23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

దేశమంటే

 పేరు : తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)

ఊరు : దిల్ సుఖ్ నగర్, రంగారెడ్డి జిల్లా
ఫోన్ : 9440710501

శీర్షిక: దేశమంటే...

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ – అని అన్నారు 1910లో గురజాడ గారు.
2022లో నేనంటున్నాను … 

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే వట్టి మనుషులూ కాదోయ్
దేశమంటే దేశపౌరుల మానసికతేనోయ్
ఆ పౌరుల వజ్ర సం..కల్పాలోయ్, దేశ.. భక్తి పర్వాలోయ్.

మనిషి మనిషిని దోచుకుంటే
పేదవాడికి తిండి కరువైతే, రైతు గుండెల నీరు నిండితే
దేశమే గతి బాగుపడునోయ్, నీ దేశమేగతి బాగుపడునోయ్.

తోటివాడికి తోడు నిలిచి, కొంత మేల్ తలపెట్టవోయ్
సొంత లాభం కొంత మాని, పొరుగువాడికి పంచవోయ్,
ఆనందసాగర మీదవోయ్.

యువశక్తి పెడదారి పడితే, దేశమాతకు దిక్కు ఎవరోయ్
స్వార్థ చింతన కొంత మాని, దేశసేవకు కదలవోయ్,
దేశభక్తులు ఎందుగలరో, అచ్చటే అభివృద్ధి గలదోయ్.

ఈర్ష్య ద్వేషం మానివేసి, ప్రేమ భావన పెంచవోయ్
అందలాలను వదిలిపెట్టి, మందిరాలను చేరవోయ్,
మానవత్వ మందిరాలను చేరవోయ్.

సాటి మహిళను గౌరవించు, మహిళా శక్తిని గుర్తించవోయ్
కామవాంఛలు కాదు గమ్యం, అండగా నువు నిలవవొయ్
ఆడపడుచుల అండగా నువు నిలువవోయ్.
🙏🙏😊😊💐😊😊🙏

మాసశివరాత్రి

 *రేపు మాసశివరాత్రి సందర్భంగా*


*మాసశివరాత్రి*


అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.


మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి. దీపాలను పడమర దిక్కున వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి. ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.  శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి. దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని చెపుతారు. తెలిసి గాని తెలియక గాని, భక్తితోగాని, గర్వంతోగని, ఈ రోజు ఎవరైతే స్నానం, దానం, ఉపవాసం, జాగారం మొదలైనవి చేస్తారో వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.


🌿🌺 *అసలు ఈ రోజున ఏం చేయాలి?* 🌺🌿


శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివేదన చేయాలి.


ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం. అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వ దళాలను శివునికి అర్పించాలి. ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది. ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి.


ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు.


కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది. అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని పాిస్తూ ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి. ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు  చేయలేకపోయినా ఈ పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.🙏

విమోచనమెలా

 భ: కర్మబంధాలనుండి విమోచనమెలా ? 


మ: అది యెవరి కర్మయో పరికించు. కర్తవు నీవు కావని తెలియవస్తుంది. ప్రార్థించాలి, పూజించాలి. ధ్యానించాలి. అప్పుడు నీవు ముక్తుడవౌతావు, దీనికి దైవానుగ్రహము కావాలి. దానికి దైవమును ప్రార్థించాలి. నీ ప్రయత్నంలేక జరిగే కర్మ - అయత్నకర్మ , నిన్ను బంధించదు. దేహం కదలికవల్ల జ్ఞానిసైతం ఏవేవో ఆచరిస్తున్నట్లు కనబడుతుంది. సంకల్పమూ యత్నమూ లేక కర్మ ఉంటుందా? అందరికీ సంకల్పాలున్నాయి. అవి రెండు విధాలు . బంధహేతువులు . 2. ముక్తి హేతువులు. ఆ తొలివానిని మాని, వెనుకటివి అలవరచుకోవాలి. పూర్వకర్మలేక ఫలముండదు. పూర్వసంకల్పం లేక కర్మ ఉండదు. కర్తృభావన ఉన్నంతకాలం ముక్తిగూడ ప్రయత్నం వలన లభించేదే.


#గీతగొవింద్

క్యాల్షియం గురించి వివరణ - 2 .

 క్యాల్షియం గురించి వివరణ - 2 . 


 చిన్నపిల్లల్లో క్యాల్షియం లోపం - 


      క్యాల్షియం లోపము ఉన్నటువంటి స్త్రీలకు పుట్టిన పిల్లలకు కూడా అదేవిధమైన లోపము రావడానికి అవకాశం ఉన్నది . ఇట్టి పిల్లలలో ఎదుగుదల లోపిస్తుంది . వీరి ఎముకలలో పటుత్వము ఉండదు . ఈ పిల్లలకు ఆకలి మందగించి ఉంటుంది . వీరికి పాలు కాని లేక వేరే ఆహారం ఎదైనా బలవంతముగా తినిపించిన వాంతి చేసుకుంటూ ఉంటారు . వీరి మూత్రము నేల మీద పోసినప్పుడు మూత్రము ఇంకిపోయి మూత్రము పడినంత మేర సున్నపు తేట తెల్లగా ఉండును . దంతాలు వచ్చుట ఆలస్యం అగును . వ్యాధినిరోధక శక్తి తక్కువుగా ఉండటం వలన ఈ పిల్లలకు అన్ని రోగాలు తేలికగా సంక్రమించే అవకాశం ఉన్నది . 


  స్త్రీలలో క్యాల్షియం లోపం - 


      స్త్రీలలో క్యాల్షియం లోపించిన రజస్వల అవడం చాలా ఆలస్యం అగును. ఋతుక్రమము సరిగ్గా ఉండదు . బహిష్టులో రక్తస్రావం అధికంగా జరుగును . ఇలా జరగటం వలన " రక్తహీనత " ఉన్నవారిలా ఉంటారు . బాలింతలకు పాలు సరిగ్గా ఉండవు . 


  క్యాల్షియం ఎక్కువైన కలుగు సమస్యలు - 


      క్యాల్షియం ఎక్కువ అయిన పొట్టనొప్పి , వాంతులు , కండరములు బలహీనత , మానసిక స్థిరత్వం కోల్పోవుట , మూత్రపిండములలో క్యాల్షియం , ఫాస్ఫరస్ కలిసి రాళ్లుగా ఏర్పడటం , నోరు , గొంతు ఎండినట్టుగా ఉండటం , ఆకలి మందగించుట , బద్ధకం , నిస్తేజముగా ఉండటం , క్యాల్షియం ఎక్కువ అయ్యిందని తెలుసుకొవడానికి మరొక ముఖ్య చిహ్నము కంటి యొక్క " CARNEA " పైన తెల్లటి  కుదపలు కనిపిస్తాయి . కనురెప్పల చివరన కూడా చిన్నచిన్న కుదపలు ఏర్పడి కళ్ళమంటలు పెరిగి నీరు కారుతూ ఉంటాయి . దీనివల్ల కంటి కి చాలా అపకారం జరుగును . 


    క్యాల్షియం ఎక్కువ అయినవారు క్యాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాల జోలికి వెళ్లకుండా ఉండవలెను . ఉదాహరణకు ఉల్లి , చిక్కుడు , గుడ్లు వంటివాటిని తీసుకొవడం ఆపివేయాలి . 


           కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో క్యాల్షియం ఎక్కువ వాడాల్సివస్తుంది . ఉదాహరణకు రికెట్స్ సమస్య , ఎముకలకు సంబంధించిన వ్యాధుల్లోనూ , ఎముకలు విరిగినప్పుడు అతుకుట ఆలస్యం అయినను , పుచ్చుపళ్ళు ఉన్నవారు , చర్మం ఎండినట్లుగా ఉండి ముడుచుకుపోయినవారు , కొన్నిరకాల చర్మసంబంధ ఎలర్జీలలో క్యాల్షియం తప్పక వాడవలెను . 


          తరవాతి పోస్టు నందు మరొక థాతువు  గురించి తెలియచేస్తాను .


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

పనకిరానివౌతాయి

 శ్లోకం:☝️

  *యథాపి పుష్పరాశినా*

*ముదామాలా గుణేబహు l*

  *ఏవం జాతేన మచ్చేన*

*తత్తబృంక ఫలం బహం ll*


భావం:  పువ్వు ఏంత అందంగా ఉన్నా పరిమళం లేనిదైతే ఏమి ప్రయోజనం? అలాగే చేతలు శూన్యమైన తీయని మాటలు ఎంత ఇంపుగా ఉన్నా పనకిరానివౌతాయి.

దానవుడు మానవుడు

 దానవుడు..

                  మానవుడు..

                                     దేవుడు

                   


మానవునకు రోగం కలిగించేది పాపం.

పాపం చెయ్యకూడదు అని తెలిసినా చేస్తాడు మనిషి పాపం.


మానవునకు భోగం కలిగించేది పుణ్యం.

పుణ్యం చేస్తే మంచిది అని తెలిసినా, పుణ్యం చెయ్యడానికి యిచ్చగించదు మనసు.


మానవుని భవిష్యత్తు నిర్ణయించేది కర్మ.

నీ స్వకీయ కర్మను అంకిత భావంతో చేసుకో మంటాడు పరమాత్మ. అలా చేసుకుంటే - నీకు మోక్షం కూడా యిస్తానన్నాడు భగవద్గీత 18-46 శ్లోకంలో.

అయినా మనసు యిచ్చ గించదు.


మానవునకు లాభం కలిగించేది సేవ.

సర్వ ప్రాణులకు చేసిన సేవ మాధవ సేవే ఔతుంది -అని, పదే పదే చెప్పాడు పరమాత్మ కానీ, అంతా నాకే కావాలంటాడు మనిషి.


మానవునకు సంపాదన నిలిపేది పొదుపు.

బిందువు + బిందువు కలిస్తేనే సింధువు అయ్యింది అని తెలుసు మనిషికి! కానీ కొంచెం + కొంచెం కూడ బెడితే కొండంత అవుతుంది అని తెలిసినా - ఒకేసారి కొండంత అయిపోవాలంటాడు మనిషి.

ఇటుక + ఇటుక పేరిస్తేనే ఇల్లు ఔతుంది. ఓకే రోజు ఇల్లు పూర్తైపోవాలంటాడు మనిషి.

విత్తనం పెట్టి, నీరు + ఎరువు వేసి కొన్ని సంవత్సరాలు పెంచితే, చెట్టు ను జాగ్రత్తగా కాపాడితే - బ్రతికి నన్నాళ్ళు ఫలాలు యిస్తుందని తెలిసినా, ఓర్పు వుండదు మనిషికి.


మానవుని విలువ పెంచేది దానం.

మనకున్న దాంట్లో, మనకన్నా లేని వాళ్లకు దానం చెయ్యాలి. నీవుఒక చేత్తో దానం చేస్తే - నీకు పది చేతుల్తో సహాయం చేస్తాడు దేవుడు.

దానం చెయ్యాలి!          మానాన్న నాచేతికిచ్చి, నాచేత్తో దానం చేయించేవాడు.

అంటే, నాకు దానగుణం నేర్పాడన్న మాట.


దయగల హృదయమే భగవన్నిలయము.

మానవునకు నష్టం కలిగించేది హింస.

’అహింసా పరమోధర్మహః’- అని శాస్త్రం చెప్పినా, మనిషి హింస మానడు. [బోయవాడు కొల్లేరు (నీటి సరస్సు)లో పట్టిన పక్షుల్ని మావూర్లో అమ్మడానికి వచ్చే వాడట. మొత్తం పక్షుల గుట్టను క్రిందికి దింపించి - కట్లు (హరిః ఓమ్ హరిః ఓమ్) విప్పించే వాడట మాతాత. బేరమాడి, కాళ్ళు + రెక్కలు బాగా వున్న పక్షుల్ని మొత్తంగా కొని పక్షుల్ని వదిలేసే వాడట మాతాత. అది అహింసకు పరాకాష్ట].  


తన తొడ నుండి మాంసం కోసి బోయ వాడికి (తాను పట్టుకున్న పావురాయికి బదులు) యిచ్చిన శిబి చక్రవర్తి ఈ దేశంలో పుట్టిన వాడే గదా! మాతాతకు శిబిచక్రవర్తి ఆదర్శం.


మానవునకు అశాంతి కలిగించేది ఆశ.

ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. ఆశకు మితం ఏముంది?

మానవునకు శాంతి కలిగించేది తృప్తి.

తినుటకు జీవించువాడు బద్ధుడు, జీవించుటకు తినువాడు ముక్తుడు. Eat to live, do not live to eat.


మానవునకు దుఃఖం కలిగించేది కామం.

Desire is the root cause of all evils. It is an insatiable demand _ కోర్కెలు తీరేవి కావు. కోర్కెల్ని తీర్చలేము.


మానవుని పతనం చేసేది అహంకారం.

’అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహా’ లను వదిలేస్తే మోక్షం యిస్తానన్నాడు పరమాత్మ  భగవద్గీతలో.


మానవునకు అందరిని దగ్గర చేసేది ప్రేమ.

Serve, Love, Give, Purify, Meditate, Realise.


మానవునకు అందరినీ దూరం చేసేది అసూయ.

కేవలం అసూయతో దుర్యోధనుడు వంశవినాశనానికి కారకు డౌతాడు.


మానవుని స్థితిని సూచించేది గుణం.

అన్నింటికీ మూలకారణం గుణమే. మంచి గుణం తయారు చేసుకోవాలి. చెడుగుణాల్ని వదిలి మంచి గుణాల్ని పోగు జేసుకోవాలి. అప్పుడు మనలో దైవత్వం చేరుతుంది.


మానవుని దైవంగా మార్చేది "దయ!"


మానవుని ఆత్మస్థితి తెలిపేది వాక్కు.

తియ్యగా మాట్లాడటం నేర్చుకోవాలి. ‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్’ - అని భగవద్గీత చెప్పింది.


మానవునకు విజయం చేకూర్చేది "ధర్మం"

మానవుని గొప్పవాడిగా చేసేది "తత్వజ్ఞానం".

మానవునకు ముక్తి నిఇచ్చేది "సత్యం".

మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది "ధ్యానం".

మరొకటి లేదు ..

 *ఖర్చులేని స్వర్గం!*

               ➖➖➖✍️


 *వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ‘ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*


*కాసేపు ఆలోచించి…“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.*


*ఆశ్చర్యంగా అతను నా వంకచూసి “అదెలా?” అన్నాడు.*


*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, వ్యసనాలకు  డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..* 


కానీ, *ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*

 

 *దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 


*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


 *సత్సంగత్వే నిస్సంగత్వం !* 

 *నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 

 *నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 

 *నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 


*సత్పురుషులు ..*  *మార్గదర్శనం* 

*సత్సంగత్యం ..* *సహవాసం* 

*సత్ప్రవర్తన ..* *జీవించడం* 

*మించి, ఈ  భౌతిక  ప్రపంచంలో  ఇంకొకటి,  మరొకటి  లేదు ..

  🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

అంతర్నేత

 ☘️అంతర్నేత☘️


*అన్ని పనులూ అయిపోయాక, కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవటం సాధారణంగా మనలో చాలామందికి అలవాటు ఉండదు.*


 *చక్కగా కళ్లు మూసుకుని కూర్చోవడం ఒక కళ. ఆ కళను అభ్యసించాలి. ఈ గందరగోళ జీవితంలో ప్రశాంతంగా కూర్చోవడం సాధ్యపడటం లేదు. నిర్మలమైన ఆకాశాన్ని చూడటం మరిచిపోయాం. నిశ్చలమైన మనసును అనుభూతి చెందటం మనకు తెలియటం లేదు.*


*కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం మనల్ని వదలిపోదు. బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. లోపల ఎన్నో అద్భుతాలు. ఓ చిన్న కనురెప్ప రెండు ప్రపంచాలను వేరుచేస్తూ, కలుపుతూ ఉంటుంది.*


*కళ్లు మూసుకుని లోపలికి వెళుతున్న కొలది, కళ్లు తెరుచుకుని చూస్తున్నప్పుడు కనిపించేదంతా ఓ కలగా, మాయగా చివరికి శూన్యంగా మారిపోతుంది. అక్కడ గొప్ప ప్రశాంతత ఉంటుంది.*


*ఒక గురువు కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నాడు. అతణ్ని ఓ వ్యక్తి సమీపించి 'మీరు చేస్తున్నది ఏమిటి?' అని అడిగాడు.*


*'లోపల చూస్తున్నాను' అని ఆ గురువు చెప్పాడు. ఆ వ్యక్తి గందరగోళంలో పడిపోయాడు.*


*'కళ్లు మూసుకుని చూస్తున్నారా?' ఆశ్చర్యపోతూ అడిగాడు.*


*'అవును... అదే నిజమైన చూపు'*


*కళ్లు తెరుచుకున్నప్పుడు అవి అనంతంలోకి చేరుకోగలవు. కాని అవే కళ్లు మూసుకుని లోపలికి చూసినప్పుడు అనంతత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడ మన స్వస్వరూపం కనిపిస్తుంది. అప్పుడే విశ్వరూపం బయటపడుతుంది.*


*కనిపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు. ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నవాణ్ని చూడాలని అనుకోరు. ఈ అందాలకు, ఆనందాలకు, అనుభూతులకు కారణం... లోపల ఉంది.*


*రబియా అనే ఒక యోగిని ఉండేది. ఓ సుందరమైన ప్రభాతవేళలో ఎవరో 'రబియా! కుటీరంలో ఏం చేస్తున్నావు? బయటికి రా, ఇక్కడి కొచ్చి చూడు. ఎంత అందమైన ఉదయాన్ని సృష్టించాడో దేవుడు!' అన్నారు.*


*కుటీరం లోపలి నుంచి రబియా ఇలా అంది. 'నీకు బయట కనిపిస్తున్న ఆ సుందర ఉదయాన్ని సృష్టించిన వాణ్ని నేను ఇక్కడి నుంచే చూస్తున్నాను. ఓ మిత్రుడా! నువ్వే లోపలి కొస్తే మంచిది. బయట ఉన్న ఏ అందమూ అందం అనిపించుకోదు- ఇక్కడున్న అందం ముందు!'*


*దర్శింపజేస్తున్న వాణ్ని దర్శించాలి!*


*కాని, కళ్లు మూసుకునే ఉంటాం. లోపల ఉండం. ఎప్పుడూ బయటే ఉంటాం. మూసుకున్నంత మాత్రాన కళ్లు మూతపడతాయా? కళ్లు మూసుకున్నా బయట దృశ్యాలు వేదిక మీద ప్రదర్శించే దృశ్యాల్లా అలా వెంటాడుతూనే ఉంటాయి.*


*కనురెప్పలు మూతపడటం- కళ్లు మూసుకోవడం కాదు. కళ్లు మూసుకోవడం అంటే లోపలికి దిగి వస్తున్న కలల నుంచి, ఆలోచనల నుంచి స్వేచ్ఛను పొందడం.*


*కళ్లు మూసుకోవడం అంటే- దృశ్యాలన్నీ మాయమైపోయి అంతరంగంలో నిశ్చలంగా ఉండిపోవడం. కళ్లు మూసుకోవడం అంటే, నిశ్చలానందాన్ని అనుభవించడం. కళ్లు మూసుకోవడం అంటే, దివ్య చైతన్యాన్ని నీ ముందర సాక్షాత్కరింప జేసుకోవడం. అదే సత్యం.*


*అదే బ్రహ్మానంద పారవశ్యం. అదే జగత్తును ఆడిస్తున్న క్రీడ. అదే శివం. అదే సుందరం.*


*చూపు మారితే సర్వస్వమూ మారుతుంది!☘️

మహత్తు

 మంత్రం మహత్తు తెలుసుకుందాం. 


మన ప్రాచీన ఋషులు, ద్రష్టలు సామాన్య జనజీవన ఉధ్ధారణ కోసం, సామాన్య గృహస్థ జీవన సమస్యా పరిష్కారాల కోసం, లోక వ్యవహరిక రీతులు కాకుండా ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన ఒకానొక విధానం ద్వారా ఇహం లోని సమస్యలు పరిష్కారం అయి, పరం యందలి పరమాత్మ అనుగ్రహం కోసం కూడా లభించడం కోసం కనుగొన్న విధానమే మంత్ర శాస్త్రం.


శబ్దానికి కల ప్రభావమే మంత్రం. మాట మంత్రం. మాట వేదమనే మాట సత్యమైనది. ఎందుకు అంటే మన పెద్దలు "మాట ఆచి తూచి మాట్లాడండి,మనం మాట్లాడే మాటలోనే మంచి కానీ, చెడు కానీ, భాధకానీ, సంతోషం కానీ కలుగుతాయి. ఒక సారి పెదవి దాటిన మాట పృథ్వి దాటుతుంది అంటారు. మాటను వెనక్కి తీసుకోలేం అంటారు.


మాటతో మనిషిని నొప్పించడం అనేది హింసించడమే అవుతుంది. అంటే మాటకు అంత బలం ఉంది అని అర్థం.


బాష తెలిసినా తెలియకపోయినా శబ్దోచ్చారణని బట్టి మాట్లాడే మనిషి మనోబావం, కోపమా, తాపమా, సంతోషమా, దుఃఖమో ఏదో తెలుసుకోవచ్చు. శబ్దానికి కల ప్రభావం ఎటువంటిది అంటే చక్కటి పాట వింటే పరవశులం అయిపోతాం. 


ఎవరైనా కోపం తో మాట్లాడుతూ ఉంటే బాధపడతాం. అలాగే సంగీతం వినిపించి వ్యాధులను నయం చేయడం, సంగీతం వినిపించి మొక్కలు ఏపుగా పెంచడం వంటివి మనం గమనించాము కూడా. పరిశోధనాత్మక నిరూపణ కూడా అయింది. 


పురాతన కాలం నాటి మాట కాదు 19 వ శతాబ్దంలోని మాటే! అమెరికా లో రూథర్ బర్ బంక్ అనే మహనీయుడు విశాలమైన తన తోటలో పెంచే అనేక మొక్కలకు వివిధ దశల్లో సంగీతం వినిపిస్తూ ఉండే వాడు. ముళ్ళతో పెరిగే చెట్లతో మృదువుగా మాట్లాడుతూ, నీకు ముళ్ళు ఎందుకు!? నిన్ను ఎవరైనా బాధ పెడితే నిన్ను నువ్వు కాపాడుకోవడానికా !? ముళ్ళు లేకుండా ఉంటే అందరూ నీ దగ్గరకు వస్తారు. మృదువుగా నిన్ను తాకి మెచ్చుకుంటారు. ఇలా మాట్లాడుతూ, మృదువైన సంగీతం వినిపిస్తూ క్రమ క్రమంగా ఆ చెట్లు ముళ్ళు లేకుండా పెరిగే విధంగా చేశాడు. ఈ పద్దతి లో ఆయన అతి పెద్ద బంగాళా దుంప పెంచాడు. దాన్ని బర్ బాంక్ పొటాటో అంటారు. లాస్ ఏంజిల్స్ నగరంలో బర్ బాంక్ అని ఆ యొక్క మహానుభావుడి జ్ఞాపక చిహ్నంగా ఒక పేట కూడా ఉంది ఇప్పటికీ కూడా. 


మఱ్ఱి చెట్టుకి బర్ బాంక్ బాష అర్థం అయింది అనుకుందామా ? లేదు. మర్రి అందులోని భావం అర్థం అయిందా అంటే అది కూడా కాదు. ఆయన స్వరంలోని శబ్ద మాధుర్యం వాటికి జీవం పోసాయి. ఆయన వినిపించే సంగీతం వాటిని ప్రభావితం చేసాయి. అంటే శబ్దానికి కల ప్రభావం అది అని మనం అర్థం చేసుకోవాలి. 


కాబట్టి అర్థం తో నిమిత్తం లేకుండా శబ్ద ప్రాధాన్యత తో కొన్ని మాటలు లేక శబ్దాలు వెలిశాయి. అవి మహ ఋషులు తమ ధ్యానం లో దర్శించి బయటకు వచ్చిన శబ్దార్దాలు. 


ఒక నిర్ణీత క్రమంలో చేయబడిన శబ్దాలు. పసి పిల్లలకు మనం జోలపాడుతాం. ఆ జోలపాటలు అర్థం వాడికి తెలుసా!? తెలియదు కదా!? కానీ ఆ పాటలోని లయ వాడిని హాయిగా నిద్ర పుట్టిస్తుంది.


ఒక శబ్దం చుట్టుపక్కల పరిసరాల మీద, లేక ఆ శబ్దం ఉఛ్ఛరించే వ్యక్తి మీదా చూపే ప్రభావమే మంత్రం. మంత్రం వాగ్రూపం. వాక్కు నాలుగు విధాలుగా విబజింపబడి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని ఏర్పడ్డాయి. వీటిలో మూడు అంతరంగంగా ఉంటాయి. ఓకే ఒక్క వైఖరీ వాక్కునే మానవులు పలుకుతున్నారు . పరా వాక్కు ఆది పరాశక్తికి సంబంధించినది. పశ్యంతిబింద్వాత్మకము. మధ్యమా నాదాత్మకము. వైఖరీ బీజాత్మకము. 


సేకరణ. మానస సరోవరం 👏