శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
శా||
వందే యంచు భజింతు నిన్ను వరదా!వ్యాళాధిరాట్కుండలా !
సందేహింపకు లోనికిం జొరగ నిస్పారోసరక్షేత్రమీ
డెందంబంచు ; రచింతు నీకిచట తండ్రీ ! కోటికైలాసముల్
చిందన్ వేడెద నీ కృపామృత మొగిన్ శ్రీ సిద్ధలింగేశ్వరా!
భావం ;( నాకు అర్ధమైన వరకు)
భక్తులందరికీ వరములిచ్చి బ్రోచే నాగభూషణా! వందే అని నిన్ను ఎల్లప్పుడూ భజించుకుంటూ ఉంటానయ్యా!
నా హృదయం ఒక పనికి మాలిన క్షేత్రం అని సందేహించకుండా నా లోనికి రావయ్యా ఇక్కడ నీకోసం కోటి కైలాసాలను రచిస్తాను.
నీ కృప అనే అమృతాన్ని కొంచెం నా మీద చిలకరించమని నిన్ను వేడుకుంటున్నా నయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి