8, అక్టోబర్ 2020, గురువారం

ఆదిపర్వము – 43

 

ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం


మరునాడు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. ద్రుపదుడు వ్యాసునికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి సత్కరించాడు. ద్రుపదుడు వ్యసునితో “మహాత్మా, నా కుమార్తె ద్రౌపదిని అర్జునుడు అంత్స్యత్యంత్రాన్ని చేధించి, స్వయంవరంలో పొందాడు. కాని ధర్మరాజు తాము ఐదుగురు అన్నదమ్ములము ద్రౌపదిని వివాహం చెసుకుంటాము అంటున్నాడు. ఇది లోక విరుధ్ధము కాదా? తమరే ధర్మ నిర్ణయం చెయ్యండి” అని అడిగాడు.

ధర్మరాజు కూడా చేతులు జోడించి “మహాత్మా, మాట వరసకైనా నేను అసత్యం, అధర్మం పలకను.నా నోటి నుంది అలా ఎందుకు వచ్చిందో తెలియదు. మాకు మా తల్లి దైవం. కాబట్టి తల్లి మాటను మెమౌ జవదాటలేము. అదియునుకాక, జటిల అనే ఋషి కన్య ఏడుగురు ఋషులను వివాహం చేసుకుంది. దాక్షాయణి అనే కన్య ప్రచేతసులు అనబడే పది మందిని వివాహం చెసుకుంది. కాబట్టి ద్రుపద మహారాజా, అలోచించిక నీ కుమార్తె ద్రౌపదిని మా ఐదుగురు అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చెయ్యి” అని అన్నాడు.

ఇరువురి వాదనలు విన్నాడు వ్యాసుడు. కాసేపు ఆలొచించాడు. “ద్రుపద మహారాజా, ఈ ధర్మరాజు చెప్పినట్టు, నీ కుమార్తె ద్రౌపదిని ఈ ఐదుగురికి ఇచ్చి వివాహం చెయ్యి. ఇది ధర్మ నిర్ణయం. నేను ఈ నిఋనయానికి ఎలా వచ్చానో కారణాలు కావాలంటే లోపలకు రా చెపుతాను” అని ద్రుపదుడిని లోపలకు తీసుకొని వెళ్లాడు. ఏకాంతంలో ద్రుపదునికి వ్యాసుడు ఇలా చెప్పసాగాడు.

“పూర్వ కాలంలో ఇంద్రసేన అనే ఆమె మౌద్గల్య మహాముని భార్య. ఆమె మహాపతివ్రత. మౌద్గల్యుడు కుష్టురోగమొతో బాధపడుతున్నాడు. చర్మం అంతా వడలి పోయింది. అవయవాలు కుళ్లిపోయాయి. కాని ఇంద్రసేన అసహ్యించుకోకుండా భర్తకౌ సేవలు చేస్తూ ఉంది. ఒక రోజు భర్తకు భోజనం పెట్టింది. మిగిలిన అన్నం తను తింటూ ఉంది, అందులో భర్త వేలు ఒకటి ఊడి పడింది.ఇంద్రసేన ఆ వేలును తీసి పక్కన పెట్టి, మిగిలిన అన్నం తింటూ ఉంది. దీనిని చూసి మౌద్గల్యుడు “ఇంద్రసేనా, నీ పతి భక్తి అమోఘం. నీకు ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను” అన్నాడు.

దానికి ఇంద్రసేన “నాధా, నాకు కామ వాంఛలు మెండుగా ఉన్నాయి. అవి మీ వల్ల ఈ రూపంలో తీరలేదు. కాబట్టి మీరు, అందమైన, మనోహరమైన రూపం ధరించి, ఐదుగురిగా మారి, ఈదు విధాలుగా నా కామ వాంఛలు తీర్చండి” అని అడిగింది.

దానికి ఆ మహాముని సంతోషించాడు. తన తపో మహిమతో, మనోహరమైన రూపం ధరించాడు. ఐదుగుఇగా విడిపోయాడు. ఐదు విధాలుగ భార్యతో కాం సుఖాలు అనుభవించాడు. తరువాత బ్రహ్మలోకానికి వెళ్లాడు.

ఇంద్రుడు మొదలైన దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి “బ్రహ్మదేవా. మానవులు మరణం లేకుండా జీవిస్తే, మాకు వారికి తేడా ఏముంటుంది చెప్పండి. దీనికి మీరే ఒక మార్గం చూపాలి” అని ప్రాధేయపడ్డారు.

దానికి బ్రహ్మదేవుడు “యముని సత్రయాగం అయ్యేదాక మీరు నిశ్చింతగా ఉండండి. యాగం పూర్తి కాగానే అతను మానవులను అంతమొందిస్తాడు. యముని తేజస్సు, మీ తేజస్సు కలిగిన వీరులు ఆయనకు సహాయంగా ఉంటారు” అని చెప్పాడు.

ఇంద్రుడు ఇతర దేవతలు ఇంద్రలోకం వెళుతూ మార్గ మధ్యంలో గంగానది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ కాశీరాజు కూతురు ఏడుస్తూ ఉండి. ఇంద్రుడు ఆమెను చూసి “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు. “దేవేంద్రా, నా ఏడుపు గురించి తెలుసుకోవాలంటే, మీరు నా వెంట రావాలి” అని అతనిని మహాశివుని వద్దకు తీసుకొని వెళ్లింది.

ఆ సమయంలో మహాశివుడు నవయువకుని రూపంలో మరొక యువతితో పాచికలు ఆడుతున్నాడు. అది చూసి దేవేంద్రుడికి కోపం వచ్చింది, “ముల్లోకాలకు అధిపతిని నా ఎదురుగా జూదం ఆడుతున్నావా?” అని గర్వంగా అడిగాడు.

దానికి శివుడు కోపించి “నువ్వు గర్వంతో మాట్లాడావు. నీకు చేతనైతె ఆ కొండ గుహను రెండుగా చీల్చు” అన్నాడు. ఇంద్రుడు తన బాహు బలంతో ఆ గుహను రెండుగా చీల్చాడు. అందులో తన మాదిరే ఉన్న నలుగురు ప్రకాసవంతులైన, బలవంతులైన వీఉలను చూసాడు. తన మాదిరే ఉన్నా వారిని చూసి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు.

మహేశ్వరుడు తన నిజ రూపంతో సాక్షాత్కరించాడు. “మీ ఐదుగురు ఇంద్రులు మానవలోకంలో జన్మించండి” అని అన్నాడు. కాశీరాజు పుత్రికను చూసి “నువ్వు ఆ ఐదుగురిని వివాహం చేసుకొని నీ కోఇకలు తీర్చుకో” అని వెళ్లిపోయాడు.

ద్రుపద మహారాజా, ఆ ఐదుగురు ఇంద్రులే, యమ, ఇంద్ర, వాయు, అశ్వినుల అంశలతో, ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులుగా జన్మించారు. కాశీరాజు పుత్రిక ఐన ఇంద్రసేన, యాజ్ఞసేనిగా ఉద్భవించి, నీ ఇంట పెరిగింది. కావలాంటే వారి పూర్వ రూపాలు చూడు” అని తన తపో మహిమతో వారి పూర్వరూపాలు చూపించాడు.

ఇంద్రుని ఐదు రూపాలలో ప్రకాశిస్తున్న ఆ వీరులను చుసాడు ద్రుపదుడు. ఇంద్రసేనను కూడా చూసాడు. అలా ఆశ్చర్యంతో చూస్తున్న ద్రుపదుని చూసి వ్యాసుడు ఇంకా ఇలా అన్నాడు “ద్రుపదా, పూర్వం నితంతుడు అనే రాజ ఋషి కుమారులు కూడా ఔశీనరపుత్రికను స్వయంవరంలో పొంది వివాహం చేసుకున్నారు. కాబట్టి నీ కూతురుకు పంచ పాండవులతో వివాహం జరిపించు, శుభం కలుగుతుంది” అని చెప్పాడు.

ద్రుపద మహారాజుకు సందేహ నివృత్తీయింది. వ్యాసమహాముని మాటను శిరసావహించాడు. పాండవులు ఐదుగురికి తన కుమార్తె ద్రౌపదిని ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పాండవుల పక్షాన వారి పురోహితుడు ధౌమ్యుడు పౌరోహిత్యం వహించాడు.

కాని ఇంద్రసేనకు కామ వాంఛలు ఇంకా తీరలేదు. మరు జన్మలో రాజ పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగానే మిగిలి పోయింది. శివుని గూరిచి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి కావాలో కోఉకొమ్మన్నాడు.

శివుడిని చూసిన తత్తర పాటులో, తన మనసులో ఉన్న బలమైన కోరికతో, “నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి” అంటూ ఐదు మార్లు అడిగింది. నీకు మరు జన్మలో ఈదుగురు భర్తలు ఔతారు అని వరం ఇచ్చాడు శివుడు.

ఆమె తన పొరపాటు గ్రహించింది. “దేవ, ఎక్కాడన్నా ఒక క్నయకు ఐదుగురు భర్తలు ఉంటారా. ఇది ధర్మ విఉధ్ధం కాదా. కాబట్టి నాకు ఈ వరం అక్కరలేదు.” అని చెప్పింది.



దానికి శివుడు “సాధ్వీ, నువ్వు ధర్మం తప్పకుండా ఐదుగురు భర్తలతో ఉంటావు” అని అన్నాడు

“అలా ఐతే, నాకు ఆ ఐదుగురు భర్తలతో ప్రత్యేక సంగమం కావాలి. ఒక్కొక్కసారి ఒక్కరినే కలవాలి. అప్పుడు నేను కన్యగానే ఉండాలి. నా కామేచ్చ తీరాలి. పతి సేవా భాగ్యం, నిరంతర సౌభాగ్యం కలగాలి” అని అడిగింది. శివుడు ఆమె కోఇన విధంగా వరాలు ఇచ్చాడు. “నువ్వు వెళ్లి గంగా తీరంలో ఉన్న ఇద్రుడిని నా వాద్దకు తీసుకొని రా” అని చెప్పాడు. కాశీ రాజు కుమార్తె అలాగే అని గంగాతీరానికి వెళ్లింది.

ఆ సమయంలో యమధర్మరాజు సత్రయాగం నిర్వహిస్తున్నాడు. యాగదీక్షలో ఉంటాడు కాబట్టి ప్రాణి హింస చెయ్యకూడాదు. అందువలన మానవులు మరణం లేకుండా ఏళ్ల తరబడి జీవించ సాగారు. భూభారం ఎక్కువ అయిపోయింది.

ద్రౌపదిని సర్వాలంకార భూషితురాలిని చేసి వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. ధౌమ్యుడు వివాహవిధిని నిర్వర్తించాడు. మొదట, ద్రౌపదిని ధర్మరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం కాగానే ద్రౌపది ఈశ్వరుని ప్రార్థించింది. ఆ మహేశ్వరుని వరం వలన మరల ఆమెకు కన్యాత్వం సిధ్ధించింది.తరువాత ఆమెను భీమసేనునికి ఇచ్చి వివాహం జరిపిచారు. ఇలా ఒకరి తరువాత ఒకరుగా, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదిని వివాహమాడారు. పంచ పాండవులు, ద్రౌపది తమ తల్లి కుంతీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. సభాసదుల ఆశీర్వాదం పొందారు.

ద్రౌపదీ స్వయంవరం తరువాత ద్రుపదుడు పాండవులకు ఎంతో విలువైన ఆభరణాలను, ఏనుగులను, గుఱ్ఱాలను ఇంకా ఎన్నో విలువైన కానుకలను ఇచ్చాడు. ద్రౌపది కూడా పతివతా ధర్మంతో ఐదుగురు భర్తలకూ సేవ చేస్తూ ఉంది. కుంతీదేవి కూడా కోడలును సకలైశ్వర్యవంతురాలిగా, సంతానవతిగా దీవించింది.

ద్వారకా నగరంలో ఉన్న శీకృష్ణుడు పాండవుల వివాహ సమయంబున అనేక కానుకలు పంపాడు. ఆ విధంగా ద్రుపద పురంలో ఒక సంవత్సరం పాటు సమస్త రాజభోగాలు అనుభవించారు.

కామెంట్‌లు లేవు: