7, నవంబర్ 2024, గురువారం

Panchang


 

కర్మ తలుచుకుంటే

 *కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుందేమో*


ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది.


ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు.


దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది.


ఏమీ అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు.

 

ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.


అతడి పరిస్థితి తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు.


భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది.


భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు.


సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త.


వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది.


దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు.


జీవతం చాలా నేర్పిస్తుంది


నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది.


అహంకారం అసలు పనికిరాదు జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు.


ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.


మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది.☝️

కార్తీక పురాణం - 6,

 _


_*కార్తీక పురాణం - 6, వ. అ ధ్యాయము*_

>>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<                                        

 *దీపదానవిధి - మహాత్మ్యం*

*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


ఓ రాజశ్రేష్ఠుడా ! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని , శ్రీ మహావిష్ణువును , పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో , అట్టివానికి అశ్వమేథయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులనగా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి , వత్తులు చేయవలెను. వరిపిండితో గాని , గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి , ఆవునెయ్యి వేసి , దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి  నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు పటింపవలెను.


*సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |*

*దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||*


అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా , *"అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు , సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక !"* యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని , స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు , విద్యాభివృద్ధి , ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు .  దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.


*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


పూర్వ కాలమున ద్రవిడ దేశము నందొక గ్రామమున నొకస్త్రీగలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాల మునకే భర్త చనిపోయెను. సంతానము గాని , ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు , అక్కడనే భుజించుచు , ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు , దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.


ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ , తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని , దేవుని మనసార ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని , తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి , యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక , తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది.


అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి , మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి , ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి *"అమ్మా ! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు , సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము , మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి , దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి , అంధకారములో బడి నశించుచున్నాడు. కాన , నా మాట లాలకించి నీవు తినక , ఇతరులకు పెట్టక , అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి , పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి , వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతఃకాలమున నదీ స్నానమాచరించి , దానధర్మముల జేసి , బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"* వని ఉపదేశమిచ్చెను.


ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున *కార్తీకమాసవ్రతములో* అంత మహత్మ్యమున్నది.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.*


    *సర్వేషాంశాన్తిర్భవతు.*

69 ." మహాదర్శనము

 69 ." మహాదర్శనము "--అరవై తొమ్మిదవ భాగము-- అతి ప్రశ్నల ఫలము


69.  అరవై తొమ్మిదవ భాగము--  అతి ప్రశ్నల ఫలము


         మరుసటి దినము దేవరాతుని ఇంటికి రాజభవనము నుండీ రెండు పల్లకీలు వచ్చినాయి. ఒకటి ఆచార్య దంపతులకు , ఇంకొకటి భగవానుల దంపతులకు. వాటిని తెచ్చిన రాజపురుషులు భగవానులకు తెలియజేసినారు , " గోవులన్నీ నిన్ననే ఆశ్రమమునకు వెళ్ళిపోయినవి. అక్కడ ఈ దినము నుండీ కొట్టములు , పాకలు , ధాన్యములు , గడ్డి , గోదాములు , గాదెలు , మనుషులు , వారికి ఇళ్ళు , పశువులకు తాగునీటి భావులు అన్నీ చేయుటకు ప్రయత్నములు మొదలైనవి. 


భగవానులు కాత్యాయనిని పిలచి అన్నారు : " చూడు , నీ ఇఛ్చ ప్రకారము వేయి గోవులను దేవతలు ఇచ్చినారు. ఇంకేమి చేస్తావో చెయ్యి. " 


      ఆమె నవ్వుతూ అన్నది , " ఔను , మనము దైవ ద్రవ్యము వారము. మనకు దేవతలు ఇస్తే ఉంటాయి , లేకుంటే లేదు. సరే , ఇప్పుడు మీరు చెప్పేది నన్ను అక్కడికి వెళ్ళి వాటిని చూచుకొమ్మనా ? "


         భగవానులు ఆమె ప్రశ్నలో నున్న భావము తెలిసి నవ్వివారు: " ఇప్పుడు నిన్ను వెళ్ళమనుటకు అవుతుందా ? ఇక్కడ విద్వత్సభలో జరుగునదంతా నువ్వు చూడకపోతే ఎలాగు ? అలాగని , ఆశ్రమమునకు వచ్చిన గోవుల యోగక్షేమములను చూచుకొనుటకు నువ్వుకాక శక్తులు వేరెవ్వరు ? నీకు మంచి ధర్మ సంకటమే ప్రాప్తమయినది కదా ? " 


        " ధర్మ సంకటమేమీ లేదు. దేవతలు ఇచ్చిన ఈ వరము వలన నాకు ఏ విధమైన ఇబ్బందీ , ఆటంకమూ ఉండకూడదని ముందరే మాట అయినది. కాబట్టి రాజపురుషులే ఈ సభ ముగియువరకూ చూచుకొనునట్లు విధాయకము చేస్తే సరిపోతుంది. " 


" అలాగా ? ఉండవే , రాజపురుషులను అడుగుదాము"


     రాజపురుషుడు మరలా తెలియజేసినాడు: " కొట్టములు కట్టి వాటిలో పశువులను కట్టివేయు వరకూ అంతా మా బాధ్యత. వాటిని సరియైన స్థలములో కట్టిన తరువాత తమరి బాధ్యత. అలాగని , అప్పుడే అనుజ్ఞ అయినది. "


       కాత్యాయని సంతుష్టురాలై భగవానుల ముఖమును చూచినది. వారు, " నువ్వు బుద్ధిమంతురాలివి. దేవతలకు నీ స్వరూపము బాగా తెలుసు. కాబట్టి నీ ఇష్ట ప్రకారమే అంతా చేసినారు కదా ? "


" అదీ మీ కృపయే , ఇదీ మీ కృపయే " 


      అందరూ జ్ఞాన మంటపమునకు సకాలములో వచ్చినారు. రాజువచ్చి వందనము చేసి , " ఈ దినము మీరు కూర్చొని మాట్లాడవలెను. పృఛ్చకులు కూడా ఎదురుబదురుగా కూర్చొనే మాట్లాడుతారు " అని విజ్ఞాపన చేసినారు. 


       భగవానులు అన్నారు , " నిన్ననే నాకు అనిపించినది. శాస్త్ర విచారములో మాట్లాడునపుడు నిలుచుకొని మాట్లాడుట శ్రేయస్కరము కాదు. అయితే , నిన్నటి సందర్భములో దానిని నేనుగా నొక్కి చెప్పరాదు అని ఊరకున్నాను. ఈదినము మీరు చేసిన విధానము ఉచితముగా నున్నది, అటులనే " అన్నారు. 


        సభ ఆరంభమగుచుండగనే భగవానులు వేదికను ఎక్కివచ్చి ఒక ఆసనములో కూర్చున్నారు. సభనుండీ ఆర్తభాగుడు వచ్చి రెండో ఆసనములో కూర్చున్నాడు. ప్రశ్నోత్తరములు ఆరంభమయినవి. ఆర్తభాగుడు అడిగినాడు : " యాజ్ఞవల్క్యా , నేను ప్రశ్నలను అడుగవచ్చునా ? "


      " మీరు ప్రసిద్ధమైన జరత్కారు వంశపు వారు. ఋతభాగుల పుత్రులు. మీయంతటి విద్వాంసులు నన్ను ప్రశ్నలు అడుగుటయే ఒక గౌరవము. అటులే కానివ్వండి. సిద్ధముగా ఉన్నాను " 


" మృత్యువంటే ఏమి ? దానిని గెలుచుట అంటే ఏమి ? "


" మృత్యువు ప్రవృత్తి కారణము. ప్రవృత్తిలో ఆసక్తుడు కాకుండా నివృత్తిలో మనసును నిలుపుటయే మృత్యువును గెలుచుట. " 


" విశ్వమంతా బ్రహ్మమే అయినపుడు , విశ్వములో నున్నవారు ఎందుకు ప్రవృత్తిలో ఆసక్తులై ఉంటారు ? "


" ఒక్కొక్క వ్యక్తీ , గ్రహాతిగ్రహములచే నియమితుడై ఉన్నాడు. అందువలన. "


" అలాగయితే , ప్రవృత్తికారణములైన ఆ గ్రహాతిగ్రహములు యేవి ? అవి ఎన్నున్నాయి ? "


         " ఆర్తభాగా , ఆ గ్రహములు ఎనిమిది. వాటిని తమ పట్టులో ఉంచుకొన్న అతి గ్రహములూ ఎనిమిదే. వినండి : ఘ్రాణము ( నాసిక )  , జిహ్వ ( నాలుక )  , చక్షువులు  ( కన్నులు ), శ్రోత్రములు ( చెవులు ), హస్తములు , త్వక్ ( చర్మము ), వాక్కు , మనస్సు అనునవి గ్రహములు. ఇవన్నీ బహిర్ముఖములు ( బాహ్యముగా కనిపించేవి ). కాబట్టి ఇవి గ్రహములు. ఇవి ఎల్లపుడూ మనుష్యుని పట్టి లాగుతూ , బహిర్ముఖుని చేసి ప్రవృత్తి కారణములైనవి. వీటిని అలాగ చేయునట్లు నియమించినవి అతి గ్రహములు. అవీ ఎనిమిది. ఘ్రాణమును గంధము లాగును. జిహ్వను రసము లాగును. ఇటులే చక్షువులను రూపమూ , శ్రోత్రములను శబ్దమూ , హస్తములను కర్మలూ , త్వక్కును స్పర్శ, వాక్కును నాదమూ , మనస్సును కామమూ లాగుచుండును. అందువలననే గంధాదులను ఘ్రాణాదుల చేతనే గ్రహించునది. ఇవన్నీ శరీరములో ఉండి శరీరి( ప్రేతము ) ని ప్రవృత్తి పరుడగునట్లు చేసి , చివరికి తాము మృత్యువు వశమగును. " 


" ఇవన్నీ మృత్యువశమగునంటే , మృత్యువు ఏది ? అది ఎవరి వశమగును ? "


     " ఆర్తభాగా , లోకమంతా అన్నము-అన్నాదుడు అను రెండే భాగములై ఉన్నది. ఇవన్నీ మృత్యువుకు నోటి ముద్దలగునన్నాను కదా ? ఆ మృత్యువే అగ్ని. దానికి అన్నీ అన్నమగును. ఇలాగ , అన్నము- అన్నాదుడు విభాగమును తెలిసినవాడు మృత్యువును గెలుచును. "


" యాజ్ఞవల్క్యా , శరీరము మృత్యు వశమైనపుడు శరీరి( ప్రేతము ) ఏమవుతాడు ? వాడిని వదలి పోవునవి ఏవేవి ? అవి ఏమవుతాయి ? "


      " బాగా అడిగినారు., ఆర్తభాగా ! శ్రద్ధగా వినండి. శరీరము మృత్యు వశమైనపుడు శరీరి( ప్రేతము ) వేరుపడును. నామము ఒక్కటీ తప్ప మిగిలినవన్నీ తాము ఎక్కడెక్కడి నుండీ వచ్చినాయో అక్కడికి తిరిగిపోవును. ఇలాగ వాణి అగ్నిని , ప్రాణము వాయువును , చక్షువులు ఆదిత్యుని , శ్రోత్రములు దిక్కులను , శరీరము పృథివినీ , బుద్ధి ఆకాశమునూ , రోమ కేశములు ఔషధులూ వనస్పతులనూ , రక్త , బల , తేజస్సులు నీటిని , మనసు చంద్రునీ చేరును. " 


" అలాగయితే అప్పుడు ఆ శరీరి( ప్రేతము )కి స్థానమేది ? ఎక్కడుంటాడు ? "


       భగవానులు అదివిని నవ్వేసినారు : " ఆర్తభాగా , ప్రశ్న చాలాబాగుంది. మీరు అడిగిన ప్రశ్నలకన్నిటికీ ఉత్తరమును ఇచ్చుటకే కూర్చున్న నేను , ఈ ప్రశ్నకు ఉత్తరమిస్తే , ఈ సభలోని ఎవరో ఒక్కరైనా శరీరమును వదలవలసి వస్తుంది. అంతటివారు ఎవరు ? వారికి మీరు ఎట్టి రక్షణ నివ్వగలరు ? చెప్పండి. నేనయితే విఘటనాత్మక మయిననూ ఉత్తరము నిచ్చుటకు సిద్ధముగా నున్నాను. " 


      ( అనువాదకుని వివరణ : బ్రహ్మ జ్ఞానులు పాలుపంచుకొనే సదస్సులో యే విషయమైననూ అనుభవ , ప్రయోగ పూర్వకములుగా అనుభవించియో , ప్రదర్శించియో చెప్పినగానీ సార్థకత ఉండదు. కేవలము శాస్త్రపు మాట చెప్పిన అది ఒక సిద్ధాంతమగునే తప్ప ప్రయోగము కాదు. అలాగ ప్రయోగించుటకు ఎవరైనా ఒకరి  శరీరములోని భూతములు వేరై ఆత్మ యేమగునో చూపవలసి వచ్చును. ) 


          ఆర్తభాగుడి కనులు తెరచుకున్నాయి. " నేనెందుకు అడగరాని ఈ ప్రశ్నను అడిగినాను ? " అని అతడికి కంట నీరు వచ్చినది. భగవానులు అది చూచి కరుణావిష్టులై, " ఆర్తభాగా , అయినదేమో అయినది. ఫరవాలేదు. కావలసిన రక్షణను ఇచ్చుటకు నేను సిద్ధముగా ఉండగా మీకు బెదురెందుకు ? " అని ధైర్యము చెప్పి ఉత్తరము నిచ్చినారు :


          " మొదట రక్షణను ఇచ్చెదను. దేవతలు అగ్నిలో శ్రద్ధను హోమము చేసెదరు. దానినుండీ సోమము పుట్టును. ఆ సోమమును పర్జన్యుడను అగ్నిలో హోమము చేస్తే , వానలు వచ్చును. ఆ వానలను పృథివి యను అగ్నిలో హోమము చేస్తే అన్నము సంభవించును. ఆ అన్నమును పురుషుడను అగ్నిలో హోమము చేస్తే రేతస్సు అగును. ఆ రేతస్సును యోషిదగ్నిలో హోమము చేస్తే గర్భమై , అది శిశువగును. దీనిని మనసులో ఉంచుకొని మీ ప్రశ్నకు ఉత్తరమును వినండి. అంతా మరలిపోవు నపుడు శరీరి( ప్రేతము ) తన కర్మమును మాత్రము తీసుకొని చంద్రుని వద్దకు వెళ్ళును. అక్కడినుండీ పుణ్యము ఎక్కువగా ఉంటే పుణ్య శరీరమును, పాపము ఎక్కువ గా ఉంటే పాప శరీరమును పొందును. " 


( అనువాదకుని వివరణ : ఒకవేళ ఎవరైనా అటుల శరీరము నుండీ వేరు పడినచో , తిరిగి శరీరమును పొందు విధానమును తెలుసుకొనుటయే రక్షణ. )


          ఆర్తభాగుడు తానేమైనానో యని మొదట తనను పరీక్షించుకున్నాడు. అంగాంగములన్నీ స్వస్థానములో ఉండుట చూసి సంతుష్ట హృదయుడై, పులి చేతికి చిక్కిన హరిణి పరుగెత్తినట్లే , అక్కడ నుండీ లేచి పరుగెత్తినాడు. రెండు అడుగులు వెళ్ళిన తరువాత భగవానులకు నమస్కారము చేయలేదని గుర్తొచ్చి , వెనక్కు తిరిగి అక్కడి నుండే సాష్టాంగ ప్రణామము చేసి, దుర్దానమును తీసుకున్నవాడిలాగా ఎవరికీ చెప్పకుండా సభనుండీ వెళ్ళిపోయినాడు. 


Janardhana Sharma

Kartika Puranam - 5

 Kartika Puranam - 5


*అథ పంచమాధ్యాయ ప్రారంభః*


వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలయును. పుణ్యముచేత పాపము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసము విడచినట్లుగా పాపములను విడుచును. ఈమాసమందు తులసీ దళములతోను, తెల్లనివి, నల్లనివి అయిన అవిశపూలతో కరవీర(గన్నేరు) పూలతో హరిని పూజించినయెడల వైకుంఠమునకు బోయి హరితో గూడా సుఖించును.భగవద్గీతయందు విభూతి, విశ్వరూప సందర్శన అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును.


హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోక పాదముగాని, పురాణము చెప్పిన వారును, విన్నవారును కర్మబంధ విముక్తులగుదురు. కార్తీకమాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును.


ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు, చండాలురయొక్కయు, పాపాత్ములయొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచవంతులయొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీకమాసమునందు వనభోజనము ఆచరించవలయును.


అనేక జాతి వృక్షములతో గూడిన వనమందు ఆమలక(ఉసిరిక) వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలెను.ఇట్లు కార్తీకమాసమందు వనభోజనము చేసినయెడల ఆయాకాలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును.కాబట్టి తప్పక ఈమాసమందు వనభోజనమాచరించ వలయును.కార్తీకమహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మనుండి విముక్తుడయిన కథ చెపుతాను వినుమని వశిష్ఠుడు జనకమహారాజుకు ఈ విధంగా చెప్పెను.


కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారంగతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రి, “నాయనా! నీకు పాపములు నశించెడి ఒక మాటను చెప్పెదను.కార్తీకమాసమందు ప్రాతః స్నానము చేయుము.సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుమ” అని చెప్పెను.


ఇలా తండ్రిచెప్పిన మాటలను విని కుమారుడు, “కార్తీకమాస ధర్మమనగా ఏమి? ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు”అని సమాధానమిచ్చెను. ఆమాట విని తండ్రి, “ఓరి దుర్మార్గుడా! ఎంతమాట అన్నావు!నీవు అరణ్యమందు చెట్టుతొర్రలో ఎలుకవై పుట్టి ఉండుమని” శపించెను.


తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాప పడి, “దురాచారుడనైన నాకు శాపవిముక్తి ఎట్లు కలుగును?” అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లనెను. “కుమారా! ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని” చెప్పెను.


తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో, కుమారుడు అరణ్యమందు ఎలుక అయ్యెను.చెట్టుతొర్రలో నివసించెను.అది అనేక జంతువులకు ఆధారమైనది.ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీకస్నానమాచరించి ఆ వృక్షముయొక్క మొదట కార్తీకమహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను.


అంతలో దురాచారుడును, హింసకుడును అగు ఒక కిరాతుడును వేటనిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, “అయ్యా! ఏమిటి? ఈపనివల్ల ఏమిఫలము?” అని అడిగెను. “కిరాతా! వినుము చెప్పెదను. నీబుద్ధి మంచిదైనది. ఇది కార్తీకధర్మము.ఈధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీకమాసమందు మోహము చేతనైనను స్నాన,దానాదికమును చేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠమును చేరును.ఈమాసమందు భక్తిశ్రద్ధలతో కూడినవాడై స్నాన దానాదివ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును”.


విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచ దేహమును విడిచి విప్రుడయ్యెను.


విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమునొందెను.తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికిబోయెను.


కిరాతుడును మూషిక దేహత్యాగమును బట్టి కార్తీకవ్రత ఫలమును, తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము చేరెను.


సుగతిని కోరువాడు కార్తీకమహాత్మ్యమును వినవలెను.విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెదరు.విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను.కాబట్టి కార్తీకవ్రతము తప్పక ఆచరించదగినది.ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా! నీవును పురాణములందు బుద్ధినుంచుము.అట్లయిన యెడల పుణ్యగతికి పోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు నిశ్చయము.


*ఇతి స్కాంద పురాణే కార్తీకమహాత్మ్యే పంచమోధ్యాయస్సమాప్తః*

68. " మహాదర్శనము

 68. " మహాదర్శనము -- అరవై ఎనిమిదవ భాగము --ప్రతిఘటన


68.  అరవై ఎనిమిదవ భాగము--  ప్రతిఘటన



          చివరికి విద్వత్సమూహములో కూర్చున్న ఒకడు లేచినాడు. అందరి దృష్టీ అతని మీదే కేంద్రీకృతమైనది. కట్టుకున్న మడి ధోవతి ఆతని హృదయ పరిశుద్ధతను తెలియజేస్తున్నది. చేతికున్న పవిత్రమూ , కప్పుకున్న అజినోత్తరీయమూ ఆతని గురిని ఉద్ఘోషిస్తున్నవి. ముఖము పై తేజస్సు , యజ్ఞేశ్వరుడే ఈ రూపముతో వచ్చినాడా అన్నట్లుంది. చూడగా ,  భగవానులు !! భగవాన్ యాజ్ఞవల్క్యులు. 


         సభను ఆవరించిన మౌనాన్ని పగలగొట్టి , మేఘజాలమును ఛేదించుకొని వచ్చు ఉరుము గర్జన వలె ఆతని గొంతు మ్రోగింది. దూరంగా కూర్చున్న శిష్యుడిని పిలచి , " ఈ గోగణమును మా ఆశ్రమమునకు తోలుకొని వెళ్ళు " అన్నారు. గొంతులో గాంభీర్యము తొణికిస లాడుతుండినది. తానే ఎక్కువ అన్న అహంకారము ఉండలేదు. ఆతని ముఖములో కూడా అంతే! ప్రశాంతత నిండి ఉంది. ఏకాంతములో అగ్నిహోత్రము చేసి , కర్మ సాద్గుణ్యమైనది అను నమ్మికతో నిండిన భావము అక్కడ తానేతానై యున్నది. 


       సభ , భగవానుల ప్రకటనను అన్నివిధములా అంగీకరించినది. అదేమిటో ఏమోగానీ , అంతవరకూ వారిని చూడనివారు కూడా వారి తేజస్సుకు అమ్ముడు బోయినారు. అందరికీ , ఇతడిప్పుడు సర్వజ్ఞ పదవికి అర్హుడు అనిపించినది. అందరూ హర్షముతో చేతులెత్తి చప్పట్లు కొట్టినారు. 


          ఉన్నట్లుండి విద్వత్సభ వైపునుండీ ఆర్భాటమైన ఒక  గర్జన వినపడింది. అందరి దృష్టీ అటువైపు మరలింది. రాజపురోహితుడైన అశ్వలుడు లేచి నిలుచున్నాడు. ముఖము ఎర్రనై ఉంది. అతనికయిన ఆశాభంగము ఆతనికి కోపమును తెప్పించినది అన్నది స్పష్టముగా కనబడు చుండినది. అదీగాక , తాను రాజపురోహితుడనన్న అహంకారము ముఖములో యెత్తి కనబడుతున్నది.  


          ఆతడు భగవానులను మాట్లాడించినాడు. తన మనసును దాచుకోనట్లు,   ఆతని మాటనుండే ఆతని భావము వ్యక్తమగుచుండినది . : " యాజ్ఞవల్క్యులవారూ , ఇప్పుడు తమరాడిన మాట ఏమిటి ? అర్థము చేసుకున్నారా ? ఆ గోగ్రహణముతో మీరు మమ్మెల్లరనూ తిరస్కరించినట్టయింది. తమరే మనందరిలో బ్రహ్మిష్ఠతములు అని చెప్పుకున్నట్టయింది. " 


          భగవానుల ముఖముపై నున్న గంభీరభావము వికసించి మందస్మితమైనది. అటులే సన్నగా నవ్వుచూ , " బ్రహ్మిష్ఠతములైన వారెవరో వారికి మాది కూడా ఒక నమస్కారము. ఇప్పటికి మేము గోవులను ఆకాంక్షించు వారము " అన్నారు. 


          అశ్వలుడు అన్నాడు , " ఆ గోవులు మనలో బ్రహ్మిష్ఠ తములకు కానుక యని మీకు తెలుసు కదా, వాటిని ఆకాంక్షించి వాటిపై అధికారము మీదే యని చెప్పినట్లాయెను.  ఈ కార్యము వలన మాలో ఎవరు కావాలన్నా , తమను ఏమికావాలన్నా అడుగవచ్చును అన్నట్టయింది " 


       " బ్రహ్మవిచారమై ఏమికావాలన్నా అడగవచ్చును. అది ఈనాడు ఈ కార్యము వల్ల మాత్రమే అయినది కాదు, ఎప్పుడు కావాలన్నా అయి ఉండవచ్చును. " 


" అయిన , అడగవచ్చునా ? "


" దానికేమి సందేహము ? "


" అయితే చెప్పండి , అంతా తానే అయి ఉన్న మీ బ్రహ్మకూ , మాకూ వ్యత్యాసము ఏమిటి ? " 


         " మీరు చెప్పినది ఎంతో సరిగా ఉన్నది. అయితే , ఈ బ్రహ్మము ,మాది , మీది అని కాదు. బ్రహ్మము బ్రహ్మది. ఇక , దానికీ మనకూ వ్యత్యాసము అనుకున్నదాని సంగతి. అది  , అనగా ఆ వ్యత్యాసము అవిద్యా కామ కర్మల నుండీ కలిగినది. కాబట్టి , తాను వేరే అనుకొన్న సర్వమూ మృత్యువశమగును. ఆ మృత్యువును దాటినది బ్రహ్మ.  అదగుట ముక్తి. "


" మీమాట ప్రకారము ఇదంతా మృత్యువశము , కదా ? "


" ఔను "


’ అట్లయిన , ఈ యజ్ఞమును చేయు యజమానుడు ముక్తిని పొందుట , అతిముక్తుడగుట ( ముక్తిని మించినవాడగుట )  ఎటుల ? " 


        " యజమానుడు కర్మ ఫలము కావలెనని ఆశిస్తూ ( ఆశించినచో ) మృత్యువశుడగును. అలాగ కాక , అధ్యాత్మమైన ( పరమాత్మ ) తన ప్రాణమే అధిభూతమైన ( పరబ్రహ్మ )  హోతృడు అని తెలిసి చేసినచో  అదే , అధి దైవమై ( దేవతల దైవము )  అగ్ని, యనగాచేసిన కర్మము అధియజ్ఞమగును ( అన్నిటికన్నా గొప్ప యజ్ఞము ).  పరిఛ్చిన్నమైన ( తాము వేరు వేరని భావనతో నున్న )  ఈ సాధనము అప్పుడు  అపరిఛ్ఛినమై ముక్తినిస్తుంది. అదే అతిముక్తి. ." 


" మంచిది , కర్మరూపమైన మృత్యువును దాటుటెట్లో చెప్పితిరి. ఇక కాలరూపమైన మృత్యువును దాటుటెట్లు ? అది చెప్పండి. " 


       " కాలము నియతము , అనియతము అని రెండు రూపములుగా ఉంటుంది. అనియత కాలము అహోరాత్ర స్వరూపమైనది. నియతకాలము తిథి పక్షాది రూపమైనది. మీరు అడిగేది దేనిని ? " 


" రెండూ చెప్పండి "


         " సరే , యజమానుని చక్షువులున్నాయి కదా , అవి అనియత కాలమును చూపించును. దానిని,  అధ్యాత్మ వలన అధిభూతమైన అధ్వర్యుడు , అధి దైవమైన ఆదిత్య రూపముగా భావించుట చేత చేసిన కర్మ అధియజ్ఞమై కాలమను మృత్యువును ,  అనియత స్వరూపమును దాటును. 


       ఇక యజమానుని ప్రాణమున్నది కదా , దానిని,  అధ్యాత్మ వలన అధిభూతము చేసి ఉద్గాతృడిని చేసుకొని అక్కడినుండీ అధిదైవమును చేసి వాయువును చూసిన ,  కర్మము అధియజ్ఞమై కాలపు నియత స్వరూపమైన తిథి పక్షాదులను అతిక్రమించి మృత్యువును దాటును. " 


" సరే , ఇదంతా కర్మ ఫలము వద్దన్న వాడి సంగతి. కర్మఫలమును కావాలనువాడు తన స్వర్గమును ఎటుల పొందును ? "


      " అంతరిక్షము నుండీ !   ఫలము కావాలనునదీ , వద్దన్నదీ మనసు చేత. ఆ మనస్సును యజ్ఞ రక్షకుడైన బ్రహ్మ గా చేసి , చంద్రుని అనుసంధానము చేస్తే , అంతరిక్షము దారి ఇచ్చి , స్వర్గమును చూపించును. "



(  అనువాదకుని వివరణ :  యజమాని ( కర్త ) తాను చేయు ప్రతి యజ్ఞము / కర్మ  లోనూ , తన ప్రాణమును పరమాత్మ యైన పరబ్రహ్మ  ( అనగా అధిభూతము ) గా మార్చి ,  క్రమముగా హోతృడు , అధ్వర్యుడు , ఉద్గాతృడు , బ్రహ్మ ల పాత్రలు వహించి కర్మ చేయవలెను. దీనినే మనకు అర్థమగునట్లు చెప్పవలెనన్న , ఈ హోతృడు , అధ్వర్యుడు , ఉద్గాతృడు , బ్రహ్మ రూపములలో  నలుగురు ఋత్త్విజులు కర్త పరముగా యజ్ఞము చేయుదురు.  వీరు ఒక్కో వేదమునకు ప్రతినిధులుగా యజ్ఞమును పూర్తి చేయుదురు.  యజ్ఞమును కర్మ ఫలము ఆశించి చేస్తే , మృత్యువశుడగును , అనగా , కోరికలు తీరుట వలన మరలా కొత్త కోరికలు పుట్టుచూ , వాటిని తీర్చుకొనుటకై  కర్మ ఫలము వలన జన్మలు ఎత్తుతూ మరణిస్తూ ముక్తికి దూరమగును.  యజ్ఞమును కర్మ ఫలము ఆశించకుండా  చేస్తే అది ’ అధి యజ్ఞమై,’ ముక్తినిచ్చును.  


       ’అధియజ్ఞము ’ చేయుట అనగా, కర్త, తాను హోతృడై తన ప్రాణమును అగ్నితోనూ , అధ్వర్యుడై తన చక్షువులను ఆదిత్యుడితోనూ , ఉద్గాతృడై తన ప్రాణమును వాయువుతోనూ , బ్రహ్మయై తన మనసును చంద్రునితోనూ అనుసంధానము చేయవలెను. 


        దీనినే మనకర్థమగుటకు ఇలాగ చెప్పవచ్చును. అధియజ్ఞముగా చేయుటకు ఒక్కో ఋత్త్విజుడు చేయవలసినది యేమనగా , తన ప్రాణమును పరమాత్మ రూపములైన అగ్ని, వాయు , ఆదిత్యులుగా తెలుసుకొని ( భావించి , ) అనగా ,  ఋగ్వేదమునకు ప్రతినిధిఅయిన  హోతృడు తన ప్రాణమును అగ్ని తోనూ , యజుర్వేదమునకు ప్రతినిధియైన అధ్వర్యుడు తన చక్షువులను ఆదిత్య రూపముతోనూ , సామవేద ప్రతినిధియైన ఉద్గాతృడు తన ప్రాణమును వాయువుతోనూ , బ్రహ్మ స్థానములో నున్నవాడు తన మనసును చంద్రుడితోనూ అనుసంధానమూ చేసి తానే పరమాత్మయన్న భావనతో చేసే యజ్ఞము అధియజ్ఞమగును. ) 



          అశ్వలుడు తబ్బిబ్బైనాడు. బంధకమై , మృత్యురూపమైన కర్మ , కాలములను రెంటినీ దాటుటెలాగో భగవానులు ఎరుగుదురు. అలాగే కర్మ ఫలము ఎలాగ వచ్చును అన్నదీ ఎరుగుదురు. అనగా , శ్రేయస్సు ప్రేయస్సులు రెండింటీనీ తెలిసినవారు. ఇంతటి వాడి దగ్గర తానేమి వాదము చేయగలడు ? సగము తెలిసి సగము తెలియని వాడి దగ్గర వాదము చేసి గెలుచుకోవచ్చును. అన్నీ తెలిసినవాడి దగ్గర వాదమనగానేమి ? పులితో సరసమాడినట్లు కాదా ? వదిలేస్తే చాలుదేవుడా అనిపించినది. ప్రశ్న అడగకుండా ఉండుటకు లేదు  , ఏమి అడగవలెనో తెలియదు. ఇటువంటి దిగ్భ్రాంతిలో ఏదో అడిగివేసినాడు, 


" యజ్ఞములో ఋత్త్విక్కులు ఏమేమి చేయుదురు ? ఆయా కర్మలవలన యజమానునికి ఏయే ఫలములగును ? "


          ఆ ప్రశ్నను అడగగనే అందరికీ అశ్వలుల దిగ్భ్రాంతి తెలిసిపోయింది. భగవానులు నవ్వుతూ అన్నారు, " హోతృడు మూడు జాతుల మంత్రములను ఉపయోగించును, అవి : పురోనువాక్యములు , యాజ్యములు, శస్యములు అనునవి. యజ్ఞానికి ముందు చెప్పు మంత్రాలన్నీ పురోనువాక్యములు. యజ్ఞకాలములో చెప్పు మంత్రములన్నీ యాజ్యములు. యజ్ఞమైన తరువాత చెప్పునవన్నీ శస్యములు. దీనివలన యజమానుడు , ప్రాణము ఎక్కడెక్కడ ఉంటుందో , ఆ లోకముల నన్నిటినీ జయించును. 


         " అధ్వర్యువు మూడు జాతుల ఆహుతులను ఇచ్చును. మంట వలె పైకి లేచునవి  , అతిగా శబ్దము చేయునవి , కిందకు పడునవి. జ్వలించు ఆహుతుల వలన యజమానుడు దేవలోకములను గెలుచును. సశబ్దములైన ఆహుతుల వలన సశబ్దమైన పితృలోకములను గెలుచును. కిందకు పడు ఆహుతులవలన మనుష్యలోకములను గెలుచును. 


         " ఉద్గాతృడు మూడుజాతుల సామములను పాడును. యజ్ఞారంభమునకు ముందువి , యజ్ఞ కాలమునందు పాడునవి , యజ్ఞమైన తరువాత పాడునవి అని. వాటినే అధ్యాత్మముగా చూచినచో, అవి ప్రాణాపాన వ్యానములగును. వాటి వలన మనుష్యలోకము , అంతరిక్షలోకము , ద్యులోకములను గెలుచును. 


        " బ్రహ్మ ,  యజ్ఞమును మనస్సుతో రక్షించును. మనస్సు అనంతమైనది. అనంతము విశ్వే దేవతలను సూచించును. కాబట్టి , విశ్వేదేవతల వలెనే అనంతములైన లోకములను గెలుచును. " 


అశ్వలుడు ఇంకేమీ అడుగుటకు కనపడక , చేతులు జోడించి కూర్చున్నాడు. ఆనాటి సభ అక్కడికే ముగిసింది. 

Janardhana Sharma

67. " మహాదర్శనము

 67. " మహాదర్శనము--అరవై యేడవ భాగము -- జ్ఞాన సత్రము


 67.  అరవై యేడవ భాగము--  జ్ఞాన సత్రము



          జ్యేష్ఠ శుద్ధ సప్తమి వచ్చినది. దానివెనుక ఎనిమిది దినములనుండీ రాజధానిలో ఒకటే కలకలము. కోలాహలము. సంభ్రమము. పదిమంది దేశాధిపతులు వచ్చినారు. ఒక్కొక్కరినీ రాజే స్వయముగా వెళ్ళి మంగళవాద్యాది పరివారములతో పిలుచుకొని వచ్చి ఒక్కొక్క భవనములో దింపినాడు. అటులనే విద్వాంసులు పల్లకీలలోనూ , మేనాలలోనూ శిష్యులతో పాటు వచ్చినారు. వారినందరినీ రాజపురుషులు పిలుచుకొని వెళ్ళి నియమిత స్తలములలో దింపినారు. 


         జ్ఞాన సత్రము ఒక జాతరవలె అయినది. దానిని చూడవలెనని జనాలు మూగుతున్నారు. " మా జన్మలో మనము ఇంతమంది విద్వాంసులను ఒక్కచోటే ఇలాగ చూచుట సాధ్యము కాదు. " అని వచ్చినవారెందరో. " జ్ఞాన సత్రమంటేనేమి , చూడవలెను " అని వచ్చినవారెందరో. అన్నిటికనా ఎక్కువగా , ’ ఇదొక వినోదము, చూడవలెను ’ అని వచ్చినవారు అసంఖ్యాకులు. మొత్తానికి రాజధాని నిండిపోయినది. ఎక్కడ చూచిననూ జనము. ఇళ్ళలో జనము , వీధులలో జనము, చెట్లకిందా జనాలు , బయలు లోనూ జనాలు. ఎక్కడెక్కడ చూచినా జనమే జనము. 


         వెనుకటి రోజే రాజు వెళ్ళి విద్వాంసులలో అగ్రగణ్యులైన వారిని చూసి వచ్చినారు. బ్రహ్మవాదిని యైన గార్గి , శ్రౌతములో ప్రసిద్ధులైన అశ్వలుడూ వెంట ఉన్నారు. శ్రౌతములో ప్రఖ్యాత విద్వాంసులైన ఆర్తభాగుడూ , భుజ్యులూ , బ్రహ్మవాదులైన ఉషస్తుడు , కహోళుడు , ఉద్ధాలకులు , విదగ్ధులనూ చూసి వచ్చినారు. విదగ్ధుడు రాజును అడిగినాడు, " ఏమిటి ? మీరు అప్పుడే మీ సర్వజ్ఞులను వరించినారంట ? "


         రాజు సహజమైన వినయముతో అన్నారు : " అటువంటిదేమీ లేదు. మా రాజ్యములో యాజ్ఞవల్క్యులు కర్మ బ్రహ్మలు రెంటిలోనూ ప్రసిద్ధి చెందిన విద్వాంసులు. అంతేగాక ఆనువంశికముగా వచ్చిన పాండిత్యమున్నవారు. కాబట్టి నేనే వెళ్ళి పిలుచుకొని వచ్చినాను. " 


       విదగ్ధుడు విస్మితుడై అన్నాడు : " దానిలో తప్పేమీ లేదు. చెవి విన్నదానిని నోరు అడిగింది, అంతే! దీనిపైన , విద్వద్బృందపు పరముగా గార్గి ఉన్నారు , మీ వారే అయిన అశ్వలులున్నారు. ఒకవేళ ఇలాగ మీరు సర్వజ్ఞాభిషేకము  ఫలానా వారికి కావలెనని నిర్ణయిస్తే వారు ప్రతిఘటించకుండా ఉంటారా ? "


        గార్గి అన్నది , " లేదు గురువుగారూ , సర్వజ్ఞత్వము మీ ఇద్దరిలో అంటే , మీరు , యాజ్ఞవల్క్యులు ఇద్దరిలో ఒకరికి కట్టి ఉంచబడిన సొత్తు. "


        " ఇది మీ అభిమానముతో చెప్పు మాట. ఆతనికి దేవతా ప్రసాదము చాలా ఉంది. ఆతడే సర్వజ్ఞుడైతే విశేషమేమీ లేదు. దానికై మేము సంకట పడునది కూడా లేదు. ఒక సంహిత , ఒక బ్రాహ్మణము, ఒక ఉపనిషత్తు పొందుట అంటే సామాన్యమా ? కానీ ఇంత అయిననూ మాకు అతడిని ఎదురించుటకు బెదురేమీ లేదు. ఏమి గార్గి , మీరేమంటారు ? మీరు ఆతని వెంట తీర్థయాత్రకు వెళ్ళినవారు. ఆతని విద్యా వైభవమును చూచి మొదటే ఓడిపోయినారా యేమి ? "


’ ఎంతైనా నేను మీ శిష్యురాలిని. ఆతనికి విద్యానుగ్రహము కావలసినంత ఉన్నదని ఒప్పుకున్ననూ , సమయము వస్తే నేను కూడా ఎదుర్కోవచ్చును. " 


        " భలే! భలే! చూడండి , ఎంతచెప్పినా , మానుషము రజోగుణ స్థానము. సమయము వచ్చినపుడు గర్జించుటయే స్వభావము. వశవర్తిని యైన భార్య కూడా ఒక్కొక్కసారి ఎదురు తిరగదా ? అందులోనూ మేము విద్వాంసులమని అహంకారము. మేము ప్రతిఘటించకుండా ఉంటే అదొక అవమానము. విద్యాదేవికి అది ద్రోహము చేసి నట్లగునని శంక. ఇవన్నీ చేరి మమ్ములను ప్రతిఘటించు నట్లు చేస్తాయి. అయితే , మా అభిమానము రాగ ద్వేషముల పట్టుకు చిక్కి , దురభిమానులమైతే మేమే చెడిపోతాము. అది సరే , పాండిత్య కిరీటమును అందరూ చూచినారా ? " 


         రాజు అన్నాడు: " పాండిత్య కిరీటము శారదా మంటపములో అందరికీ కనబడునట్లు ఉంచబడినది. అయితే అదేమీ గొప్పది కాదు. కానీ ఆ గోధనమును చూస్తే ఎంతటి అపరిగ్రాహికి అయినను మనసు లాగుతుంది. వివరాలన్నీ నేనే చెప్పరాదు. కాబట్టి అనుజ్ఞ అయితే అశ్వలులు చెప్పెదరు " 


         " చెప్పండి అశ్వలులవారూ! మీ భాషణము విని చాలా దినములయినది. పైగా , మీరేమి , సామాన్యులా ? తెచ్చుకుంటే వరము , ఇచ్చుకుంటే శాపము అనునట్టి విద్వద్వరేణ్యులు. ఏమి చేయుట ? మా అందరి దురదృష్టము. మీరు బ్రహ్మవిద్య వైపుకు గమనము సారించలేదు. మీ సర్వస్వమునూ శ్రౌతమునకే ధారపోసినారు. సరే , మీ పురోహితులు భార్గవులెక్కడ ? "


        " వారు రాజ పౌరోహిత్యమును వదలి ఇప్పుడు యాజ్ఞవల్క్యుల ఆశ్రమములో తపస్సుకు కూర్చున్నారు. అంతే కాదు , యాజ్ఞవల్క్యుల అగ్నులను తాను చూసుకుంటానని చెప్పి , మైత్రేయి గారిని పంపించినారు. "


" ఆమె యాజ్ఞవల్క్యుల మోక్షపత్ని కదా ? "


" ఔను "


      " సంతోషము. అంతటి బ్రహ్మవాదిని రాకుంటే మీ సభకు కాంతి ఎక్కడిది ? ఏమి గార్గీ ? ..సరే , అశ్వలులు ఏమో చెపుతారన్నారు కదా ? "


          అశ్వలుడు చెప్పినాడు, : ఒక వేయి గోవులు. వత్సములతో కూడిన వాటితో పాటూ రాజభవనపు ఇరవై అయిదు ఆబోతులు. వీటిని కట్టివేయుటకు కనీసము యజ్ఞమంటపానికి రెండింతలున్న ఆ ఎదురుగా ఉన్న తోపులో స్థానము ఏర్పాటు చేసినాము. ఆ మందను చూస్తేనే చాలు. కనులు చెదరి పోతాయి. వాటినన్నిటినీ కడిగి , పసుపూ కుంకుమా పెట్టిన తరువాత ఇక చెప్పవలసినదేమి ? అంతేకాక ఒక్కొక్కదానికీ పైన కప్పుటకు జరీతో కూడిన ఒక్కొక్క జలతారు వస్త్రము. కాళ్ళకు , కొమ్ములకూ వెండి మువ్వలు , కుప్పెలు , మెడకు ఇత్తడి పట్టీ , ముఖానికి జలతారుతో చేసిన కడ్డీలు గల  ముఖవాడము , వీటన్నిటికీ మించి రెండు కొమ్ములకూ ఐదైదు మను సువర్ణములు. ఒక్కొక్కదానికీ పాలు పితుకుటకు ఒక చిన్న పాత్ర ,  ఒక బిందెడైనా పాలు పట్టు మరియొక పెద్ద పాత్ర. వాటికి కావలసిన మనుషులు , తిండిగింజలు, పత్తి గింజలు , పచ్చిగడ్డి, ఎండు గడ్డి,  తవుడు , గానుగ చెక్క . ఇంతేనా , ఆ సువర్ణాలే పదివేలవుతాయి. "


" మను సువర్ణములు అంటేనేమి ? "


        అశ్వలుడు మహారాజు ముఖాన్ని చూసి , అనుమతి పొంది , నిక్షేప లాభపు వృత్తాంతమంతా చెప్పినాడు. " ఆ సువర్ణము ఒక్కొక్కటీ మూడు వేళ్ళ వెడల్పు ఉండి , మన సువర్ణములు దానితో ఇరవై అయిదవుతాయి. " 


" అంత భారీ సువర్ణమా ? "


          " రేపు తమరే చూస్తారుగదా ? ఇంకొక విశేషము , ఆ పశువులను తీసుకొని పోవుటకు లేశమైననూ కష్టము , ఖర్చు , దుఃఖమూ కారాదని , వాటికి కావలసిన కొట్టములు , పాకలు , వాటిని చూచుకొను మనుషులకు గృహములు , వాటికి ఒక సంవత్సరమునకు కావలసిన ధాన్యము , మేతలను నింపి యుంచుకొనుటకు గోదాములు,  గాదెలూ , చివరికి వాటిని కట్టియుంచుటకు గూటములను, సర్వమునూ మహారాజుగారే సొంత వెచ్చముతో కట్టించి ఇస్తారు. " 


       " కానుక అంటే అలాగ ఉండవలెను. మహారాజులు ఇలాగ చేయించుట బహు సమంజసముగా నున్నది . చివర , సర్వజ్ఞాభిషేకపు నాడు ఈ దేశాధిపతులు ఇచ్చు కానుకలూ చేరుతాయి. అన్నీ చేరి అయిదు లక్షలు కావచ్చునా ? "



" హెచ్చుతక్కువగా అక్కడికి రావచ్చును. "


         విదగ్ధుడు సంతోషముతో తలయూపినాడు. " చాలా బాగుంది. ఈ జ్ఞాన సత్రములో, లేదా జ్ఞాన పణ ద్యూతములో గెలిచినవాడు నిస్సందేహముగా , నిరాలోచనగా  రెండు మూడు తరాలు సుఖముగా ఉండవచ్చును. అలాగ చేసిన విద్య తప్పక పెరుగును , రాణించును. ఇది ఎంతో బాగున్నది. " అన్నాడు. 


       సప్తమి నాడు విద్వాంసులు , దేశాధిపతులు , పుర ప్రముఖులు , అతిథులు , ఆహ్వానితులు , రాజాధికారులు , మొదలగు అందరూ మధ్యాహ్నాత్పరము సవాహనులై దయచేసినారు. చివరగా భగవానులు తల్లిదండ్రులను పల్లకిలో కూర్చో బెట్టుకొని తామూ , తమ ప్రధాన శిష్యుడు కణ్వుడూ ముందరి కొమ్ములనూ , మైత్రేయీ కాత్యాయనీ వెనుకటి కొమ్ములనూ భుజాలకు ఎత్తుకొని ఇంకొక ప్రధాన శిష్యుడైన మాధ్యందినుడు పల్లకీ ముందర బెత్తమును పట్టుకొని , జ్ఞాన మంటపమునకు సాగుతూ వచ్చినారు. ఆచార్యుని తేజస్సు విజృంభిస్తున్ననూ , భగవానుల తేజస్సు దానికి మూలముగా ఉన్నట్లు ఉండినది. 


          భగవానుల నిరీక్షణలో నున్న మహారాజుకు ఇది తెలిసింది. " హా!  హా!  " అని పరుగెత్తి వెళ్ళి , భగవానుల బదులు తామే పల్లకీని భుజాని కెత్తుకున్నారు. ఆతని వెంట పరుగెత్తి వచ్చిన మంత్రి, దళపతి , కోశాధికారులు మిగిలిన కొమ్ములను పట్టుకున్నారు. ఆచార్యుడు తాను ఇంకా పల్లకీలో కూర్చొని యుండుట సమంజసము కాదని , ఎవరెంత బలవంతము చేసిననూ వినక , కిందకు దిగినాడు. భగవానులు సపత్నీ శిష్యులై తల్లిదండ్రులను ముందుంచుకొని వచ్చినారు. మేస్త్రీ ముందర బెత్తమును పట్టుకొని నడుస్తుండగా , అతని వెనుక రాజు , మంత్రి , దళపతి , కోశాధికారులు  దేవరాత కుటుంబమునకు దారి చూపిస్తూ పిలుచుకు వచ్చినారు. 


మహారాజులు స్వయముగా వెళ్ళి పిలుచుకొని వచ్చినారు , వచ్చిన వారెంతటివారో యని మంటపానికి మంటపమే లేచి నిలుచుంది. విదగ్ధ శాకల్యులకు మాత్రమే కాళ్ళు కడిగిన మహారాజు , ఆచార్య దంపతులకూ , భగవానులకూ , వారి పత్నులకు కూడా కాళ్ళు కడిగినారు. వారందరూ వచ్చి విద్వత్సభలో తమతమకు కేటాయించిన స్థానములలో కూర్చున్నారు. భగవానులు తండ్రికి సరిసమానముగా కూర్చోక , తమ ఆసనమును కొంచము అడ్డముగా తిప్పి కూర్చున్నారు. సభవారు, వారు యాజ్ఞవల్క్యులని తెలిసి ఉపశాంతులై , వారి తేజస్సును చూసి బహు సంతోషించినారు. అందరూ యథావిధిగా ఉపస్థితులైన తరువాత , సుశ్రావ్యమైన స్వాగత సంగీతమైన తరువాత, రాజు వేదిక పైకి వచ్చి , సభాపూజను నెరవేర్చినారు. సభలోనున్నవారికి భయభక్తులతో అన్నారు: " సర్వ సన్మాన్యులైన విద్వద్వరేణ్యులకు నమస్కారములు. జ్ఞానసత్రమును ఆరంభించుటకు తమరి అనుమతిని వేడుకుంటున్నాను. ఏ జన్మలో నేను చేసిన పుణ్యము పరిపక్వమైనదో తామందరినీ , తమంతటి వారికి ఆశ్రయము నిచ్చిన ఈ దేశాధిపతులనూ ఒకచోట చూచే సుయోగము నాకు లభించినది. ఇక నేను తమకు రెండు అంశములను విజ్ఞాపించు కొనెదను. ఈ మహాసభ , యే మహాత్ముడిని సర్వజ్ఞుడని నిర్ణయించునో , ఆతనికి ఈ పాండిత్య కిరీటమును కట్టబెట్టి సర్వజ్ఞాభిషేకమును చేయుట, రెండోది , ఈదినము తామందరూ వచ్చునపుడు , ఆ దిన్నె పక్కగా నున్న తోపులో కట్టిన వేయి గోవులను చూచినారు కదా ? అవన్నీ సాలంకృతములు , సోపస్కరములు , సపరివారములు. వాటిని తమలో బ్రహ్మిష్ఠులు ఎవరో , వారు తీసుకొనవచ్చును. "


అక్కడ కూర్చున్న విద్వాంసులు ఎన్నో సభలను ఎదిరించినవారు. కీర్తి సంపన్నులు. విద్యా వైభవమున్నవారు. అయినా , వారందరికీ ఈ సభ ముందర నిలచి నేను బ్రహ్మిష్ఠతముడను యని చెప్పుకొనుటకు ధైర్యము చాలలేదు. అందరూ గోవులను కోరిననూ, అవి మాకు కావలెను అని చెప్పలేక పోయినారు. ఎందుకో అందరికీ మనసులో జంకు కలిగింది. విద్యాకీర్తులలో పెద్దవారు కురు పాంచాలులు . వారిలోనూ పరమ శ్రేష్ఠుడు విదగ్ధశాకల్యుడు. అతడు కూడా ఎందుకో లేచి నిలబడుటకు సిద్ధము కాలేదు. 


రాజు మరలా వేదికపై నిలచి , ముందు చెప్పినదే మరలా చెప్పినాడు.  


ఒక్క ఘడియ వేచియుండినాడు. అదే మౌనము. ఇప్పుడు నిరీక్షణము ఘనముగా పెరిగి , మౌనము ఇంకా గంభీరమైనది. 


రాజు తాను చెప్పినది మూడవ సారిగా మరలా చెప్పినాడు. రాజు మాట ప్రతిధ్వనించునట్లు సభ మౌనముగా ఉంది. గట్టిగా ఊపిరి వదలనివారే లేరు అంటే అతిశయోక్తి కాదు. 

Janardhana Sharma

పరమార్ధ చింతన - లోకరీతి !

 


పరమార్ధ చింతన - లోకరీతి !


               శా: అంతామిధ్య తలంచి చూచిన ; నరుండట్లౌటెరింగి న్సదా 


                      కాంతల్ ,పుత్రులు ,నర్ధముల్, తనువు , నిక్కంబంచు ,మోహార్ణవ 


                     భ్రాంతిన్ జెంది చరించుఁ గాని ; పరమార్ధంబైన నీయందు తా


                     చింతాకంతయు చింత నిల్పడుగదా ! శ్రాకాళ హస్తీశ్వరా !


                         శ్రీ కాళహస్తీశ్వర శతకము- మహాకవి ధూర్జటి ;


                     

                   జీవన భ్రాంతిలో మునిగి జనం పరమార్ధతత్త్వాని గురించి తలంచే సమయమే గానక యేరీతిగా అజ్ఙానంలో జీవనం గడుపు తున్నారో ధూర్జటి యీపద్యంలో చాలా నిపుణంగా వివరించాడు.


                 భావము: ఓశ్రీకాళహస్తీశ్వరా! లోకమంతా మిధ్య (మాయ) యని తెలసిననూ జీవన భ్రాంతులై జనులు భార్యా పుత్రులు ధనములు శరీరాదులు నిజమనుకొని (శాశ్వతమని భావించి) తమనుతాము మరచి చరించుచున్నారే గాని, పరమార్ధ

స్వరూపుడవగు నిన్ను చింతాకంతయు ధ్యానింపరుగదా! 


          వివరణ: జగమొక నాటకరంగము మనము పాతల్రమే ! మనపాత్ర నటన పూర్తియైన వెనుక కాలయవనిక వెనుకుకు బోవక తప్పదు. రాజైనను పేదయైనను అదేనియతి. నిత్యము లోకమున జనన మరణాదుల నెన్నిటిని మనము గాంచుటలేదు. అయినను మనకు నదియంతయు మిధ్యయను జ్ఙానము అలవడుటలేదు. ఇది నాభార్య ,వీడు నాకొడుకు, నాయిల్లు , నాఆస్తి , అనియనుక్షణం వానిచుట్టూ తిరుగుచూ

  మోహార్ణవంలో మునిగిపోతున్నాం. ఎందరు చెపుతున్నా వినబడటంలేదు అదేపాట. అదేయావ. యీగొడవలోపడి పరమాత్మ నొక్కక్షణమైనా తలచుకోలేక పోతున్నాంకదా! 


                               ఇది పరమార్ధ సాధనకు తోడ్పడునా? పుట్టుకకు ఇదేపరమార్దమా?


                                                       అని , ధూర్జటి కవి ప్రశ్న ? ఇక సమాధానము మనదే !


                                                                                       స్వస్తి !🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

విస్సన్న చెప్పింది వేదం

 విస్సన్న చెప్పింది వేదం" అని జాతీయం. ఎవరు ఆ విస్సన్న? ఏమిటి ఆ కథ?

“లేచింది ..నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం” అనే పాట గుండమ్మ కథ సినిమా లోనిది మన N.T.రామారావుగారిది అందరూ వినే ఉంటారు. దానిలో అతడు “ఎపుడో చెప్పెను వేమన గారూ అపుడే చెప్పెను బ్రహ్మంగారూ ..ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా విస్సన్న చెప్పిన వేదం కూడా” అంటూ పాడుతాడు. వేమన్న ఎవరో మనందరికీ తెలుసు. అలాగే కాలజ్ఞానం చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారూ తెలుసు. అయితే వీరి పేర్ల సరసన చేర్చబడిన ఆ విస్సన్నగారెవరో చాలమందికి తెలీదు. ఆయన చెప్పిన వేదం ఏమిటో కూడా తెలీదు. ఆయన ఎక్కడివాడో ఎప్పటి వాడో తెలుసుకుందామన్నా చెప్పేవారెవరూ లేక ఆయన కూడా ఒక మహానుభావుడై ఉంటాడ్లే అని సరిపెట్టుకుని ఊరుకుంటాము. అలా ఊరుకోనక్కర లేదు. ఆయనా ఒక చారిత్రిక పురుషుడే.ఆయన పూర్తి పేరు ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు .విస్సన్న చెప్పిందే వేదం అని ప్రఖ్యాతి గాంచిన ఈయన ఏ వేదం చెప్పలేదు. కాని ఏ విషయంలోనైనా వాదనలో ఆయనను ఓడించగల వాడు ఆయన కాలంలో ఉండేవాడు కాదు. ఏ శాస్త్ర విషయమైనా ఆయన నిర్ణయాన్ని కాదనగలిగే వారు లేక పోవడంతో ఆయన వాక్కే వేద వాక్కయిందన్నమాట. His was the last word in any literary dispute or argument. ఇంత ప్రఖ్యాతి గాంచిన ఈయన గురించిన విశేషాలు తెలుసుకుందాం.


శ్రీ ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు గారిది అప్పటి గోదావరి జిల్లా. ఈయన శ్రీ బులుసు అచ్చయ్య గారి శిష్యుడట. శ్రీ బులుసు అచ్చయ్యగారు దేశమంతా ప్రఖ్యాతి గాంచిన మహా పండితుడు. (అటువంటి వారి శిష్యుడైన విశ్వపతి శాస్త్రులుగారు కూడా మహా పండితుడు కావడమే కాకుండా వాదనలో మహా దిట్ట. అందువల్ల ఏ సంవాదంలోనైనా ఆయన మాటే చివరికి చెల్లుబాటై విస్సన్న చెప్పినదే వేదం అనే ఖ్యాతి ఆయనకు తెచ్చి పెట్టింది. ఈయనకు సంబంధించిన ముచ్చట ఒకటి చెబుతాను వినండి:


ఒకసారి యానాం లో మన్యం వారి దివాణంలో జరిగిన సభలో ఇతర పండితులందరికీ వ్యతిరేకంగా ఈయన చేసిన సిధ్ధాంతం ఏమిటంటే బ్రాహ్మలు కోమట్ల ( అలాగే శిష్టు కరణాల) ఇళ్ళల్లో జరిగే ఆబ్దికాలలో నేతితో కాని నూనెతో కాని వండిన అరిసెలు గారెలు వంటివి నిరాక్షేపణీయంగా భోజనం చేయవచ్చునని. దీనికి ఆయన చూపించిన ప్రమాణం-


“శ్లో. ఘృత పక్వం తైల పక్వం, పక్వం కేవల వహ్నినా,


శూద్రాదపి సమశ్నీయా దేవమాహ పితామహః”


వెంటనే ఆ రోజుల్లో విస్సన్నగారు చెప్పినది అందరు బ్రాహ్మలూ అమలు చేసేరో లేదో మనకు తెలియదు గాని, కాల క్రమేణా వారి ఆచారంలో సడలింపు తెచ్చుకున్నట్లే కనిపిస్తోంది. దీనికి సాక్ష్యం “రొట్టెకు రేవేమిటి?”అనే సామెతే.( ఈసామెత శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు తమ కథలూ గాథలూలో రెండు మూడు చోట్ల వాడేరు. ఏదో చెబుతూ విషయాంతరంలోకి వెళ్లి పోయి తిరిగి అసలు విషయానికి వచ్చే సందర్భంలో వాడేరిది.). ఆ రోజుల్లో గోదావరిలో రోజుల తరబడి పడవలలో ప్రయాణం చేసేటప్పుడు పడవ వాడు వంట చేసుకోవడానికి అనువుగా ఏదో తీరం చేర్చేవాడు. అక్కడ ఒడ్డు మీద వంటలూ భోజనాలూ కానిచ్చి తిరిగి ప్రయాణం కొనసాగించే వారన్న మాట. అలా ఏదో ఒక రేవు చేరితే కాని బ్రాహ్మలకు, వారు అంటు పాటిస్తారు కనుక, ఏదీ తినడానికి అవకాశం ఉండేది కాదన్నమాట. అయితే విస్సన్నగారు చెప్పిన దాని ప్రకారం నిప్పు మీద కాల్చినవాటికీ, నూనెలోనూ, నేతిలోనూ వేగిన వాటికీ, ఈ అంటు ప్రసక్తి ఉండదన్నమాట. అందు చేత ఎక్కడైనా తినవచ్చునని తీర్మానం. అందువలన పడవ ప్రయాణంలో రేవు రాక పోయినా దారి మధ్యలో రొట్టె వంటి పదార్థాలు భుజించవచ్చునన్నమాట. అందుకే పుట్టింది ఈ రొట్టెకు రేవేమిటి? అనే సామెత.


తన మాటను వేద వాక్కుగా జనం స్వీకరించారంటే విస్సన్నగారు (శ్రీ ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు గారు) ధన్యజీవియే కదా?

భస్మధారణ

 #భస్మధారణ...........!!


ఈ భస్మధారణకే శిరోవ్రతమని పేరు.

ఈ భస్మధారణ వలన మహాపాపాలు కూడా నశిస్తాయి. 


కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం.


 గృహస్తు భస్మాన్ని నీళ్ళతో తడిపి, నుదుటిమీద, ఉదరంపైన, చేతులమీద పెట్టుకోవాలి. మంత్రాలు ఉచ్చరించడం చేతకానివారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే, కనీసం "నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి, భస్మధారణ చేయాలి.


స్త్రీలు(అర్హతకలిగినవారు మాత్రమే), బ్రహ్మచారులు, స్వాములు(సన్న్యాసులు) నీళ్ళతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. 

విభూతి ధరిస్తే సకల శారీరక,మానసిక రోగాలు తొలగిపోయి, పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.


పవిత్రమైన విభూతిని ఎలా ధరించాలో, ఏ అంగాలలో ధరిస్తే ఏయే ఫలితాలు సిద్ధిస్తాయో చూద్దాం.


 ఫాలభాగం- పీకలవరకు చేసిన పాపాలు తొలగుతాయి. 

వక్షస్థలం-మనస్సుతో తెలిసి చేసిన పాపం నశిస్తుంది.

 నాభి- కడుపు దాకా చేసిన పాప నిర్మూలన జరుగుతుంది. 

భుజాలు- చేతితో చేసిన పాపం నశిస్తుంది. 


1. భస్మం - శ్వేత వర్ణము

2. విభూతి - కపిలవర్ణము,

3. భసితము -కౄష్ణ వర్ణము

4. క్షారము - ఆకాశవర్ణము

5. రక్షయని - రక్తవర్ణము


హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.

హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.

హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి.

భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

వివిధ హోమభస్మాలు చేసే మేలు:


శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.


శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.


శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.


శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.


శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.


శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి


శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.


శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.


శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.


హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.


* హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.* 


విభూతి స్నానం అంటే ఏమిటి?

స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.


                    🚩 సర్వేజనా సుఖినోభవంతు 🚩

కార్తీక పురాణం - 6,

 _


_*కార్తీక పురాణం - 6, వ. అ ధ్యాయము*_

>>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<                                        

 *దీపదానవిధి - మహాత్మ్యం*

*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


ఓ రాజశ్రేష్ఠుడా ! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని , శ్రీ మహావిష్ణువును , పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో , అట్టివానికి అశ్వమేథయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులనగా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి , వత్తులు చేయవలెను. వరిపిండితో గాని , గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి , ఆవునెయ్యి వేసి , దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి  నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు పటింపవలెను.


*సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |*

*దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||*


అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా , *"అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు , సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక !"* యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని , స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు , విద్యాభివృద్ధి , ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు .  దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.


*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


పూర్వ కాలమున ద్రవిడ దేశము నందొక గ్రామమున నొకస్త్రీగలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాల మునకే భర్త చనిపోయెను. సంతానము గాని , ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు , అక్కడనే భుజించుచు , ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు , దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.


ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ , తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని , దేవుని మనసార ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని , తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి , యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక , తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది.


అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి , మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి , ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి *"అమ్మా ! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు , సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము , మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి , దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి , అంధకారములో బడి నశించుచున్నాడు. కాన , నా మాట లాలకించి నీవు తినక , ఇతరులకు పెట్టక , అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి , పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి , వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతఃకాలమున నదీ స్నానమాచరించి , దానధర్మముల జేసి , బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"* వని ఉపదేశమిచ్చెను.


ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున *కార్తీకమాసవ్రతములో* అంత మహత్మ్యమున్నది.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.*


    *సర్వేషాంశాన్తిర్భవతు.*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం - షష్ఠి - పూర్వాషాఢ -‌‌ గురు వాసరే* (07.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Kartika Puranam -- 6

 Kartika Puranam -- 6


*కార్తిక పురాణము - ఆరవ అధ్యాయము*


వశిష్ఠుడు మరల ఇట్లనెను ఓ జనకమహారాజా! కార్తీకమాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను, స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును.


సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈమాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి, వత్తిని చేసి, బియ్యపుపిండితోగాని, గోధుమపిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను.ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి, బంగారముతో వత్తిని చేయించి, బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ బోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆదీపమును దానము చేయవలెను.


*శ్లో!! సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛుభావహం!

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ!!*


దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక.


ఈ ప్రకారముగా స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీకమాసమందు ఆచరించిన యెడల అనంతఫలమును పొందుదురు.దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుష్షును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు.


కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత చేయబడిన తెలిసి, తెలియక చేసిన పాపములు నశించును.ఈవిషయమందు పురాతనపు కథ యొకటి ఉన్నది వినుము.


పూర్వకాలమున ద్రవిడదేశమందు సుత బంధువిహీనయైనయొక స్త్రీ గలదు.ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది.ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది.చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలయిన పనులను చేసెడిది.వారు ఇచ్చే కానుకల్ని యితరులకు అమ్మి డబ్బు కూడబెట్టింది.ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది.


ఆస్త్రీ ఏనాడూ ఇంటిలో వంట చేయలేదు.ఏనాడూ ఇంటిలో దీపాన్ని వెలిగించలేదు, విష్ణు పాదారవిందములనుధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు,ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు.


అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు, పరులకు పెట్టలేదుఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగమువలన శ్రీరంగమునకుబోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని జూచి, ‘అయ్యో! ఈ చిన్నది అన్యాయంగా నరకములపాలు కాగలదని’ దయగలిగి ఆమెతో ఇట్లనియె.


“మూఢురాలా! నామాటలను వినుము, విని చక్కగా ఆలోచించుము.ఈ దేహము సుఖదుఃఖములతో గూడినది.చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా, పంచభూతములు చూరులందుపడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును.ఈ దేహము నీటిమీది బుడగవలె నశించును.ఇది నిశ్చయము.నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి.ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును.కాబట్టి, మోహమును విడువుము.సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము.ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీకమాసమందు ప్రాతః స్నానమాచరించుము.విష్ణుప్రీతిగా దానము చేయుము.బ్రాహ్మణునకు దీపదానము చేయుము.అట్లుచేసిన యెడల అనేక జన్మముల పాపములు నశించును సందేహమువలదు”.


ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ స్త్రీ ఆ మాటలు నమ్మి, విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీకవ్రతమును ఆరంభించెను.


సూర్యోదయ సమయాన శీతోదకస్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణశ్రవణము ఈప్రకారముగా కార్తీకమాసము నెల రోజులు చేసి బ్రాహ్మణభోజన సమారాధన చేసెను. నెలరోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆస్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగముజనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతినొందినది.

తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది.


కాబట్టి కార్తీకమాసమందు అన్నిటికంటె దీపదానము అధిక పుణ్యప్రదము.కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా!ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసారబంధనమును త్రెంచుకుని వైకుంఠము పొందుదురు.


*ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షష్ఠాధ్యాయసమాప్తః*

శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 924




⚜ కర్నాటక  :   ఉడిపి 


⚜ శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయం



💠 ఉడిపి పవిత్ర పట్టణం కర్ణాటకలోని అరేబియా తీరంలో ఉంది. 

సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రం' మరియు ' ప' అంటే నాయకుడు'. 

చంద్రుడు నక్షత్రాలకు అధిపతి కావడంతో ఆ ప్రాంతానికి ఉడిపి అనే పేరు వచ్చింది.


💠 ఉడిపి అనే పదానికి బహుళ మూలాలు ఉన్నాయి, వాటిలో ఒకటి తుళ్లూ పదం ఒడిపు నుండి వచ్చింది. 


💠 ఈ ప్రదేశంలో శ్రీ చంద్రమౌళేశ్వర మరియు అతి ప్రాచీనమైన అనాథేశ్వర దేవాలయాలు ఉన్నాయి.  

మహాదేవుడు అనంతేశ్వరుడిగా "రజత పీఠం" (వెండి పీఠం)పై కూర్చున్న లింగ రూపంలో ఉంటాడు.

అందుకే మన ప్రాచీన గ్రంథాలలో ఈ ప్రదేశాన్ని రజతపీటపుర అని పిలుస్తారు.


💠 తారా అపహరణపై ప్రజాపతి దక్షుడు చంద్రుడిని శపించాడని పురాణ కథనం. 

 శాప విమోచనం పొందడానికి చంద్రుని భక్తికి సంతోషించిన మహారుద్రదేవుడు ఈ ప్రదేశమైన దేవాలయంలో మహారుద్రదేవుడిని ఆరాధించాడు  చంద్రమౌళీశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 


💠 ఉడిపిని శివ బెల్లి అని పిలిచేవారు. 

 బెల్లి రజతపీఠాన్ని సూచించే వెండి.  

శివ బెల్లి తరువాత శివల్లి అయ్యాడు మరియు అక్కడ నివసించిన బ్రాహ్మణులను శివల్లి బ్రాహ్మణులుగా గుర్తించారు.  


💠 ఈ వెండి పీఠం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది.  

రాజు రామభోజుడు, పరశురాముని గొప్ప భక్తుడు, మహాయజ్ఞం చేయాలనుకున్నాడు.  యజ్ఞ స్థలంలో భూమిని దున్నుతుండగా ఒక పాము చంపబడింది.  తెలిసి తెలియక పాముని చంపడం చెడ్డ కర్మ.  పామును చంపిన పాపం నుండి తనను తాను నిరూపించుకోవడానికి, రాజు ఒక వెండి పీఠంపై (రజత పీఠం) శివలింగాన్ని ప్రతిష్టించాడు, ఇది శేష రూపంలోని మహా విష్ణువు మరియు లింగంగా మహారుద్రదేవుని దివ్య ఉనికిని కలిపింది.  ఉడిపిలో చంద్రమౌళేశ్వర మరియు అనంతేశ్వర ఆలయాలను సందర్శించి, ఆపై శ్రీకృష్ణ దేవాలయానికి ప్రార్థనలు చేయడం సాధారణ పద్ధతి.


💠 ఉడిపిలోని చంద్రమౌళీశ్వర దేవాలయం ఉడిపిలో దక్షిణ భారతీయులు ఉపయోగించిన అద్భుతమైన వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ.  

ఒక  అద్భుతమైన గోపురం , స్తంభాల మందిరాలు మరియు అందమైన చెక్కడాలు అంతటా ఉన్నాయి.  

ఆలయ లోపలి గర్భగుడి  విశాలమైనది మరియు పెద్దది.  

ఇందులో చంద్రమౌళీశ్వరుని ప్రధాన శివలింగం ఉంది.  


💠 ప్రధాన మందిరం చుట్టూ ఇతర దేవతలకు అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి, అవి గణేశ మరియు ఇతర దేవతలు మరియు శివునికి సంబంధించిన దేవతల వంటివి.  ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు హిందూ పురాణాలు మరియు వివిధ దేవతలు, సిద్ధులు మరియు పౌరాణిక జీవుల దృశ్యాలను వర్ణిస్తాయి.


💠 ఈ ఆలయ నిర్మాణం దాదాపు 7వ లేదా 8వ శతాబ్దానికి చెందినది.  

ఆలయానికి నాలుగు దిక్కులకూ ప్రవేశం కల్పించేందుకు నాలుగు తలుపులు ఉన్నాయి.  


💠 ఈ ఆలయంలో మొత్తం రెండు పెద్ద శివలింగాలు ఉన్నాయి.  

అలంకారమైన చెక్కబడిన గోడలు మరియు నల్ల గ్రానైట్ యొక్క పెద్ద స్తంభాలు ఆలయాన్ని సందర్శకులకు, వారు భక్తులు లేదా ప్రయాణీకులకు ఒక శిల్పకళా అద్భుతంగా చేస్తాయి.  


💠 ఈ ఆలయంలో నాట్య రూపంలో ఉన్న వినాయకుడి చిత్రం, అలాగే జలంధర చిత్రం ఉంది.  దురదృష్టవశాత్తూ, ఈ ఆలయాన్ని గొప్ప వాస్తుశిల్పులు, కళాకారులు మరియు శిల్పులు నిర్మించినప్పటికీ, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై ఎటువంటి రికార్డులు అందుబాటులో లేవు.


 

💠 ఉడిపి రైలు స్టేషన్‌కు పశ్చిమాన 2.9 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.


రచన

©️ Santosh Kumar

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము చతుర్థాశ్వాసము*


188* వ రోజు*

*అశ్వథ్థామ ఆగ్రహం*


తండ్రిని అలా తూలనాడటం విన్న అశ్వత్థామ " సుయోధనా! పశువులను కాచేవారిని బెదిరించి ఆవులను పట్టుకున్నంతా మాత్రాన ఇలా మాట్లాడటం తగదు. మనమింకా యుద్ధం చేయ లేదు, శత్రువులను జయించ లేదు, నగరం చేర లేదు యుద్ధసంలో గెలిచిన వారు కూడా ఇలా మాట్లాడరు. యుద్ధమంటే జూదంలో రాజ్యాన్ని అపహరించటం కాదు, యుద్ధభూమిలో జూదం ఆడటం కుదరదు. పాండవుల జయించేనా ద్రౌపదిని సభకు పిలిపించింది? ఈడ్చుకు రమ్మని ఆజ్ఞాపించింది. శకుని మాట వినేగా అవన్నీ చేసింది ఇప్పుడు ఆ శకుని యుద్ధం చేస్తాడులే . సభలో నీచే అవమానించ బడిన కపికేతనుడు నీపై యుద్ధానికి వస్తున్నాడు. గురువును అధిక్షేపించావు కాని దేవదానవులను జయించిన అర్జునుని నీవు ఒక్కడివే ఎదుర్కొన గలవా? వీరుని పొగడటం సహజం. పుత్ర సమానుడైన ప్రియ శిష్యుడైన అర్జునిని పొగడటం నేరమా. ఇంత జరిగిన తరువాత సిగ్గు లేకుండా నా తండ్రి యుద్ధం చేయ వచ్చు కాని నేను చేయను. సుయోధనా! యముడు చెలరేగినా, అగ్ని ఆగ్రహించినా, మృత్యు దేవత పురులు విప్పినా కొంత అయినా మిగులుతుంది. అర్జునుడు బాణాలు సర్వనాశనం చేస్తాయి. నీ కుటిల బుద్ధులు ఇక్కడ పని చేయవు. అర్జునుడు గాండీవంతో శరసంధానం చేసి బాణాలు విసురుతాడు కాని పాచికలు విసరడు. మనం మత్స్య దేశాధీశుని గోవులను పట్టుకున్నందుకు మత్స్యదేశాధీశుడు ససైన్యంతో వస్తే ఎదిరిస్తాము కాని అర్జునిని ఎదిరించ లేము " అన్నాడు.


*కర్ణుడి ఆగ్రహం*


ఆ మాటలకు కర్ణుడు ఊగిపోయాడు " మనం వచ్చింది పాండవులను పట్టు కోవడానికి. పాండవులను గుర్తించడానికి. అర్జునిని చూసి బెదరడం భావ్యమా. సుయోధనుని పిచ్చివాడిని చేయటం తగునా? మీకు భయంగా ఉంటే మీరు ఊరుకోండి. ఒక్కని ఎదిరించడానికి ఎంత మంది కావాలి. నేను ఒక్కడినే ఎదిరిస్తాను. కపిధ్వజాన్ని విరగొట్టి, దాని చుట్టూ ఉన్న పిశాచాలను తరిమి కొడతాను. సారధిని చంపి అర్జునిని శరీరాన్ని నా బాణాలతో తూట్లు చేస్తాను. నా బాహు బలాన్ని చూడండి. అర్జునుడు పమూడేళ్ళ అరణ్యాజ్ఞాత వాసాలు ముగించుకొని యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నాడు. కౌరవసేనలో మహా వీరుడనైన నేను అతనిని ఎదుర్కొంటాను. రారాజు ఋణం తీర్చుకోవడానికి, పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్రప్రయోగం చేయడానికి కర్ణార్జునులలో ఎవరు గొప్పో తేలడానికి ఇది సమయం. అర్జునిని గెలిచి సుయోధనునికి ముదము చేకూర్చెదను. ఇష్టం ఉన్న వారు మా ద్వంద యుద్ధం చూడండి లేని ఎడల ఆవుల వెంట నగరానికి పొండి " అన్నాడు.


*కృపాచార్యుని వాదం*


కర్ణుని మాటలు విన్న కృతవర్మ " కర్ణా! నీవు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతావు. కార్యసిద్ధి గురించి నీకు పట్టదు. కార్యసాధనలో యుద్ధం ఒక నీచమైన ప్రక్రియ అని రాజనీతిజ్ఞులైన పెద్దలు చెప్తారు. దేశ, కాల, పరిస్థితిని అర్ధం చేసుకుని తన బలాన్ని ఎదిరి బలాన్ని బేరీజు వేసుకుని యుద్ధం చేయాలి కాని మూర్ఖంగా దుస్సాహసంతో యుద్ధానికి దిగితే ఓటమి తప్పదు. అర్జునుడు ఒంటరి వాడని నువ్వు అంటున్నావు. ఖాండవవన దహన సమయంలో ఇంద్రునితో యుద్ధం చేసింది అర్జునుడు ఒక్కడే, యాదవ సైన్యంతో పోరాడి సుభద్రను చేపట్టింది అర్జునుడు ఒక్కడే, రాజసూయ యాగమున దిగ్విజయం చేసింది అర్జునుడొక్కడే, నివాతకవచులను సంహరించి దేవతలకు మేలొనరించించింది అర్జునుడొక్కడే, దేవేంద్రునికి అజేయులైన కాలకేయులను సంహరించింది అర్జునుడొక్కడే. అంతెందుకు ద్రౌపది స్వయవరంలో అబేధ్యమైన మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని చేపట్టడమే కాక అనంతరం తిరగబడిన రాజులను జయించినది అర్జునుడు ఒక్కడే. నువ్వూ అక్కడే ఉన్నావు కదా. పాండవులు అందరూ తమతమ శక్తి కొద్దీ దిగ్విజయం చేసారు. నీవేమో హస్థినా పురంలో కూర్చుని ప్రగల్భాలు పలుకుతున్నావు. నీవు అర్జునుని గెలుస్తానని చెప్పడం ఒంటి చేత్తో సముద్రం ఈదడం లాంటిది. కనుక దుస్సాహసం విడిచి మనమంతా రారాజును కాపాడు కోవాలి కాని యుద్ధోన్మాదులం కాకూడదు. అందరం కలసి అర్జునిని ఎదుర్కొందాం నువ్వొక్కడివే పోరాడతానని చెప్పడం అవివేకం " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

*శ్రీ కాళహస్తీశ్వర శతకము

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*కాసంతైన సుఖం బోనర్చునొ మనఃకామంబు లీడేర్చునో*

*వీసం బైనను వెంట వచ్చునొ జగద్విఖ్యాతి గావించునో*

*దోసంబు ల్వెడఁబాపునో వలసినం దొడ్తో మిముంజూపునో*

*చీ సంసారదురాశే లుడుపవో శ్రీకాళహస్తీశ్వరా!!!*


         *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 79*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఈ సంసారవ్యామోహము కొంచెమైనా సుఖదాయకమా? కోరిన కోర్కెలు తీర్చునా? వెంట వచ్చు పుణ్యమా? లోకములో కీర్తిప్రతిష్ఠలు గలిగించునా? యశఃదాయకమా? దోషనాశకమా? లేక నిన్ను చేరు మార్గమా? జీవులీ సంసారము నందు మోహమును విడువలేకున్నారు? దీనిని ఏల తొలగింపవు ప్రభో?*


✍️🌷🌹🌺🙏

_*కార్తీక పురాణం*_ 🚩

 🕉️🌹🪔🛕🪔🌹🕉️

    🪷 *గురువారం*🪷

🕉️ *నవంబరు 7, 2024*🕉️


🚩 _*కార్తీక పురాణం*_ 🚩

    _*6 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 *దీపదానవిధి - మహాత్మ్యం*

*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


☘☘☘☘☘☘☘☘☘


ఓ రాజశ్రేష్ఠుడా ! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని , శ్రీ మహావిష్ణువును , పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో , అట్టివానికి అశ్వమేథయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులనగా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి , వత్తులు చేయవలెను. వరిపిండితో గాని , గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి , ఆవునెయ్యి వేసి , దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి  నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు పటింపవలెను.


*సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |*

*దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||*


అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా , *"అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు , సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక !"* యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని , స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు , విద్యాభివృద్ధి , ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు .  దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.


*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


పూర్వ కాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని , ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు , అక్కడనే భుజించుచు , ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు , దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.


ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ , తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని , దేవుని మనసార ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని , తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి , యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక , తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది.


అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి , మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి , ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి *"అమ్మా ! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు , సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము , మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి , దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి , అంధకారములో బడి నశించుచున్నాడు. కాన , నా మాట లాలకించి నీవు తినక , ఇతరులకు పెట్టక , అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి , పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి , వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతఃకాలమున నదీ స్నానమాచరించి , దానధర్మముల జేసి , బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"* వని ఉపదేశమిచ్చెను.


ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున *కార్తీకమాసవ్రతములో* అంత మహత్మ్యమున్నది.


*ఇతి స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయం - ఆరవ రోజు పారాయణము సమాప్తము.*


            🌷 *సేకరణ*🌷

        🌹🪔🕉️🕉️🪔🌹

              *న్యాయపతి*

          *నరసింహా రావు*

        🙏🙏🕉️🕉️🙏🙏

07, నవంబరు, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🌷 *గురువారం*🌷

🌹 *07, నవంబరు, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి  : షష్ఠి* రా 12.34 వరకు ఉపరి *సప్తమి*

*వారం : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : పూర్వాషాడ* ఉ 11.47 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*


*యోగం  : ధృతి* ఉ 09.52 వరకు ఉపరి *శూల*

*కరణం  : కౌలువ* ప 12.41 *తైతుల* రా 12.34 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.30 - 01.00  సా 04.00 - 05.00*

అమృత కాలం  :*ఉ 06.50 - 08.29*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.14*


*వర్జ్యం         :   రా 07.52 - 09.29*

*దుర్ముహూర్తం  : ఉ 09.56 - 10.42 మ 02.31 - 03.17*

*రాహు కాలం : మ 01.17 - 02.43*

గుళికకాళం      : *ఉ 08.59 - 10.25*

యమగండం    : *ఉ 06.07 - 07.33*

సూర్యరాశి : *తుల*

చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 06.07* 

సూర్యాస్తమయం :*సా 05.35*

*ప్రయాణశూల  : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 06.07 - 08.25*

సంగవ కాలం   :      *08.25 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.00*

అపరాహ్న కాలం: *మ 01.00 - 03.17*

*ఆబ్ధికం తిధి       : కార్తీక శుద్ధ షష్ఠి*

సాయంకాలం  :  *సా 03.17 - 05.35*

ప్రదోష కాలం   :  *సా 05.35 - 08.05*

రాత్రి కాలం     :  *రా 08.05 - 11.26*

నిశీధి కాలం      :*రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.27 - 05.18*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏


*అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే* |

*ఆత్మఙ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః* 


   *ఓం శ్రీ  దత్తాత్రేయాయ నమః*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

🌹🍃🌿🌹🌹🌿🍃🌹