14, జులై 2021, బుధవారం

గాయిత్రీ #మంత్రంలోని #రహస్యం

 #ఎవరికీ #తెలియని #గాయిత్రీ #మంత్రంలోని #రహస్యం 🙏


గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.


1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.


2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.


3. పురాణ కధనం ప్రకారం 24మంది

మహా ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకునిధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.


4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.


5. 24 కేశవ నామాలు


6. 24 తత్వాలు :

*ఐదు జ్ఞానేన్ద్రియాలు,

*5 కర్మేంద్రియాలు,

*పంచ తన్మాత్రలు,

*5 మహాద్భుతాలు,

*బుద్ధి, *ప్రకృతి, *అహంకారం, *మనస్సు


7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”


8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.


9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు.


10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.


11. మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.


“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతాః పర దైవతం” అన్నారు పెద్దలు .


24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు.


సకల దేవతా స్వరూపం గాయత్రీ.

రామాయణ సారం గాయత్రీ .

కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.

సకలకోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రీ

24 బీజాక్షర సంపుటి గాయత్రీ..


అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.........


సర్వే జనా సుఖినోభవంతు 🙏

*People are not aware of gold ...!*

 *Dr.S.Mahendiran advocate, Musiri.*


 *People are not aware of gold ...!*


 *Some ads claim that the wastage % is this much, and no making charges etc.,  What is the truth?*

 _____________________


 💫 *Jewellery  can only be made by adding 1.5 grams of copper to a Sovereign of gold chain ...!*


 *Everyone knew this.*


 *But out of 8 gms. Gold jewellery is made by adding 1.5 gms Copper and 6.5 grams of Gold to make a chain of 8 gms gold ...!*


 *But when buying Gold by an ordinary man, 6.5 gold + 1.5 copper put together sold as 8 grams of gold in the bill.*


 *In addition to that, they are selling the copper for the price of gold, saying that 1.5 grams of gold has been added by showing as wastage, but actually adding copper ...!*


 *In which I mean 6.5 gold + 1.5 copper (as gold) + damage copper 1.5 = 9.5 grams.  So buyers of 1 Sovereign jewelry not only add 6.5 grams of gold but also 3 grams of copper also as gold and charge  the price of gold ...!*


 💫 *So we pay 9.5 grams price of gold for 1 Sovereign 8 grams jewelery .  Whom they are Cheating!*


 *They are deceiving the poor and sucking the blood of the poor like parasites ...!*


 *How did the money come in for them if one opens a new jewelry store and buys, constructs multiple buildings, floors in a short span of a few years? Do agree the above calculations are correct to become so rich. Is it not true!!*


 💫 *What is the price of a gram of gold today?  What is the price of one gram of copper when they are collecting at 3 grams as gold per Sovereign?  Check this account ...!*


 *1 gram of gold is worth Rs.  4760 / -*


 *8 grams of gold worth Rs.  38,080 / -*


 *1 gram of copper - Rs. 4.80*


 *1.5 grams of copper - Rs. 7.20 or Rs. 7 / -*


 *6.5 grams Gold - 30940 / -*


 *6.5 grams of gold + 1.5 grams of copper - Rs. 30940 + Rs. 7.20 = 30947.2 / -*


 *In 1 Sovereign of gold - Rs. 38080 - 30940 Profit = Rs. 7140*


 *Wastage 1.5 g = Rs. 7140 / -*


 *Gross profit per 1 Sovereign 14280*


 *What dizziness?  A privilege within me.  But the price of gold will definitely go down whenever people realize this awareness ...*


 *You should be the good souls who should to create awareness!*


 *Share more to show your prowess.  Anything we can do until the government intervenes and sets a fair price* *

*A. M. Q & P. M. ?*

 *A. M. Q &  P. M. ?*


All these days, we were made to believe that, the terms A.M. and P.M. stands for:


▪A.M.  =   *ante meridian*

▪P.M.  =    *post meridian*


(ante of what ?)  and  (post of what ? )  never clarified ... !!!


(what = the subject himself is missing)


Now our *ancient Sanskrit texts have blown off the ambiguity and the things are now Crystal clear*


Just take a look:-


▪A.M. =  *Aarohanam Marthandasya*


▪P.M.  =  *Pathanam Marthandasya*


Explanation:-


The *‘Sun’* who is vital to the calculation remains un-mentioned. This is unthinkable and unjustifiable. That lacuna arises because it is not realized that the letters *A.M. and P.M. are the initials of the hoary Sanskrit* expressions (आरोहणम् मार्तडस्य्) Arohanam Martandasaya *(i.e. the climbing of the sun)* and (पतनम् मार्तडस्य्) Patanam Martandasaya *(i.e. the falling of the sun).*


Are  We  Clear at least now ......??

This is for the people not knowing d above. Others pl excuse.

మన గోదావరి ""మన అయినవిల్లి

 మన గోదావరి  ""మన  అయినవిల్లి""


అయినవిల్లిలో కొలువైన సిద్ధివినాయకుడు కాశీలోని సాక్షిగణపతికే సాటి అయిన వాడని చెబుతారు. 

మరో ప్రత్యేకమైన పూజ కూడా ఇక్కడి వినాయకుడికి జరుగుతుంది. . అదేంటో తెలుసా, పెన్నులతో అభిషేకం. అవునండీ పెన్నులతో స్వామికి అభిషేకం చేసి వాటితో 

పరీక్ష రాస్తే తప్పకుండా పాస్ అవుతామని భక్తులు నమ్ముతారు.


స్వయంభు గణపతి క్షేత్రాలలో ఈ అయినవిల్లి ఆలయం ఒకటి.అయినవిల్లి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామము. దీనిని చేరుకోవాలంటే సమీప పట్టణమైన అమలాపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోనసీమగా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామం పరిసర ప్రాంతాలు చాల అందంగా ఉంటాయి. కొబ్బరి తోటలు  ,గోదావరి ఒడ్డు ,పచ్చని పొలాలు,కాలువలు ఇంకా చాల ఉన్నాయ్. అయినవిల్లి  అమలాపురానికి 12 కి.మీ. వయాముక్తేశ్వరం) రాజమండ్రికి 55 కి.మీ (వరావులపాలెం,కొత్తపేట,వానపల్లి) కాకినాడకు 72 కి.మీ.(వయా యానాం,అమలాపురం,ముక్తేశ్వరం) దూరంలో ఉంది.ఈ ప్రాంతం దేవాలయాలు ఉండటానికి చాల అనువైన ప్రదేశం.


అత్యంత పురాతనమైన శ్రీ విగ్నేశ్వర ఆలయములలో అయినవిల్లి క్షేత్రం చాల ప్రసిద్ధి చెందినది. ఇది తూర్పు గోదావరి జిల్లాలో గల అమలాపురం పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నది .పూర్వము దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము నిర్వర్తించే ముందు ఈ వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణమును బట్టి తెలియచున్నది. తొలుత ఈ ఆలయ నిర్మాణమును దేవతలే  చేసారని పెద్దలు చెబుతూ  ఉంటారు. ప్రతినిత్యం శ్రీ స్వామివారికి శివాగమ ప్రకారం విశేషార్చనలు సహస్రాధికములుగా నారికేళ ఫలోదకములతో అభిషేకములు చేయించుకుని వేలాది మంది భక్తులు శ్రీ స్వామి వారి కరుణ కటాక్షములు పొందుతారు. భక్తుల పాలిట కోర్కెలు తీర్చే గణనాధుడిగా స్వామి ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తారు. భక్తులు వేయి నూట పదహార్లు వరకు నారికేళములతో  అభిషేకాలు చేయించుకుని తమ మొక్కులు  స్వామి వారికీ సమర్పించుకుంటారు.


ఇక ప్రతి మాసము ఉభయ చవితి తిధులు దశమి,ఏకాదశి,'వినాయచవితి,నవరాత్రులలోను' శ్రీ స్వామి వారి వైభవములు వర్ణింపలేము. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణములో శివకేశవులకు బేధము లేదని చాటిచెప్తున్నట్లు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి,శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ విశ్వేశ్వరాలయం ప్రక్క ప్రక్కనే ప్రతిష్టించబడిన ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీకాలబైరవస్వామి కొలువై ఉన్నారు.


ఇది భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం అలాగే దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం.

రామాయణమ్ 363

 రామాయణమ్ 363

...

సీతమ్మా ! అదుగో విను ఆ ఏనుగుల కాలి గజ్జెల చప్పుడు ! గుర్రపు గిట్టల ధ్వని ! సైనికుల శంఖనాదాలు,

 వారి పదఘట్టనలచేత ఆకాశమందు మేఘమండలములాగా కనపడే ఆ ధూళిని చూడు !

.

 ఇవ్వన్నీ దేనికి సంకేతాలు తల్లీ ! రాబోయే మహా సంగ్రామానికి రాక్షసులు సన్నద్ధమవుతున్నారని కాదా ! ...........

.

.అనుచూ సరమ చెప్పగా విన్న సీతమ్మ ఆవిడను ఒక కోరిక కోరింది ..

.

మరి రావణుడు ఏమి చేయుచున్నాడో చూసి వచ్చి నాకు చెప్పగలవా ! అని అడిగింది.... అందుకు సరే అని సరమ రావణసభాభవనములోనికి రహస్యముగా వెళ్ళి అక్కడ జరుగుతున్నవన్నీ చూసి తిరిగి వచ్చింది ....

.

సీతమ్మ కడు ఆత్రంగా ఏమి జరుగుతున్నది అక్కడ అని ప్రశ్నించింది ........

.

రావణుని తల్లి కైకసి ,వృద్ధమంత్రి అవిద్ధుడు నిన్ను సగౌరవముగా రామచంద్రునకు అప్పగించమని హితవు పలుకుతున్నారు,రాముని గురించి నీకు ఇంకా తెలియరాలేదా రావణా ! ఒక మానవమాత్రుడు జనస్థానములో పదునాల్గువేలమందిని అరగంట కాలములో ఒక్కడే చంపగలిగినాడంటే ఆతని సామర్ధ్యమేపాటిదో నీకింకా తెలియకపోవుట చిత్రముగా ఉన్నది,ఒక పెనుకోతి సంద్రముదాటి లంకకు వచ్చి మరల క్షేమముగా తిరిగి వెళ్ళగలిగినదంటే వారి శక్తిని నీవు సరిగా అంచనా వేయలేదు ...సీతమ్మను రాముని వద్దకు చేర్చు, సంధిచేసుకో  అని పలికిన వారి పలుకులు  ఏవీ ఆయన చెవికెక్కడములేదు.

.

 ఎందుకెక్కుతాయి మరి మృత్యుదేవత రమ్మని పిలిచేపిలుపు కైపెక్కించి ఆయనలో యుద్దపు కాంక్షను రగిల్చి వేస్తుంటే !

.

,ఒక్కటి మాత్రము నిశ్చయము సీతమ్మా!

 వాడు చావనిదే నిన్ను విడిచిపెట్టడు! వాని చావు రాముని చేతిలో వ్రాసిపెట్టి ఉన్నది ఇది తథ్యము అని సరమ పలుకుచుండగనే వానర సైన్యముల కదలికల వలన కలిగిన మహాధ్వని వారి చెవులకు సోకెను.

.

వూటుకూరు జానకిరామారావు

ప్రోస్టేటు గ్రంథి వాపు

 ప్రోస్టేటు గ్రంథి వాపు గురించి వివరణ  - 


      మూత్రకోశ ద్వారమున ఒక చిన్న గ్రంథి ఉన్నది. దీనిని ప్రొస్టేటు గ్రంథి అంటారు. దీనికి కామగ్రంధి అని మరొక పేరు కూడా కలదు. దీని ముఖ్యమైన పని ఏమిటంటే సంభోగ ప్రారంభములో ఇది ఒక పలచటి ద్రవాన్ని , చివరి దశలో చిక్కటి పాల వంటి ద్రవాన్ని ప్రసరింపచేస్తుంది . దీని వలన సంభోగం చివరి దశలో వీర్యము పురుషావయవము గుండా స్త్రీ యోనిలోకి ప్రవేశించగలదు. కాని కొన్ని కారణాల వలన ఈ గ్రంథి వాచి వ్యాధిని కలిగిస్తుంది . ఈ వ్యాధి 45 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువుగా వస్తుంది. 


 *  లక్షణాలు  - 


      ప్రొస్టేటు గ్రంథి వాచుట వలన మూత్రనాళము యొక్క ద్వారము నొక్కబడును . తత్ఫలితముగా మూత్రవిసర్జన సమయాన మంట , నొప్పి కలుగును. పదేపదే మూత్రవిసర్జన చేయరావలసివచ్చును . మూత్రం ధారాళముగా వెలువడదు. నెమ్మదిగా వెలువడును. ఇంతేకాక పొత్తికడుపు , నడుము , గజ్జల యందు కొద్దిగా నొప్పి ఉంటుంది. 


  ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు  - 


 *  అధిక నూనె , నెయ్యితో చేసిన ఆహారపదార్థాలు సేవించటం . 


 *  ఒక గ్రాము వీర్యములో 7 mg జింక్  ఉంటుందని కనుగొనబడినది. కావున ఆహారంలో జింక్ లోపము వలన గాని అధికసంభోగము వలన గాని జింక్ నష్టం అగుట వలన ప్రోస్టేట్ గ్రంథి వ్యాధికి గురగును.


  నివారణా మార్గాలు  - 


        ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం శరీరం నందలి జింక్ పరిణామము పైన ఆధారపడి ఉండును. జింక్ ఎక్కువ కలిగిన ఆహారపదార్థాలు అయిన wheat germ brewers yeast , pumpkin seeds ప్రతిరోజూ వాడాలి . లేదా విటమిన్లు , ఖనిజలవణాలు మరియు జింక్ అధికంగా కలిగిన ఔషధాలు సేవించవలెను . 


              ఆరోగ్యరీత్యా సంభోగం విషయములో మితముగా ఉండటం మంచిది . ఆయుర్వేదం ప్రకారం "సంగమం దినత్రయంచ " అనే సూత్ర ప్రకారం మూడురోజులకు ఒకసారి భార్యాభర్తలు  కలియుట మంచిది . 


     ప్రొస్టేట్ గ్రంధిని ఆరోగ్యముగా ఉండుటకు , సక్రమముగా పనిచేయుటకు సూర్యనమస్కారములు , ఆసనాలు వేయుట చాలా అవసరము . ఈ ఆసనాలు గ్రంథిని ఉత్తేజిత పరిచి దాని ఆరోగ్యం పెంచును . 


        మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సంతానం..సంతోషం..*


చాలా రోజుల క్రిందట సంగతి ఇది..శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించడానికి బెంగుళూరు నుండి ఒక కుటుంబం వచ్చారు..తల్లీ తండ్రీ ఇద్దరు కుమారులు..వారి భార్యలు.. ..మొత్తం ఆరుగురు..నిజానికి వాళ్ళు మాలకొండ లోని శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం కోసం వచ్చారు..అక్కడికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దగ్గరే అని తెలుసుకొని..చూసిపోదామని వచ్చారు..ఆరోజు శనివారం..వీళ్ళు మందిరానికి చేరే సరికి సాయంత్రం నాలుగు గంటల సమయం అయింది..


ఎలాగూ వచ్చారు కనుక పల్లకీ సేవ చూసి వెళ్ళండి అని చెప్పాము..అందరూ ఒకరినొకరు సంప్రదించుకొని..సరే అన్నారు..వాళ్ళ ఉద్దేశ్యం లో పల్లకీ సేవ అయిపోగానే..ఆలస్యం గా నైనా నెల్లూరు వెళ్ళిపోయి..రాత్రికి అక్కడ బస చేయాలని..అందుకే మమ్మల్ని రూము కూడా అడగలేదు..


పెద్దవాళ్ళిద్దరూ శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు..ఆసక్తిగా విన్నారు..ముఖ్యంగా పెద్దవాళ్ళిద్దరూ ఓపికగా శ్రీ స్వామివారి మందిరం అంతా తిరిగి చూసారు..


"శ్రీ స్వామివారు తపస్సు చేసుకునేటప్పుడు.. ఈ పులిచర్మం మీద కూర్చున్నారు కదా..ఆయన శరీర స్పర్శ పొందింది కదా!.." అని ఆ పెద్దాయన తన భార్యకు చెప్పి..మనసారా నమస్కారం చేసుకున్నారు..అలానే శ్రీ స్వామివారు నేలమాళిగ లో సాధన చేసుకునే ముందు..ఆ నేలమాళిగ పైన మూత లాగా వాడిన చెక్కపలక ను ముట్టుకుని కళ్లకద్దుకున్నారు..శ్రీ స్వామివారి గురించి మరింతగా తెలుసుకోవాలని వున్నదనీ..వీలైతే చెప్పమని నన్ను అడిగారు..ఆ సమయం లో పల్లకీ సేవ ఏర్పాట్ల లో కొద్దిగా పనిలో వున్నాను..అదే మాట వారికి చెప్పి..మా అమ్మగారు శ్రీ స్వామివారి గురించి వ్రాసిన పుస్తకం ఆయన కు ఇచ్చాను..భక్తిగా తీసుకున్నారు..


పల్లకీ సేవ లో కుటుంబం యావత్తూ పాల్గొన్నారు..ప్రసాదం తీసుకొని..ఇవతలికి వచ్చి..వారిలో వారే ఏదో మాట్లాడుకుంటున్నారు..ఒక పది నిమిషాల తరువాత నా దగ్గరకు వచ్చి.."ఏమండీ రాత్రికి ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము..చూసారు కదా మేము మొత్తం ఆరుగురం వున్నాము..ఏదైనా రూము వుంటే..అందులో సర్దుకుంటాము.."అన్నారు..ఒక చిన్న గది ఉందనీ..అందులో ఆడవాళ్లు అందులో సర్దుకుంటే..మొగవాళ్ళు మందిర ప్రాంగణం లో పడుకోవచ్చనీ తెలిపాను..సరే అన్నారు..


ఆ రాత్రికి అందరూ నిద్ర చేసి..తెల్లవారి ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి కి అర్చన చేయించుకొని..సమాధికి నమస్కారం చేసుకొని..ఇక బయలుదేరి పోబోతూ..నా దగ్గరకు వచ్చి.."రాత్రి..పల్లకీ సేవ వద్ద కొందరు భక్తులతో మాట్లాడానండీ.. ఇక్కడ మనస్ఫూర్తిగా మ్రొక్కుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు..పెద్దవాడికి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయింది.. శ్రీ స్వామివారికి మ్రొక్కు కున్నాము..అందుకోసమే రాత్రి ఇక్కడ నిద్ర చేసాము..అదృష్టం బాగుండి.. వాళ్లకు సంతానం కలిగితే..మళ్లీ ఇక్కడికి అందరం వచ్చి మ్రొక్కు తీర్చుకుంటాము.." అన్నారు..ఆ వెంటనే సెలవు తీసుకొని వెళ్లిపోయారు..


దాదాపు సంవత్సరం తరువాత.. ఒక ఆదివారం నాడు మళ్లీ వాళ్ళందరూ వచ్చారు..నేరుగా శ్రీ స్వామివారి అర్చన టికెట్ కొనుక్కొని..పూజ చేయించుకొని..నా దగ్గరకు వచ్చి.."శ్రీ స్వామివారు మహిమ చూపారండీ..పెద్దవాడికి అమ్మాయి పుట్టింది..శ్రీ స్వామివారికి మ్రొక్కు కున్న విధంగా..హుండీ లో నేననుకున్న మొత్తం సమర్పించుకున్నాను..శ్రీ స్వామివారి పేరు కలిసి వచ్చేటట్లు గా పాపకు పేరు పెట్టుకుంటాము..ఆయన ప్రసాదం కాబట్టి..ముందుగా ఇక్కడికి వచ్చాము.." అన్నారు..


వాళ్ళందరి ముఖాల్లో సంతోషం తాండవిస్తోంది..అందుకు కారణభూతుడైన ఆ స్వామివారు మాత్రం సమాధినుంచి చిద్విలాసంగా చూస్తూవున్నారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699)

దైవాన్ని మనకున్నకోరిక

 *దైవాన్ని మనకున్నకోరిక ఎలా తెలియపరచికోరుకోవాలి?*

>>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<                                           

1.నువ్వు ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి.                                

అంటే!ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితి లో ఉండాలి అని అర్థం!.                     

అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉం టుంది.                                             


2. నాఇంట్లొ దైవానికి నిత్యపూజా నైవేద్యం ఉండాలి అనికోరుకోవాలి 

అంటే! నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ 

నిలువ ఉంటుంది.


3. నాఇంట్లో నేను నిత్యపూజ రోజు చేయాలి అని కోరుకోవాలి. 

అంటే! నీ ఆరోగ్యంబాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ నీ ఇంట్లో నిత్యపూజ చేస్తావు..


4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినాకడు పునిండా భోజనంచేసి వెళ్ళాలి అని కోరుకోవాలి. 

అంటే! నీకు అనుకూల వతి,లేక వంతుడు అయినవారుధర్మపత్నీగా లేక భర్తగా, భాగస్వామి అవుతారు.


5. నేను నాచివరిదశ వరకు నీ క్షేత్రా నికి దర్శనానికి రావాలిఅనికోరాలి

అంటే! నీకు సంపూర్ణ మైన ఆరోగ్యా న్ని ఇవ్వమని అడగటం..


6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి  అంటే! నీకు సమాజంలో తగిన గౌర వం మంచిపేరు రావాలి అని కోరు కోవడంఅన్నమాట!...


7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే!నువ్వుఆరోగ్యంగా,ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగాఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి!..


8. చివరిగా నేను పండు ముత్తైదు వుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే! భర్తకు సం పూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవ డం..మనకు తల్లిదండ్రులు ఆ దైవ మే వారిని కాక ఎవరిని అడుగుతా ము కానీ ఆ అడిగే కోరిక ఇలాఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.


   *ఓం నమో దేవ దేవ్యైనమః.*

                       🙏

ప్రశ్న పత్రం సంఖ్య: 10

 ప్రశ్న పత్రం సంఖ్య: 10                            కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "సం  " తో అంతమౌతాయి   

1) మగవారి రోషానికి సాంకేతం 

2) ఇంట్లో తినాలంటే ఇది ఉండాలి కదా 

3) మంచివారితో మాత్రమే చేయి 

4) ప్రజలు వుండే స్థలము 

5) సరదాగా మిత్రునితో చేసేది 

6)రాజకీయ నాయకులూ చేసింది ఇది ముఖ్యంగా 

7) ఇంగ్లీషులో బాగావుంటే ఇలా అంటాము 

8) జాగ్రత్త _______ విరసంలో దింపేను 

9) నీతిమంతులు ఇది చేయాలంటే భయపడతారు 

10) శివాభిషేకంలో చేసే ఒక క్రియ 

11)  బ్యాటరీలో వాడే ఒక లోహ విశేషం 

12)   కాకికి ఇంకొక పేరు 

13)  పండగలకు సాధారణంగా పాలతో ఈ వంటకమ్ చేస్తారు 

14) ఠీవి 

15)  యమధర్మ రాజు చేతిలో ఇది ఉంటుంది 

16)   ఇది వస్తుందిరా, అందుకే పరిగెత్తవద్దని అంటా 

17)   ఇది ఒక తెలుగు వ్యాకరణ అంశము 

18)  కష్టమైన పనులు చేయటము  _________అవుతుంది 

19)  ఆశ్రమ ధర్మాలలో ఇది ఒకటి, ముక్తికోసం  

20)  వలస వెళ్ళటం 

21) చిరు నవ్వు  

22)   వృత్తంలో ఇది ఒక కొలత 

23)   ప్రధర్శన 

 



జవాబులు 

1) మీసం 

2) గ్రాసం 

3) సావాసం 

4)  

5) 

6)  

7)   

8)  

9)  

10)  

11)  సీసం

12) 

13)  

14) రాజసం

15)  

16)  

17) 

18) 

19) 

20) 

21)

22) 

23)

24) 

25)