8, అక్టోబర్ 2020, గురువారం

నిష్కామ భక్తి*


    ఒకసారి ఓ గురువు గారు గ్రామాంతరం వెళ్తూ తన శిష్యునికి ఒక బొమ్మ కృష్ణుని ఇచ్చి తాను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పారు.


 సరేనన్నాడు శిష్యుడు. 


 మరుక్షణం నుంచి ఆ బొమ్మను ముద్దులాడుతూ ఉయ్యాలలో వేసి ఊపుతూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, చాలా బాగా చూసుకున్నాడు,   


పొద్దున సాయంత్రం బొమ్మ కృష్ణుడి కోసం అరిసెలు అప్పాలు సున్నుండలు మీగడ వెన్న తెచ్చే వాడు.


 'తిను కన్నయ్య' అని బతిమిలాడే వాడు...


 కానీ కన్నయ్య తింటేనా!!!


 శిష్యుడికి ఏం చేయాలో తోచక దిగులు పడి కూర్చునేవాడు.


     నివేదన చేయడం అనేది మన భక్తికి సూచనగా చేసి క్రియే గాని దేవుడు నిజంగా వచ్చి తినడు.. పారవశ్యంలో ఈ చిన్న విషయం కూడా శిస్యుని బుద్ధికి తట్టలేదు.


 బొమ్మని గుండెల్లో పొదుపు కుంటూ సందిట్లో దోచుకుంటూ.. "కన్నయ్య నన్ను కన్న తండ్రి! ఈ ఒక్క సున్నుండ తినరా తీయ తీయని ఈ మీగడ నీ కోసమే తెచ్చాను రా" అని బ్రతిమిలాడుతున్నా ..

 కృష్ణయ్య ఉలక లేదు పలకలేదు ..కనీసం ఒక్క అప్పమైనా తినలేదు.


 దాంతో శిష్యునికి కోపం వచ్చింది విసవిసా లేచి వెళ్లి బెత్తం ఒకటి పట్టుకొచ్చి తింటావా నాలుగు తగిలించమంటావా అని బెదిరించాడు.


 బొమ్మ కృష్ణుడు భయంతో వణికిపోయాడు బుద్ధిగా వచ్చి అప్పాలు అరిసెలు అన్ని ఆరగించాడు. 


ఇక శిష్యుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 


అతని కళ్ళు ఆనంద ఆశ్రువులతో నిండి పోయాయాయి. 


కృష్ణయ్యను కౌగిలించుకొని సంతోషం తో సతమతమై పోయాడు.


  అప్పటికి అతను అన్నము తిని మూడు రోజులైంది లేచి వెళ్లి గబగబా రెండు ముద్దలు తిన్నాడు. 


 తిన్నాక పొలం వైపు నడిచాడు గడిచిన మూడు రోజులుగా అతనికి కృష్ణయ్యను బ్రతిమిలాడడానికే సరిపోయే. ...


పొలం చేయడానికి వెళ్లింది ఎక్కడ...? పొలం పనులు చేసుకున్నది ఎక్కడ? మనసులో పోగు పడ్డ ఆలోచనల చిక్కు తీసుకుంటూ వచ్చేసరికి పొలం గట్టు దగ్గర ఉన్నాడతను. 


తన పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పొలం గట్లన్నీ తీర్చినట్టు వున్నాయి. పని చేసి పొలమంతా మడులు చేసి నీరు పెట్టినట్టు ఉంది. 


అది కలో లేక వైష్ణవమాయయో అర్థం కాలేదు. ఊహించడానికి శక్తి కూడా చాలలేదు.  


ఆనందం తో కళ్ళు మూతలు పడ్డాయి కళ్ళ ముందు తన చేతిలో ఉన్న బెత్తాన్ని చూసి భయపడి అరిసెలు అప్పాలు అన్ని ఒకేసారి నోట్లో కుక్కుకుంటూ వున్న కృష్ణయ్య దర్శనమిచ్చాడు. 


 అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాడు. 


 నిష్కామ భక్తికి నిర్మల భక్తి కి ఉన్న శక్తి అది.

  

" నా భక్తులు నాకు పూర్తిగా సొంతం కావాలి నాకు అంకితం కావాలి. వారి హృదయాలను స్వచ్ఛంగా పరిశుభ్రంగా చేసుకుని అందులో నన్ను మాత్రం ప్రతిష్టించుకోవాలి నన్ను మాత్రమే కొలవాలి " అని గీతలో కృష్ణుడు అర్జునుడితో అంటాడు. 


   శాస్త్రాలు చదవడం వల్లనో.., జ్ఞానం వల్ల కూడా భక్తి అలవడదు.  


ఎవరైనా భక్తులు కావాలంటే వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని విడిచిపెట్టాలి, చివరికి జ్ఞానాన్ని కూడా వదులుకోవాలి అది రహస్యం. 


భగవంతుడు నుంచి వేరు చేసే అగాధాలు కొన్ని ఉన్నాయి...

అవి సిగ్గు, అహంకారం, బిడియం, కోపం వంటివి...

మనిషి మనసుని దేవుడి మీద నిలవ నీయకుండా అంధకారంలోకి నెట్టివేస్తుంది...

కాబట్టి వీటి విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి..


జై శ్రీ కృష్ణా...💐 🙏

గురుశుశ్రూషయా

 సేకరణ 👇


గురుశుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన వా !

అథవా విద్యయా విద్యా చతుర్థీ నోపలభ్యతే !!


తా!!: గురువులకు సేవచేయడం (శుశ్రూష) ద్వారా లభించేది, పుష్కలంగా ధనం ఖర్చుపెట్టడం ద్వారా సంపాదించేది, ఒక విద్యనిచ్చి మరో విద్య నేర్చుకోవడం ద్వారా పొందేదని జ్ఞానాన్ని ఆర్జించే మార్గాలు, పద్ధతులు మూడు. అలా కాకుండా విద్యను సంపాదించగల నాలుగవ ఉపాయం లేదు.


వ్యాఖ్య: "జ్ఞానార్జనకు వినయం, సమర్పణం, వినిమయం" అనే మూడు మార్గాలు మాత్రమే. పూర్వం రాజులైన గురుకులంలోచేరి గురువుకు సేవలుచేసి విద్యను నేర్చుకునేవారు. ఆరోజుల్లో గురువులంటే అంత భక్తి. గురుదక్షిణ కూడా ఇచ్చేవారు. రెండవది ధనాన్ని సమర్పించి, విద్య నేర్చుకోవడం. ఈరోజుల్లో విద్య స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజు విద్యార్థులు చెల్లించి చదువుకోవడం. ఒకప్పుడు (50 సం!!ల క్రితం) అందరూ చాలా తక్కువ ఫీజులతో వీధి బడులలో చదువుకొని - ఆసక్తి ఉన్నవారు, తెలివైనవారు ఉన్నత స్థాయికి వెళ్లేవారు. కొందరు కష్టపడి పైకివచ్చేవారు. నేడు చదువుకునే వారితోపాటు చదువు కొనుక్కునేవారు పెరిగి, విద్య అతిపెద్ద వ్యాపారంగా మారింది. చదువు కొనుక్కుని బయటకువచ్చి, హాస్పిటల్స్, విద్యాసంస్థలు లాంటివి పెట్టడంవల్ల, సేవా దృక్పధంపోయి పూర్తిగా వ్యాపారసంస్థలుగ పనిచేస్తూ ప్రజలనుండి అధిక సొమ్ము వసూలు చేయడమేకాక వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. మూడవది 'వినిమయమార్గం' పంచుకుని నేర్చుకునే పద్ధతి. విద్యా, వైజ్ఞానిక సమావేశాలలో పాల్గొని వారి వారి అనుభవాలను నిజాయితీగా 'వినిమయం' చేసుకునే విధానం. పరస్పర భావ వినిమయం పద్ధతి ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం.

పూరీ జగన్నాథ్ ఆలయంలో


 పూరీ జగన్నాథ్ ఆలయంలో 

సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు...


ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నిక గన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షలసంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ, విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు.


అయితే ఇంతటి ప్రతిష్ట , ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలూ వున్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగు తున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం. అవేంటో ఒకసారి మీరే చదవండి ...


మొదటిది...: తనంతట తానే ఆగిపోయే రథం.. 


ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం వుండదు.


రెండవది...: నీడ కనిపించని గోపురం.. 


జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు . 

ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.


మూడవది...: గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా... 


ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురుతుంటుంది. కానీ పూరీ ఆలయ గోపురం పైన వుండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .


నాలుగవది...: మనవైపే చూసే చక్రం... 


పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు వుంటుంది .


ఐదవది...: ఈ ఆలయంపై ఎగరని పక్షులు... 


ఇది మరో వింత. ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు.


ఆరవది...: ఆలయం లోకి వినిపించని అలల సవ్వడి...


ఇదో విచిత్రం. సముద్ర తీరాన కొలువుతీరిన 

ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్రపు హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.


ఏడోది...: ఘుమఘుమల ప్రసాదం ...


పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. అయితే ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసనా రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలు మంచి సువాసనతో ఘుమఘుమలాడుతుంటాయి.

(సేకరణ)

తివిరి యిసుమున

 తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు

తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు

చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.


భావం : ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును.ఎండమావి యందును నీరు త్రాగవచ్చును.తిరిగి తిరిగి కుందేటి కొమ్ము నైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు.

మానవత్వం

 చిరిగిన పంచి చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు - మీ కోసం ఏమి తీసుకురావాలి?


ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌లో #దోశ తినిపిస్తాను, అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను."


మా అమ్మాయి వాగ్దానాన్ని నెరవేర్చింది. దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి. "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకురావాలి? "అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు ..."మొత్తం విషయం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి మొత్తం కథ చెప్పాడు- "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అప్పుడు యజమాని అన్నాడు- "ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు ... ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు 😊


హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు... ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు...అ యజమాని వాళ్లకి మూడు దోశలు తో పాటు పొరుగువారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు... చాలా గౌరవం ఇచ్చిన అతను,అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తన ఇంటికి వెళ్ళారు...


సమయం గడిచిపోయింది ...

ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్‌గా వచ్చింది.ఆమె ముందు ఒక అటెండర్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియజేయమంది ... హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు.ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది...


 అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళుతున్నప్పుడు, ఆమె ఇలా చెప్పింది- "మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. , ఎవరి తండ్రికి మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు🙏, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేశారు..


  ఈ రోజు నేను మీ ఇద్దరి మంచితనం తో కలెక్టర్ అయ్యాను...మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ అనుకూలంగా గుర్తుంచుకుంటాను... ఈ రోజు ఈ పార్టీ నా తరపున ... ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.... అలా అని అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను..👏👏


నీతి - 

ఏదైనా పేదల పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న ప్రతిభను గౌరవించండి...

🧘🏻‍♀️🧘🏻‍♀️🧘🏻‍♀️🧘🏻‍♀️🧘🏻‍♀️🧘🏻‍♀️🧘🏻‍♀️🧘🏻‍♀️🧘🏻‍♀️🧘🏻‍♀️

*జీవిత స‌త్యo*

  


జీవితంలో దేనికోసం ఎదురు చూడకు. ఎదురు చూడడం అంటే జీవితాన్ని, విలువైన సమయాన్ని వృధా చేయడమే. సంతోషం రెండు కష్టాల మధ్య వచ్చే ఉపశమనం కాదు. అది కష్టపడి సంపాదించుకునే హృదయ సంస్కారం. కలలని పరుగులెత్తిస్తే లాభం లేదు, వాస్తవాలను కలపాలి.శాంతి అంటే రెండు యుద్ధాల మధ్య సంధి కాలం కాదు, యుద్ధం లేకపోవడమే శాంతి.ఆనందం ఉన్న చోట వినోదాలు అక్కర్లేదు. వినోదాలు ఉన్న చోట ఆత్మానందానికి తావు లేదు.సౌకర్యాలు పెరిగాయి, సదుపాయాలు పెరిగాయి, సౌఖ్యాలు పెరిగాయి. సంతోషమే సన్నగిల్లి పోయింది.ఒకరు మనపై జాలి పడడం మనకు గౌరవం కాదు. సానుభూతులు, సహాయాలతో జీవితం నిండదు. మనం మనంగా ఉన్నప్పుడే పదిమందిలో గౌరవం.ఇతరులతో నిన్ను పోల్చుకోవాలని చూడవద్దు. పోలిక విషం లాంటిది. వృద్ధిపై బుద్ధి పోనివ్వకుండా అడ్డుకునే దుర్మార్గపు లక్షణం పోలికలో ఉంటుంది.ప్రపంచం మారదు, మారాల్సింది నువ్వే.

ప్రేమించడం వేరు, ఒక వస్తువు కావాలనుకోవడం వేరు. కావాలనుకున్న ప్రేమ స్వార్థం అవుతుంది, అది బాధను మిగులుస్తుంది.ధ్యానం అంటే మన ఆలోచనలు, ప్రతిక్రియలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఆవేశాలు. వీటి స్వరూప స్వభావాలను, తత్త్వాలను అర్థం చేసుకుని అదుపు చేస్తేనే ధ్యానం సార్థకమవుతుంది.ఒకరివద్ద ఉన్నదేదో నీ వద్ద లేదు. అంటే నీ దగ్గర ఏదో లేదని కాదు, వాడి దగ్గర ఉంది కనుక నీకేదో లేదు అనిపిస్తోంది. ఇది కేవలం భావదారిద్య్రం మాత్రమే. ఉన్నదేదో ఉంది అని ఉన్నంతలో సరిపెట్టుకుంటే అంతకు మించిన ఆనందం లేదు.ఈ ప్రపంచానికి పెద్ద మార్పు అవసరం అని నువ్వు అనుకుంటే ఆ మార్పు ఎక్కడి నుంచో రెక్కలు కట్టుకుని రాదు, నువ్వు మారితే ప్రపంచం దానంతట అదే మారుతుంది. కనుక మార్పు నీ నుంచే మొదలవ్వాలి.పరిపూర్ణమైన మౌనంలోనే వర్తమానం ఉంటుంది.సృష్టి అంటే ఉన్నదాన్ని కొనసాగించడం కాదు, కొత్త భవిష్యత్తుకు నాంది పలకడం. ఉన్నదానికి చిలవలు, పలవలు పెట్టడం కాదు, కొత్తదనాన్ని తీసు కురావడం.ఈ ప్రపంచం నీకు ఏమీ ఇవ్వదు. ఏది కావాలన్నా నువ్వే సంపాదించు కోవాలి. సంపాదన మొదలు పెట్టాలంటే అసలు నీకు ఏం కావాలో నీకే స్పష్టంగా తెలియాలి. లక్ష్యం నిర్ణయించుకున్నాకే వెతుకులాట మొదలు పెట్టు.పరమానందం కోసం వెతుకు, అది నీ జన్మ హక్కు. సుఖానుభూతుల అరణ్యంలో తప్పిపోకు.ధనం ఎప్పుడూ, ఎవ్వరినీ అధికారిని చెయ్యదు. అది మనిషిని బానిసను చేస్తుంది. చాకిరీ చేయిస్తుంది, నిర్మొహమాటంగా ఊడిగం చేయిస్తుంది. ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా ఉండు. పరిసరాలు పాడయ్యాయని నువ్వు పాడైపోనక్కర్లేదు. ఇతరుల సుఖాలను బలి తీసుకుని బతకద్దు. అదే పవిత్రత అంటే. ఇతరుల సంతోషానికి చేయదగిన సాయం ఏదైనా ఉంటే రెండో ఆలోచన లేకుండా చేసిపెట్టు. అదీ పవిత్రతే. ధనికుడిని మించిన పేదవాడు ఎక్కడా లేడు. మామూలు పేదవాడికన్నా అతను రెండింతలు పేదవాడు. ధనికుడి దగ్గర డబ్బు మాత్రమే ఉంటుంది. దరిద్రుడి దగ్గర అభిమానం ఉంటుంది. ధనికుడు జీవిత కాలం భయపడుతూనే బతుకుతాడు. దరిద్రుడు నిర్భయంగా విహరిస్తాడు. ధనం – దాస్యం, దరిద్రం – స్వేచ్ఛ.

జిజ్ఞాసతో ఉన్న మనస్సును నాశనం చేస్తే అంతా నాశనమవుతుంది. మనసులేని మనిషి లేడు. మనస్సు లేకుంటే మానవత్వమూ లేదు. మనిషంటే జ్ఞానం. జ్ఞానం ఉంటేనే అన్వేషణ. అన్వేషణ అణగారి పోతే జీవితం సమాధి అవుతుంది. అందుకే జిజ్ఞాస బ్రతికుండాలి, ఏదో ఒకటి చేసి దాన్ని బ్రతికించాలి.

సహనం ప్రేమ కాదు. ప్రేమకు సహనం ఉండదు. ఆవేశం, ఆక్రోశం మాత్రమే ప్రేమ లక్షణాలు. భరించగల నేర్పు, ఓర్పు ప్రేమికులకు వరం. అవి ఉన్నవాడే ప్రేమించే సాహసం చేయాలి.

ఏదైనా కావాలనుకోవడం దు:ఖాన్ని పిలిచి తలకెక్కించుకోవడం. అన్ని బాధలకు ఆశే మూలకారణం. బతకడానికీ ఆశ కావాలి, ఉన్నతంగా ఎదగడానికీ ఆశ కావాలి. ఆశ నుంచి ఆశయం మొలకెత్తుతుంది. ఆశయం కోసం పాటు పడడం వేరు, ఆశతో కష్టాలు కొనితెచ్చుకోవడం వేరు.

ప్రపంచం మొత్తం తనకు విరుద్ధంగా ఉండాలని కోరుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. అలాంటి కోరిక అపాయకరం, ఎంతో ప్రమాదకరం. సంఘజీవనం, సామాజిక జీవనం, సహ జీవనం మనిషి మనుగడకు మూలం. వాటిని కాదంటే జీవితం చిందరవందర అవుతుంది.మనుషులు దేన్ని ద్వేషిస్తారో దాన్నే వెంట తెచ్చుకుంటూ ఉంటారు. ద్వేషంలోనే బ్రతుకుతుంటారు. ద్వేషం తెచ్చిపెట్టే గాయాలను మాన్చుకునే ప్రయత్నం చేయరు. మనస్సు ఒక క్రీడారంగం. అందులో అర్ధాంతరమైన ఆటల కన్నా బుద్ధిలేని ఆటలే ఎన్నో జరుగుతుంటాయి. ఆ బుద్ధిలేని ఆటలు కూడా సరిగ్గా అర్థం చేసుకుని జాలీ, దయ, క్షమా, కరుణలతో సహించగలిగితే అంతకు మించిన క్షమాపణ మరొకటి లేదు. క్షమాగుణం లేని మనిషి శత్రువులకు దాడి చేసే అవకాశం ఇస్తున్నాడన్నమాట.

-నీకు నిర్దిష్ట్టమైన స్వరూపం ఉంది, నీవు సమగ్రంగా పుట్టావ్‌. నీ సమగ్రతే ఈ దేశానికి ఇచ్చే సందేశం. వేరే సందేశాల కోసం ఎక్కడికీ పరుగులెత్తకు. నీ సమగ్రత చెదిరిపోకుండా కాపాడుకో. దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకో, అనుగుణంగా జీవించు. అదే నిన్ను కాపాడుతుంది.

మన దు:ఖానికి కారణాలు రెండు. ఒకటి నీ దు:ఖాన్ని పక్కవాళ్ళ మీదికి నెట్టివేయడం, రెండవది పరమానందం ఇతరుల నుంచి వస్తుంది అనే భావనతో బ్రతికివేయడం. రెండోది జరిగేది కాదు అందుకే నీవు కోరుకున్న సుఖం రాదు.

నీ జీవితం ఒక వస్తువు లాంటిది కాదు. సంతోషం కూడా ఒక వస్తువు లాంటిది కాదు. అది చేజారితే పగిలిపోదు, ఇతరులకు ఇచ్చేస్తే మనకు లేకుం డా పోదు. ఎవరి జీవితం వారిది.

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*

🌸దైవం మీద నమ్మకమే మోక్షానికి దారి🌸*

 *

🕉️🌞🌎🏵️🌼🚩


 *త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.* 

‘ *అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు?* 

 *ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని.* 


‘ *విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు.* 

‘ *అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని.* 


 *సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు.* 

 *‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం* *చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.* 


 *‘స్వామి బాగానే ఉన్నారు.* 

 *నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను.* 

 *నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు.* 

 *‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు.* 

 *అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు.* 

 *వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు.* 


 *‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి.* 

 *కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్త* 


 *స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు.* 

 *నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు.* 


 *నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు* *స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది.* 

 *నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు,* 


‘ *స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు* 

 *‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు.* 

 *వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.*  

 *విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు.* 


 *ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని.* 

 *‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం.* *మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో.* 


 *నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.* 

      *‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా!* 


 *నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు.* 


 *‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. ‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి.* 


 *ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా…* 


 *ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు* *స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు.* 


 *పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.* 

సేకరణ వే శ్రీ

🕉️🌞🌎🏵️🌼🚩

శివానందలహరి 56, 57_ వ శ్లోకం

 



శివానందలహరి

56 వ శ్లోకం


" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":


అవతారిక:


సకల ప్రపంచ స్వరూపుడైన పరమేశ్వరుని శంకరులు స్తుతిస్తున్నారు.


 శ్లోకము :


             నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే

సత్యాయాది కుటుమ్బినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే ।

మాయా సృష్ట జగత్త్రయాయ సకలామ్నాయాన్త సంచారిణే

సాయం తాణ్డవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ।।56।।



తాత్పర్యము :


శాశ్వతుడునూ , బ్రహ్మ విష్ణు రుద్ర రూపములు గలవాడునూ, త్రిపుర

విజయియూ, కాత్యాయనీ మనోహరుడునూ, సత్యస్వరూపుడునూ,

మునుల మనస్సు లకు గోచరమైన చిత్ స్వరూపుడునూ , మాయవలన 

ముల్లోకములనూ కల్పింౘువాడునూ, వేదాంత వేద్యుడునూ, తాండవ

నృత్యమునందు పరమానందమును పొందువాడునూ, జటాజూటం

గలవాడునూ, మొట్టమొదటి సంసారియూ నైన శివునకు నమస్కారము.

   


            🔱 శివానందా రూపం శివం శివం 🔱


ఈ శ్లోకము ఈశ్వరుని నుతించే ఒక అద్భుత స్తోత్రము. ఈశ్వరుడు నిత్యుడు. 

సత్త్వరజస్తమో గుణ స్వరూపుడు. స్థూల సూక్ష్మ కారణ రూపములైన 

త్రిపురములను ఝయించిన వాడు. పార్వతీ తపః ఫల స్వరూపుడు. ప్రథమ

సంసారి. మునీశ్వరుల మనస్సు లకు గోచరమయ్యే చిత్స్వరూపుడు. మాయతో

మూడు లోకాలనూ సృష్టించే వాడు. వేదాంతముల యందు అనగా ఉపనిషత్తు

లలో సంచరించే వాడు. సాయంకాల నర్తనమునందు తొందర గలవాడు. 

జటాజూటము గలవాడు. ఆయనకు నమస్కారము.

[

 *దత్తభక్తుడు గా ఉండటం ఎన్నో జన్మల అదృష్టం* *శ్రీగురుదత్తాత్రేయస్వామి వారు చాలా మహిమ కలిగిన స్వామివారు. ఆయనను పూజించినవాళ్ళు* *జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తిని దత్తస్వామి ఇస్తారు. దత్తనామం పలకండి. మానవజన్మ ధన్యం చేసుకోండి* 


 *🌹🌻జయగురుదత్తా దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ! 🙏🙏*   

        

 *🌹🌻దిగంబరా దిగంబరా అవధూతచింతన దిగంబరా !!🙏🙏🙏🙏🙏🙏*

🚩


*మిథిలానగరాన్ని పరిపాలించే జనకునికి రాజర్షి అని బిరుదు. ఆయనను గొప్ప జ్ఞానిగా అందరూ భావించి గౌరవించేవారు. అయితే ఆయనలోని జ్ఞానం ఆయన ముఖంమీద తాండవిస్తూ ఉంటుందా? అందులోనూ ఉదయం నుంచి రాత్రివరకు రకరకాల లౌకిక వ్యవహారాలలో మునిగి తేలే ఒక రాజును జ్ఞానిగా ఎలా భావించడం!.*



*జనకున్ని రాజర్షిగా, జ్ఞానిగా అందరూ ఎందుకంటున్నారో, అందులోని విశేషమేమిటో తేల్చుకుందామను కున్నాడు ఒక సాధువు. నేరుగా జనకుని ఆస్థానానికి వెళ్ళాడు.* 



*జనకుడప్పుడు మంత్రులతో మంతనాలు జరుపుతున్నాడు. ప్రజల బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు.కప్పం చెల్లించని సామంత రాజులపై కోపం ప్రకటిస్తున్నాడు.*



*ఎతైన సింహాసనం మీద కూర్చున్న జనకునికి పరిచారకులు అటూ ఇటూ నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఒకరు పాదాలు ఒత్తుతున్నారు. ఆయన కిరీటంలో పొదిగిన మణిరత్నాలు జిగేలుమంటున్నాయి. ఎటుచూసినా ఆడంబరమూ, అతిశయమే. సాధువు ఇదంతా గమనిస్తున్నాడు. అతనకీ వరస ఏమీ నచ్చలేదు. ఇతడన్నీ లౌకికవిషయాలే మాట్లాడుతున్నాడు. లౌకికమైన సిరిసంపదలతో తులదూగుతున్నాడు. ఇతడు రాజర్షీ, జ్ఞానీ ఎలా అవుతాడు? ఇతణ్ణి జ్ఞాని అన్నవాళ్ళు పరమ అజ్ఞానులు - అనుకున్నాడు.*



*సాధువు ఆస్థానంలోకి అడుగు పెడుతున్నప్పుడే అతని మీద జనకుని దృష్టి పడింది. మంత్రులతో మాట్లాడుతూనే అతనిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అతని మనోభావాలను అంతర్దృష్టితో గమనిస్తూనే ఉన్నాడు. సాధువును తన వద్దకు పిలిపించు కున్నాడు. సాధువు వేషంలో ఉన్నావు కానీ, నువ్వు నిజమైన సాధువువి కావు అన్నాడు. సాధువు తెల్లబోయాడు. ఎప్పుడూ ఇతరులలో తప్పు లెంచే స్వభావం నీది. దానితోనే నీ సమయమంతా ఖర్చయిపోతోంది. భగవధ్యానానికి నీకు తీరికేదీ? సాధువు మరింత నివ్వెర పోయాడు. నా దృష్టిలో నువ్వు నేరస్థుడివి. రాజుగా నిన్ను శిక్షించక తప్పదు. నీకు మరణశిక్ష విధిస్తున్నాను. వారం రోజుల్లో నిన్ను ఉరితీస్తారు. సాధువు గజగజ వణికిపోతూ నిలబడ్డాడు.* 



*జనకుడు అలా ప్రకటించిన వెంటనే భటులు సాధువును తమ అదుపులోకి తీసుకున్నారు. చెరసాలకు తరలించారు. అతడికి రోజూ ఉప్పులేని కూరలు, కారం కలిపిన తీపిపదార్థాలు ఆహారంగా పెట్టమని జనకుడు సేవకులను ఆదేశించాడు. అయితే ఆ సాధువు వాటి రుచిని పట్టించుకునే స్థితిలో ఉన్నాడా? కళ్ళు మూసినా తెరచినా అతనికి ఉరికంబమే కనిపిస్తోంది. తన మెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుంటున్న దృశ్యమే కళ్ళముందు కదులుతోంది.* 



*కంటిమీద కునుకే కరువైపోయింది. ఆ వారంరోజుల్లోనే అతడు మరణభయంతో, మనోవ్యధతో చిక్కి శల్యమైపోయాడు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేశాయి.ఏడవరోజున సాధువును ఉరి తీయడానికి సన్నాహాలు చేయమని జనకుడు ఆదేశించాడు. తను కూడా ఉరి తీసే ప్రదేశానికి వెళ్ళాడు. భటులు చెరోవైపూ చేతులు పట్టుకుని, అతికష్టంమీద అడుగులు వేస్తున్న సాధువును తీసుకొచ్చి జనకుని ముందు నిలబెట్టారు. మృత్యుభయంతో సాధువు స్పృహ కోల్పోయి కుప్ప కూలిపోయాడు.*



*కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చింది. అప్పుడు జనకుని ఆదేశంపై సేవకులు అతనకి ఉప్పు కలిపిన పాలు ఇచ్చారు. సాధువు ఆ పాలను గడగడ తాగేశాడు. పాలు బాగున్నాయా? పంచదార సరి పోయిందా? అని ప్రశ్నించాడు జనకుడు చిరునవ్వుతో. ఎందుకడుగుతావు మహారాజా! ఈ వారంరోజులుగా పదార్థాల రుచిని గమనించే స్థితిలో ఉన్నానా నేను? నాకు ప్రతిక్షణమూ, ప్రతిచోటా ఉరికంబమే కనిపిస్తోంది, అన్నాడు సాధువు. జ్ఞానబోధకు ఇదే తగిన సమయమనుకున్నాడు జనకుడు.*



*ఈ వారం రోజులూ నువ్వు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, నీ దృష్టి చేస్తున్న వాటిమీద,తింటున్నవాటిమీద లేదు. కేవలం ఉరికంబమే నీకు కనిపించింది. అలాగే నేను రోజూ ఉదయం నుంచి రాత్రివరకూ అనేకమైన లౌకికివిధులు నిర్వర్తిస్తున్నా నా దృష్టి మాత్రం ఎల్లవేళలా పరబ్రహ్మతత్త్వం పైనే లగ్నమై ఉంటుంది.*



 *విశేష ధ్యానంతో నేనాస్థితిని సాధించాను. నేనీ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండగలను. నా మనస్థితి ఎటువంటిదో ఇప్పుడైనా అర్థమైందా? ఇక ముందెప్పుడూ ఇతరుల లోపాలను ఎంచే ప్రయత్నం చేయకు. నీ బాగు నువ్వు చూసుకో. ఇతరులలో మంచినే చూడడం నేర్చుకో. తపస్సుతో , ధ్యానంతో పరమసత్యాన్ని తెలుసుకో. ప్రపంచానికి అతీతంగా ఉంటూనే ప్రపంచ క్షేమం కోసం పనిచెయ్యి.* 



*ఇక వెళ్ళు!. సాధువుకు జనకుని ఔన్నత్యం, తన అల్పత్వం అర్థమయ్యాయి. అతనికి శిరసు వంచి నమస్కరించి అక్కడినుంచి నిష్క్రమించాడు.*


🕉🌞🌎🌙🌟🚩



🍁🍁🍁🍁🍁


ద‌స‌రా ఉత్స‌వాల స‌మ‌యమిది. దుర్గ‌మ్మ‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తులు పూజిస్తున్న ప‌విత్ర త‌రుణ‌మిది. ఈ స‌మ‌యంలో ఛండీ హోమం అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. ఇది చేస్తే... మాత యొక్క ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆది శక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియా శక్తి, కుండలినీ శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.

 

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

 

🌷చండీ హోమంలో ఉన్న మంత్రాలు ఎంతో శ‌క్తివంత‌మైన‌వి...🌷



చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.


దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం                   

 

🌷చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:🌷


ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

 

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి(చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు.

 

వీటిలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. చండీ యాగాల ఫ‌లితం అనూహ్యంగా ఉంటుంది.


 శ్రీ మాత్రే నమః 🙏


🍁🍁🍁🍁

 *మన కోసం-మంచి మాటలు*


_*దు:ఖం నుండి శాంతి వైపుకు...*_


*విక్రమాదిత్య మహారాజు...* ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది :


 ' నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు.


 కానీ వాళ్ళంతా రాజులు కాలేదు ,


 నేనే ఎందుకయ్యాను ?

 ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? 


' మరుసటిరోజు సభ లో పండితులముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. 


అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా , ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. 


ఆయనను కలవండి. 

జవాబు దొరుకుతుంది ''అన్నాడు. 


రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు


అది చూసి రాజు ఆశ్చర్యపోయి ,...

 తన ప్రశ్న ఆయన ముందు పెడితే....


 ఆయన అన్నాడు : '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది.


 అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''


 నిరాశపడినా , 

రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. 


రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తిం టున్నాడు


రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.


 కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.


 కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు


 రాజుకూ కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. 


వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : '' ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది ,


 అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి.'


 రాజుకంతా గందరగోళంగా వుంటూంది. అయినా అక్కడికెళతాడు. 


చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. 


అపుడు ఆ అబ్బాయి అన్నాడు


 '' గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారితప్పివుంటారు. 


ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.


 తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి , నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో 


*'' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు*


*రెండవ వ్యక్తిని అడిగితే..*

 '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే ''


 అని వెటకారంగా అంటాడు.


 మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ? 


''అని నీచంగా మాట్లాడాడు. 


కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' తాతా , నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను , '' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.


 ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా '' అని అన్నాడు. 


 రాజు దిగ్భ్రాంతి కి లోనయ్యాడు. 


రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూసినాడు...

ఓ మంచిమాట దానం వంటిది...అందరికీ పంచండి...ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది...*

*ఓ చెడ్డ మాట అప్పులాంటిది...ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది...


#మధురమీనాక్షి #అద్భుత #శబ్దసౌందర్యం

12 వ శతాబ్దంలో నిర్మించిన మధుర మీనాక్షి ఆలయ అందాలు చూడటానికే రెండు కళ్ళు చాలవు అనుకుంటే ఆ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న శబ్ద సౌందర్యం గురించి తెలుసుకుంటే మన పూర్వీకుల, శిల్పుల నైపుణ్యం, దూరదృష్టి, ఆలయ నిర్మాణాల వెనక దాగి ఉన్న రహస్యాలు ఛేదించడానికి మన తరానికి ఉన్న మిడి మిడి జ్ఞానం సరిపోదు అనిపిస్తుంది. ఈ ఆలయ శిల్పులకు, నిర్మాతలకు శిరసా ప్రణామములు 🙏🙏🙏


పురాతన తమిళులు మధురై మీనాక్షి ఆలయంలో సంగీత స్తంభాలను నిర్మించడంలో “శరీరాల కంపనం” సూత్రాలను ఉపయోగించారు. ఈ అద్భుతమైన ఆలయం యొక్క శబ్ద సౌందర్యంపై తమిళనాడులోని ENT నిపుణుల బృందం చేసిన అధ్యయనం ప్రకారం - విభిన్న సంగీత శబ్దాలను పొందటానికి శిల్పులు సరైన రకమైన రాయిని ఎన్నుకుని స్తంభాల పొడవు, వ్యాసాన్ని చాలా తెలివిగా తయారుచేశారు. ఒకే రాయిని ఉపయోగించడం ద్వారా, దాని ఆకారాన్ని తగిన విధంగా మార్చడం ద్వారా వారు దానిని సాధించగలిగారు. మధురై జనరల్ హాస్పిటల్‌లోని ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు ENT ఇన్స్టిట్యూట్ చీఫ్ డాక్టర్ ఎస్ కామేశ్వరన్ నేతృత్వంలోని వైద్య బృందంతో పాటు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు మరియు ఆడియాలజిస్టులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఈ పరిశోధన ప్రాజెక్టుకు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన హెచ్‌ఆర్‌సిఇ నిధులు సమకూర్చింది. ఈ ఆలయం ‘శబ్ద అద్భుతం’ అని అధ్యయన బృందం అభిప్రాయపడింది. 


ఆలయంలో ఉన్న గర్భాలయంలో శబ్ద స్థాయి 40 డెసిబెల్స్ కి మించదు. ఇది మన గ్రంథాలయాల్లో ఉండే శబ్దంతో ఇది సమానం. అదే కాక ఆలయ కోనేరు, అష్టశక్తి మంటప పరిసరాల్లో కూడా శబ్ద స్థాయి ఇంచుమించు 40 డెసిబుల్స్ మాత్రమే ఉంటుంది. ఈ పరిసరాల శబ్దం ఒక వ్యక్తి దైవత్వాన్ని అనుభూతి చెందడానికి, ధ్యానం చేయదానికి సాధ్యపడుతుంది. సాయంత్రం సందర్శకులు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా నమోదు చేయబడిన ధ్వని స్థాయి 70 నుండి 80 డిబి వరకు మాత్రమే ఉంది. విశేషమేమిటంటే, ఆలయంలో ఎక్కడా ప్రతిధ్వని వినిపించదు (zero echo). ప్రతిధ్వని సున్నాగా ఉండటానికి, అదే సమయంలో, మొత్తం శబ్దం నిర్దిష్ట స్థాయి 80 డిబి మించకుండా ఉండటానికి ప్రత్యేకంగా ఈ నిర్మాణం చేశారు.


ఆలయంలోని 1000 స్తంభాల మంటపం (హాల్ ఆఫ్ థౌజండ్ పిల్లర్స్ ) కూడా పరిపూర్ణ శబ్ద సాంకేతికతకు (సౌండ్ ఇంజనీరింగ్) శాస్త్రీయ ఉదాహరణ. ఈ మంటపానికి ప్రస్తుతం 985 స్తంభాలతో చాలా తక్కువ పైకప్పు ఉంది. ప్రతి స్తంభం సగటున 12 అడుగుల ఎత్తు ఉంటుంది. అన్నీ సరిగ్గా ఒకే పరిమాణం, ఒకే ఆకారం మరియు గణితశాస్త్రం ప్రకారం కచ్చితమైన స్థానాల్లో ఉంటాయి. చాలా మంది ఈ ప్రతిధ్వని లేని (ఎకో రెసిస్టెంట్) హాలులో కూర్చుని ఆలయంలోని మొత్తం కార్యకలాపాలను నిశ్శబ్దంగా వినవచ్చు. 


ఈ భారీ ఆలయాన్ని నిర్మించిన శిల్పులకు కచ్చితంగా ధ్వని యొక్క ప్రాథమిక సూత్రాల గురించి తెలిసి ఉండాలి. అపరిష్కృతమైన స్తంభాలపై ఉన్న భారీ చిహ్నాలు, బయటకు వెళ్ళే ద్వారం, చుట్టుపక్కల బహిరంగ ప్రదేశాల కేటాయింపు, అన్నీ ఈ ఆలయంలో శబ్దం స్థాయిని నిర్దేశించేలా నిర్మించారని అధ్యయన బృందం తెలిపింది.


🙏🙏🙏🙏🙏

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":


అవతారిక :


ఈ శ్లోకము లో సేవింౘుట యందు తాను నేర్పులేని వాడైనప్పటికీ

తనను తప్పక సంరక్షింప వలెనని‌‍ , శంకరులు, ‍ సహేతుకంగా ఈశ్వరునకు

నివేదింౘు కున్నారు.


 శ్లోకము ॥


నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా

వ్యర్థం పర్యటనం కరోమి భవతస్సేవాం న జానే విభో ।

మజ్జన్మాన్తర పుణ్యపాక బలతస్త్వం శర్వ సర్వాన్తరః

తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోఽస్మ్యహమ్ ।।57।।


ప్రభూ ! పశుపతీ ! శివా ! నా కడుపు నింపుకోవడానికి ధనాశచే నిత్యమూ

ధనము గలవారి నందరినీ ఉద్దేశించి వ్యర్థముగా తిరుగుతున్నాను. నీ

సేవను కొంచము కూడా ఎఱుగను కానీ నా పూర్వజన్మ పుణ్య పరివపాక 

ఫలముచే సర్వాంతర్యామివైన నీవు అన్నింటియందూ ఉన్న విధంగానే

 నాయందు కూడా ఉన్నావు. అందుచే నీవు నన్ను ఉపేక్షింౘడానికి వీలు

 లేదు. నేను కూడా నీకు రక్షింపదగిన వాడను అవుతున్నాను.


వివరణ :


ఈ శ్లోకము లో వాడిన సంబోధనలన్నీ సార్థకములు. ఈశ్వరుని "విభో "

అనీ, " శర్వ " అనీ, " పశుపతే " అనీ ఈ శ్లోకము లో సంబోధించారు. 

" విభో" అంటే సర్వవ్యాపకా ! అని అర్థము. ఈశ్వరుడు సర్వవ్యాపకుడై

నందున తనలో కూడా ఉంటాడని అర్థము‌ " పశుపతి " అన్నందున 

పశువునైన తనను రక్షింౘాలని అర్థము. ఇక. " శర్వ " అంటే భక్తుల 

పాపములను ధ్వంసము చేయువాడా ! అని పిలుపు. తన పాపాలను

సైతమూ మన్నించి రక్షింపుమని ప్రార్థన. శంకరులు ధనాశతో అంతటా 

తిరుగుతున్నానని చెప్పారు. " ఆశాయాః యేదాసాః , తే దాసాః సర్వ

లోకస్య ". అని చ్పుతారు. ఆశకు దాసు లయితే , వారు సర్వ లోకానికీ 

దాసులే అవుతారట.


భగవంతుని సేవయొక్క గొప్పతనాన్ని గుర్తించి నట్లయితే, అర్థముగల

వారి సేవ వ్యర్థమని తేట తెల్ల మవుతుంది.


                ". అర్థ మనర్థం భావయ నిత్యం

                   నాస్తి తతః సుఖలేశః సత్యం ". ( భజగోవింద శ్లోకం)


తాత్పర్యము :


ధనము, ఉపద్రవాలను తెచ్చి పెడుతుంది. దానివల్ల కించిత్తు కూడా 

సుఖము ఉండదనే మాట సత్యము " అని శంకరులు భజగోవింద

శ్లోకాలలో చెప్పారు.



      

            🔱 శివానందా రూపం శివం శివం 🔱

అమ్మ


 

మహేశుడి నెలవు... దేవేంద్రుడి కొలువు

 

పారిజాతాలు...నందనవనాలు

దేవగానాలు...గంధర్వ లోకాలు

మానస సరోవరాలు...రాజహంసలు.

యతుల నివాసాలు... మునుల గుహాలయాలు

అక్షయ నిధులు... ఆత్మానందాలు...

అన్నీ అక్కడే. అవి హిమాలయాలు...


అవి అచలాలైనా చంచలమైన మనస్సును అదుపు చేసుకోవాలనుకునే వారి చరమ లక్ష్యాలు. ఆత్మోన్నతి కోరుకునేవారికి కొంగుబంగారాలు. భారతీయ ఆధ్యాత్మికతకు పెట్టని కోటలు. అచట పుట్టిన కొమ్మ కూడా ్ఝ]చేవ అన్నట్లు అక్కడ కనిపించే ప్రతి దృశ్యమూ అద్భుతమే.

ఆ సానువల్లో పుట్టిన ప్రతి కథా ఆశ్చర్యమే.


శివ, బ్రహ్మవైవర్త, మత్స్యపురాణాల్లో హిమాలయాలు, అక్కడి ప్రాంతాలు, శిఖరాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు కనిపిస్తాయి


ప ర్వతాలకు రెండు రకాల దేహాలుంటాయని సనాతన ధర్మం చెబుతోంది. ఒకటి జంగమం... అంటే నడిచేది. రెండోది స్థావరం... అంటే స్థిరమైంది. శివపురాణంలోని పార్వతీ ఖండంలో ఉన్న కథ ప్రకారం హిమవాన్‌ అనే పర్వతరాజు ఉండేవాడు. ఆయననే హిమవంతుడని కూడా పిలిచేవారు. ఆయన స్థావర రూపంలో అంటే పర్వతంగా ఉన్నప్పుడు తూర్పు నుంచి పడమరకు భూమిని కొలిచే కొలబద్దలా వ్యాపించి ఉండేవాడు. అద్భుత ప్రకృతి సౌందర్యంతో శోభాయమానంగా దర్శనమిచ్చేవాడు. అందుకే ఎందరో రుషులు అక్కడ తపస్సు చేసుకునేవారు. హిమవంతుడు విష్ణువు అంశతో జన్మించినవాడు. అందుకే ఆయనను, ఆయన స్ధావర రూపమైన హిమాలయాలను పరమశివుడు అత్యంత ఇష్టపడేవాడు. హిమవంతుడికి మేన అనే ఆమెతో వివాహమైంది. వారిద్దరి సంతానమైన పార్వతీదేవినే పరమశివుడు పెళ్లి చేసుకుని హిమశిఖరాలపైనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు శివ పురాణం చెబుతుంది.

పరమేశ్వరుడు కొలువున్న ఆ చోటే కైలాస పర్వతమని చెబుతారు. ఉత్తర హిమాలయాల్లోని ఈ దివ్యధామం మహిమాన్వితమైంది. భారతీయులతో పాటు, టిబెట్‌, నేపాల్‌ ప్రజలకు కూడా అత్యంత పూజనీయస్థలమది. ఈ పర్వత వైభవాన్ని బ్రహ్మవైవర్త పురాణం, గణపతి ఖండం వివరిస్తోంది. ఎంతో సుందరమైన ఆ పర్వతం సుందర స్ఫటిక కాంతులు వెదజల్లుతుంది. అక్కడికి సమీపంలో అసంఖ్యాకంగా యక్షులు అదృశ రూపంలో నివసిస్తుంటారు. మహా యోగులు, కిన్నరులు, కింపురుషులు, ప్రమథగణాలు ఆ పరిసరాల్లో కొలువుదీరి ఉంటారు. ఇక్కడి ఆకాశగంగ నదీ తీరంలో పారిజాత వృక్షాలు, పరిమళభరితమైన పుష్పాలున్న మొక్కలు కనువిందు చేస్తుంటాయి. ఎందరో సిద్ధులు కనిపిస్తారు. విశ్వకర్మ నిర్మించిన శంకర సౌధం అద్భుతంగా ఉంటుందని గణపతి ఖండంలో ఉంది. కైలాస పర్వతానికి పశ్చిమంగా పుష్పచిత్రం, క్రౌంచం అనే పర్వతాల మధ్య ప్రదేశంలో కార్తికేయుడి అభిషేకం జరిగినట్లు చెబుతారు. దాన్ని శరవణం అని అంటారు.అక్కడికి పడమటి దిక్కున నిషిధ పర్వత శిఖరంపై మహాదేవుడు అర్చించే విష్ణువు ఆలయం ఉంటుంది


బదరీ క్షేత్రానికి ఉత్తరంగా మర్యాదా, దేవకూట అనే రెండు శిఖరాలున్నాయి. ఈ ప్రాంతంలో గరుత్మంతుడు ఉండేందుకు వీలుగా ఇక్కడ ఒక ప్రదేశం ఉంటుంది. దాని పక్కన ముఫ్ఫై ఆమడల వెడల్పు, నలభై ఆమడల పొడవున్న ఏడు గంధర్వ నగరాలుంటాయి. అక్కడే సింహకేయుడు అనే గణానికి చెందిన ఓ మహా నగరం కూడా ఉంది. అక్కడ దేవరుషులు సంచరిస్తుంటారు. హేమకూట పర్వత మధ్య భాగంలో మహాదేవుడి రావిచెట్టు ఉంది. అక్కడే ఒక పెద్ద సభాప్రాంగణం కూడా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలోనే పద్మం, మహాపద్మం, మకరం, కచ్ఛపం, కుముదం, శంఖం, నీలం, నందం అనే మహానిధులున్నాయి. మందాకిని, కనకమంద, మంద అనే నదులు కూడా ప్రవహిస్తుంటాయి. మత్స్యపురాణంలో వర్ణించిన సాలతాల, తమాల, కర్ణికార, శాల్మల, న్యగ్రోధ, అశ్వద్ధ, శిరీష, వకుళ వంట ఓషధ వృక్షజాతులను ఇప్పటికీ మనం చూడొచ్చు. అందుకే హిమాలయాలను జాతి సంపదగా భావించాలి, వాటిని సంరక్షించుకోవాలి.


శరవణానికి సమీపంలో కలాప అనే గ్రామం ఉంది. సిద్ధులు, మునిగణాలు అక్కడ నివసిస్తుంటారని, మార్కండేయుడు, వశిష్ఠుడు, ఉద్దాలకుడు తదితర మహానుభావులు ఇప్పటికీ భౌతిక దేహాలతో ఉన్నారని చెబుతారు.



👆 పైన చెప్పిన విషయం లో హిమాలయాలు జంగమాలు అని చెప్పబడింది. అంటే హిమాలయ పర్వత ప్రాంతం నడుస్తూ ముందుకు కదులుతున్నాయి అని అర్థం. సంవత్సరానికి ఆరు సెంటీమీటర్లు అని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. ఈ విషయం మనకు పురాణాల్లో చాలా అద్భుతంగా తెలిపారు. 19వ శతాబ్దం మొదటి వరకు మన సైంటిస్ట్ ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు.


Forwarded post

🌹*కోరిక ?!*🌹

 


        మహాభారతం లోని ఆదిపర్వములో ఉటంకించిన యయాతి కథ మనిషి లోని కోరికలకు అంతము లేదని, దానిని మనిషి జయించ గలగాలనే సత్యాన్ని తెలియ చేస్తుంది.


        శివుడి కుమార్తె అశోక సుందరి నహుష చక్రవర్తుల కుమారుడు యయాతి మహారాజు. ఇతడు పాండవులకు పూర్వీకుడు. గొప్ప విష్ణు భక్తుడు. పరాజయం ఎరుగని పరాక్రమశాలి. ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని వివాహం చేసుకున్నాడు. 


        ఆ తరువాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ పట్ల కూడా మోహం కలిగి దేవయానికి చెప్పకుండా రహస్యంగా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. దేవయానికి ఈ సంగతి తెలిసి తన తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడికి అల్లుడి మీద పట్టరాని కోపం వచ్చింది. 


        అంతే చేతిలోకి మంత్ర జలం తీసుకుని “నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక” అని యయాతికి శాపం ఇచ్చాడు. 


        నడి వయస్సులో అకస్మాత్తుగా ముసలి తనం రావడంతో యయాతి మహారాజు హడలి పోయి, గత్యంతరం లేక మామగారి పాదాలపై పడ్డాడు. 


        ఎంతైనా కూతురి భర్త కదా !... శుక్రాచార్యుడు జాలిపడ్డాడు. ”రాజా! నా శాపాన్ని ఉపసంహరించలేను. అయితే ఎవరైనా సమ్మతించే వారుంటే వారికి నీ మసలి తనం ఇచ్చి వారి పడుచు తనం నీవు తీసుకోవచ్చు” అని ఉపాయం చెప్పాడు. 


        యయాతికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. అందరూ అందమైన వాళ్ళు. క్షత్రియోచితమైన విద్యలో ఆరితేరిన వాళ్ళు. కొడుకులలో ఎవరికైనా తన శాపాన్ని బదలాయించాలనుకుని, వాళ్ళను పిలిచి...


        “నాయనలారా! మీ తాతగారిచ్చిన శాపం వల్ల నాకు అకాల వార్థక్యం దాపురించింది. చూశారుగా నా అవస్థ!.... మీలో ఎవరైనా సరే నా ముసలితనం తీసుకుని మీ యవ్వనం నాకు బదులిస్తే మరి కొంత కాలం నేను పడుచుదనం అనుభవించవచ్చు. జీవిత భోగాలు తృప్తి తీరా అనుభవిస్తాను. ఎవరైతే నా ముసలితనం స్వీకరిస్తారో వారికి నా రాజ్యం ఇస్తాను” అన్నాడు. 


        పెద్ద కుమారుడు నావల్ల కాదన్నాడు.


        రెండవ కమారిడిని అడిగితే, “నాన్నగారూ! బలాన్నీ, రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనంచేసే వృద్ధాప్యాన్ని తీసుకోమని అడుగుతున్నారు. అంతటి నిబ్బరం నాకు లేదు. క్షమించండి” అని మర్యాదగా తప్పుకున్నాడు.


        మూడవవాడు నిష్కర్షగా ముందే చేతులు అడ్డంగా తిప్పాడు.


        రాజుగారికి చాలా కోపం వచ్చింది. నాలుగవ వాణ్ణి పిలిపించారు. అతడు...


        “నాన్నగారూ! నన్ను మన్నించండి. ముసలితనమంటే నాకు అసహ్యం. వార్ధక్యంలో శరీరం ముడతలు పడి, చూపు ఆనక, మాట వినపడక స్వతంత్రం కోల్పోయి దుఃఖ పడాలి. మీ కోసం నేనంత కష్టాన్ని భరించలేను” అని స్పష్టంగా చెప్పాడు.


        ఇలా నలుగురు కొడుకులు ఒకరి తర్వాత ఒకరు తన కోరిక కాదనేటప్పటికి యయాతి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు. ఎంతోసేపు విచారించాడు. చివరకు తన మాటకు ఎన్నడూ ఎదురుచెప్పని కడగొట్టు కుమారుణ్ణి పిలిపించాడు.


        ఆ కుమారుడిని చూడగానే కంట తడి పెట్టుకుని “నాయనా! ఇక నీవే నన్ను కాపాడాలి. ఈ ముసలితనం, ఈ ముడతలు, ఈ తడబాటు, ఈ నెరసిన వెంట్రుకలు ఇవన్నీ శుక్రాచార్యులవారి శాపం వల్ల నాకు అకాలంగా వచ్చి పడ్డాయి. ఈ దుస్థితిని నేను భరించ లేకుండా వున్నాను. కొంతకాలం నా ముదుమిని నీవు పుచ్చుకుని నీ యవ్వనం నాకిచ్చావంటే సర్వసుఖాలూ అనుభవిస్తాను” అని దీనంగా అర్ధించాడు.


        యయాతి ఆఖరి కుమారుడి పేరు పూరుడు. అంత దీనంగా తండ్రి ప్రాధేయ పడే సరికి అతనికి తండ్రి యెడల జాలి కలిగింది. 


        ”నాన్నగారూ! మీ కోరిక ప్రకారం మీ వార్ధక్యాన్నీ, రాజ్యభారాన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తాను. మీరేమీ దిగులు పెట్టుకోకండి” అన్నాడు.


        యయాతికి పట్టరాని ఆనందం కలిగింది కుమారుణ్ణి కౌగిలించుకుని అభినందించాడు.


        పూరుడి సమ్మతితో అతని యవ్వనాన్ని యయాతి తీసుకున్నాడు. తండ్రి మసలితనం పూరుడు స్వీకరించి, రాజ్యభారం వహించి చాలా కాలం జనరంజకంగా పాలన చేశాడు. గొప్ప కీర్తి పొందాడు. 


        యయాతి కుమారుడు ఇచ్చిన యవ్వనంతో వేల సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభ వించాడు. కానీ తృప్తి కలుగలేదు. ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. ఇలా ఎంత కాలం అనిపించింది. అప్పుడు పూరుడి దగ్గరకు వెళ్ళి... 


        “నాయనా! కుమారా! కోరికలు ఎన్నటికీ తీరవు. విషయానుభవం వల్ల కాంక్షలు ఇంకా వృద్ధి పొందుతాయే గాని అణగవు. కామినీ కాంచనాలూ, పాడిపంటలూ మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తి పరచలేవు. ఈ సంగతి క్రమేపీ నాకు తెలిసి వచ్చింది. ఇష్టా అయిష్టాలకు అతీతమైన ప్రశాంత స్థితిని పొందాలని వుంది. ఇక నీ యవ్వనం నీవు తీసుకుని చల్లగా రాజ్యం పాలిస్తూ వర్థిల్లు నాయనా” అని అశీర్వదించాడు.


        తండ్రి కోరిన విధంగా పూరుడు తిరిగి తన యవ్వనం తను తీసుకుని తండ్రి ముసలి తనం తండ్రికి ఇచ్చాడు. యయాతి అందరి దగ్గర సెలవు తీసుకుని తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి, చివరకు స్వర్గం చేరుకున్నాడు.


        ఈ కథ ద్వారా అరిషడ్వర్గాలకు లొంగి పోతే ఎప్పటికీ తృప్తి తీరదనే విషయం అర్దమవుతోంది. అందుకే మన కోరికలను కుదించి ఆ పరమేశ్వరుడిని సదా మనసులో నిలుపుకుంటే జీవన్ముక్తులం కాగలము.


                             శుభం భూయాత్


                                  🌺🙏🌺

మీకు తెలుసా


 

*ధార్మికగీత - 25*

 

                                   *****


       *శ్లో:-  యౌవనం  ధనసంపత్తి: ౹*

               *ప్రభుత్వ    మవివేకితా  ౹*

               *ఏకైక  మప్య  నర్థాయ  ౹*

               *ఏకత్ర   కిము  ఉచ్యతే  



యౌవన , విత్తశాఠ్యములు ,

           నయ్యధికార , వివేకహీనతల్ ,

ప్రోవిడకుండ నొక్కొకటి 

           పూనిననైన ననర్థదాయకం 

బై వివిధంబుగా చెఱచి

           వ్యక్తి వినాశముగొల్పు ; నన్నియున్ 

ప్రోవిడి వచ్చిజేర నిక 

           పూని వచింప నశక్యమెంతయున్



✍️  గోపాలుని మధుసూదన రావు

**హిందూ ధర్మం** 60

 **దశిక రాము**

కోపానికి సంబంధించి శ్రీ రామాయణంలో బాలాకాండ 51-62 సర్గల్లో ఒక చక్కటి కధ ఉంది.


ఈ భూమిని కొన్ని వేల్ల సంవత్సరాలు పరిపాలించిన విశ్వామిత్రుడు మొదట క్షత్రియుడు. ఒకసారి తన దగ్గరుండే సైన్యంలో ఒక అక్షౌహిణి సైన్యాన్ని (21,870 ఏనుగులు, 21,870 రధాలు, 65,610 అశ్వదళం/గుర్రాలు, అంద్ 1,09,350 సైనికులు) తీసుకుని ప్రపంచమంతా చుట్టి రావడానికి బయలుదేరాడు. నదులు, పర్వతాలు, నగరాలు దాటి వెళుతున్న విశ్వామిత్రుడి సైన్యం ఒక మనోహరమైన ఋషి ఆశ్రమాన్ని చేరుకుంది. రకరకాల మొక్కలు, చెట్లు, పువ్వులు,, లతలు, తీగలు, ప్రదేశమంతా వ్యాపించి ఉన్న పశువుల మందలు కనిపించాయి, జింకలు పరిగెడుతున్నాయి, అనేక రకాల పక్షులు కనిపించాయి. ఆ ప్రదేశాన్ని సిద్ధులు, చారణులు సేవిస్తున్నారు. దేవ, దానవ, గంధర్వ, కిన్నెరుల రాక చేత ఆ ప్రాంతమంతా వెలిగిపోతోంది. బ్రహ్మవేత్తలందరూ ఆ ప్రాంతంలో యజ్ఞం చేస్తున్నారు. బ్రహ్మర్షులు, దేవర్షులు కనిపిస్తున్నారు. అక్కడున్న వారందరూ అగ్ని వలె తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. బ్రహ్మదెవునకు సమానమైన ఋషులు కూడా ఉన్నారు. అందులో కొందరు కేవలం నీటిని, కొందరు గాలిని, ఇంకొదరు ఎండిన ఆకులను, కొందరు పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవిస్తున్నారు. ఇంద్రియ నిగ్రహాన్ని పూర్తిగా ఆచరిస్తున్న వాలఖిల్యులు, వైఖానసులు కనిపించారు. వారు దోషరహితులై ఉన్నా యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, ధ్యానంలో నిమగ్నులయ్యారు. ఇంత మంది గొప్ప మహానుభావుల యొక్క తపోశక్తి చేత దివ్యంగా ప్రకాశిస్తున్న ఆ ఋష్యాశ్రమం వశిష్ట మహర్షిది. మహాబలవంతుడైన విశ్వామిత్రుడు భూలోకంలో బ్రహ్మలోకం వలే కనిపిస్తున్న ఈ వశిష్టాశ్రమాన్ని చూసి ముగ్దుడయ్యాడు.


గొప్ప తపస్వీ అయిన వశిష్టమహర్షిని చూసిన విశ్వామిత్రుడు ఆనందంతో పులకరించి, వశిష్ట మహర్షికి వినయంతో ప్రణమిల్లారు. అదే విధంగా వశిష్టమహర్షి కూడా విశ్వామిత్రునికి ఘనస్వాగతం పలికి గొప్ప స్థానం ఇచ్చి, ఆసనంలో కూర్చున్నాక, పండ్లు, కందమూలాలు సమర్పించారు. వాటిని స్వీకరించిన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమ బాగోగుల గురించి, ఋషుల గురించి, యజ్ఞాల గురించి, ఆశ్రమ వాతవరణం గురించి, శిష్యులు, విద్యార్ధుల గురించి అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్టమహర్షి విశ్వామిత్రుని బాగోగులను గురించి, రాజ్య పరిపాలన గురించి వివరంగా అడిగారు. ఓ రాజా! మీరు ధార్మికంగా పరిపాలిస్తున్నారని, మీ క్షత్రియ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని భావిస్తున్నాను అన్నారు.


తరువాయి భాగం రేపు.......

🙏🙏🙏

సేకరణ

**హిందూ ధర్మం - 20**

 **దశిక రాము**




క్షమా గుణం మీద రామాయణం బాలకాండ 32-33 సర్గల్లో చక్కటి కధ ఒకటి వాల్మీకి మహర్షి అందించారు.


కుశనాభుడనే ఒక రాజుకు, ఘృతాచి అనబడే ఒక గంధర్వకాంత వలన 100 మంది మహసౌందర్యవతులైన కుమార్తెలు జన్మించారు. యవ్వనంలో ఉన్న ఆడపిల్లలు ఒకసారి దగ్గరలో ఉన్న ఉద్యానవనానికి వెళ్ళి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆకాశం నుంచి తారలు దిగివచ్చాయా అన్నట్టుగా ఉన్నది వారి అందం అని వర్ణించారు వాల్మీకి మహర్షి. వారు ప్రపంచంలోనే మహసౌందర్యవతులు. ఆ సమయంలో వారి ముందు వాయుదేవుడు ప్రత్యక్షమై మీరు చాలా అందంగా ఉన్నారు, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, నన్ను పెళ్ళి చేసుకుంటే మీకు ఈ మానవ శరీరాలు పోయి, దేవతలవుతారు అధికకాలం, మానవులకు యవ్వనం కొంతకాలమే ఉంటుంది, కానీ నన్ను వివాహం చేసుకుంటే మీ యవ్వనానికి, అందానికి ఇక మరణం ఉండదు అంటాడు.


వాయుదేవుని మాటలు విన్న ఆ కాంతలందరూ ఒక్కసారి నవ్వి 'నీవు సకల ప్రాణకోటికి జీవనాధారమైనవాడివి, మాకు నీ యొక్క గొప్పతనం తెలుసు, అయినా నీవు మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నావు. మేము కుశనాభుడి కుమార్తెలము, ఓ దేవోత్తమా! మేము తల్చుకుంటే నిన్ను, నీ వాయుపదవి నుంచి తప్పించగలము, అయినా మా తపశ్శక్తిని రక్షించుకోవడం కోసం మమ్మల్ని మేము నిగ్రహించుకుంటున్నాము. ఓ మదాంధుడా! తగిన సమయం వచ్చినప్పుడు మేము స్వతంత్రంగా, మా తండ్రి అనుమతితో నచ్చిన వరుడిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకుంటాము. మా నాన్నగారు మాకు దైవంతో సమానం, వారు మమ్మల్ని ఎవరి చేతిలో పెడితే, వారితోనే జీవితం గడుపుతాము' అన్నారు.


ఈ మాటలు విన్న వాయుదేవుడు, కోపంతో వారి శరీరాల్లోకి ప్రవేశించి, వారి సౌందర్యాన్ని నాశనం చేశాడు, వారిని అందవిహీనంగా, వికలాంగులుగా మార్చేశాడు.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA

ఋణానుబంధ రూపేణ


*సందేహం;- "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః" ఈ సూక్తి ఏ సందర్భములోనిది?*




*సమాధానం;- ఈ ప్రసిద్ధ సూక్తి శ్రీ భాగవత పురాణంలోని చిత్రకేతు ఉపాఖ్యానంలోనిది.*


శూరసేన దేశానికి రాజైన చిత్రకేతుడికి ఎన్ని వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు. అంగీరస మహాముని రాజు చేత పుత్రకామేష్టి యాగం చేయించి యజ్ఞ ప్రసాదం పట్టపురాణికి ఇచ్చాడు. ఆమెకు కడుపు పండి పుత్రుడు కలిగాడు. చిత్రకేతుడు ఆ పుత్రుడి మోహంలోపడి, సర్వం మరిచాడు. అయితే తల్లి అయిన పట్టపురాణిని మాత్రం మిక్కిలి ఆదరంతో చూచేవాడు. ఇతర ఆయన రాణులకు ఇది నచ్చక, వారు బాలునికి విషం పెట్టి చంపేశారు. 


మరణించిన బాలుడి కోసం రాజు, రాణి విలపిస్తూండగా అంగీరసుడు నారదునితో వచ్చి రాజును ఓదారుస్తూ ఇట్లా అన్నాడు. "రాజా! *ఋణానుబంధ రూపేణా పశు, పత్ని సుతాలయాః* పశువులు, పత్నులు, కుమారులు, గృహాలు మొదలైనవి మానవులు చేసుకున్న ఋణాలనుబట్టి వస్తూ, పోతూ ఉంటాయి కదా! ఈ ప్రపంచం స్వప్నం లాంటిది. కల నిజమవుతుందా? కర్మవశాన జీవులు పుడుతూ, గిడుతూ ఉంటారు. ఎవరికి ఎవరు ఏమవుతారు? ఈ మోహ వికారాన్ని వదిలి, శ్రీహరిని ధ్యానించు" అని చెప్పాడు.


అపుడు నారదుడు "ఓ రాజా! నీకూ వీనికి బంధుత్వం ఏమిటో చూడు" అని బాలుడి దేహాన్ని జూచి "ఓ జీవా! నీ తల్లిదండ్రులు నీకై దుఃఖిస్తున్నారు. నీవు తిరిగి ఈ దేహంలో ప్రవేశించి, వీరికి సంతోషం కలిగించు" అన్నాడు.


ఆ బాలుడు ఇలా అన్నాడు "కర్మ బద్దుడినై అనేక జన్మలెత్తుతున్న నాకు వీరు ఏ జన్మలో తల్లిదండ్రులు? ఒక్కొక్క జన్మలో వేరు వేరు తల్లిదండ్రులు, బంధువులు నాకు ఏర్పడుతున్నారు. మరో జన్మ, మరో తల్లి, తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నారు, వస్తా" అనుకుంటూ వెళ్ళిపోయాడు.


అపుడు చిత్రకేతుడు మోహం విడిచి బాలుని దేహానికి యమునా నదిలో ఉత్తర క్రియలు చేసి, నారదునిచే నారాయణ మంత్రం ఉపదేశం పొంది కృతకృత్యుడయ్యాడు.


*శుభంభూయాత్*

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *వందేమాతరం*


పద్యం: 1921 (౧౯౨౧)*


*10.1-908-*


*క. వారి బరు వయ్యె మందల*

*వారికి; నిదె పరులు లేరు వారింపంగా;* 

*వారిద పటల భయంబును*

*వారిరుహదళాక్ష! నేడు వారింపఁగదే. "* 🌺



*_భావము: "ఓ పద్మదళాక్షా! కృష్ణా! ఈ జల ధారల (వరద ) తాకిడిని భరించలేకపోతున్నాము. ఈ దట్టమైన మేఘ సముదాయముల వలన కలిగే దారుణ పరిణామములనే ఆపద నుండి మన పల్లె ప్రజలను తప్పించ గల వారెవ్వరూ లేరు. నీవే మాకు రక్ష."_* 🙏



*_Meaning: "O Lotus-eyed Krishna! We are not able to stand the fury of this hailstorm and the resultant flooding. Except you, there is no one else to help us get over (overcome) the dreadful and distressing effect of this calamity. You are our sole saviour."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

శివానందలహరి 18 _ వ శ్లోకం

 దశిక రాము



" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:

ఈశ్వరుడొక్కడే మోక్ష ఫలములను ఈయగలవాడు. అందువల్లనే తాము 

మంచి పదవులలో ఉండికూడా ,మోక్షపదవిని కోరి , విష్ణువూమొదలైన 

దేవతలు తిరిగి తిరిగీ ఈశ్వరునే సేవిస్తున్నారు. అందువల్లనే శంకరులు

మోక్షాన్ని చ్చే పరమ శివుని నుండియే ,తన హృదయ గ్రంథి ఛేదనాన్ని 

కోరుతున్నారు.


        శ్లో " " త్వమేకో లోకానాం _ పరమ ఫలదో దివ్య పదవీం

                   వహంత స్త్వన్మూలాం _ పునరపి భజంతే హరిముఖాః

                   కియద్వా దాక్షిణ్యం తవ శివ ! మదాశా చ కియతీ

                   కదా వా మద్రక్షాం _ వహసి కరుణా పూరిత దృశా " !!


పదవిభాగం :

త్వం _ ఏకః _ లోకానామ్ _ పరమఫలదః _ దివ్యపదవీమ్ _ వహంతః

త్వన్మూలామ్ _ పునః _ అపి _ భజంతే _ హరిముఖాః _ కియత్ _ వా _ 

దాక్షిణ్యమ్ _ తవ _ శివ _ మదాశా _ చ _ కియతీ _ కదా _ వా _ మద్రక్షామ్ వహసి _ కరుణాపూరితదృశా..


తాత్పర్యం :

శంకరా ! ఓ మహదేవా ! ముల్లోకములకునూ, ఉత్కృష్టఫలమైన మోక్ష 

ఫలమును ఇచ్చేవాడవు నీవొక్కడవే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన

వారు , నీ దయ చేతనే విష్ణుత్వము, బ్రహ్మ త్వము, ఇంద్రత్వము మొదలైన

పదవులను పొందినవారైనా, విష్ణు, బ్రహ్మేద్రాదులు అంతకంటెనూ ఉన్నత మైన మోక్షఫలాన్ని పొందడం కోసం , మఱలా,మఱలా నిన్ను సేవిస్తూ ఉన్నారు. ఆహా ! భక్తుల మీద నీకు ఎంత దయయో ! నా ఆశ ఎంత అని చెప్పను ? శివా ! సంపూర్ణ కటాక్షముతో అహంభావమును పోగొట్టి నన్ను రక్షింౘుము.


వివరణ :

నేను పరమ ఫలాన్ని _ అనగా నీ సాయుజ్యాన్ని, సాలోక్యాన్ని, 

సామీప్యాన్ని, సారూప్యాన్ని కోరుతున్నాను. దానిని నాకు అనుగ్రహింౘ

గలవాడవు నీవొక్కడవే. కాబట్టి నేను నిన్ను తప్ప ఇంకొకరిని ఆశ్రయింౘ

లేను. నేను విష్ణువు మొదలైన దేవతలను ఆశ్రయిస్తే ,ఫలం ఏముంటుంది ?

ఏమంటే వారే నిన్ను సేవిస్తున్నారు కదా ! నేను కూడా విష్ణుమూర్తి ,బ్రహ్మ,

ఇంద్రుడు మొదలయిన దేవతల మార్గాన్నే అనుసరించి , ఈశ్వరుడైన 

నిన్నే సేవిస్తే , నీ సాయుజ్య రూపమైన ఎప్పటికో అప్పటికి తప్పక నాకు 

లభిస్తుంది కదా ! 


ఈశ్వరా ! నారక్షణను అనగా నా హృదయగ్రంథి ఛేదనను ఎప్ప్పుడు చేస్తావో, 

ఎప్పుడు నాకు నీ పాదసేవా భాగ్యాన్ని కల్పించి రక్షిస్తావో అది నీ ఇష్టము.


సకామ భక్తి స్వర్గాది ఫలములనిస్తుంది. అకామ భక్తి జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. భుక్తిని కానీ ,ముక్తిని కానీ కోరుకొనకుండా , కేవలమూ భగవత్పాద సేవను మాత్రమే కోరుకోవడమన్నది మహత్తరమైన విషయము. అలా కోరుకొనే భక్తుడికి భగవంతుడు తనను తానే ఇౘ్చుకొంటాడు.

🙏🙏🙏 

హిందూ ధర్మం - 19

 **దశిక రాము**


హిందూ ధర్మం - 19


క్షమించమన్నారు కదా అనీ, అన్ని వేళలా ఇది వర్తించదు. దేశం విషయంలోనూ, ధర్మం విషయంలోనూ మితిమీరిన క్షమా గుణం పనికిరాదు. మాతృదేశంపై ఆక్రమణకు, యుద్ధానికి శత్రుదేశం పాల్పడినప్పుడు, స్వదేశరక్షణ కోసం ఎదుటివాడితో పోరాటం చేయాలి. అక్కడ క్షమించకూడదు, గట్టి సమాధానం చెప్పాలి, తగిన గుణపాఠం నేర్పాలి. అదే ధర్మం.అట్లాగే ధర్మానికి హానీ ఏర్పడినప్పుడు, ధర్మం మీద దాడి జరుగుతునప్పుడూ మౌనం వహించకూడదు, క్షమించకూడదు.


అదే మహాభారతంలో కనిపిస్తుంది. అంతా తన బంధువులేననీ, తనవారిపై పోరాటం చేయడం కంటే రాజ్యాన్ని విడిచిపెట్టడం మేలు అనుకున్న అర్జునుడికి శ్రీ కృష్ణపరమాత్మ గీత భోధించాడు. ధర్మానికి హానీ ఏర్పడప్పుడు, పిరికివాడిలా పారిపోవడం కాదు, నిజమైన క్షత్రియుడులా యుద్ధం చేసి, ధర్మాన్ని పునఃప్రతిష్టించమని చెప్పాడు, గీతను భోధించి అర్జునుడిని మానసికంగా బలవంతుడిని చేసి, యుద్ధం చేయించి, ధర్మరాజుకు రాజ్యం అప్పగించాడు. ధర్మానికి హాని ఏర్పడుతందంటే, బంధుత్వాలు, క్షమాగుణాలు అన్నీ విడిచిపెట్టాలని, ధర్మాన్ని, దేశాన్ని కాపాడడమే ప్రధమ కర్తవ్యం అని తెలియజేశాడు.


వందలమందిని దారుణంగా హతమార్చిన ముష్కరుడిని గట్టిగా దండించడమే రాజు యొక్క ధర్మం. అంతేకానీ, వాడిని క్రూరంగా దండిస్తే, మనకూ వాడికి తేడా ఏముంటుందండీ? వాడిని క్షమించి, విడిచిపెట్టాలి అంటారు కొందరు. అక్కడ క్షమాగుణం చూపవలసిన అవసరమే లేదంటుంది ధర్మం.


తరువాయి భాగం రేపు.......

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


105 - 0అరణ్యపర్వం.


యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు, తన మేధస్సు మేరకు సమాధానాలు చెబుతున్నాడు, తన తమ్ములప్రాణాలు రక్షించేందుకు. 


నాలుగవ ప్రశ్న : భూమిపై నుండి లోపలకు వెళ్లి వృద్ధి చెందేవానిలో శ్రేష్టమైనది ఏది ? 

                        భూమిలో చేరి చెట్టుగా వృద్ధి చెందే విత్తనం అతి శ్రేష్టమైనది.

5 . భూమికంటె గొప్పదైనదీ, ఆకాశంకంటే యెత్తైనదీ, గాలికంటె వేగం కలదీ, గడ్డి కంటే అల్పమైనది ఏవి ?

భూమికంటె గొప్పదైనది, తల్లి. ఆకాశంకంటే ఉన్నతమైనవాడు తండ్రి. గాలికంటె వేగం కలది మనస్సు. గడ్డికంటే అల్పమైనది కష్టాలకు దుఃఖించడం.


6 . కనులు మూయకుండా నిద్రించే జీవి ఏది ? పుట్టిన తరువాత చలనం లేనిది ఏది ? హృదయం లేనిది ఏది ? తన వేగంతోనే తాను వృద్ధి చెందేది ఏది ? 

కన్నుమూయకుండా నిద్రించేది చేప. పుట్టినా కదలనిది గుడ్డు. హృదయం లేనిది రాయి. తన వేగంతో తానే వృద్ధి చెందేది నదీప్రవాహం.

7 . ప్రయాణంలో మిత్రుడెవరు ? ఇంటిలో వున్నప్పుడు స్నేహితుడెవరు ? రోగికి మిత్రుడెవరు ? చనిపోయే వానికి ఆప్తుడు ఎవరు ? 

యాత్రికుల సమూహమే, యాత్రికునికి నేస్తాలు. ఇంట్లోవున్నప్పుడు భార్యయే నిజమైన మిత్రుడు. రోగికి వైద్యుడు స్నేహితుడు. చనిపోయేవానికి, తాను చేసే దానాలే మిత్రులు.  

8 . సర్వజీవులకు అతిధి ఎవరు ? అందరికీ అగ్నిదేవుడు అతిధి.

9 . ఒంటరిగా తిరిగేవాడు ఎవరు ? తిరిగితిరిగి పుట్టేది ఏది ? మంచుకు వైద్యం ఏమిటి? అన్నిటికీ ఆధారమైనది ఏది ?

సూర్యభగవానుడు ఒంటరిగా సంచరిస్తాడు. మరల మరల పుట్టేవాడు చంద్రుడు. అగ్నిదేవుడు మంచుకు విరుగుడు. భూమి అన్నిటికీ ఆధారం. 

10 . అన్ని కీర్తి కారకములలో శ్రేష్టమైనది ఏది ? దానగుణం.  

11 . దైవమిచ్చిన స్నేహితుడు ఎవరు ? భార్య.

12 . శ్రేష్టమైన సంపద ఏది ? విద్య.

13 . లాభాలలో గొప్పది ఏది ? ఆరోగ్యం.  

14 . సుఖాలలో ఉన్నతమైనది ? సంతృప్తి. 

15 . ఉత్తమమైన ధర్మం ? అన్నిప్రాణుల యెడ దయ.

16 . దేనిని త్యాగం చేస్తే మనిషి దుఃఖానికి దూరంగా వుంటాడు ? 

        క్రోధాన్ని జయించినవాడు. 

17 . సుఖంగా వుండాలంటే దేనిని వదలాలి ? లోభాన్ని. 

18 . ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఏమిటి ? దరిద్రుడు మృతుడితో సమానం.

19 . జయించలేని శత్రువు ఎవరు ? నయము కాని వ్యాధి ఏది ? సాధువు అని ఎవరిని అంటారు ? ఎట్టివాడు సాధువుగా పరిగణింపబడదు ? 

జయించలేని శత్రువు క్రోధం. లోభత్వం నయంకాని వ్యాధి . అందరికీ మేలు చేసే వాడు సాధువు. అందరినీ హింసించేవాడు క్రూరుడు. 

20 . అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి ? 

ప్రతిరోజూ ప్రాణులు ఎందరో చనిపోతూ వున్నారు. అయినా మిగిలినవారు భూమిపై శాశ్వతం అనే భావంతో మసలుతూ వుంటారు. ఇది యెంతో ఆశ్చర్యకరమైన విషయం.

21 . వార్తలకన్నిటిలోనూ విశేషమైనది ఏమిటి ?

       కోరికలతో నిండిన పెద్దపాత్రని, పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు మండిస్తూ ఉంటే, నెలలూ ఋతువులూ అనే గరిటెతో, పాత్రలో వున్న కోరికలను కలియబెడుతూ, కలిపురుషుడు జీవులను వండుతున్నాడు.


ఈ విధంగా ధర్మరాజు, యక్షునికి సంతృప్తి కలిగేటట్లు సమాధానాలు ఇవ్వడంతో, ' నలుగురు తమ్ముళ్లలో ఒకరిని బ్రతికిస్తాను, ధర్మజా ! కోరుకో యెవరు కావాలో ! ' అని యక్షుడు చెప్పాడు. దానికి ధర్మరాజు తడుముకోకుండా, ' మహానుభావా ! అదుగో, నల్లని రంగుతో వున్న, పొడుగాటి బలిష్ఠుడైన నా తమ్ముడు నకులుడిని పునరుజ్జీవితుడిని చేసి నన్ను సంతోషపెట్టు. ' అని అడిగాడు.  


యక్షుడు అమితాశ్చర్యం పొందాడు, ధర్మరాజు కోరికకు. ' నీకు ఇష్టుడైన భీముని, పరాక్రమవంతుడైన అర్జునుని కాదని, నకులుని యెందుకు కోరుకున్నావు చెప్పు ' అని ధర్మరాజును కుతూహలంగా అడిగాడు.


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 తృతీయ స్కంధం -41


చంద్రసూర్యపితృ మార్గంబు 


సంసారానికి కట్టుబడిన గృహస్థులు ధర్మార్థకామాలపై ప్రీతి కలిగి వాటితోనే సంతుష్టులై వాటిని సాంధించడంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వేదాలలో నిర్ణయింపబడిన భాగవత ధర్మాలకూ భగవద్భక్తికీ విముఖులై ఉంటారు. దేవగణాలను నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. పితృకార్యాలను భక్తితో చేస్తూ సదాచార సంపన్నులై ఉంటారు. కానీ ఇట్లా దేవతలకూ పితరులకూ సంబంధించిన సత్కర్మలను ఆచరించడంలోనే నేర్పరులై, కోర్కెలు నిండిన చిత్తం గలవారై ఉండి మోక్షాన్ని అందుకోలేరు. వారు ధూమ్రాది మార్గాలలో చంద్రలోకం చేరి అచ్చట సుఖాలు అనుభవించి పుణ్యం తరిగి నశింపగా మళ్ళీ జన్మ ఎత్తడం కోసం భూలోకానికి వస్తారు. అంతేకాక...అత్యంత నిర్మలమైన ఆదిశేషుని పానుపుమీద హరి యోగనిద్రలో మునిగి ఉన్న సమయంలో సమస్త లోకాలూ ప్రళయాన్ని పొందుతాయి. అటువంటి సర్వేశ్వరుణ్ణి బుద్ధిమంతులైనవారు (ధ్యానిస్తారు) ఆ బుద్ధిమంతులు తమ భక్తిప్రపత్తులతో తమతమ ధర్మాలన్నింటినీ పద్మనాభునికే సమర్పించి, ప్రశాంత చిత్తులై, సర్వసంగ పరిత్యాగులై, పుండరీకాక్షుని ఆరాధన తప్ప ఇతర ధర్మాలనుండి దూరంగా ఉంటూ, నిత్యం ఆ దైత్యారినే ధ్యానిస్తూ (ఉంటారు).ఇంకా అహంకార, మమకారాలను వదిలి ప్రవర్తిస్తూ వెలుగు త్రోవల పయనించేవాడూ, గొప్ప చరిత్ర కలవాడూ, విశ్వమంతా నిండినవాడూ, పవిత్రమైన కీర్తి కలవాడూ, లోకాల సృష్టి స్థితి లయలకు కారణమైనవాడూ, నాశనం లేనివాడూ, జన్మరహితుడూ, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడూ, పురుషోత్తముడూ, క్రొత్త తామరలవంటి కన్నులు కలవాడూ అయిన సర్వేశ్వరునిపై బుద్ధి నిలిపి, పునర్జన్మ లేని మహనీయమైన మార్గంలో స్వచ్ఛమై ఆనందమయమై తేజస్సుతో వెలిగిపోయే దివ్యపదాన్ని పొంది సుఖించే ధీరులు పునర్జన్మలను పొందడానికి ఎన్నటికీ భూమిపైకి తిరిగిరారు. ఇంకా పరమేశ్వరుడనే దృష్టితో బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేవారు సత్యలోకంలో రెండు పరార్థాల కాలం తరువాత వచ్చే ప్రళయం వరకు పరుడైన చతుర్ముఖుని పరమాత్మ రూపంలో ధ్యానిస్తూ ఉంటారు. సర్వేశ్వరుడు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను, మనస్సును, పంచేంద్రియాలను, పంచతన్మాత్రలను, వాటితో కూడిన సమస్త ప్రకృతినీ, సకల లోకాలనూ తనలో లీనం చేసుకుంటాడు. అప్పుడు సత్యలోకంలో నివసించే ఆత్మస్వరూపులు బ్రహ్మతో కూడ పరమానంద స్వరూపుడూ, సర్వోత్కృష్టుడూ అయిన పురాణపురుషునిలో లీనమౌతారు. కాబట్టి అమ్మా! నీవు సకల ప్రాణుల హృదయ పద్మాలలో నివసించేవాడూ, మహానుభావుడూ, నిష్కలంకుడూ, నిరంజనుడూ, అద్వితీయుడూ అయిన పురుషోత్తముణ్ణి శరణుపొందు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.సమస్త చరాచర ప్రాణికోటికి అధీశ్వరుడు, పవిత్రాలైన వేదాల పుట్టుటకు కారణభూతుడు, సర్వశ్రేష్ఠుడు అయిన పరమేశ్వరుడు యోగీంద్రులు, సనకాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు భక్తియోగంతో తనను భజింపగా వారికి సగుణస్వరూపంతో దర్శనమిస్తాడు. అటువంటి సర్వేశ్వరుడు ఆయా సమయాలలో తన మహనీయ గుణగణాల కలయికచే అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని అంశలు పంచుకొని పుట్టిన ఋషులు, దేవతలు తమ కర్మఫలాన్ని అనుసరించి పౌరుషంతో ఐశ్వర్యం, పారమేష్ఠ్యం మొదలైన అధికారాలు చేపట్టి కొంతకాలం అనుభవించి, యథాస్థానానికి తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన మనస్సు కలవారై, ధర్మమందు శ్రద్ధ కలవారై, ధర్మానికి విరుద్ధం కాకుండునట్లుగా, నిత్యమూ తాము చేయదగిన ఆచారాలను నిర్వర్తిస్తూ, రజోగుణంతో నిండిన మనస్సు కలవారై...కామప్రవృత్తికి లోబడి ఇంద్రియాలను జయింపలేక పితృదేవతలను అనుదినం ఆరాధిస్తూ గృహాలలో పడి సంసార నిమగ్నులై జీవిస్తూ, హరిపరాఙ్ముఖులై, ధర్మార్థకామాలను మాత్రమే నమ్ముకొని వర్తిస్తారు. అటువంటి వారు త్రైవర్గిక పురుషులని పిలువబడతారు. శుభగుణవిశిష్టుడు, అద్వితీయ పరాక్రముడు అయిన త్రివిక్రముని భజిస్తూ ఆయన మహిమలనే మననం చేస్తూ ఆయన మధుర కథాసుధను తనివితీరా త్రాగడం ఉత్తమలక్షణం. అలాకాకుండా మరికొందరు ఊరబంది అవివేకంతో తీయతీయని నేతివంటకాలను కాలదన్ని మలభక్షణకై పరుగెత్తినట్లుగా చెడ్డకథలను వింటూ ఆనందిస్తూ ఉంటారు. ధూమమార్గాల గుండా వెళ్ళి, పితృలోకం చేరి సుఖించేవాళ్ళు తమ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ ఈ భూమిమీద తమ బిడ్డలకే బిడ్డలై జన్మిస్తారు. వశం తప్పిన మనస్సుతో మాతృగర్భంనుండి బయటపడింది మొదలుగా శ్మశాన భూమికి చేరే పర్యంతం ఆయా కర్మఫలాలను ఇక్కడే అనుభవిస్తాడు. కాబట్టి ఓ తల్లీ! నీవు...విను. సర్వశ్రేష్ఠుడు, పాపరహితుడు, అనంతుడు, అధీశ్వరుడు, పురుషోత్తముడు అయిన పరమేశ్వరుణ్ణి అన్నిరీతులా సద్బుద్ధితో సంతోషంగా సేవించు. దానివల్ల పునర్జన్మం లేని కైవల్యం నీకు లభిస్తుంది.” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. “పరమేశ్వరుడైన వాసుదేవుని యందు అభివ్యక్తమైన భక్తియోగం బ్రహ్మసాక్షాత్కారానికి సాధనాలైన జ్ఞానాన్నీ వైరాగ్యాన్నీ కలుగజేస్తుంది. అటువంటి భగవద్భక్తితో కూడిన చిత్తం ఇంద్రియ వ్యాపారాలలో సమంగా వర్తిస్తుంది. అటువంటి మనస్సు కలవానికి హెచ్చుతగ్గులు, ప్రియాప్రియములు, విషయ లాలస, గ్రహింప దగినవీ, తిరస్కరింప దగినవీ ఉండవు. సర్వత్ర సమదర్శన మేర్పడుతుంది. తనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తాను చూడగలుగుతాడు. జ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మ, పరమాత్ముడు, ఈశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఒకే రూపం కలవాడై ఉండికూడా కనబడే రూపాన్ని బట్టీ, చూచేవారినిబట్టీ, చూడటానికి ఉపయోగపడే సాధనాలనుబట్టీ వేరువేరు రూపాలలో గోచరిస్తాడు. ఇదే యోగి అయినవాడు సంపూర్ణ యోగంవల్ల పొందదగిన ఫలం. కావున విషయాలనుండి వెనుకకు మరలిన ఇంద్రియాలవల్ల జ్ఞాన స్వరూపమూ, హేయగుణ రహితమూ అయిన పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. ఆ పరబ్రహ్మమే మనస్సు యొక్క భ్రాంతి వలన శబ్దం స్పర్శం మొదలైన వాని ధర్మాలైన అర్థాల స్వరూపంతో గోచరిస్తున్నది. ఆ పరబ్రహ్మం అర్థస్వరూపంతో ఎట్లా కనిపిస్తుందని నీకు సందేహం కలుగవచ్చు. అహంకారం గుణరూపం ధరించి సత్త్వరజస్తమస్సులై మూడు విధాలుగానూ, భూతరూపం ధరించి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలనే అయిదు విధాలుగానూ, ఇంద్రియరూపం ధరించి పదకొండు విధాలుగానూ ఉంటుంది. ఈ విధంగా అహంకారమే నానావిధాలుగా భాసిస్తుంది. విరాట్పురుషుడు జీవస్వరూపుడు. జీవరూపమైన ఈ జగత్తు అనే గ్రుడ్డులో అతడు నిండి ఉంటాడు. ఈ పరమ రహస్యాన్ని శ్రద్ధా సహితమైన భక్తితోనూ, యోగాభ్యాసంతోనూ, నిశ్చల చిత్తం కలవాడై వైరాగ్యం పొందినవాడు దర్శిస్తాడు. అమ్మా! నీవు జ్ఞాన సంపన్నులైన పెద్దలు పూజింపదగిన చరిత్ర గలదానవు. కాబట్టి నీకు ఈ విషయమంతా వెల్లడించాను. సమస్త యోగసాధనలవల్ల పొందదగిన పరబ్రహ్మను నిర్గుణుడని జ్ఞానయోగులు పలుకుతున్నారు. నేను చెప్పిన భక్తియోగం ఆ పరమాత్మను సగుణుడుగా పేర్కొంటున్నది. వాస్తవానికి జ్ఞానయోగం భక్తియోగం రెండూ ఒక్కటే. ఇంద్రియాలు వేరువేరు రూపాలతో ఉంటాయి. అందువల్లనే ఒకే రూపంలో ఉండే వస్తువు అనేక విధాలుగా తోచినట్లు, ఒకే పరమాత్మ అనేక విధాలుగా గోచరిస్తున్నాడు. అమ్మా! నారాయణుడు సమస్త శాస్త్రాలను చదివినందువల్లను, అనుష్ఠానాలూ యజ్ఞాలూ తీర్థయాత్రలూ జపతపాలూ ఆచరించినందువల్లనూ కనిపించడు. వేదాలు అధ్యయనం చేయడం వల్లనూ, యోగాభ్యాసాల వల్లనూ, దానాలూ వ్రతాలూ చేసినందువల్లనూ గోచరింపడు. చంచలమైన మనస్సును లోగొని చెలరేగిన ఇంద్రియాలను జయించి, కర్మ లన్నింటినీ భగవదర్పితం చేసి, ఆత్మస్వరూపాన్ని గుర్తించి, తరిగిపోని వైరాగ్యంతో ఫలితాలను అపేక్షించకుండా ప్రవర్తించే పురుషుడు మాత్రమే దుర్గుణాలను దూరం చేసుకొని పాపాలను పటాపంచలు గావించి అనంత కళ్యాణ గుణ విశిష్టుడు పరమాత్మ అయిన ఆ హరిని చేరగలుగుతాడు.అందువల్ల నీకు నాలుగు విధాలైన భక్తి మార్గాలను విశదంగా తెలియజెప్పాను. అంతేకాక స్వేచ్ఛారూపమైన నా సంకల్పం ప్రాణులందు జనన మరణ రూపాలతో ఉంటుంది. అజ్ఞానంతో ఆచరించే కర్మల మూలంగా కలిగే జీవుని ప్రవర్తనలు అనేక విధాలుగా ఉంటాయి. జీవాత్మ అటువంటి అకర్మలు ఆచరిస్తూ అత్మస్వరూపం ఇటువంటిది అని తెలియని స్థితిలో ఉంటాడు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “ఇటువంటి అతిరహస్యమైన సాంఖ్యయోగ పద్ధతి దుష్టునకు, నీతి హీనునకు, మూర్ఖునకు, దురాచారునకు, డంబాలు కొట్టేవానికి, ఇంద్రియ సుఖాలకు లోబడిన వానికి, పిల్లలూ ఇల్లాలూ ఇల్లూ మొదలైన వానిపై ఆసక్తి కలవానికి, భగవంతునిపై భక్తి లేనివానికి, విష్ణు భక్తులను ద్వేషించే వానికి ఉపదేశింపకూడదు. శ్రద్ధాసక్తుడు, భక్తుడు, వినయసంపన్నుడు, ద్వేషరహితుడు, సర్వప్రాణులను మైత్రీభావంతో చూచేవాడు, విజ్ఞాన విషయాలను వినాలనే అసక్తి కలవాడు, ప్రాపంచిక విషయాలపై విరక్తుడు, శాంతచిత్తుడు, మాత్సర్యం లేనివాడు, స్వచ్ఛమైన మనస్సు కలవాడు, భక్తులందు ప్రేమ కలవాడు, పరస్త్రీలను మంచి భావంతో చూచేవాడు, చెడు కోరికలు లేనివాడు అయిన వానికి మాత్రమే ఈ సాంఖ్యయోగం ఉపదేశింప తగినది. అటువంటివాడే ఇందుకు అర్హుడైన అధికారి. ఈ ఉపాఖ్యానాన్ని ఏ పురుషుడైనా, పతివ్రత అయిన ఏ స్త్రీ అయినా శ్రద్ధాభక్తులతో నాపై మనస్సు నిలిపి వినినా, చదివినా అటువంటి పుణ్యాత్ములు నా దివ్య స్వరూపాన్ని పొందుతారు” అని కపిలుడు దేవహూతితో చెప్పాడని చెప్పి మైత్రేయుడు విదురుణ్ణి చూచి ఇంకా ఇలా అన్నాడు. “ఈ విధంగా కర్దమమహర్షి అర్ధాంగి అయిన దేవహూతి కపిలుని ఉపదేశం విని, మోహం తొలగిపోగా అతనికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, పరబ్రహ్మకు సంబంధించిన తాత్త్వికమైన సాంఖ్య జ్ఞానంతో కపిలుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించి ఇలా అన్నది. ఇంద్రియాలతో, ఇంద్రియార్థాలతో, మనస్సుతో, పంచభూతాలతో నిండి సమస్త జగత్తుకు బీజభూతమై సత్త్వరజస్తమోగుణ ప్రవాహానికి మూలకారణమై నారాయణుడనే నామంతో నీ దివ్యమంగళ విగ్రహం తేజరిల్లుతూ ఉంటుంది. అటువంటి నీ కళ్యాణమూర్తిని నీ నాభికమలం నుండి జన్మించిన చతుర్ముఖుడే సాక్షాత్తుగా దర్శించలేక ఎలాగో తన మనస్సులో కనుగొన గలిగాడు. అలా చూచి నీ అనుగ్రహంవల్ల అనేక శక్తులను తనలో వ్యక్తీకరించుకొని వేలకొలది శక్తులతో కూడినవాడై ప్రవాహరూపమైన ఈ విశ్వాన్ని సృజింప గల్గుతున్నాడు. సృష్టి సంబంధమైన సర్వకార్యాలను నిర్వహింప గలుగుతున్నాడు. అప్పుడు...మహాప్రళయ సమయంలో సమస్త భువన సముదాయాన్ని నీ ఉదరంలో పదిలంగా దాచుకొని మహాసాగర మధ్యంలో మఱ్ఱి ఆకు పాన్పుమీద మాయాశిశువుగా ఒంటరిగా శయనించి ఉంటావు. మహానుభావా! ఆ విధంగా వటపత్రశాయివైన నీవు లీలగా నీ కాలి బొటనవ్రేలిని నోటిలో నుంచుకొని అందలి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. అటువంటి నీవు నా పూర్వపుణ్య విశేషంవల్ల ఇప్పుడు నా కడుపున పుట్టావు. అటువంటి పరమాత్మ స్వరూపుడవైన నీవు...అవతారాలమీద ముచ్చటపడి వరుసగా రఘురాముడుగా, కృష్ణుడుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారాలు ధరించి దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మంపట్ల ప్రవృత్తమైన చిత్తం కల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించటం కోసం వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు, అనంత కళ్యాణగుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వాన్ని అభివర్ణించడం చతుర్ముఖునకు, చతుర్వేదాలకు కూడా సాధ్యం కాదంటే నేనెంతదాన్ని? వెయ్యి మాటలెందుకు? నిన్ను తెలుసుకొని సన్నుతించటం నాకు శక్యం కాని పని.

అంతే కాకుండా...ఓ జ్ఞానస్వరూపా! మంగళకరమైన నీ నామాన్ని స్మరించినా, కీర్తించినా దరిద్రులు శ్రీమంతులౌతారు. అటువంటివారు అగ్నిష్ఠోమం మొదలైన యజ్ఞాలు చేసినవారికంటె 

పరిశుద్ధులవుతారు. అంతే కాకుండా...లోకాలన్నిటిలో విచిత్రమైన విషయ మేమిటంటే భక్తిపూర్వకంగా నీ నామాన్ని జిహ్వాగ్రాన నిలుపుకొని జపించినట్లయితే వాడు కుక్కమాంసం తినేవాడైనా వానితో బ్రాహ్మణుడు కూడా సాటి కాలేడు. ఈ పరమార్థాన్ని చక్కగా తెలిసికొన్న సజ్జనులు సర్వదా లోకపావనమైన నీ మధుర కథాసుధారసాన్ని తనివితీరా మనసారా త్రాగుతారు. అటువంటి వారికి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా వేదాలన్నీ గొంతెత్తి చాటుతున్నాయి. అందువల్ల అటువంటి మహనీయులే మాననీయులు, ఉత్తములు, సాధుసత్తములు. అందువల్ల పరబ్రహ్మవూ, పరమపురుషుడవూ, వెలుపలా లోపలా సంభావింప తగినవాడవూ, సకల జీవుల పాపాలను పటాపంచలు చేసేవాడవూ, స్వయంప్రకాశుడవూ, వేదమూర్తివీ, మహావిష్ణు స్వరూపుడవూ అయిన నీకు నమస్కరిస్తున్నాను.” అని దేవహూతి స్తుతించగా పురుషోత్తముడూ, మాతృప్రేమతో నిండినవాడూ అయిన కపిలుడు కరుణరసార్ద్రహృదయుడై తల్లితో ఇలా అన్నాడు. కమలదళాల వంటి కన్నులు గల తల్లీ! సుఖస్వరూపమూ, మోక్షప్రదమూ అయిన ఈ యోగమార్గాన్ని నీకు తేటతెల్లంగా వెల్లడించాను. దీనిని నీవు దృఢమైన భక్తితో అనుష్ఠించు. 

దీనిని ఏకాగ్రచిత్తంతో ఏమరుపాటు లేకుండా ఆచరించేవారికి జీవన్ముక్తి లభిస్తుంది. ఈ మార్గాన్ని ఇష్టపడని వారికి మృత్యుభీతి కలుగుతుంది. సుఖం దూరమవుతుంది.”అని ఈ విధంగా కపిలుడు దేవహూతికి మనస్సు సంతోషించేటట్లు ఆత్మతత్త్వాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడని మైత్రేయుడు విదురునికి తెలియజేశాడు.

🙏🙏🙏

సేకరణ

*సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


తొమ్మిది, పది శ్లోకాల ఉపోద్ఘాతం - మొదటి భాగం


(షట్చక్రముల ప్రస్తావన ఉన్న శ్లోకాలు రాబోతున్నందున దానికి ఉపోద్ఘాతంగా మహాస్వామి వారి ఉపదేశమిది)


ఈ రోజుల్లో చాలామంది కుండలినీ యోగ దీక్షనిస్తామని శిక్షణాశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పుచ్చుకొనేవారు ఎగబడుతున్నారు. తమకు కుండలినీ ప్రచోదన కలిగిందనీ, తాము మహాయోగులమనీ తమకుతామే ప్రచారం చేసుకొనేవారూ ఉన్నారు. ఉదయ సూర్యుని అరుణ ప్రకాశంతో మిలమిలలాడిపోయే ఆ తల్లి వీరందరికీ నిజంగా సంపూర్ణంగా ఆవిష్కృతమయి ఉంటే మాటలకందని మహదానంద స్థితిలో ఉండిపోయేవారు. మనందరిలోనూ శివశక్తి నాలుగింట మూడువంతులు నిద్రాణమై ఉంటే ఈ యోగులమని చెప్పుకొనే వారి విషయంలో మనకంటే కొంచెం మేరకు జాగృతమై ఉండి ఉండవచ్చు. కుండలిని కదిలితేనే నడినెత్తిన ప్రకంపనలు, భ్రూమధ్యంలో ఏకాగ్రత వంటివి సిద్ధిస్తాయి. అయితే దానికి కుండలిని తన గమ్యం చేరిందని అర్థంకాదు. తీవ్ర యోగాచరణ వలన కుండలిని తన స్వస్థానం నుండి స్వల్పంగా పైకి లేచి మళ్ళీ యథాస్థానం లోనికి ప్రవేశిస్తుంది.


ప్రతి అణువులోనూ అనంతమయిన శక్తి నిక్షిప్తమయి ఉండి తగినె పద్ధతిలో విస్ఫోటనం జరిపినపుడు అనంతమైన శక్తిని విడుదల చేస్తుందనీ, దానిని సక్రమమైన పద్దతిలో ఉపయోగించి మానవ కల్యాణానికి ఉపయోగించుకోవచ్చనీ, దారిమళ్ళిస్తే ప్రపంచ నాశనానికి కారణమవుతుందనీ అణుశస్త్రం చెబుతోంది కదా! అలాగే ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన పరబ్రహ్మ శక్తి కుండలినీ రూపంగా నిక్షిప్తమైయున్నది. మనవంటి సాధారణ మానవులలో ఆ శక్తి నిద్రాణమై ఉంటుంది. మనం కష్టతమమైన యోగసాధన చేస్తే – ఆ శక్తి కొన్ని చక్రముల ద్వారా పైకి వెళుతూ చివరకు పరాశక్తిగా జాగృతమవుతుంది. అటువంటి జాగృతమయిన పరాశక్తి పరబ్రహ్మలో లీనమయిపోతుంది. కుండలినీ శక్తి ఒక్కొక్క చక్రమును దాటినపుడు సాధకునికి కొన్ని సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధుల వ్యామోహంలో తనకు అత్యంతికమైన ఫలం సిద్ధించిందనే అపోహతో సాధన ఆపివేయరాదు. ఇదీ కుండలినీ యోగసారం. మనం ఇంతమాత్రం ఎఱిగి ఉంటే చాలు. అది కూడా ఎందుకంటే – ఈ దేశంలో పుట్టిన తరువాత మన పరంపరాగతమైన మహచ్ఛాస్త్రములు గురించి ప్రాధమికమైన అవగాహన ఉండాలనే! కుండలిని సరియైన పథం నుండి మరలినపుడు ఫలితాలు ప్రమాద భరితంగా ఉంటాయి. మతిస్తిమితం కూడా తప్పవచ్చు. సాధకులు ఈ విషయం అత్యంత జాగరూకతతో గుర్తించాలి.


ఈ ప్రపంచంలో మాయ అనేకరకాలు. ఆ మాయ నుండి బయటపడడానికి అనేక పద్ధతులు. కుండలినీ యోగపు తుదిగమ్యం అన్నిరకములైన మాయలను అధిగమించి పరమాత్మలో లీనమవడమనేది నిస్సందేహమైన విషయం. అయితే ఆ త్రోవలో అంబిక విరాట్ శ్శక్తిని సందర్శించవచ్చు. సాధకునికి కూడా శక్తులు సిద్ధిస్తాయి. అయితే ఈ యోగంలో అంబిక ఎంతో మాయను మేళవించింది. సాధకుడు అత్యంత సులభంగా ఆ మాయలో పడిపోవచ్చు. ఆమె ఎందుకలా చేసిందో మనమెలా చెప్పగలం ? ఒక పంట ఊరికే నేలపై విత్తులు జల్లినంతనే మొలచి పంటకొస్తుంది. కొన్ని పంటలు సరియైన నేల, వాతావరణము వెతికి అటువంటి పరిస్థితులలోనే పండించాల్సి ఉంటుంది. ఎందుకంటే, అది అంబిక లీల. ఆమె కుండలినీ యోగాన్ని అత్యంత కష్టసాధ్యమైన యోగంగా నిర్దేశించింది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

**సౌందర్య లహరి**

 *దశిక రాము**

శ్లోకము - 9


(శ్రీ శంకర భగవత్పాద విరచితము)


శ్రీలలితాంబికాయైనమః


మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం

స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకార ముపరి,

మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం

సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి !!


ఓ భగవతీ ! నువ్వు మూలాధారంలో వున్న పృథివీ

తత్త్వాన్ని , మణిపూర చక్రం లోని అగ్ని తత్త్వాన్ని ,

అనాహత చక్రం లోని వాయు తత్త్వాన్ని , అంతకు

పైనవుండే విశుద్ద చక్రం లోని ఆకాశ తత్త్వాన్ని , కను

బొమలనడుమనుండే అజ్ఞా చక్రం లోని మనస్తత్త్వాన్ని

వీడి సుషుమ్నా మార్గాన్ని ఛేధించుకొని సహస్రార

కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి

రహస్యంగా క్రీడిస్తున్నావు.


ఓం గిరితనూభవాయైనమః, 

ఓం వీరభద్రప్రసువేనమః

ఓం విశ్వవ్యాపిణ్యేనమః.

🙏🙏🙏 

శ్రీమన్నారాయణీయం* 1-8-శ్లో.

 **దశిక రాము**


*

నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్ధితాన-

ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ।

ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే! త్వంక్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థవర్థివ్రజో౾యమ్||


భావం. 

హరీ! నీ రూపము జనులను అనుగ్రహించుటకు అవతరించిన పారిజాతవృక్షము (కల్పవృక్షము). వినమ్రులయి నిన్ను స్మరించిన వారి ఎదుట నీవే స్వయముగా నిలిచి వారి మనోభిష్టములను తీర్చెదవు. పరిపూర్ణమయిన గతిని (ముక్తిని) ప్రసాదించదవు. ఈ విధముగా అవధి లేని మహా ఫలములను అనుగ్రహించు పారిజాతవృక్షము నీ రూపము నందు ఉండగా నీ మహిమ తెలుసు కొనలేనివారు దేవలోకము నందలి పారిజాతవృక్షమును తమ కోరికలు తీర్చుటకు యాచించుచున్నారు.

(తెలుగుభాగవతం.ఆర్గ్).


వ్యాఖ్య. పురాణేతిహాసాల్లో పారిజాత చెట్టు.. దాని పుష్పాలకున్న విశిష్టత ఇంతంత కాదు. క్షీర సముద్ర మథనంలో అమృతంతో పాటు ఉద్భవించిన అద్భుతమైన వాటిలో అది కూడా ఒకటి. దానికోసం మహామహుల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. అదే పారిజాతం చెట్టు. దేవతల రాజయిన ఇంద్రుడు ఈ చెట్టును తీసుకువెళ్లి తన ఉద్యానవనంలో ఉంచుకున్నాడు.


తన తల్లి కుంతీ దేవి కోరిక మేరకు అర్జునుడు ఇంద్రుడి వద్ద నుండి పారిజాత చెట్టును భూమికి తెచ్చాడని మహాభారతం చెపుతుంది. ఆ పుష్పాలతో కుంతీదేవి శివుడికి పూజలు అర్పిస్తుంది. ఈ పుష్పాలతో పూజలు చేసినందువల్లే పాండవులకు కురుక్షేత్ర మహాయుద్ధంలో విజయం లభించిందిట..


అఃతటి పారిజాతం కన్నా స్వామివారి క్రృపే మిన్న అని భట్టతిరి ఎందుకు అంటున్నారో చూద్దాం.


పంచైతే దేవతరవ: మందార: పారిజాతక:!

సంతాన: కల్పవృక్షశ్చ పుంసివా హరి చందనమ్‌!! (అమరకోశం) 


మందారం, పారిజాతం, సంతాన వృక్షం, కల్ప వృక్షం, హరిచందన వృక్షం ఈ అయిదు దేవతా వృక్షాలుగా క్షీరసాగర మదనంలో ఆవిర్భవించాయి. ఇవన్నీ కోరిన వాటిని ప్రసాదించేవే. అన్నింటిలో విశేషమైనది కల్ప వృక్షం. 


ఈ కల్పవృక్షం కోరిన ప్రతి కోరికను వెంటనే తీరుస్తుంది. కానీ ఆ కల్పవృక్షం కోరికను తీర్చిన వాడు శ్రీమన్నారాయణుడు. కోరిన వారి కోర్కెలు తీర్చే శక్తిని తనకు ప్రసాదించమని కల్పవృక్షము ప్రార్థిస్తే దాని కోరిక పరమాత్మ తీర్చాడు. అందుకే కల్పవృక్షానికి కల్పవృక్షం పరమాత్మ. 


తనకు ఈ వరం ఇచ్చినందుకు స్వామికి సేవ చేసే భాగ్యం ప్రసాదించమని మరో కోరిక కోరింది కల్పవృక్షం. స్వామి ఆ కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకొని ఆ కోరికా తీర్చాడు.

నిజమైన కల్పవృక్షం తానే అని 


అందుకే తననే ఆశ్రయించి, సేవించమని, అన్నీ తానే ఇస్తానని కల్ప వృక్షం లోపల ఉండి కోరిన వారి కోరికలు తీరుస్తున్నది తానే కావున భక్తజన కల్ప వృక్షం తానేనని తక్కిన వారందరూ తన సేవకులు మరియు వాహనాలే అని కల్పవృక్ష వాహన ఉపదేశం. 


కల్పవృక్షం కోరితేనే ఇస్తుంది కానీ గర్భాలయంలో ఉన్న స్వామి భక్తులు తనను మాడవీథులకి రమ్మని కోరకుండానే తన దర్శనాన్ని ప్రసాదించి తరిపంచేస్తున్నారు. అందుకే కోరితేనే కోరికలు తీర్చే చెట్లను, పుట్టలను ఆశ్రయించరాదని శాసించడానికే కల్పవృక్ష వాహనాన్ని అధిష్టించి నాలుగు మాడవీధులలో ఊరేగుతున్నాడు మలయప్ప స్వామి. 


కల్పవృక్ష వాహనం పై విహరిస్తున్న స్వామిని దర్శించిన వారికి సకల కామనలు తీరుతాయి, కోరని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు స్వామి. (శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు - mprabha.news)

🙏🙏🙏

సేకరణ

మూకపంచశతి

 మూకపంచశతి🌹


🌹 ఆర్యాశతకము🌹


🌹18.

శ్లోకం


ధరణిమయీం తరణిమయీం


పవనమయీం గగన దహన హోతృమయీం౹


అమ్బుమయీమిన్దుమయీ

       అమ్బామనుకమ్పంఆదిమామీక్షే౹౹


      🌺భావం:  


భూమూర్తిగా ,సూర్యమూర్తిగా ,వాయు మూర్తిగా ,ఆకాశమూర్తిగా ,అగ్నిమూర్తిగా ,యజమానమూర్తిగా,జలమూర్తిగా ,చంద్రమూర్తిగా సకలసృష్టియందు భాసించుచున్న ఆ ఆది పరాశక్తి ని కంపానదీతీరమున కాంచీక్షేత్రమున తన్మయత్వముతో దర్శించుచున్నాను.



💮భూమి ,జలము ,అగ్ని ,వాయువు ,ఆకాశము ఈ పంచభూతములూ ,బుద్ధి అనగా సూర్యుడు,మనస్సుఅనగా సోముడు ,అహంకారముఅనగా యజమానతత్వము ,ఈ అష్టప్రకృతులు కలసి ఒక స్త్రీ రూపము ధరించి, సర్వసృష్టికీ కారణమయిన ఆ అమ్మలగన్నయమ్మ , ఆ కామాక్షీ దేవి కంపానదీతీరమున భక్తులకు దర్శనభాగ్యమును కలిగించుచున్నది.🙏

     

🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

అమ్మ సన్నిధిలో

 అమ్మ సన్నిధిలో అన్నీ శుభాలే!


         విజయాన్ని సొంతం చేసుకోవాలంటే ఆదిపరాశక్తి అనుగ్రహం కావాలి. సకల బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్న శక్తి ఆమె. స్రుష్టి, లయ, తిరోధాన, అనుగ్రహమనే పంచక్రుత్యాలను ఆవిడే నిర్వహిస్తుంది. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపాలలో ఆమె జగత్తును సంరక్చిస్తోంది. ఆమె ధరించిన అనేక రూపాల్లో సంహార శక్తికి ప్రతీక దుర్గ. శత్రవులు ఎవ్వరూ దరిచేరని అద్భుతమైన శక్తి ని దుర్గా అని పిలిచేరు. దుర్ఘమాసురుణ్ణి జయించి విజయాన్ని సాధించింది. ఆవిడ ఎందరో రాక్షసుల్ని వేర్వేరు సందర్భాల్లో సంహరించింది. విజయదశమి నేపథ్యంలో జరిగిన అసుర సంహారాన్ని మార్కండేయ పురాణం లోని చండీ సప్తశతి, దేవీభాగవతం ప్రధానంగా ప్రస్తావించాయి. దుర్మార్గులైన రాక్షసుల్ని వధించింది. అలాగే భక్తులకు ఎదురయ్యే కష్టనష్టాలను తీరుస్తుంది. ఆపన్నులెవరైనా, ఆపద ఎలాంటిదైనా ఆమె అక్కున జేర్ఛుకుంటుంది. రక్షించి సన్మార్గం చూపుతుంది.

🍁🍀🍁🍀🍁🍀🍁🍀

గాయత్రీ మంత్రం

 చాలామందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం    

🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺


🍁చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు.


🍁కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.


🍁నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. 


🍁అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.


గాయత్రీ మంత్రము అంటే…

➖➖➖➖➖➖➖➖➖

🙏“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,

భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”

ఇది మంత్రము. 


ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. 


అది ఎలాగంటే….....


🌷ఓం


🌷భూర్భువస్సువః


🌷తత్సవితుర్వరేణ్యం


🌷భర్గోదేవస్య ధీమహి


🌷ధియో యోనః ప్రచోదయాత్!!


ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.


🍁ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.


🍁గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. 


🍁వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.


👉1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.


👉2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.


👉3. పురాణ కధనం ప్రకారం 24మంది

మహా ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకునిధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.


👉4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.


👉5. 24 కేశవ నామాలు


👉6. 24 తత్వాలు :-


*ఐదు జ్ఞానేన్ద్రియాలు,

*5 కర్మేంద్రియాలు,

*పంచ తన్మాత్రలు,

*5 మహాద్భుతాలు,

*బుద్ధి, *ప్రకృతి, *అహంకారం, *మనస్సు


👉7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”


👉8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.


👉9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు.


👉10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.


👉11. మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. 


వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.


“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతాః పర దైవతం” అన్నారు పెద్దలు .


24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు.


సకల దేవతా స్వరూపం గాయత్రీ.

రామాయణ సారం గాయత్రీ .

కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. 

విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.

సకలకోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రీ

24 బీజాక్షర సంపుటి గాయత్రీ..


అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.!!

అమ్మవారికి పూజలు


 

దక్షిణా మూర్తి


 

పూర్వఫల్గుణీ {పుబ్బ} నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు

 

     పూర్వఫల్గుణీ నక్షత్రములలో ఇది 11వ నక్షత్రము. దీనికి పుబ్బ అని ఇంకొక పేరుంది. ఈ నక్షత్రము అధిపతి శుక్రుడు. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. జాతి పురుష జాతి. జంతువు సింహం, ఆధిదేవత భర్గుడు, రాశి సింహా రాశి. పూర్వ ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము సింహరాశి, రెండవ పాదము - కన్యారాశి, మూడవ పాదము - తులారాశి, నాలుగవ పాదము - వృశ్చికరాశి.


పూర్వఫల్గుణీ మొదటి పాదము

ఈ నక్షత్రములోని ఏ పాదంలో శిశువు జన్మించినా, సామాన్య దోషం కలుగుతుంది. ఈ దోష శాంతికి సామాన్య శాంతికి శిశువు ముఖాన్ని తండ్రి నూనెలో చూడాలి. అబ్బాయి పుడితే ధనవంతుడు, ధర్మాత్ముడు, కార్య విచారమును ఎరిగిన వాడుగా, నృత్య శాస్త్రమున సమర్థుడుగా అవుతాడు. స్త్రీ పుడితే ఉత్తమమైన సంతానం కలిగినదిగా, ధనవంతురాలుగా, శతృజయం పొందినదిగా అవుతుంది.


పూర్వఫల్గుణీ రెండవ పాదము

పూర్వఫల్గుణీ రెండో పాదములో జన్మించిన జాతకులకు 15 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారమును ఉంగరపు వేలుకు పొదిగించుకుని ధరించాలి. 15 సంవత్సరముల నుంచి 21వ సంవత్సరముల వయస్సు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 21 సంవత్సరముల నుంచి 31 సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ ఉంటుంది. కనుక ఈ సమయాన ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 31 నుంచి 38 సంవత్సరముల వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 38 నుంచి 56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 

 

56 సంవత్సరము వయస్సు నుంచి 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ. కాబట్టి కనుక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 72 సంవత్సరముల నుంచి 91 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. 


పూర్వఫల్గుణీ మూడోపాదము

పూర్వఫల్గుణీ మూడో పాదములో జన్మించిన జాతకులైతే.. జన్మించిన 10 సంవత్సరముల వయస్సు వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమం. ఇక 10 సంవత్సరముల నుంచి 16 సంవత్సరముల వరకు రవి మహర్దశ. అందువల్ల కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 సంవత్సరముల నుంచి 26 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.


26 నుంచి 33 సంవత్సరముల వరకు కుజ మహర్దశ. అందువల్ల పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 33 సంవత్సరముల నుంచి 51 సంవత్సరముల వరకు రాహు మహర్దశ ఉంటుంది. కనుక గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 51 నుంచి 67 సంవత్సరముల వరకు గురు మహర్దశ. అందువల్ల కనక పుష్యరాగమను బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిది. 67 సంవత్సరముల నుంచి 86 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి మీరు నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.


పూర్వఫల్గుణీ నాలుగో పాదము

పుబ్బ నక్షత్రం 4వ పాదములో జన్మించిన జాతకులైతే జన్మించిన 5 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాల్సి ఉంటుంది. 5 సంవత్సరముల నుంచి 11 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించాలి. 11 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.


21 నుంచి 28 సంవత్సరముల వయస్సు వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి. 28 నుంచి 46 సంవత్సరాల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 46 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు గురు మహర్దశ. అందువల్ల కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. 62 ఏళ్ల వయసు నుంచి 81 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.  


పూర్వఫల్గుణి నక్షత్రము - గుణగణాలు


పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు. అందువల్ల వీరి బాల్యం సుఖమయంగా గడుస్తుంది. విద్యాభ్యాసముకు ఎలాంటి ఆటంకం కూడా రాదు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలముగా ప్రవర్తించే స్వభావం వల్ల అధికారులుగాను, నాయకులుగానూ రాణిస్తారు. 


ఇక ఎవరు ఏమనుకున్నా లెక్క చేయరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని, సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యా దానము చేస్తారు. స్వయంకృతాపరాధము వలన తాను శ్రమించి సంపాదించిందంతా వైరి వర్గానికి ధారపొస్తారు. 


మిత్రుల ఉచ్చు నుంచి కొందరు జీవితకాలమంతా బయటపడని సందర్భం ఎదురు కావొచ్చు. బయటకి కనిపించే జీవితము కాక రహస్య జీవితము వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా

*62) కఠోపనిషత్తు

 ఓం నమః శివాయ:

*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


ఆగ్ర్యమ్య బుద్ధి అంటే అగ్రస్థితిలో వున్నటువంటి బుద్ధి. మనం ఇప్పటి వరకూ మాట్లాడుకున్న అంశాలను స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి. ఆ వజ్రాన్ని ఎక్కడ పెడుతారు సాధారణంగా? మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు, సాసర్లు, బిందెలు, గిన్నెలు... అక్కడ వెతికారు అనుకోండి, ఆ వజ్రం కనబడుతోందా? సాధారణంగా ఈ వజ్రమంత విలువైన దానిని ఎక్కడ పెడుతాము? ఎక్కడో ఒక చోట భద్రమైనటువంటి స్థితిలో పెడుతాము. భద్రమైనటువంటి స్థానంలో పెడుతాము. ఎందుకని? చాలా విలువైనది కాబట్టి. మరి వాటిని సామాన్యంగా మనం వెతికితే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పడవేసి వెతికితే అది కనపడుతుందా అంటే, ఆ వస్తువులన్నిటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. 



అట్లాగే మనలో భద్రమైనటువంటి స్థానంలో, భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప జ్ఞానమున్నది, స్వప్రకాశము కూడా ఉన్నది. అదే ఆత్మ. అర్థం అయ్యిందా అండి. బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశ స్థానములో, నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నటువంటి, స్వప్రకాశము ఏదైతే ఉన్నదో అది ఆత్మ. ఇది భద్రంగా ఉంది. అతి సూక్ష్మంగా ఉంది, గుహ్యంగా ఉంది, రహస్యంగా ఉంది, భద్రమైన స్థితిలో వుంది, భద్రమైన స్థానంలో ఉంది.



        ఒక్కొక్కదానిని విరమించుకుంటూ, ఒక్కొక్క దానియందున్న సంగత్వాన్ని పోగొట్టుకుంటూ, ఆసక్తులను పోగొట్టుకొంటూ, ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలడం ద్వారా, మనస్సును మరలించడం ద్వారా, నీ మనస్సు సదా గిన్నెల చుట్టూ, సదా విషయముల చుట్టూ, సదా తినే పదార్థముల చుట్టూ, సదా భోగించేటటువంటి లక్షణాల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఏ బట్టలు కట్టుకుందాం? ఏ భోజనం చేద్దాం? ఏ రకంగా సుఖాన్ని పొందుదాం? ఏ రకంగా విశ్రాంతి తీసుకుందాం? ఏ రకంగా అలంకారం చేద్దాం? ఈ రకంగా బాహ్యమైనటువంటి విషయాల చుట్టూ, బాహ్యమైనటువంటి వస్తువుల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉంటే, బుద్ధి కూడా మనసును అనుసరించి, నిర్ణయాలు చేస్తూ ఉంటుంది బాహ్యముగానే. ఏ నివృత్తి మార్గానికి, స్వస్వరూప ఆత్మజ్ఞానానికి, ఉపయోగపడవలసినటువంటి బుద్ధి ఉన్నదో, దానిని బాహ్యమైనటువంటి విషయాల కొరకు, బాహ్యమైనటుంవంటి వస్తు జ్ఞానము కొరకు, వ్యవహార నిర్ణయము కొరకు, వాడుకోవడం ఎటువంటి దంటే, కంట్లో ఆపరేషన్‌ చేయడానికి ఉపయోగించవలసినటువంటి కత్తిని, కూరగాయలు కోయడానికి ఉపయోగించరాదా? అంటే, అది కూడా కత్తే, కోయడానికి ఉపయోగపడుతుందా? పడదా? పడుతుంది. కానీ, ఒకసారి కూరగాయలు కోస్తే మరల కంట్లో ఆపరేషన్స్‌ చేయడానికి ఉపయోగపడదు. ఇప్పుడు మన బుద్ధి ఇలాగే తయారైంది.



      బుద్ధి నివృత్తి మార్గం ద్వారా స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందటానికి ఉపయోగపడవలసిన సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. అది ఎంత సూక్ష్మమైనది అంటే, సూర్యకిరణాలను కూడా నిలువుగా ఛేదించగలిగేటటువంటి సమర్థత కలిగినంత సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. దానిని ఇప్పుడు మనము బిందెల చుట్టు, కడవల చుట్టు, భౌతికమైన, స్థూలమైనటువంటి విషయాల చుట్టూ, వస్తువుల చుట్టూ తిప్పుతున్నాము.



        ఈ రకమైనటువంటి అభ్యాసదోషం చేత మన బుద్ధి స్థూలతని సంతరించుకుంది. తన సూక్ష్మతను పోగొట్టుకుంది. ఇప్పుడు పునః ఏం చేయాలట? దానిని వెనక్కు తిప్పుకుని, మనస్సును విరమింప చేసి, బుద్ధిని విరమింప చేసి, దానికి మూలమైనటువంటి, కారణమైనటువంటి, మహతత్వమునందు, అవ్యక్తము నందు దానిని స్థిరపరచి బుద్ధిగుహ యందు విచారణ చేసి, దృష్టి నిలిపి, హృదయాకాశము నందు సదా ప్రకాశిస్తున్నటువంటి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు పొందాలి. 



అలా ఎవరైతే పొందుతారో వాళ్ళకి, ఆ సాక్షాత్కార జ్ఞానం, ఆ జన్మపర్యంతం అంటే, జనన మరణాలను దాటటానికి అదే సోపానముగా పనికి వస్తుంది. అదే అవకాశంగా పనికి వస్తుంది. ఈ జనన మరణ చక్రంలోనుంచి బయటపడగలుగుతాడు. కర్మబంధాలలోనుంచి బయటపడగలుగుతాడు. మోహంలోనుంచి బయటపడగలుగుతాడు. 

ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మానవజన్మని ధన్యత చెందించగల సర్వసమర్థమైనటువంటి సాధన ఏదైనా ఒకటి ఉంది అంటే, అది ఆత్మవిచారణ, ఆత్మసాక్షాత్కార జ్ఞానము. కాబట్టి, 



అటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని, ఉత్తమమైనటువంటి సాధనను, శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలించుకోవడం ద్వారా బాహ్య విషయ వస్తు వ్యవహార సంగత్వ దోషాన్ని పరిత్యజించడం ద్వారా, నిమిత్తమాత్రపు వ్యవహారం ద్వారా, సామాన్య వ్యవహారం ద్వారా, తనను తాను నియమించుకుంటూ, సాధన చతుష్టయ సంపత్తి ద్వారా, నిత్యానిత్యవస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి... అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షత్వము, తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యము... వీటిని పొందవలసినటువంటి అవసరము మానవులకు ఎంతైనా ఉన్నది. ఈ సమస్తమూ కూడా నివృత్తి మార్గంలోనే సాధ్యమౌతుంది. సత్వగుణంతోనే సాధ్యమౌతుంది. 



చాలా మంది ఈ సత్వగుణం అనేదాని దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. ఎంతకాలం తీసుకుంటారయ్


యా? ఎన్ని జన్మలపాటైన

ా విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకని అంటే? అది సహనంతో ఉంటుంది, శాంతంతో ఉంటుంది, ఓర్పుతో ఉంటుంది. అన్ని దైవీ లక్షణాలు ఆ సత్వగుణంతో ముడిపడి ఉంటాయి. దయ, క్షమ, త్యాగం ఇలాంటి లక్షణాలన్నీ దానితో ముడిపడి ఉంటాయి. కానీ స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందక పోయినట్లయితే, ఈ సత్వగుణం కూడా బంధహేతువే, బంధ కారణమే! ఎందుకని అంటే, జనన మరణ చక్రంలోకి పట్టుకెళ్తుంది కాబట్టి. పునః మరలా శరీరాన్ని ధరింప చేస్తుంది కాబట్టి. ఎప్పటికైనా సరే ఈ సత్వగుణాన్ని కూడా అధిగమించాలి. గుణాతీత స్థితిలో నిలబడి ఉండాలి. గుణాలకు సాక్షిగా ఉండాలి.



         ‘గుణత్రయాతీతః’ - ఎట్లా అయితే, ‘శరీర త్రయ విలక్షణః’ - ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ‘గుణత్రయాతీతః’ - మూడు గుణాలను దాటినటువంటి స్థితిలో, మూడు గుణాలు స్వాధీనమైనటువంటి స్థితిలో, గుణమాలిన్యము లేనటువంటి స్థితిలో, స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞాన స్థితిలో, ప్రత్యగాత్మ స్థితిలో, అంతర్యామి స్థితిలో, బుద్ధి గుహయందు, స్వప్రకాశంతో, స్వరూపజ్ఞానంతో సహజంగా నిలకడ చెంది, తనను తాను తెలుసుకున్న వాడై, సరియైనటువంటి ఆత్మనిష్ఠ యందు నిలకడ చెందాలి. ఈ ఉత్తమ లక్ష్యాన్ని పొందాలి అంటే, రాచబాటను తెలియజేసింది. నివృత్తి మార్గం ద్వారా మనస్సునుండి బుద్ధికి, బుద్ధినుండి మహతత్వానికి, మహతత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యగాత్మకు చేసేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని, మానవులు పూర్తి చేయాలి. అలా పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఈ ఆత్మదర్శనాన్ని పొందగలుగుతున్నారు.



        అలా లేకపోయినట్లయితే, ఈ నివృత్తి మార్గంలో కనుక నువ్వు ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించి, శ్రవణ, మనన, నిధి ధ్యాసల ద్వారా, ఈ స్థిరమైనటువంటి స్థితిని గనుక నువ్వు పొందకపోయినట్లయితే, ఇది సాధ్యం కాదు. కాబట్టి, తప్పక అందరూ ఈ ఆత్మదర్శనాన్ని పొందేదిశగా పరిణామం చెందవలసినటువంటి అవసరం ఈ జన్మలోనే ఉంది. ఎప్పుడో చేద్దాంలే, ఎప్పుడో చూద్దాంలే, అదే రాకపోతుందా? వచ్చినప్పుడు అదే వస్తుందిలే, కాలంలో అవే వస్తాయిలే, ‘కాలేన ఆత్మని విందతి’ - అనేటటువంటిది వాయిదా పద్ధతి తమోగుణం సంబంధమైన వాయిదా పద్ధతి.



        ఇప్పుడే ఈ జన్మలోనే, ఈ క్షణమందే, ఈ స్థితియందే, ఇప్పటికిప్పుడే ‘నేను పొందాలి’ అనేటటువంటి తీవ్రమోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో, వారు మాత్రమే ఈ నివృత్తి మార్గంలో త్వరత్వరగా ప్రయాణం చేయగలుగుతారు.



 అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతారు. చాలామంది ప్రయత్నం చేస్తారు కాని, సత్వగుణానికి చేరగానే ‘కాలేన విందతి’ అని ఊరుకుంటారు. అలా ఊరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇది పెద్ద విమానాశ్రయం లాంటిది, విమానాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వీడు ఎప్పటికీ విమానాశ్రయంలో వుంటాడు, ఏ విమానము ఎక్కడు, ఎక్కడికి ప్రయాణం పూర్తి చేయడు. అందువల్ల ఏమైపోయింది? శ్రవణం చేశాడు, మననం కూడా చేశాడు, కానీ నిధిధ్యాసలను పూర్తి చేయలేదు. అతని దగ్గర అన్నీ మంచి లక్షణాలున్నాయి. ఏ చెడు లక్షణాలు ఎత్తి చూపడానికి ఏం కనపడవు.



 అందరి కంటే ఓర్పు కలిగినవాడు, అందరి కంటే సహనం కలిగినవాడు, అందరితో పోలిస్తే జ్ఞానం ఉన్నవాడు, అందరితో పోలిస్తే వివేకం ఉన్నవాడు, శాస్త్రములన్నీ బాగా చదివాడు, మంత్రములన్నీ బాగా తెలుసుకున్నాడు, ఉపదేశాలన్నీ బాగా పొందాడు, మహానుభావుల సేవనం కూడా చేశాడు, కానీ లక్ష్యశుద్ధి ఇప్పుడే, ఈ జన్మలోనే, ఇక్కడే, ఈ సందర్భంలోనే ‘నేను వెంటనే వెనువెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానము’ పొందక నిలువజాలను అనేటటువంటి తీవ్రమోక్షేచ్ఛ లోపించడం చేత, ఆ స్థానంలో వాయిదా పద్ధతి వచ్చేసింది. సరే నేను చేయాల్సింది చేసేశాను,



 ఇక వచ్చేది ఎప్పటికైనా ఈశ్వరానుగ్రహం చేత అదే వస్తుందిలే అనుకుంటాడు. అలా అనడం వలన ఏమైపోయింది? ఆ వాయిదా వాయిదా అలాగే ఉండిపోయి, ఆ జన్మాంతరమూ, అలాగే అవశేషంగా మిగిలిపోయి, ఆ అసంతృప్తి చేత పునః జనన మరణ చక్రంలో, మరలా తల్లి గర్భాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చింది.


🕉🌞🌏🌙🌟🚩

గ్యాలరీ


 

కలియుగం


 

భాషా విశేషాలు

 గండ్రగొడ్డలా ? ఏడుకొప్పెరల ధనమా ?

...........................................................


(1) డౌలు చెప్పోద్దు, వాడోడౌలుగాడు, వాడిది వుత్తి డౌలే కాని నిజం ఏమిలేదు. ఇందులో డౌలు అనగా ?


(అ) ఇదో రెవెన్యూవారి పరిభాష, రాబడి అంచనావేయడమని అర్థం.🚩

(ఆ) ఆడంబరాన్ని ప్రదర్శించడం

(ఇ) హోదా

(ఈ) అబద్ధాలు చెప్పడం


(2) గండ్రగొడ్డలిలోని గండ్ర అనగా ?


(అ) పెద్దది

(ఆ) పదునైన🚩

(ఇ) పలుచని ఆయుధం

(ఈ) మందమైన ఆయుధం


(3) ఆ రాజుకు ఏడు కొప్పెరల ధనం లభించింది. ఇందులో కొప్పెర అనగా ?


(అ) బోషానం

(ఆ) అతిపెద్ద పెనం🚩

(ఇ) సంచి

(ఈ) లంకెబిందె


(4) మొక్కమామిడి అనగా ?


(అ) అడవి మామిడి

(ఆ) కొండ మామిడి

(ఇ) జీడిమామిడి ( బాదాం )🚩

(ఈ) మామిడి మొక్క


(5) విధవంటే తెలుసు మరి వెధవంటే ఎవరు ?


(అ) భార్యను కోల్పోయిన పురుషుడు

(ఆ) పనికిరానివాడు

(ఇ) సోమరులు/బద్ధకస్తులు

(ఈ) అది విధవే, వెధవగా మారింది.🚩


(6) భార్యను కోల్పోయిన పురుషుడిని ఏమంటారు.


(ఆ) వెధవ

(ఆ) విధురుడు🚩

(ఇ) వింతకాడు

(ఈ) విబుద్ధికాడు


(7) సాదర / సాదరి అనేకులముంది.ఒక్కపుడు వీరి వృత్తి ఏమిటి ?


(అ) మల్లులు (మల్లయుద్ధం)

(ఆ) సైనికులు

(ఇ) ద్వారపాలకులు

(ఈ) పన్నువసూలు🚩


(8) తురకలు అనగా ?


(అ) పర్షియానుండి వచ్చినవారు

(ఆ) అరబ్బునుండి వచ్చినవారు

(ఇ) భారతదేశంలో మతం మారినవారు

(ఈ) టర్కినుండి వచ్చినవారు🚩


(9) చిక్కం అనగా ?


(అ) దొరకనివారు

(ఆ) సన్నబడిన చిన్నది

(ఇ) ఉట్టి

(ఈ) వల🚩


(10) కొరకంచు అనగా ?


(అ) వాడైన కత్తి

(ఆ) కంచుదీపం

(ఇ) కాగడా🚩

(ఈ) కంచుపెట్టె

..................................................................................................................................