13, సెప్టెంబర్ 2020, ఆదివారం

*"విస్తరాకును"*

*"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము.
భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం *'ఆకును' (విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం.
*"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము.
*'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.
*'విస్తరాకుకు'* ఉన్న ఆలోచన భగవంతుడు *"మనుషులకు"* కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ....
*'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి.
మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *"వాయిదా"* వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు..
 ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?
 కనీసం *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు..
అందుకే *'ఊపిరి'* ఉన్నంత వరకు *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'జీవించండి'*.. *ఇదే జీవిత పరమార్ధం*

*సర్వేజనా సుఖినోభవతు*
చం.
ఘనమగు పుణ్యకార్యములు కాంక్షలులేని యుదారదానముల్
జనహిత సత్కృతుల్ మరియు సప్తవిధంబగు సంతు యెన్నగా
మనకగు నిత్యసంపదలు మాన్యత నిచ్చుచు నిల్చు; నంత్యమున్
వెనుకన వచ్చు ధర్మమయి; వేఱొకకర్మ కనంగ మిధ్యయే
                                             ✍️శ్రీశర్మద.

మీ పద్యం లో నాకు నచ్చింది

వేఱొకకర్మ కనంగ మిధ్యయే

వేఱొక కర్మ కన్సా కనుక పోయీనా కూడా మిధ్యయే మిధ్యమే 

సామాజిక రోగనిరోధక శక్తి

సామాజిక రోగనిరోధక శక్తి
ఇప్పుడు ప్రజలల్లో ఒకే ఒక చేర్చ అది కరోనా-కరోనా ఇలా ఇప్పుడు ఈ కరోనా కొంతమంది శరీరంలో ఉంటే ప్రపంచంలో అందరి మనస్సులో వుంది.  కరోనా గూర్చి ఆలోచించని మనిషి ఇప్పుడు భూమి మీద లేడు అంటే అతిసేయోక్తి కాదు. అంటే ప్రతి మనిషి మనస్సు ఇప్పుడు కరోనా ప్రభావంతో వుంది.  మన జీవన శైలి మారింది. ఇప్పుడు ప్రతివారు తన మనసులో కరోనా గూర్చి ఆలోచింది తానూ ఇతరులతో కలిసి మెలిసి జీవించటంలేదు. చాలామటుకు వేరే మనుషులతో దూరంగా ఉంటున్నాడు, లేక ఉండటానికి  ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాలన్నీ మన జీవన స్తితిగతులపై మార్పు తీసుకురావటం అటుంచి మన మెదడు పూర్తిగా కరొనతో వ్యాప్తినుంచి వుంది. 

సామాజిక రోగనిరోధక శక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. మనలో వయస్సు మళ్ళిన వాళ్లందరికీ DDT అనే పదం తెలుసు ఇది పూర్వం దోమల నివారణకు తయారుచేసిన ఒక విషం. దీనిని స్ప్రే చేసి దోమల్ని నిర్ములించే వాళ్ళు. ఈ విషయం చాలామందికి (పెద్ద వాళ్లకు) తెలుసు. కానీ కాలాంతరంలో ఈ విషపు ప్రభావం దోమలమీద తగ్గింది అందుకు DDT ని స్ప్రే చేసిన కూడా దోమలు చనిపోయేవి కావు.  అప్పుడు శాస్త్రజ్ఞులు పరిశోదన చేసి దోమలు DDT కి ఇమ్మ్యూన్ అయ్యాయని తెలుసుకొని DDT కి బదులుగా గమాక్సిన్ అనే విషపదార్ధం తయారుచేసారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం వాడుతున్న గమాక్సిన్ అప్పటి DDT కి ప్రత్యామ్నాయంగా తయారు చేసింది. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమంటే చాలా చిన్న జీవి (మనిషితో పోల్చితే) అయిన దోమలు కొద్ది రోజులకే సామాజిక రోగనిరోధకతను సంక్రమించుకొని DDT నుండి రక్షణ పొందాయి. అటువంటప్పుడు దోమలకన్నా చాల పెద్ద జీవి మరియు బుద్ది జీవి అయిన మనుషులు ఎందుకు ఈ సామాజిక రోగనిరోధకత పొంద లేరు అని. 

సామాజిక రోగనిరోధక శక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సమాజంలో ప్రబలిన వ్యాధికి రోగనిరోధక టీకా రావటం ఆ టీకా ప్రజలకు ఇచ్చి రోగ నిరోధకతను పెంపొందించటం, ఇక రెండు ప్రజలలో సదరు వ్యాధి గూర్చి భయం ఏర్పడటం వలన శరీరం తనంతట తానూ సదరు వ్యాధికి చెందిన రోగనిరోధకతను పెంపొందించుకోవడం. 

ఒక చిన్న ఉదాహరణతో దీనిని వివరించేప్రయత్నిస్తా మనం స్కూటరు మీద ఏదో ఒక రోడ్డుమీద వెళుతుంటే మనకు ఎవరో ఒక స్కూటరిస్టు  ఎదురౌతాడు అప్పుడు మనం వాకపు చేస్తే అక్కడ పోలీసులు పట్టుకుంటున్నారు అంటాడు. మనం అప్పుడు అది నిజామా కాదా అని విచారించం వెంటనే మన స్కూటరును వెనుకకు తిప్పుతాం ఇది మనలో చాలామందికి తెలిసిన విషయమే. మన దగ్గర పూర్తిగా కాగితాలు ఉంటే అట్లా చెప్పినా కూడా ముందుకు వెళుతాము పోలీసులు అడిగితె కాగితాలు చూపించి ముందుకు సాగుతాము. ఇక్కడ కాగితాలు వున్న వాడు అంటే రోగనిరోధక టీకా వేసుకున్న వాడు. వెనుతిరిగిన వాడు అంటే టీకా వేసుకొని వాడు. ఇద్దరు పోలీసులనుండి రక్షింపబడ్డారు. కానీ వెనుదిరిగిన వాడికి భద్రత తక్కువ. 

గతంలో ఇప్పటి కరోనా వైరస్ కంటే ప్రేమాదకరమైన అనేక వ్యాధులను మన మానవ సమాజం చవి చూసింది. చాలా మంది వాటి భారిన పడి మరణించారు.  కానీ ప్రజలలో సామాజిక రోగనిరోధక శక్తి పెరిగింతరువాత వాటినుండి పూర్తిగా రక్షింప బడ్డారు. ఇప్పుడు ఆ వ్యాధులు లేవు, వున్నా అవి ప్రాణాంతకపు వ్యాధులు కావు. 

సామాజిక రోగనిరోధక శక్తి  ఎప్పుడు వస్తుంది. ప్రజల్లో 70% నుండి 90% మంది వ్యాధిన పడితే అప్పుడు సామాజిక రోగనిరోధక శక్తి  విస్తృతంగా పెరుగుతుంది. కానీ దీనిని మనం ఇప్పుడు ఊహించగలమా. 

ఇప్పటివరకు కరోనాకు ప్రపంచంలో టీకా మందు రాలేదు. ప్రయోగ దశలోనే వుంది. టీకాలతో ఇంకొక సమస్య కూడా వుంది అదేమిటంటే టీకా సరిగా పనిచేయక పొతే ఆరోగ్యవంతుడు కూడా వ్యాధిని పడి మరణించ వచ్చు. నిజానికి టీకా మందు అనేది ముల్లును ముల్లుతో తీయాలి అనే న్యాయంతో తయారుచేసింది. అంటే అతి తక్కువ మోతాదులో వ్యాధికి సంబందించిన క్రిములను మనిషి శరీరంలో పంపుతారు అప్పుడు శరీరంలో రోగనిరోధకత వృద్ధి చెంది ఆ క్రిమితొ పాటు నిజమైన క్రిమి దాడి చేసినా దానిని నిర్ములించగలదు. కాబట్టి టీకా మందు వాడటం ఒకరకంగా కొంత ప్రమాదకరం కూడా. ఇంకొక విషయం వయస్సు ఎక్కువ వున్న వారికి ఈ టీకా మందు పనిచేస్తుందా లేదా అనేది కూడా ఒక సమస్య.  
మనకు గతంలో హెపటైటిస్ బి అనే రోగానికి ఒక టీకా మందు వచ్చింది దానిని పరీక్షించిన తరువాత అది 30 సంవత్సరాలు దాటిన వారిపైన ప్రభావం చూపదని తేల్చారు.  కానీ మన డాక్టర్లు డబ్బుకు ఆశ పడి ఆ విషయం చెప్పకుండా వయస్సుతో నిమిత్తంలేకుండా అందరికి ఇచ్చారు డబ్బులు వసూలుచేసుకున్నారు.ఇది మనందరికీ తెలిసిన విషయమే. 

టీకా మందు విషయంలొ  డాక్టర్ల దన దాహం కూడా పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం రోగులు మరణించినాకూడా ఎలాంటి కనికరం లేకుండా ప్రెవేట్ హాస్పిటలవాళ్ళు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నట్లు మనం రోజు మీడియాలో చూడటమే కాదు మన హైదరాబాదు గౌరవ  హైకోర్టు వారు అనేక విధాలుగా హెచ్చరికలు జారీ చేసినా కూడా పెడచెవిన పెట్టి మరి వారి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. అటువంటప్పుడు ఈ టీకా మందు వస్తే దానికి వున్న నియమాలు అంటే దాని పనితనం వయస్సు మొదలైనవి అన్ని మరచి కనిపించిన వాళ్లకల్లా మందు ఇచ్చి డబ్బులు వసూలు చేయరని మనం ఎలా అనుకోగలం. సామాన్యులకు మందు గూర్చిన అవగాహన ఉండదు.  అవగాహన వున్నడాక్టరు ధనాపేక్షతో విషయం చెప్పడు. పరియవసానం యెంత తీవ్రతగా ఉంటుందో. తలచుకుంటేనే భయం వేస్తుంది. 

ఏది ఏమైనా సామాజిక రోగనిరోధక శక్తి త్వరగా రావాలని ఈ భమండలం కరోనా రహిత ప్రపంచంగా కావాలని ఆశిద్దాము . 
గమనిక:  ఇది ఎవ్వరిని ఉద్దేశించి వ్రాసింది కాదు కేవలం ప్రస్తుత పరిస్థితిని సమాజ దృక్పధాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాసిందే నని గమనించగలరు. దీనివల్ల ఎవరికైనా బాధ కలిగితే కేవలం అది వారు దీనిని సరిగా అర్ధం చేసుకోకపోవడం వల్లనే అని గమనించగలరు. 
*********************

కాంక్షలులేని యుదారదానముల్

ఘనమగు పుణ్యకార్యములు కాంక్షలులేని యుదారదానముల్
జనహిత సత్కృతుల్ మరియు సప్తవిధంబగు సంతు యెన్నగా
మనకగు నిత్యసంపదలు మాన్యత నిచ్చుచు నిల్చు; నంత్యమున్
వెనుకన వచ్చు ధర్మమయి; వేఱొకండు కనంగ మిధ్యయే

INFO ABOUT *KRISHNA

EXCELLENT INFO ABOUT *KRISHNA IN BRIEF*

1) Krishna was born *5,252 years ago* as on 11/08/2020.
2) Date of *Birth* : *18 th July,3,228 B.C*
3) Month : *Shravan*
4) Day : *Ashtami*
5) Nakshatra : *Rohini*
6) Day : *Wednesday*
7) Time : *00:00 A.M.*
8) Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*
9) Date of *Death* : *18th February 3102.*
10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra)* war took place.
11) He died *36 years after the Kurukshetra* war.
12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi,BCE 3,139. i.e "8th December 3139" and ended on "25th December, 3,139".* 
12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3,139" ; cause of Jayadrath's death.*
13) Bhishma died on *2nd February,( First Ekadasi of the Uttarayana), in 3,138 B.C.*
14) Krishna is worshipped as:👇
(a)Krishna *Kanhaiyya* : *Mathura*
(b) *Jagannath*:- In *Odisha*
(c) *Vithoba*:- In *Maharashtra*
(d) *Srinath*: In *Rajasthan*
(e) *Dwarakadheesh*: In *Gujarat*
(f) *Ranchhod*: In *Gujaarat*
(g) *Krishna* : *Udipi, Karnataka*
15) *Bilological Father*: *Vasudeva*
16) *Biological Mother*: *Devaki*
17) *Adopted Father*:- *Nanda*
18) *Adopted Mother*: *Yashoda*
19 *Elder Brother*: *Balaram*
20) *Sister*: *Subhadra*
21) *Birth Place*: *Mathura*
22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*
23) Krishna is reported to have *Killed only 4 people* in his life time.
(i) *Chanoora* ; the Wrestler
(ii) *Kamsa* ; his maternal uncle
(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins.
24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage.
25) He was *born dark skinned.* He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; *Kanha*. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.
26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*
27) He stayed in Vrindavan *till 14~16 years*. He killed his own uncle at the age of 14~16 years at Mathura.He then released his biological mother and father.
28) He *never returned to Vrindavan ever again.*
29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ; Kala Yaavana.*
30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*
31) He *rebuilt Dwaraka*.
32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18.
33) He had to *fight the pirates from Afrika and rescue his teachers son ; Punardatta*; who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat.
34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga.
35) Then, he helped his cousins to *establish Indraprastha and their Kingdom.*
36)He *saved Draupadi from embarrassment.*
37) He *stood by his cousins during their exile.*
38) He stood by them and *made them win the Kurushetra war.*
39) He *saw his cherished city, Dwaraka washed away.*
40) He was *killed by a hunter (Jara by name)* in nearby forest.
41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges.
42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*
43) He is the *only person, who knew the past and probably future ; yet he lived at that present moment always.*
44) He and his life is truly *an example for every human being.*

*Hare Krishna* 🙏🙏🙏

సోమారామం

పశ్చిమగోదావరి జిల్లా
భీమవరం లో
కొలువైఉన్న
సోమారామం గా పిలువబడే
పంచారామ క్షేత్రం
గునుపూడి
శ్రీసోమేశ్వర స్వామి వారి దర్శనం
ఈరోజు శివసంకల్పం లో
     * పంచారామాల్లో విశిష్టమైన కళల్లో శివలింగం ఉండే ఆలయం ఇది
   *పౌర్ణమి రాత్రుల్లో శివలింగం తెలుపు వర్ణం లో,అమావాస్య రాత్రుల్లో స్వామి లింగరూపం నల్లగా మరియు చీకటిగా ఉండటం విశిష్టతల్లో ఒకటి
  *మూడవ(3) శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడింది
  *అన్నపూర్ణ అమ్మవారి ఆలయం శివాలయం పైన నిర్మించబడింది.ఇది ఎక్కడా కనిపించని మరో విశేషం
  * అమ్మవారి మెడలో పవిత్రమైన దారం మరియు ఆమె పాదాల దగ్గర ఒక బిడ్డ ను కలిగిఉంటుంది
 *ఈ లింగమూర్తి చంద్రుడి ప్రతిష్ట గా చరిత్ర
  *అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి గా పూజలు అందుకుంటారు
  *ఈ ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి ఉంది
  *ఈ పుష్కరిణిని సోమగుండం అని కూడా వ్యవహరిస్తారు
  *ఆలయం లోపల గణపతి,కుమారస్వామి,సూర్యభగవానుడు, ఆంజనేయుని ఆలయాలు ఉన్నాయి
  *ప్రధాన ద్వారం ముందు 15 అడుగుల స్తంభం నిర్మించబడివుంది దాని పైన నంది విగ్రహం దర్శనమిస్తుంది
  *గునుపూడి లోని ఆలయం భీమవరం పట్టణానికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం లో ఉంది
  *సోమగుండం లో ఎరుపు మరియు తెలుపు వర్ణం లో తామరపువ్వులు నిండి ఉంటాయి
  *ఆలయానికి ఎడమవైపు ఉన్న హాలులో శ్రీరాముని మందిరం ఉంది
  శివసంకల్పం లో మనకోసం ఈరోజు...

జాలువారే విభూతి ధార

కైలాశ పర్వతం నుండి జాలువారే విభూతి ధార

కైలాస పర్వత ప్రదక్షిణం చేస్తుంటారు కొంతమంది యాత్రికులు , కానీ మరీ దగ్గరగా వెళ్లేవారు మాత్రమే మాటల్లో వర్ణించలేని ఈ అనుభూతి పొందగలరు.కైలాస పర్వతాన్ని సమీపిస్తున్న కొద్దీ సుగంధ పరిమళాల సువాసనలు వీస్తుంటాయట. అక్కడ మంచు బదులు విభూతి ఉంటుందట. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరవలసిన క్షేత్రాలలో ఇదీ ఒకటి.

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం.

" సంభవామి యుగే యుగే " 🙏🙏🕉

నువ్వు కోండీ

ఒక ఫ్లాట్ లో డోర్ బెల్ మోగింది
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తలుపు తీసింది
బిచ్చగాడు
"భవతీ, భిక్షాం దేహీ!"
మహిళ:
"ఇదిగో, తీసుకో అయ్యా"
బిచ్చగాడు
 "తల్లీ, కొంచెం గుమ్మం ఇవతలికి వచ్చి వేస్తారా!"
మహిళ గుమ్మం దాటి రాగానే
బిచ్చగాడు ఆమె చేయి పట్టుకుని
"హ హ్హ హ్హా.... నేను బిచ్చగాణ్ణి కాను, రావణుడిని"
😛😛
అందుకామె,
" హా హా హా..... నేను కూడా సీతను కాను, పనిమనిషిని"...
😛😛😛
కథ ఇంతటితో అయిపోలేదు...
రావణుడు
 " హ హ్హ హ్హా.... సీతని తీసుకెళ్లినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను.... అదే నిన్ను తీసుకెళ్తే మండోదరి కూడా సంతోషపడుతుంది.... తనకి కూడా పనిమనిషి అవసరం ఉంది "
😛😛😛
మహిళ
" హా హా హా..... పిచ్చి వాడా..... సీత కోసం రాముడొక్కడే వచ్చాడు.... నా కోసం అయితే మా కాలనీ మొత్తం వస్తుంది".
😝😝😂😜😜

బ్రహ్మానందం



🍁🍁🍁🍁🍁

ప్రతి మానవుని యొక్క ప్రధాన లక్ష్యం ఆనందంగా జీవించడమే. అలా భావించడం కూడా సహజమే!

 దాని కోసం జీవుడు దేహేంద్రియములతో బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలలో వెతుకుతున్నాడు.

  భ్రాంతితో తాత్కాలికమైన సుఖము, సంపదల పట్ల మోహితుడై, అనుభవిస్తూ వాటిలోనే ఆనందం ఉంది అని అనుకుంటాడు. అవే శాశ్వతం అని జీవుడిని ప్రభావితం చేస్తున్నాయి.

అసలు సమస్య జీవునిలోనే ఉంది. శాశ్వతమైన ఆనందం అనేది ఎక్కడో లేదు. ఆనందం సహజంగా లభించాలంటే, నిత్యము, శాశ్వతము, శుద్ధ చైతన్యవంతము, సత్యము, సహజమైన సత్ వస్తువు ప్రతి జీవునిలోనే ఉంది. దానిపై ఎరుకతో ఉండటమే ఆనందం! ఉన్నది ఒక్కటే, అదే స్వరూప ఆనందం! అదే సచ్చిదానందం! అదే బ్రహ్మానందం! అదే శాశ్వతమైన ఆనందం. మనస్సు అంతర్ముఖం అయినప్పుడే దాన్ని గ్రహించగలరు!

జీవుడు శుద్దత్వంతో జన్మిస్తాడు. సహజ సిద్దంగానే చైతన్య స్వరూపుడు. అజ్ఞానంతో (మాయ ప్రభావం వల్ల) తన స్వస్వరూపాన్ని గ్రహించలేక జీవిస్తున్నాడు! కానీ పుట్టుకతోనే చిత్తశుద్ధి ఉంటే ప్రతి జీవుడు ముక్తుడే. పరమాత్మ పరిపూర్ణ జ్ఞానం కలవాడు. జీవుడు పరిమితి జ్ఞానం కలవాడు. అంటే జడమైన భాగం శరీర రూపంలో ఉంది. పరమాత్మలోని చైతన్యం జీవాత్మగా ఉంది. ఈ రెండింటి యొక్క మిశ్రమ స్వరూపమే జీవుడు! పరిమితి జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానంగా మార్చుకోవాలి!

బహిర్ముఖంగా ఉన్న మనస్సును శాశ్వతమైన ఆనందం కోసం అంతర్ముఖంగా అన్వేషణ చేయాలి. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖం అవుతుంతో, అప్పుడు జీవుడు తనకు తెలీనీ ఎన్నో రహస్యాలను గ్రహించగలడు. సూక్ష్మం లోనే ఉంది మోక్షం. ఒక్కసారిగా మనస్సుని అంతర్ముఖం చేయాలంటే చాలా కష్టం. దానికి కఠోర సాధన చేయాలి. చైతన్యవంతమైన జ్ఞానంతో బుధ్ధి ద్వారా మనస్సుని అదుపులోకి తెచ్చుకోవచ్చు! 

ఎన్నిరకాలుగా ప్రయత్నం చేసిన మనస్సును జయించడం జ్ఞానంతోనే సాధ్యము! చంచలమైన మనస్సుని అధీనంలోకి తెచ్చుకోవాలంటే, అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. జ్ఞానంతో కూడిన వైరాగ్యంతో నిరంతర అభ్యాసం ద్వారా మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు!

మనస్సును ఇంద్రియాలతో జోడించకపోతే, చిత్తవృత్తి నిరోధం కలిగి, ఆలోచనలు క్రమేపీ తగ్గి ఆలోచనా రహిత స్థితికి చేరతాడు. అదే తన స్వస్థితి, ఆత్మస్వరూపము! అదే బ్రహ్మానందం.

నిత్యం, శాశ్వతం, సత్యం అయినది పరమాత్మ ఒక్కటే! మనమందరం ఆ పరమాత్మ అంశములే! కావున మన స్వస్థితిని/ స్వరూపమును అనుభవ పూర్వకంగా గ్రహించి, అనుభూతి పొంది, తాను ఆ పరమాత్మ ఒక్కటే అని నిర్ణయంగా గ్రహించడమే అసలైన సత్యము. అదే అద్వైతసిద్ధి! అదే ఏకత్వం!! అదే మన అందరి లక్ష్యం!

భార్యాభర్తల

*💑 భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! 💑*

💖 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

💖 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

💖 అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

💖 ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..ప్రతిభార్య తనభర్తను,మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...

💖 భార్యకు సేవ చేయడం అంటేబానిసగాబ్రతుకుతున్నామని కాదు అర్థంబంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

💖 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

💖 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీఅర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

💖 భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.మధ్యలోనే పోతారు.
భార్యకి భర్త శాశ్వతం.భర్తకు భార్య శాశ్వతం.

💖 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ,గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!

💖 అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

💖 మోజుతీరగానేమూలనేసేది కాదు మూడుముళ్ల బంధంముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.

💖 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటేఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

💖 మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకుయజమానిగాఉంటుంది.కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

💖 కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

💖 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.2ES

💖 ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

💖 సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.

💖 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

💖 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.

💖 వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.

💖 నేలకు జారిన తారకలై
ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!

💖 సప్తపది ఏడు అడుగులు
మొదటి అడుగు - అన్న వృద్ధికి
రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధన వృద్ధికి
నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి
ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

💖 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.

💖 వివాహాన్ని సుఖమయం
 చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

💖 కలిమి లేములతో...
కలసిన మనసులతో...
కలివిడిగా మసలుకో..
కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

💖 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.పొరపాటు అనేదిఅందులోఒకపేజీమాత్రమే. ఆఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

💖 మగవాడు గాలి పటం
(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)
ఆడది దారం, అతడికి ఆధారం

(ఆమెకువెన్నంటిప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)
విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

💖 భర్తకి భార్య బలం కావాలి
బలహీనత కాకూడదు
భార్యకి భర్త భరోసా కావాలి
భారం కాకూడదుభార్యా భర్తల బంధం
అన్యోన్యం కావాలి
అయోమయం కాకూడదు.

మనసులోనిప్రేమని,బాధనికళ్లలోచూసిచెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

💖 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటేఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

💖 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

💖 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య

💐💐💐💐💐💐💐💐💐💐

బంధాలు

మట్టి పాత్రలలో కలిసి భోజనం చేసినప్పుడు అందరిలో సహనం ఉండేది.
అరటి ఆకుల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేవి.
లోహ పాత్రలలో భోజనం చేస్తున్నప్పుడు సంబంధాలలో ఆధునీకరణ ప్రారంభమయింది.
గాజు పాత్రలలో భోజనం చేస్తున్నప్పుడు బంధాలలో బీటలు,పగుళ్లు ఉండేవి.
ఇప్పుడు థర్మకోలులో భోజనాలు దిగేకా "యూజ్ అండ్ త్రో "లా ఉన్నాయి.

🌺 *ఓం నమో నారాయణాయ* 🌺




*212. అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం బ్రణామంబు జేసి, యిందుధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరికృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుం డయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె.*


*భావము:* ఇలా విష్ణుమూర్తిని స్తుతించి, బలిచక్రవర్తి విష్ణువునకూ, బ్రహ్మదేవునకూ, చంద్రశేఖరుడైన శివునికీ నమస్కరించాడు. బంధనం నుండి విడుదలపొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.



*213. "చతురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు; శర్వుఁడీ లక్ష్ముల జాడఁ బొందఁ, డన్యుల కెక్కడి దసురులకును మాకు; బ్రహ్మాదిపూజితపదుఁ వయిన దుర్లభుండవు నీవు దుర్గపాలుఁడ వైతి; పద్మజాదులు భవత్పాదపద్మ మకరంద సేవన మహిమ నైశ్వర్యంబు;లందిరి కాక యే మల్పమతుల*
213.1
*మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము నీకృపాదృష్టిమార్గంబు నెలవు చేర నేమి తప మాచరించితి మెన్నఁగలమె?మమ్ముఁ గాచుట చిత్రంబు మంగళాత్మ!*


*భావము:* "ఓ మంగళస్వరూపా! బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంక ఇతరులనగా ఎంత. బ్రహ్మాదేవుదు మున్నగువారిచేత నీవు పూజింపబడువాడవు. నిన్ను దరిజేరడానికి ఎవరికీ సాద్యం కాదు. అటువంటి నీవు మారాక్షసులకు దుర్గరక్షకుడవు అయ్యావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమవల్ల బ్రహ్మాదేవుడు మున్నగువారు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ, మేము చాలా అల్పులము. నీచజన్మ కలవారము. ఏమి తపస్సు చేయడంవల్ల మామీద నీ కరుణాకటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్ములను కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.



*214. అదియునుం గాక.*


*భావము:* అంతేకాకుండా.

శ్రీనరసింహషోడశరత్నమాలికాస్తోత్రం



1) నమస్తే నారసింహభగవన్ జ్వాలామాలాస్వరూపిణే 
   ప్రహ్లాదాహ్లాదవరదాయ నారదవందితాంఘ్రియుగళే ||

2) నమస్తే నారసింహభగవన్ శంఖచక్రధారిణే
   యోగానందస్వరూపాయ యోగమార్గప్రదర్శినే ||

3) నమస్తే నారసింహభగవన్ నిఠలాక్షస్వరూపిణే
   అరిషడ్వర్గహంతాయ మహాబలస్వరూపిణే ||

4) నమస్తే నారసింహభగవన్ అహోబలనివాసినే
   కుంకుమచందనాంకితాయ వేదవేదాంగరూపిణే ||

5) నమస్తే నారసింహభగవన్ ఘటికాచలనివాసినే
   దంష్ట్రాయుధాయ భద్రాయ పంచాననస్వరూపిణే ||

6) నమస్తే నారసింహభగవన్ వేదాచలనివాసినే
   వనమాలాధరాయ శాంతాయ మంత్రరాజైకరూపిణే ||

7) నమస్తే నారసింహభగవన్ సర్వయంత్రవిదారిణే 
   సర్వతంత్రస్వరూపాయ భక్తానందకారిణే ||

8) నమస్తే నారసింహభగవన్ చండవిక్రమరూపిణే
   గరుడారూఢాయ దేవాయ పరమహంసస్వరూపిణే ||

9) నమస్తే నారసింహభగవన్ కమలకోమలచరణే
   ప్రణతజనవత్సలాయ లక్ష్మీమానసవిహారిణే ||
10) నమస్తే నారసింహభగవన్ బంధమోచనకారిణే
    వాంచితార్ధప్రదాతాయ పాపసంఘవిదారిణే ||

11) నమస్తే నారసింహభగవన్ దారుణరోగనివారిణే
    వారిజభవపూజితాయ విశ్వస్థితికారిణే ||

12) నమస్తే నారసింహభగవన్ మకరకుండలధారిణే
    నక్షత్రగ్రహాధీశాయ స్తంభావిర్భావరూపిణే ||

13) నమస్తే నారసింహభగవన్ షోడశకళాస్వరూపిణే 
   ధ్యానమగ్నాయ సతతం ఆగళాద్రుద్రరూపిణే ||

14) నమస్తే నారసింహభగవన్ సర్వోపద్రవవారిణే
   జ్ఞానాంజనస్వరూపాయ నాదబ్రహ్మస్వరూపిణే ||
15) నమస్తే నారసింహభగవన్ గుణాతీతస్వరూపిణే
   త్రిభువనైకపాలకాయ శంకరఃప్రాణరక్షిణే ||

16) నమస్తే నారసింహభగవన్ జటాజూటధారిణే
    భార్గవపవనాత్మజసన్నుతాయ శింశుమారస్వరూపిణే ||

       సర్వం శ్రీనారసింహదివ్యచరణారవిందార్పణమస్తు

ఏం పేరది

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
ఏం పేరది ? ట్రిప్లికేనా! ఎక్కడుంది ?
..................................................

భారతీయులకు ముఖ్యంగా పదహారణాల తెలుగువారికి భావదాస్యమెక్కువనే చెప్పాలి. ఇంగ్లీషువాడి కట్టుబట్టలను తెలుగోడు ఆచరించినట్టుగా ఇతరులెవరు ఆచరించరు.
అప్పటి ఇంగ్లీషువాడి మాటలను పదాలను నూటికి నూరుశాతం ఇంతవరకు తెలుగుభుజాల పైన మోస్తూనేవున్నాడు.

తెల్లోడికి తెనుగు పలకటానికి నోరు తిరక్క తెలుగు ఎలా వ్రాయాలో అర్థంకాక తనకు వచ్చినరీతిలో పలికడం, వ్రాసుకోవడం జరిగింది. అది వాడి సౌలభ్యమనుకోవాలి.

 మనవారికేమైంది తెలుగు స్వచ్ఛంగా పలకడం, శుభ్రంగా వ్రాయడం వచ్చుకదా! 1947లో స్వాతంత్ర్యం వచ్చినా ఇంకా వారి భావజాలాన్ని శరీరంపైన మనసులోనా మోస్తూనేవున్నాడు.

ఉదా॥ కొన్ని గ్రామనామాలు చూడండి.

సామర్లకోటను వాడు సామల్ కోట్ అంటే మనం కూడా నిర్లజ్జగా సామల్ కోట్ అంటున్నాం.
విజయనగరాన్ని విజియనగరం (Vizianagaram) అంటే మనం బుద్ధిలేకుండా అలానే వ్రాస్తూ పలుకుతున్నాం.
నూజివీడును వాడు Nuzvid అంటే అహాఓహో ఎంతమంచి పేరని అహ్వానిస్తున్నాం.
కందనవోలును కర్నూలు అనంటే చిత్తం దోర అంటూ కుర్నూల్ అని (Kurnool) వ్రాసుకొంటూ సంబరపడిపోతున్నాం.
గుత్తిని గూటి అనంటే ఇదే అసలైనపేరని మనం కోడైకూస్తున్నాం.
కూడేరు ను కుడైర్ అనంటే ఇంతకంటే మంచి పేరులోకంలోనే లేదని ఎలుగెత్తి చాటి వ్రాసుకొంటున్నాం.

ఇవన్ని ఒకెత్తైతే ఇంగ్లీసువాడి నోట్లో ఊడిపడ్డామా అనేటట్టుగా హైడ్రాబ్యాడ్ (హైదరాబాదు) అనంటపూర్ (అనంతపురం) ఈస్ట్ గోడావరి (తూ.గో) వెస్ట్ గోడావరి (ప.గో) హిండూపూర్ ( హిందూపురం) అని పలుకుతూ తెగ ఆనందపడిపోతున్నాము.
ఇలా మనం భ్రష్టుపట్టిస్తున్న పదాలు ఒకటా ? రెండా ? పదులా ? కాదు కాదు వందలలోనే వున్నాయి.

తెలుగు అకార, ఉకార, ఇకారంతమైన రమ్యమైన భాష. అంటే పదంలోని చివరి అక్షరం అ,ఉ,ఇ లతో అంతమైవుంటుంది. అలాగే పలకాలి కూడా.

ఉదా|| రాజంపేట్, ఖాదర్ పేట్, హైదరాబాద్, పాయకారావుపేట్, అనంతపూర్, కర్నూల్‌, గుంటూర్ అని పలుకరాదు, వ్రాయరాదు. రాజంపేట, ఖాదరు పేట, హైదరాబాదు . పాయకారావుపేట అనంతపురం, కర్నూలు, గుంటూరు, గుంతకల్లు, కొత్తపేట, వరంగల్లు, కరీంనగరు, ఖమ్మము అనే పలకాలి,వ్రాయాలి కూడా.

ఇకపోతే చెన్నైనగరంలో ట్రిప్లికేన్ (Triplicane) అనే వీధివుంది. ట్రిప్లికేన్ అసలు పేరు. తిరువల్లిక్కేణి. తమిళంలో తిరు అంటే పవిత్రమైన, శ్రీ అనే అర్థముంది. అల్లి అంటే పద్మమని, కేణి అంటే సరస్సు, కోనేరు అనే అర్థముంది. ఇక్కడ పల్లవులకాలం నాటి పార్థసారథి దేవాలయముంది. ఇక్కడి కోనేరులో దొరికే పద్మాలు స్వచ్ఛమైనవి, అంచేత వీటిని పార్థసారథి మూలవిరాట్టుకు భక్తులు సమర్పించేవారు. కనుక ఇక్కడున్న గ్రామానికి తిరు+ వల్లి + కేణి = తిరువల్లిక్కేణి అనే పేరు ఏర్పడింది.ఇంగ్లీషోడికి పలకడం, వ్రాయడం చేతకాక ట్రిప్లికేన్ అనంటే ఎంతమంచి పేరని ఇప్పటి నోరారా పిలుస్తున్నాం.

ఈ తిరువల్లిక్కేణి సెయింట్ జార్జి ఫోర్టు కన్నా ముందున్నదే. విజయనగర ప్రభువైన శ్రీరంగరాయలకాలంలో శ్రీకాళహస్తిని పరిపాలించే దామెర్ల వెంకటాద్రినాయుడు ఇంగ్లీషువారికి అంటే ఫ్రాన్సిస్ డే ద్వారా 1639 లో ఇపుడన్న చెన్నై ప్రాంతాన్ని ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనికి అద్దెకు ఇవ్వడం జరిగింది.

 వ్యాపారానికి పరిశ్రమల స్థాపనకు సముద్రతీరప్రాంతాన్ని తీసుకొన్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1644 లో సెయింట్ జార్జికోటను నిర్మించి ప్రధానకేంద్రంగా (రాజధానిగా) చేసుకోవడం జరిగింది. ఆ తరువాతనే మద్రాసు పట్టణం అభివృద్ధి చెందడమైంది..

1668లో తిరువల్లిక్కేణి మద్రాసులో కలవడం జరిగింది.

తెలుగు సోదరీసోదరులారా తెలుగులోనే మాట్లాడండి.

*ధార్మికగీత - 19*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                         
                                       *****
             *శ్లో:- స్వగృహే పూజ్యతే మూర్ఖః ౹*
                    *స్వగ్రామే పూజ్యతే ప్రభుః ౹*
                    *స్వదేశే పూజ్యతే రాజా ౹*
                    *విద్వాన్ సర్వత్ర పూజ్యతే ౹౹*
                                        *****
*భా:- అవిద్య, అజ్ఞానము, అహంకారము, ఆధిపత్యము, అవివేకములతో రాణిస్తున్న మూర్ఖుడు కూడా తన ఇంటిలో మకుటం లేని మహారాజులా గారవింప బడతాడు. గ్రామాధికారి ఊరిని తన ఆధీనంలో పెట్టుకొని, పెత్తనాన్ని, అధికార దర్పాన్ని చలాయిస్తూ, ఇష్టమైనా, కష్టమైనా తన గ్రామంలో ప్రజానీకముచే సాదర నీరాజనాలు అందుకుంటాడు. రాజు చతుర్విధ బలగాలతో, అధికార,అనధికార గణాలతో, మంత్రులతో, సామంతులతో, సిరిసంపదలు, భోగభాగ్యాలతో ఎనలేని స్వర్గసుఖాలలో మునిగి తేలుతూ తన దేశమంతటా నయానో, భయానో పూజింపబడతాడు. వీరందరికి పరిమితులు ఉన్నాయి. కాని సకల విద్యాపారంగతుడైన పండితుడు తన నవ నవోన్మేషమైన శేముషీ వైభవంతో పండిత పామర లోకాన్ని రంజింపజేస్తూ, ప్రపంచ మంతటా సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలు అందుకుంటాడు. వ్యాస వాల్మీకాది మహర్షులు,జగద్గురువు ఆదిశంకరులు, కాళిదాసు,భారవి వంటి మేటి విద్వత్కవులు తమ అపార వైదుష్యాన్ని,పాండితీ ప్రతిభను తరతరాలకు త్రికాలవేద్యంగా, పూజ్యంగా అందజేసి,ప్రాతః స్మరణీయులు, చిరస్మరణీయులై నారు. గురువు ఇహపర సాధనా విధాన నిధానాన్ని నిర్దేశిస్తూ,మోక్షానికి మార్గం చూపిస్తాడు. కాన రాచరికం అస్థిరమని,ఆశాశ్వతమని, విద్వత్తే స్థిరమని, శాశ్వతమని, అనుసరణీయమని సారాంశము.*
                                   *****
                     *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

జగత్ గురువు

 తే, గీ. మౌన ముద్రను మునులకు జ్ఞాన మిడిన,
సహజ దయశాలి భక్త వశంకరుండు
అవతరించెనో యనగ స్నేహానుకంప
జనత నోదార్చె ఘనత జగద్గురుండు.

 సత్యమగు తత్వమెరుగని సాధకులను,
కరుణ బ్రోవంగ నరుదెంచే ఖలవిదారి,
ముందు ముందుగ నొజ్జల ముదలమేర
భాష్యములు వ్రాయ సమకట్టె పరమ గురుడు.

 ఆత్మ పరమాత్మ, లైక్యత, కధ్యయనము,
జ్ఞాన, వైరాగ్య, భక్తి, కర్మానుభవము,
విశదపరచిన పంచమవేద వాణి,
కతులిత మ్మైన భాష్యమ్ము నందజేసె




హితచింతన


రే చేతః కథయామి తే హితమిదం బృన్దావనే చారయన్
బృన్దం కోపి గవాం నవామ్బుదనిభో బన్ధుర్నకార్యస్త్వయా
 సౌన్దర్యామృతముద్గరద్భిరభితః సంమోహ్య మన్దస్మితై
రేష త్వాం తవవల్లభాంశ్చ విషయానాశు క్షయం నేష్యతి.
       చేయవద్దు అన్న పని చేయడం మానవమనస్సుకు బాగా అలవాటు. ఆబలహీనతను తెలిసిన కవి మనస్సుతో ఇలా హెచ్చరిస్తున్నాడు
           ఓ మనస్సా! నీకో మేలైనది చెబుతా విను (వినదు అనితెలిసి) 
             పావనయమునానదీ తీరం. అక్కడో రమ్యమైన వివిధఫలపుష్పాలతో రమ్యమైనబృందావనం . అక్కడో వర్షాకాలపుమేఘం లా నల్లగా ఉంటాడొకడు.మామంచి అందగాడు. కామధేనువులవంటి  మంచి గోవుల బృందాన్ని మేపుచూ(ఎప్పుడూ) ఉంటాడు. వానిని చూడనే చూడకు. చూసినా మాట్లాడకు. మాట్లాడినా.  వానితో చుట్టరికానికి దిగేవు సుమా జాగ్రత్త. ఏమాత్రం బంధుత్వం పెట్టుకోకు సుమా.
     ఎందుకంటావా ?అబ్బబ్బ ఏం చెప్పమంటావు. వాడో దొంగ.మత్తు మందులా సౌందర్యామృతం అంతటా చిమ్ముతూ చిఱునవ్వులు రువ్వుతూ  మోహంలో పడేస్తాడు.  అంతేనా  నిన్నే   కాదు నీకు బాగా ఇష్టమైన. భార్యా , పుత్ర విత్త, గృహ క్షేత్రాది సమస్త విషయాలన్నింటినీ  వెంటనే ఇట్టే దోచేస్తాడు. మళ్ళీ లేకుండా చేస్తాడు సుమా. తర్వాత నీ ఇష్టం నీ యోగం ఏలా ఉందో. ఉపనిషత్తులనే గోవులందు సంచరిచే శ్రీకృష్ణపరమాత్మ మనోలయం. విషయక్షయం చేసి పరమానందాన్ని కలిగించాలని వేడుకొంటూ ప్రణామాలు.
        ఇతి శమ్
****************

అరటి పండుపై అపోహలా

*.. ఇది చదవండి..*

*అరటి.. ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజూ దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటి వల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలోనూ దీనికి సాటిలేదు. ఇదిలా ఉండగా, చాలా మందిలో అర‌టిపండ్ల‌ను గురించి కొన్ని అపోహ‌లు ఉన్నాయి. దీంతో ఈ పండును పక్కనపెట్టేస్తారు.అలాంటివారు ఇది చదవండి..*

షుగ‌ర్ ఉన్న‌వారు కూడా నిర‌భ్యంత‌రంగా అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. అయితే తక్కువగా తినాలి. ఆహారం తక్కువగా తీసుకునేవారు అరటిపండ్లను తినవచ్చు. మధుమేహంతో బాధపడేవారు దీన్ని పక్కనపెట్టడానికి ప్రధాన కారణం ఇందులో చక్కెర ఉంటుందని. అయితే ఇందులో ఉండే చక్కెర ఫ్రక్టోజ్‌. ఇది సహజసిద్ధమైనది. కనుక డయాబెటిస్‌ రోగులకు ఇది హాని చేయదు.*

బీపీ ఉన్నవారు అరటిపండ్లు తింటే హైబీపీ వస్తుందని అనుకుంటారు. కానీ అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్‌ చేస్తుంది.గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది.*

చాలామంది అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటే బ‌రువు పెరుగుతామ‌ని భయపడుతూ ఉంటారు. అయితే, ఇందులో పెక్టిన్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్నవెంటనే కడుపునిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. అంతేకాని అరటిపండ్లను తింటే బరువు పెరుగరు. పొట్ట కూడా రాదు. అర‌టిపండ్ల‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. కానీ వాటిలో ఉండే ప‌లు ఔష‌ధ గుణాలు మ‌న శ‌రీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో మ‌న‌కు ఉప‌యోగ‌మే త‌ప్ప న‌ష్టం ఉండ‌దు.*


*వాస్తవం: బ‌రువు త‌గ్గాల‌ని అనుకునే వారు కూడా అర‌టి పండ్ల‌ను దూరంపెడతారు. ఎందుకంటే అర‌టి పండ్ల వ‌ల్ల శ‌రీరంలో అద‌న‌పు క్యాల‌రీలు చేరుతాయ‌ని వారు నమ్ముతారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే బ‌రువు తగ్గాలనుకునేవారు ఎక్స‌ర్‌సైజ్ చేసే క్ర‌మంలో అర‌టి పండ్ల‌ను తింటే శ‌రీరానికి ఎక్కువ శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో మ‌రికొంత సేపు ఎక్కువ‌గా వ్యాయామం చేయ‌వ‌చ్చు. అది మ‌న‌కు మేలే చేస్తుంది. కానీ న‌ష్టం చేయ‌దు.*

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Stirling's engineering

Doctors




రెండు ఒకటే




సూర్య దేముడి రధం



స్వక్షేత్ర షడ్గ్రహ యోగం- ఒక విశ్లేషణ

https://www.facebook.com/100002175249614/posts/3227714113977732/?sfnsn=wiwspwa&extid=bqJIErYtgiMbHdsa&d=w&vh=i


శివామృతలహరి

    శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||
వందే యంచు భజింతు నిన్ను వరదా!వ్యాళాధిరాట్కుండలా !
సందేహింపకు లోనికిం జొరగ నిస్పారోసరక్షేత్రమీ
డెందంబంచు ; రచింతు నీకిచట తండ్రీ ! కోటికైలాసముల్
చిందన్ వేడెద నీ కృపామృత మొగిన్ శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం ;( నాకు అర్ధమైన వరకు)

భక్తులందరికీ వరములిచ్చి బ్రోచే నాగభూషణా! వందే అని నిన్ను ఎల్లప్పుడూ భజించుకుంటూ ఉంటానయ్యా!
నా హృదయం ఒక పనికి మాలిన క్షేత్రం అని సందేహించకుండా నా లోనికి రావయ్యా ఇక్కడ నీకోసం కోటి కైలాసాలను రచిస్తాను.
నీ కృప అనే అమృతాన్ని కొంచెం నా మీద చిలకరించమని నిన్ను వేడుకుంటున్నా నయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

నిబద్ధత




ఒక దృఢసంకల్పానికో, మంచి మాటకో, సిద్ధాంతానికో కట్టుబడి ఉండటమే ‘నిబద్ధత’. మనో వాక్కాయకర్మలతో నిరంతరం ఆ సత్సంకల్పాన్ని ఆచరించడం నిమగ్నం కావడమే నిబద్ధత అనిపించుకుంటుంది.
ప్రతి మనిషీ ఏదో ఒక విషయంలోనో, కొన్ని విషయాల్లోనో నిబద్ధుడై ఉంటాడు. అప్పుడే ఆయా పనుల్లో విజయం సాధించగలుగుతాడు. ఆధ్యాత్మిక సంపన్నులెవ్వరూ తాము ఏర్పరచుకున్న నియమ నిబంధనలను అతిక్రమించరు. విస్మరించరు. నిబద్ధులైనవారికి ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా తోడుంటుంది.  వారికెప్పుడూ నిరాశా నిస్పృహలు కలగవు. పైగా అంతర్యామికి అధీనులై ఆత్మ సమర్పణ భావంతో, సర్వదా చైతన్యమూర్తులై ఉంటారు. నారాయణుడే వారికి నమ్మకం. నారాయణ శరణాగతే వారి ఆశయం.
నిబద్ధత లేనివాడి మనసు చాంచల్యమనే బలహీనతకు బానిసైపోతుంది. అటువంటివాణ్ని కామక్రోధాది అరిషడ్వర్గాలు ఆవరించి అధఃపాతాళానికి తొక్కేస్తాయి. వాడు భూమికి భారమై చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.
ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం కవచం లేకుండా యుద్ధానికి వెళ్లడంలాంటిది. ఒక సత్సంకల్పం, దాన్ని ఆచరించే ప్రణాళిక, ఆచరణలో ఏకాగ్రత, సాధన... మనిషిని అసలైన నిబద్ధుడిగా నిలబెడతాయి. బాధలు అనే మదపుటేనుగును సైతం లొంగదీసుకునే అంకుశమే నిబద్ధత. సత్సంకల్పం మీద నమ్మకం లేనివాడు, దానికి కట్టుబడనివాడు సమస్యల్ని అధిగమించలేడు. నిజాయతీపరుడు, నిబద్ధతతో జీవించగలిగితే ఆధ్యాత్మికంగా ఉచ్చదశకు చేరుకోగలుగుతాడు. పదిమందికీ దిశానిర్దేశం చేయగలుగుతాడు. ఏ ఓటమైనా అతడి ముందు చేతులు కట్టుకు నిలబడుతుంది. నిబద్ధత లేని జీవన విధానం జీనులేని గుర్రంలాంటిది. జీవితమన్నాక ఎన్నో ఒడుదొడుకులు వస్తుంటాయి. అవరోధాలు కలుగుతాయి. బాధలు ఎదురవుతాయి. అవన్నీ భగవంతుడు పంపిన దూతలనుకొని, వాటిని గౌరవించాలి, భరించాలి, సహించాలి. స్థితప్రజ్ఞుడు నిబద్ధతతో సుఖ దుఃఖాలను, విజయాలను, విఘ్నాలను సమానంగానే చూస్తాడు, అనుభవిస్తాడు. సుఖాన్నిచ్చే వస్తువు దగ్గర ఉన్నా లేకపోయినా, తేడా అనేది తెలీదు నిబద్ధుడైనవాడికి. అటువంటివాడు పరమాత్మకు అత్యంత ప్రియుడు, ఆత్మీయుడు. సత్కార్యం పట్ల శ్రద్ధ, ప్రేమ ఉన్నవాడిని ఏ మనో వికారమూ ప్రలోభపెట్టలేదు. సామాన్య మానవుడు దుఃఖంలో వెనక్కి, కష్టంలో అన్ని వైపులా, భక్తిలో పైకి చూస్తాడు. నిబద్ధత కలవాడు ఏ   దశలోనైనా పై దిశకే చూస్తాడు. అంటే ఈశ్వరుడి వైపు చూస్తాడన్నమాట!
పురాణేతిహాసాల్లో చాలా పాత్రల్లో మనకు ఈ నిబద్ధత కనిపిస్తుంది. ధర్మానికి నిబద్ధుడు శ్రీరాముడు. భ్రాతృ భక్తికి నిబద్ధులైనవారు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. దాస్య భక్తికి కట్టుబడినవాడు హనుమ. స్వామిభక్తికి లోనైనవాడు కర్ణుడు. బ్రహ్మచర్య దీక్షకు జీవితాన్ని ధారపోసినవాడు భీష్ముడు. సత్యానికి జీవితం అంకితం చేసిన మహనీయుడు హరిశ్చంద్రుడు. దానగుణానికి ప్రసిద్ధి చెందినవారు శిబి, దధీచి, బలి. సాధ్వీమణులంతా పతిసేవా పరాయణత్వంతో ఆదర్శమూర్తులైనారు. ప్రేమ, వాత్సల్యం, బంధానుబంధాలు, సత్సాంగత్యం, గురుభక్తి, అహింస, పరోపకార చింతన, నిస్వార్థం, నిరహంకారం, జ్ఞానతృష్ణ... నిబద్ధుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు. అతడిలో ఏ దుర్లక్షణం ప్రవేశించినా కుండెడు తేనెలో విషపు చుక్క వేసినట్లే. ఇందుకు రావణుడే ప్రత్యక్ష తార్కాణం. నిరంతర సాధన, ఏకాగ్రత,  శ్రద్ధ, పట్టుదల సత్సంకల్ప సాధనకు పట్టుగొమ్మలు. అవే జాతి ప్రగతికి, దేశ భవితకు అసలైన సొమ్ములు.

నాటక పద్యం తెలుసుకుందాం.

.

శ్రీమాన్ తిరుపతి వేంకట కవిమహాశయుల రచించిన పాండవోద్యోగ నాటకంలోని
 ద్వారక దృశ్యం లో ఉన్న అర్జున భూమిక యొక్క పద్యాలు
అర్థ తాత్పర్యాలతో, ఆపుదల విశేషాలతో, గురువుల ఆశీస్సులు వల్ల చర్చించుకున్నాము, తెలుసుకున్నాము. అర్జున భూమిక ధరించే వృత్తి, ఔత్సాహిక కళాకారులకు
ఈ విశ్లేషణ, వివరణ ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నాను.

ఈ వివరణల విశ్లేషణల గురించి అనగా,దీనిని ముందుకు తీసుకు వెళ్ళటం కోసం ఇంకా ఎక్కువగా అందరికీ ఉపయోగపడే విధంగా మీ మీ సూచనలను అభిప్రాయాలను తెలియజేయ వలసినదిగా హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. లోపాలు ఉంటే సరి చేసుకుంటాను.
 గుణాలు ఉంటే వృద్ధి చేసుకుంటాను.
పద్య నాటకం లోని పద్యాల సౌందర్యం గురించి
, అవి వృత్తి ఔత్సాహిక కళాకారులకు ఉపయోగపడటం కోసమే
ఈ నా ప్రయత్నం. దయతో స్పందించ మనవి...... 🙏🏻💐🙏🏻

అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత

అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, ఈ స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు

ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం "

దీపావళీ వేళ అష్టలక్ష్మీ స్తోత్ర విశేషం, మహత్యం.. కష్టాల నుంచి విముక్తి దిశగా

అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

ఆదిలక్ష్మీ :- వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి.

ధాన్య లక్ష్మి :- ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావల్సిన అన్ని రకాల విటమిన్స్, పండ్లు, ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం.. అంతే కాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్న.. అతి వృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే!

ధైర్య లక్ష్మి :- కొంతమంది ఎన్నీ కష్టాలు .. ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు..

మనకు కావలసిన అన్ని రకాల శక్తి - సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి.. పూర్వం ఒక కధ ప్రాచుర్యంలో ఉండేది.. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు.. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది.. కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు.. వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు.. మళ్లీ వారందరినీ

పొందగలనని విశ్వాసంగా వుంది.. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు... నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్ధైర్యమే.. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత.

గజలక్ష్మి :- ఈ అవతారం దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపమ్లో ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడ భావించవచ్చు.. లక్ష్మి గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు

సంతాన లక్ష్మీ :- ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావల్సిన మొదటి సంపద సంతానమే.. అది లేకుంటే జీవితాన్ని నిస్సారం గా గడపవలసి వస్తుంది.. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు.. అందుకే ఈ శక్తి ని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి.. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, ధీర్ఘాయుస్సు లభిస్తాయి.

విజయ లక్ష్మీ :- పేరులోనే ఉంది పెన్నిది.. బాహ్య - అంతర్గత మనసుపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే!

ధనలక్ష్మి :- భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.

విద్యాలక్ష్మి :- పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!

అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఎందరో చెప్పిన మాట..షోడశ అంటే 16.. ఇప్పుడు ఆ ఫలాలు ఏమిటో చూద్దాం...

1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం

6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు,

8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం

12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం,

14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః.

అష్టలక్ష్మీ స్తోత్రం:-

ఆదిలక్ష్మి :-

సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |

పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మి:-

అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |

మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మి:-

జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |

భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే

జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి:-

జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే

రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మి:-

అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే

గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |

సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి:-

జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే

అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |

కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే

జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి:-

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే

మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |

నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే

జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మి:-

ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |

వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||

ఫలశృతి:-

శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||

శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |

జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్

కనుక దేవున్ని కొలిచే ప్రతి ఒక్కరూ నిత్యం ఈ స్తోత్రం చదవడం వలన పై ప్రయోజనాలు కొన్ననైనా పొందవచ్చు. అలాగే జాతక రిత్యా శుక్ర గ్రహ ప్రీతి కొరకు, దోష నివారణకు కూడా ఇది చదవవచ్చు.. దీని వలన భార్య భర్తల మధ్య సఖ్యత, సుఖాలు లభిస్తాయి. ఇంట్లో శ్రీ చక్రం ఉన్న వారు దానికి దగ్గర ఈ అష్ట లక్ష్ముల ఫొటో పెట్టి ఇది చదవడం మరింత వేగంగా ఫలించేలా చేస్తుంది.. అలాగే క్షీరాన్నము లేక పాల కోవా నివేదన చెప్పబడుతోంది. లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు.. ఐశ్వర్య మస్తు.. !

*సర్వేజనా సుఖినో భవంతు శుభంభుయాత్, లోకాసమస్తా సుఖినోభవంతు.*

గ్రహ కూటమి – అపోహ దాని నివృత్తి*



*13.09.2020 ఆదివారం నాడు ఏర్పడు గ్రహ కూటమి – అపోహ దాని నివృత్తి*

నాకు ఒక మిత్రుడు క్రింది మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ వివరణ అడిగారు:

1850 నుండీ 2250 మధ్య ఒక్కసారి మాత్రమే రాబోతున్న అద్భుతమైన ఘడియలు:
13/09/2020 ఆదివారం ఉదయాన 11:00 నుండీ 11:45 మధ్య:
లగ్నం - అనూరాధ 2 - వృశ్చిక
రవి - సింహం - భావం10 - స్వక్షేత్రం
చంద్ర - కర్క - భావం 9 - స్వక్షేత్రం
కుజ - మేష - భావం 6 - స్వక్షేత్రం
బుధ - కన్య - భావం11 - ఉచ్ఛ
గురు - ధను - భావం 2 - స్వక్షేత్రం
శుక్ర - కర్క - భావం 9 - శత్రు
శని - మకర - భావం 3 - స్వక్షేత్రం
రాహు - మిధున - భావం 8 - సమ
కేతు - ధను - భావం 2 - సమ
జిల్లేడు ఆకుపై గోధుమలు ఉంచి, ప్రమిదలో దీపారాధన చేసి, దైవారాధనలో నిమగ్నమై ఈ అద్భుతమైన ఘడియలు సఫలీకృతం చేసుకోగలరు!

ఇదీ ఆ మెసేజ్. ఇప్పుడు ఈ మెసేజ్ వైరల్ అయ్యింది. మన మీడియా ఎంత అభివృద్ధి చెందిందంటే, చెప్పేవారు ఎవరో, వారి అర్హత ఏమిటో, ఇవేమీ లేకుండానే వారి సందేశాలు వైరల్ అవుతున్నాయి. దీన్ని సమీక్షిద్దాము:

13.09.2020 నాడు ఉదయం 10.45 నుండి 6 గ్రహాలు వాటి స్వక్షేత్రాలలో ఉంటున్నాయి. నిజానికి ఈ యోగం గొప్పదే. అరుదుగా వస్తుంది కూడాను. ఇట్టి యోగాలను *‘రాజ యోగాలు’* అని అంటారు. ఏ రాజయోగ మైనా సఫలీకృతం కావడానికి గాను *‘రాజయోగ భంగ’* యోగాలు ఉండరాదు. ఇది జ్యోతిష శాస్త్ర సిద్ధాంతం. ఈ గ్రహ కూటమిలో ఒక్క బుధుడు మినహా మిగిలిన గ్రహాలన్నీ కూడా పాపగ్రహ ప్రభావంలో ఉన్నాయి. శుక్ర చన్ద్ర భ లను శని సప్తమ స్థానంలో ప్రభావితం చేస్తున్నాడు. గురు భ కేతువు మరియు రాహువుల ప్రభావంలో ఉన్నాడు. కావున ఇట్టి యోగము నిర్వీర్యమగు చున్నది. కొంత వరకు లేదా స్వల్ప ప్రమాణంలో మాత్రమే శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది, కాని ఎంతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. పాప గ్రహ ప్రభావంలో ఉన్న శుభ గ్రహాలు అద్భుతమైన ఫలితాలను ఏనాడు ఇవ్వవు. శని ఫలితాన్ని మందగిస్తాడు, రాహువు అనిశ్చితిని ఇస్తాడు.

*ఇక రెండవ అంశం* – ఈ గ్రహ కూటమి వృశ్చిక లగ్న వశాత్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ప్రచారం జరుగుచున్నది. ముహూర్తం నిర్ణయానికి గాను, ప్రస్తుత సమయంలో శుభ ముహూర్తాలు లేవు. ఈ ముహూర్తం సాధారణ పనులకు మాత్రమే పనికి వస్తుంది. ఎందుకంటే ఇవి *‘మహాలయ పక్షాలు’*. మహాలయ పక్షాలలో పితృ తర్పణాల మినహా ఇతర శుభ కార్యాలు ఉండవు. కావున ఈ ముహూర్తం సాధారణ పనులకు మినహాయించి ఇతర పనులకు పనికి రాదు. ఈ విధంగా సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చక్కని గ్రహ యోగాలు వస్తాయి, కాని అవి వచ్చిన సమయం, కాలం ప్రధానమైనది. *ఆ సమయం శుభ ముహుర్తాలకు పనికి రానిది అయిన ఎడల వాటి వలన ప్రయోజనం ఉండదు*.

ఈ సమయంలో ‘జిల్లేడు ఆకుపై గోధుమలు ఉంచి, ప్రమిదలో దీపారాధన చేసి, దైవారాధనలో నిమగ్నమై ఈ అద్భుతమైన ఘడియలు సఫలీకృతం చేసుకోగలరు!’ అనే ప్రచారం జరుగుతుంది. సంపూర్ణ భక్తి, నిబద్ధత, శ్రద్ధ మరియు అంకిత భావం తో భగవానుడిని ధ్యానం చేస్తే, ఆయన ఎప్పుడైనా అనుగ్రహిస్తాడు. కామ్యాపేక్ష తో చేసే పూజలు, భక్తి, ధ్యానం ఇత్యాదివి అర్హతకు అనుగుణంగా మాత్రమే ఫలితాలను ఇస్తాయి. కావున వృశ్చిక లగ్నంలోనే కాదు, ఏ లగ్నంలో అయినా భక్తితో భగవంతుడిని పూజించ వచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. భగవంతుడి పూజకు, ధ్యానం చేసుకోవడానికి ‘ఫలానా సమయాలలోనే పూజించండి – అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి’ అని అనడం మూర్ఖత్వం. ఇది ముహూర్త శాస్త్రానికి వర్తిస్తుంది కాని భక్తికి వర్తించదు. భక్తికి ముహూర్త శాస్త్రానికి సంబంధం లేదు. ఏదో ప్రత్యేకమైన పూజ, వ్రతం మరియు క్రతువు ఇత్యాదివి చేసేటపుడు దుర్ముహూర్తాలు లేకుండా చూసి ప్రారంభించడం సాంప్రదాయం. ఇది నమ్మకం. ‘వృశ్చిక లగ్నంలో చేయండి సఫలీకృతం చేసుకోండి’ అని అనడం పొరపాటు. *అర్హత లేని భక్తుడికి సఫలీకృతం కాదు. అర్హత ఉన్నవాడు ఎప్పుడు చేసినా సఫలీకృతం అవుతుంది. అర్హత లేని వాడికి, సంకల్పిత కార్యం సిద్ధించక పోవుట వలన శాస్త్రం పై నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కావున భగవంతుడి పూజకు భక్తి శ్రద్ధలు ప్రధానమైనవి అని గ్రహించ గలరు.*

*ప్రస్తుత గ్రహ యోగాలు ప్రపంచానికి చాలా ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. ఈ యోగ ప్రభావం గురు భ కుంభ రాశిలో ప్రవేశించు వరకు కూడా ఇదే విధంగా ఉంటాయి. కాని సెప్టెంబర్ 23 నాడు రాహువు వృషభ రాశిలో ప్రవేశించిన మొదలు కొంత ఉపశమనం లభించే అవకాశం మాత్రమే కలదు. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో భగవానుడిని ప్రార్థించడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. లోక రక్షకుడు ఆ భగవానుడు ఒక్కడే. అనవసరమైన ప్రచారాల ప్రభావంలో పడి సమయం వృధా చేసుకోకండి. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో భగవానుడిని ప్రార్థించండి.*

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति
https://www.srigayatrivedavision.com/

ప్రమాదం

ఉభయ 👪 కుశలోపరి 🇬‌🇺‌🇩‌ 🇲‌🇴‌🇷‌🇳‌🇮‌🇳‌🇬‌

భోజనంలో విషం పెడితే
ఎంత ప్రమాదమో
చెవిలో విషయం పడితే కూడా
అంతే ప్రమాదం
తినే భోజనం గురించి
ఎంత జాగ్రత్తగా ఉంటామో
వినే మాటల గురించి కూడా
అంతే జాగ్రత్తగా ఉండాలి
కొన్నిసార్లు మన చెవులు
గ్రహించే మాటల వలన
మన స్వభావం మారిపోవచ్చు
అందుకే వీలైనంత వరకూ
మంచి మాటలు వింటూ ఉండండి
మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా
వారి మాటల్లో మంచిని మాత్రమే
గ్రహించండి
చాడీలు చెప్పేవారికి మాత్రం
దూరముండండి
ఎందుకంటే రేపు మీ గురించి
ఇంకొకరికి చెడుగా చెబుతారు..!!

*సూర్యుని రూపాలు.*

*🌞సూర్యుని ద్వాదశమూర్తులు.🌞*

*సూర్యుని రూపాలు.*

1. ఇంద్రుడు :
స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.

2. ధాత :
ప్రజాపతియై భూతములను సృష్టించాడు.

3. పర్జన్యుడు:
తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.

4 త్వష్ట :
 ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.

5. పూష :
ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.

6. అర్యముడు :
దేవతారూపంలో వుంటాడు.

7. భగుడు :
 ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.

8. వివస్వంతుడు :
ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు.

9.విష్ణువు :
శత్రువులను నాశనం చేస్తాడు.

10.అంశుమంతుడు :
 గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.

11. వరుణుడు :
 జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.

12. మిత్రుడు :
 లోకాాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు.
                   
 *🌞శుభ సూర్యోదయం🌞*

"సూర్య శతకము"

*మయూర కవి విరచిత "సూర్య శతకము" గురించి......*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*సూర్యుడు.. సప్తశ్వారూఢుడు.* ఆయనకు సంబంధించిన రహస్యాలను శతకరూపంలో రచించారు మన పూర్వీకులు..అలాంటి రచనల్లో ప్రధానమైనది *మయూరశతకం.* 
దక్షిణ భారత దేశంలో పల్లవ రాజుల కాలంలో, *మయూర మహాకవి విరచిత సూర్య శతకంలో.......*
 *ప్రభా వర్ణనం (1-43)*
 *అశ్వ వర్ణనం (44-49)*
 *అనూరు వర్ణనం (50-61)*
 *రథ వర్ణనం (62-72)*
 *మండల వర్ణనం (73-80)*
 *రవి వర్ణనం (81-100)*
అనే విభాగాలున్నాయి.

ఇందులోని వర్ణనలు, అత్యంత సుందరాలు. కల్పనాచమత్కృతి అమోఘం. అర్థవంతంగా ఉన్నాయి.

ఆ చిత్రభానుని కిరణాలను వివిధ రీతుల వర్ణిస్తూ, *"అవి కిరణాలు కావు. ఆ పద్మ బాంధవుని పవిత్ర పాదాలు. ఆ కిరణలు శుభములకు ఆవిష్కరణలు. ప్రకృతికి అలంకారాలు. చాలా శక్తిమంతాలు. భక్తి భరితాలు. వీటి స్వభావం చాలా చిత్రంగా వుంటుంది. ఇవి అతి సుకుమారమైనవి. అతి కఠినమైనవీ కూడా! పద్మాల హృదయాలలో చేరి ఆనందం అందించి చక్కిలిగిలి పెడతాయి. పర్వత పాషాణ చిత్రాలలో ప్రవేశించి, చైతన్యాన్ని అందిస్తాయి."*

ఇలా మొదలై పోను పోనూ అభివ్యక్తిలో చిక్కదనం ఇనుమడిస్తూ ఇనుమడిస్తూ, సూర్యునికీ శ్రీమన్నారాయాణునికీ అభేదం సూచించేంత వరకూ వెళ్ళటం - నిజంగా అద్భుతం.

సూర్యుడెలా వున్నాడు? ప్రకృతికి బంగారు భూషణం వలె, పద్మరాగ మణి వలె, ఆకాశమనే నీలి కలువపై పసుపు వన్నె పుప్పొడివలె, కాలపన్నగ శిరముపై – మహారత్నము వలె, విశ్వసుందరి కంఠాన మెరుస్తున్న శుభకర మంగళసూత్రము వలె కాంతులు ప్రతిఫలింపగా, మంగళకరముగా సూర్యమండలం కనిపిస్తున్నదనటం – మయూరకవి అపూర్వ కల్పనాచాతురికి పరాకాష్ట!

ఇంతేనా?...

‘ఆదిత్య దీప్తి అఖిల ప్రపంచానికి రక్షణ కవచం. రవిమండలం - మహాయోగీశ్వరులకు ముక్తి మార్గం చూపించే అఖండ దీప్తి. కడుపులో పెనుమంటలు పెట్టుకుని, లోకం కోసం ప్రాణికోటికి చాలినంత వరకే కాంతిని వారి వుపయోగం కోసం ప్రసారం చేసె ఆదిత్యుని యేమని కీర్తించగలం? మహాత్ముల రచనలు అద్భుతం.

*సూర్య సార్వ భౌమత్వాన్ని ప్రతిపాదించిన మయూరుడు, ఫల శృతిలో, యీ తన శతకాన్ని భక్తి శ్రద్ధలతో పాఠం చేసిన వారు సర్వ పాపాలనుంచీ విముక్తులవటమే కాక, వారికి ఆరోగ్యం, సత్కవిత్వం, అతులనీయమైన బలం, విద్య, ఐశ్వర్యం, సంపదలూ - అన్నీ సూర్య ప్రసాదాలుగా లభిస్తాయని ఘంటాపథంగా మయూర శతకం పేర్కొన్నది.*

*సేకరణ*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*అంతా రామమయం

🙏🙏 *జై శ్రీ రామ్* 🙏🙏

*ఒకసారి శ్రద్దగా చదవండి...*
*చదివిన తరువాత ఆనందంతో ఆశ్చర్యపోతారు*

*అంతా రామమయం !.. మన బతుకంతా రామమయం !!*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే *రామాయణం.*

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ *రాముడు మనవెంట నడిచిన దేవుడు !*

మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన *ఆదర్శ పురుషుడు.*

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన *అద్దం రాముడు.*

ధర్మం పోత పోస్తే *రాముడు !*

ఆదర్శాలు రూపుకడితే *రాముడు !*

అందం పోగుపోస్తే *రాముడు !*

ఆనందం నడిస్తే *రాముడు !*

వేదోపనిషత్తులకు అర్థం *రాముడు !*

మంత్రమూర్తి *రాముడు !*

పరబ్రహ్మం *రాముడు !*

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు *రాముడు !*

ఎప్పటి త్రేతాయుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ??
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా *రాముడే.*

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - *శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !*

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - *రామాలాలి - మేఘశ్యామా లాలి.*

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు *శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.*

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - *అయ్యో రామా.*

వినకూడని మాట వింటే అనాల్సిన మాట - *రామ రామ.*

భరించలేని కష్టానికి పర్యాయపదం - *రాముడి కష్టం.*

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - *రాముడు.*

కష్టం గట్టెక్కే తారక మంత్రం - *శ్రీరామ.*

విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - *శ్రీరామ శ్రీరామ శ్రీరామ.*

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - *అన్నమో రామచంద్రా !*

వయసుడిగిన వేళ అనాల్సిన మాట - *కృష్ణా రామా !*

తిరుగులేని మాటకు - *రామబాణం.*

సకల సుఖశాంతులకు - *రామరాజ్యం.*

ఆదర్శమయిన పాలనకు - *రాముడి పాలన.*

ఆజానుబాహుడి పోలికకు - *రాముడు.*

అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - *రాముడు.*

*రాముడు* ఎప్పుడూ మంచి బాలుడే.

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - *రామా కిల్డ్ రావణ* ; *రావణ వాజ్ కిల్డ్ బై రామా.*

ఆదర్శ దాంపత్యానికి - *సీతారాములు.*

గొప్ప కొడుకు - *రాముడు.*

అన్నదమ్ముల అనుబంధానికి - *రామలక్ష్మణులు.*

గొప్ప విద్యార్ధి - *రాముడు* (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).

మంచి మిత్రుడు - *రాముడు* (గుహుడు చెప్పాడు).

మంచి స్వామి *రాముడు* (హనుమ చెప్పారు).

సంగీత సారం *రాముడు* (రామదాసు, త్యాగయ్య చెప్పారు).

నాలుకమీదుగా తాగాల్సిన నామం *రాముడు* ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - *రాముడు.*

నోరున్నందుకు పలకాల్సిన నామం - *రాముడు.*

చెవులున్నందుకు వినాల్సిన కథ - *రాముడు.*

చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - *రాముడు.*

జన్మ తరించడానికి - *రాముడు, రాముడు, రాముడు.*

*రామాయణం పలుకుబళ్లు*

మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో *రామాయణం* ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా *రామాయణం* విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.

చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక *రామాయణం.*

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - *సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.*

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక *పుష్పకవిమానం.*

కబళించే చేతులు, చేష్ఠలు - *కబంధ హస్తాలు.*

వికారంగా ఉంటే - *శూర్పణఖ.*

చూసిరమ్మంటే కాల్చి రావడం - *హనుమ.*

పెద్ద పెద్ద అడుగులు వేస్తే - *అంగదుడి అంగలు.*

మెలకువలేని నిద్ర - *కుంభకర్ణ నిద్ర.*

పెద్ద ఇల్లు - *లంకంత ఇల్లు.*

ఎంగిలిచేసి పెడితే - *శబరి.*

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - *ఋష్యశృంగుడు.*

అల్లరి మూకలకు నిలయం - *కిష్కింధ కాండ.*

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - *అగ్ని పరీక్షలే.*

పితూరీలు చెప్పేవారందరూ - *మంథరలే.*

యుద్ధమంటే - *రామరావణ యుద్ధమే.*

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - *రావణ కాష్ఠాలే !*

కొడితే బుర్ర *రామకీర్తన* పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.

బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.

ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.

ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.

ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.

ఒంటిమిట్టది ఒక కథ..

భద్రాద్రిది ఒక కథ...

అసలు రామాయణమే మన కథ.

*అది రాస్తే రామాయణం - చెబితే మహా భారతం🙏జై హనుమాన్ జై జై హనుమాన్* 🙏శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏🏻🌺

*అంతా రామమయం

🙏🙏 *జై శ్రీ రామ్* 🙏🙏

*ఒకసారి శ్రద్దగా చదవండి...*
*చదివిన తరువాత ఆనందంతో ఆశ్చర్యపోతారు*

*అంతా రామమయం !.. మన బతుకంతా రామమయం !!*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే *రామాయణం.*

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ *రాముడు మనవెంట నడిచిన దేవుడు !*

మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన *ఆదర్శ పురుషుడు.*

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన *అద్దం రాముడు.*

ధర్మం పోత పోస్తే *రాముడు !*

ఆదర్శాలు రూపుకడితే *రాముడు !*

అందం పోగుపోస్తే *రాముడు !*

ఆనందం నడిస్తే *రాముడు !*

వేదోపనిషత్తులకు అర్థం *రాముడు !*

మంత్రమూర్తి *రాముడు !*

పరబ్రహ్మం *రాముడు !*

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు *రాముడు !*

ఎప్పటి త్రేతాయుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ??
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా *రాముడే.*

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - *శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !*

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - *రామాలాలి - మేఘశ్యామా లాలి.*

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు *శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.*

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - *అయ్యో రామా.*

వినకూడని మాట వింటే అనాల్సిన మాట - *రామ రామ.*

భరించలేని కష్టానికి పర్యాయపదం - *రాముడి కష్టం.*

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - *రాముడు.*

కష్టం గట్టెక్కే తారక మంత్రం - *శ్రీరామ.*

విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - *శ్రీరామ శ్రీరామ శ్రీరామ.*

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - *అన్నమో రామచంద్రా !*

వయసుడిగిన వేళ అనాల్సిన మాట - *కృష్ణా రామా !*

తిరుగులేని మాటకు - *రామబాణం.*

సకల సుఖశాంతులకు - *రామరాజ్యం.*

ఆదర్శమయిన పాలనకు - *రాముడి పాలన.*

ఆజానుబాహుడి పోలికకు - *రాముడు.*

అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - *రాముడు.*

*రాముడు* ఎప్పుడూ మంచి బాలుడే.

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - *రామా కిల్డ్ రావణ* ; *రావణ వాజ్ కిల్డ్ బై రామా.*

ఆదర్శ దాంపత్యానికి - *సీతారాములు.*

గొప్ప కొడుకు - *రాముడు.*

అన్నదమ్ముల అనుబంధానికి - *రామలక్ష్మణులు.*

గొప్ప విద్యార్ధి - *రాముడు* (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).

మంచి మిత్రుడు - *రాముడు* (గుహుడు చెప్పాడు).

మంచి స్వామి *రాముడు* (హనుమ చెప్పారు).

సంగీత సారం *రాముడు* (రామదాసు, త్యాగయ్య చెప్పారు).

నాలుకమీదుగా తాగాల్సిన నామం *రాముడు* ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - *రాముడు.*

నోరున్నందుకు పలకాల్సిన నామం - *రాముడు.*

చెవులున్నందుకు వినాల్సిన కథ - *రాముడు.*

చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - *రాముడు.*

జన్మ తరించడానికి - *రాముడు, రాముడు, రాముడు.*

*రామాయణం పలుకుబళ్లు*

మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో *రామాయణం* ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా *రామాయణం* విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.

చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక *రామాయణం.*

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - *సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.*

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక *పుష్పకవిమానం.*

కబళించే చేతులు, చేష్ఠలు - *కబంధ హస్తాలు.*

వికారంగా ఉంటే - *శూర్పణఖ.*

చూసిరమ్మంటే కాల్చి రావడం - *హనుమ.*

పెద్ద పెద్ద అడుగులు వేస్తే - *అంగదుడి అంగలు.*

మెలకువలేని నిద్ర - *కుంభకర్ణ నిద్ర.*

పెద్ద ఇల్లు - *లంకంత ఇల్లు.*

ఎంగిలిచేసి పెడితే - *శబరి.*

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - *ఋష్యశృంగుడు.*

అల్లరి మూకలకు నిలయం - *కిష్కింధ కాండ.*

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - *అగ్ని పరీక్షలే.*

పితూరీలు చెప్పేవారందరూ - *మంథరలే.*

యుద్ధమంటే - *రామరావణ యుద్ధమే.*

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - *రావణ కాష్ఠాలే !*

కొడితే బుర్ర *రామకీర్తన* పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.

బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.

ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.

ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.

ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.

ఒంటిమిట్టది ఒక కథ..

భద్రాద్రిది ఒక కథ...

అసలు రామాయణమే మన కథ.

*అది రాస్తే రామాయణం - చెబితే మహా భారతం🙏జై హనుమాన్ జై జై హనుమాన్* 🙏శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏🏻🌺

రామాయణమ్.60


...
గుండెలు చెలమలయినాయి!
కన్నులు కన్నీటి జలపాతాలయినాయి!.
 హృదయాన్ని వారి సంభాషణ కలచివేసింది!
దుఃఖము ఎలా ఆపుకోవాలో అర్ధం కాలా లక్ష్మణునకు .
ఉన్నపళంగా అన్న పాదాలమీద వ్రాలాడు.
.
అన్నా ,నీ ముందు నేను నడుస్తాను ! నీ మార్గాలు నిష్కంటకం చేస్తాను ! నీవులేని అయోధ్యలో నేనూ ఉండను.
.
అన్నా నీతో కలిసి ఉండటమా !
దేవలోక ఆధిపత్యమా? ఈ రెండింటిలో!ఏది ?అంటే
 నీతో కలిసి ఉండి నీ సేవ చేసుకోవటం నాకు ముఖ్యం.
అదే అన్నింటికన్నా ఎక్కువ నాకు .
.
తనతో కలిసి అడవికి వస్తానన్న తమ్ముని పరిపరివిధాలుగా వారించాడు రామచంద్రుడు !
.
 లక్ష్మణస్వామి పట్టిన పట్టు విడువడే! .
.
అదేమిటన్నా నీవు ఇంతకు పూర్వమే నాకు అనుమతి ఇచ్చావుగా అన్నా! ఇప్పుడిలా అంటున్నావేమిటి?
.
(ఎప్పుడు అనుమతిచ్చాడు రాముడు? సీతాదేవితో సంభాషణ అంతా విన్నాడు లక్ష్మణుడు అప్పుడు ఆయన భరతశత్రుఘ్నులతో బాగుండమని కదా చెప్పినది ! లక్ష్మణుడి ప్రసక్తితేలేదక్కడ!
అంటే లక్ష్మణుడు ఎక్కడుంటాడు ! సదా రాముడితోటే! చిన్నతనం నుండే అలవాటు అన్నతోటే ఉండటం !
అన్నకూ అదే ఊహ తమ్ముడు తననుండి వేరుకాదని !
కానీ ఈ సంకట సమయంలో కూడా రాముడు తమ్ముని తనతోటే అనుకుంటూ అలవాటు ప్రకారం మాట్లాడాడు!.
అది పట్టుకున్నాడు లక్ష్మణుడు ఇప్పుడు).
.
లక్ష్మణా ! నీవుకూడా నాతో వస్తే అమ్మకౌసల్యను ,తల్లిసుమిత్రను చూసుకొనేదెవరు? వారి పోషణ భారం ఎవరు భరిస్తారు?.
.
కామవశుడయిన తండ్రి ఇప్పుడు వారిని మునుపటిలా చూడగలడా? రాజ్యము హస్తగతమయిన వెంటనే సవతులను ముప్పుతిప్పలు పెడుతుంది కైక! .
.
లక్ష్మణా నీవిచటనే యుండి తల్లుల యోగక్షేమాలు చూసుకోవాలి ! అదే నేను కోరుకునేది .
.
అన్న రాముని చూసి లక్ష్మణుడు ,అన్నా! అమ్మ కౌసల్యను ఒకరు చూడాలా! ఆవిడ అధీనంలో వెయ్యిగ్రామాలున్నవి మనలాంటి వారిని పదిమందిని పోషించగలదావిడ! ( Financial independence to women ఆ రోజులలో లేదని ఎవడన్నాడు?)
.
అమ్మ కౌసల్యకున్న ఆర్దికబలము వలన మన తల్లి సుమిత్రకు కూడా వచ్చిన లోటులేదు!.
.
అన్నా నేను నీ అనుచరుడను ! నీ వెంటే నేనుంటా! నాకు తెలిసినది అదే ! నీవిక అడ్డు చెప్పక అనుమతింపుము.
.
ధనుర్బాణములు,గునపము,గంప చేతపుచ్చుకొని నీకు మార్గము చూపుతూ నీముందు నడుస్తాను.
.
నీకు నిత్యము కందమూలపలములు ,ఇతరావసరములు సేకరించి నీకు సమకూర్చగలవాడను!.
.
తమ్ముడి ప్రేమకు తలవంచాడు అగ్రజుడు .సరే నీ మిత్రులవద్ద సెలవు తీసుకొనిరా అని పంపించాడు!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

పాత పైసలు



















సర్కస్




గ్రహ దోషాలు - శాంతి మార్గాలు



      మానవుడిపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. అయితే జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన సమస్యలను నుంచి బయటపడేందుకు, ఉపశమనం పొందేందుకు శాంతి మార్గాలను అన్వేషించాల్సిందే. నిజానికి గ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం, ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించాలి.

అయితే జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలలో రవి ఈశ్వరారాధన చేస్తారు. చంద్రుడు గౌరీ ఉపాసకులు. కుజ దిశ సుబ్రహ్మణ్యం అధిదేవత అని, బుధుడికి విష్ణువు ఆరాధ్య దైవము అని, గురువుకు శివుడు, శుక్రుడికి లక్ష్మీ ఉపాసన, శనికి శివారాధన, రాహువుకు దుర్గ, కేతువుకు గణపతి అని చెప్పబడింది. దీని ఆధారంగా వివిధమైన విధానాలు పెద్దలు, మహర్షులు వ్యవస్థ చేశారు.

శ్రీమహావిష్ణుమూర్తి సృష్టి పరిపాలకుడు. ఆయన పరిపాలనకు గాను తన అనుచరులుగా ఈ నవగ్రహాలను ఉంచారు. అందువల్ల సృష్టి పాలకులయిన హరిహరులను నిత్యం అర్చించడం నవగ్రహాలకు యధోచిత సేవ చేయడం చాలా మంచిది. నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయడం వంటివి అవసరం. ఇది కనీస శాంతి మార్గము.

సాధారణంగా ఆరోగ్య సమస్యలు నడిచే విషయంలో సూర్య నమస్కారాలు అరుణ పారాయణ చేయించడం ఒక విధి. రవి దశ, గురు దశ, శని దశ, కేతు దశ నడిచేటప్పుడు ఇది బాగా పని చేస్తుంది. చంద్రగ్రహం వలన వచ్చే ఆరోగ్య సమస్యలకు సూర్య నమస్కారాలతోపాటు దుర్గా అనుష్ఠానం చేయించాలి. అలాగే కుజ దశ నడిచే సందర్భంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ దశ విషయంలో లక్ష్మీనృసింహానుష్ఠానం, శుక్ర దశలోనూ కేతు దశలోనూ లక్ష్మీ నృసింహానుష్ఠానం, శనితో సంబంధంగా ఆరోగ్య సమస్యలు వున్నప్పుడు మృత్యుంజయ జపం, రాహువుతో సంబంధంగా ఆరోగ్య సమస్యలకు దుర్గా అనుష్ఠానం మంచిది. అలాగే మృత్యుప్రదం అయిన ఆరోగ్య సమస్యలు తీవ్రంగా బాధించే సమయంలో నిత్యం ‘మృత్యుంజయ పాశుపతం’ చేయించాలి.

వివాహము ఆలస్యం
వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం, చంద్రుడితో దోషం ఉన్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం మరియు సుబ్రహ్మణ్య పూజలు చేయడం, బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం, గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ మంత్రానుష్ఠానం చేయించడం. శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం.

శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం, రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ, ఇంకా లలితా సహస్ర పారాయణ చేయడం, కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శుభకరం.

అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు. గ్రహ సంబంధమైన ఏ విధమైన దోషం ఉన్ననూ నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి అనంతరం శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శుభం. దీనికి కారణం సృష్టి పరిపాలకులు గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు సంతృప్తి పొందితే సత్వరం శుభ ఫలితాలు ఉంటాయి. పై శాంతి చేయించడం ద్వారా జాతకంలో రాసి వున్న వివాహ దశలు కాలం మారవు. ప్రయత్నాలలో అవరోధాలు చికాకులు తొలగుతాయి.

ఇక విద్యా విషయంగా పరిశీలిస్తే రవి దోషంగా ఉంటే అనుగ్రహం కావలసి వచ్చినను గురు శని విషయంలో కూడా దక్షిణా మూర్తి ఆరాధన త్వరగా సత్ఫలితాలను ఇస్తుంది. చంద్రగ్రహ విషయంలో బాలానుష్ఠానం, కుజ గ్రహ విషయంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ గ్రహ విషయంలో హయగ్రీవోపాసన, శుక్రగ్రహ విషయంలో హయగ్రీవోపాసన, రాహు గ్రహ విషయంలో బాలామంత్రానుష్ఠానం, కేతువు గ్రహ విషయంలో శ్రీవిద్యా గణపతి అనుష్ఠానం చెబుతారు. అయితే ‘ఈశానస్సర్వ విద్యానాం’ అనే వేద వాక్యం ఆధారంగా ‘ఓం నమశ్శివాయ’ శివ షడక్షరీ మంత్రానుష్ఠానం దీక్షగా మెడిటేషన్ చేసిన వారికి విద్యా విజ్ఞాన యోగం తప్పక లభిస్తుంది.

పిల్లలు సరిగా మాట వినకపోయినా, సరైన దారిలో లేకున్నానూ, విద్యా ఉద్యోగ వివాహ విషయములలో సమస్యలతో ఉంటే.. శ్రీరామ శ్శరణం మమ’ అని 108 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి ప్రతిరోజూ చేయడం ద్వారా తల్లిదండ్రులు సత్ఫలితాలు అందుకుంటారు.

ఉద్యోగ విషయంలో రవి గురు శని దోషం ఉంటే పాశుపతి అభిషేకం చేయించి ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేయాలి. చంద్ర శుక్ర రాహు దోషం ఉంటే చండీ సప్తశతీ పారాయణ, కుజగ్రహ దోషం ఉంటే సర్పసూక్తంతో అభిషేకం, బుధ కేతు గ్రహ దోషం ఉంటే లక్ష్మీ గణపతి అనుష్ఠానం శ్రేయస్కరం.

సంతానం కొరకు పురాణాలలో చాలా విశేషములు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ వ్యాస మహర్షి మొదలగు వారు సంతానం కొరకు శివారాధన చేసినట్లు పురాణాలలో చెప్పబడింది. సంసారంలో చికాకులు తొలగి భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుటకు ‘శివకామేశ్వరాంకస్టా శివాస్వాధీన వల్లభా’ అనే వాక్యం లలితా సహస్రంలో ప్రతి శ్లోకానికి ముందు వెనుక చెప్పి మూడు కాలాలతో చేయుట ద్వారా మంచి ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి.

స్నానాలు కూడా..
గ్రహ దోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలు కూడా ఉన్నాయి. కుంకుమ, ఎర్ర చందనం కలిపిన రాగిపాత్రలోని నీటితో స్నానం చేయడం వల్ల సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి. కుంకుమ - గంధం కలిపిన నీటిని 'శంఖం'తో పోసుకుంటే చంద్ర గ్రహ దోషాలు దూరమవుతాయి. అలాగే గంధం, తిలలు కలిపిన 'రజిత పాత్ర'లోని నీటితో స్నానమాచరించడం వలన కుజ దోషాల బారినుంచి బయటపడ వచ్చును.

ఇక నదీ సాగర సంగమంలోని నీటిని మట్టిపాత్రలో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు వదలిపోతాయి. మర్రి, మారేడు కాయలను బంగారుపాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ 'రజిత పాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇక నువ్వులు, మినువులు కలిపిన 'లోహపాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇక గేదె కొమ్ము(డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు.. పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆయా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది...మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557
 ఆదివారం ఉదయాన 11:00 నుండీ 11:45 మధ్య:

లగ్నం - అనూరాధ 2 - వృశ్చిక

రవి - సింహం - భావం10 - స్వక్షేత్రం

చంద్ర - కర్కా - భావం 9 - స్వక్షేత్రం

కుజ - మేష - భావం 6 - స్వక్షేత్రం

బుధ - కన్య - భావం11 - ఉచ్ఛ

గురు - ధను - భావం 2 - స్వక్షేత్రం

శుక్ర - కర్క - భావం 9 - శత్రు

శని - మకర - భావం 3 - స్వక్షేత్రం

రాహు - మిధున - భావం 8 - సమ

కేతు - ధను - భావం 2 - సమ

జిల్లేడు ఆకుపై గోధుమలు ఉంచి, ప్రమిదలో దీపారాధన చేసి, దైవారాధనలో నిమగ్నమైన మీ ఆరోగ్యం బాగుంటుంది
మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి
ఈ అద్భుతమైన ఘడియలు
సఫలీకృతం చేసుకోగలరు.🙏

సర్వే జానాః సుఖినో భవంతు 🙏🌷

46వ పద్యం


శా. 
లేవో కానల గందమూల ఫలముల్, లేవో గుహల్, తోయముల్
లేవో యేఱుల, బల్లవాస్తరణము ల్లేవో; సదా యాత్మలో
లేవో నీవు విరక్తులన్ మనుప, జాలింబొంది భూపాలురన్
సేవల్ చేయగ బోదు రేలకొ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!

గాయత్రీ గురించి ఋక్ పరిశీలన.

గాయత్రీ గురించి ఋక్ పరిశీలన. గాయన్తి త్వా గాయత్రిణోః అర్చన్త యత్ అర్కం అర్కిణః. అని తెలుపు చున్నది. అణవు గాయన్తిగానంతో వ్యాప్తి చేయబడినది. గానము అనగా ఉఛ్చ్వాస నిశ్వాసమునకు మూలమైన శక్తితో సాధన చేయబడినది తెలియును. అర్చన్త యత్ అర్కం అర్కిణః సూర్య శక్తితో చైతన్యమైన అణువుయెుక్క చైతన్యలక్షణమువలెనే యని తెలియును. అణువును శుద్ది చేయుటకు దాని మూల తత్వ శక్తని తెలిసిన గాని శుద్ది విధానము తెలియదు. అట్లే సూర్య శక్తిని మనలో వున్న సూర్య శక్తితో సూర్యుని చైతన్యము చేయుట గాయత్రీ సాధన యని తెలియును. యిచ్చట అర్కం అనగా సూర్యుని పూర్ణమైన శక్తి అర్కిణః అర్క సూర్యునిలో గల ఈ అనే శక్తితో అణువును ఆత్మను చైతన్యం చేయు సాధనయే ఈ అనేశక్తితో అణువును పూర్ణంగా మార్చుట గాయత్రీ సాధన. యిలా ప్రతీ మంత్రమును పరిశీలించి పరష్కరించవలసిన సమయం ఆసన్న మైనది. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే ఉందాం.

ఆహారంలో ఐదు విధాలైన దోషాలు

*మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి*


*౧. అర్ధ దోషం*
*౨. నిమిత్త దోషం*
*౩. స్ధాన దోషం*
*౪. గుణ దోషం*
*౫. సంస్కార దోషం* 

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.


 *అర్ధ దోషం*

ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది.

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు. 

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం భుజించడమే *అర్ధదోషం.* మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.


*నిమిత్త దోషం*

మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.

నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *'నిమిత్త దోషం '* ఏర్పడుతోంది.


 *స్ధాన దోషం*

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.


*గుణ దోషం*

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.


*సంస్కార దోషం* 

దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో
కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు.

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి

*ఓం నమః శివాయ*

🕉🕉🕉🕉🕉🕉