22, సెప్టెంబర్ 2022, గురువారం

మహర్షుల చరిత్ర*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

        *మన మహర్షుల చరిత్ర*          


*🌹ఈ రోజు 33 వ జైగీషవ్య మహర్షి గురించి తెలుసుకుందాము🌹*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


*జిగీషువు అంటే జయించాలన్న కోరిక కలవాడు అని అర్థం ఏం జయించాడో చూద్దాం.*


🌸 జైగీషవ్యుడు కపిల మహర్షికి శిష్యుడు మిత్రుడు కూడా . వీళ్ళిద్దరూ కలిసి అశ్వశిరుడనే రాజుని చూడ్డానికి వెళ్ళారు . 


🌿రాజు అతిథి సత్కారం చేసి విష్ణుమూర్తి కటాక్షానికి ఏం చెయ్యాలో చెప్పమన్నాడు . 


🌸కపిలుడు నన్ను విష్ణుమూర్తిగా తెలుసుకో అన్నాడు . నాకు విష్ణుమూర్తి తెలుసు . అతనికి గద , శంఖం , చక్రం లాంటివి ఉంటాయి , 


🌿నీకు లేవుకదా అన్నాడు రాజు . కపిల మహర్షి గద , శంఖం , చక్రం అన్నిటితోను విష్ణువుగానూ , జైగీషవ్యుడు గరుడ వాహనంగానూ కనిపించారు . 


🌸మరి విష్ణుమూర్తి కమల నాభుడు కదా ! బ్రహ్మ ఏడి ? అన్నాడు రాజు . కపిలుడు కమల నాభుడుగా జైగీషవ్యుడు బ్రహ్మగానూ మారారు . 


🌿ఇదంతా మోసం నేను నమ్మనన్నాడు రాజు . కపిలుడు రాజ్యసభని మాయమైపోయేలా చేశాడు . ఎక్కడ చూసినా క్రూర జంతువులే కనిపంచాయి . 


🌸రాజు భయపడి కపిలుడికి నమస్కారం చేసి నువ్వే విష్ణువు , జైగీషవ్య మహర్షి బ్రహ్మ . నా తప్పుని క్షమించండి అన్నాడు . 


🌿దేవలుడు అనే మహాయోగికి తాను గొప్పవాడినని గర్వం . కాని అతడు సత్యవ్రతుడు , ఉత్తముడు , తపస్వికూడా . 


🌸ఒకనాడు జైగీషవ్యుడు దేవలుడింటికి వచ్చి కొన్నాళ్ళిక్కడే ఉండి తపస్సుచేసుకుంటానని చెప్పాడు .


🌿 జైగీష్యవుడి వంటి మహా యోగీశ్వరుడు తనింటి దగ్గర ఉండడమంటే దేవలుడికి చాలా ఆనందంగా అనిపించి అలాగే వుండమన్నాడు దేవులుడు .


🌸జైగీషవ్యుడు తపస్సు చేసుకుంటున్నాడు . ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి . మౌనం వదలడు . నిష్ట విడవడు .

ఉగ్రమైన తపస్సు చేస్తూ తేజస్సుతో వెలిగిపోతున్నాడు జైగీషవ్యుడు . 


🌿సుందరి దేవలుడు ఎలాగయినా తన గొప్పని నిరూపించుకోవాలని ఒకనాడు అంతర్ధానమై సముద్రస్నానానికి వెళ్ళేసరికి అప్పటికే స్నానం చేసి తపస్సు చేసుకుంటున్నాడు జైగీషవ్యుడు . 


🌸తన పని పూర్తిచేసుకుని యోగవిద్యతో తిరిగి వచ్చిన దేవలుడు యధాస్థానములో కూర్చుని మౌననిష్టలో వున్న జైగీషవ్యుడ్ని చూసి ఆశ్చరయపోయాడు . 


🌿ఇంకా తన శక్తి నిరూపించుకోవడం కోసం యోగశక్తితో ఆకాశానికి ఎగిరి సిద్ధలోకం చేరేటప్పటికి జైగీషవ్య మహర్షిని సిద్ధులు సేవిస్తూ కనిపించారు . 


🌸దేవలుడు పితృలోకం , యమలోకం , సోమలోకం అగ్నిలోకం , రుద్రలోకం ఇలా ఎక్కడికి వెళ్ళినా జైగీషవ్య మహర్షి అక్కడే కనిపించాడు .


🌿 దేవలుడు మహర్షి పాదాల మీద పడి సామాన్యమైన మనిషిలా నా ఆతిథ్యం అడిగావు , నువ్వింత గొప్పవాడివని నాకు తెలియదు క్షమించమన్నాడు .


🌸 దేవలుడు జైగీషవ్య మహర్షికి శిష్యుడయి తన తపస్సు ధారపోసి పితృదేవతలకు ఉత్తమగతులు భూతతృప్తి కలిగించి సన్యాసం తీసుకుని మోక్షాన్ని పొందాడు .


*🌹జై గీషవ్యుని పార్వతీపరమేశ్వరులు పరీక్షించుట : 🌹*


🌿జైగీషవ్యుఁడు పార్వతీపరమేశ్వరులు మేరుపర్వత ప్రాంతమున విహరించుచున్న సమయమున మహర్షి బోయి యీశ్వరసన్నిధిని కుర్చుండెను.


🌸పరమేశ్వరుని పరివార మంతయు 

సిద్ధ సాధ్య యక్ష గంధర్వా ఆప్సరసలు గణములు వారిని సేవించు ఆవకాశమున కెదురుచూచుచుండెను. 


🌿ఆ సమయమున పార్వతీ పరమేశ్వరుల ప్రసంగవశమున పార్వతి “దేవా! అర్థ మేది ? అర్థశక్తి యేది? దయ దలచి తెలుపు" మని భర్తను ప్రార్థించెను.


🌸పరమేశ్వరుడిట్ల ఆనెను. "దేవీ ! అర్థమును నేను. అర్థశ క్తివి నీవు. నేను భోక్తను. నీవు భోజ్యమవు. నేను వరుడను. నీవు ప్రకృతివి. విష్ణుడు డను,  బ్రహ్మను, యజ్ఞపురుషుడను 

నేనే.


🌿 “నాథా ! అర్థము, అర్థశక్తి వీనిలో 

ఏది యధిక" మని పార్వతి పరమేశ్వరు నడిగెను. ఆతడేమియు సమాధానము చెప్పక మిన్నకుండెను. అపుడు 

జై గీషవ్యుఁడు "తల్లీ ! అర్థమే అధికమైనది. 


🌸అర్థశక్తి యర్థమునందు లయించియున్న" ఆని బదులుచెప్పెను. తాను తనభర్తను ప్రశ్నింపగా సమాధాన మిచ్చుటకు వీడెవ డనియు,తను పలుకుట కాతని కెంత కండకావర ​మనియు పార్వతి యాతనిపై గోపించెను. 


🌿అది గ్రహించి జైగీషవ్యుడట అచట నుండి వెడలిపోయెను. అపుడు శివుడు పార్వతిని జూచి "దేవి! అతడు జైగీషవ్యుఁడు. మహాయోగి. మహా జ్ఞాని. మన పరమభక్తుడు. 


🌸పరమ ప్రశాంత చిత్తుడు. ఆతని నట్లు కోపించితివి. ఆతడు నా భక్తుడు. సఖుడు, శిష్యుడును" అని పలికెను. అందులకు పార్వతి “దేవా! నీ 

నా సంభాషణమున ఆతడడ్డువచ్చి సమాధాన మిచ్చుట 


🌿నన్న ఆవమానించుట కాదా? మనల నాశ్రయించి వరములు గ్రహింప వచ్చిన యాతడు మనతో సమానస్థాయిని మాటాడి దోషయుక్తుడై నాడని పలికెను.


🌸 దానిపై శివుడు "దేవీ! కాదు. కాదు. ఆతని కే వరము నక్కఱలేదు. 

ఆతడట్టి ఆశించి మన కడకు రాలేదు. ఆతడు ద్వంద్వాతీతుడు, 

సమలోష్టాశ్మ కాంచనుడు, నిరాశి. 


🌿ఆతని కింద్రత్వము, బ్రహ్మత్వము, రుద్రత్వము తృణప్రాయములు. ఆతడు బ్రహ్మజ్ఞాని. ఆతని నీ వట్లు తృణీకరింపరా" దనెను. అందులకు పార్వతి “ఐనచో ఆతని ఆశా రాహిత్యమును పరీక్షింప నా ఆనుజ్ఞయిమ్మని పరమేశ్వరుని కోరెను.


🌸 అపుడు పార్వతీపరమేశ్వరులు వృషభారూఢులై కొంతపరివారము వెంట రాగా, పరిశుద్దాత్ముడు, ముని శ్రేష్ఠుడు నగు జైగీషవ్యుని యాశ్రమమునకు వచ్చి చేరిరి.


🌿ఏ కోరికయు లేక గాలిలేనిచోట ప్రకాశించు దీపమువలె వెలుగుచు,  చిద్విలాసము ముఖమున  జిందులు ద్రొక్కు జైగీషవ్య యోగీంద్రుని దగ్గఱి పార్వతీపరమేశ్వరులు నిలిచి "యోగీంద్రా !


🌸 నీకు కావలసిన వర మేదైన కోరుకొమ్ము. ఎట్టి యసాధ్యవరమైన ఆనుగ్రహింతు” మని పలికిరి. 

జైగీషవ్యుడు వారికి నమస్కరించి శంకరుని జూచి "దేవా! నీ దయ ఈయలేని దేమున్నది ? 


🌿నేను కృతార్థుడను. నాకు వలయున దేమియు లేదు” అని బదులు చెప్పెను. పార్వతీపరమేశ్వరు ఆతని రెట్టించి రెట్టించి ఆడిగి ఏన్ని విధములనో ఆతనిని మభ్యపెట్ట జూచిరి కానీ మహర్షి ఏమియు గోరుకొనక ధ్యానంలో ఉండెను


🌿నిజముగ నాత ​ఆతనికి కావలసిన ఏమైన నున్నగదా కోరుట? ఏ కోరిక లేనివాడే కోరిక కోరును?


🌸పార్వతీ పరమేశ్వరు ఏంత యత్నించిన ఆతడు చలింపడాయెను.


🌿 పరమేశ్వరుడు పార్వతివంక జూచెను. ఆమె జైగీషవ్యుని పలుకరించి కనికరించి తాను పడ్డ కోపమునకు బాధపడకు మనెను. 


🌸ఆత“డమ్మా! కోపతాప లన్నియు నాకు సమానమే" యని పలికి భక్తితో వారిని వీడ్కొలిపెను. ఈ పరీక్షలో పార్వతీపరమేశ్వరు లోడిపోయిరి.

జైగీషవ్యుఁడు గెలిచెను...


🌿ఏమీ వద్దన్నాడు జైగీషవ్యుడు ! అంటే అసలు కోరికలే లేవు ఆయనకి . అంత గొప్ప మహర్షి .


🌸ఇదండీ జైగీశావ్యుడు మహర్షి గురించి మనం తెలుసుకున్న విషయాలు రేపు మరో మహర్షి చరిత్ర తెలుసుకుందాము స్వస్తి..


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

కామెంట్‌లు లేవు: