14, జులై 2021, బుధవారం

రామాయణమ్ 363

 రామాయణమ్ 363

...

సీతమ్మా ! అదుగో విను ఆ ఏనుగుల కాలి గజ్జెల చప్పుడు ! గుర్రపు గిట్టల ధ్వని ! సైనికుల శంఖనాదాలు,

 వారి పదఘట్టనలచేత ఆకాశమందు మేఘమండలములాగా కనపడే ఆ ధూళిని చూడు !

.

 ఇవ్వన్నీ దేనికి సంకేతాలు తల్లీ ! రాబోయే మహా సంగ్రామానికి రాక్షసులు సన్నద్ధమవుతున్నారని కాదా ! ...........

.

.అనుచూ సరమ చెప్పగా విన్న సీతమ్మ ఆవిడను ఒక కోరిక కోరింది ..

.

మరి రావణుడు ఏమి చేయుచున్నాడో చూసి వచ్చి నాకు చెప్పగలవా ! అని అడిగింది.... అందుకు సరే అని సరమ రావణసభాభవనములోనికి రహస్యముగా వెళ్ళి అక్కడ జరుగుతున్నవన్నీ చూసి తిరిగి వచ్చింది ....

.

సీతమ్మ కడు ఆత్రంగా ఏమి జరుగుతున్నది అక్కడ అని ప్రశ్నించింది ........

.

రావణుని తల్లి కైకసి ,వృద్ధమంత్రి అవిద్ధుడు నిన్ను సగౌరవముగా రామచంద్రునకు అప్పగించమని హితవు పలుకుతున్నారు,రాముని గురించి నీకు ఇంకా తెలియరాలేదా రావణా ! ఒక మానవమాత్రుడు జనస్థానములో పదునాల్గువేలమందిని అరగంట కాలములో ఒక్కడే చంపగలిగినాడంటే ఆతని సామర్ధ్యమేపాటిదో నీకింకా తెలియకపోవుట చిత్రముగా ఉన్నది,ఒక పెనుకోతి సంద్రముదాటి లంకకు వచ్చి మరల క్షేమముగా తిరిగి వెళ్ళగలిగినదంటే వారి శక్తిని నీవు సరిగా అంచనా వేయలేదు ...సీతమ్మను రాముని వద్దకు చేర్చు, సంధిచేసుకో  అని పలికిన వారి పలుకులు  ఏవీ ఆయన చెవికెక్కడములేదు.

.

 ఎందుకెక్కుతాయి మరి మృత్యుదేవత రమ్మని పిలిచేపిలుపు కైపెక్కించి ఆయనలో యుద్దపు కాంక్షను రగిల్చి వేస్తుంటే !

.

,ఒక్కటి మాత్రము నిశ్చయము సీతమ్మా!

 వాడు చావనిదే నిన్ను విడిచిపెట్టడు! వాని చావు రాముని చేతిలో వ్రాసిపెట్టి ఉన్నది ఇది తథ్యము అని సరమ పలుకుచుండగనే వానర సైన్యముల కదలికల వలన కలిగిన మహాధ్వని వారి చెవులకు సోకెను.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: