పేరు : తుమ్మ జనార్ధన్ (కలం పేరు: జాన్)
ఊరు : దిల్ సుఖ్ నగర్, రంగారెడ్డి జిల్లాఫోన్ : 9440710501
శీర్షిక: దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ – అని అన్నారు 1910లో గురజాడ గారు.
2022లో నేనంటున్నాను …
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే వట్టి మనుషులూ కాదోయ్
దేశమంటే దేశపౌరుల మానసికతేనోయ్
ఆ పౌరుల వజ్ర సం..కల్పాలోయ్, దేశ.. భక్తి పర్వాలోయ్.
మనిషి మనిషిని దోచుకుంటే
పేదవాడికి తిండి కరువైతే, రైతు గుండెల నీరు నిండితే
దేశమే గతి బాగుపడునోయ్, నీ దేశమేగతి బాగుపడునోయ్.
తోటివాడికి తోడు నిలిచి, కొంత మేల్ తలపెట్టవోయ్
సొంత లాభం కొంత మాని, పొరుగువాడికి పంచవోయ్,
ఆనందసాగర మీదవోయ్.
యువశక్తి పెడదారి పడితే, దేశమాతకు దిక్కు ఎవరోయ్
స్వార్థ చింతన కొంత మాని, దేశసేవకు కదలవోయ్,
దేశభక్తులు ఎందుగలరో, అచ్చటే అభివృద్ధి గలదోయ్.
ఈర్ష్య ద్వేషం మానివేసి, ప్రేమ భావన పెంచవోయ్
అందలాలను వదిలిపెట్టి, మందిరాలను చేరవోయ్,
మానవత్వ మందిరాలను చేరవోయ్.
సాటి మహిళను గౌరవించు, మహిళా శక్తిని గుర్తించవోయ్
కామవాంఛలు కాదు గమ్యం, అండగా నువు నిలవవొయ్
ఆడపడుచుల అండగా నువు నిలువవోయ్.
🙏🙏😊😊💐😊😊🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి