8, అక్టోబర్ 2020, గురువారం

**హిందూ ధర్మం - 20**

 **దశిక రాము**




క్షమా గుణం మీద రామాయణం బాలకాండ 32-33 సర్గల్లో చక్కటి కధ ఒకటి వాల్మీకి మహర్షి అందించారు.


కుశనాభుడనే ఒక రాజుకు, ఘృతాచి అనబడే ఒక గంధర్వకాంత వలన 100 మంది మహసౌందర్యవతులైన కుమార్తెలు జన్మించారు. యవ్వనంలో ఉన్న ఆడపిల్లలు ఒకసారి దగ్గరలో ఉన్న ఉద్యానవనానికి వెళ్ళి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆకాశం నుంచి తారలు దిగివచ్చాయా అన్నట్టుగా ఉన్నది వారి అందం అని వర్ణించారు వాల్మీకి మహర్షి. వారు ప్రపంచంలోనే మహసౌందర్యవతులు. ఆ సమయంలో వారి ముందు వాయుదేవుడు ప్రత్యక్షమై మీరు చాలా అందంగా ఉన్నారు, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, నన్ను పెళ్ళి చేసుకుంటే మీకు ఈ మానవ శరీరాలు పోయి, దేవతలవుతారు అధికకాలం, మానవులకు యవ్వనం కొంతకాలమే ఉంటుంది, కానీ నన్ను వివాహం చేసుకుంటే మీ యవ్వనానికి, అందానికి ఇక మరణం ఉండదు అంటాడు.


వాయుదేవుని మాటలు విన్న ఆ కాంతలందరూ ఒక్కసారి నవ్వి 'నీవు సకల ప్రాణకోటికి జీవనాధారమైనవాడివి, మాకు నీ యొక్క గొప్పతనం తెలుసు, అయినా నీవు మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నావు. మేము కుశనాభుడి కుమార్తెలము, ఓ దేవోత్తమా! మేము తల్చుకుంటే నిన్ను, నీ వాయుపదవి నుంచి తప్పించగలము, అయినా మా తపశ్శక్తిని రక్షించుకోవడం కోసం మమ్మల్ని మేము నిగ్రహించుకుంటున్నాము. ఓ మదాంధుడా! తగిన సమయం వచ్చినప్పుడు మేము స్వతంత్రంగా, మా తండ్రి అనుమతితో నచ్చిన వరుడిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకుంటాము. మా నాన్నగారు మాకు దైవంతో సమానం, వారు మమ్మల్ని ఎవరి చేతిలో పెడితే, వారితోనే జీవితం గడుపుతాము' అన్నారు.


ఈ మాటలు విన్న వాయుదేవుడు, కోపంతో వారి శరీరాల్లోకి ప్రవేశించి, వారి సౌందర్యాన్ని నాశనం చేశాడు, వారిని అందవిహీనంగా, వికలాంగులుగా మార్చేశాడు.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA

కామెంట్‌లు లేవు: