23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

క్యాల్షియం గురించి వివరణ - 2 .

 క్యాల్షియం గురించి వివరణ - 2 . 


 చిన్నపిల్లల్లో క్యాల్షియం లోపం - 


      క్యాల్షియం లోపము ఉన్నటువంటి స్త్రీలకు పుట్టిన పిల్లలకు కూడా అదేవిధమైన లోపము రావడానికి అవకాశం ఉన్నది . ఇట్టి పిల్లలలో ఎదుగుదల లోపిస్తుంది . వీరి ఎముకలలో పటుత్వము ఉండదు . ఈ పిల్లలకు ఆకలి మందగించి ఉంటుంది . వీరికి పాలు కాని లేక వేరే ఆహారం ఎదైనా బలవంతముగా తినిపించిన వాంతి చేసుకుంటూ ఉంటారు . వీరి మూత్రము నేల మీద పోసినప్పుడు మూత్రము ఇంకిపోయి మూత్రము పడినంత మేర సున్నపు తేట తెల్లగా ఉండును . దంతాలు వచ్చుట ఆలస్యం అగును . వ్యాధినిరోధక శక్తి తక్కువుగా ఉండటం వలన ఈ పిల్లలకు అన్ని రోగాలు తేలికగా సంక్రమించే అవకాశం ఉన్నది . 


  స్త్రీలలో క్యాల్షియం లోపం - 


      స్త్రీలలో క్యాల్షియం లోపించిన రజస్వల అవడం చాలా ఆలస్యం అగును. ఋతుక్రమము సరిగ్గా ఉండదు . బహిష్టులో రక్తస్రావం అధికంగా జరుగును . ఇలా జరగటం వలన " రక్తహీనత " ఉన్నవారిలా ఉంటారు . బాలింతలకు పాలు సరిగ్గా ఉండవు . 


  క్యాల్షియం ఎక్కువైన కలుగు సమస్యలు - 


      క్యాల్షియం ఎక్కువ అయిన పొట్టనొప్పి , వాంతులు , కండరములు బలహీనత , మానసిక స్థిరత్వం కోల్పోవుట , మూత్రపిండములలో క్యాల్షియం , ఫాస్ఫరస్ కలిసి రాళ్లుగా ఏర్పడటం , నోరు , గొంతు ఎండినట్టుగా ఉండటం , ఆకలి మందగించుట , బద్ధకం , నిస్తేజముగా ఉండటం , క్యాల్షియం ఎక్కువ అయ్యిందని తెలుసుకొవడానికి మరొక ముఖ్య చిహ్నము కంటి యొక్క " CARNEA " పైన తెల్లటి  కుదపలు కనిపిస్తాయి . కనురెప్పల చివరన కూడా చిన్నచిన్న కుదపలు ఏర్పడి కళ్ళమంటలు పెరిగి నీరు కారుతూ ఉంటాయి . దీనివల్ల కంటి కి చాలా అపకారం జరుగును . 


    క్యాల్షియం ఎక్కువ అయినవారు క్యాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాల జోలికి వెళ్లకుండా ఉండవలెను . ఉదాహరణకు ఉల్లి , చిక్కుడు , గుడ్లు వంటివాటిని తీసుకొవడం ఆపివేయాలి . 


           కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో క్యాల్షియం ఎక్కువ వాడాల్సివస్తుంది . ఉదాహరణకు రికెట్స్ సమస్య , ఎముకలకు సంబంధించిన వ్యాధుల్లోనూ , ఎముకలు విరిగినప్పుడు అతుకుట ఆలస్యం అయినను , పుచ్చుపళ్ళు ఉన్నవారు , చర్మం ఎండినట్లుగా ఉండి ముడుచుకుపోయినవారు , కొన్నిరకాల చర్మసంబంధ ఎలర్జీలలో క్యాల్షియం తప్పక వాడవలెను . 


          తరవాతి పోస్టు నందు మరొక థాతువు  గురించి తెలియచేస్తాను .


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

కామెంట్‌లు లేవు: