సామాజిక రోగనిరోధక శక్తి
ఇప్పుడు ప్రజలల్లో ఒకే ఒక చేర్చ అది కరోనా-కరోనా ఇలా ఇప్పుడు ఈ కరోనా కొంతమంది శరీరంలో ఉంటే ప్రపంచంలో అందరి మనస్సులో వుంది. కరోనా గూర్చి ఆలోచించని మనిషి ఇప్పుడు భూమి మీద లేడు అంటే అతిసేయోక్తి కాదు. అంటే ప్రతి మనిషి మనస్సు ఇప్పుడు కరోనా ప్రభావంతో వుంది. మన జీవన శైలి మారింది. ఇప్పుడు ప్రతివారు తన మనసులో కరోనా గూర్చి ఆలోచింది తానూ ఇతరులతో కలిసి మెలిసి జీవించటంలేదు. చాలామటుకు వేరే మనుషులతో దూరంగా ఉంటున్నాడు, లేక ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాలన్నీ మన జీవన స్తితిగతులపై మార్పు తీసుకురావటం అటుంచి మన మెదడు పూర్తిగా కరొనతో వ్యాప్తినుంచి వుంది.
సామాజిక రోగనిరోధక శక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. మనలో వయస్సు మళ్ళిన వాళ్లందరికీ DDT అనే పదం తెలుసు ఇది పూర్వం దోమల నివారణకు తయారుచేసిన ఒక విషం. దీనిని స్ప్రే చేసి దోమల్ని నిర్ములించే వాళ్ళు. ఈ విషయం చాలామందికి (పెద్ద వాళ్లకు) తెలుసు. కానీ కాలాంతరంలో ఈ విషపు ప్రభావం దోమలమీద తగ్గింది అందుకు DDT ని స్ప్రే చేసిన కూడా దోమలు చనిపోయేవి కావు. అప్పుడు శాస్త్రజ్ఞులు పరిశోదన చేసి దోమలు DDT కి ఇమ్మ్యూన్ అయ్యాయని తెలుసుకొని DDT కి బదులుగా గమాక్సిన్ అనే విషపదార్ధం తయారుచేసారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం వాడుతున్న గమాక్సిన్ అప్పటి DDT కి ప్రత్యామ్నాయంగా తయారు చేసింది. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమంటే చాలా చిన్న జీవి (మనిషితో పోల్చితే) అయిన దోమలు కొద్ది రోజులకే సామాజిక రోగనిరోధకతను సంక్రమించుకొని DDT నుండి రక్షణ పొందాయి. అటువంటప్పుడు దోమలకన్నా చాల పెద్ద జీవి మరియు బుద్ది జీవి అయిన మనుషులు ఎందుకు ఈ సామాజిక రోగనిరోధకత పొంద లేరు అని.
సామాజిక రోగనిరోధక శక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సమాజంలో ప్రబలిన వ్యాధికి రోగనిరోధక టీకా రావటం ఆ టీకా ప్రజలకు ఇచ్చి రోగ నిరోధకతను పెంపొందించటం, ఇక రెండు ప్రజలలో సదరు వ్యాధి గూర్చి భయం ఏర్పడటం వలన శరీరం తనంతట తానూ సదరు వ్యాధికి చెందిన రోగనిరోధకతను పెంపొందించుకోవడం.
ఒక చిన్న ఉదాహరణతో దీనిని వివరించేప్రయత్నిస్తా మనం స్కూటరు మీద ఏదో ఒక రోడ్డుమీద వెళుతుంటే మనకు ఎవరో ఒక స్కూటరిస్టు ఎదురౌతాడు అప్పుడు మనం వాకపు చేస్తే అక్కడ పోలీసులు పట్టుకుంటున్నారు అంటాడు. మనం అప్పుడు అది నిజామా కాదా అని విచారించం వెంటనే మన స్కూటరును వెనుకకు తిప్పుతాం ఇది మనలో చాలామందికి తెలిసిన విషయమే. మన దగ్గర పూర్తిగా కాగితాలు ఉంటే అట్లా చెప్పినా కూడా ముందుకు వెళుతాము పోలీసులు అడిగితె కాగితాలు చూపించి ముందుకు సాగుతాము. ఇక్కడ కాగితాలు వున్న వాడు అంటే రోగనిరోధక టీకా వేసుకున్న వాడు. వెనుతిరిగిన వాడు అంటే టీకా వేసుకొని వాడు. ఇద్దరు పోలీసులనుండి రక్షింపబడ్డారు. కానీ వెనుదిరిగిన వాడికి భద్రత తక్కువ.
గతంలో ఇప్పటి కరోనా వైరస్ కంటే ప్రేమాదకరమైన అనేక వ్యాధులను మన మానవ సమాజం చవి చూసింది. చాలా మంది వాటి భారిన పడి మరణించారు. కానీ ప్రజలలో సామాజిక రోగనిరోధక శక్తి పెరిగింతరువాత వాటినుండి పూర్తిగా రక్షింప బడ్డారు. ఇప్పుడు ఆ వ్యాధులు లేవు, వున్నా అవి ప్రాణాంతకపు వ్యాధులు కావు.
సామాజిక రోగనిరోధక శక్తి ఎప్పుడు వస్తుంది. ప్రజల్లో 70% నుండి 90% మంది వ్యాధిన పడితే అప్పుడు సామాజిక రోగనిరోధక శక్తి విస్తృతంగా పెరుగుతుంది. కానీ దీనిని మనం ఇప్పుడు ఊహించగలమా.
ఇప్పటివరకు కరోనాకు ప్రపంచంలో టీకా మందు రాలేదు. ప్రయోగ దశలోనే వుంది. టీకాలతో ఇంకొక సమస్య కూడా వుంది అదేమిటంటే టీకా సరిగా పనిచేయక పొతే ఆరోగ్యవంతుడు కూడా వ్యాధిని పడి మరణించ వచ్చు. నిజానికి టీకా మందు అనేది ముల్లును ముల్లుతో తీయాలి అనే న్యాయంతో తయారుచేసింది. అంటే అతి తక్కువ మోతాదులో వ్యాధికి సంబందించిన క్రిములను మనిషి శరీరంలో పంపుతారు అప్పుడు శరీరంలో రోగనిరోధకత వృద్ధి చెంది ఆ క్రిమితొ పాటు నిజమైన క్రిమి దాడి చేసినా దానిని నిర్ములించగలదు. కాబట్టి టీకా మందు వాడటం ఒకరకంగా కొంత ప్రమాదకరం కూడా. ఇంకొక విషయం వయస్సు ఎక్కువ వున్న వారికి ఈ టీకా మందు పనిచేస్తుందా లేదా అనేది కూడా ఒక సమస్య.
మనకు గతంలో హెపటైటిస్ బి అనే రోగానికి ఒక టీకా మందు వచ్చింది దానిని పరీక్షించిన తరువాత అది 30 సంవత్సరాలు దాటిన వారిపైన ప్రభావం చూపదని తేల్చారు. కానీ మన డాక్టర్లు డబ్బుకు ఆశ పడి ఆ విషయం చెప్పకుండా వయస్సుతో నిమిత్తంలేకుండా అందరికి ఇచ్చారు డబ్బులు వసూలుచేసుకున్నారు.ఇది మనందరికీ తెలిసిన విషయమే.
టీకా మందు విషయంలొ డాక్టర్ల దన దాహం కూడా పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం రోగులు మరణించినాకూడా ఎలాంటి కనికరం లేకుండా ప్రెవేట్ హాస్పిటలవాళ్ళు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నట్లు మనం రోజు మీడియాలో చూడటమే కాదు మన హైదరాబాదు గౌరవ హైకోర్టు వారు అనేక విధాలుగా హెచ్చరికలు జారీ చేసినా కూడా పెడచెవిన పెట్టి మరి వారి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. అటువంటప్పుడు ఈ టీకా మందు వస్తే దానికి వున్న నియమాలు అంటే దాని పనితనం వయస్సు మొదలైనవి అన్ని మరచి కనిపించిన వాళ్లకల్లా మందు ఇచ్చి డబ్బులు వసూలు చేయరని మనం ఎలా అనుకోగలం. సామాన్యులకు మందు గూర్చిన అవగాహన ఉండదు. అవగాహన వున్నడాక్టరు ధనాపేక్షతో విషయం చెప్పడు. పరియవసానం యెంత తీవ్రతగా ఉంటుందో. తలచుకుంటేనే భయం వేస్తుంది.
ఏది ఏమైనా సామాజిక రోగనిరోధక శక్తి త్వరగా రావాలని ఈ భమండలం కరోనా రహిత ప్రపంచంగా కావాలని ఆశిద్దాము .
గమనిక: ఇది ఎవ్వరిని ఉద్దేశించి వ్రాసింది కాదు కేవలం ప్రస్తుత పరిస్థితిని సమాజ దృక్పధాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాసిందే నని గమనించగలరు. దీనివల్ల ఎవరికైనా బాధ కలిగితే కేవలం అది వారు దీనిని సరిగా అర్ధం చేసుకోకపోవడం వల్లనే అని గమనించగలరు.
*********************
*********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి