30, మే 2024, గురువారం

పసుపు కొమ్ములు

 🌹🌻🌹

మనం వంటలో వాడే పసుపు 

ఒక యాంటీబయాటిక్ గా 

పని చేస్తుంది అని ఒక

ఆలోచనతో మా ఊరి

పొలాల్లో పండే పసుపునుండి 

కొమ్ములను సేకరించి 

మర పట్టింస్తున్నాము.


🌻🌹🌻మన పూజలు, నోములు,వ్రతాలు 

మరియు వంటకు

ఉపయోగించే పసుపు, 

మావి చిగురు కుంకుమకు

నాణ్యమయిన పసుపుకొమ్ములను దుగ్గిరాల మండలము, గుంటూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్  పసుపు యార్డు ద్వారా సేకరించి మర పట్టించి ఇవ్వబడును. 


🌻🌹🌻అలాగే లక్ష పసుపు కొమ్ములు నోముకు 

పసుపు కొమ్ములు సప్లై చేయబడును. 


🌻🌹🌻కైలాసగౌరి, 

గ్రామ పసుపు కుంకుమ నోములకు  

పసుపు, కుంకుమ 

సప్లై చేయబడును. 


🌻🌹🌻అలాగే  పెళ్లికి కావాల్సిన పసుపు,కుంకుమ ప్యాకెట్లు.


🌻🌹🌻సారెకు పసుపు,కుంకుమ మరియు సున్నిపిండి

సరఫరా చేయబడును.


🌻🌹🌻ఏ విధమయిన రసాయనాలు గానీ 

రంగు గానీ దీనిలో

వినియోగించడం లేదు.


🌹🌹Telangana and Andhra free supply available near to transport logistics .


A.Nagavalli, 

Nallakunta, 

Hyderabad. 

Phone numbers

9492528205,

9014295773.

*శ్రీ మంజునాథ దేవాలయం*

 🕉 మన గుడి : నెం 333


⚜ *కర్నాటక  :-*


*ధర్మస్థల - దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ *శ్రీ మంజునాథ దేవాలయం* 



💠 శివుడు లీలామయుడు, సర్వాంతర్యామి. ఆయన లీలలు అనంతం. అనన్య సామాన్యం. శివుని లీలావిశేషాలతో పునీతమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో 'ధర్మస్థల’ ఒకటి.


💠 నేత్రావతి నది తీరాన ఉన్న ఈ మంజునాథస్వామి ఆలయ ప్రాంగణం చూపరులను దృష్టిమరల్చనీయదు. 

కర్నాటకలో ధర్మస్థలం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర, ఇది జైన, శివ మరియు వైష్ణవ అనుచరులకు కేంద్రం. 


 💠 శ్రీ క్షేత్ర ధర్మస్థల, ధర్మానికి మరియు ధర్మానికి భూమి.

800 సంవత్సరాల చరిత్ర కలిగిన 

ఈ శైవ దేవాలయం వైష్ణవ పూజారులు మరియు జైన వంశస్థులచే నిర్వహించబడుతున్నందున, శ్రీ క్షేత్ర ధర్మస్థలంలో మంజునాథేశ్వర భగవానుడు చాలా అసాధారణమైన మరియు అసాధారణమైన రీతిలో పూజించబడతాడు.


💠 ఆధ్యాత్మిక క్షేత్రంలోని ప్రధాన దైవం మంజునాథేశ్వరుడు శివలింగ రూపంలో వెలిశాడు.


💠 ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో హిందూ ద్వైత సన్యాసి వాదిరాజ తీర్థ అప్పటి ఆలయ నిర్వాహకుడు దేవరాజ హెగ్గడే అభ్యర్థన మేరకు పునర్నిర్మించారు. 800 సంవత్సరాల క్రితం, ధర్మస్థలను దక్షిణ కానరాలోని మల్లర్మడిలో కుడుమ అని పిలిచేవారు.

ఇక్కడ నెల్లియాడి బీడు అనే ఇంటిలో జైన అధిపతి బిర్మన్న పెర్గాడే మరియు అతని భార్య అమ్ము బల్లాల్తి నివసించారు. 


💠 పురాణాల ప్రకారం, ధర్మం యొక్క సంరక్షక దేవదూతలు మానవ రూపాలను ధరించి, ధర్మాన్ని ప్రచారం చేసే స్థలాన్ని వెతుకుతూ పెర్గాడే నివాసానికి చేరుకున్నారు. 

వారి అలవాటు ప్రకారం, పెర్గాడే దంపతులు ఈ విశిష్ట సందర్శకులకు  గొప్ప గౌరవంతో ఆతిథ్యం ఇచ్చారు. 


💠 వారి చిత్తశుద్ధి మరియు ఔదార్యానికి సంతోషించి, ఆ రాత్రి ధర్మ దైవాలు శ్రీ బిర్మన్న పెర్గాడే కలలో కనిపించారు. 

వారు తమ సందర్శన ఉద్దేశాన్ని ఆయనకు వివరించి, దైవారాధన కోసం తన ఇంటిని ఖాళీ చేయమని, ధర్మ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేయమని సూచించారు.

ఎటువంటి ప్రశ్నలు అడగకుండా, పెర్గేడ్ తనకు తానుగా మరొక ఇంటిని నిర్మించుకున్నాడు మరియు నెల్లియాడి బీడు వద్ద దైవాలను ఆరాధించడం ప్రారంభించాడు. ఇది నేటికీ కొనసాగుతోంది.


💠 వారు తమ ఆరాధనలు మరియు ఆతిథ్యాన్ని కొనసాగించడంతో, ధర్మ దైవాలు మళ్లీ శ్రీ బిర్మన్న పెర్గడే ముందు కనిపించారు .

కాలరాహు, కలర్కై, కుమారస్వామి మరియు కన్యాకుమారి అనే నాలుగు ధర్మ దైవాలకు అంకితం చేయబడిన ప్రత్యేక మందిరాలు నిర్మించారు. 

అలాగే, పెర్గేడ్‌కు దైవ సహాయకులుగా వ్యవహరించడానికి ఇద్దరు గొప్ప వ్యక్తులను మరియు పుణ్యక్షేత్రాల కార్యనిర్వాహక అధిపతిగా శ్రీ పెర్గేడ్‌కు అతని విధుల్లో సహాయం చేయడానికి నలుగురు యోగ్యమైన వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించబడింది. 

దానికి ప్రతిగా, దైవాలు శ్రీ పెర్గాడే కుటుంబ రక్షణ, పుష్కలమైన దానధర్మాలు మరియు 'క్షేత్ర'కు ఖ్యాతిని ఇస్తానని వాగ్దానం చేశారు.


💠 నియమం ప్రకారం, శ్రీ పెర్గాడే మందిరాలను నిర్మించారు మరియు కర్మలు నిర్వహించడానికి బ్రాహ్మణ పూజారులను ఆహ్వానించారు. 

ఈ పూజారులు పెర్గాడేను స్థానిక దైవాల పక్కన శివలింగాన్ని కూడా ప్రతిష్టించమని అభ్యర్థించారు. 


💠 ఆలయ నిర్మాణంలో నిమగ్నమైన 

కుటుంబంలోని వివిధ సభ్యులకు వివిధ హోదాలు లేదా పదవులు కేటాయించబడతాయి. 

పెద్ద సభ్యుడు ధర్మ అధికారి లేదా ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరిస్తారు మరియు హెగ్గడే అనే బిరుదును పొందుతారు. 

గత ఇరవై ఏళ్లుగా ఇదే జరుగుతోంది. 

అయితే, ప్రస్తుతానికి ఈ పదవిని కేటాయించిన వ్యక్తి వీరేంద్ర హెగ్గడే.


💠 శ్రీ మంజునాథస్వామి ఆలయం కొన్ని ఆలయాల సమూహం.

విఘ్ననాయకుడు,అణ్ణప్పస్వామి, అమ్మనవరు అమ్మ దర్శనం వుంటుంది.

అమ్మనవరు దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. 

స్ర్తీలు సౌభాగ్య సిద్ధి కోసం, సంతానం కోసం ‘అమ్మనవరు’ను దర్శించుకుని భక్తితో పూజిస్తారు.


🔆 ధర్మాధికారి 


💠 ధర్మస్థల హెగ్గాడే స్థానం భారతదేశంలోని మరే ఇతర మత కేంద్రానికి తెలియని విశిష్టమైనది.  

అన్న దాన (ఆహారం), ఔషధ దాన (వైద్యం), విద్యా దాన (విద్య) & అభయ దాన & ఉచిత సామూహిక వివాహాలు అనే నాలుగు సంప్రదాయ దానాలను విస్తరించడం ద్వారా అతను పవిత్రమైన గృహస్థుడిగా తన సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తాడు.


💠 అన్నపూర్ణ చౌల్ట్రీ, నేటి వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ, ఏ రోజునైనా 30,000 నుండి 70,000 మంది యాత్రికులకు ఆహారం అందించడానికి రూపొందించబడిన ఆధునిక, పరిశుభ్రమైన, స్వయంచాలక వంటగదిని కలిగి ఉంది. యాత్రికులకు మూడు పూటల భోజనం వడ్డిస్తారు, ఇది ఏ ఆలయంలోనైనా ఉత్తమంగా వడ్డించే భోజనంలో ఒకటి.


💠 ధర్మస్థల బెంగుళూరు నుండి దాదాపు 300 కి.మీ మరియు మంగళూరు నుండి దాదాపు 65 కి.మీ దూరంలో ఉంది. 

ఈ మార్గాల్లో బస్సులు చాలా తరచుగా ఉంటాయి మరియు ధర్మస్థలకు ప్రయాణం చాలా సులభం అవుతుంది.

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

Mechanical diploma Jobs

 Dear friends,

Need 30 Mechanical diploma candidates with or  without experience for BOSCH 

Pune location. 

Pls inform anybody if u know. 

Salary 35 to  45 k (take home). 

2 years bond. Confirmation based on work efficiency after 2 years. 

Immediate requirement.  


praveen.ks@in.bosch.com


If it is not useful to you...

Share this in your circle, this may help  in someone's career


NB. This blogger is not responsible for the content

Panchaag


 

*మే 31, 2024*🪷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 *శుక్రవారం*🌹 

🪷 *మే 31, 2024*🪷

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

     *వైశాఖ మాసం - బహళ పక్షం*   

తిథి : *అష్టమి* ఉ8.46 వరకు

వారం : *శుక్రవారం* (భృగువాసరే)

నక్షత్రం : *శతభిషం* ఉ5.48 వరకు

తదుపరి *పూర్వాభాద్ర* తె4.10వరకు

యోగం : *విష్కంభం* సా5.52 వరకు

కరణం : *కౌలువ* ఉ8.46 వరకు

తదుపరి *తైతుల* రా7.34 వరకు

వర్జ్యం :*ఉ11.45 - 1.15*

దుర్ముహూర్తము : *ఉ8.03 - 8.55* 

మరల *మ12.22 - 1.14*

అమృతకాలం :  *రా8.42 - 10.12*  

రాహుకాలం : *ఉ10.30 - 12.00*

యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*

సూర్యరాశి : *వృషభం* || చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం : *5.28* || సూర్యాస్తమయం :*6.26*

______________________________

            🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

                🪷 *ఓం*🪷 

🌹 *శ్రీ మహాలక్ష్మీయై నమః*🌹

*లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ ।*

*దాసీభూత సమస్త దేవ వనితాం-లోకైక దీపాంకురామ్ ।*

*శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।*

*త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం-వందే ముకుందప్రియామ్ ॥*

🙏🪷🌹🛕🌹🌷🪷🌷🙏

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

రోజు ఒక రుచి

 రోజుకి ఒక పొడి, రోజు ఒక రుచి ఆస్వాదించండి!!


శ్రీ గాయత్రి ఎంటర్ ప్రైసెస్ వారి వెల్లులి లేని హోమ్ మేడ్ పొడులు రెడి గా ఉన్నాయి..ఇంకెందుకు ఆలాస్యం వెంటనే ఆర్డర్ పెట్టుకుని రుచి గా భుజించడమే.


ఆఫర్: 4 పొడులు(250gms each) యొక్క కొంబో కేవలం ₹500 మాత్రమే( అసలు ధర ₹550)



*సంప్రదించగలరు:*

*తంగిరాల విశ్వనాథ్*

*7416223176*

*చైతన్యపురి, హైదరాబాద్*

భాగస్వాములు

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ +91 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు+91 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు


గుర్తుంచుకోండి చార్లీ చాప్లిన్

 


: చార్లీ చాప్లిన్ 88 వయస్సులో

మరణించాడు.

అతను మనకు 4 స్టేట్ మెంట్ లు విడిచిపెట్టాడు:

(1) ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు.

(2) నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఎవరూ నా కన్నీళ్లను చూడలేరు.

(3) జీవితంలో అత్యంత వృధా అయిన రోజు మనం నవ్వని రోజు.

(4) ప్రపంచంలోని ఆరుగురు ఉత్తమ వైద్యులు...

1. సూర్యకాంతి,

2. విశ్రాంతి,

3. వ్యాయామం,

4. డైట్,

5. ఆత్మ గౌరవం

6. ఫ్రెండ్స్.

వాటిని మీ జీవితంలో అన్ని దశల్లో ఉంచుకోండి మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించండి...

చంద్రుడిని చూస్తే దేవుడి అందం కనిపిస్తుంది.....

సూర్యుడిని చూస్తే దేవుని శక్తి కనిపిస్తుంది..

అద్దంలో చూస్తే దేవుని అత్యుత్తమ సృష్టి కనిపిస్తుంది

అప్పుడు నమ్మండి.

మనమంతా టూరిస్టులం, ఇప్పటికే మన యాత్రలు, బుకింగ్ లు, గమ్యస్థానాలను తయారు చేసిన మన ట్రావెల్ ఏజెంట్ దేవుడు...

అతడిని నమ్మండి మరియు జీవితాన్ని ఆనందించండి.

జీవితం ఒక ప్రయాణం మాత్రమే!

ఈరోజు లైవ్!!!!

చైతన్యo ద్వారానే*

 *భగవంతుని చైతన్యo ద్వారానే* 

 *ఏ సత్కార్యాలైనా జరుగుతాయి* 


 భగవంతుడు మనకు సత్కార్యాలు చేసే చైతన్యాన్ని ఇస్తాడు.. మనిషి ఏ పని చేయాలనుకున్నా, ముందుగా అతని మనసులో ఆచార్య భావన ఉండాలి. అప్పుడే మనం పనిలోకి దిగగలం. మనసులో ఆలోచనలు వచ్చేలా చేసేవాడు భగవంతుడు.  

కాబట్టి భగవంతుని ఉనికిని గురించి ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదు. 

ఎందరో మహానుభావులు భగవంతుని  దర్శించుకున్నారు. ఈ సత్యం మనకు శాస్త్రాల్లో, పురాణాల్లో తెలియచెప్పారు. కొన్ని వందల సంవత్సరాల క్రితంవరకు జీవించిఉన్న  అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, తుకారాం వాటి వారికి భగవంతుని సాఖ్యాత్కార్యం లభించింది. మరి, మనకు ఆయన దర్శనం ఈ రోజుల్లో లభించకపోవడానికి కారణం మనం మన పూర్వీకులు అనుసరించిన మార్గాన్ని - సాధనను అనుసరించకపోవడమే..


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ* 

 *మహాస్వామి వారు*

ధర్మానుష్ఠానం రక్షిస్తుంది

 ఓం నమశ్శివాయ 🙏


ధర్మం అన్న మాటకు పర్యాయపదమే భక్తి. గోనెసంచుల్లో మారేడు దళాలు తీసుకొచ్చి, పూలదండలు మోసుకొచ్చి పూజ చేయడాన్ని భక్తి అనరు. కూర్చొని, ఊరికే స్తోత్రాలు చేసి, పూలు వేసేస్తే - పరమేశ్వరుడు సంతోషపడిపోడు. కర్తవ్య నిష్ఠతో ధర్మపాలన చేసినవాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసినవాడే ధర్మాన్ని అనుసరిస్తునట్లు! భగవంతుడు విహిత కర్మ చెప్పాడు!! విశుద్ధ కర్మ చెప్పాడు!! ‘‘ఒరేయ్ ! నీకు అయిదు ఇంద్రియాలిచ్చాను. సుఖం అనుభవించు... నేను వద్దనడం లేదు. వీణావాదన వినాలని ఉందా, పాట వినాలని ఉందా? ‘సాంబశివాయని అనరే..’ అని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటారు. విను! భగవంతుడి దగ్గర కూర్చొని నీ కూతురే ‘కంజ దళాయతాక్షీ’ అంటూ కీర్తన చేస్తుంటే మురిసిపో! కానీ, లౌల్యానికి కట్టుబడకు. భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దన్నదాని జోలికి వెళ్ళకు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు! విశుద్ధకర్మ విడిచిపెట్టకు! ఇతరుల ద్రవ్యాన్ని కోరవద్దు. నిత్య తృప్తితో ఈశ్వరుడు నీకు ఇచ్చినదేదో అదే పరమానందదాయకం అన్న భావనతో జీవితాన్ని అనుభవించు. అలా బతికినవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు!

పరమ భక్తితత్పరుడు అన్నదానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపఃశిల్పం సకలమపి ముద్రా విరచనా...’’ నేను మాట్లాడుతున్నానంటే ఇది నేను మాట్లాడుతున్నది కాదు. మనుష్యుడిగా నాకు జన్మనిచ్చి, పరమేశ్వరుడు 83 లక్షల 99 వేల 999 జీవరాశులకు ఇవ్వని చక్కటి స్వరపేటికను ఇచ్చి, ఇన్ని మాటలు నా చేత పలికించగలుగుతున్నాడు. ఆయన పలకించిన ఆ ఒక మంచి మాటతో ఎంత కష్టంలో ఉన్న వాళ్ళనైనా శాంతి పొందేలా చేయగలుగుతున్నాను. ‘‘అయ్యా. బెంగ పెట్టుకోకండి. ‘భయకృత్ భయనాశనః’ - ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీసేస్తాడు. చింతించకండి’’ అని ఒక్క మంచి మాట అన్నాననుకోండి. అంత కష్టాన్నీ మర్చిపోయి వెళ్ళగలుగుతున్నారు.

‘‘మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు’’. మాట అంత గొప్పది. ‘‘జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం’’ అన్నారు. ఆ మాటచేత ఏదైనా పొందవచ్చు. శత్రుత్వాన్ని, చివరకు మరణాన్ని కూడా తెచ్చుకోవచ్చు. ‘‘ఈశ్వరా! నాకు ‘మాట’ ప్రసాదించావు. నీవిచ్చిన ‘మాట’ను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టేది కాకుండా నేను చూసుకుంటా’’ అని దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ, మాట్లాడే ముందు జాగ్రత్తపడేవాడెవడో... వాడు పరదేవత పట్ల భక్తితో ఉన్న వాడు. అంతేకానీ నాలుగుపూలు వేసి పూజ చేసి, బయట రావణుడిలా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే భక్తుడెలాఅవుతాడు?

‘‘ధార్మికమైతే నేను మాట్లాడతా. కాకపోతే మాట్లాడను’’ అన్నాడనుకోండి. ఇప్పుడది భక్తి. ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘‘సకలమపి ముద్రా విరచనా’’ - నా చేతులు, కాళ్ళు ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ఎంతోమంది అవయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం. కదులుతున్నాయి. ఇది పరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే!

ఇలా ఏది చేస్తున్నా భగవంతుని అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతున్నవాడు నిత్యం భగవంతుడికి ఉత్సవం చేస్తున్నవాడితో సమానం. కేవలం ‘అష్టదళ పాదపద్మారాధన’ టికెట్ కొనుక్కుని ఏడుకొండలూ ఎక్కి దర్శనం చేసుకున్నవాడు ఆ పద్మారాధన సేవ చేసినవాడు కాడు. ‘అష్టదళ పాదప ద్మారాధన’ ప్రతిరోజూ ప్రతిక్షణం చేసేలా అనుగ్రహించమని వేడుకోవాలి.

ఆ పూజెలా ఉండాలి? 8 రకాల పూలతో పూజ. ఏమిటా పూలు? ‘అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియనిగ్రహః, సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపఃపుష్పం ధ్యానం పుష్పం తతై ్తవచ సత్యం అష్టవిధం పుష్పమ్ విష్ణోః ప్రీతికరమ్ భవత్’ అన్నారు. అహింస (ప్రేమ), ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానం, తపస్సు, ధ్యానం, సత్యమనే 8 రకాల పుష్పాలతో నీ మనస్సుని ఈశ్వరుని పాదాల వద్ద పెట్టు. భక్తిమార్గంలో పయనించడమంటే అదీ! 

ఈశ్వరుడు వద్దన్నదాన్ని చేయకుండా ఉండడం- బ్రేకు. చేయమన్నదాన్ని చేయడం -యాక్సిలరేటర్. లోపల నీ ప్రయాణం క్షేమం. గమ్యం ఈశ్వరానుగ్రహం. ఇది ఎవడికి సాధ్యపడుతుందో వాడు ఉద్రేకపడడు, ప్రలోభాలకు లొంగడు. రామాయణంలో రాముడు ఒక మాట అంటాడు... ‘ఒకడు మంచివాడా, చెడ్డవాడా అని దేన్నిబట్టి నిర్ణయించాలి’ అని. ‘ఎవడో సంతోషంతో పొగిడాడనో, లేదా అక్కసుకొద్దీ తిట్టాడనో కాదు. ధర్మ ప్రవర్తనను బట్టి దాన్ని నిర్ణయించాలి.’

చాలామంది రాముడికి సీతమ్మ ఇష్టమనుకుంటారు. కానీ ఆయనకు ఏది ఇష్టమో తెలుసా? తండ్రి పోయినా, సీతమ్మ దూరమైనా, ఇంకొక కష్టమొచ్చినా రాముడు నిత్య తృప్తుడు. నవమి (9వతిథి)నాడు పుట్టాడు. తొమ్మిదిని ఏ అంకెతో హెచ్చవేసినా మళ్ళీ తొమ్మిదే వస్తుంది. రాముడికి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఎందుకు సంతోషంగా ఉంటాడో తెలుసా! ‘నా ధర్మం నేను నెరవేర్చా’ అన్న తృప్తి ఒక్కటే అందుకు కారణం. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ మనుష్యుడిగా పుట్టిన రాముడు ధర్మం కోసం నిలబడ్డాడు. అలాగే ప్రతివాడూ ‘నేనీ రోజు భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ! ఆయన వద్దన్నది చేయలేదు కదూ!’ అని మననం చేసుకోవాలి. ఇక జీవితంలో ఎదురయ్యే ఉత్థాన పతనాలంటారా... ‘ఈశ్వరుడున్నాడు, ధర్మముంది. నా ధర్మానుష్ఠానం నన్ను రక్షిస్తుంది’ అని భావన చేయాలి. ధర్మంతో మనిషి తరిస్తాడు. ధర్మం మనకు నిగ్రహశక్తినిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నైతికబలాన్నిస్తుంది. అదే భక్తి. అదే మనకు,

 మన కుటుంబాలకు, మన సమాజానికి 

హితకారిణి. ఈశ్వరానుగ్రహాన్నిస్తుంది.🙏


శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

అదో ప్రపంచం

 నాటి సినిమా హాలుల కబుర్లు:::


అప్పట్లో టికెట్ల ధర :


నేల 60 పైసలు 

బెంచి 1 రూపాయి 

కుర్చీ 1.25 పైసలు.


Theatres ప్రత్యేకత ఏమిటంటే టికెట్లు ఇస్తూనే ఉంటారు.


నేల full గా నిండి ఒకరి భుజాలమీద ఇంకొకరు కూర్చున్నా booking ఆగదు.


లోపల భీకర యుద్ధాలు జరుగుతున్నా gatekeeper చలించడు.



బెంచి class లో extra benches మరియు balcony లో ఇనుప కుర్చీలు వేస్తారు.


నేలకి ఆ సౌకర్యం లేదు.


కొందరైతే screen ముందున్న అరుగు మీద కూర్చుని కొండల్లా కనిపించే hero ముఖాన్ని చూసి జడుసుకునే వాళ్ళు.


ఆడవాళ్ళు నేల class లో కుళాయి నీళ్లలా ధారాపాతంగా బూతులు, కొందరైతే జుత్తు పట్టుకొని ఉండలా దొర్లే వాళ్ళు.


First show కి వచ్చిన ఆడవాళ్ళు second show వరకు తిట్టుకునే వారు.


ఈ ఉత్సాహంలో సినిమా start అయ్యేది.


ఊపిరాడని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగరెట్లు ముట్టించి "బుస్సు" మని పొగ వదిలే వారు.


తాగిన వాళ్ళకి, తాగని వాళ్ళకి సమానంగా దగొచ్చేది.


సినిమా మంచి రసపట్టు లో అంటే  N.T.R. 

కత్తిని ముద్దు పెట్టు కొని ఒంటి చేత్తో తిప్పుతున్నపుడు రెండు ఈలలు, N.T.R. dupe రెండు చేతులతో తిప్పుతున్నపుడు పది ఈలలు వినిపిస్తూ ఉండగా అందరినీ తొక్కుకుంటూ కొందరు ప్రవేశిస్తారు 


" ఎవరికయా నిమ్మ సోడా", అని ఒకరు, 


" వేయించిన శనగకాయలు" అని ఇంకొకరు,


" చకిలం, చకిలం " 

ఇలా రాగయుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ళకి కుయ్ మని సౌండ్ తో సోడా, తుప్పు పట్టిన పావు తో శనగకాయలు కొలిచి ఇచ్చేవారు.


ఇంత ఇరుకు లో కూడా పద్మనాభం, రాజబాబు వస్తే జనం పక పక నవ్వే వాళ్ళు.


అంజలీదేవి చూసి ఏడిచేవారు.



ఇక బెంచి class కి వెల్దాం.


Theatre పుట్టినప్పుడు కొన్ని వేల నల్లులు బెంచీలలోకి వలస వచ్చాయి.


Audience (prekshakulu) రాకకోసం ఎదురు చూస్తూ, వచ్చిన వెంటనే కుటుంబ సమేతంగా దాడి చేస్తాయి.


మొదటి సారి కుట్టినప్పుడు ఉలిక్కిపడతాం. రెండో సారి పడతాం. తర్వాత అలవాటు పడతాం.


ఆ దురద తట్టుకోలేక కొందరు లేచి నిలబడి గీరుకుంటారు.


వెనుక ఉన్న వాళ్ళు కూచో మని అరుస్తూ ఉంటారు.


కొందరు senior audience ఉంటారు.


వాళ్ళకి నల్లులు తో అనుభవం తో పాటు శాశ్వత శత్రుత్వం ఉంటుంది.


అందుకని అగ్గిపుల్ల గీసి బెంచి సందులో తిప్పుతారు.


దీంతో ప్రయోజనం ఏమిటి అంటే కొన్ని నల్లులు వీరమరణం పొందుతాయి.


అయితే కసి, పగ, ప్రతీకారంతో మిగిలిన నల్లులు కుట్టడం ప్రారంభిస్తారయి.


ఈ కుట్లకి audience బెంచీలమీద ఎగిరి ఎగిరి పడుతూ ఉంటారు.


ఈ class లో కూడా పొగ ఉచితం.


బీడీల కంపు తక్కువ, సిగిరెట్ల కంపు ఎక్కువ.


ఇక balcony.


Balcony లో కుర్చీలు వేస్తారు.


వాటి చర్మం చిరిగి పోయి లోపల ఉన్న కొబ్బరి పీచు, దూది, పొట్ట పేగులు లా కనిపిస్తూ ఉంటాయి.


కుర్చీల్లో పెద్దగా నల్లులు ఉండవు.


కానీ మేకులు ఉంటాయి.


అవి మన బట్టల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్రత్తగా లేస్తే పరమని సౌండ్.


Balcony లో projector room కూడా ఉంటుంది.


సోడాలు, శనగకాయలు traffic పెరిగినప్పుడు వాళ్ళ తలకాయలు screen మీద కనిపిస్తూ ఉంటాయి.


అన్ని class లో fans ఉంటాయి.


అయితే fan కింద seat సంపాదించడం చాలా కష్టం.


సంపాయించినా అది సవ్యంగా తిరిగే fan అయి ఉండడం మరీ కష్టం.


ఎందుకంటే చాలా fans పూనకం వచ్చినట్టు గీక్ గీక్ అని అరుస్తూ ఉంటాయి.


అవి ఊడి మీద పడకపోవడం మన అదృష్టం.


ఇక్కడి తో మన కష్టాలు ఆగవు.


కరెంటు వాళ్ళ దయ ఉండాలి.


Power cut, జనమంతా పిచ్చెక్కినట్టు ఈలలు వేస్తారు.


Generators లేని కాలం. కాబట్టి కరెంటు కోసం ఎదురు చూడాల్సిందే.


కరెంటు రాకపోతే pass లు ఇచ్చి పంపుతారు.


మరుసటి రోజు వచ్చి సినిమా చూడాల్సిందే.


Release అయిన ఏడాదికి రాష్ట్రమంతా ఆడిన తర్వాత మావూరి కి వచ్చేది.


పాత print కావడంతో సినిమా అంతా గీతలు గీతలు వచ్చి cut అయ్యేది.


ఇన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా సినిమా enjoy చేసే వారు.


ఇప్పుడు ఇన్ని సౌకర్యాల మధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావడం లేదు.


అమాయకత్వం లోని రహస్యం అదేనేమో!.


అదో ప్రపంచం... అప్పట్లో అదో ఆనందం.

మానవత్వపు ఉన్నతమైన పాఠాన్ని

 APJ ABDUL KALAM FOUNDATION : నుండి సేకరణ........

*ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన విషయం*

ఈ క్రింది దానిని శ్రద్ధతో చదివే ప్రయత్నం చేయాలని మనవి.

*జై కలాం - జై భారత్*


*మానవత్వపు ఉన్నతమైన పాఠం*

             ➖➖➖✍️


*నేను మా ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి ఉన్నాను. బస్సు ఇంకా  రాలేదు..*


 *నేను అక్కడ కూర్చుని పుస్తకం చదువుతున్నాను.* 


 *నన్ను చూసి, దాదాపు 10 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి, "సార్, ఈ పెన్నులు కొనుక్కోండి, నేను మీకు నాలుగు పెన్నులు రూ.10కి ఇస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా తినడానికి  ఉంటుంది."* 


 *ఆమెతో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు, బహుశా ఆమె తమ్ముడనుకుంటాను.* 


 *నేను, "కానీ, నాకు పెన్ను అవసరం లేదమ్మా", అన్నాను.* 


 *ఆమె తర్వాత చాలా ముద్దుగా ఇలా ​​అడిగింది,   "అప్పుడు మేము ఏం తింటాం?"* 


 *"నాకు పెన్ను వద్దు, కానీ నువ్వు తప్పకుండా ఏదోకటి తింటావు" అన్నాను.* 


  *నా బ్యాగ్‌ లో రెండు బిస్కెట్ల ప్యాకెట్లు ఉన్నాయి. నేను ఆ రెండు ప్యాకెట్లను తీసి, ఇద్దరికీ చెరొకటి ఇచ్చాను.* 


*కానీ ఆమె ఒక ప్యాకెట్ తిరిగి ఇచ్చేసి, "అయ్యగారు! ఒక్కటి చాలు, ఇద్దరం పంచుకుంటాం" అని చెప్పడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను.* 


 *నేను మళ్ళీ "ఫర్వాలేదు, ఈ రెండూ ఉంచుకో!" అన్నాను.* 


 *దానికి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న నన్ను, నా హృదయాన్ని, నా ఆత్మను కూడా కదిలించింది.* 


*”అప్పుడు మీరు ఏమి తింటారు?" అని అడిగింది.* 


 *కోట్లాది కోట్లు సంపాదిస్తున్న మనుషులు మానవత్వాన్ని పక్కనపెట్టి విజయం పేరుతో ప్రజలను విపరీతంగా దోచుకుంటున్న ఈ ప్రపంచంలో, ఆకలితో ఉన్న ఓ చిన్నారి అమ్మాయి నాకు మానవత్వపు ఉన్నతమైన పాఠాన్ని నేర్పింది.* 


 *ఆత్మతో సంతృప్తి చెందేవాళ్ళు ఇలాగే ఉంటారేమో అని నాలో నేనే అనుకున్నాను...* 


 *దురాశతో వాళ్ళ వంతు కూడా తినేసేంతగా ఎదుటివారి వద్ద నుండి తీసుకోకండి ..!!*

దయచేసి విశాల హృదయంతో, మానవత్వంతో ఆలోచించండి....


🙏 *జై భారత్*

సీనియర్ సిటిజన్లకు TTD

 *సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త.*


వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి.  


ఒకటి ఉదయం 10 గంటలకు,మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. మీరు ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్‌లో సమర్పించాలి.            


వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడి వైపు గోడకు రోడ్డు దాటుతుంది.  ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంది.  


మీరు లోపల కూర్చున్నప్పుడు - వేడి సాంబార్ అన్నం మరియు పెరుగు అన్నం మరియు వేడి పాలు అందించ బడతాయి.  


ప్రతిదీ ఉచితం. 

మీరు రూ20/- చెల్లించి రెండు లడ్డూలను పొందుతారు.  


మరిన్ని లడ్డూల కోసం మీరు రూ. 25/- ప్రతి లడ్డూకి.టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది. 


దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి, ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అనుమతించ బడుతుంది. 


భగవంతుని దర్శనం తర్వాత మీరు 30 నిమిషాల్లోపు దర్శనం నుండి బయటకు రావచ్చు. 


హెల్ప్‌డెస్క్ తిరుమల 08772277777 ని సంప్రదించండి 

సమాచార వివరాలు: TTD.

చదరంగం రాజు

 చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.


అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!

చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.


అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.


రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!

రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు.


"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.


మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!

ఒక గడిలో ఒక గింజ -

రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -

మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -

నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -

.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.


రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.


ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.


తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..

‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..’


‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’


‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.


‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’


‘ఎందుకు..? ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు


ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా ! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.


‘అలాగా.. ఏమిటా పద్యం..?’


‘ఇదుగో.. వినండి మహారాజా !’


శర శశి షట్క చంద్ర శర

సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

ధర గగనాబ్ధి వేద గిరి

తర్క పయోనిధి పద్మజాస్య కుం

జర తుహినాంశు సంఖ్యకు ని

జంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు

సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్


పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’


‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’


‘సరే… సరే.. విప్పి చెప్పు..’


‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..


ఈ పద్యంలో


శర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.


గగన, వియత్ - 0

(ఆకాశం గగనం శూన్యం)


శశి, చంద్ర, తుహినాంశు -1

(చంద్రుడొకడే భూమికి )


షట్కము - 6


రంధ్ర - 9


(నవరంధ్రాలు)

నగ, గిరి, భూధర - 7


అగ్ని - 3

(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)


అబ్ధి, పయోనిధి - 4


వేద -4

(చతుర్వేదములు)


తర్క - 6

( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)


పద్మజాస్య - 4

(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)


కుంజర - 8

(అష్ట దిగ్గజములు)


ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’

శర శశి షట్క చంద్ర శర

5 1 6 1 5

సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

5 9 0 7 3

ధర గగనాబ్ధి వేద గిరి

7 0 4 4 7

తర్క పయోనిధి పద్మజాస్య కుం

6 4 4

జర తుహినాంశు సంఖ్యకు ని

8 1

జంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్


అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -

కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..


అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.


1,84,46,74,40,73,70,95,51,615


ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615


ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,

ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,

4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..


పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.


పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే

సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సంవత్సరాలు..

అదీ సంగతి…


వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .


అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు.


ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .


ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.


సేకరణ....🌼🍂

చక్ర భ్రమణం

 🙏⭐🙏⭐🙏

చక్ర భ్రమణం

☸️☸️☸️☸️☸️

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం... ఇది ‘యుగచక్రం’.

వర్షకాలం, చలికాలం, ఎండకాలం... ఇది ‘రుతుచక్రం’.

రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... ఇది ‘కాల చక్రం’.

బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం... ఇది ‘జీవిత చక్రం’.

సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ పరమేశ్వరుడి నిర్దేశానుసారం ‘చక్ర భ్రమణం’ నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది.

రంగులరాట్నంలో కింది నుంచి పైకి, పైనించి కిందికి తిరుగుతున్నట్టే మనిషి జీవితంలో సుఖానుభవాలు, దుఃఖానుభవాలు... ఒకదాని వెంట మరొకటిగా కలుగుతూనే ఉంటాయి.

ఈ సత్యం తెలిసికూడా మనసును మాయపొర కమ్మేయడంతో రాగబంధాలకు లోనైన మనిషి నిరంతరం బాధపడుతుంటాడు.

జీవిత ప్రయాణం అంటే- గమ్యం వైపు గమనం. ఏది గమ్యం అనేదే జటిలమైన ప్రశ్న!

గమ్యాన్ని నిర్దేశించేది కోరిక. ఆ కోరికను ప్రేరేపించేవి మూడు- ధనం, సుఖం, కీర్తి.

ఎంత ధనం కావాలి, ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఎంత కీర్తిని మూట కట్టుకోవాలి? ఈ ‘ఎంత’ అనేదానికి ‘అంతు’ ఉందా? చాలామంది విషయంలో లేదు, ఉండదు!

మనిషి జీవితంలో- బాల్యం అమాయకంగాను, కౌమారం జిజ్ఞాసతోను, యౌవనం ఆశలతోనూ గడిచిపోతాయి. వార్ధక్యం వచ్చేసరికే అసలు సమస్య మొదలవుతుంది.

జీవిత చరమాంకంలోనూ కోరిక చావదు. ఇంకా ధనం కావాలి, సుఖాలు కావాలి, కీర్తి ప్రతిష్ఠలు కావాలి. ఇంకా, ఇంకా, ఇంకా... ఈ పరుగును ఎక్కడ ఆపాలో తెలియకపోవడమే దుఃఖానికి హేతువు అవుతుంది.

అలాగని కోరికే లేకుండా జీవించడం సాధ్యమే కాదు. ఆ కోరిక ఎంతవరకు అనే విచక్షణే సుఖదుఃఖాలను నిర్ణయిస్తుంది.

ఉరిశిక్ష పడిన ఓ నేరస్థుడికి శిక్ష అమలుపరచేందుకు తలారి సిద్ధమయ్యాడు. ఉరికొయ్యకు అతడి కాళ్లూచేతుల్ని తాళ్లతో ముడివేసి, పరిసరాలు కనిపించకుండా ముఖానికి నల్లటి ముసుగును కప్పేశాడు. ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడానికి ఆ జైలు అధికారి అతడికి ఒక నిమిషం వ్యవధి ఇచ్చాడు. ఆఖరి క్షణాల్లో ఉన్న ఆ నేరస్థుడికి కేవలం తన పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక తేలు అతడి పాదానికి అంగుళం దూరంలో కనిపించింది. భయంతో అతడు తన కాలివేళ్లను వెనక్కి తీసుకోవడానికి, తేలుకాటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు... మరికొద్ది క్షణాల్లో ఉరిశిక్షను అనుభవించబోతున్న అతడికీ ప్రాణాలమీద ఆశే!

మరణించేదాకా జీవించాలనే ఆశను కలిగిఉండటం మనిషి నైజం!

అడవిలో ఒక రుషి తపస్సు చేసుకుంటున్నాడు దీక్షగా. రుషిని గురించి విన్న ఆ దేశ రాజు చూడటానికి వెళ్లాడు. కానీ అంతకు ముందురోజే ఆ రుషి హిమాలయాలకు వెళ్ళిపోయాడని తెలిసి, దర్శన భాగ్యం కలగనందుకు బాధపడిన రాజు, అలౌకిక సంపద కలిగిన రుషి తిరిగి వస్తాడనే నమ్మకంతో అన్ని వసతులతో కూడిన గొప్ప మందిరాన్ని నిర్మించాడు. కొంతకాలం తరవాత తిరిగివచ్చిన ఆ రుషి చెట్టు స్థానంలో వెలసిన మందిరంవైపు చూడగానే అక్కడివాళ్లు- రాజుగారు ప్రత్యేకంగా మీ కోసమే కట్టించారు స్వామీ అని సెలవిచ్చారు. విరాగి అయిన రుషి మందిరంవైపు నిర్వికారంగా చూసి దూరంగా ఉన్న మరో చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోవడం ఆరంభించాడు! బ్రహ్మజ్ఞానం తప్ప మరే కోరికా లేకపోవడం రుషి నైజం.

ప్రాణంకోసం తపించే మామూలు మనిషి స్థితి నుంచి, ఈ ప్రాణమే శాశ్వతం కాదు అనే పరిపక్వ స్థితికి చేరడమే జ్ఞాన దర్శనం అంటే.

చక్ర భ్రమణంలో తనను తాను తెలుసుకుంటూ, జీవన ప్రస్థానంలో అన్ని దశలనూ దాటుకుంటూ మహాప్రస్థానం వైపు అడుగులు వేసేలోగా- ‘నిగ్రహం, నిర్మోహం, నిరాపేక్షత’ అనే త్రిలక్షణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అలా చేయగలిగితే అంతర్యామిని చేరుకునే అలౌకికమైన ఆనందం సిద్ధిస్తుంది.

🙏⭐🙏⭐🙏

విద్యార్థి

 

విద్యార్థి 

సాధకుడు ప్రతి విషయంమీద శ్రర్ధ వహిస్తేనే కానీ సాధనలో ముందుకు పోలేడు. ఏరకంగా అయితే ఒక విద్యార్థి పరీక్షలముందు చదువు యందు చాలా శ్రర్ధ తీసుకొని తనకు ఎక్కువ మార్కులు రావటానికి ఏయే పాఠ్యముసాలని  చదవాలి  వాటిని ఎలా ఆకటింపు చేసుకోవాలి. ప్రతి రోజు యెంత సమయం కేటాయించాలి అని ఏంటో విశ్లేషణ చేసుకొని పరీక్షలకు ముందు ప్రిపేర్ అవటం మనం చూస్తాము. విద్యార్థి తానూ ముఖం కడుకుంటున్న, స్నానమాచరిస్తున్నాన్న, భోజనం చేస్తున్నాకూడా తానూ చేస్తున్న పనులు కాకతాళీయంగా చేస్తూ మనస్సు మాత్రం తానూ చదివిన విషయాలను మనననమ్ చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తుంటారు. అలా సంపూర్ణంగా విద్య యందె నిమగ్నుడైన విద్యార్థి పరీక్షలలో ఎక్కువ మార్కులను సంపాదించుకోవటం మనం చూస్తూవుంటాము. ఒక సాధారణ పరీక్షకోసమే ఒక విద్యార్థి అంతగా కష్టపడితే మరి ఎన్నో జన్మలనుంచు ప్రయత్నిస్తున్న పరీక్ష ఇది అదేమిటంటే మోక్షపదం చేరటం అంటే యెంత కష్టంగా ఉంటుందో యెంత కృషి సల్పాలో మనం వేరే చెప్పనవసరం లేదు. మోక్షార్ధి ఒక విద్యార్థి కన్నా ఎన్నో రేట్ల కష్టం, కృషి, శ్రమ చేస్తూ నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉండి ఒక సత్ గురువు ద్వారా నిత్యానిత్య వివేకా జ్ఞానాన్ని పొంది నిత్యమూ సత్యము అనంతము అయిన ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి సదా నిదిజాసలో వుంటూ ఉంటే మాత్రమే మోక్షసిద్ది కలుగదు.

ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా |
క్షురస్య ధరా నిశితా దురత్యయా దుర్గాం పాఠస్తత్కవయో వదంతి || 14 ||

నిద్రలెమ్ము సాధక అంటే అజ్ఞానం అనే నిద్రలో వున్నావు నీవు ఆ నిద్రను తొలగించి జ్ఞానానం అనే ప్రకాశం వైపు నడువు ఆ దోవ ఎటువంటిదంటే ఒక క్షురకుని పదునైన కత్తిమీద నడవటం వంటిది. అటువంటి కష్టసాధ్యమైన దానిని సాదించటానికి ఒక మంచి స్టేగురువును ఆశ్రయించు అని ఈ ఉపనిషత్ మంత్రం మనకు ప్రబోధిస్తున్నది. 

సద్గురువు ఎవరు: 

కలి ప్రభావం వలన మనకు అనేక మంది తమకు తామే సద్గురువులని చెప్పుకుంటూ అనేక ఆశ్రమాలను నిర్మిస్తూ  ,లక్షలకొద్దీ శిష్యులను కలిగి నిరంతరం పాద పూజలు చేయించుకుంటూ, విలువైన వస్తువులను దక్షణలుగా తీసుకుంటూ మనకు అనేక మంది తారసపడుతున్నారు. విచిత్రమేమిటంటే వారు నిత్యం అనేక వేదాంత ఉపన్యాసాలను చేస్తూ అనేకులను ఆకాసర్షిస్తున్నారు. వారి దర్శనానికి ఫీజు, పాదపూజకు ఫీజు మనకు వారి భక్తులు చెపుతుంటారు మేము ఈ స్వామీజీని నమ్ముకున్నాము.  ఆయనకు పాదపూజ జరిపిస్తే మాకు ఈ మంచి జరిగించి ఆయనకు పూజలు జరిపిస్తే అది జరిగింది.  ఆయన సాక్షాత్తు ఫలానా దేముడి  అవతారం. మీరు మీ కోరికలు తీర్చుకోండి అని చేసే ప్రచారాలకు, ప్రలోభాలకు ప్రలోభపడి అప్పుడప్పుడే ఆత్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్న సాధకుడు తనకు భక్తిమార్గమే శరణ్యం అని అనుకుంటూ ఇటువంటి గురువుల శిష్యుల మాటలకు ఆకర్షించబడి ఆ గురువు సేవనమే తన  జీవిత పరమావధి భావంచి తన ఆమెయిల్యమైన జీవితమును వృధా చేసుకుంటున్నారు. సాధకులను త్రప్పుడు త్రోవ పట్టించి వారివద్ద వున్నా ద్రవ్యాన్ని తస్కరించి ఈ రకమైన గురువులు వారి సంపదను వృద్ధి చేసుకోవటమే కాకుండా పెద్దపెద్ద భవనాలలో  అనేక ఆశ్రమాలను   నిర్మించిప్రజా సేవ చేస్తున్నట్లుగా ప్రగల్బాలు పలుకుతూ తమ పగ్గం గడుపుకుంటున్నారు.  విచిత్రం ఏమిటంటే మన హిందువులు మాత్రమే కాకుండా మహమ్మదీయుడైన ఒక సాదువుకూడా ఇటీవల బాబాగా ప్రసిద్ధి చెంది తన మరణానంతరము  గుడులు,గోపురాలు కలిగి నిత్యం పూజలు అనుడుకోవటం మనం చూస్తూవున్నాము. బాబా భక్తీ మత్తులో వున్న వారిని తిరిగి హిందుత్వపు వైపు తీసుకొనిరావటానికి సాక్షాత్తు ఆదిశంకర భగవతపాదులకు కూడా సాధ్యం కాదేమో అని ఈ సాధకుని అనిపిస్తున్నది.  ఎందుకంటె వారు బాబా మత్తులో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మృగతృష్ణలోనుంచి నీటిని తోడటం వంటిది. 

ప్రతి సాధకుడు ముందుగా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి సద్గురువు ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాలి, రెండవది సద్గురువు కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే తనకు ఉపకరిస్తాడు కానీ సద్గురువు మోక్షాన్ని ప్రసాదించే వాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే గురువును మనం ఒక ఉపకారణంలాగా మాత్రమే చూడాలి కానీ గురువుచుట్టూ తిరుగుతూ జీవితాన్ని వృధా చేయకూడదు. మనం ఒక ప్రయాణం చేస్తూవున్నాము మధ్యలో ఒక నది వచ్చింది ఆ నదిని దాటటానికి ఒక పడవను ఉపయోగిస్తాము నది దాటినా తరువాత మనకు ఆ పడవతో నిమిత్తం లేదు మరల మన ప్రయాణం మనమే చేస్తూ మన గమ్యస్థానాన్నికి చేరుకుంటాము. ఇక్కడ మన ప్రయాణంలో పడవ ఎలా ఉపయోగ పడిందో అలానే మనకు సద్గురువు కూడా గురువు బోధనలను విని మన సందేహాలను నివృతి చేసుకొని తిరిగి మన సాధనను కొనసాగించాలి. అంటే కానీ జీవితాంతం గురువుకు సేవచేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. 

సద్గురువు ఎలా వుంటారు. సద్గురువు తనకు తానుగా ఆత్మా సాక్షాత్కారం పొందినవాడుగా ఉండాలి అటువంటివాని వల్లనే మనము జ్ఞ్యానాన్ని పొందగలము మనకు జ్ఞ్యానాన్ని ఇవ్వాలనే ముందుగా మన గురువు జ్ఞాని అయివుండాలి కదా. గురువు అరిషడ్వార్గాన్ని త్యజించిన వాడై ఉండాలి.  అంటే ఆయనకు మన సామాజిక జీవనపు లక్షణాలు ఏవి వున్దకూడాదు. అంటే ఏ విషయాలమీద ఆసక్తి,  అనురక్తి,మోహము, కామము లేని వాడై  ఉండాలి. కేవలము బిక్షాటన చేస్తూ తనకు దొరికిన దానిని భుజిస్తూ పరుల సొమ్మును ఆశించని వాడు అస్సలు ఇతరులతో మాట్లాడని వాడు ఇతరులనుంచి ఏది కోరని వాడు. కౌపీనము (గోచీ) మాత్రమే ధరించే వాడు అయివుండాలి అటువంటి సత్ గురువు మీకు లభిస్తే వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించి శిష్యత్వాన్ని సవీకరించండి

సాధకుడు ముందుగా ఒక భక్తుడిగా తన ఆధ్యాత్మిక జీవనాన్ని మొదలుపెడతాడు. అదే అతనికి ఒకరకంగా రెండవ జన్మగా మనం అభివర్ణించవచ్చు. దేవి దేవతల యందు భక్తి కలిగి  నిత్యం దూప దీప నైవైద్యంతో పూజలు చేసే భక్తుడు తానూ త్రికరణ శుద్ధిగా ఆచరించే పూజల ఫలితంగా ముందుగా అంతకరణ శుద్ధి ఏర్పడుతుంది. కొంతకాలం పూజలు చేసిన తరువాత కొద్దీ కొద్దిగా వాక్సుద్ధి ఏర్పడుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఆ స్థితిలో సాధకునికి ఒక ప్రశ్న తలయెత్తుతుంది. తానూ చేసే పూజలు మాత్రము చాలవు ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమైనా చేయాలి అనే  ఉదయిస్తుంది. ఆ భావన కలగటమే జీవితంలో మలుపుకు దారితీస్తుంది. అప్పుడు తరువాత  జపం,తరువాత ధ్యానం చేస్తూ సాధకుడు భగవంతునికి దగ్గరగా అవుతాడు. 

 నిత్యం భగవంతుని ధ్యానిస్తూ నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన సాధకుడు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్దించుకున్న సిద్ధుడే.  కాబట్టి సాధకులారా మీ అమూల్య మైన సమయాన్ని వృధా చేసుకోకుండా కుటింటిత దీక్షతో  కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి  శాంతిః    

మీ  భార్గవ శర్మ 

ఈ పద్యం జ్ఞాపకం వున్నదా

: శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

ఈ పద్యం జ్ఞాపకం వున్నదా

వైశాఖ పురాణం - 22.

 వైశాఖ పురాణం - 22.


22వ అధ్యాయము - పాంచాలరాజు సాయుజ్యము


నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.


పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.


నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |

యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1


ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |

అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2


సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |

తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3


తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |

దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4


ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |

భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5


భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |

నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6


తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |

స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7


వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |

తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8


తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |

నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9


ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |

యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10


నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |

తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11


త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |

సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12


నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |

లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13


పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |

కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14


పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |

తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15


సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |

సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16


సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |

యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17


ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |

అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18


అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |

భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19


ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |

సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20


భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |

నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21


ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |

స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22


కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |

దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23


హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |

న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24


త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25

అని స్తుతించెను.


పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు, పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా! అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు/శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే.


01 స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.


02 తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.


03 స్వామీ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.


04 తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.


05 స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.


06 నేనును యిట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.


07 ఇందువలన శత్రువులు నా రాజ్యము నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.


08 ధర్మార్థకామమోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.


09 అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు.


10 నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.


11 స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.


12 మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగానేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.


13 స్వామీ! ఎచటను సుఖనిద్రలేదు, శుభములేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.


14 నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.


15 స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.


16 సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.


17 ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.


18 స్వామీ! అచ్యుతా! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.


19 కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.


20 జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.


21 ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.


22 నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక.నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.


23 నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.


24 నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.


25 ప్రభూ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.


ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘగంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన యీ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తినిముక్తిని యిత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని, ముక్తిని యిత్తును. ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు, కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును. వైశాఖవ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత యిష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.


వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.


పాంచాలమహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


ఉత్తమమైన యీ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.


వైశాఖ పురాణం 22వ అధ్యాయం సమాప్తం

అర్చకుల బాధలు

 "అర్చకత్వం" అంటే అంత సులభం కాదు ? ఎందుకు అంటున్నాను అంటే కొంతమంది మహానుభావులు ఏముందండీ మీ నోరే గా  నాలుగు మంత్రాలు చదవడం మేగా   మాలాగా గొడ్డు చాకిరి లేదు అంటారు .కానీ  అర్చకత్వం చేసేవారి మానసిక సంక్షోభం, ఒక వయస్సు వచ్చేటప్పటికీ వాళ్లు తీసుకునే సాత్వికఆహారపు అలవాట్ల కి శారీరక దౌర్బల్యం, మానసిక సంక్షోభం ఇవన్నీ కలిసి 40 ఏళ్ల వాడిని 60 ఏళ్ళ వాడిని చేస్తాయి. ఇవన్నీ  మహానుభావులకి తెలియదు. సుఖంగా కూర్చున్నదే వాళ్ళకి తెలుస్తుంది

తెల్లవారకట్ట నిద్ర లేచిన అర్చకుడు కాలకృత్యాలు నెరవేర్చుకుని దేవలయం ద్వారాలు తెరచి విగ్రహం దగ్గరనుండీ అంతా శుభ్రం చేసుకొని , అభిషేకం , అర్చనా పూర్తి అయ్యే సరికి నీరసం నిస్సత్తువ తో  ఇంటికి పోయి కాఫీ/టీ తాగుదామని అనుకొనే లోపల , భక్తులు వొచ్చి పూజచేయమని అడగంగానే అప్పుడు వారితో ఇప్పుడే వస్తానండి  ఇంటికి వెళ్ళి కొంచెము కాఫీ తాగివస్తా అంటే ! స్వామి త్వరగా రండి మాక పనిఉంది అంటారు . కొంతమందైతే 

మాకు త్వరగా అర్చన చేసిపోస్వామి అంటారు..

అలా వొచ్చిన వారికి  పూజ చేస్తూనే తీర్ధం, శఠారీ పెడుతూ  ఆకలిని చంపుతూ పూజని పూర్తిచేసి బడలిక తీర్చుకున్న అర్చకుడు ఎవరినో ఒకరిని అక్కడ పెట్టి అవసరాలను తీర్చుకొని.. దేముడికి భోగము పెట్టి, వచ్చిన వారి గోత్ర నామాలను చెప్పి అర్చన మొదలు పెట్టిన తరువాత ఎవరో ఒకరు తమకు కూడా అర్చన మొదలు పెట్టమని మొదటి భక్తుడు ఉరిమి చూస్తూ ఉండగా రెండవ భక్తుడి గోత్రనామాలను చెపితే మొదటి భక్తుడు తన ముని మనవారళ్ళ పేర్లతో సహా చెప్పమని వత్తిడి చేస్తే కంఠం నెప్పి వచ్చినా మారు మాట్లాడకుండా అన్నీ చెప్పి పూజ చేసి తీర్ధ మంత్రంతో మూడుసార్లు వేయకుండా ఒకసారి వేసినందులకు కోపంగా చూసే కళ్ళను తప్పుంచుకుంటూ ప్రసాదం ఇచ్చి సంభావన ని చూసి నిరాసక్తంగాను ఒక్కొక్కప్పుడు ఆనందంగానూ చూసే లోపు కమిటీ మెంబర్లు వస్తే వాళ్ళ పేర్లమీద పూజచేసి ఒక కంట వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ మధ్యలో వాళ్ళు వేసే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు మాట్లాడకుండా అర్చన చేసి ప్రసాదం ఇచ్చిన తరువాత వారు తిట్టినా కోప పడక వారి సలహాలను పాటిస్తూ  అని వాళ్ళని తృప్తి పరచి హమ్మయ్యా అని కూర్చునే లోపల భక్తుల వస్తే పూజ లేదా తీర్ధం ఇచ్చి వాళ్ళ సమస్యలను విని సలహాలు ఇచ్చే సరికి ఆకలి నకనకలాడతూ ఇంత ప్రసాదమో లేక ఫలమో తిందామటే ఉండొచ్చూ ఉండొక పోవచ్చు అనుకుంటూ ఉన్నదాంట్లో తృప్తి పడే లోపు కమిటీ లేదా  పంపిన గుఢాచారికి సరైన సమాధానమచ్చే సరికి తలప్రాణం తోకకి వస్తుంది అప్పటికి సమయం మధ్యాహ్నం 12:00 ఇక గుడిని కట్టేద్దామనుకునే లోపల భక్తులు వస్తే వారికి ప్రసాదం పెట్టి  నీరసంగా గుడి తలుపులు వేసి ఇంటికి పోయి మహా నైవేద్యం తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టి తాను తినేసరికి మధ్యాహ్నం2:00 కాస్తంత నిద్రపోయి సాయంత్రానికల్లా ఇంటి కోసం, గుడి కోసం  సరుకులను తెచ్చే సరికి గుడితీసే సమయం ప్రారంభం , ఆరాత్రి 9:00 గంటలకి గుడి మూసి ఇంటికి వచ్చి నిద్రపోయే సరికి  రాత్రి 11:00 గంటలు ఇదీ ఒక గుళ్ళోని అర్చకుని రోజువారీ వ్యవహారం, ఇంకొటి సెలవులు అవేమీ ఉండవు,  పైగా అదనంగా తిట్లు రాజకీయాలు భరించాలీ, తన కుటుంబం కోసం తాను నమ్మిన దేవత & దేవుని కోసం. పొరపాటున బయట టిఫిన్ తిన్నాడా ఇక పని ఐపోయి నట్టే ఇదీ ఒక సాధారణ అర్చకుని కధ కాదు కాదు ఇది ఒక అర్చకుని వ్యధ, ప్రతీ గుడి తిరుపతో,యాదగిరి గుట్టో కాదు!థూపదీపాలకు నోచుకోని గుళ్ళు,ఒక రోజు కూడా భో(క్త)జనానికి దొరగని "బాపని ఇళ్ళు" ఎన్నో ఉన్నాయీ మన(దేశం) తెలుగు రాష్ట్రాల్లో...

* ఇదేనయ్యా అర్చకుల బాధలు..ఇంకా వ్రాయాలంటే ఎన్నో ఉన్నాయి కాని మీరు చదవలేరు..అందుకే ముగిస్తున్నాను..🙏

తంజావూరు - బృహదీశ్వర ఆలయం..._*

 *_మిస్టరీలకు నిలయం - తమిళనాడు తంజావూరు - బృహదీశ్వర ఆలయం..._*


ఇది శైవాలయం (శివాలయం).  11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు.  చాల ప్రసిద్ది చెందిన ఆలయం. చాల పెద్ద ఆలయం..  రాజ రాజ చోళుడు క్రీ.శ్. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..


1. ఈ ఆలయం లో ఉన్న శివుడి పేరు రాజ రాజేశ్వరుడు. మరాఠాలు దీనికి  బృహదీశ్వర ఆలయం అని పేరు పెట్టారు  


2. ప్రధాన ఆలయం మొత్తం గ్రానైట్ తో నిర్మించబడినది. సుమారు 130,000 టన్నుల గ్రానైట్ వాడారని ఒక అంచనా. గ్రానైట్ ని ఈ రోజుల్లో ముక్కలు చేయడమే కష్టం అలాంటిది అన్ని టన్నుల గ్రానైట్ ఎలా ముక్కలు చేశారో ఇప్పటికి ఎవరికి అంతు పట్టదు


3. ఆలయం లో ఉన్న నంది  వాహనం  కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2. 5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది


4. ప్రధాన విమానం 200 అడుగులు ఎత్తు ఉంటుంది  దీన్ని దక్షిణ మేరు అంటారు


5. ఈ దేవాలయం నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ నిక్షేపాలను ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో వున్న'పుదుకోవై' అనే ప్రాంతంలోని కొండలను తొలిచి అక్కడినుంచి తెప్పించి ఉంటారని చెబుతుంటారు. ఆలయ పైభాగానికి కప్పుగా 80 టన్నుల బరువుగల ఏకశిలను ఉపయోగించారు. ఈ రాయిని గుడి పైకి చేర్చడానికి వారు ప్రత్యేకమైన వంతెన వంటి నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. 13 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించడమే కాకుండా, నర్మదా నదీ ప్రాంతం నుంచి తెప్పించిన 13 అడుగుల 'ఏకశిల'ను గర్భాలయంలో శివలింగంగా మలిచారు. ఈ శివలింగానికి అభిషేకం నిర్వహించడానికి రెండు వైపులా మెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక 8 అడుగుల వెడల్పు ... 12 అడుగుల ఎత్తు గల నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా ఏకశిలలోనే మలిచారు. లేపాక్షి బసవన్న తరువాత ఆ స్థాయి విగ్రహం ఇదేనని చెబుతూ వుంటారు.


6. వెయ్యేళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహర్మం. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉన్నది. దీని ఎత్తు 3. 7 మీటర్లు.


7.  ఆలయం నిర్మించటానికి సిమెంట్, ఉక్కు వాడలేదు. పూర్తిగా 13 అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టించారు.


8. ప్రధాన ఆలయానికి గోపురం హైలెట్. 13 అంతస్తులు ఎటువంటి గోడ సహాయం లేకుండా నిలబడటం అనేది.


 9. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం మిట్టమధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా పడకపోవడం. గుడి నీడన్న పడుతుందేమో గానీ గోపురం నీడ అస్సలు పడదు.


10. ఆలయంలో అనేక సొరంగమార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే, మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజచోళుడు తగుజాగ్రత్తల కోసం ఏర్పాటుచేసుకున్నాడని చెబుతారు


11. వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిధిలావస్థ దశలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కుచెదరకుండా అత్యద్భుతంగా, ఇప్పుడిప్పుడే కట్టారా ? అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు, విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.


12. గుడి చుట్టుపక్క ప్రాంతాలలో ఇప్పటికీ పురావస్తుశాఖ వారు తవ్వకాలను జరుపుతున్నారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఎదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువో బయటపడుతూ ఉంది ... ఆనాటి వైభవాన్ని చాటుతూ ఉంది.


13. గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్నరాతి తోరణాలు. ఈ తోరణాల యొక్క రంధ్రాలు ఆరు మీ.మీ ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికీ తెలీదు.


14. ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోకతప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకొనే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు...

టీచర్లని ఎలా అంటాం..

 *_పిల్లల్ని ప్రేమించలేనివారిని టీచర్లని ఎలా అంటాం..?_*

_(వివక్షతను మించిన విషం ఉంటుందా!!?)_

*=================*

_|మనసును కదిలించే కథ... చదవండి! 🙏|_


*కరీంనగర్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్ లో గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా, పక్కనే ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా school కే పంపడం. ఇంకా ఇంకా నాకస్సలు నచ్చేది కాదు. అసలే నాకు ఈ ఊళ్లంటేనే పడదు. అలాంటిది మళ్లీ ఈ ఊరమాస్ పిల్లలకు చదువు చెప్పాలి.  "దేవుడా ! ఏంటీ పరీక్ష" అని రోజూ చిరాకుతో కూడిన చిర్రబుర్రులతోనే బడికి వెళ్లేదాన్ని.* 


*అందులో ఒక్కణ్ణి చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకెప్పుడు వాణ్ని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్ళుంటాయి. వాడు మూడో తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకొనేవాడు. ఆరాతీస్తే, వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పని చేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవారు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని,  పంపిస్తూన్నా రనిపించింది.*


*నా దృష్టిలో అయితే వాడు చాలా poor student. ఏమీ గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్ప చెప్పమన్నా కూడా వాడికి 5 కి మించి రావు. పైగా వాడి నలుపు రూపు చూస్తేనే అసహ్యంగా అనిపించి అస్సలు వాడి వైపు చూడ్డం  కానీ, మాట్లాడటం కానీ అస్సలు చేసేదాన్ని కాదు.* 


*అలాంటోడు కొన్ని రోజులుగా school  ki రావడమే మానేశాడు.  ఇలాంటి places లో school  ki రావడం, మానేయడం వీళ్ళకు మామూలే కదా! అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు...* 


*ఒకరోజు హెడ్మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్ కి వెళ్లాను. ఆయన రూమ్ లో ఆయనకెదురుగా ముప్పై ఏళ్ళున్న ఒక labour  ఆవిడ చేతులు కట్టుకుని నిల్చుని ఉంది.* 


*ఆవిణ్ణి నాకు పరిచయం చేస్తూ.. _"ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు పదిరోజుల కిందటే విషజ్వరంతో చనిపోయాడంట. వాళ్ళమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది madam ఒక్కసారి మాట్లాడండీ"_ అన్నారు హెడ్మాస్టర్.*


*వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్లెంబడి నీళ్లతో కుప్పకూలి, మేడమ్..! వాడు పోయే ముందు ఎప్పుడూ... _"నళిని  మేడమ్ తో ఒక్కసారన్నా good  అనిపించుకోవాలి అమ్మా"_ అని నాతో రోజూ చెప్పేవాడు.* 


*వాడు చనిపోయే ముందురోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా...! వాడు తనకు తానే _" సాంబడు good"_  అని పుస్తకంలో రాసుకొని మీ లాగే సంతకం చేసుకున్నాడు,"  అని తాను తెచ్చుకున్న సంచిలోనుండి పుస్తకం తెరిచి వాడి చిన్ని చిన్ని రాతలతో నా పేరు చూపించింది వాళ్ళ మ్మ... నాకళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటిబొట్లతో వాడు పెట్టిన నా.. నా.. సంతకం తడిసి, పేజీ ముద్దగా అవుతోంది. నాకు దుఃఖం ఆగడంలేదు.*


 *వాడు బతికుండగా ఒక్కసారి కూడా వాణ్ని మెచ్చుకోలుగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూళ్ళేదు వాణ్ని.* 

*పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడో!  _"తండ్రీ ఎక్కడున్నా నన్ను క్షమించు... జాతి, వర్ణ, ఆర్ధిక బేధాలతో.. వివక్షలతో  చిన్నారులను చిన్న చూపు చూసే నాతో పాటు నాలాంటి ఎందరో బుద్ధిలేని పెద్దమనుషులను కూడా క్షమించరా"😌_ అని మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ...* 

*_“సాంబడు  is Very Good”  నాలాంటి ఎందరో కళ్లు  తెరిపించావు తండ్రీ!_ అని అదే బుక్ లో రాసి ఆ గదిలోనే ఉన్న bench మీద కూర్చుని హెడ్మాస్టర్  గారి వెనుక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి _"తప్పు  చేశాను సార్!  🙏ఇక మీదట ఇలా జరగదు"_ అని నాకు నేను మనస్సులోనే ప్రమాణం చేసుకున్నాను.*  😌

*_దయచేసి పిల్లలని ప్రేమించండి.🙏_* 

_మీ...._ 

_—నళిని టీచర్_ 

— *Written by ✍️ Challa SridharReddy, software engineer, Telangana*—

*:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:*

*_{ఇదిసేకరణే.... ఈ కథను తెలంగాణకు చెందిన 'చల్లా శ్రీధర్ రెడ్డి' అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాశారు. నాకు పర్సనల్ గా పంపించారు. చదువుతూంటే నా మనసు కదిలింది.. కళ్ళు చెమ్మగిల్లాయి. అందరూ చదవాల్సింది.. ముఖ్యంగా టీచర్లు. అందుకే.. మీతో పంచుకుంటున్నాను.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

గ్రహ కూటమి

 4 వ తేదీ ఎన్నికలు ఫలితం రావడం తోనే గ్రహ కూటమి కూడా మొదలు అవుతుంది ఈ సారి అధికారం లో ఎవరు ఉన్నా, పాలకులు చాలా ఇబ్బంది పడతారు.. అమావాస్య తో 

ఏర్పాడుతున్న పరిణామం శుభ సూచకం కాదు.. ఎవరు అధికారం లోకి వచ్చిన వారు తరచుగా చండి హోమాలు చేయించుకుంటూ ఉండాలి 


💐🙏పంచ గ్రహ కూటమి🙏💐


జూన్ 6 వ తేది(గురువారం)వైశాఖ అమావాస్య:-✍️


జూన్ 5 వ తారీకున ఉదయం 04:12 కి చంద్రుడి వృషభ రాశి ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశిలో రవి,చంద్ర, గురు,బుధ, శుక్ర,  గ్రహాల పంచ గ్రహ కూటమి జరుగబోతోంది. 


ఈ గ్రహ కూటమిలో రవి ,గురువులు గ్రహ యుద్ధంలో ఓడింపబడి వున్నారు.

శుక్రుడు అస్తంగత్వం అయ్యి మౌఢ్యంలో వుండడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి సమస్యలు కలగడం జరుగుతాయి.


గ్రహ కూటములు ఎప్పుడూ దుష్ఫలితాలనే ఇస్తాయని బృహత్ సంహిత  వంటి గ్రంథాలలో చెప్పబడింది. అమావాస్య  సమయంలో  సంభవించబోయే ఈ పంచ గ్రహ కూటమి ఎక్కువ ప్రమాదకారి అనే చెప్పొచ్చు.


వృషభ రాశి భూతత్వపు రాశి కనుక కొన్ని ప్రదేశాల్లో భూకంపం సంభవించవచ్చు. వృషభ రాశి భారత దేశపు లగ్నం. 


ఈ పంచ గ్రహ కూటమి వివిధ రకాల దుస్సంఘటనలకు కారణం అయ్యే సూచనలు వున్నాయి. 


 మత/కుల/వర్గ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది. 


ఢిల్లీ, కశ్మీర్,ముంబై, తూర్పు భారత దేశంలోని రాష్ట్రాల్లో ఎక్కడైనా భూమి కంపించ వచ్చు. స్టాక్ మార్కెట్ లో విపరీతమైన హెచ్చు తగ్గులు వుండొచ్చు. అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.


మరొక ముఖ్య మైన అంశం : వృషభ రాశి లో కూటమి లో వున్న 5 గ్రహాలు జల తత్వపు రాశైన వృశ్చిక రాశిని వీక్షిస్తారు.  ఈ 5 గ్రహాలతో పాటు మేష రాశిలో వున్న కుజుడు తన అష్టమ దృష్టితో ,  కుంభ రాశిలో వున్న శని తన దశమ దృష్టితో , మీన రాశిలో వున్న రాహువు తన నవమ దృష్టితో

అంటే మొత్తంగా అన్ని గ్రహాలు వృశ్చిక రాశిపై దృష్టి సారిస్తారు. 

దీని వల్ల దక్షిణ భారత దేశంలో  అకాల వర్షాలు, వరదలు, జన నష్టం, ఆస్తి నష్టం సంభవించవచ్చు. 


అరుదుగా సంభవించే ఈ కూటమి వల్ల కలిగే దుష్ఫలితాల ప్రభావం తమ పై పడకుండా ఎవరికి వారు ఇష్ట దైవ ప్రార్థన చేసుకోవాలి.


#గమనిక:- ద్వాదశ రాశులు వారు జూన్ 6 వ తేది తమ తమ గృహల్లో ఇది వరకు పోస్ట్ లో ఇచ్చిన అష్ట దిక్బంధనతో ఇంటికి రక్షణ చేసుకువాలి అదే మంత్రాన్ని 1008 సార్లు జపం చేసుకోవాలి. 3 వరాలు పాటు మాంసాహారం తినకపోవడం మంచిది వాతావరణం కారణం గా జబతువులు జబ్బు పడతాయి ఆ మాంసం ఆరోగ్యం కి మంచిది కాదు ముఖ్యం గా చేపలు తినే వారు త్వరగా అశ్వాస్తతకు గురు అవుతారు.. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారి మూడు లేక నాలుగు వరాలు పాటు గర్భధారణ జరగకుండా జాగ్రత్త పడాలి వైకల్యo వచ్చే సూచనలు ఉంటాయి.. దూరప్రయాణాలు చేయండి మంచిది కాదు.. వాయువు ద్వారానే వైరస్ వ్యాపించే రోగాలు ఈ గ్రహ కూటమి ద్వారా తెలుస్తున్న పరిణామం.. గ్రహ కూటమి వల్ల ఇవన్నీ ఏర్పడటం లేదు ఇవన్నీ జాగరగబోయే దానికి ఈ కూటమి ఒక ముహూర్తం.. ఇది వరకే చాలా సార్లు చెప్పాను ప్రకృతి వైపరిత్యం ద్వారా

 ప్రాణ నష్టం జరుగుతుంది అని ఈ కూటమి ఒక సూచన అంతే, తులా రాసి వారు శాంతి హోమం చేయించుకోండి.. హనుమాన్ చాలీసా పారాయణం సీతలిని స్త్రోత్రం పారాయణం చేసుకోండి.. భయపడాల్సిన అవసరం లేదు ఆహారం విషయం లో ప్రయాణం విషయం లో జాగ్రత్తగా ఉండాలి.. కరోనా లాంటి సమస్యలు కూడా క్రమశిక్షణ ఆహార నియమాలు వల్లే తగ్గింది మందులు వల్ల కాదు.. దైవానుగ్రహం తప్పా ఇటువంటి వాటికి పరిష్కారం ఉండదు అందుకే ఈ పూజలు హోమాలు 


🌹శ్రీ మాత్రే నమః 🌹

అహంకారముము తోలగించునో

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝  *సా విద్యా యా మదం హన్తి సా శ్రీర్యార్థిషు వర్షతి*।

      *ధర్మానుసారిణీ యా చ సా బుద్ధిరభిధీయతే*॥


తా𝕝𝕝 ఏదైతే అహంకారముము తోలగించునో అదే విద్య... ఏదైతే యాచకుల కోరికలను తీర్చునో అదే ధనము.... *ఏదైతే ధర్మబద్ధముగా ఆలోచించునో అదే బుద్ధి అని చెప్పబడుతున్నది*...


          👇 { _/  *కనకధారా స్తవం* _/ } 👇


     *ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారే:*

      *ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని*

    *మాలాదృశో ర్మధుకరీవ మహోత్సలే యా*

    *సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః* (02)


తాత్పర్యం: నల్లకలువ మీద ఆడు తుమ్మెద ప్రీతితో వ్రాలినట్లు శ్రీమహా లక్ష్మి యొక్క సుందరమైన చూపులు ప్రణయంచేత తన నాథు డైన నారాయణుని చూచుటకు ముందుకు సాగుతున్నాయి. ఆయన తన్ను చూచినప్పుడు సిగ్గుతో ఆమె చూపులు వెనుకకు మరలుతున్నాయి. ఈ రీతిగా ప్రణయం చేత, ఆయన తన వైపు చూడనప్పుడు ప్రియుణ్ణి వీక్షిస్తూ, ఆయన చూపులు తన మీదికి వ్రాలినప్పుడు లజ్ఞతో వెనుకకు మరలుతున్న ఆ కలుములు చెలి *కంటి చూపులు నా మీద ప్రసరించి నాకు సిరిసంపదలు అనుగ్రహించు గాక*

తిరుమలనంబి

 తిరుమలనంబి .....

1000 ఏళ్ళ క్రితం తిరుమలలో ఎవరూ నివాసం ఉండేవాళ్ళు కాదు., 

అప్పుడు తిరుమల భయంకరమైన క్రూర జంతువులతో నిండి ఉన్న కీకారణ్యం.,

ఈ రోజుల్లోనే అప్పుడప్పుడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయంటే అప్పట్లో ఎంత భయంకరంగా పులుల సంచారం ఉండేదో ఊహించండి., విపరీతమైన చలి, భయంకరమైన దోమలు.,

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నర సంచారం ఉండేది.

తిరుమలలో అప్పట్లో నివాసం అనేది కనీసం ఊహించడానికే భయపడే అంశం.,

అటువంటిది మొదటిసారిగా ప్రాణాలకు తెగించి స్వామి వారికి నిత్య కైంకర్యాల కోసం మొదటిసారిగా తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి తిరుమలనంబి.,

అందుకే ఆయనను First Citizen of Tirumala అని కీర్తిస్తారు.,

వెంకటేశ్వరస్వామి ఆయనకు స్వయంగా  బోయవాని రూపంలో ప్రత్యక్షమై ఆకాశగంగ తీర్థాన్ని ఏర్పరచిన సన్నివేశం అద్భుతం.,

తిరుమలనంబి దక్షిణ మాడవీధిలో చిన్న కుటీరం ఏర్పరచుకుని స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిపేవారు.,ఈ తిరుమలనంబి నివశించిన ప్రాంతంలోనే గుర్తుగా ఆయనకు గుడి కట్టారు., మార్గానికి కుడి ప్రక్కగా దక్షిణ మాఢవీధిలో ఈ మహానుభావుడి గుడి ఉంది., బ్రహ్మోత్సవాలు/ఊరేగింపులలో స్వామివారు ఈ గుడికి ఎదురుగా రాగానే నైవేద్యం/హారతి సమర్పిస్తారు.,ఓసారి బ్రహ్మోత్సవాల్లో ఈవిషయం మర్చిపోయారు.,దానితో స్వామివారి రధం ముందుకు కదలలేదు, తరువాత విషయం తెలుసుకుని ముందుకు కదిలించారు....

Shared from WhatsApp

https://whatsapp.com/dl/source=sfw

ఆస్తి పాస్తులు

 మన ఆస్తి పాస్తులు అంటే ఇళ్ళు, బండి, కారు, స్థలం & పొలం డబ్బు ఇవేనా నీ ఆస్తులు? దేశం నీ ఆస్తి కాదా? ధర్మం నీ ఆస్తి కాదా? సంస్కృతి నీ ఆస్తి కాదా? సాంప్రదాయం నీ ఉనికి కాద?హిందుత్వం నీ అస్తిత్వం కాద ?ఎప్పుడు ఆలోచిస్తావు హిందువా? నీ హిందూ ధర్మం కోసం నీ సనాతన ధర్మం కోసం, నీ తాత ముత్తాతలు వాళ్ల తాతలు,వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తులు అంతస్తులు కావాలి  కానీ వాళ్ళు నీకు వారసత్వంగా  ఇచ్చిన ధర్మం నీకు వద్దా ! వాలిచ్చిన ఆచారాల వ్యవహారాలు నీకు వద్దా! ఎప్పుడు తెలుసుకుంటావు హిందువా, నీ ఆస్తులతో పాటు మీ తాత ముత్తాతలు ఇచ్చిన ధర్మాన్ని కూడా కాపాడుకో అదే నీ అస్తిత్వం నీ జీవితానికి ఆలంబన. "ధర్మో రక్షిత రక్షితః"

అని విన లేదా


ఒక జాతి, ఒక ధర్మం,సాంప్రదాయం, ఆచారవ్యవహారాలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు 

1) చరిత్ర తెలుసుకోకపోవడం., 

2) ఐకమత్యం లోపించడం., 

3) సంస్కృతీ-సాంప్రదాయాలను వదిలివేయడం.  

4) అందరూ మనవాళ్లే అని నమ్మటం

5) ముఖ్యంగా కొంతమంది దుష్ట శక్తులు వారి స్వార్థం కోసం హిందూ ధర్మం మీద  హిందూ ఆచారాల మీద హిందువుల మీద దుష్ట ప్రచారాలు చేస్తున్నారు అని తెలుసుకోలేకపోవటం ఆ దుష్ట ప్రసారాలను తిప్పి కొట్టలేకపోవటం...    ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిఘటించే సత్తా లేక పోవడం.ఉన్న నిమ్మకు నీరెత్తి నట్టు ప్రవర్తించడం. తస్మాత్ జాగ్రత్త సోదరులారా సమయం ఆసన్నమైంది నీ ఉనికిని నిలుపుకో కాపాడుకో సత్తా చాటి సనత ధర్మాన్ని పునః ప్రారంభం దిశలో అడుగు వ్వేయి  భావి తరాలకు ఈ ఫలాలు అందించాలి.  ఇదే 

సదావకాశం.           

జై శ్రీరామ్ 

జై జై శ్రీరామ్ 

భారత్ మాతాకీ జై 

భారత్ మాతాకీ జై.... వందేమాతరం...వందేమాతరం

పంచాంగం 30.05.2024

 ఈ రోజు పంచాంగం 30.05.2024  Thursday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ    పక్ష: సప్తమి తిధి బృహస్పతి  వాసర: ధనిష్ఠ నక్షత్రం వైధృతి యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


సప్తమి పగలు 11:42 వరకు.

ధనిష్ఠ ఉదయం 07:30 వరకు.

సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:42


వర్జ్యం : మధ్యాహ్నం 02:19 నుండి 03:49 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:04 నుండి 10:56 వరకు తిరిగి మధ్యాహ్నం 03:15 నుండి 03:49 వరకు.


అమృతఘడియలు : రాత్రి 11:24 నుండి 12:55 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

చదువుకొనుటను తగ్గించు

 *2024*

*కం*

చదువుకొనుటతగ్గించుచు

చదువు‌ను కొన నేర్చినంత చపలము ప్రబలెన్.

చదువును కొన మదము బలియు

చదువుకొనగ మేధమెరియు చక్కగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! చదువుకొనుటను తగ్గించు చూ చదువును కొనడం నేర్చుకోవడం వలన అస్థిరత్వం పెరిగిపోయింది. చదువును కొనడం వలన దురహంకారం పెరుగుతుంది, కానీ చదువుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది.

*సందేశం*:-- గురువుల మెప్పుపొంది వారి అనుగ్రహం వలననూ, స్వయంగా గ్రంథాలు చదివి గురువులద్వారా సందేహనివృత్తులు చేసుకోవడం వలన జ్ఞానం వర్ధిల్లుతుంది. అదే చదువు ను ధనం తో కొనుగోలు చేయడం వలన మెదడు కు ఆలోచించే పని తగ్గి, అస్థిరపడి తద్వారా దురహంకారం పెరుగుతుంది.

*గురువులేనివిద్య రాణించడం కష్టం*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

హైదరాబాద్ ప్రాంతం వారికి

 30.05.2024.       గురువారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు*   


సుప్రభాతం......


ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష *సప్తమీ* తిథి ఉ.11.43 వరకూ తదుపరి *అష్టమి* తిథి, *ధనిష్ఠ* నక్షత్రం ఉ.07.31 వరకూ తదుపరి  *శతభిష* నక్షత్రం, *వైధృతీ* యోగం రా.08.53 వరకూ తదుపరి *విష్కుంభ* యోగం, *బవ* కరణం ఉ.11.43 వరకూ, *బాలవ* కరణం రా.10.42 వరకూ తదుపరి *కౌలవ* కరణం ఉంటాయి.

*చంద్ర రాశి* :కుంభం లో

*సూర్య రాశి*: వృషభం (రోహిణీ నక్షత్రం లో)

*నక్షత్ర వర్జ్యం*: మ.02.20 నుండి మ.03.51 వరకూ.

*అమృత కాలం*: రా.11.25 నుండి రా.12.56 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.41

*సూర్యాస్తమయం*: సా.06.47

*చంద్రోదయం*:రాత్రి 12.48

*చంద్రాస్తమయం*: ప.11.52

*అభిజిత్ ముహూర్తం*: ప.11.48 నుండి మ.12.40 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.10.03 నుండి ఉ.10.55 వరకూ మరలా మ.03.17 నుండి సా.04.09  వరకూ.

*రాహు కాలం*: మ.01.52 నుండి మ.03.30 వరకూ

*గుళిక కాలం*: ఉ.08.58 నుండి ఉ.10.36 వరకూ

*యమగండం*: ఉ.05.41 నుండి 07.19 వరకూ


ఈరోజు *మాస కాలాష్టమీ*. కాలభైరవ భక్తులు ప్రతీ బహుళ పక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి కాలభైరవుడు ని పూజిస్తారు.


ఈరోజు *శైవ నక్త వ్రతం*. శైవ భక్తులు ఈరోజు పగటి పూట ఉపవాసం ఉండి, నక్షత్ర దర్శనం అయిన తరువాత రుద్రాభిషేకం చేసి పారణ  చేస్తారు.


శివ స్మరణం తో......సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

రాఘవశతకము

 శు భో  ద యం 🙏


తనువిది యుద్ధరంగము, నధార్మికవాంఛలు ధార్తరాష్ట్రులున్

మనమిది ద్రౌపదీసతియు, మానధనుండు నహమ్ము, పాండవుల్

వినయవివేకసంపదలు, వీరలు పోరుచునుంద్రు నిత్యమున్

కనునిది యంతరాత్మ యదుకాంతుడు, నన్ గృపఁజూడు రాఘవా !


నీదు హృదంబుజంబు కడునిర్మల బ్రహ్మము, రుద్రుడై చనున్

నీదగుకోపమున్, నయననీరజ యుగ్మము సూర్యచంద్రులౌ,

నాదిజురాణి జిహ్వయు, చరాచరవిశ్వము దేవవర్గమౌ,

నీదగు సీత లక్ష్మి, హరి నీవయి , నన్ గృపఁజూడు రాఘవా!


నీవె పరాత్మ, సీతయె మనీషయు, భృత్యులు ప్రాణముల్, సదా

దేవళమౌ శరీరము, త్వదీయసుపూజ సుఖోపభోగమున్

భావసమాధి నిద్రయగు, వాక్కగు స్తోత్రము, కర్మజాతమున్

తావకపూజనంబె, భవతారక, నన్ గృపఁజూడు రాఘవా!

          -రాఘవశతకమునుండి.

స్టోరీ ఆఫ్ మై లైఫ్ " లోని 456 వ పేజీలో

 



మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "స్టోరీ ఆఫ్ మై లైఫ్ " లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు :

ఎందుకో తెలియదు కానీ - నెహ్రూ "హిందూ మతంమీద ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.

హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు.

కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు :

"నేను జీవించి ఉన్నంత కాలం.. మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను..

ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లోకి హిందువులతో వస్తాను" అని..

పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె.బి. కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు!

ఆయన ఇలా అన్నారు : "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.

నిజంగా ఇది లౌకిక దేశమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు

కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది.

కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది!

కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో,

అప్పుడే హిందువులంతా, హిందూ ద్రోహుల యొక్క, ఛాతీపైకి ఎక్కుతారు. నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా కూడా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు.. ఏమీ జరగనట్టుగా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. 1947నుండి 70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !

హిందువులకు అర్థం కాలేదు ! దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది....ఎక్కడి నుండి శబ్దం రాలేదు ! సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు ! సింధు ఇవ్వబడింది! సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది ! ఎవరూ పట్టించుకోలేదు !

తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !

చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది ! మీడియా కిక్కురు మనలేదు!

తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు 

సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !

మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు.. కాదు కాదు.. చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు..

అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !

2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం, CWG, అగస్టా, వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్, వంటి భారీ కుంభకోణాలు జరిగాయి, శరీరం శబ్దం చేయలేదు!

కానీ.

గొడ్డు మాంసం, ఆగిన వెంటనే... విపత్తు సంభవించింది !

జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే.. అసంతృప్తి బయలుదేరింది.

వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు.. వారి నాలుకలు కథాకళి నృత్యం చేశాయి...

డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు.. కోపం వారితో భరత నాట్యం చేయించింది..

ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !

రోహింగ్యాల వెలికితీత - ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది.

ఆలోచించండి.............................

కాంగ్రెస్ = ఖన్☪️ గ్రీకు✝️ = హిందుదేశ్ వినాశనం

హిందువులకు ఏమి చేసింది ??

చర్చి కిటికీ కి లేదా

మసీదు పై రాళ్ళు పడితే..మీడియాలో వారాలపాటు చూపబడుతుంది

వందల గుళ్ళు కూలగొడితే ఎవ్వరూ కిమ్మనరు..

ఎంతో కొంత భాజపా కొట్లాడితే, అది మతతత్వం అంటారు..

ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !

ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !

ఒకటి కాదు, రెండు కాదు...........లెక్కలేనన్ని వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!

దీని గురించి ఏ ఒక్క హిందువుకు తెలియనీయలేదు !

మొదట హిందువులను కాశ్మీర్ లోయ నుండి బలవంతంగా తరిమేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది ! మొత్తం కాశ్మీర్ లోయ నుండి హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయాలని చూసారు!

LK అద్వానీ భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం రాకపోతే ఇది ఎవరికీ తెలిసేది కూడా కాదు !

వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల, కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు ఈ సమస్యను దేశం ముందు ఎందుకు పెట్టలేదు?

వీళ్లకు తోడుగా, ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు., బయాస్డ్ మీడియా, సూడో సెక్యులర్లు అందరూ హిందూ పండుగలను, సాంప్రదాయాలను దేవుళ్లను సైతం వెక్కిరిస్తూ ఇతర మతాల జోలికి వెళ్లే ప్రయత్నం చేయరు..

ఇది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల తెలివి !

సాధారణ హిందువుకు ఈ చరిత్ర గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు !

దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా....కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పాటుపడింది!

మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని, ఎన్ని డ్రామాలు ఆడిందో...! దీని గురించి ఆలోచించండి,

ఈ సందేశాన్ని మీకు సాధ్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న అన్ని హిందూ సోషల్ మీడియాలద్వారా

ప్రపం చంలో ఉన్న హిందువులకి చాటండి. ఇతరులకు పంచమని ఒక అంతర్జాతీయ వాదిగా అఖండ విశ్వ సనాతన హైందవ హిందూ భారతీయ భగవత్ స్వరూపులైన

భారతీయ జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తూ

ఓ భరతమాత జనులారా దేశ చరిత్ర తెలుసుకో....దేశ ఖ్యాతి తెలుసుకో.....నీ గొప్పదనం గూర్చి అప్పుడే తెలుస్తుంది.

నీకున్న ఔన్నత్యం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలిస్తేనే, మనలను ప్రపంచం గౌరవిస్తుంది

జగమెరిగిన నగ్న సత్యం.. జై హింద్.! జై భారత్.!!

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.30.05.2024

బృహస్పతివాసరే( గురువారము)

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే సప్తమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  కృష్ణ పక్షే సప్తమ్యౌపరి అష్టమ్యాం

బృహస్పతివాసరే  అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.26

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం 

సప్తమి ప. 11.06 వరకు. 

గురు వారం. 

నక్షత్రం ధనిష్ఠ ఉ.7.20 వరకు. 

అమృతం రా.11.09 ల 12.33 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 9.47 ల 10.39 వరకు. 

దుర్ముహూర్తం మ.2.59 ల 3.41 వరకు. 

వర్జ్యం మ.2.04 ల 3.34 వరకు. 

యోగం వైధృతి  రా.8.52 వరకు. 

కరణం బవ ప.11.06 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ.1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ అష్టమి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. స్పాట్ రిజిస్ట్రేషన్ లు  ఏర్పాటు చేయటం జరిగినది.

 ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ సప్తమి  - ధనిష్ట -‌‌ గురు వాసరే* (30.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 


రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. . బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి,  . కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే,, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 


+91 9848647145