సృష్ఠి రహస్యం తెలిసిన అహంకారమే. యిది బ్రహ్మ కైనా తప్పలేదు. దానికి విష్ణువు అవతారం ఎత్తి అహంకారమునుగూర్చియు పోగొట్టి అనగా రాక్షసత్వం పోగొట్టుటకు అవతారం. అహంకారమే రాక్షస్తం అనగా. వేదముల వలన సృష్టి రహస్యం తెలియును. అట్టి వేదములను తెలుసుకొన్న తరువాతనే అహంకారం ఉద్భవించింది. దానిని నశింపజేసిన తరువాతనే అహంకారము పోయి తిరిగి తన పనిని తాను చేయుటకు ఉపక్రమించారు. దీని రహస్యం మత్స్యావతారం. ప్రతిచోటికిని అహంకారమే వినాశనం చేసే ప్రయత్నమే. సోమరసం సముద్రం నుండి తెచ్చి అనగా సృష్టి కార్య రహస్యమును ఆపి వేయుట. జీన్ తెలియకపోతే సృష్టి జరుగదు. సోమరసం పదార్ధ లక్షణము. మనం కూడా సృష్టి కార్యమును వాయిదా వేసి ధనసముపార్జనే ధ్యేయంగా ఆనందమును కోల్పోయి అనవసర ప్రయాణం వృధా జీవన గమనం. తద్వారా జీవన గమన లక్ష్యం దెబ్బ తినుట. అందుకే ఏ వయస్సులో ఆ వయస్సుకు సంబంధించిన కార్యములను అనుసరింపవలెనని. బాల్యంలో విద్యను సాధన చెయ్యాలి. యౌవనంలో సృష్టి ధర్మాన్ని నిర్వర్తించాలి. కౌమారంలోనే జీవిత లక్ష్యములను నిర్వర్తించాలి. వార్ధక్యంలో మెూక్షమును గురించి సాధనతో తెలియాలి. తనను తాను ముందునుండి తన ధర్మాన్ని ఆచరిస్తూనే తనను తాను తెలుసుకొనే సాధన చేయాలి. కూర్మావతారం అనగా సాధన చేయుట. అనగా సృష్టికి సంబంధించిన ప్రకృతిని సమన్యాయముగా వుంచుట.వరాహావతారం అనగా సృష్టించిన దానిని నేనే అనే అహంకారంతో వినాశనము. అనగా ప్రకృతిని తద్వారా సృష్టికి మూలమైన భూమిని ప్రకృతి వినాశనంగా చేయుట. అందుకే వరాహవతారంఅనగా భూమిని పూర్తిగా జలమయం చేయుట. అనగా సృష్టి వినాశనం. అవతార ఆవిర్భావం అహంకారము వలన ఏర్పడిన ప్రకృతిని రక్షించుటయే. యిప్పటికిని మానవులు గాఢ నిద్రలోనే అనగా అఙ్ఞానం తో కూడిన గాఢ నిద్రలో వున్నాం. ఙ్ఞానం తో నిద్ర అనగా తస్మాత్ జాగృత జాగ్రతః శంకరుల బోధ. యిప్పటికిని మేల్కొనక పోతే సృష్టి వినాశనమే. అందరూ దాని ప్రతిఫలం అనుభవించవలసివదే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి