14, జులై 2021, బుధవారం

ప్రోస్టేటు గ్రంథి వాపు

 ప్రోస్టేటు గ్రంథి వాపు గురించి వివరణ  - 


      మూత్రకోశ ద్వారమున ఒక చిన్న గ్రంథి ఉన్నది. దీనిని ప్రొస్టేటు గ్రంథి అంటారు. దీనికి కామగ్రంధి అని మరొక పేరు కూడా కలదు. దీని ముఖ్యమైన పని ఏమిటంటే సంభోగ ప్రారంభములో ఇది ఒక పలచటి ద్రవాన్ని , చివరి దశలో చిక్కటి పాల వంటి ద్రవాన్ని ప్రసరింపచేస్తుంది . దీని వలన సంభోగం చివరి దశలో వీర్యము పురుషావయవము గుండా స్త్రీ యోనిలోకి ప్రవేశించగలదు. కాని కొన్ని కారణాల వలన ఈ గ్రంథి వాచి వ్యాధిని కలిగిస్తుంది . ఈ వ్యాధి 45 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువుగా వస్తుంది. 


 *  లక్షణాలు  - 


      ప్రొస్టేటు గ్రంథి వాచుట వలన మూత్రనాళము యొక్క ద్వారము నొక్కబడును . తత్ఫలితముగా మూత్రవిసర్జన సమయాన మంట , నొప్పి కలుగును. పదేపదే మూత్రవిసర్జన చేయరావలసివచ్చును . మూత్రం ధారాళముగా వెలువడదు. నెమ్మదిగా వెలువడును. ఇంతేకాక పొత్తికడుపు , నడుము , గజ్జల యందు కొద్దిగా నొప్పి ఉంటుంది. 


  ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు  - 


 *  అధిక నూనె , నెయ్యితో చేసిన ఆహారపదార్థాలు సేవించటం . 


 *  ఒక గ్రాము వీర్యములో 7 mg జింక్  ఉంటుందని కనుగొనబడినది. కావున ఆహారంలో జింక్ లోపము వలన గాని అధికసంభోగము వలన గాని జింక్ నష్టం అగుట వలన ప్రోస్టేట్ గ్రంథి వ్యాధికి గురగును.


  నివారణా మార్గాలు  - 


        ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం శరీరం నందలి జింక్ పరిణామము పైన ఆధారపడి ఉండును. జింక్ ఎక్కువ కలిగిన ఆహారపదార్థాలు అయిన wheat germ brewers yeast , pumpkin seeds ప్రతిరోజూ వాడాలి . లేదా విటమిన్లు , ఖనిజలవణాలు మరియు జింక్ అధికంగా కలిగిన ఔషధాలు సేవించవలెను . 


              ఆరోగ్యరీత్యా సంభోగం విషయములో మితముగా ఉండటం మంచిది . ఆయుర్వేదం ప్రకారం "సంగమం దినత్రయంచ " అనే సూత్ర ప్రకారం మూడురోజులకు ఒకసారి భార్యాభర్తలు  కలియుట మంచిది . 


     ప్రొస్టేట్ గ్రంధిని ఆరోగ్యముగా ఉండుటకు , సక్రమముగా పనిచేయుటకు సూర్యనమస్కారములు , ఆసనాలు వేయుట చాలా అవసరము . ఈ ఆసనాలు గ్రంథిని ఉత్తేజిత పరిచి దాని ఆరోగ్యం పెంచును . 


        మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: