13, సెప్టెంబర్ 2020, ఆదివారం

రామాయణమ్.60


...
గుండెలు చెలమలయినాయి!
కన్నులు కన్నీటి జలపాతాలయినాయి!.
 హృదయాన్ని వారి సంభాషణ కలచివేసింది!
దుఃఖము ఎలా ఆపుకోవాలో అర్ధం కాలా లక్ష్మణునకు .
ఉన్నపళంగా అన్న పాదాలమీద వ్రాలాడు.
.
అన్నా ,నీ ముందు నేను నడుస్తాను ! నీ మార్గాలు నిష్కంటకం చేస్తాను ! నీవులేని అయోధ్యలో నేనూ ఉండను.
.
అన్నా నీతో కలిసి ఉండటమా !
దేవలోక ఆధిపత్యమా? ఈ రెండింటిలో!ఏది ?అంటే
 నీతో కలిసి ఉండి నీ సేవ చేసుకోవటం నాకు ముఖ్యం.
అదే అన్నింటికన్నా ఎక్కువ నాకు .
.
తనతో కలిసి అడవికి వస్తానన్న తమ్ముని పరిపరివిధాలుగా వారించాడు రామచంద్రుడు !
.
 లక్ష్మణస్వామి పట్టిన పట్టు విడువడే! .
.
అదేమిటన్నా నీవు ఇంతకు పూర్వమే నాకు అనుమతి ఇచ్చావుగా అన్నా! ఇప్పుడిలా అంటున్నావేమిటి?
.
(ఎప్పుడు అనుమతిచ్చాడు రాముడు? సీతాదేవితో సంభాషణ అంతా విన్నాడు లక్ష్మణుడు అప్పుడు ఆయన భరతశత్రుఘ్నులతో బాగుండమని కదా చెప్పినది ! లక్ష్మణుడి ప్రసక్తితేలేదక్కడ!
అంటే లక్ష్మణుడు ఎక్కడుంటాడు ! సదా రాముడితోటే! చిన్నతనం నుండే అలవాటు అన్నతోటే ఉండటం !
అన్నకూ అదే ఊహ తమ్ముడు తననుండి వేరుకాదని !
కానీ ఈ సంకట సమయంలో కూడా రాముడు తమ్ముని తనతోటే అనుకుంటూ అలవాటు ప్రకారం మాట్లాడాడు!.
అది పట్టుకున్నాడు లక్ష్మణుడు ఇప్పుడు).
.
లక్ష్మణా ! నీవుకూడా నాతో వస్తే అమ్మకౌసల్యను ,తల్లిసుమిత్రను చూసుకొనేదెవరు? వారి పోషణ భారం ఎవరు భరిస్తారు?.
.
కామవశుడయిన తండ్రి ఇప్పుడు వారిని మునుపటిలా చూడగలడా? రాజ్యము హస్తగతమయిన వెంటనే సవతులను ముప్పుతిప్పలు పెడుతుంది కైక! .
.
లక్ష్మణా నీవిచటనే యుండి తల్లుల యోగక్షేమాలు చూసుకోవాలి ! అదే నేను కోరుకునేది .
.
అన్న రాముని చూసి లక్ష్మణుడు ,అన్నా! అమ్మ కౌసల్యను ఒకరు చూడాలా! ఆవిడ అధీనంలో వెయ్యిగ్రామాలున్నవి మనలాంటి వారిని పదిమందిని పోషించగలదావిడ! ( Financial independence to women ఆ రోజులలో లేదని ఎవడన్నాడు?)
.
అమ్మ కౌసల్యకున్న ఆర్దికబలము వలన మన తల్లి సుమిత్రకు కూడా వచ్చిన లోటులేదు!.
.
అన్నా నేను నీ అనుచరుడను ! నీ వెంటే నేనుంటా! నాకు తెలిసినది అదే ! నీవిక అడ్డు చెప్పక అనుమతింపుము.
.
ధనుర్బాణములు,గునపము,గంప చేతపుచ్చుకొని నీకు మార్గము చూపుతూ నీముందు నడుస్తాను.
.
నీకు నిత్యము కందమూలపలములు ,ఇతరావసరములు సేకరించి నీకు సమకూర్చగలవాడను!.
.
తమ్ముడి ప్రేమకు తలవంచాడు అగ్రజుడు .సరే నీ మిత్రులవద్ద సెలవు తీసుకొనిరా అని పంపించాడు!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: