23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

మహత్తు

 మంత్రం మహత్తు తెలుసుకుందాం. 


మన ప్రాచీన ఋషులు, ద్రష్టలు సామాన్య జనజీవన ఉధ్ధారణ కోసం, సామాన్య గృహస్థ జీవన సమస్యా పరిష్కారాల కోసం, లోక వ్యవహరిక రీతులు కాకుండా ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన ఒకానొక విధానం ద్వారా ఇహం లోని సమస్యలు పరిష్కారం అయి, పరం యందలి పరమాత్మ అనుగ్రహం కోసం కూడా లభించడం కోసం కనుగొన్న విధానమే మంత్ర శాస్త్రం.


శబ్దానికి కల ప్రభావమే మంత్రం. మాట మంత్రం. మాట వేదమనే మాట సత్యమైనది. ఎందుకు అంటే మన పెద్దలు "మాట ఆచి తూచి మాట్లాడండి,మనం మాట్లాడే మాటలోనే మంచి కానీ, చెడు కానీ, భాధకానీ, సంతోషం కానీ కలుగుతాయి. ఒక సారి పెదవి దాటిన మాట పృథ్వి దాటుతుంది అంటారు. మాటను వెనక్కి తీసుకోలేం అంటారు.


మాటతో మనిషిని నొప్పించడం అనేది హింసించడమే అవుతుంది. అంటే మాటకు అంత బలం ఉంది అని అర్థం.


బాష తెలిసినా తెలియకపోయినా శబ్దోచ్చారణని బట్టి మాట్లాడే మనిషి మనోబావం, కోపమా, తాపమా, సంతోషమా, దుఃఖమో ఏదో తెలుసుకోవచ్చు. శబ్దానికి కల ప్రభావం ఎటువంటిది అంటే చక్కటి పాట వింటే పరవశులం అయిపోతాం. 


ఎవరైనా కోపం తో మాట్లాడుతూ ఉంటే బాధపడతాం. అలాగే సంగీతం వినిపించి వ్యాధులను నయం చేయడం, సంగీతం వినిపించి మొక్కలు ఏపుగా పెంచడం వంటివి మనం గమనించాము కూడా. పరిశోధనాత్మక నిరూపణ కూడా అయింది. 


పురాతన కాలం నాటి మాట కాదు 19 వ శతాబ్దంలోని మాటే! అమెరికా లో రూథర్ బర్ బంక్ అనే మహనీయుడు విశాలమైన తన తోటలో పెంచే అనేక మొక్కలకు వివిధ దశల్లో సంగీతం వినిపిస్తూ ఉండే వాడు. ముళ్ళతో పెరిగే చెట్లతో మృదువుగా మాట్లాడుతూ, నీకు ముళ్ళు ఎందుకు!? నిన్ను ఎవరైనా బాధ పెడితే నిన్ను నువ్వు కాపాడుకోవడానికా !? ముళ్ళు లేకుండా ఉంటే అందరూ నీ దగ్గరకు వస్తారు. మృదువుగా నిన్ను తాకి మెచ్చుకుంటారు. ఇలా మాట్లాడుతూ, మృదువైన సంగీతం వినిపిస్తూ క్రమ క్రమంగా ఆ చెట్లు ముళ్ళు లేకుండా పెరిగే విధంగా చేశాడు. ఈ పద్దతి లో ఆయన అతి పెద్ద బంగాళా దుంప పెంచాడు. దాన్ని బర్ బాంక్ పొటాటో అంటారు. లాస్ ఏంజిల్స్ నగరంలో బర్ బాంక్ అని ఆ యొక్క మహానుభావుడి జ్ఞాపక చిహ్నంగా ఒక పేట కూడా ఉంది ఇప్పటికీ కూడా. 


మఱ్ఱి చెట్టుకి బర్ బాంక్ బాష అర్థం అయింది అనుకుందామా ? లేదు. మర్రి అందులోని భావం అర్థం అయిందా అంటే అది కూడా కాదు. ఆయన స్వరంలోని శబ్ద మాధుర్యం వాటికి జీవం పోసాయి. ఆయన వినిపించే సంగీతం వాటిని ప్రభావితం చేసాయి. అంటే శబ్దానికి కల ప్రభావం అది అని మనం అర్థం చేసుకోవాలి. 


కాబట్టి అర్థం తో నిమిత్తం లేకుండా శబ్ద ప్రాధాన్యత తో కొన్ని మాటలు లేక శబ్దాలు వెలిశాయి. అవి మహ ఋషులు తమ ధ్యానం లో దర్శించి బయటకు వచ్చిన శబ్దార్దాలు. 


ఒక నిర్ణీత క్రమంలో చేయబడిన శబ్దాలు. పసి పిల్లలకు మనం జోలపాడుతాం. ఆ జోలపాటలు అర్థం వాడికి తెలుసా!? తెలియదు కదా!? కానీ ఆ పాటలోని లయ వాడిని హాయిగా నిద్ర పుట్టిస్తుంది.


ఒక శబ్దం చుట్టుపక్కల పరిసరాల మీద, లేక ఆ శబ్దం ఉఛ్ఛరించే వ్యక్తి మీదా చూపే ప్రభావమే మంత్రం. మంత్రం వాగ్రూపం. వాక్కు నాలుగు విధాలుగా విబజింపబడి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని ఏర్పడ్డాయి. వీటిలో మూడు అంతరంగంగా ఉంటాయి. ఓకే ఒక్క వైఖరీ వాక్కునే మానవులు పలుకుతున్నారు . పరా వాక్కు ఆది పరాశక్తికి సంబంధించినది. పశ్యంతిబింద్వాత్మకము. మధ్యమా నాదాత్మకము. వైఖరీ బీజాత్మకము. 


సేకరణ. మానస సరోవరం 👏

కామెంట్‌లు లేవు: