30, జనవరి 2021, శనివారం

రామాయణమ్ ..201

 రామాయణమ్ ..201

.................................

వాలి శ త్రుసంహారకుడు . మహాబలవంతుడు.

 నాకు నా తండ్రికి ఒకప్పుడు బహు ప్రీతిపాత్రుడు .

.

నా తండ్రి మరణానంతరము జ్యేష్టుడని ఈయనకు రాజ్యాభిషేకము చేసిరి . తాతముత్తాతలనుండి సంక్రమించిన రాజ్యాన్ని అతను శాసించుండగా  సేవకునివలె ఆయనకు వంగి ఉంటిని.

.

మాయావి అనే ఒక రాక్షసునికి ఒక స్త్రీ మూలమున వాలి తో వైరము ఏర్పడినది .దుందుభి ,మాయావి అన్నదమ్ములు .

.

ఆ మాయావి ఒకరోజు రాత్రి వేళ జనులనందరూ గాఢ నిద్రలో మునిగిఉన్న వేళ నగరద్వారము వద్దకు వచ్చి భయంకరమైన కేకలు వేయుచూ వాలిని యుద్ధానికి ఆహ్వానించినాడు .

.

అప్పుడు నిదురలో ఉన్న మా అన్న వాలి కోపించి వేగముగా బయటకు వచ్చినాడు .మేము వారించిననూ వాలి మా మాట వినక వానితో యుద్ధానికి బయలుదేరినాడు .

.

నేను కూడా అన్నపై గల స్నేహముతో ఆయన వెంట బయలు దేరినాను .

.

మా ఇరువురినీ చూసి ఆ అసురుడు భయపడి చాలా దూరము పారి పోయినాడు .

.

నిశిరాతిరిలో నిండు చందురుని వెన్నెలలు మాకు దారి చూపాయి.

.

అంత ఆ అసురుడు అత్యంత వేగముగా ఒక బిలములోనికి దూరినాడు .ఆ బిలము చుట్టూరా  గడ్డి కప్పబడి ఉన్నది .

.

అప్పుడు మా అన్న ఎలాగైనా వాని సంగతి చూడాలని పట్టుదలతో కోపావేశములు కలవాడై నన్ను ఆ బిల ద్వారము వద్దనే కావలి ఉండమని ఆజ్ఞాపించి తానూ మహా వేగముగా లోపలికి దూరినాడు .

.

అంతటా నిశ్శబ్దము!

.

 ఏ విధమైన ధ్వనులూ లోపలినుండి వినిపించుటలేదు .....

.

ఒక సంవత్సరము గడిచి పోయినది ...

.

జానకిరామారావు వూటుకూరు

.

కామెంట్‌లు లేవు: