"అర్చకత్వం" అంటే అంత సులభం కాదు ? ఎందుకు అంటున్నాను అంటే కొంతమంది మహానుభావులు ఏముందండీ మీ నోరే గా నాలుగు మంత్రాలు చదవడం మేగా మాలాగా గొడ్డు చాకిరి లేదు అంటారు .కానీ అర్చకత్వం చేసేవారి మానసిక సంక్షోభం, ఒక వయస్సు వచ్చేటప్పటికీ వాళ్లు తీసుకునే సాత్వికఆహారపు అలవాట్ల కి శారీరక దౌర్బల్యం, మానసిక సంక్షోభం ఇవన్నీ కలిసి 40 ఏళ్ల వాడిని 60 ఏళ్ళ వాడిని చేస్తాయి. ఇవన్నీ మహానుభావులకి తెలియదు. సుఖంగా కూర్చున్నదే వాళ్ళకి తెలుస్తుంది
తెల్లవారకట్ట నిద్ర లేచిన అర్చకుడు కాలకృత్యాలు నెరవేర్చుకుని దేవలయం ద్వారాలు తెరచి విగ్రహం దగ్గరనుండీ అంతా శుభ్రం చేసుకొని , అభిషేకం , అర్చనా పూర్తి అయ్యే సరికి నీరసం నిస్సత్తువ తో ఇంటికి పోయి కాఫీ/టీ తాగుదామని అనుకొనే లోపల , భక్తులు వొచ్చి పూజచేయమని అడగంగానే అప్పుడు వారితో ఇప్పుడే వస్తానండి ఇంటికి వెళ్ళి కొంచెము కాఫీ తాగివస్తా అంటే ! స్వామి త్వరగా రండి మాక పనిఉంది అంటారు . కొంతమందైతే
మాకు త్వరగా అర్చన చేసిపోస్వామి అంటారు..
అలా వొచ్చిన వారికి పూజ చేస్తూనే తీర్ధం, శఠారీ పెడుతూ ఆకలిని చంపుతూ పూజని పూర్తిచేసి బడలిక తీర్చుకున్న అర్చకుడు ఎవరినో ఒకరిని అక్కడ పెట్టి అవసరాలను తీర్చుకొని.. దేముడికి భోగము పెట్టి, వచ్చిన వారి గోత్ర నామాలను చెప్పి అర్చన మొదలు పెట్టిన తరువాత ఎవరో ఒకరు తమకు కూడా అర్చన మొదలు పెట్టమని మొదటి భక్తుడు ఉరిమి చూస్తూ ఉండగా రెండవ భక్తుడి గోత్రనామాలను చెపితే మొదటి భక్తుడు తన ముని మనవారళ్ళ పేర్లతో సహా చెప్పమని వత్తిడి చేస్తే కంఠం నెప్పి వచ్చినా మారు మాట్లాడకుండా అన్నీ చెప్పి పూజ చేసి తీర్ధ మంత్రంతో మూడుసార్లు వేయకుండా ఒకసారి వేసినందులకు కోపంగా చూసే కళ్ళను తప్పుంచుకుంటూ ప్రసాదం ఇచ్చి సంభావన ని చూసి నిరాసక్తంగాను ఒక్కొక్కప్పుడు ఆనందంగానూ చూసే లోపు కమిటీ మెంబర్లు వస్తే వాళ్ళ పేర్లమీద పూజచేసి ఒక కంట వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ మధ్యలో వాళ్ళు వేసే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు మాట్లాడకుండా అర్చన చేసి ప్రసాదం ఇచ్చిన తరువాత వారు తిట్టినా కోప పడక వారి సలహాలను పాటిస్తూ అని వాళ్ళని తృప్తి పరచి హమ్మయ్యా అని కూర్చునే లోపల భక్తుల వస్తే పూజ లేదా తీర్ధం ఇచ్చి వాళ్ళ సమస్యలను విని సలహాలు ఇచ్చే సరికి ఆకలి నకనకలాడతూ ఇంత ప్రసాదమో లేక ఫలమో తిందామటే ఉండొచ్చూ ఉండొక పోవచ్చు అనుకుంటూ ఉన్నదాంట్లో తృప్తి పడే లోపు కమిటీ లేదా పంపిన గుఢాచారికి సరైన సమాధానమచ్చే సరికి తలప్రాణం తోకకి వస్తుంది అప్పటికి సమయం మధ్యాహ్నం 12:00 ఇక గుడిని కట్టేద్దామనుకునే లోపల భక్తులు వస్తే వారికి ప్రసాదం పెట్టి నీరసంగా గుడి తలుపులు వేసి ఇంటికి పోయి మహా నైవేద్యం తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టి తాను తినేసరికి మధ్యాహ్నం2:00 కాస్తంత నిద్రపోయి సాయంత్రానికల్లా ఇంటి కోసం, గుడి కోసం సరుకులను తెచ్చే సరికి గుడితీసే సమయం ప్రారంభం , ఆరాత్రి 9:00 గంటలకి గుడి మూసి ఇంటికి వచ్చి నిద్రపోయే సరికి రాత్రి 11:00 గంటలు ఇదీ ఒక గుళ్ళోని అర్చకుని రోజువారీ వ్యవహారం, ఇంకొటి సెలవులు అవేమీ ఉండవు, పైగా అదనంగా తిట్లు రాజకీయాలు భరించాలీ, తన కుటుంబం కోసం తాను నమ్మిన దేవత & దేవుని కోసం. పొరపాటున బయట టిఫిన్ తిన్నాడా ఇక పని ఐపోయి నట్టే ఇదీ ఒక సాధారణ అర్చకుని కధ కాదు కాదు ఇది ఒక అర్చకుని వ్యధ, ప్రతీ గుడి తిరుపతో,యాదగిరి గుట్టో కాదు!థూపదీపాలకు నోచుకోని గుళ్ళు,ఒక రోజు కూడా భో(క్త)జనానికి దొరగని "బాపని ఇళ్ళు" ఎన్నో ఉన్నాయీ మన(దేశం) తెలుగు రాష్ట్రాల్లో...
* ఇదేనయ్యా అర్చకుల బాధలు..ఇంకా వ్రాయాలంటే ఎన్నో ఉన్నాయి కాని మీరు చదవలేరు..అందుకే ముగిస్తున్నాను..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి