేము.

అతిరథ మహారథులు..

 అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!!


అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. 

అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం 

మనకు అర్థమవుతుంది. 

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. 

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.


యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి, 

అతిరథి, 

మహారథి, 

అతి మహారథి, 

మహామహారథి.


1) రథి..💐

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.


సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు -


వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..💐

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు 


వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు 


వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.


ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు - 


వీరు..అతి మహారథులు.


రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, 

అటు ఇంద్రజిత్తు - 

ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐

ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, 


వీరంతా..మహామహారథులు.


మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం 

హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. 

అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.


🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵


ఆదివారం శుభోదయ అభివాదాలతో....


మీ.........

చాగంటి.......

అభ్యర్థన

 *అభ్యర్థన*

*-------*

ఆర్యా !

వేదోఖిలో ధర్మ మూలం - ధర్మో రక్షతి రక్షితః 


మన భారత దేశంలో సాంప్రదాయికమైన వేద పారాయణలు  అఖండముగా జరిగినందున ఇక్కడి శాంతి తరంగాలు ప్రపంచములో ఎక్కడా లేనంత తీవ్రముగా వ్యాపించి వెల్లివిరిశాయి, అన్న విషయము మనందరకు విదితమే. కాలక్రమేణా కనుమరుగుచున్న ఈ వ్యవస్థను పునరుద్ధరించు కొనుటకై శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామీ సంస్మృతి ట్రస్ట్ వారు గత 20 సంవత్సరములుగా తెలంగాణా ప్రాంతములో శ్రీ తెలంగాణా వేద విద్వన్మహా సభలు - వేద పరీక్షలను, అలాగే రాయలసీమ ప్రాంతములో గత 10 సంవత్సరములుగా విద్వన్మహా సభలు - వేద పరీక్షలను,  అలాగే గత 5 సంవత్సరములుగా స్మార్త విద్వన్మహా సభలు - స్మార్త  పరీక్షలను   ప్రభుత్వ, వదాన్యుల సహకారం తో నిర్వహించుచున్న విషయం మీ అందరకు విదితమే. ఈ సంవత్సరం జనవరి చివరి వారంలో రాయలసీమ, ఫిబ్రవరి లో తెలంగాణ, మార్చి లో స్మార్త పరీక్షలు నిర్వహించుటకు తలపెట్టినాము. ఇందుకు సుమారు 25 లక్షల వరకూ ఖర్చగునని అంచనా. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ సహకారం తగినంతగా లేనందువలన  సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తగు ఆర్థిక  సహకారము చేసి / చేయించి ఈ సాంప్రదాయిక వేద విద్యా వ్యాప్తి ద్వారా ప్రపంచానికి శాంతి తరంగాలు అందుటకై సహకరించవలసినదిగా కోరుచున్నాము.


OUR BANK ACCOUNT DETAILS:

Name: S J S S S Trust

SB Account no.52340100002126

IFSC Code: BARB0(read as ZERO)UPPALX

Bank of Baroda, uppal branch


మరిన్ని వివరములకు 


శ్రీ పసుమర్తి బ్రహ్మానంద శర్మ(9849011009), శ్రీ గొర్తి శివ(9704706667),శ్రీ కలువకొలను నరసింహం గార్లను  (9492925133)సంప్రదించండి

అనుమానం..అడగనా

 తాతా..తాతా...ఒక అనుమానం..అడగనా?


అడుగురా చంటీ... ఆడిగితేనే కదా అనుమానం తీరేది..


ఏం లేదు తాతా రోజూ నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావ్ కదా! మరి ఆ చేస్తున్నప్పుడు నువ్వు ' ॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి  నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥ అని ఎందుకు చదువుతావు ? నువ్వేమి గంగ నీటి తోనో గోదావరి నీటి తోనో స్నానం చెయ్యడం లేదు కదా?


మంచి ప్రశ్న వేశావు. సరే జవాబు విను.


మన పూర్వీకులు ఏ పని చేసినా ఒక ఆశావహ దృక్పధం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్ గా వుండే అవకాశం మెరుగుపడుతుంది అని తెలుసుకొని  మన రోజూ వారీ జీవనవిధానంలో కూడా అలా పాజిటివ్ గా ఆలోచించే విధంగా కార్యక్రమాలులో  లేదా అలవాట్లులో  చొప్పించారు. 

మీ మామ్మ చూడు..

బియ్యం అయిపోయాయి అని చెప్పదు. నిండుకున్నాయి అని అంటుంది.

అలాగే దీపం ఆరిపోయింది అనదు, ఘనం అయింది లేదా దీపం కొండెక్కింది అంటుంది

నల్ల పూసల గొలుసు లేదా మంగళ సూత్రం  తెగితే.. గొలుసు పెరిగింది అంటుంది. కానీ తెగింది అని అనదు.

ఇలా ప్రతీదీ పాజిటివ్ గానే చెపుతుంది తప్ప నెగటివ్ గా చెప్పదు.


ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తీసుకుంటే..

మనకి గంగ యమునా గోదావరి వంటి నదులను పవిత్రంగా భావిస్తాం వాటిని దైవాలుగా కూడా కొలుస్తాం వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం. కానీ అన్ని ప్రదేశాల్లో ఆ పవిత్ర నదులు ఉండవు కదా! అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టేసుకున్నాం. అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని గంగపుత్రులు అంటాం. అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకున్నాయో చూశావు కదా! 


నేను కుళాయి నీళ్ల తోనో, చేరువులోనో, యేటి నీళ్ల తోనో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించో లేక ఒక దండం పెట్టో ఆ నీటిని పవిత్ర గంగజాలంగా భావించి స్నానం చేస్తున్నాను అన్న మాట. అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ ని శరీరానికి ఇస్తున్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగాజలంతో సమానం. నా ఆరోగ్యానికి హాని కలుగకుండు గాక అని.


అంటే అలా అనేసుకుంటే అవి నిజంగా గంగ, గోదావరి నీళ్ళు అయిపోతాయా తాతా అని నువ్వు అడగవచ్చు.. దీనికి నేను ఉదాహరణ చెపుతాను.


మా చిన్నప్పుడు రైల్లో వెళుతున్నప్పుడు తాగడానికి నీరు ఇలా మినరల్ వాటర్ బాటిల్స్ లో దొరికేది కాదు..ప్లాట్ ఫామ్స్ మీద కుండలతో ఆ తరువాత కుళాయిలు ఆ తరువాత కూలర్స్ లో అందించేవారు. అదే నీరు భయపడకుండా తాగేవారం.  ఇప్పుడు (చేతిలో కాస్త డబ్బు ఉంటే) ఆ నీరు తాగడానికి భయపడుతున్నాం. అందుకని ₹20 పెట్టి ఒక లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు నువ్వు ప్రతీ సారీ టెస్ట్ చేసి తాగవు కదా! ఆ సీసా మూత సీల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తున్నావ్. మరి ఆ కంపనీ వాడు ఆ సీసాల్లో ఏ బోర్ నీళ్ళో, చెరువు నీళ్ళో పోసి ఉండచ్చు కదా! అలాగే ఈ మధ్య వింటున్నాం ప్లేట్ ఫార్మ్ మీద దొరికే ఆ ఖాళీ బాటిల్స్ లో సాధారణ కుళాయి నీరు పోసి దొంగ సీల్ వేసి ట్రైన్స్ లో అమ్ముతున్నారు అని. అయినా మనం అనుమానం పడకుండా తగుతున్నాం. అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు. అంటే ఆ నీటికి కంపనీ వాడు ఒక బ్రాండింగ్ చేసాడు. నిజంగా టెస్ట్ చేయకపోయినా ఆ పేరు చూసే మనం ఆ నీటి క్వాలిటీ నమ్ముతున్నాం. అంటే మనసుకి ఒక ధైర్య వచనం చెపుతున్నాం. నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు. ఈ నీరు తాగినా నాకు అనారోగ్యం రాదు అని. ఒక వేళ ప్రయాణంలో కానీ ప్రయాణం అయ్యాక గాని సుస్తీ చేసినా ఈ నీటి వల్ల అని అనుమానించం.

అంటే అక్కడ నువ్వు ప్రతీసారీ టెస్ట్ చేయకపోయినా నమ్ముతున్నావ్. అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని ఇస్తోంది అన్నమాట.


అంటే ఈ శ్లోకం చదవడం ద్వారా లేదా ఒక నమస్కారం పెట్టడం ద్వారా ఆ సాధారణ నీటికి మనం మానసికంగా బ్రాండింగ్ చేస్తున్నాం అన్న మాట

       *SO BE POSITIVE*. 

*GANDHIJI ALWAYS HAS*

 *POSITIVE THOUGHTS*


🙏🙏🙏

పాల ఉబ్బసం

 పిల్లల పాల ఉబ్బసం వ్యాధి నివారణ కొరకు నేను ప్రయోగించిన అద్బుత యోగం - 


    పాల ఉబ్బసం వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ము మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డని తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్ట , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్నిబట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపోతుంది . 


   

   గమనిక -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 🛑 *సుప్రీంకోర్టు సంచలన తీర్పు* 🛑


*కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు,

భీమా సంస్థలు , రవాణాశాఖ మరియు ప్రభుత్వం సంయుక్తంగా    ఏప్రిల్ 1వ తారీకు 2021 నుంచి కచ్చితంగా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు జడ్జి ఆదేశించారు...* 

***********


⭕1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా)  ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు.  అలాగే ప్రమాదం పాలైన వారికి  ఏ విధమైన పరిహారం వర్తించదు.


⭕2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.


⭕3. హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాధభీమా వర్తించదు.


⭕4. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ , ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన భీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు.


⭕5.మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన భీమా వర్తించదు.


⭕6. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి .ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.

అదే విధంగా వారి రక్తసంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు.


⭕7. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.


⭕8. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు.


⭕9.ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు , ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభత్వ పరమైన సహాయం అందదు.


⭕10.అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి.


⭕11. కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా వున్నా కూడా ప్రమాదం జరిగితే  ఏ విధమైన భీమా వర్తించదు


Please share to every one🙏🏻

ధార్మికగీత - 127*


                       *ధార్మికగీత - 127*

                        ***************

      *శ్లో:-   ధర్మేణ హన్యతే వ్యాధి: ౹*

               *హన్యంతే వై తథా గ్రహా: ౹*

               *ధర్మేణ   హన్యతే  శత్రు:  ౹*

               *యతో ధర్మః తతో జయః ౹౹* 

                                  *****

 *భా:-  ధర్మమును చక్కగా ఆచరిస్తే,  అది  ఆధులను, వ్యాధులను నివారిస్తుంది. ప్రతికూలంగా ఉన్న గ్రహాలను సానుకూల దిశగా నియం త్రిస్తుంది. ఎంతటి ప్రబల శత్రువుల నైనా అరికట్టి, అణచి వేయగలదు. అందుకే ఎక్కడ ధర్మముంటే అక్కడ  విజయం తథ్యమని పెద్దలు చెబుతారు.* 

☘☘☘☘☘☘☘☘☘☘☘☘

30, జనవరి 2021, శనివారం

తత్త్వవిచారణ

 ప్ర: ఉపనిషత్తులలో పూజలు, పునస్కారాల గురించి చెప్పలేదు, చక్కని తత్త్వవిచారణ మాత్రమే ఉంది. హాయిగా ఆ జ్ఞానాన్ని గ్రహించకుండా, ఈ దేవతా పూజలతో కాలం వ్యర్థం చేసుకోవలసిన అవసరముందా? 


జ: ఉపనిషత్ జ్ఞానానికి దేవతా పూజల పట్ల విరుద్ధ భావమేమీ లేదు. వైద్యం గురించి, వంటల గురించి కూడా ఉపనిషత్తులలో చెప్పబడలేదు. అలాగని వైద్యాన్ని, వంటల్ని విడిచి పెడుతున్నామా! ఉపనిషత్తుల జ్ఞానం వేరు. వైద్యం లాంటి శాస్త్రాలు వేరు. ఇవి శరీరాన్ని బాగుచేయడానికి, పోషించడానికి చెప్పబడినవి. ఉపనిషత్తు తత్త్వాన్ని చెబుతోంది. తత్త్వాన్ని చింతనలో ఉంచుకొని మన క్షేమం కోసం చేయవలసిన కర్మల్ని మానకుండా చేసుకుంటాం. 


అలాగే ఉపనిషత్తత్త్వాన్ని మననం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే, దేవతా పూజలు చేయవచ్చు. ఉపనిషత్తులు దేవతాపూజల్ని నిషేధించలేదు. దేని ప్రయోజనం దానిదే. ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు. 


దేవతా పూజ కేవలం అభీష్టసిద్ధికీ, అనిష్ట పరిహారానికి మాత్రమే కాక 1. కృతజ్ఞతా భావంతోను, 2. చిత్తశుద్ధి కోసం, 3. కృతఘ్నతా దోష నివారణ కోసం చేయాలి. దేవతల వల్లనే ప్రకృతి శక్తులు, మన ఇంద్రియ శక్తులు సమర్ధవంతమౌతున్నాయి కనుకనే కృతజ్ఞతగా వారిని అర్చించాలి. లేని పక్షంలో కృతఘ్నతా దోషం వస్తుంది. అందుకే - ఉపనిషత్తు - *“దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యమ్"* - దేవపితృ కార్యాలలో ఏమరపాటు కూడదు - అంటే 'దేవతలను, పితృదేవతలను మరువరాదు'. యజ్ఞ, అర్చనాది కర్మల ద్వారా వారిని ఆరాధించడం మన విధి. వారి ఆరాధన వల్ల శుద్ధమైన చిత్తానికే తత్త్వవిచారం సాధ్యమౌతుంది.

సంపాదకీయం

 *న్యూయార్క్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ జోసెఫ్ హోప్ రాసిన సంపాదకీయం...*


భారత దేశాన్ని ఒక ఉన్నతమైన, ఉత్తమమైన దేశంగా చెయ్యడమే నరేంద్ర మోడీ ఆశయం.  ఆయన్ని ఆపకపోతే భవిష్యత్తులో భారత దేశం ఒక శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది.  అమెరికా, బ్రిటన్, రష్యాలను మించి పోతుంది. 


నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నాడు.  ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు. 


ఆ చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశ భక్తుడున్నాడు.  ప్రపంచంలోని అన్ని దేశాలను తన దేశ ప్రయోజనాలకోసం వాడుకుంటాడు. 


పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లకు అమెరికాతో సంబంధాలు తెగ్గొట్టాడు. 


వియత్నాంకు చేరువై సూపర్ పవర్ గా ఎదగాలన్న చైనా కలలను భగ్నం చేశాడు.

దక్షిణ చైనా సముద్రంలో చమురు నిక్షేపాలను తోడుకునే విషయంలో వియత్నాంకు చైనాకు మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలో వియత్నాంను బలపరిచాడు.  ఫలితంగా వియత్నాం తన మొత్తం చమురును భారత దేశానికి ఎగుమతి చేస్తోంది.


ఇరాన్ లోని చాబహార్ పోర్టుని తన స్వాధీనంలోకి తీసుకుని ఇరాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్, ఇతర ఐరోపా దేశాలకు భారత దేశ ఎగుమతులకు దారి చేశాడు. 


ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. 


ఆయన ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి.  ఆర్టికల్ 370, 35A రద్దయ్యాయి.  


ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీరును  పూర్తిగా వశపరుచుకుంటాడు.  రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ను నాలుగు ముక్కలయ్యేలా చేస్తాడు. పాకిస్థాన్ కు అపర మిత్రుడైన సౌదీ అరేబియా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. 


ఆసియా ఖండంలో ప్రపంచ దేశాలకు ఆయన తన సత్తా చాటాడు. ఆసియాలో తన ఆధిపత్యాన్ని నిరూపించాడు. 


వీసా అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టిన పాకిస్తాన్ విదేశీ మంత్రికి UAE జరిమానా విధించి వెనక్కి పంపేలా చేశాడు. 


రష్యా, జపాన్ లను అతి సున్నితంగా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. 


చైనా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంచాడు.  ఈ వ్యక్తి భారత రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. 


ఇతర దేశాలు తమకు చాలా మంది శత్రువులు ఉన్నట్లు భావిస్తూ ఉంటాయి.  కానీ ఇండియాకు పాకిస్థాన్ తప్ప మరో శత్రువు లేడు.  భారత్ మిగతా అన్ని దేశాలతోనూ సఖ్యతగా ఉంటుంది.


నరేంద్ర మోడీ యుద్ధం చేయకుండానే పాకిస్థాన్ ను సర్వ నాశనం చేశాడు.  అది కూడా ఇతర ముస్లిం దేశాల మద్దతుతో.  ఒకవేళ పాకిస్థాన్ ఇండియా మీద యుద్ధం చేసినా పెద్దగా నష్టమేమీ లేదు.  


ఇతర దేశాలతో సంప్రదింపులలో ఆయన నిజాయితీ కొట్టొచ్చినట్లు కనపడుతుంది. 


నరేంద్ర మోడీ ప్రపంచంలోని ఉత్తమ నాయకుల్లో ఒకరు. 


త్వరిత గతిన సాగుతున్న భారత దేశ అభివృద్ధి ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. 


ఇంతవరకూ ఎవ్వరినీ నేను ఇంతగా మెచ్చుకోలేదు. 


 - జోసెఫ్ హోప్

వరుణ యాగానికీ

L

*🌧️వరుణ యాగానికీ వర్షానికి సంబంధం ఏమిటి..?🌧️* 




*మంత్రాలకి చింతకాయలు రాల్తాయా..??అంటూ సందేహించే వారికోసం*


     

ॐ మనకి విశ్వంలో వర్షానికి  ముఖ్యంగా రెండు energy systems కారణం గా ఉంటాయి.

    

1.శబ్ద_తరంగాలు 

2.ఉష్ణ_తరంగాలు 


మంత్రాలు ద్వారా శబ్ద తరంగాన్ని , అగ్ని ద్వారా ఉష్ణ తరంగాన్ని ప్రేరేపిస్తున్నాం.. 


ॐ యఙ్ఞాలలో సమిధలు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలు, సోమ (ఒక రకం మొక్క).. యివి వాడతారు.. వాటి ప్రాముఖ్యత యిపుడు చూద్దాం.


ॐ ఆవు నెయ్యి అగ్ని లో వేసినపుడు ఒక లీటరు నెయ్యి కి ఒక టన్ ఆక్సిజన్ వస్తుంది. 


ॐ ఆవు పాలు 100 డిగ్రీలకు ఆహుతి అయ్యాక ethelene oxide వస్తుంది.. యిది సూక్ష్మ క్రిములను చంపేస్తుంది.


ICU లో sterilization కి ఈ gas వాడతారు. కొత్త ఇంటిలో పాలు పొంగించడానికి ఇది ఒక కారణం.. 


ॐ ఆవు పాలు, నెయ్యి కలసినపుడు propelene oxide వస్తుంది. కృత్రిమ వర్షానికి ఈ వాయువే కారణం.


ॐ సోమ అనే మొక్క scientific name ASCLEPIUS ACIDA.. ఈ మొక్క downstream water quality అంటే భూమి లో వున్న నీటి శాతాన్ని, నాణ్యతను పెంచుతుంది. 


ఈ మొక్క ని యజ్ఞంలో వాడటం వల్ల cloud seeding అంటే వర్షపాతం ను పెరిగేలా చేసి cloud condensing మేఘాలను సంక్షేపనం చేసి వర్షం వచ్చేలా చేస్తుంది. యిది ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది. 


ॐ ఆవు పిడకలు తెలిసినదే కదా radiation absorber.. 


ॐ గంధం, నెయ్యి... యివన్ని యజ్ఞంలో కలిసి hydro carbons ని oxidise చేసి formic acid, acetic acid అనే క్రిమినాశిని వాయువులు ఏర్పడతాయి. 

     

ఇది మన యఙ్ఞానికి ఉన్న ప్రాముఖ్యత..🌷

సర్వభూత గణామేయ సౌహార్దాయ 141

 Forwarded message


సర్వభూత గణామేయ సౌహార్దాయ 141 


శ్రీమఠంలో ప్రతిరోజూ సాయంత్రం, ఏనుగులకు బెల్లం కలిపిన అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలు బంతులుగా పెట్టడం అలవాటు. మావటి ఆ అన్నం ముద్దలను చేతిలోకి తీసుకుని, నేరుగా ఏనుగు నోట్లో పెట్టేవాడు.


ఒకరోజు ఏనుగులకు అన్నం పెట్టే సమయంలో పరమాచార్య స్వామివారు మామూలుగా అటువైపు వచ్చారు. ముద్దలుగా చేసిన అన్నాన్ని చూశారు. దగ్గరలోనే ఉన్న సహాయకునితో, “ఈ అన్నం ముద్దలను ఏనుగుకు తినిపించవద్దు అని మావటికి చెప్పు” అని చెప్పి వెళ్ళిపోయారు.


వెంటనే మేనేజరుని పిలిచారు స్వామివారు.


“ఏనుగుకు పెట్టే అన్నాన్ని సరిగ్గా ఉడికించలేదు. పొడిగా, తరకలుగా విరిగిపోతోంది. ఇంత అశ్రద్ధతో, ఇలా దానికి ఆహారం పెట్టరాదు. అది మాటలురాని ఒక జంతువు, దానికి ఇలా సగం ఉడికిన అన్నం పెడతారా? మావటికి చెప్పు. ఈ ఏనుగుకు పెట్టే ఆహారం సాక్షాత్ గజముఖునికి పెట్టే నైవేద్యం లాగా ఉండాలి. అంత భక్తి ఉండాలి. అంత శ్రద్ధ ఉండాలి. మరలా అన్నం వండి, ఏనుగుకు పెట్టండి” అని చెప్పారు.


మాటలురాని ఒక జంతువుపై స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని చూసి శిష్యులు కరిగిపోయారు.


మహాస్వామి వారు ఆ అన్నం ముద్దల్ని చేతిలోకి తీసుకుని పరిశీలించలేదు. అంతెందుకు, అసలు ఒక్క క్షణం అక్కడ నిలబడి వాటివైపు కూడా చూడలేదు. మరి అది సరిగ్గా ఉడకలేదని, తరకలుగా అయిపోయిందని స్వామివారికి ఎలా తెలుసు?


ఇంత చిన్న విషయాల్లో కూడా స్వామివారు తమ సర్వజ్ఞత్వాన్ని చూపేవారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

సుఖమైనా, దుఃఖమైనా

 శ్లోకం:-డా౹౹ సూరం శ్రీనివాసులు


సుఖం వా దుఃఖం వా న నియమితం నాపి నియతం

విభిన్నత్వాచ్చేతోగతికృతిఫలానాం ప్రతిజనమ్౹

పరం స్యాద్వా నిత్యం సుఖ మిహ జగద్దుఃఖ మితి న

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


సుఖమైనా, దుఃఖమైనా నియతంగానూ వుండవు, 

నియమించబడీ వుండవు. ప్రతి వ్యక్తిలో కూడా గతి, 

కృతి, ఫలం భిన్నంగా ఉంటాయి. పరం నిత్యమూ ,

సుఖమూ కావొచ్చు, కానీ జగత్తు దుఃఖమంటే ఎలా? 

విధాతా !సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు 

విఫలుడవవుతున్నావు?

ధార్మికగీత - 126*

 ☘☘☘☘☘☘☘☘☘☘☘☘

                    *ధార్మికగీత - 126*

                      ***************

       *శ్లో:- ఉపేక్ష్య  సమయే కార్యే౹*

              *భగ్నే  చింతా  నిరర్థకా ౹*

              *నిర్గతే   సలిలే    తత్ర ౹*

              *సేతు బంధో  నిరర్థకః  ౹౹*

                             *****

    *భా:- చేయవలసిన పనిని తగిన సమయములో చేయ కుండా, తరువాత ఆ పని పాడయి పోయినదని విచారించడం వలన ప్రయోజనం ఉండదు. నీరు పారు తున్నప్పుడే గట్టు కట్టాలి. తరువాత గట్టు కడితే లాభం ఏమిటి? గత జల సేతుబంధనం అంటే ఇదే!*

☘☘☘☘☘☘☘☘☘☘☘☘

పరాత్మా

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


పరాత్మా జీవాత్మా జగదపి సమానస్థితియుతా

ననన్యజ్ఞాతత్వా దనుగతజనిత్వా దపరధా౹

స్వరూపప్రాప్తిత్వాత్ పునరిహ వయం భిన్నకథనాః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


పరాత్మ , జీవాత్మ  జగత్తు(జడం) కూడా సమాన స్థితి 

కలిగినవే. ఇతరులెవ్వరికీ తెలియకుండా వుంది కాబట్టి 

పరాత్మ , పుట్టుక కొనసాగింపు జరుగుతోంది కాబట్టి 

జీవాత్మ ,మరొక స్వరూపం పొందుతోంది కాబట్టి జడం 

సమాన స్థితి కలిగి వున్నాయి. అయితే మేమేమో ఇక్కడ 

విభిన్నంగా చెబుతుంటాం. విధాతా ! సృష్టిగతిని 

కొనసాగిస్తూ నువ్వెందుకు విఫలుడవవుతున్నావు?

ఋభు మహర్షి

 మన మహర్షులు - 9


 ఋభు మహర్షి


🍁🍁🍁🍁


ఋభు మహర్షి బ్రహ్మకి ఇష్టమయిన పుత్రులంటారే వాళ్ళల్లో ఒకడు. అంటే బ్రహ్మ మానసపుత్రుడన్నమాట,


భగవంతుడు వరాహావతారం ఎత్తినపుడు ఋభువు ఆయనకి శిష్యుడుగా ఉండేవాడు .చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు మంచి నిష్ట కలిగిన వాడు అయిన ఋభు మహర్షి దగ్గరికి పులస్త్య మహర్షికి కొడుకయిన నిదాఘుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమన్నాడు. గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకుని ఋధువు సరేనన్నాడు


నిధాఘుడు గురువయిన ఋభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు ఒక్క ఆద్వైతాన్ని గురించి మాత్రం వంటబట్టించుకోలేక పోయాడు.


నిదాఘుడు వివాహం చేసుకుని యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపస్సు, అతిధులకి సేవచేస్తూ, గురుభక్తి తో కాలం గుడుపుతుండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి


ఒకరోజు ఆయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు.. నిధాఘుడు ఆయన్ని ఆదరించి మహాత్మా ! భోజనం చెయ్యండి అన్నాడు. నాకు అన్నం తినాలని లేదు. ఆరు రుచులు కలిగిన భోజనం పెట్టమన్నాడు. నిదాఘుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టాడు మహర్షి భోజనం పూర్తయ్యాక నిదాఘుడు మహాత్మా! ఆకలి తీరిందా? భోజనం బాగుందా అనడిగాడు


ఆకలి వున్న వాడికి ఆకలి తీరిందా? లేదా? తెలుస్తుంది. నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు, భోజనము రుచిగా ఉందా? లేదా? అనేది దేహానికి సంబంధించింది. మట్టిగోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో ఈ శరీరం కూడ పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలతోనే పోషింపబడుతుంది. ఏది రుచి ఏది రుచి కాదు, నువ్వు, నేను ఇల్లాంటివన్నీ విడిచిపెట్టి ముక్తికి మార్గం చూసుకో అన్నాడు


నిదాఘుడు మహాత్మా ! మీ పేరు చెప్పలేదు అన్నాడు. 


ఆ మహర్షి నా పేరు ఋభుడు, నేను నీ గురువుని అనగానే నిదాఘుడు ఆయన కాళ్ళమీద పడి మిమ్మల్ని చూసి వేయి సంవత్సరాలయిపోయింది. అందుకే గుర్తించలేకపోయాను క్షమించండి అన్నాడు.


ఇంకొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి., 


మళ్ళీ బుభు మహర్షి శిష్యుడు నిదాఘుడు ఉన్న నగరానికి వచ్చాడు, నిదాఘుడు అడవికి వెళ్ళి కట్టెలు, పండ్లు మొదలయినవి పట్టుకొని వస్తూ దార్లో నడవడానకి వీలవక ఒకచోట కూర్చున్నాడు.


ఋధుమహర్షి నిదాఘుణ్ణి చూసి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి ? అని అడిగాడు


. శిష్యుడికి మళ్ళీ మామూలే, గురువుగార్ని గుర్తుపట్టలేదు. నడుస్తుంటే రాజ బలగం అడ్డు వచ్చింది. అందుకే ఆగానన్నాడు.


గురువు మళ్ళీ అడిగాడు. ఇందులో రాజెవరు? బలం ఎవరు? అని. 


శిష్యుడు అది కూడ తెలియదా! ఏనుగు మీద ఉన్నవాడు రాజు అన్నాడు. 


గురువు గారు ఊరుకోలేదు రాజెవరు? ఏనుగెవరు ? అన్నాడు


. శిష్యుడు ఓపిగ్గా పైన ఉన్నది రాజు, క్రింద ఉన్నది ఏనుగు అన్నాడు.


 గురువు శిష్యుణ్ని వదిలి పెట్ట దలుచుకోలేదు. పైన అంటే ఏమిటి క్రింద అంటే ఏమిటి ? అన్నాడు. 


ఇంక శిష్యుడికి కోపం ఆగలేదు. ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడమీద కూర్చుని ఇప్పుడు నేను పైన నువ్వు క్రింద అన్నాడు.


 గురువుగారు ఇంకా వదలడల్చుకోలేదు శిష్యుణ్ణి, నువ్వంటే ఎవరు? నేనంటే ఎవరు? అన్నాడు. 


శిష్యుడు వెంటనే క్రిందకి దూకేసి గురువుగారి పాదాల మీద పడి మహాత్మా! వేయి సంవత్సరాలు గడిచిపోయింది కదా.. మిమ్మల్ని గుర్తించలేదు. క్షమించండి అన్నాడు.


ఋధ మహర్షి నిదాఘుడ్ని లేవదీసి నీకు బ్రహ్మవిద్య గురించి చెప్పాలని వచ్చాను నీకేమయినా సందేహాలుంటే అడుగు. ఇంక రాను అన్నాడు.


 శిష్యుడు మహాత్మా ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి అన్నాడు


ఋభుష మహర్షి వత్సా! ఈ శరీరం మాయచే కప్పబడింది. మేలుకొని వున్నంతవరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది, నిద్రపోయినపుడు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతుంది. పూర్వజన్మ కర్మల వల్లనే మనిషి సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఆశ్మే పరబ్రహ్మం. దాని వల్లనే సర్వేంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి. ఏది పరబ్రహ్మ స్వరూపమో, ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో, ఏది నిత్యమో అదే నేను. బ్రహ్మము నేను నాలోంచే అన్నీ పుడుతున్నాయి. నశిస్తున్నాయి. నేనే విశ్వమంతా ఉన్నాను. కళ్ళు లేకపోయినా చూడగలను, చెవులు లేకపోయినా వినగలను, నాకు పాపము లేదు, చావు లేదు, వేరే జన్మము లేదు, నాకు దేహబుద్ధి లేదు అంతా నేనే. నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత..


అంతా నేనే వేరే ఏమీ లేదు. నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడ పరబ్రహ్మ కదా.. దాని గురించి నీకు ఆలోచన ఎందుకు? అది కూడ వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో. అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది, అప్పుడే ఈ సంసారంతో బంధం కూడ ఉండదు. నువ్వు ఎక్కడనుండయితే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో, దానికి మార్గం భగవన్నామం.


భగవన్నామం చేసుకుని నువ్వు ఎవరో ఎక్కడనుండి, ఎందుకు వచ్చావో తెలుసుకుని అక్కడకి వెళ్ళడానికే నీ తపస్సు ఉపయోగించుకోమని ఋభు మహర్షి నిదాఘుడుకి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు.


తెలుసుకున్నాం కదా...

శిష్యుడికి గురవెంత ముఖ్యమో, గురువుకి మంచి శిష్యుడు కూడ అంతే ముఖ్యం, గురువు ఎప్పుడూ శిష్యుడికి మంచి జరగాలనే కోరుకుంటాడు.


చూశారా! గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలయినా తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకుంటూ, జ్ఞానం, మోక్షం కలిగేలా బోధిస్తూ ఉన్నాడో..


అదే.. గురశిష్య సంబంధం.. తండ్రికి కొడుక్కి.. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం ...


శ్రీ గురుభ్యోన్నమః 🙏


🌸జై శ్రీమన్నారాయణ🌸


🍁🍁🍁🍁

దత్త కరుణ.

 *దత్త కరుణ..*


"శనివారం నాడు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి రావాలని అనుకుంటున్నామండీ..ఆరోజు రాత్రికి అక్కడ మేము బస చేయడానికి ఒక రూమ్ ఇవ్వగలరా?.." అని అతను అడిగాడు..ఈవారం కుదరదు ఆపై శనివారం నాటికి రూమ్ ఇవ్వగలము అని చెప్పాను..ఒక్కక్షణం ఆలోచించి.."పోనీ మేము మంటపం లో పడుకునే అవకాశం ఉన్నదా..? ఈ శనివారం తప్ప నాకు సెలవు లేదు..అందుకని అడుగుతున్నాను.." అన్నాడు.."మంటపం లో ఉండొచ్చు..మీ పేరు చెప్పండి..నమోదు చేసుకుంటాను..ఒకవేళ రూములు తీసుకున్న వాళ్లలో ఎవరైనా రాకపోతే..ఆ రూమ్ మీకు కేటాయిస్తాము.." అన్నాను.."చాలా థాంక్స్ అండీ..నాపేరు హరికృష్ణ, మా ఆవిడ పేరు..శిరీష..మేమిద్దరం వస్తాము..మీకు వీలుంటే రూమ్ చూడండి..లేకుంటే..మంటపం లో ఉంటాము.." అన్నాడు..


అనుకున్న విధంగానే శనివారం నాటి ఉదయం తొమ్మిది గంటల కల్లా హరికృష్ణ, అతని భార్య శిరీష వచ్చారు..మందిరం లోకి వచ్చి, నా గురించి వాకబు చేసి, నేను కూర్చున్న చోటుకి వచ్చారు.."మీరేనా ప్రసాద్ గారు..నమస్తే అంకుల్.." అని ఇద్దరూ ఒకేసారి చెప్పారు..నేనూ నమస్తే అన్నాను.."అంకుల్..రూము ఏదైనా..." అని అతను కొద్దిగా నసుగుతూ అడిగాడు..అందరూ వస్తున్నారని..ఇక మీరు మంటపం లోనే ఉండాలి అని నేను చెప్పాను..అతను తన భార్య వైపు చూసి..మళ్లీ నా వైపు తిరిగి.."సరే అంకుల్..సాయంత్రం పల్లకీసేవ లో పేరు ఎప్పుడు నమోదు చేసుకుంటారు?.." అని నన్ను అడిగాడు..మధ్యాహ్నం మూడుగంటల తరువాత మా సిబ్బంది వద్ద నమోదు చేసుకోండి..అని చెప్పాను..


"అంకుల్..మీరు కొద్దిగా సమయం ఇస్తే..మా సమస్య చెప్పుకుంటాము.." అన్నాడు.."ఇప్పుడు ఖాళీగా వున్నాను..చెప్పండి.." అన్నాను.."మా ఇద్దరికీ వివాహం జరిగి ఆరేళ్ళు అవుతోంది..పెళ్ళైన రెండేళ్ల తరువాత తాను గర్భవతి అయింది..కానీ రెండో నెలలోనే అబార్షన్ అయింది..డాక్టర్ కు చూపించాము..ఒక్కొక్కసారి అలా జరుగుతుందని..కంగారు పడొద్దు..ఈసారి గర్భం వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే..అలా జరుగదు..అని మందులు రాసిచ్చారు..మళ్లీ ఎనిమిది నెలల తరువాత గర్భం వచ్చింది..ఈసారి డాక్టర్ సలహాతో ముందు జాగ్రత్తలు తీసుకున్నాము..మా ఖర్మ ఏమిటో తెలీదు కానీ..మళ్లీ అబార్షన్ జరిగింది..తాను బాగా బాధపడింది..ఇప్పటికి మొత్తంగా మూడు సార్లు అబార్షన్ జరిగింది..ఇప్పుడు రెండో నెల తనకు..ఈ స్వామివారి గురించి బాగా విన్నాను..నేనూ చదివాను..ఒక నమ్మకం ఏర్పడింది..తనకు చెప్పాను..తాను మూడు నెలల నుంచీ స్వామివారి లీలలు ఫేస్బుక్ లో చదువుతున్నదట..నాతో చెపితే..నేను మూఢ నమ్మకం అంటానేమో అని సందేహం తో ఊరుకున్నదట..నేనే ఆడిగేసరికి..సంతోషంగా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నది..గర్భవతి కదా..ఇక్కడ నేల మీద పడుకోవడం కష్టం కదా అని రూమ్ అడిగాను..తానేమో..స్వామివారి ని నమ్మి వెళుతున్నాము..మన బాగోగులు ఆయనే చూసుకుంటాడు..అన్నది..ఇలా వచ్చాము.." అన్నాడు..


"మీ నమ్మకమే మీకు రక్ష.." అన్నాను.. సరే అని ఇద్దరూ లేచి వెళ్లిపోయారు..క్యూ లైన్ లో వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకొని..నమస్కారం చేసుకున్నారు..ఆరోజు సాయంత్రం పల్లకీసేవ కు పేర్లు నమోదు చేసుకున్నారు..సరిగ్గా సాయంత్రం ఆరు గంటలప్పుడు..మా సిబ్బంది నా దగ్గరకు వచ్చి, "అయ్యా..ఈరోజు రూములు బుక్ చేసుకున్న వాళ్లలో ఒకరు ఇంతవరకూ రాలేదు..వాళ్ళ సెల్ కు కాల్ చేస్తే..మాకు ఇబ్బంది వచ్చింది మేము రావటం లేదు..అన్నారు..మీరు చెప్పారు కదా..ఆ దంపతులకు అవకాశం ఇవ్వమని..వాళ్ళకే ఈ రూమ్ ఇద్దాము.." అన్నారు..ఆ దంపతులను పిలిచి విషయం చెప్పాను..సంతోష పడ్డారు.."చూసావా..నేను కష్టపడటం స్వామివారికి ఇష్టం లేదు..అందుకే మనకు రూమ్ ఇప్పించారు.."అని అతని భార్య అన్నది..ఆరోజు పల్లకీసేవ లో ఇద్దరూ పాల్గొన్నారు..ప్రక్కరోజు ఉదయం ప్రభాతసేవ పూర్తి కాగానే..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తమ సమస్య అక్కడ చెప్పుకొని..దయ చూపమని కోరుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం ఊరెళ్లిపోయారు..


పోయిన ఆదివారం ఆ దంపతులు ఇద్దరూ వచ్చారు..ఆ అమ్మాయి చేతుల్లో పసి బిడ్డ ఉన్నది..నేరుగా మా దంపతుల వద్దకు వచ్చి..మా ఆవిడ చేతిలో..ఆ బిడ్డను పెట్టి.."స్వామివారి దయ వల్ల పుట్టింది అంకుల్..అందుకే "దత్త కరుణ" అని పేరు పెట్టుకున్నాము..ఇప్పుడు ఐదో నెల..మా మొరను స్వామివారు విన్నారు..కాకుంటే..ఇక నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది..ఈ బిడ్డ ఒక్కటే చాలు అని స్వామివారే నిర్ణయించారు అనుకున్నాము..ఏదైనా ఆయన దయ.." అన్నది.."నిజం అంకుల్..స్వామివారి ప్రసాదమే ఈ పాప.." అన్నాడు అతను..

స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి వెళుతూ..ఆ దంపతులు మళ్లీ మా దగ్గరికి వచ్చారు.."అంకుల్..స్వామివారు మా కోరిక తీర్చారు..మేము కూడా మా చేతనైన పని ఇక్కడ చేయాలని అనుకున్నాము..అందరికీ ఉపయోగ పడే కార్యం ఉంటే చెప్పండి..మా శక్తి కొద్దీ మేము చేస్తాము.." అన్నారు..ఒక ఐదు నిమిషాలు ఆలోచించి.."మీరే చూసారు కదా..భక్తులు ఉండటానికి వసతి కావాలి..కొన్ని రూములు కట్టాలి..అందుకు మీ చేతనైన సహాయం చేయండి.." అన్నాను.."అలాగే అంకుల్..త్వరలోనే మా వంతుగా విరాళం ఇస్తాము.." అని చెప్పారు..సర్వం..దత్తకృప అని ప్రతిసారీ నేనెందుకు పదే పదే అన్ని పోస్టుల్లో వ్రాస్తుంటాను అని కొంతమంది నన్ను అడిగారు..ఇటువంటి సంఘటనలు కళ్లారా చూసినప్పుడు..అలా రాయడం లో తప్పులేదు అని వాళ్లకు తెలుస్తుంది అని అనుకుంటున్నాను..ఆ దత్తుడి కృపను మీరూ పొందొచ్చు..త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మి కొలవండి చాలు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 99089 73699)

రామాయణమ్ ..201

 రామాయణమ్ ..201

.................................

వాలి శ త్రుసంహారకుడు . మహాబలవంతుడు.

 నాకు నా తండ్రికి ఒకప్పుడు బహు ప్రీతిపాత్రుడు .

.

నా తండ్రి మరణానంతరము జ్యేష్టుడని ఈయనకు రాజ్యాభిషేకము చేసిరి . తాతముత్తాతలనుండి సంక్రమించిన రాజ్యాన్ని అతను శాసించుండగా  సేవకునివలె ఆయనకు వంగి ఉంటిని.

.

మాయావి అనే ఒక రాక్షసునికి ఒక స్త్రీ మూలమున వాలి తో వైరము ఏర్పడినది .దుందుభి ,మాయావి అన్నదమ్ములు .

.

ఆ మాయావి ఒకరోజు రాత్రి వేళ జనులనందరూ గాఢ నిద్రలో మునిగిఉన్న వేళ నగరద్వారము వద్దకు వచ్చి భయంకరమైన కేకలు వేయుచూ వాలిని యుద్ధానికి ఆహ్వానించినాడు .

.

అప్పుడు నిదురలో ఉన్న మా అన్న వాలి కోపించి వేగముగా బయటకు వచ్చినాడు .మేము వారించిననూ వాలి మా మాట వినక వానితో యుద్ధానికి బయలుదేరినాడు .

.

నేను కూడా అన్నపై గల స్నేహముతో ఆయన వెంట బయలు దేరినాను .

.

మా ఇరువురినీ చూసి ఆ అసురుడు భయపడి చాలా దూరము పారి పోయినాడు .

.

నిశిరాతిరిలో నిండు చందురుని వెన్నెలలు మాకు దారి చూపాయి.

.

అంత ఆ అసురుడు అత్యంత వేగముగా ఒక బిలములోనికి దూరినాడు .ఆ బిలము చుట్టూరా  గడ్డి కప్పబడి ఉన్నది .

.

అప్పుడు మా అన్న ఎలాగైనా వాని సంగతి చూడాలని పట్టుదలతో కోపావేశములు కలవాడై నన్ను ఆ బిల ద్వారము వద్దనే కావలి ఉండమని ఆజ్ఞాపించి తానూ మహా వేగముగా లోపలికి దూరినాడు .

.

అంతటా నిశ్శబ్దము!

.

 ఏ విధమైన ధ్వనులూ లోపలినుండి వినిపించుటలేదు .....

.

ఒక సంవత్సరము గడిచి పోయినది ...

.

జానకిరామారావు వూటుకూరు

.

విమానం లో భోజనం

 *విమానం లో భోజనం* మనసు పెట్టి చదివే కథ, మనసు న్నోళ్ళ కథ,

.

విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని 

" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి 

.

" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు 

" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే ! 

" సరే ! " 

నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...

నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...

నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను . 

వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .

నేను అంతా గమనించాను . మీకు అభినందనలు . 

ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.

ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...

మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ." 

నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను . 

అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు . 

అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు 

విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు . 

ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి . 

.

ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.

" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !

మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !

ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే. 

- జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

సూర్య నమస్కారానికి అరుదైన ఘనత

 భారత సూర్య నమస్కారానికి అరుదైన ఘనత


భారత సూర్య నమస్కారానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత దక్కింది. ‘సూర్య నమస్కార్ యజ్ఞ’ను గుర్తిస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. “మిస్టర్ స్పీకర్, హిందూ స్వయం సేవక్ సంఘ్ పదవ వార్షికోత్సవం సందర్భంగా ‘సూర్య నమస్కార యజ్ఞ’ను గుర్తించాలని కోరుతున్నాను” అని ఇల్లినాయిస్ ప్రజా ప్రతినిధి బిల్ ఫోస్టర్ బుధవారం నాడు ప్రతినిధుల సభలో తెలిపారు. ఇది చాలా సులభమైన యోగాసనమని గుర్తు చేసిన ఆయన శ్వాసకు సంబంధించిన మెళకువలను ఇది నేర్పిస్తుందని, ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుందని, మనసుకు సాంత్వన చేకూరుస్తుందని ఈ సందర్భంగా ఫోస్టర్ వ్యాఖ్యానించారు. యోగా ఫర్ హెల్త్ అంటూ ఈనెల 14 నుంచి పదిహేను రోజుల పాటు హిందూ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించనున్న ప్రచారం 29తో ముగియనున్న సంగతి తెలిసిందే. యోగా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంఘం ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా పోస్టర్ కొనియాడారు.


పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస, వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం.

పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు అవడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.


సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు , ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది. ఆత్మకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. సమతుల్యం, సహనం, నిర్దిష్ట మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనో విశ్లేషణ, హృదయ వివేకాన్ని సాధకుడు పొందుతాడు. ద్వాదశ సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలు గోప్యమైనవి. వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఇవి ప్రణామ ప్రవాహంగా అవిచ్చిన్నంగా సాగుతాయి. వీటిలో మొండెం, మెడ ముందుకు , వెనుకకు , పైకి, కిందకు ప్రధానంగా కదులుతాయి. ఈ కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి.


ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రెండు .

వేసే ప్రతి ఆసనంలోను శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది .

శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది. శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం.

ముఖ్య సూత్రం .


ప్రాణాయామం, సూర్యనమస్కారం, విశ్రాంతి ఆసనమైన శవాసనం అనే మూడు ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి.


జాగ్రత్తలు

ఋతు సమయాలలోను, వెన్నెముక కింది భాగంలో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీటిని ఆచరించకూడదు. గుండె , రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలున్న వారు, జ్వరం, అల్సర్ లు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు.


సూచనలు

ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే జీవనశైలికి అలవాటుపడిన వారు, చెడు రక్తం, జీర్ణ సమస్యలు వంటి రుగ్మతలున్నవారు ' పవనముక్తాసన శ్రేణి' భంగిమలను మెల్లగా ప్రాక్టీస్ చేసి ఆ తరవాత సూర్య నమస్కారాలకు ఉపక్రమించాలి . పవనముక్తాసనం వలన శరీర భాగాలలోని మజిల్స్ సాగి, సూర్య నమస్కారాలలోని కదలికలకు అనువుగా సర్దుకుంటాయి.

అలా కాని పక్షంలో కీళ్ళ నొప్పులు , జ్వరం, పాదాలవాపు , చర్మం పగలడం వంటి సమస్యలు వస్తాయి.


సూర్యనమస్కారాలను సాయంత్రం వేళల్లో చేయకూడదు .

సూర్యుని వైపు తిరిగి, వేకువఝామునే సూర్య నమస్కారాలు చేయడాన్ని అభ్యసించాలి.


ఆసనాలు: 

1. ప్రణామాసనం

నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి.

' ఓం మిత్రాయ నమః ' అందరికీ మిత్రుడనైన నీకు అంజలి ఘటిస్తున్నాము అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని పఠించాలి .


ప్రయోజనాలు :

ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచడం వల్ల, మనస్సును హృదయం పై కేంద్రీకరించి ఉండటం వల్ల మనస్సు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది.


2.హస్త ఉత్థానాసనం

శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి. ' ఓం రవయే నమః' ప్రకాశవంతుడైన ప్రకాశదాతవైన నీకివే వందనాలు దేవా! అనే అర్థాన్నిచ్చే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి.


ప్రయోజనాలు :

వెన్నెముకకు శక్తి ఇవ్వడం , దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఛాతీని విరిచినట్లుగా వెడల్పుగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. అంతేకాక థైమస్, థైరాయిడ్ వంటి గ్రంథులపై బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.


3. పాదహస్తాసనం

శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ' ఓం సూర్యాయ నమః ' సకల ప్రాణుల పుట్టుకకు కారణమైన పరమాత్మ అనే భావాన్నిచ్చే ఈ మంత్రాన్ని జపించాలి.

జాగ్రత్తలు:

మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు . అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది .


ప్రయోజనాలు:

ఈ ఆసనం వల్ల ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది . మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది , కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం సహకరిస్తుంది.


4.అశ్వ సంచలనాసనం

లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ' ఓం భానవే నమః ' అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం ' అనే అర్థాన్నిచ్చే మంత్రం పఠించాలి.


జాగ్రత్తలు :

ప్రారంభ దశలో ఎక్కువమంది సాధకులు మోకాలిని వెనుకకు వంచడాన్ని మరిచిపోతారు. శరీరమంతా సక్రమమైన భంగిమలో ఉన్నదా లేదా అన అంశాన్ని గమనించాలి. చాలామంది పైకి చూడటం మరిచిపోతారు . తప్పనిసరిగా తలను పైకెత్తి చూడాలి. థైరాయిడ్ గ్రంథి చర్య క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది.

ప్రయోజనాలు :

శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, ఎడ్రినల్, మరియు యురోజెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను అధిగమించడం, సంతాన సాఫల్యం , శ్వాసక్రియ మెరుగుపడటం - ఈ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలు. .


5.సంతులనాసనం 

నాలుగవ స్థితి నుండి గాలి నెమ్మదిగా వదులుతూ కాలివేళ్లు నేలను తాకుతూ, ఎడమకాలిని వెనుకకు కదిలించాలి. ఇప్పుడు మోకాళ్ళు రెండు నేలకు దూరంగా ఉంచాలి. శరీరం మధ్య భాగం పైకి ఎత్తినట్లు బోర్లించిన v ఆకారంలో ఉంచాలి. శరీరం మొత్తం కాలివేళ్ల పైన అరచేతులపైన ఆధారపడి నిలవాలి. దృష్టిని మాత్రం ఎదురుగా నేలపై ఉన్న ఏదైనా వస్తువుపైన కేంద్రీకరించి ఉంచాలి. ' ఓం ఖగయే నమః' ' అనాయాసంగా సాగిపోయే దైవానికి వందనాలు' అనే అర్థం వచ్చే ఈ మంత్రం జపించాలి.


జాగ్రత్తలు : అనాయాసంగా సాగిపోయే దైవానికి దైవానికి వందనాలు" అనే అర్థం వచ్చే ఈ మంత్రం జపించాలి.

ఎక్కువమంది ఈ ఆసనం వేసేటప్పుడు శరీరాన్ని చెక్కలా వంగకుండా ఉంచడం మరుస్తారు . కటి భాగాన్ని పైకి ఎత్తి ఉంచుతారు. అలా చేయకూడదు. దీనివల్ల శరీరం బరువు తగ్గదు. శరీరాన్ని వంచకుండా స్టిఫ్ గా ఉంచడం మరవకూడదు.


ప్రయోజనాలు:

ఈ ఆసనం వేస్తే మణికట్టుకు బలం వస్తుంది. మానసిక, శారీరక పుష్టి కలుగుతుంది. ఇది నడుముకు పటుత్వాన్ని ఇస్తుంది. వెన్నెముకకు (క్రింది భాగానికి) బలాన్ని అందిస్తుంది. అందువల్ల అనేక రుగ్మతలు తొలగుతాయి.


6.అష్టాంగ నమస్కారం: 

అర చేతులను, కాలి వేళ్ళను కదిలించకుండా నేలపై ఉంచాలి. మొండాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి. మొదటిగా మోకాళ్ళను నేలకు ఆనించాలి. తరువాత ఛాతీని, గడ్డాన్ని నేలకు తాకించాలి. ఈ భంగిమలో శరీరం అల ఆకారంలో కనిపిస్తుంది. 

' ఓం పూష్ణే నమః' ' సర్వులకు పోషకుడైన నీకు వందనం' అనే భావంతో మంత్రాన్ని జపించాలి. 


జాగ్రత్తలు:

కడుపు, కండరాలు వేలాడకుండా ఈ భంగిమ నిరోధిస్తుంది. మధుమేహం, మలబద్ధకం, జీర్ణ సమస్యల పరిష్కారంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎడ్రినల్ గ్రంథులకు విశ్రాంతినిస్తుంది. హార్మోనులను సక్రమంగా పని చేయిస్తుంది.


7.భుజంగాసనం: 

అష్టాంగ నమస్కారం వలె ఉదరం నేలకు తాకేలా ఉంచాలి. శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుండి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి., మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి.

' ఓం హిరణ్యగర్భాయ నమః ' విశ్వ ప్రతినిధియైన నీకు నమస్కారం' అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని మననం చెయ్యాలి.


జాగ్రత్తలు :

ఈ భంగిమ చివరిలో మోచేతులను చాచకూడదు. ఉదరాన్ని నేలకు అణచి ఉంచాలి.. అలా చేయడం వల్ల ఉదర గ్రంథులు చురుకుగా పనిచేస్తాయి.


ప్రయోజనాలు:

ఒత్తిడి, స్థూలకాయం, వెన్నెముక సమస్యలు, థైరాయిడ్ సమతుల్యం, యురోజెనిటల్ సమస్యలు - ముఖ్యంగా ఋతుక్రమ సంబంధమైన, ఋతువాగి పోవడం వలన వచ్చే సమస్యలకు ఈ భంగిమ అమోఘంగా పని చేస్తుంది . తొడలు , పిరుదులు, శరీరం వెనుకభాగాన్ని ఈ ఆసనం తీర్చిదిద్దుతుంది .


8.పర్వతాసనం :

పద్మాసనం లో కూర్చునే విధంగా కూర్చుని రెండు చేతులను ఒక చోట చేర్చి చిత్రంలో చూపిన విధంగా చేతులను సాగదీస్తూ పైకి ఎత్తాలి.

ప్రయోజనాలు :


వెన్నెముకకు ఇది మంచి వ్యాయామం , ఫలితంగా వెన్నునొప్పులకి ఇది ఔషధంలా పని చేస్తుంది.


జాగ్రత్తలు : కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ వ్యాయయం చేయకూడదు .


9.అశ్వసంచాలనాసనం :

పై ఆసనాల నుండి నెమ్మదిగా కటిద్వయాన్ని కిందికి దించి కుడికాలిని కొంచెం ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి ఉంచాలి. ఎడమ మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్థ చంద్రాకారం కలిగి గుఱ్ఱం ఆకారం వలె ఉంటుంది. 

' ఓం ఆదిత్యాయ నమః' 'విశ్వ సుతుడైన నీకు ప్రణామం' అనే మంత్రం స్మరణీయం.


ప్రయోజనాలు: ఈ ఆసనం వలన ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది. కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.


10.పాద హస్తాసనం 

అశ్వభంగిమ నుండి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తి ముందుకు నుంచునే విధంగా వంగాలి. చిత్రంలో చూసి అభ్యసించాలి. పై వివరాలే దీనికీ వర్తిస్తాయి.

' ఓం పవిత్రే నమః ' ' చైతన్యం కలిగించే వానికి ప్రణామం' అన్న భావాన్నిచ్చే మంత్రం అనుకోవాలి.


ప్రయోజనాలు :

శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, టైమర్ ఎడ్రినల్, మరియు యూరో జెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను సంతాన సాఫల్యాన్ని, శ్వాసక్రియ మెరుగుపరచడం , ఈ ప్రక్రియ వల్ల కలిగే ఉపయోగాలు.


11.హస్త ఉత్థానాసనం 

పై భంగిమ నుండి రెండు చేతులను తల పైకి ఎత్తి ఉంచాలి. అలా చేసేటప్పుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనుకభాగం వద్ద కొద్దిగా వంగాలి. ' ఓం ఆర్కాయ నమః ' ' శక్తిప్రదాతకు నమస్సులు ' అనే భావాన్నిచ్చే మంత్రాన్ని జపించాలి.


ప్రయోజనాలు :

వెన్నెముకకు శక్తి ఇవ్వడం, దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేసే ఆలోచనల వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. 


ఛాతీని తెరచి ఉంచుకోవాలి, శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది . టైమస్, థైరాయిడ్, వంటి గ్రంథుల పై బాగాపని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం , మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.


12.ప్రణామాసనం 

శ్వాసను వదులుతూ రెండు అర చేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి చాతీ వద్ద ఉంచాలి. దీనితో సూర్య నమస్కారాసనాలు పూర్తి అయినట్లే. 

' ఓం భాస్కరాయ నమః ' ' గురువుకు అభివాదం' అనే భావంలో జపం చెయ్యాలి.

29, జనవరి 2021, శుక్రవారం

స్వగృహ

 S A V Foods

స్వగృహ ఆకెళ్ల  ఊరగాయలు 


ఉసిరికాయ

చింతకాయ 

పండుమిర్చి

మామిడి తొక్కుపచ్చళ్ళు 

మామిడి ముక్కల పచ్చడి    

మెంతికాయ

ఆవకాయ 

మాగాయ

గోంగూర 

టమాటో 

నిమ్మకాయ

వంగపండు ఊరగాయ 

కొత్తిమీర ఊరగాయ  

ఉసిరి ఆవకాయ 


పుట్నాల  పొడి

కందిపొడి

ఇడ్లి కారంపొడి 

కరివేపాకు కారం పొడి 

వెల్లుల్లి కారంపొడి 

పల్లీలపొడి 

కూరపొడి 


అన్ని రకాల ఊరగాయ పచ్చళ్ళు, పొడులు ఆర్డరుపైచేసి ఇవ్వబడును కావలసిన వారు సంప్రదించగలరు.

Phone no. 9441593152

Akella Savithri 

Malkajgiri

Hyderabad

ఋచీక మహర్షి

 మన మహర్షులు -8



 ఋచీక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మహానుభావుడైన ఔర్వుని కుమారుడే   మన ఋచీక మహర్షి.


ఋచీక మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు. 


ఒకనాడు గాధి అనే రాజు కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాధి రాజు దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు.


పాపం గాధిరాజు గారికి ఋచీక మహర్షికి తన కూతురు సత్యవతినిచ్చి పెళ్ళి చేయ్యాలంటే బాధగా అనిపించింది. కాని ఏం చేస్తాడు? మహర్షి అడగడానికి వచ్చాడంటే అదేదో భగవంతుడే సంకల్పించి వుంటాడనుకుని ఎందుకయినా మంచిదని ఒక షరతు పెట్టాడు మహర్షీ ! నువ్వు వాయువేగంతో సమానమైన వేగం వున్నవి, నల్లని చెవులు

తెల్లని శరీరాలు వున్న వెయ్యి గుర్రాలు తీసుకురా, అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఋచీక మహర్షి సరేనని వెళ్ళిపోయాడు.


ఋచీక మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి, తిరిగి అవి వరుణదేవుడి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాడు.


 వెంటనే తన తపశ్శక్తితో వరుణలోకానికి వెళ్ళి వరుణుడికి వచ్చిన విషయం చెప్పాడు. 


వరుణదేవుడు ఋచీక మహర్షికి నమస్కారం చేసి, కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదా! అని చెప్పి 'తురంగ తీర్థం'లో స్నానం

చేయించి వెయ్యి గుర్రాలు ఇచ్చి పంపాడు. 


వెయ్యి గుర్రాలను తీసుకుని గాధి మహారాజుకిచ్చి అతని కూతురు సత్యవతిని వివాహం చేసుకున్నాడు ఋచీక మహర్షి.


ఋచీక మహర్షి భార్యను తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేదమంత్రాలతో అగ్ని దేవుడికి ఆహుతి చెయ్యడానికి తయారు చేసిన అన్నం భార్యచేత తినిపించాలనుకున్నాడు


స్వామీ! నా తల్లికి కూడ ఒక కొడుకుని ప్రసాదించండి అంది సత్యవతి. ఈ అన్నం మేమిద్దరం తింటాము అని చెప్పింది.


 ఋచీక మహర్షి ఇద్దరికి విడి విడిగా పెట్టి పండ్లు మొదలయినవి తెచ్చుకోడానికి అడవికి వెళ్ళాడు.


ఆయన వచ్చేలోపు హడావిడి గా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆ హావిర్భాగం తినేశారు... ఆ తొందరలో ఒకరిది మరొకరు తీసికొన్నారు..


ఋచీక మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకుని భార్యని పిలిచి మంత్రజలం చల్లిన అన్నాన్ని, నేను చెప్పినట్లు కాకుండ మార్చుకుని తిన్నారు. నీకు క్షత్రియ థర్నాలున్న కొడుకు, నీ తల్లికి వేదాంతవేది, మహాతపస్సంపన్నుడు అయిన కొడుకు పుడతారు అన్నాడు.


 సత్యవతి భయపడి క్షమించమని భర్తని వేడుకుంది.


 ఋచీక మహర్షి జరగవల్సింది

జరిగిపోయింది. ఇది దైవ నిర్ణయం ఇంక చెయ్యగలిగింది ఏమీ లేదు అన్నాడు


కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు, ఆమె తల్లికి విశ్వామిత్రుడు అనే కొడుకు పుట్టారు. 


 ఋచీక మహర్షి సంసారం వదిలి పెట్టేసి భగవంతుడిలో చేరిపోవడానికి బయలుదేరాడు. 


వెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నదీరూపంలో ఉండేలా వరం ఇచ్చాడు.


 ఆ నదే కౌశికీ నది. గొప్ప పుణ్య తీర్థంగా పేరు పొందింది


చదివేశారా... ఋచీక మహర్షి గురించి!


చూసారా మరి  పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఎన్ని అనర్ధాలు జరిగిపోతాయో ..


అందుకే చక్కగా పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలన్న మాట....


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

యజ్ఞోపవీతం

 *యజ్ఞోపవీతం* 


*యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని అంటారు.*


*దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.*


*’సూచనాత్ బ్రహ్మతత్త్వ స్య వేదతత్త్వస్య సూచనా త్  తత్సూత్ర ముపవీతత్వాత్, బ్రహ్మ సూత్రమితి స్మృతమ్’!!*


*బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేద తత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మ సూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి.*


 *ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.*


*యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి.*


*యజ్ఞోపవీతం పరమ పవిత్ర మైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.*


*యజ్ఞోపవీతాన్ని నవ తంతువు లతో (తొమ్మిది దారపు పోగులతో) నిర్మించాలి.*


*ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -*


*‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయే హోగ్నిస్థథైవ చ తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా పంచమే పితృ దైవత్యం షష్ఠేచైవ ప్రజా పతిః సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ సర్వే దేవాస్తు నవమే ఇత్యే తాస్తంతు దేవతాః’!!*


*మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువు లో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగ దేవత, నాలుగవ తంతువు లో సోమదేవుత, ఐదవ తంతువులో పితృ దేవత లు, ఆరవ తంతువు లో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయు దేవుడు, ఎనిమిదవ తంతువు లో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.*


*‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేద ఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.*


*’తిథివారం చ నక్షత్రం తత్త్వ వేదగుణాన్వితమ్ కాల త్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’*


*ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది.*


*తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాల లోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాల లోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.*


*‘యజ్ఞోపవీతం’ తొంభై యారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠ స్మృతి’ చెబుతోంది.*


*’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతి కాక్షరీ తస్మాచ్చ తుర్గుణం కృత్వా బ్రహ్మతంతు ముదీరయేత్’*


*నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలు గానే ఉపదేశించబడింది.*


*అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం.*


*గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.*


*యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.*


*’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్, తద్ధార్యముపవీతం స్యాత్, నాతిలంబం నచోచ్చ్రితమ్, ఆయుర్హ రత్యతిహ్రస్వం అతి దీర్ఘం తపోహరమ్, యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!*


*అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.*


*బ్రహ్మచారి ఒక యజ్ఞోప వీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి.*


*వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.*


*యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాల ను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీత ధారణ, విసర్జనలు పనికి రావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోప వీతాలను మార్చుకోవాలి.*


*యజ్ఞోపవీతం ధారణ మంత్రం:-*


*“ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః”.*

*ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి.*


*యజ్ఞోపవీతం విసర్జన మంత్రం:-*

*ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మ వర్భో దీర్ఘాయు రస్తుమే*

------------------------^--------

*ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.*


*తీసివేసేటప్పుడు పాదాలకు తగలకుండా నడుము నుంచి క్రిందకు తీసివేసి ఇంటి చూరుపై గాని చెట్లపై గాని ఎవరూ త్రొక్కకుండా ఉండే విధంగా కానీ లేక ఏదైనా నదిలో గాని విసర్జన చేయాలి.*


*యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి.*


*ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే!*


*వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి.*


*యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సు కోసం ఉపయోగ పడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు.

🙏🙏🙏#సర్వంశివసంకల్పం🙏🙏🙏

సుభాషితమ్

 🙏 *శుభోదయమ్*🙏

🌸 *సుభాషితమ్* 🌸 


శ్లో||  రోగార్దతా నఫలాన్యాద్రయన్తే

నవై లభన్తేవిషయేషు తత్త్వమ్

దుఃఖోపేతా రోగిణో నిత్యమేవ

నబుధ్యన్తే ధనభోగాన్నసౌఖ్యమ్!!


*విదురనీతి*


తా|| రోగపీడితులు ఫలములుతిని ఆనందింపలేరు...... 

విషయములలోని సారము పొందలేరు...... 

రోగము కలవారు నిత్యము దుఃఖించుచున్నవారై ధనభోగములు, అన్నము వీటి సౌఖ్యముననుభవింపజాలరు....... 

🙏💖🌷

మూర్తీభవించిన దత్త స్వరూపం..*

 *మూర్తీభవించిన దత్త స్వరూపం..*


"మీ గురించి లోకం ఏమని అనుకుంటున్నదో ఒక్కసారన్నా పట్టించుకున్నారా?..ఎవడో దారినపొయ్యే దిగంబరుణ్ణి "స్వామీ..స్వామీ.." అనుకుంటూ పిచ్చి లో పడ్డారని..మీ మొహాన ఆ మాయగాడు ఏదో మత్తు మందు చల్లాడనీ..లంకెబిందెలు అప్పనంగా మీకు దొరుకుతాయని  మీరిద్దరూ అతని చుట్టూ భజన చేస్తున్నారని లోకం కోడై కూస్తున్నది..ఇప్పటికైనా నా మాట వినండి..వాడి మాయలో పడకండి.." అంటూ ఆ వచ్చినావిడ మా తల్లిదండ్రులకు శతవిధాలా నూరిపోస్తున్నది..మా అమ్మా నాన్న శాంతంగా వున్నారు..ఇంత ఉపోద్ఘాతామూ ఎందుకంటే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారిని మా అమ్మానాన్న సాక్షాత్తూ దత్తావతారంగా నమ్మి..ఆయనకు ఆశ్రయం కల్పించే ఆలోచనలో ఉన్నందుకు ఆరోజుల్లో మా బంధువుల్లో ఏర్పడిన అభిప్రాయం తెలియచేసేటందుకు..


శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసుకునే రోజుల్లో మా తల్లిదండ్రులకు (శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్లే మా తల్లిదండ్రులని నేను పదే పదే చెప్పనక్కరలేదు..పాఠకులకు ఆ విషయం తెలుసు..) పరిచయం అయిన క్షణం నుంచే ..స్వామివారు సాధారణ మానవ మాత్రుడు కాదనీ..ఒకానొక సిద్ధపురుషుడో..లేక ఆ త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడో..ఈ రూపంలో అవతరించాడనీ..ప్రఘాడంగా విశ్వసించారు..క్రమంగా శ్రీ స్వామివారితో వీళ్ళిద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడటం..స్వామివారు తన తపోసాధనకు ఆశ్రమం అవసరమని తలచి..అందుకు కావాల్సిన భూమిని మా తల్లిదండ్రులను అడగటం..వారూ సంతోషంగా స్వామివారు కోరినంత భూమిని విరాళంగా ఇవ్వడం..అందులోనే శ్రీ స్వామివారి ఆదేశం మేరకు శ్రీ మీరాశెట్టి గారు ఆశ్రమం నిర్మించి ఇవ్వడం వంటి పరిణామాలు జరిగిపోయాయి..


శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణానికి ముందుగా కొద్దిరోజుల పాటు మా ఇంట్లో విడిది చేసిన విషయం పాఠకులకు గుర్తు వుండే ఉంటుంది..సరిగ్గా ఆ సమయం లోనే..మా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన మా బంధువుల ఆవిడ పై విధంగా వ్యాఖ్యానించింది..ఆవిడ మా ఇంటికి రాత్రికి వచ్చే ఆఖరి బస్సులో వచ్చింది..ఆ సమయానికి స్వామివారు తాను ఉంటున్న గది లోకి వెళ్లి ధ్యానం చేసుకోసాగారు..అందువల్ల స్వామివారిని చూసే అవకాశం ఆవిడకు కలుగలేదు..కానీ తాను అనదల్చుకున్న మాటలన్నింటినీ..ఆ రాత్రివేళే..తాను నిద్ర పోకుండా..మా అమ్మానాన్న లను నిద్ర పోనివ్వకుండా..మళ్లీ తానెక్కడ మర్చిపోతానో అన్నట్లుగా గబ గబా చెప్పేసింది..


"అమ్మా..నువ్వు ఇంక పడుకో..మేమూ పడుకుంటాము..రేపుదయం పెందలాడే లేచి పనులు చేసుకోవాలి.." అని మా నాన్నగారు కొద్దిగా విసుగ్గా చెప్పిన తరువాత ఆవిడ నిద్ర పోయారు..


ఉదయం నాలుగు గంటల వేళ..శ్రీస్వామివారు గది నుంచి బైటకు వచ్చారు..గది ముందున్న పారిజాతం చెట్టు వద్ద పది నిమిషాలు నిలబడ్డారు..శీతాకాలంలో పారిజాత పుష్పాలు బాగా పూస్తాయి..పైగా వెన్నెల రోజులు..ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి..మెల్లిగా నడుచుకుంటూ ఆవరణ అంతా తిరుగసాగారు..మొగలిచెర్ల లోని  మా ఇంటి వద్ద స్వామివారు ఉన్న ఇరవై రోజుల్లో..కనీసం పది పన్నెండు సార్లు ఈ దృశ్యాన్ని మా అమ్మా నాన్న గార్లతో పాటు పిల్లలం మేమూ చూసివున్నాము..స్వామివారు మా ఇంటి ఆవరణలో తిరిగే సమయం లో ఏదో ఒక స్తోత్రాన్ని..అది విష్ణు సహస్రనామం కావొచ్చు..లలితా సహస్ర నామాలు కావొచ్చు..మధురమైన కంఠంతో ఆలపిస్తూ తిరిగేవారు..అదొక అద్భుత స్వరం..మళ్లీ మళ్లీ వినాలనిపించే గాత్రం..ఆ ప్రభాత వేళ..ఒకరకమైన భక్తి భావం తరంగాల్లా మా యింటి ఆవరణ అంతా వ్యాపించి పోయేది..


అలా స్వామివారు ఆవరణ అంతా తిరిగి తన గదికి పోయేముందు..మా ఇంటి ముందు నిలబడ్డారు..అప్పటికి చీకట్లు తొలగి..వెలుతురు మెల్లిగా వస్తోంది...సరిగ్గా ఆసమయం లోనే..రాత్రి వచ్చినావిడ నిద్ర లేచి..బావి వద్దకు వెళ్లాలని..బైటకు వచ్చింది..స్వామివారు ఎదురుగ్గా నిలబడి వున్నారు..ఆయన ముఖం చిరునవ్వు తో ఉంది..దిగంబరంగా తన కెదురుగ్గా నిలబడి ఉన్న స్వామివారిని చూసినావిడ..ఒక్కక్షణం నిర్ఘాంత పోయింది..అప్రయత్నంగా చేతులు రెండూ జోడించి నమస్కారం చేసింది..ఒక్కసారి కూలబడి నట్లు..నేలమీద కూర్చుని..తన చేతులతో స్వామివారి పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకున్నది.."స్వామీ..స్వామీ.." అనే రెండక్షరాల పదం తప్ప మరో మాట మాట్లాడలేకుండా ఉన్నది..స్వామివారు తన కుడిచేతిని ఆమె నెత్తిన పెట్టి.."పెద్దదానివి అయ్యావు..దైవాన్ని తలుచుకో..నామ జపం చెయ్యి.." అని చెప్పి..వెనక్కు తిరిగి తన గది కి వెళ్లిపోయారు..


మరో రెండు నిమిషాలకు ఆవిడ తెరుకున్నది..వెంటనే మా అమ్మ దగ్గరకు పరుగులాంటి నడకతో వచ్చి.."ప్రభావతీ..స్వామివారు నా నెత్తిన చెయ్యి పెట్టి నామ జపం చేసుకో అని చెప్పారు..మహానుభావుడి దర్శనం పొద్దునే అయింది..గొప్ప యోగి పుంగవుడు మీ ఇంట్లో కాలుమోపాడు..మీ దంపతులు చేసుకున్న పుణ్యం..నా నోటికొచ్చినట్లు వాగాను..తప్పు తల్లీ..మీ నమ్మకమే నిజం..ఆయన దిగంబరుడు కాదమ్మా..సాక్షాత్తూ దత్తాత్రేయుడే..నాకు అలానే కనిపించాడు..దత్తస్వరూపమే మీ ఇంట్లో ఉంది.." అని కన్నీళ్ల పర్యంతం అవుతూ చెప్పింది..


ముందురోజు రాత్రి ఆవిడ మాట్లాడిన మాటలకు..అత్యంత సులభంగా స్వామివారు తానెవరో ఆమెకు నిరూపించి..ఆవిడ వాచాలత్వాన్ని శాశ్వతంగా ఆపడమే కాకుండా..ఆవిడకు మోక్ష మార్గాన్ని కూడా చూపారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా ఆవిడ మొగలిచెర్ల కు వచ్చి స్వామివారి సమాధి వద్ద నిలబడి..తన నెత్తిమీద చేయిపెట్టి..స్వామివారు చెప్పిన మాటలను మననం చేసుకునేది..ఆవిడ జీవించి ఉన్నంత కాలమూ స్వామివారిని తలుచుకుంటూనే ఉండేది..స్వామివారి నే స్మరిస్తూ తన అరవయ్యో ఏట పరమపదించారు ఆవిడ..ద్వేషం నిండిన మనసులో భక్తిని స్థిరపరచారు స్వామివారు.. 


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ప్రశాంతతకి లాజిక్కు*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

😘 *ప్రశాంతతకి లాజిక్కు*


గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు పంప్ చేస్తుంది. మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది.


ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది.


గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం వ్యాకోచించటానికి (అంటే రిలాక్స్ కావటానికి). ఈ 0.5 సెకన్ల రిలాక్స్ టైమ్ లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి శుభ్రపడుతుంది. ఈ రిలాక్స్ టైమ్ తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు.


*మీరు టెన్షన్ లో గానీ కోపంతో గానీ ఉంటే ఏమవుతుంది? మీ మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకన్ల టైమ్ రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్ కి 0.8 కి బదులు 0.3 + 0.4 = 0.7 టైమ్ మాత్రమే తీసుకుంటుంది. నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి (రిలాక్సేషన్) 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది*.


ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని మీ శరీర అవయవాలని సరిగా శుభ్రపరచలేకపోతుంది.


*కనుక కోపపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఇతరులమీద కోపం, ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 సార్లు కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది*.


ఇంతే. 

*గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది*


☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️

మోక్షం

 🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️                        

మోక్షం 

   మోక్షం సాధించి పొందేది కాదు . ఉన్నదాన్ని తెలుసుకోవడమే . నీవు శరీరం కాదు . నీవు మనస్సు  కాదు . 

నీవు ఆత్మవు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మోక్షం . ఆత్మను తెలుసుకోవడానికి  ఊరక  

ఉండటం తప్ప ఏమీ చేయనక్కర లేదు . నామ రూప గుణాలు అనే వేషం వేసుకొని జీవునిగా ఉన్నది బ్రహ్మమే 

అని గుర్తించు . నేనే బ్రహ్మమును . బ్రహ్మమే నేను అని జీవించు . యిదే మోక్షము . 

    ఎంతకాలము నీ మనస్సు పనిచేస్తుందో అంతకాలం నీవు భగవంతుని చేరలేవు . మనస్సును ఖాళీ చేసి 

అన్నింటినీ సాక్షిగా చూడు . దేహ తాదాప్యం చెందినవాడికే బంధం . మనస్సులో ఉన్న భావాలకే  బంధం  . 

మనస్సులో ఏ భావాలు లేకపోతె , బంధం లేదు . బంధం లో ఉన్నాను అనుకునేవాడు మోక్షం కోసం ప్రయత్నం 

చేస్తాడు . బంధం లేకపోతె మోక్షం లేదు  . బంధముక్తులకు అతీతంగా ఉండేదే నీ నిజ స్థితి . ఇదె  జీవన్ముక్త స్థితి . 

     పూర్వ జన్మలో అజ్ఞానం తో చేసిన కర్మలకు ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తూ ఉన్నాము . ఈ జన్మలో 

ఆత్మజ్ఞానం తెలుసుకొన్నావు . తెలుసుకొన్న ఆత్మజ్ఞానాన్ని త్రికరణ శుద్ధి గా ఆచరించు . యిదే నీకు ఆఖరి జన్మ 

అవుతుంది . 

    బంధ మోక్షాలు రెండు అబద్ధాలే . మనస్సు చేత కల్పించబడ్డాయి . నీకు పుట్టుక లేదు చావు లేదు . నీకు 

పరమాత్మకు భేదమే లేదు . అజ్ఞానం ముడి విడిపోవడమే మోక్షం . జ్ఞానం తో కూడిన నిర్మల చిత్తమే మోక్షం . 

మనో నాశనమే నిజమైన స్వేచ్ఛ . బ్రతికి ఉండగా , మనస్సు లోని స్థితిలో ఎవరు ఉంటారో వారికే మోక్షం . 

" మోక్షం కావలి " అన్న సంకల్పం కూడా బంధమే . మనస్సును 100% ఖాళీ చేసి , బ్రహ్మనిష్ఠ యందు ఉండుటే 

మోక్షం. 

 🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️

ధార్మికగీత -125*

 ☘☘☘☘☘☘☘☘☘☘☘☘

                  *ధార్మికగీత -125*

                     **************

   *శ్లో:- అత్యల్ప మపి సాధునాం ౹*

         *శిలా     లేఖేవ      తిష్ఠతి ౹*

         *జల   లేఖేవ   నీచానామ్౹*

         *యత్ కృతం తత్ వినశ్యతి౹౹*

                         *****

*భా:-  సత్పురుషులు చేసేది కొంచె మైనప్పటికిని, అది శిలాక్షరాల వలె శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కాని నీచులు చేసేది నీటి వ్రాత వలె ఎప్పటి కప్పుడే చెరిగిపోతుంది.*


☘☘☘☘☘☘☘☘☘☘☘☘

చీమ మిడత కథ

 చీమ మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది .


ఒరిజినల్ కథ :


ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .


ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :


చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .

మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది . 

NDTV , CNN IBN , Times Now , India Today, tv 9 , మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని , అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది . 

విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .

రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు . 

ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .

.

.

జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .

.

.

.

కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .

.

.

.ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .

.

.

.

మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు

ఉదంక మహర్షి ఆశ్రమానికి

 ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకానగరానికి వెడుతూ ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఉదంక మహర్షి ఆయన్ని పూజించి స్వామి! నువ్వు సంధి చెయ్యకలిగి కూడ కౌరవులకీ, పాండవులకీ యుద్ధం జరిగేలా ఎందుకు చేశావు ? అని అడిగాడు


శ్రీకృష్ణుడు ఉదంక మహర్షితో సత్త్వ, రజ, తమోగుణాలు నావశంలో ఉంటాయి మరుత్తులు, వసువులు అందరూ నాలోంచే పుట్టారు. ఓంకారంతో ఉన్న వేదాలు నేనే నాలుగు ఆశ్రమాలు, అన్ని కర్మలు, అన్ని మోక్షాలు నావశంలో ఉంటాయి. మనస్సు చేసే ధర్మాలన్నింటికి కారణం నేనే. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఈ మూడూ నేనే. లోక రక్షణకోసం అధర్మాన్ని జయించి ధర్మాన్ని కాపాడతాను. కౌరవులు అధర్మం గల పన్లే చేశారు, వాళ్ళని చంపడం కోసమే యుద్ధం జరిగేలా చేశానని చెప్పాడు.


అప్పుడు ఉదంక మహర్షి విశ్వరూపం చూపించమని అడిగి విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆయన రూపాన్ని చూసి నా జన్మ ధన్యమైందని ఆనందించాడు.


శ్రీకృష్ణుడు  ఉదంకుడుకి బ్రతికినంత కాలం నువ్వు తల్చుకోగానే వర్షాలు పడతాయని వరమిచ్చాడు

ఆ మేఘాన్ని 'ఉదంకమేఘం' అంటారు


ఉదంకుడు బ్రతికినంతకాలం లోకాన్ని ఉద్ధరించడానికే బ్రతికి చివరకి మోక్షం పొందాడు.


ఉదంక మహర్షి మనం గురుభక్తితో, స్వార్ధం లేకుండ అందరి కోసం మంచి పనులు

చెయ్యడం ఎలాగో తెలియచెప్పాడన్నమాట.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

మన మహర్షులు - 7

 మన మహర్షులు - 7


ఉదంక మహర్షి

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ఉదంక మహర్షి భృగువంశంలో పుట్టాడు. గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు. 


చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఉదంక మహర్షి చదువయిపోయిందని గౌతమ

మహర్షి చెప్పలేదు. ఉదంకుడు కూడ అలా సేవ చేస్తూనే ఉండిపోయాడు. 


ఒకసారి అడవినుంచి కట్టెల మోపు తీసికొచ్చి కిందపడేసినప్పుడు ఉదంకుడి జుట్టు దాంట్లో చిక్కుకుని కట్టె పుల్లలతో పాటు ఊడి వచ్చేసింది. ఆ ఊడిపోయిన జుట్టు తెల్లగా ఉండడం చూసి ఉదంకుడు అయ్యో! నా బాల్యం, యౌవనం అంతా ఇక్కడే గడిచిపోయింది. నా చదువు ముసలితనం వచ్చినా పూర్తవలేదని బాధపడ్డాడు.


గౌతమ మహర్షి ఉదంకుణ్ణి పిలిచి నాయనా ! బాధపడకు నీ గురుభక్తిని పరీక్షించాను నీ ముసలితనం పోయేలా చేస్తాను. అని చెప్పి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు.


మన ఉదంకుడు అంతటితో ఊరుకున్నాడా.... స్వామీ ! మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. గౌతమ మహర్షి నీ గురుభక్తియే నాకు గురుదక్షిణ. ఇంకేమీ వద్దు నాయనా ! అన్నాడు. 


ఉదంకుడు గురువుగారి భార్యను అడిగాడు.... మిత్రసహుడు అనే మహారాజు భార్యకి కుండలాలు ఉన్నాయి, అవి నాకు కావాలి అనడిగింది ఆవిడ.


ఉదంకుడు బయలుదేరి మిత్రసహుడనే రాజు దగ్గరకి వచ్చాడు.


ఉదంకుడు మహారాజా ! నీ భార్య కుండలాలు నాకు ఇప్పించు. అవి నా గురువుగారి భార్యకి ఇవ్వాలి .అని అడిగాడు..


పరససాధ్వి అయిన రాణి ఉదంకుడు శుచియై వచ్చిన తర్వాత మాత్రమే దర్శనమిచ్చి ఆనందం గా తన కుండా లాలను తీసి ఇస్తుంది.


మిత్రసహమహారాజు ఉదంక మహర్షిని మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. భోజనం చేస్తుండగా అన్నంలో తలవెంట్రుకలు వచ్చాయి. 


ఉదంక మహర్షి రాజుని గుడ్డివాడయిపోతావని శపించాడు. రాజు తిరిగి ఉదంక మహర్షిని శపించాడు. ఉదంక మహర్షి రాజుకిచ్చిన శాపం ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు. 


ఉదంక మహర్షి కుండలాల్ని ఒక పట్టుబట్టలో చుట్టుకొని తీసికెడుతున్నాడు. మధ్యలో ఆకలికి ఆగలేక ఒక చెట్టెక్కి ఆ మూటని ఒక కొమ్మ మీద పెట్టి పండ్లు కోసుకుంటున్నాడు ఆ మూట క్రింద పడిపోయింది


ఆ మూటని ఒక నాగరాజు తీసికుని పుట్టలోంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఉదంక మహర్షి ఆ పుట్టిని తవ్వడం మొదలెట్టాడు. ఇది చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఉదంకా ఆ కుండలాలు పాతాళలోకంలో ఉన్నాయి. నువ్వు పడుతున్నది అనవసర శ్రమన్నాడు. ఉదంకుడు ఎక్కడ ఉన్నా సరే అవి నా గురువుగారి భార్యకివ్వాల్సిందే అని మళ్ళీ తవ్వడం మొదలు పెట్టాడు.


అప్పుడు ఇంద్రుడు ఉదంకుడు ఉపయోగిస్తున్న కర్రకి వజ్రాయుధానికి వున్నంత శక్తినిచ్చాడు. అలా తవ్వుతుంటే భూదేవి భయపడిపోయి పాతాళానికి దారిచ్చేసింది. పాతాళ లోకంలో కుండలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఉదంకుడు నాగుల్ని ప్రార్థించాడు.


ఉదంకుడు నలుపు తెలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళనీ, చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులనీ, పెద్ద గుఱ్ఱమెక్కి ఉన్న ఒక గొప్ప పురుషుణ్ణి చూసి స్తోత్రం చేశాడు. వాళ్ళు నీకేం కావాలో అడగమన్నారు


ఉదంక మహర్షి ఈ నాగులన్నీ నాకు వశమయిపోవాలన్నాడు. అయితే నువ్వు ఈ గుఱ్బం చెవిలో ఊదమన్నాడు ఆ మహాపురుషుడు. ఉదంకుడు అలా చెయ్యగానే పాతాళలోకమంతా కూడ మంటలు వచ్చేశాయి. తక్షకుడు అనే పాము తక్షణమే కుండలాలు తెచ్చి ఉదంకుడకి ఇచ్చేసింది.


 ఉదంకుడు దివ్యాశ్వం  మీద కూర్చుని గౌతమ మహర్షి ఇంటికి వచ్చాడు. గురుపత్ని అహల్య కుండలాలు ధరించి పూజ పూర్తిచేసుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టింది.


ఉదంక మహర్షి గురువుగార్ని దివ్యపురుషుడు, ఆరుగురు కుమారులు, తెలుపు నలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు స్త్రీలు వీళ్ళందరూ ఎవరు స్వామీ? అని అడిగాడు గౌతమ మహర్షి నాయనా ! ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు, ఆరుగురు


కుమారులున్నారే వాళ్ళు ఆరు ఋతువులు, ఆడవాళ్ళని ఇద్దర్ని చూశావు కదా! అది రాత్రి పగలు, ద్వాదశ చక్రం చూశావు కదా అది పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం ఇంద్రుడికి స్నేహితుడున్నాడే పర్జన్యుడు అతడే ఆ గజ్జం. ఇవన్నీ చూడగలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. 

ఇంక నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమన్నాడు.


ఆ తర్వాత కాలం లో ఉదంకుడు జనమేజయ మహారాజుతో సర్పయాగం చేయించాడు. అస్తీక మహర్షి వచ్చి ఆ యాగం ఆపించి నాగుల్ని రక్షించాడు.


ఉదంక మహర్షి శివుడ్ని గురించి గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నువ్వు లోకం కోసం మంచి పనులు చేస్తూ జీవించు అని దీవించాడు ఉదంకుణ్ణి.


ఆ కాలంలో  ధుంధుడు అనే రాక్షసుడు   బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం తీసుకుని దేవతల్ని, గంధర్వుల్ని., రాక్షసుల్ని అందర్నీ చంపేస్తున్నాడు. సముద్రం దగ్గర పెద్ద గొయ్యి చేసుకుని దాంట్లో పడుకుంటూ వుండేవాడు. వాడు విడిచిన గాలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చి పెద్దగాలి దుమారం లేపేది. అది వచ్చినప్పుడు ఏడు రోజులదాకా చెట్లు ఊగుతూనే ఉండేవి. అందరూ చాలా భయపడ్తున్నారని ఉదంక మహర్షి బృహదశ్వుడు అనే రాజుకి చెప్పి ఆ రాక్షసుణ్ణి చంపించమని అడిగాడు. బృహదశ్వుడి కొడుకు కువలాశ్వుడు తండ్రి మాట ప్రకారం ఆ రాక్షసుణ్ణి చంపేశాడు

సూర్యోదయం


 

Painting


 

పశుసంబంధమైన ధర్మసూత్రములు -

 పశుసంబంధమైన ధర్మసూత్రములు  -


 *  పశువుల కాపరికి యజమాని కూలి ఇవ్వనిచో యజమానికి పది ఆవుల పాలు పిండి ఇచ్చి తానొక్క ఆవుపాలు కూలికింద తీసుకొనవచ్చు . జీతము లేనప్పడుదియే కూలి .


 *  కంటికి కనపడనిది , పురుగులచే , కుక్కలచే తినబడినది , పల్లపు గుంటలు మొదలగు వానిలో పడి చచ్చినది , కాపరి లేనప్పుడు పారిపోయినది అయిన పశువులకు పశుకాపరిదే భాద్యత. కాపరి తెచ్చి ఇవ్వవలెను.


 *  దొంగలు దొమ్మిచేసి పశువులను అపహరించుకు పోయిన విషయము కాపరి వెంటనే యజమానికి దగ్గరలో ఉన్నప్పుడే చెప్పినచో కాపరి యజమానికి పశువులను ఇచ్చుకోవాల్సిన బాధ్యత లేదు .


 *  చచ్చిన పశువు చెవులు , చర్మం , తోక , వెంట్రుకలు , గోరోచనము వీటిని యజమానికి ఇవ్వవలెను. తక్కిన గిట్టలు , కొమ్ములు మున్నగునవి అన్నియు యజమానికి చూపించి మరలా తాను తీసికొనవలెను.


 *  దారిలోను , బూడిదలోను , గోవుల మందలోను మలమూత్రాలను విసర్జించరాదు . గోవుకి ఎదురుగా మలమూత్రాలను విసర్జించరాదు.


 *  నీరు తాగుచున్న ఆవును గాని , పాలు తాగుచున్న దూడను గాని నివారించరాదు. పాలు తీయునప్పుడు మూత్రం పోయుటను నివారించవచ్చు. ఇతరుల దూడలు పాలు తాగుచున్నప్పుడు వారికి చెప్పకూడదు. ఇంద్రధనుస్సును ఆకాశమున చూచి ఆ దోషమును ఎరిగిన వాడై ఉండి ఇతరులకు చూపరాదు.


 *  తుంటరివి , ఆకలిరోగములు గలవి , కొమ్ములు లేనివి , గుడ్డివి , గిట్టలు లేనివి , తోకలేనివి అగు వృషభములను కట్టిన బండ్లలో ప్రయాణం చేయరాదు .


 *  మచ్చికపడినవి , వడిగా నడుచునవి , శుభలక్షణాలు కలిగినవి , వన్నెయు , ఆకారం కలిగి ఉండునవి అగు ఎద్దులను గట్టిన బండ్లలో మునికోలతో పొడవవలెను.


 *  చతుష్పాద జంతువు విషయమై అపద్ధం చెప్పినవాడు అయిదుగురు బంధువులను , గోవు విషయమై అపద్ధం చెప్పినవాడు పదిమందిని, గుఱ్ఱముల విషయమై అపద్ధం చెప్పినవాడు వంద మందిని , మానవుల విషయమై అపద్ధం చెప్పినవాడు వెయ్యిమంది బంధువులకు చంపిన పాపమును పొంది నరకమునకు పోవును .


 *  ఈని పది దినములు గూడ గడవని గోవులను , చక్రము , శూలము మొదలగు గుర్తులు వేసి విడిచిన ఎద్దులను , హరిహరాదుల ముద్రలు వేసి ఉన్న ఎద్దులను , కాపరులతో ఉన్నను లేక పొలము నందు ప్రవేశించి నస్యములను తినుచున్నను వానిని దండింపరాదు.


 *  గోవుల పైన కూర్చుని స్వారి చేయరాదు . కాని బండికి కట్టవచ్చు.


 *  ఎవడు జంతువులను కట్టుట, చంపుట, వంచుట చేయుటకు ఇష్టపడడో అతడు సకల భూతములకు హితము గోరువాడు ఎల్లప్పుడూ తరగని మోక్షరూపం అగు ఆనందమును పొందును.


 *  బ్రాహ్మణుల గోవులను అపహరించినప్పుడు , గొడ్డుటావులతో బరువులు మోయించుటకై ముక్కుత్రాడు వేసినప్పుడు , యాగముల కొరకు పశువులను అపహరించినప్పుడు వెంటనే అపహరించినవాని కాలు సగము నరికివేయవలెను .


 *  మార్గములో గ్రామ సమీపేతర ప్రదేశమునందలి పొలములలో గోవులు మేసినచో  కాపరి కి జరిమానా వేయవలెను . తరువాత గోవులు తినిన మేతఫలమును కాపరి గాని , యజమానిగాని పొలము యజమాని కి ఇవ్వవలెను.


 *  వెంటనే ఊడ్చుట, గోమయముతో అలుకుట , గోమూత్రము మున్నగునవి చల్లుట , పైమట్టి ఎత్తి తవ్వి ఎత్తిపోయుట , గోవుని ఒక రాత్రి , ఒక పగలు కట్టివేయుట  ఈ అయిదింటిచేత భూమి పరిశుద్ధతనొందును.


 *  వర్షం కురియుట వలన నేలను చేరునవి , పశువుల తాగగానే దప్పిక తీరునవి , గంధము , రసము , రంగు వానితో కూడిన ఉదకములు అనగా నీళ్లు పరిశుద్ధములు.


 *  సకల జంతువుల ప్రాణ సంరక్షణార్థమై రాత్రిగాని , పగలుగాని ఎల్లప్పుడూ తన శరీరముకు కష్టం కలిగినను భూమిని చూచుచు  నడవవలెను .


 *  ఒక గ్రామము చుట్టును నూరు ధనువులంతా ( ధనువు అనగా నాలుగు మూరలు ) ప్రదేశము పశువుల మేతకును , గాలి మొదలగు వీచుటకు భూమి బీడుగా వదలవలెను. పట్టణం అయినచో దీనికి మూడురెట్లు ప్రదేశం బీడుగా వదలవలెను .


 *  పైన చెప్పిన బీడు భూమి చుట్టూ ఆవరణ లేక పైరు సరిగ్గా లేని స్థలము నందు గోవు మేసిన యెడల ఆ కాపరిని గాని , యజమానిని గాని దండించరాదు.


 *  పశువుల మేయు బీడు భూమి చుట్టు నుండు ఆవరణ ఒంటెలు తలయెత్తి చూచిన లోపలి ప్రదేశము కనపడని యంతఎత్తున చుట్టూ రక్షణ ఏర్పరచవలెను . కుక్కలు , పందులు లోపల దూరకుండా కిందవైపు సందులను మూయవలెను .


 *  గ్రామసమీపాన దారికి దగ్గరగా ఉండు చుట్టూ వేసిన ఆవరణలో గోవులు దూరి మేసినచో ఆ గోవుని దండింపక గోపాలకునికి జరిమానా విధించవలెను .


 *  ఎండకాయుచున్నను , వర్షం కురియుచున్నను , ముందుగా శక్తికొలది గోవులను సంరక్షించిన తరువాతయే తన్ను రక్షించుకొనవలెను .


 *  గోవును దర్భ తాళ్లతో , రెల్లు తాళ్లతో దక్షిణాభిముఖముగా కట్టివేయవలెను . ఈ తాళ్లకు నిప్పు అంటుకొని కాలిపోయినను గోవు చిన్న గాయాలతో బయటపడును . కట్టివేసినప్పుడు గోవు అగ్నిచేత దగ్ధం అయినపుడు ప్రాయశ్చిత్తం ఏమియును లేదు .


 *  రాజ్యము నందు గోవులు దీనంగా ఉన్నయెడల రాజులకు అశుభం. కాళ్లతో భూమిని గోకిన రోగములు సంభవించును . కనుల నుంచి నీరు కార్చుచున్న మృత్యువు కలుగును. యజమాని చూచి భయపడి అరిచినచో దొంగలు వస్తారు.


 *  కారణం లేకుండా గోవు అరుచుచున్న అనర్థం కలుగును. రాత్రివేళ అయినచో భయం కొరకగును. ఎద్దు అరిచినచొ శుభం కలుగును. ఈగలచే గాని , కుక్కలచేగాని మిక్కిలి విరుద్ధమై అరిచినచో వెంటనే వర్షం కురియును.


 *  గోవులు అంబా అనుచూ ఇంటికి వచ్చిన గోశాల వృద్ది అగును. గోవులను సేవించుచూ వచ్చిననను గోశాల వృద్ది అగును. తడిసిన అవయవములతో గాని , నిక్కబొడిచిన వెంట్రుకలతో గాని సంతసించుచూ వచ్చిన గోవులు మంచివి. ఈ రీతినే గేదెలు కూడా ఉండును .


 *  చూలుతో ఉన్నట్టియు, తగిన వెలకు దొరికినట్టియు , దానము వలన దొరికినట్టియు , కూలి సొమ్ముల వలన దొరికినట్టియు , యుద్ధాదులలో గెలిచి తెచ్చినవియు , ఇంటబుట్టినవియు , ఏదేని వ్యాధిచే యజమాని వలన విడకాబడినవియు , తానుపోషించునవియగు గోవులు మిక్కిలి మంచివి.


 *  దూడలేని ఆవుపాలు , గర్భముతో ఉన్న గోవుని పితకరాదు. ఈనిన పది దినముల వరకు పాలు పితికినవాడు నరకమునకు పోవును .


 *  బలం లేనిదియు , వ్యాధిగ్రస్తం అయినదియు , పొర్లినదియు , కవల దూడలు పెట్టినదియు అగు గోవు పాలు పితకరాదు .


 *  పుట్టిన రెండు నెలల వరకు దూడను తీయకుండానే పాలు పితకవలెను . మూడొవ నెలలో రెండు చన్నులు దూడకు వదిలి రెండు చన్నులు పితకవలెను. నాలుగొవ నెలలో మూఁడు భాగములు యజమాని తీసుకుని ఒక భాగము దూడకు విడిచిపెట్టవలెను . అటు తరువాత పశువు యొక్క బలాబలాలను బట్టి పాలు తీసుకొనుట మంచిది .


 *  ఆషాడ పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి, పుష్యపౌర్ణమి , మాఘపౌర్ణముల యందు పాలు పితకక దూడలకు వదలవలెను .


                              సమాప్తం 


 


   గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రామాయణమ్ 200

 రామాయణమ్ 200

...........................

రామాసకలసద్గుణాభిరాముడవు ,

మహాదైశ్వర్యవంతుడవు !నీతో స్నేహము నా అదృష్టము .

.

రఘుకులతిలకుడవు నీతో స్నేహము నా బందువులందిరలో నన్ను గొప్పగా నిలబెట్టును.

 అది నాకు గర్వకారణము .

.

రామా! నేను కూడా నీకు తగిన స్నేహితుడనే .

నా గుణగణముల గురించి నేనుగా నీకు చెప్పజాలను నీవే ముందుముందు తెలుసుకొనగలవు .

.

రామా ,మనస్సును సదా అదుపులో ఉంచుకొన్న నీ వంటి మహాత్ముల ప్రేమ ,ధైర్యము,కూడా స్థిరముగానే యుండును .

.

రామా ,ధనికుడైనా ,దరిద్రుడైనా ,సుఖాలలో ఉన్నాదుఖాలలోఉన్నా , ఎన్నిదోషములున్నప్పటికీ స్నేహితుడే ఉత్తమమైన గతి .

.

రామా స్నేహమనగా ఇట్టిది అని తెలిసిన వారు తన ధన ,ప్రాణములు స్నేహితునికోరకు త్యజించుటకు కూడా వెనుకాడరు.ఇదినాది, ఇది నీది అను భేద భావము వారిరువురి మధ్య పొడసూపదు.

.

అని అంటున్న సుగ్రీవుని మాటలకు అవును నిజమన్నట్లుగా రాఘవుడు తల ఊపాడు .

.

రామా నా అన్నతో నాకు కలిగిన వైరకారణము చేత . నా ఈ నలుగురు సహచరులతో నేను ఇచ్చట నివసించుంటిని. నా ప్రాణములు తీయించ వలెనని నా అన్న ఎన్నో సార్లు ప్రయత్నించినాడు .

.

మా అన్న పంపిన వారినందరినీ యమసదనమునకు పంపినాను . 

.

మా అన్నయ్య నా భయమునకు హేతువు! అందు వలననే మీరు కనపడినప్పుడు వాలి పంపిన వారేమోనని భయపడినాను .

.

భయమునకు కారణ మున్నప్పుడు భయపడుట సహజముకదా.

.

రామా నేను శోకాక్రాంతుడనై ఉన్నాను. స్నేహితుడవు కనుక నా కష్టములు నీ ముందు వెల్లడించు చున్నాను .

.

అని అత్యంత దీనముగా ,బాధ తో పలికిన సుగ్రీవుని మాటలు విని రాముడు ,

అసలు నీకు మీ అన్నకు వైరము ఏర్పడుటకు గల కారణమేమి అని ప్రశ్నించాడు .

.

వూటుకూరు జానకిరామారావు