ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
8, ఏప్రిల్ 2025, మంగళవారం
రామాయణం
🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🪷బుధవారం 9 ఏప్రిల్ 2025🪷*
*రామాయణం*
ఒకసారి చదివినంత మాత్రాన
మన సమస్త పాపాలని తీసేస్తుంది.
*వాల్మీకి రామాయణం*
*3 వ భాగం*
రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు...
పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది.
ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. (యోజనం అంటే = 9 మైళ్ళు) ఆ నగరం మధ్యలో రాజ ప్రాసాదంలో దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెఱకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో, ఏ ఇంట్లోను కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు.
దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు… దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు.
వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.
ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది.
ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు.
దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు...```
*”సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం।*
*ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||*
```
పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు... “ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను” అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు.
“ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి” అన్నాడు.
అప్పుడు దశరథ మహారాజు, “నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు” అంటే,
సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు... “పూర్వకాలంలో విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.
వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, “రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు?” అన్నారు.
ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు...```
*ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి ।*
```
రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.
ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు.
ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, “మహాపురుషులారా! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను” అన్నాడు.
అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు.
మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు.
సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే...```
*తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని ।*
*వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ॥*```
ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు.
కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు... “మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా” అని అడిగాడు.
రోమపాదుడు ఆనందంగా పంపించాడు.
దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.
*రేపు...4వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
బుధవారం🪷* *🌷09, ఏప్రిల్, 2025🌷* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*
*🪷బుధవారం🪷*
*🌷09, ఏప్రిల్, 2025🌷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్ర మాసం - శుక్లపక్షం*
*తిథి : ద్వాదశి* రా 10.55 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : బుధవారం* ( సౌమ్యవాసరే )
*నక్షత్రం : మఖ* ఉ 09.57 ఉపరి *పూర్వ ఫల్గుణి (పుబ్బ)*
*యోగం : గండ* సా 06.26 వరకు ఉపరి *వృద్ధి*
*కరణం : బవ* ఉ 10.00 *బాలువ* రా 10.55 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 08.00 - 11.30 సా 04.00 - 05.00*
అమృత కాలం : *ఉ 07.21 - 09.05*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : సా 06.46 - 08.32*
*దుర్ముహూర్తం : ప 11.44 - 12.34*
*రాహు కాలం : మ 12.09 - 01.42*
గుళికకాళం : *ఉ 10.36 - 12.09*
యమగండం : *ఉ 07.30 - 09.03*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *సింహం*
సూర్యోదయం :*ఉ 05.57*
సూర్యాస్తమయం :*సా 06.22*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.56 - 08.25*
సంగవ కాలం : *08.25 - 10.54*
మధ్యాహ్న కాలం : *10.54 - 01.24*
అపరాహ్న కాలం : *మ 01.24 - 03.53*
*ఆబ్ధికం తిధి : చైత్ర శుద్ధ ద్వాదశి*
సాయంకాలం : *సా 03.53 - 06.22*
ప్రదోష కాలం : *సా 06.22 - 08.40*
రాత్రి కాలం : *రా 08.40 - 11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.09*
--------------------------------------------------
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷శ్రీ సరస్వతి స్తోత్రం🪷*
*(అగస్త్య కృతం)*
*ఙ్ఞాన విఙ్ఞాన రూపాయై*
*ఙ్ఞానమూర్తే నమో నమః |*
*నానాశాస్త్ర స్వరూపాయై*
*నానారూపే నమో నమః*
*🌷ఓం సరస్వత్యై నమః🌷*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
హిందువా
* హిందువా...తెలుసుకో*
😔😔😔😔😔😔😔😔😔
*నువ్వు చేసే ప్రతి చర్యను అనుమానిస్తూ , హేళన చేస్తూ హైందవ ద్వేషులు నిన్ను సైన్స్ అనే చట్రంలో బిగించి సంస్కృతి , సంప్రదాయాలనుండి నెమ్మదిగా దూరం చేస్తూ మెదళ్లలోకి విషాన్ని నింపుతున్నారు*
😡😡😡😡😡😡😡😡😡
ఈరోజున మన అందరికీ దాదాపుగా ఒక పిచ్చి పట్టింది ! అదేమిటంటే ఒక పండుగ వచ్చింది ! ఉదాహరణకు వినాయకచవితి ! 21 ఆకులతో విఘ్నేశ్వరుడిని పూజిస్తారు ఆ ఆకులన్నీ వైద్యంలో పనికి వచ్చే దివ్య ఔషధాలు ...అంతేగాక ..blablabla ...ఇట్లా వందకారణాలు చెప్పుకొని అట్లా పండుగ చెయ్యడం శాస్త్రీయం కాబట్టి చేస్తున్నాం అని మనకు మనం చెప్పుకొని సమాధాన పడి చేయడం ఎక్కువ అయ్యింది .
దానికి తగ్గట్లుగా పేపర్లలో వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా వస్తాయి for and against
..
అలాగే ఈ రోజు శ్రీరామనవమి ! రాముడు పుట్టాడు కాబట్టి పండుగ ! పానకం ఎందుకు తాగటం అంటే వడదెబ్బ తగులకుండా ! రెడీగా సమాధానం ! తాగుతాం అంతే అని ఎందుకు చెప్పరు ?
ఇట్లా ప్రతిదానికి అలాగే మనం చేసే సాంస్కృతికమైన ప్రతిపనికి scientific basis ఆలోచిస్తూ తోచిన అన్వయం చెప్పుకుంటూ సమాధాన పడుతూ గడుపుతున్నాం ! మనం చేసినదే మన పిల్లలు కూడా scientific evidence వెతికి చేస్తారు వారి పిల్లలు వారి పిల్లలు !
..
అంటే ఎవరూ వారి పూర్వీకులను నమ్మని స్థితికి వచ్చారు...అని కదా !
..
....ఇలా మన తాతలు తండ్రులు చేసినదానిని మనం నమ్మక కారణం వెతుక్కోవడం మనం చేసిన దానిని మన తరువాత తరాలు కారణం వెతుక్కోవడం పిచ్చికాక మరేమిటి ?
...
ఏ పండుగ నయినా హాయిగా ఇది నా సంస్కృతి నా సంప్రదాయం ఇలాగే ఆచరిస్తాను అని ఆచరిద్దాం ! అనవసరంగా ప్రతిదానిని సైన్సు అనే చట్రంలో ఇరికించి చూడటం మానేద్దాం !
..
సైన్సు సైన్సులాగ నేర్చుకుందాం! సంస్కృతి ని , ఆచారాన్ని జీవన విధానాన్ని ముందుకు తీసుకెళదాం !
దానిదోవదానిదే దీనిదోవ దీనిదే !
...
ఊటుకూరు జానకిరామారావు
రామాయణం
🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*రామాయణం*
ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.
*వాల్మీకి రామాయణం:*
*2 వ భాగం*
వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు...
“సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి “మీదగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను” అన్నాడు.
ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి “నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు” అని అగ్నిశర్మని అడిగారు.
“నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి” అని చెప్పాడు శర్మ.
“అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా!” అని అత్రి మహర్షి అన్నారు.
“మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి” అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు.
చాలా బాధ కలిగి, మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి, “నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమ”న్నాడు.
“ధ్యానం చెయ్యి” అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు.
13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి.
తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు.
ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు.
వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.
```
*“తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం।*
*నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం॥”*```
వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం.
దీని అర్ధం ఏంటంటే, ‘తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు’ అని.
వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటే...
```
*“కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।*
*ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః॥*
*చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః।*
*విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః॥*
*ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః ।*
*కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ॥*”
```
“ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి” అని అడిగాడు.
“నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను” అని నారద మహర్షి ఇలా అన్నారు...
“ఇక్ష్వాకు వంశములో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి” అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.
చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు.
విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చెయ్యడానికి తమసా నదీ తీరానికి భారద్వాజుడు అనే శిష్యుడితో వెళ్లారు.
అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు.
అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు.
కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతోంది.
అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...
```
*“మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః।*
*యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||”*
```
“ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక!” అని శపించాడు.
ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది.
ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు.
ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కు కూర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు.
ఆ శ్లోకానికి అర్ధం చూడండి...
“నిషాద” అంటే బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. “మా” అంటే లక్ష్మీదేవి.```
*“మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః”,* ```అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక.``` *“యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్",* ```కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా, నీకు మంగళం జరుగుగాక!” అని ఆ శ్లోక అర్ధం మారింది.
బ్రహ్మగారు అన్నారు, “నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు
ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను ‘నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.
వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా బ్రహ్మ గారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు.
*రేపు...3వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*🙏
ఉపదేశం
34b6;54e5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఉపదేశం*
➖➖➖✍️
```
శ్రీ రాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైనాడు.
ఒకనాడు శ్రీరాముని చూడడానికి వచ్చిన కైకేయి “రామా! ఈ భవబంధాలనుండి, సంసార సాగరం నుండి ముక్తి పొందే మార్గం తెలియక అల్లల్లాడే నాకు నీవే ఒక మార్గం చూపించాలి.” అని అడిగింది.
అది విన్న రాముడు… “అమ్మా... దిగులు పడకండి. రేపు లక్ష్మణుడు మిమ్మల్ని ఒక చోటుకు తీసుకుని వెడతాడు. అక్కడ మీకు తగిన మార్గం లభిస్తుంది.” అని అన్నాడు.
మరునాడు లక్ష్మణుడు కైకేయిని పల్లకిలో సరయూ నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున మేత మేస్తున్న ఒక మేకల మంద వద్ద పల్లకీని ఆపించాడు.
“అమ్మా.. ఒకసారి బయటకు రండి..” అని వినయంగా పిలిచాడు.
పల్లకి నుండి దిగిన కైకేయి తనకి ఎదురుగా వున్న మేకల మందను చూసింది. తనను పల్లకి నుండి ఎందుకు బయటకు రమ్మని పిలిచాడో కారణం తెలియక లక్ష్మణుని వైపు చూసింది.
కైకేయి సందేహం గ్రహించిన లక్ష్మణుడు… “అమ్మా..యీ మేకలు చేసే శబ్దాలు మీరు కొంతసేపు వినాలని చక్రవర్తి శ్రీరాముని ఆదేశం” అని అన్నాడు.
'మే..మే అని వందల సంఖ్యలో వున్న మేకల అరుపులను కొంచెంసేపు ఏకాగ్రతగా వినగానే కైకేయి మనసులో ఏదో స్పష్టత ఏర్పడింది.
వెంటనే… “లక్ష్మణా! ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి రాముడు నాకు చూపిన మార్గం అర్ధమైనది. ఇక మనం రాజ భవనానికి వెళ్ళిపోదాం” అన్నది.
రాజభవనానికి తిరిగి వచ్చిన కైకేయిని శ్రీరాముడు ఆహ్వానించాడు. రామునితో కైకేయి “రామా.. నదీతీరాన నేను ఒక మేకల మంద అరుపులను తదేకదీక్షతో విన్నాను.
‘మే...మే...’ అంటే నాది అని అర్ధం కదా ..! ‘నేను అనే అహంకారంతో, నాది అనే కోరికతో బ్రతికినందువలనే ఇప్పుడు మేము మేకలు గా పుట్టాము’ అని అవి నాకు చెప్తున్నట్టుగా తోచింది.
'నేననే అహంకారం.. నాది అనే మమకారం మనిషిని అజ్ఞానాంధకారంలోకి నెట్టుతోందని గ్రహించాను. ఇంక మీద నేను ఈ లౌకిక భవబంధాలను త్రెంచుకొని ప్రశాంతిగా జీవిస్తాను.” అని అన్నది కైకేయి.
అది విని చిరునవ్వు నవ్విన రాముడు… “తల్లీ! నిజం గ్రహించారు. పుత్రునికి తల్లికి ఉపదేశించే అర్హతలేదు. అందువలన మీకు మీరుగా సత్యాన్ని తెలుసుకునేందుకు మిమ్మల్ని మేకల మంద వద్దకు పంపించాను.” అని పలికాడు.
శ్రీరాముని వివేకం, వినయసంపత్తి ఆయన ఔన్నత్యానికి దర్పణం పడుతుంది.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🗣️భవిష్యత్తు తరాలకు సంస్కృతి,సంప్రదాయాలు,విలువలతో పాటు మంచి నడవడికను, సంస్కారాన్ని నేర్పగలరు.
----------------------------------------------
🦁🌹*సనాతన ధర్మ పరిరక్షణ*🌹🦁
-------------------------------------------
.............................................
గమనిక :ఈ *కలియుగం లో భగవంతుడు నామరూపంలో* ఉంటాడు, కాబట్టి సదా ఈ నామాన్ని( *హరే కృష్ణ మంత్రం)* స్మరించండి,ఆనందించండి🌸🌷🌹😃
--------------------------------------------
🌸 అందరూ ఒక్కసారి,
👉 జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభునిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాధి గౌర భక్త బృంద! అని (ఒక్కసారి చెప్పి)
👉 ఈ మహామంత్రాన్ని
🧘🏻♂️ *హరే కృష్ణ హరే కృష్ణ*
*కృష్ణ కృష్ణ హరే హరే*
*హరే రామ హరే రామ*
*రామ రామ హరే హరే"*🧘🏻♂️
(108 సార్లు పలకండి)
........................................................🙇♂️
పోతన గారి భాగవత నాంది
🙏పోతన గారి భాగవత నాంది పద్యం🙏
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.!
భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదాస్మరిస్తు ఉంటాను.
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధారంభ ప్రార్థనా పద్యం.
ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు.
ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు.
(1) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్
(2) లోకరక్షైకారంభకున్
(3) భక్తపాలన కళా సంరంభకున్
(4) దానవోద్రేక స్తంభకున్
(5) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్
(6) మహానందాంగనా డింభకున్
అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి.
భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షన చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి.
(1) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది.
(2) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.
(3) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది.
(4) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది.
(5) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది.
(6) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
శ్రీరామచంద్రుడు సీతామహాసతిన్
శ్రీ రామచంద్రాయ నమః 🙏🙏🙏
శ్రీరామచంద్రుడు సీతామహాసతిన్
బరిణయం బాడెడి భవ్యవేళ
కాంతులీనెడి సీత కమలాంజలీ పుటిన్
బద్మరాగము భాతి పరిఢవిల్లి
మహానీయు రాముని మస్తకంబున నుండ
కుంద విరుల భంగి నందగించి
నీలమేఘచ్ఛాయ నెగడు శ్రీరాముని
తనువుపై జారెడి తరుణమందు
నింద్రనీలపుకాంతుల నినుమడించి
మోదమును గూర్చు చుండెడి ముత్యసేస
మిగుల శోభను వర్తిల్లి మించి సొగసు
ననయ శుభముల నిడుగాక నందఱికిని
శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు,వందనములు 🙏🙏🙏
సునీతా విలియమ్స్
సునీతా విలియమ్స్ దిగ్భ్రాంతికరమైన వెల్లడి.
9 నెలలు అంతరిక్షంలో గడిపి వారం రోజుల పాటు మిషన్‌ను ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్ విలేకరులతో చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
"నేను అంతరిక్షంలో చిక్కుకుపోవడం దేవుని చిత్తమని నేను భావిస్తున్నాను." నాకు 20 రోజుల వయస్సు ఉన్నప్పుడు, నేను మరణాన్ని ఎదుర్కొంటున్నట్లుగా జీవించాను. నా ఆహారం మరియు నీటి సరఫరా అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఎలా కొనసాగుతాను అని ఆలోచిస్తున్నప్పుడు, నాకు చైత్ర నవరాత్రి సనాతన ఉపవాస మాసం గుర్తుకు వచ్చింది, ఆ రోజు నుండి నేను కొద్దిగా ఆహారం మరియు సాయంత్రం కొద్దిగా నీరు త్రాగుతావచ్చాను. ఒక నెల తరువాత, నేను ఆరోగ్యంగా మరియు ఉల్లాసంగా ఉన్నాను. నేను మరికొంత కాలం తట్టుకోగలనని గ్రహించాను.
"నేను మరణం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, నేను ఒక రోజు బైబిల్ చదువుదామని నా కంప్యూటర్ తెరిచాను." ఇంతకు ముందు చాలా సార్లు చదివాను కాబట్టి ఒక్క పేజీ చదివాక బోర్ కొట్టింది. అప్పుడు నాకు రామాయణం మరియు భగవద్గీతా మళ్ళీ చదవాలని అనిపించింది (ఇప్పుడు నాకు కొంత బలం వచ్చినట్లు అనిపిస్తుంది). నేను దానిని (ఇంగ్లీష్ అనువాదం) డౌన్‌లోడ్ చేసి చదవడం ప్రారంభించాను. 10-15 పేజీలు చదివాక ఆశ్చర్యపోయాను. అందులోని పిండశాస్త్రం, లోతైన సముద్రం మరియు ఆకాశం అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి ప్రపంచానికి చెప్పాలని నాకు అనిపించింది.
"అంతరిక్షం నుండి చూసినప్పుడు, సూర్యుడు బురద గుంటలో కూర్చున్నట్లు కనిపిస్తాడు." కొన్నిసార్లు నేను సంస్కృత హిందీ అని భావించే మంత్రాలను పఠించడం వంటి కొన్ని శబ్దాలు పై నుండి వినిపిస్తాయి. నేను ప్రతిరోజూ రామాయణం మరియు భగవద్గీతా చదవడం వల్ల ఇలా జరుగుతోందని నా ప్రయాణ సహచరుడు బారీ విల్మోర్ నాకు చెప్పాడు. ఆ తర్వాత రామాయణం, గీతలను లోతుగా చదవాలని నిర్ణయించుకుని తఫ్సీర్లను డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఇది ఒక అద్భుతమైన అనుభవం. నేను వెంటనే ఎలోన్ మస్క్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. ఈ విషయాన్ని త్వరలో తన మాజీతో పంచుకుంటానని చెప్పాడు.
'ఇప్పుడు మీరు షాక్ అవుతారు... కొన్ని రోజులు మన అంతరిక్ష కేంద్రం వైపు దూసుకుపోతున్న భారీ ఉల్కలను చూసి భయపడతాం.' వేరే మార్గం లేకపోవడంతో, దేవుడిని ప్రార్థించాము మరియు అద్భుతంగా, కొన్ని చిన్న గోళాకార లైట్లు (నక్షత్రాల వలె కనిపిస్తాయి) ఎగిరి లోపల ఉన్నవన్నీ నాశనం చేశాయి. మేము దానిని చూస్తుంటే, మేము దానిపై నక్షత్రాలు విసిరినట్లు అనిపించింది. ఇది మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. త్వరలో ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు నిర్వహిస్తామని నాసా హామీ ఇచ్చింది.
అలా 8 నెలల తర్వాత, రామాయణం మరియు భగవద్గీతా మొత్తం చదివాను. నేను భూమికి తిరిగి రావాలని నేను భావించడం ప్రారంభించాను. నాలో అసాధారణమైన ఆత్మవిశ్వాసం నింపినట్లు భావించాను.
ఏప్రిల్ నెలలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, త్రిశూలంతో మాతాజీతో ఉన్న సింహాన్ని పోలిన ఒక జీవి పై నుండి భూమికి దిగినట్లు కనిపించింది. ఇది భూమి యొక్క వాతావరణాన్ని చేరుకున్న తర్వాత, అది కనిపించలేదు. ఇది ఎక్కడ నుండి వస్తుందో నాకు అర్థం కాలేదు, కాబట్టి నేను మరియు నా బారీ విల్లిమోర్ దానిని చూడటం ప్రారంభించాము. అది పైన ఉన్న ప్రత్యేక పొర నుండి క్రిందికి వస్తున్నట్లు నాకు అనిపించింది మరియు ఆకాశంలో ఒకటి కంటే ఎక్కువ పొరలు ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను. ఎంత ఆలోచించినా ఈ ఎగిరే గుర్రాలు ఎందుకు లేవని అర్థం కాలేదు. హడ్సన్ నదిపై చంద్రుడు కనిపించడం గురించి న్యూయార్క్ టైమ్స్ నివేదిక మరియు మార్చి 2 న సనాతని ఉపవాసం ప్రారంభమైందని వార్తలను చూశాను. అప్పటి నుండి, నంగల్ ఈ దృగ్విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు. తరువాత, భూమిపై ఉపవాసం విరమించే సమయం వచ్చిందని మేము గ్రహించాము. వారు దేవుని ఆశీర్వాదంతో వస్తున్న దేవదూతలు అని నేను అనుకుంటున్నాను.
"సనాతన భగవద్గీతా నిజమని ఇప్పుడు నేను భావిస్తున్నాను." ఇప్పుడు నా పరిశోధన వేదాల శాస్త్రంపై ఉంటుంది. ఎంబ్రియాలజీ, డీప్ సీ సైన్స్. నేను ఖగోళ శాస్త్రం గురించి ప్రతిదీ నేర్చుకోవాలను కుంటున్నాను. వేదాలకు ఉన్న అతీంద్రియ శక్తులను తెలుసుకోవడానికి నాసాలో కొత్త విభాగాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించబడింది. అందుకు అవసరమైన నిధులను ట్రంప్ ప్రభుత్వం కేటాయిస్తుందా లేదా అనే ఆందోళనను కూడా సునీత పంచుకున్నారు.
BBC...
*వేదాలు, భగవద్గీత, రామాయణం, శివ మహాపురాణం మరియు ఉపనిషద్ లు.... మొదలైన వాటిని గౌరవించండి..🚩*
*మనం నమ్మలే కానీ దేవుడు ఉన్నాడు అంటానికి యీ ఉదాహరణ చాలు🙏🏻*
వేదాంత సారం బ్రహ్మ సూత్రాలు
🙏వేదాంత సారం బ్రహ్మ సూత్రాలు 🙏
శ్రీ గురుబ్యోనమః
ఓం గణపతయే నమః
హరి ఓం! విష్ణువు అవతారమైన బుద్ధిమంతుడైన బాదరాయణుడు మరియు శ్రీకృష్ణ ద్వైపాయనుదు శ్రీ వ్యాసునికి నమస్కారములు.
వేదాలు మూడు భాగాలను కలిగి ఉంటాయి, అవి, ఆచార కర్మలను వివరించే కర్మ కాండ, ఉపాసన (ఆరాధన) గురించి వివరించే ఉపాసన కాండ మరియు బ్రహ్మ జ్ఞానాన్ని వివరించే జ్ఞాన కాండ. కర్మ కాండ పురుషుని పాదాలను, ఉపాసన కాండ హృదయాన్ని మరియు జ్ఞాన కాండ శిరస్సును సూచిస్తుంది. తల పురుషునికి అతి ముఖ్యమైన భాగం అయినట్లే, వేదాల జ్ఞాన భాగాన్ని వివరించే ఉపనిషత్తులు కూడా వేదాలకు శిరస్సు. అందుకే దీనిని వేదాల శిరస్సు అని అంటారు.
మీమాంస అంటే పవిత్ర గ్రంథాల యొక్క అనుసంధానించబడిన అర్థంపై పరిశోధన లేదా విచారణ. ఈ మీమాంసలో రెండు శాఖలు గుర్తించబడ్డాయి, పూర్వ మీమాంస (మునుపటిది) మరియు ఉత్తర మీమాంస (తరువాతిది). మునుపటిది కర్మ కాండను క్రమబద్ధీకరిస్తుంది - వేదంలోని భాగం, ఇది చర్య మరియు కర్మ కాండకు సంబంధించినది మరియు సంహితలు మరియు బ్రాహ్మణాలను కలిగి ఉంటుంది;
తరువాతిది జ్ఞాన కాండను క్రమబద్ధీకరిస్తుంది, అంటే, బ్రాహ్మణాలు మరియు ఉపనిషత్తుల యొక్క అరణ్యక భాగాన్ని కలిగి ఉన్న వేదాలలోని భాగం. జైమిని పూర్వ మీమాంస రచయిత. జైమిని గురువు శ్రీ వ్యాస భగవానుడు బ్రహ్మ సూత్రాల రచయిత, దీనిని వేదాంత సూత్రాలు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ సూత్రాల అధ్యయనం ఉపనిషత్తుల సంశ్లేషణ అధ్యయనం. ఇది వేదాంత తత్వశాస్త్రాన్ని వివరిస్తుంది.
వేదాలు శాశ్వతమైనవి. అవి ఏ వ్యక్తిచే వ్రాయబడలేదు. అవి హిరణ్యగర్భ (బ్రహ్మ దేవుడు) శ్వాస నుండి ఉద్భవించాయి. వేదాంతం వేదాల ముగింపు లేదా సారాంశం. ఇది జ్ఞాన భాగానికి సంబంధించినది. వేదాంతం కేవలం ఊహాగానాలు కాదు. ఇది అతీంద్రియ అనుభవాల యొక్క ప్రామాణికము లేదా గొప్ప ఋషుల ప్రత్యక్ష మరియు వాస్తవ సాక్షాత్కారం. బ్రహ్మ సూత్రాలు ఆత్మ యొక్క శాస్త్రం.
సూత్రాలు సంక్షిప్త సూత్రాలు. అవి ఒక అంశంపై వాదనల సారాంశాన్ని ఇస్తాయి. గరిష్ట ఆలోచనను ఈ సూత్రాలలో వీలైనంత తక్కువ పదాలలో కుదించవచ్చు. వాటిని గుర్తుంచుకోవడం సులభం. గొప్ప మేధావులు మాత్రమే, సాక్షాత్కారంతో, సూత్రాలను తయారు చేయగలరు. అవి ఆధారాలు లేదా జ్ఞాపకశక్తికి సహాయకాలు. స్పష్టమైన వ్యాఖ్యానం (భాష్యం) లేకుండా వాటిని అర్థం చేసుకోలేము. వ్యాఖ్యానానికి మరింత విస్తృతమైన వివరణ కూడా అవసరం. అందువల్ల సూత్రాల వివరణలు మరియు కారికాలు వంటి వివిధ రకాల సాహిత్య రచనలకు దారితీశాయి. వివిధ ఆచార్యులు (విభిన్న ఆలోచనా విధానాల స్థాపకులు) తమ సొంత సిద్ధాంతాలను స్థాపించడానికి సూత్రాలకు వారి స్వంత వివరణలను ఇచ్చారు. బ్రహ్మ సూత్రాలపై శ్రీ శంకరుడి భాష్యాన్ని సరిరక భాష్యం అంటారు. ఆయన ఆలోచనా విధానం కేవల అద్వైతం. విశిష్టాద్వైత పాఠశాలను స్థాపించిన శ్రీ రామానుజుడి భాష్యాన్ని శ్రీ భాష్యం అంటారు. శ్రీ నింబార్కాచార్యుల వ్యాఖ్యానాన్ని వేదాంత-పారిజాత-సౌరభ అని పిలుస్తారు. శ్రీ వల్లభాచార్య తన శుద్ధాద్వైత (స్వచ్ఛమైన ఏకవాదం) తత్వశాస్త్రాన్ని వివరించాడు మరియు బ్రహ్మ సూత్రాలపై అతని వ్యాఖ్యానాన్ని అను భాష్య అంటారు.
సంస్కృతం చాలా సాగేది. ఇది కామధేనువు లేదా కల్పతరు లాంటిది. మీరు మీ మేధో సామర్థ్యం మరియు ఆధ్యాత్మిక అనుభవాల ప్రకారం దాని నుండి వివిధ రకాల రసాలను పొందవచ్చు. అందువల్ల వివిధ ఆచార్యులు సూత్రాలను వారి స్వంత మార్గాల్లో అర్థం చేసుకోవడం ద్వారా విభిన్న ఆలోచనా వ్యవస్థలను లేదా ఆరాధనలను నిర్మించారు మరియు శాఖల స్థాపకులు అయ్యారు. మధ్వుడు తన స్వంత ద్వైత వ్యవస్థను స్థాపించాడు. భాగవతం లేదా పంచరాత్రంగా పిలువబడే విష్ణు ఆరాధనలు మరియు శివుడు, పాశుపతం లేదా మహేశ్వర ఆరాధనలు బ్రహ్మ సూత్రాలను వారి స్వంత సిద్ధాంతాలకు అనుగుణంగా అర్థం చేసుకున్నాయి. నింబార్కాచార్యుడు వేదాంత వ్యవస్థను భేదాభేద-ద్వైతాద్వైత దృక్కోణం నుండి అర్థం చేసుకున్నాడు. తొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో అభివృద్ధి చెందిన భాస్కరుడి బోధనల ద్వారా అతను ఎక్కువగా ప్రభావితమయ్యాడు. భాస్కరుడు మరియు నింబార్క అనుసరించిన సిద్ధాంతాన్ని ప్రాచీన గురువు ఆవులోమి అనుసరించాడు. బాదరాయణుడు స్వయంగా తన బ్రహ్మ సూత్రాలలో ఈ సిద్ధాంతాన్ని ప్రస్తావించాడు.
బ్రహ్మ సూత్రాలకు పద్నాలుగు కంటే ఎక్కువ వ్యాఖ్యానాలు ఉన్నాయి. శ్రీ అప్పయ దీక్షిత తన పరిమల ద్వారా, శ్రీ వాచస్పతి మిశ్రా తన రచన భామతి ద్వారా మరియు శ్రీ అమలానంద సరస్వతి తన కల్పతరు ద్వారా శ్రీ శంకరుల వ్యాఖ్యానాన్ని మరింత స్పష్టంగా వివరించారు.
శరీరాన్ని స్వచ్ఛమైన ఆత్మతో తప్పుగా గుర్తించడం మానవ బాధలకు, దుఃఖానికి, జనన మరణాలకు మూల కారణం. మీరు మిమ్మల్ని శరీరంతో గుర్తించుకుని, 'నేను అందంగా, నల్లగా, బలిష్టంగా లేదా సన్నగా ఉన్నాను' అని అంటారు. నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుడిని, నేను వైద్యుడిని' అని అంటారు. మీరు ఇంద్రియాలతో మిమ్మల్ని గుర్తించి, 'నేను అంధుడిని, నేను మూగవాడిని' అని అంటారు. మీరు మనస్సుతో మిమ్మల్ని మీరు గుర్తించి, 'నాకు ఏమీ తెలియదు. నాకు అన్నీ తెలుసు. నాకు కోపం వచ్చింది. నేను మంచి భోజనం ఆస్వాదించాను. నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను' అని అంటారు. బ్రహ్మ సూత్రాల మొత్తం లక్ష్యం ఏమిటంటే, ఆత్మను శరీరంతో గుర్తించడాన్ని తొలగించడం, ఇది మీ బాధలకు, దుఃఖాలకు మూల కారణం, ఇది అవిద్య (అజ్ఞానం) యొక్క ఉత్పత్తి మరియు బ్రహ్మ జ్ఞానం ద్వారా అంతిమ విముక్తిని పొందడంలో మీకు సహాయం చేస్తుంది.
ఉపనిషత్తులు మొదట్లో వైరుధ్యాలతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. వాటిలో స్థిరమైన ఆలోచనా విధానం ఉండదు. శ్రీ వ్యాసుడు తన బ్రహ్మ సూత్రాలలో ఉపనిషత్తుల ఆలోచనలను లేదా తత్వశాస్త్రాన్ని క్రమబద్ధీకరించాడు. సూత్రాలు ఉపనిషత్తుల విరుద్ధమైన ప్రకటనలను సమన్వయం చేస్తాయి. వాస్తవానికి ఆలోచనాపరుడికి ఎటువంటి విభేదాలు ఉండవు. ఔదులోమి మరియు అస్మరథ్య కూడా ఈ పనిని వారి స్వంత మార్గంలో చేసి, వారి స్వంత ఆలోచనా విధానాలను స్థాపించారు.
వేదాంత తత్వాన్ని అధ్యయనం చేయాలనుకునే వారు పది శాస్త్రీయ ఉపనిషత్తులు మరియు బ్రహ్మ సూత్రాలను అధ్యయనం చేయాలి. అందరు ఆచార్యులు బ్రహ్మ సూత్రాలపై వ్యాఖ్యానించారు. భారతదేశంలోని ప్రతి తాత్విక పాఠశాలకు ఇది గొప్ప అధికారం. ఏదైనా ఆచార్యుడు తన సొంత సంస్కృతిని లేదా శాఖను లేదా ఆలోచనా విధానాన్ని స్థాపించాలనుకుంటే, అతను బ్రహ్మ సూత్రాలపై తన స్వంత వ్యాఖ్యానాన్ని రాయవలసి ఉంటుంది. అప్పుడే అది గుర్తించబడుతుంది.
ఐదుగురు గొప్ప ఆచార్యులు: కేవల అద్వైతం లేదా రాజీలేని ఏకత్వాన్ని వ్యక్తపరిచిన శ్రీ శంకరుడు, విశిష్టాద్వైతం లేదా అర్హత కలిగిన ఏకత్వాన్ని వ్యక్తపరిచిన శ్రీ రామానుజుడు, భేదాభేదవాదాన్ని వ్యక్తపరిచిన శ్రీ నింబార్క, కఠినమైన ద్వైతం లేదా ద్వైతవాదాన్ని వ్యక్తపరిచిన శ్రీ మధ్వుడు మరియు శుద్ధాద్వైతవాదాన్ని వ్యక్తపరిచిన శ్రీ వల్లభుడు బ్రహ్మ ఈ ప్రపంచానికి కారణమని మరియు బ్రహ్మ జ్ఞానం జీవిత లక్ష్యం అయిన మోక్షానికి లేదా అంతిమ విముక్తికి దారితీస్తుందని అంగీకరిస్తున్నారు. వారు కూడా బ్రహ్మను కేవలం తర్కం ద్వారా కాకుండా గ్రంథాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చని గట్టిగా ప్రకటించారు. కానీ ఈ బ్రహ్మం యొక్క స్వభావం, బ్రహ్మంతో వ్యక్తిగత ఆత్మకు ఉన్న సంబంధం, అంతిమ విముక్తి స్థితిలో ఆత్మ యొక్క స్థితి, దానిని పొందే మార్గాలు మరియు ఈ విశ్వానికి సంబంధించి దాని కారణవాదం వంటి అంశాలలో వారు తమలో తాము విభేదిస్తారు.
శ్రీ శంకరుల అభిప్రాయం ప్రకారం, సత్-చిత్-ఆనంద అనే ఒక సంపూర్ణ బ్రహ్మం ఉంది, అతను పూర్తిగా సజాతీయ స్వభావం కలిగి ఉంటాడు. ఈ ప్రపంచం కనిపించడానికి కారణం మాయ - బ్రహ్మం యొక్క మాయా శక్తి, ఇది సత్ లేదా అసత్ కాదు. ఈ ప్రపంచం అవాస్తవం. ఈ ప్రపంచం మాయ ద్వారా వివర్తం లేదా స్పష్టమైన మార్పు. మాయ ద్వారా బ్రహ్మం ఈ విశ్వంగా కనిపిస్తుంది. బ్రహ్మమే ఏకైక వాస్తవికత. వ్యక్తిగత ఆత్మ అవిద్య మరియు శరీరం మరియు ఇతర వాహనాలతో గుర్తింపు ద్వారా తనను తాను పరిమితం చేసుకుంది. తన స్వార్థపూరిత చర్యల ద్వారా అతను తన చర్యల ఫలాలను అనుభవిస్తాడు. అతను నటుడు మరియు ఆనందించేవాడు అవుతాడు. అతను తనను తాను అణువుగా మరియు అవిద్య లేదా పరిమితం చేసే అంతఃకరణం కారణంగా ఒక ప్రతినిధిగా భావిస్తాడు. వ్యక్తిగత ఆత్మ తన అవిద్య నాశనం అయినప్పుడు బ్రహ్మంతో సమానంగా ఉంటుంది. వాస్తవానికి జీవుడు సర్వవ్యాప్తి చెంది బ్రహ్మంతో సమానంగా ఉంటాడు. ఈశ్వరుడు లేదా సగుణ బ్రాహ్మణుడు మాయ యొక్క ఉత్పత్తి. ఈశ్వరుని ఆరాధన క్రమ ముక్తికి దారితీస్తుంది. భక్తిగల భక్తులు (సగుణ బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు) బ్రహ్మలోకానికి వెళ్లి అత్యున్నత జ్ఞానం ద్వారా తుది విడుదలను పొందుతారు. వారు ఈ లోకానికి తిరిగి రారు. వారు చక్రం చివరిలో నిర్గుణ బ్రహ్మాన్ని పొందుతారు. నిర్గుణ బ్రహ్మం యొక్క జ్ఞానం మాత్రమే విముక్తికి ఏకైక మార్గం. నిర్గుణ బ్రహ్మం తెలిసినవారు తక్షణ తుది విడుదల లేదా సద్యోముక్తిని పొందుతారు. వారు దేవతల మార్గంలో లేదా దేవయాన మార్గంలో వెళ్ళవలసిన అవసరం లేదు. వారు పరబ్రహ్మంలో తమను తాము విలీనం చేసుకుంటారు. వారు ఏ లోకానికి లేదా ప్రపంచానికి వెళ్ళరు. శ్రీ శంకరుల బ్రాహ్మణం లక్షణాలు లేని నిర్విశేష బ్రహ్మం (నిరాకార సంపూర్ణం).
శ్రీ రామానుజుల ప్రకారం, బ్రహ్మం గుణాలతో (సవిశేష) ఉన్నాడు. నేను అన్ని శుభ గుణాలతో నిండి ఉన్నాను. ఆయనే తెలివి కాదు. తెలివితేటలు ఆయన ముఖ్య లక్షణం. ఉన్నదంతా ఆయన తనలోనే ఉంటుంది. ప్రపంచం మరియు వ్యక్తిగత ఆత్మలు బ్రహ్మ స్వభావానికి అవసరమైన నిజమైన భాగాలు. పదార్థం (అచిత్) మరియు ఆత్మ (చిత్) అనేవి భగవంతుడు, భగవంతుడు నారాయణుడి శరీరాన్ని ఏర్పరుస్తాయి, అతను అంతర్ పాలకుడు.పదార్థం మరియు ఆత్మలను ఆయన గుణాలు (ప్రకార) అని పిలుస్తారు. వ్యక్తిగత ఆత్మలు బ్రహ్మంలో ఎప్పటికీ పూర్తిగా పరిష్కరించబడవు. రామానుజుల ప్రకారం, బ్రహ్మం పూర్తిగా ఒకటి మరియు సజాతీయమైనది కాదు. ప్రళయ సమయంలో వ్యక్తిగత ఆత్మలు సంకోచ స్థితికి లోనవుతాయి. సృష్టి సమయంలో అవి విస్తరిస్తాయి (వికాశం). శ్రీ రామానుజుల బ్రాహ్మణం లక్షణాలతో కూడిన వ్యక్తిగత దేవుడు. రామానుజుల వ్యక్తిగత ఆత్మ నిజంగా వ్యక్తిగతమైనది. అది ఎప్పటికీ వ్యక్తిత్వంగా ఉంటుంది. ఆత్మ ఆనంద స్థితిలో వైకుంఠంలో ఎప్పటికీ ఉంటుంది మరియు భగవంతుడు నారాయణుడి దివ్య ఐశ్వర్యాన్ని ఆస్వాదిస్తుంది. భక్తి అనేది అంతిమ విముక్తికి ప్రధాన సాధనం, జ్ఞానం కాదు. శ్రీరామానుజుడు తన భాష్యంలో బోధాయన అధికారాన్ని అనుసరించాడు.
కేవలద్వైత తత్వశాస్త్ర పాఠశాల విద్యార్థులు శ్రీ శంకరుని శరీరక భాష్యాన్ని అధ్యయనం చేయాలి, ఇది లోతైనది, సూక్ష్మమైనది మరియు ప్రత్యేకమైనది. ఇది బ్రహ్మ సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి దారితీసే అధికారం. తత్వశాస్త్ర పుస్తకాలలో ఇది ఉన్నత స్థానాన్ని ఆక్రమించింది. అద్వైత తత్వశాస్త్రం హిందువుల అత్యంత ఉన్నతమైనది మరియు గొప్ప తత్వశాస్త్రం.
పన్నెండు శాస్త్రీయ ఉపనిషత్తుల పరిజ్ఞానం ఉంటే మీరు బ్రహ్మ సూత్రాలను అర్థం చేసుకోవచ్చు. సాంఖ్య, న్యాయ, యోగ, మీమాంస, వైశేషిక దర్శనం మరియు బౌద్ధ పాఠశాల గురించి కూడా మీకు జ్ఞానం ఉంటే మీరు రెండవ అధ్యాయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠశాలలన్నింటినీ శ్రీ శంకరులు ఇక్కడ ఖండించారు. శ్రీ శంకర వ్యాఖ్యానమే ఉత్తమ వ్యాఖ్యానం. డాక్టర్ తిబౌట్ ఈ వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. "బ్రహ్మ సూత్రాలు" ప్రస్థానత్రయ పుస్తకాలలో ఒకటి. ఇది హిందూ తత్వశాస్త్రంపై ఒక అధికారిక పుస్తకం. ఈ రచనలో 4 అధ్యాయాలు (అధ్యాయాలు), 16 పాదాలు (విభాగాలు), 223 అధికరణాలు (అంశాలు) మరియు 555 సూత్రాలు (సూక్ష్మసూత్రాలు) ఉన్నాయి. మొదటి అధ్యాయం (సమన్వయాధ్యాయ) బ్రహ్మాన్ని ఏకం చేస్తుంది, రెండవది (అవిరోధాధ్యాయ) ఇతర తత్వాలను ఖండిస్తుంది, మూడవది (సాధనాధ్యాయ) బ్రహ్మను సాధించడానికి సాధన (సాధన) గురించి మరియు నాల్గవది (ఫలాధ్యాయ) ఆత్మసాక్షాత్కార ఫలాల గురించి వివరిస్తుంది. ప్రతి అధ్యాయంలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పదంలో అధికరణాలు ఉంటాయి. ప్రతి అధికరణలో చర్చించడానికి ప్రత్యేక ప్రశ్నలు ఉంటాయి. మొదటి అధ్యాయంలోని మొదటి ఐదు అధికరణలు చాలా చాలా ముఖ్యమైనవి.
పరాశర పుత్రుడు, మహా ఋషి, అన్ని పురాణాలను రచించిన మరియు వేదాలను విభజించిన చిరంజీవి శ్రీ వ్యాస భగవానునికి కీర్తి. ఆయన ఆశీస్సులు మన అందరికీ ఉండుగాక!
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
నిర్భయత్వం, నిరహంకారం
🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️నిరాడంబరత, నిర్భయత్వం, నిరహంకారం, నిర్మలత్వం, నిర్మొహం వంటి ఉదాత్త లక్షణాలు వ్యక్తులకు సహజ మైన అలంకారాలుగా వర్దిల్లుతాయి.. సజ్జన సాంగత్యం అనేది సుగంద పరిమళ ద్రావ్యాల దుకాణం వంటిది.. ఆ దుకాణం వద్దకు వెళితే చాలు.. మనం కొన్నా, కొనపోయినా సువాసన మనకు తగలక మానదు🏵️జీవితంలో కొన్ని సార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు.. ఆది కష్టంగానే ఉంటుంది.. కానీ ఆ వంటరి తనమే డబ్బు విలువ, కష్టం విలువ, చదువు విలువ, మనుషుల విలువ, సమయం విలువ అన్నీ నేర్పిస్తుంది..ఒక సారి మనం ఓ ప్రయత్నం ప్రారంభిచాక ఆది సఫలంగా ముగిసే వరకూ మనం దాన్ని అంటిపెట్టుకుని ఉండడం చాలా ముఖ్యం🏵️మనిషి జీవితంలో నవ్విచ్చే పరిచయాలు కొన్ని, ఏడిపించే పరిచయాలు కొన్ని, విసిగించే పరిచయాలు కొన్ని, వికశించే పరిచయాలు కొన్ని, కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయలే అన్నీ..జీవితంలో కష్టపడితే సంపద, హోదా, గౌరవం వస్తాయి.. కానీ దాన్ని నిలుపు కోవాలి అంటే గొప్ప సంస్కారం మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D .N 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ఏకాదశి - ఆశ్రేష - భౌమ వాసరే* (08.04.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
కామదా ఏకాదశి వ్రతం
*సకల పాప హరణం కామదా ఏకాదశి వ్రతం*
*ఏప్రిల్ 08 మంగళవారం కామదా ఏకాదశి సందర్భంగా...*
ప్రతి నెలలో వచ్చే ఏకాదశిలలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చైత్ర మాసం శుక్ల పక్షంలో వచ్చే కామదా ఏకాదశి కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
కామదా ఏకాదశినే దమన ఏకాదశి అని వ్యవహరిస్తారు. పాపాలు హరించడం ఈ ఏకాదశి ప్రత్యేకత. కామద ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు దూరమవుతాయి. ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని పురాణ వచనం. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కామదా ఏకాదశి వ్రతం ఆదరించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తుంటారు.
స్త్రీలు తమ సమస్త సంపదగా భావించుకునే సౌభాగ్యం చిరకాలం పచ్చగా ఉండటానికి చేసే విశిష్టమైన వ్రతాలలో కామదా ఏకాదశి వ్రతం ఒకటి.
ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీలక్ష్మీనారాయణులను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున వేకువనే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
ఈ రోజన ఉపవాసం, జాగరణ చేసి నియమనిష్టలతో నిబంధనలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం బాగుంటింది. అంతేకాకుండా కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కామదా ఏకాదశికి సంబంధించిన ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. వరాహ పురాణంలో
శ్రీకృష్ణడు, యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు. అలాగే వశిష్ట మహాముని దిలీప రాజుకు ఈ ఏకాదశి వ్రత కథను వివరించాడు.
పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ రాజుకు వినోదం పంచేవారు. ఒక రోజు ఒక గంధర్వుడు సభలో కళా ప్రదర్శన సరిగ్గా ఇవ్వక, పరధ్యానంతో ఉండడం గమనించిన రాజు ఆగ్రహించి ఆ గంధర్వుడిని శపించాడు. ఆ శాపం కారణంగా అతని అందం, సృజనాత్మకత, కళా అంత నాశనమైపోతుంది. రాక్షసుని ఆకారంలోకి మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతగానో బాధపడి భర్తను తీసుకొని వింధ్యాచల అడువుల్లోకి పయణమయింది. అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అక్కడ ఉన్న శ్రింగి మహర్షిని కలిసి తనకు జరిగిన దురదృష్ట సంఘటన గురించి వెళ్లబోసుకుంది. అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యం గురించి వివరించాడు. ఆయన చెప్పిన ప్రకారం లలిత భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించి తన కోరిక తీరాలని మనసులో అనుకొని నమస్కరించుకుంది. వెంటనే తన భర్త రాక్షస ఆకారం పోయి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. ఇంతటి మహత్తువున్న కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన తెలియక చేసే పాపాలన్నీ కూడా ప్రోతాయని పురాణాలు చెబుతున్నాయి.