8, అక్టోబర్ 2020, గురువారం

*ఆచార్య సద్భోదన*



ఉన్నతము, శాశ్వతమూ, అవినాశమూ అయిన ఒక ఆధ్యాత్మికాదర్శం కోసం మనం గట్టిగా ప్రయత్నించాలి. 


కానీ మనం కోరికోరి ఈ మాయా కల్పితమైన మమతానురాగాలను, భౌతికమైన భోగాలను అంటిపెట్టుకుని, అజ్ఞానపు పంథాను ఎంతో ఇష్టంగా అవలంబిస్తాం. ఈ రోజు కాకపోతే రేపైనా వాటిని విడువక తప్పదు కదా. మనంతట మనంగా పట్టువిడవకపోతే, మన చేతిలోని ఆటబొమ్మ ఏదో ఒకనాటికి బలవంతంగా లాగివేయబడుతుంది. ఇది అమితమైన దుఃఖానికి దారి తీస్తుంది.


ఇలా జరిగిన తర్వాత, భగ్న హృదయులైనప్పుడు మాత్రమే చాలా మంది ఈ జీవితం నేర్పే పాఠాలను నేర్చుకుంటారు.


కానీ ఈ విధంగా నేర్చుకోవడం ఎంతో బాధాకరంగా ఉండడమే కాక, దానికి ఎన్నో జన్మలు పడుతుంది కూడా. అలా చెయ్యడానికి బదులు, ఆధ్యాత్మిక జీవనన్ని బుద్ధిపూర్వకంగా, చక్కగా యోచించి, స్పష్టమైన ఎరుకతో, దృఢమైన సంకల్పశక్తితో, భగవర్పిత ఏకనిష్టతో జీవించాలి.


నిజానికి, ఈ సంకల్పశక్తి ద్వారా మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకూ చేర్చవచ్చు లేదా అధోగతులకు దిగజార్చవచ్చు. 


*అంతా మన చేతుల్లోనే ఉంది.* 


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: