*2024*
*కం*
చదువుకొనుటతగ్గించుచు
చదువును కొన నేర్చినంత చపలము ప్రబలెన్.
చదువును కొన మదము బలియు
చదువుకొనగ మేధమెరియు చక్కగ సుజనా.
*భావం*:-- ఓ సుజనా! చదువుకొనుటను తగ్గించు చూ చదువును కొనడం నేర్చుకోవడం వలన అస్థిరత్వం పెరిగిపోయింది. చదువును కొనడం వలన దురహంకారం పెరుగుతుంది, కానీ చదువుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది.
*సందేశం*:-- గురువుల మెప్పుపొంది వారి అనుగ్రహం వలననూ, స్వయంగా గ్రంథాలు చదివి గురువులద్వారా సందేహనివృత్తులు చేసుకోవడం వలన జ్ఞానం వర్ధిల్లుతుంది. అదే చదువు ను ధనం తో కొనుగోలు చేయడం వలన మెదడు కు ఆలోచించే పని తగ్గి, అస్థిరపడి తద్వారా దురహంకారం పెరుగుతుంది.
*గురువులేనివిద్య రాణించడం కష్టం*
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి