22, సెప్టెంబర్ 2022, గురువారం

క్యాల్షియం

 క్యాల్షియం గురించి వివరణ - 1 . 


     మానవ దేహములో క్యాల్షియం ఎముకల పెరుగుదలకు , దంతాలు గట్టిగా ఉండి ఎదుగుటకు ప్రముఖ పాత్ర వహించును . 70 కిలోలు ఉన్న మానవ దేహము నందు సుమారుగా 1 కిలో క్యాల్షియం వివిధ లవణాలతో సంయోగం చెంది ఉండును . 


    క్యాల్షియం ఎక్కువుగా అవసరం అయ్యే పరిస్థితులు - 


 *  గర్భవతులుగా ఉన్న స్త్రీలు , పాలిచ్చు బాలింతలకు క్యాల్షియం చాలా ఎక్కువ అవసరం అగును . 


 *  ప్రమాదవశాత్తు గాయపడినప్పుడు కలుగు రక్తస్రావములో రక్తం గడ్డకట్టుటకు క్యాల్షియం అవసరం అగును . 


 *  విటమిన్ B12 శరీరం సంగ్రహించుటకు , కొన్ని ఎలర్జీ కేసులలో కూడా క్యాల్షియం అవసరం అగును . 


  క్యాల్షియం ఎక్కువుగా ఉన్న ఆహారపదార్దాలు - 


  పెద్ద ఉల్లి , ఆకుకూరలు , మునగ , గుడ్డు యందలి పచ్చసొన , చిక్కుడు మొదలగు ఆహారపదార్థాలలో క్యాల్షియం విరివిగా లభ్యం అగును . 


        గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు ప్రతిరోజూ 1000 నుండి 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం అగును . సాధారణ ప్రజానీకానికి మాత్రం రోజుకు 400 నుండి 500 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం అగును . 


  క్యాల్షియం గ్రహించుట మరియు విసర్జించుట - 


       క్యాల్షియం శరీరం సంగ్రహించుటకు అనేక పరిస్థితులు అనుకూలంగా ఉండవలెను . ముఖ్యముగా శారీరక ఆరోగ్యము పైన , జీర్ణాశయము నందలి చిన్నప్రేగుల పరిస్థితి పైన , ఆవ్యక్తి తీసుకొనే విటమిన్ల పైన అధారపడి ఉండును . 


               సాధారణముగా మలమూత్ర విసర్జన ద్వారా క్యాల్షియం శరీరం నుండి బయటకి వెడలిపోతుంది . శరీరానికి తగినంత క్యాల్షియం లేకపోవడాన్ని వైద్యులు   " హౌపో కాల్షిమియా " అంటారు . ఇలా క్యాల్షియం లోపించడానికి ముఖ్య కారణం మనము తీసుకునే ఆహరంలో A , B12 , D మరియు C విటమిన్స్ , ఫాస్ఫరస్ మొదలైనవి లోపించినప్పుడు కూడా క్యాల్షియం తగ్గును . ఇలా క్యాల్షియం లోపించినవారికి కండరాల నొప్పులు కలుగును . ఈ క్యాల్షియం మన శరీరం సంగ్రహించుటకు ముఖ్యమైనది సూర్యరశ్మి . ఈ సుర్యరశ్మి వలెనే క్యాల్షియం ఒంటబట్టించు విటమిన్ D మన శరీరము నందు తయరగును . కావున ప్రతిరోజు సుర్యరశ్మి మన శరీరముకు తగులునట్లు చూసుకోవలెను . 


   క్యాల్షియం లోపించుట వలన కలుగు బాధలు  - 


 * దొంతర పళ్లు పెరుగుట . 


 *  ఏ కొంచం పనిచేసిన అలిసిపోవుట . 


 *  పనిచేయాలనిపించక బద్ధకముగా ఉండటం . 


 *  చలికి తట్టుకోలేకపోవుట . 


 *  ప్రతి చిన్నపనికి అతిగా ఆందోళన చెందుట . మరణ భయం కలుగుట . 


 *  చలికాలము నందు కూడా తలచుట్టూ చెమటపట్టుట . వంటి భాధలు క్యాల్షియం లోపించటం వలన కలుగును . 


         మరింత విలువైన సమాచారం తరవాతి పోస్టు నందు వివరిస్తాను . 


 

         మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

కామెంట్‌లు లేవు: