రే చేతః కథయామి తే హితమిదం బృన్దావనే చారయన్
బృన్దం కోపి గవాం నవామ్బుదనిభో బన్ధుర్నకార్యస్త్వయా
సౌన్దర్యామృతముద్గరద్భిరభితః సంమోహ్య మన్దస్మితై
రేష త్వాం తవవల్లభాంశ్చ విషయానాశు క్షయం నేష్యతి.
చేయవద్దు అన్న పని చేయడం మానవమనస్సుకు బాగా అలవాటు. ఆబలహీనతను తెలిసిన కవి మనస్సుతో ఇలా హెచ్చరిస్తున్నాడు
ఓ మనస్సా! నీకో మేలైనది చెబుతా విను (వినదు అనితెలిసి)
పావనయమునానదీ తీరం. అక్కడో రమ్యమైన వివిధఫలపుష్పాలతో రమ్యమైనబృందావనం . అక్కడో వర్షాకాలపుమేఘం లా నల్లగా ఉంటాడొకడు.మామంచి అందగాడు. కామధేనువులవంటి మంచి గోవుల బృందాన్ని మేపుచూ(ఎప్పుడూ) ఉంటాడు. వానిని చూడనే చూడకు. చూసినా మాట్లాడకు. మాట్లాడినా. వానితో చుట్టరికానికి దిగేవు సుమా జాగ్రత్త. ఏమాత్రం బంధుత్వం పెట్టుకోకు సుమా.
ఎందుకంటావా ?అబ్బబ్బ ఏం చెప్పమంటావు. వాడో దొంగ.మత్తు మందులా సౌందర్యామృతం అంతటా చిమ్ముతూ చిఱునవ్వులు రువ్వుతూ మోహంలో పడేస్తాడు. అంతేనా నిన్నే కాదు నీకు బాగా ఇష్టమైన. భార్యా , పుత్ర విత్త, గృహ క్షేత్రాది సమస్త విషయాలన్నింటినీ వెంటనే ఇట్టే దోచేస్తాడు. మళ్ళీ లేకుండా చేస్తాడు సుమా. తర్వాత నీ ఇష్టం నీ యోగం ఏలా ఉందో. ఉపనిషత్తులనే గోవులందు సంచరిచే శ్రీకృష్ణపరమాత్మ మనోలయం. విషయక్షయం చేసి పరమానందాన్ని కలిగించాలని వేడుకొంటూ ప్రణామాలు.
ఇతి శమ్
****************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి