4, ఫిబ్రవరి 2026, బుధవారం

LKG నుండి PG వరకు

 ▪️ తల్లి తండ్రులు లేని పిల్లలు  ఎవరయినా  ఉంటే వారికి ప్రముఖ సంస్థ అయిన Hyderabad *Amma Jyothi Foundation* వారు 1వ తరగతి నుండి వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది వారికి అన్ని ఉచితం 


* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


1.నో హాస్టల్ ఫీజు

2.నో స్కూల్ ఫీజు

3 నో కాలేజ్ ఫీజు.

4.నో బిల్డింగ్ ఫీజ్. 


📘 *ముఖ్య గమనిక:* 

తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే *Amma Jyothi Foundation*  సంస్థ వారికి మంచి భవిష్యత్తు ఇస్తుంది.


*హాస్టల్ ఫీజు ఉచితం

*మెస్ ఫీజు ఉచితం

* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


📞 వివరాలకు సెల్:

*9490043272*

9573411887


ఇతర గ్రూపులకు పంపండి

పేద విద్యార్దులకు  సహాయంచేయండి.

మనకు అవసరము లేకపోవచ్చు, 

కానీ అనాధ పిల్లలకు చాలా అవసరం ఉండవచ్చు. పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!🙏

పంచాంగం

 


శివనామమ్ము సమస్త మానవులకుం

  *శివనామమ్ము సమస్త  మానవులకుం జేcదౌను భావింపగన్*

ఈ సమస్యకు నా పూరణ. 


ధవుగా గోరితి  జేతునే తపమునే  తప్పెన్నగా వచ్చితే


భవుడే భస్మపుధారియైన సరియే భాగ్యంబు మాదౌనులే


శివనామమ్ము సమస్త మానవులకుం -  జేcదౌను భావింపగన్


భవదీయమ్మగు బోధలున్ వినినచో  వల్లించగా నాస్తికా!



అల్వాల లక్ష్మణ మూర్తి.

04ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌷బుధవారం🌷*

 *🪷04ఫిబ్రవరి2026🪷*      

   *దృగ్గణిత పంచాంగం*                 


          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : తదియ* ‌రా 12.09 వరకు ఉపరి *చవితి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : పుబ్బ* రా 10.12 ఉపరి *ఉత్తరఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : అతిగండ* రా 01.05 వరకు ఉపరి *సుకర్మ(

*కరణం  : వణజి* మ 12.19 *భద్ర* రా 12.09 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.15 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *మ 03.48-05.24*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : ఉ 06.11 - 07.47*

*దుర్ముహూర్తం  :ప 11.58- 12.44*

*రాహు కాలం   :మ 12.21-01.47*

గుళికకాళం      : *ఉ 10.55 - 12.21*

యమగండం    :*ఉ 08.03 - 09.29*

సూర్యరాశి : *మకరం*                  

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 06.47* 

సూర్యాస్తమయం :*సా 06.13*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం        :*ఉ 06.38- 08.55*

సంగవ కాలం       :*08.55 - 11.13*

మధ్యాహ్న కాలం   :*11.13 - 01.30*

అపరాహ్న కాలం   :*మ 01.30-03.48*

*ఆబ్ధికం తిధి  :మాఘ బహుళ తదియ*

సాయంకాలం     :*సా03.48- 06.05*

ప్రదోష కాలం      :*సా 06.05 - 08.36*

రాత్రి కాలం         :*రా 08.36- 11.56*

నిశీధి కాలం        :*రా 11.56- 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57- 05.47*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷శ్రీ సరస్వతీ శ్లోకం🌷*


*శుద్ధస్ఫటికరూపాయై* 

*సూక్ష్మరూపే నమో నమః*

*శబ్దబ్రహ్మి చతుర్హస్తే* 

*సర్వసిద్ధ్యై నమో నమః*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మాఘ పురాణం - 17వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷బుధవారం 4 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 17వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *4వ తేదీ బుధవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

```

మాఘ పురాణం పదిహేడవ అధ్యాయంలో… 

ఒకప్పుడు, ఇంద్రుడు ఒక ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి శాపం పొందాడు.

ఆ శాపం వలన అతనికి గాడిద ముఖం వచ్చింది. సిగ్గుతో, అతను పద్మగిరి గుహలో దాక్కున్నాడు. దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించి ఇంద్రుని శాప విముక్తి గురించి అడిగారు. 

శ్రీమహావిష్ణువు మాఘమాస స్నాన మహిమను వివరించి, గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే శాపం నుండి విముక్తి పొందుతాడని చెప్పాడు. 

తన మాటలకు బలపరిచే ఉదాహరణగా, విశ్వామిత్రుని కథను కూడా చెప్పాడు…

ఒకసారి, విశ్వామిత్రుడు ఒక గంధర్వ స్త్రీతో కామ క్రీడలలో లీనమై తన తపస్సును కోల్పోయాడు. శాపం వలన అతనికి కోతి ముఖం వచ్చింది. కానీ, మాఘమాస స్నానం చేసి శ్రీమహావిష్ణువును ధ్యానించడం ద్వారా అతను శాపం నుండి విముక్తి పొందాడు. 

శ్రీమహావిష్ణువు సలహా మేరకు, దేవతలు గాడిద ముఖంతో ఉన్న ఇంద్రునిచే మాఘమాస స్నానం చేయించారు. దాని ఫలితంగా, ఇంద్రుడు తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన దివ్య శక్తులను పొందాడు. ఈ కథ మాఘమాస స్నానం యొక్క పుణ్య మహిమను మరియు భక్తి శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది...

```

*ఇంద్రునికి కలిగన శాపము*```


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. “రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము... ‘పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగానది తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభం అగును. అటువంటి  మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాప నాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతః కాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడు అయినట్టుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు..

పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను అధ్యయనం చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి, ఆమె ఒక నాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహ పరవశుడయ్యెను. 


ఆమెను ఎటులనైనా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు 

ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను.


మిత్రవింద ముని తెల్లవారు జామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశమై ఇంద్రుని పొందుకు  అంగీకరించెను, కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్లేందుకు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవు ఎవడవని అడిగెను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవు అయి స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగా నదీ తీరమును చేరి అక్కడ తపము ఆచరించి యోగ శక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను.

ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజైన ఇంద్రుడు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరముల యందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసము అగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి.


మాఘమాస మహిమను ముచ్చటించు కొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారిట్లనిరి. దేవతలారా వినుము మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకమునందు స్నానము చేయుట శ్రీమహా విష్ణు పూజ, పురాణ పఠనము, యధా శక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘ శుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిల దానము ఆవూప దానము, పాయస దానము, వస్త్రకంబళముల దానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహా విష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు, మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి.

దేవతలును దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను.


మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి.

స్వామీ! నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులు అయినారు. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ! అటువంటి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు.


పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును యెరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వ వ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉర్దవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై, పూర్వమువలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు, కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.


దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వస్ధుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపి ముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాస కాలము అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి.

అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆసక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను అతని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వుడి భార్య మాఘ స్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ  విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ  కామక్రీడలలో తేలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామ వాంఛకు లోనై నీ తపశ్శక్తిని అంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

దేవతలారా! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*మాఘపురాణం పదిహేడవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మళ్లీ మనకే ఓటేస్తారు

 ఒక రోజు హిట్లర్ ఒక కోడిని తీసుకుని కేబినెట్ సమావేశానికి వచ్చాడు. ఆ కోడి తలను తన చేతి కింద బిగించి పట్టుకున్నాడు. నడుస్తూనే, కోడి ఈకలను ఒక్కొక్కటిగా పీకడం మొదలుపెట్టాడు. కోడి తీవ్ర వేదనతో కేకలు వేస్తూ, తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ హిట్లర్ దానిని వదలలేదు; దాని అరుపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈకలు పీకుతూనే ఉన్నాడు. అది చూసిన కేబినెట్ సభ్యులు అన్నారు:


“పాపం ఆ జీవిన ఆలా హింసించకండి. దానిని వదిలేయండి.”


కానీ హిట్లర్ ఎవరి మాట వినలేదు. చివరికి ఆ కోడి ఈకలన్నీ పీకేసి, దాన్ని నేల మీదకు విసిరేశాడు. 


తర్వాత తన జేబులోంచి కొంత ధాన్యం తీసి, ఆ కోడికి వేయడం ప్రారంభించాడు. 


ఆ స్థితిలో, ఆకలితో అలమటిస్తున్న ఆ కోడి మళ్లీ హిట్లర్ చేతి వైపే చూడటం మొదలుపెట్టింది.


హిట్లర్ దానిని దగ్గరకు పిలుస్తూ ధాన్యం చూపించాడు. కొద్దిసేపటికి ఆ కోడి అతని దగ్గరకు వచ్చి కూర్చొని, ఆ కొద్ది ధాన్యాన్ని తినడం ప్రారంభించింది. 


ఇప్పటివరకు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదే కోడి, ఇప్పుడు మళ్లీ అతని పక్కనే కూర్చుంది. కేవలం కొద్దిపాటి ధాన్యం కోసం..! 

దాన్ని చూసి కేబినెట్ సభ్యులు ఆశ్చర్యంతో అడిగారు:


“ఇది ఏమిటి?”


అప్పుడు హిట్లర్ అన్నాడు:

“ఓటర్లు కూడా ఇలాగే ఉంటారు. నాలుగున్నర సంవత్సరాల పాటు మనం వాళ్ల ఈకలు పీకుతాం. 

ఆ తర్వాత, చివరి ఆరు నెలల్లో కొద్దిపాటి ధాన్యం వేస్తాం. ఆ కొద్దిపాటి లాభాలకోసం, నాలుగున్నర సంవత్సరాల అన్యాయాలను ఓటర్లు మర్చిపోయి, మళ్లీ మనకే ఓటేస్తారు..!

జీవితం నీ ఇష్టం

  మనం బ్రతికున్నపుడే అన్ని హంగులు, ఆర్భాటాలు..

నువ్వు చచ్చాక నిన్ను 'శవం' అనే అంటారు. 'ఆ శవాన్ని ఇటు తీసుకురండి ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి' అనే అంటారు.. నువ్వు బతికినప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ నీ సంతోషాలని, నీ ఆనందాలని దూరం చేసుకున్నావో అదే జనాలు,నువ్వు చచ్చిన మరు క్షణం నుంచే నిన్ను పేరుతో పిలవటం మర్చిపోతారు. ఆ రోజు నువ్వో 'శవం'. కాల్చినాక గంట కూడా నీ కోసం ఎవరూ ఉండరక్కడ. నిన్ను పూడ్చిన పది నిమిషాలు కూడా ఎవరూ నీ కోసం వెయిట్ చేయరు. 

అందుకే నువ్వు నీ కోసం బతుకు..

నీలా బతుకు.. నీకిష్టమొచ్చినట్టు బతుకు..

నిజమే చెప్పు. ఇష్టముంటే అవునను.. లేదంటే కాదను.

నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్. నీ జీవితం నీ ఇష్టం..నీ లక్ష్యం.. నీ ఆశయంనీ జీవితం అంతే..


అనాయాసేన మరణం

వినా దైన్యేన జీవనం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పార్వతీపతి


 అనాయాసేన మరణం - ఎటువంటి బాధ లేకుండా మరణం

  వినా దైన్యేన జీవనం - ఇతరులపై ఆధారపడని జీవితాన్ని 

 దేహాంతే తవ సాన్నిధ్యం - అంతిమ సమయంలో నీ సన్నిధిని చేర్చమని 

 దేహిమే పార్వతీపతి - శివా! ఈ మూడు వరాలని ప్రసాదించమని ప్రార్థన..


✨ దేవుడు చాలా తెలివైనోడు


బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే,

తీసి స్కూల్‌లో వేస్తాడు. టెన్షన్ మొదలవుతుంది.


స్కూల్ అయిపోయి, కాలేజ్‌లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే,

బాధ్యతలు గుర్తు చేస్తాడు.


సరే, జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే,

డబ్బు మీద ఆశను పెంచుతాడు.


డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే,

ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు.


మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు,

భార్యను పంపిస్తాడు.


సరే, భార్యా పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే,

పిల్లల భవిష్యత్తు అంటాడు.


పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే,

ప్రేమను కోల్పోతున్నావని గుర్తు చేస్తాడు.


కానీ మనిషి దేవుడి మాట వినడు.

కట్టలకొద్దీ పైసలు కూడబెడతాడు.


“హమ్మయ్య!” అని ఇంటికి తిరిగి వచ్చేసరికి,

వాడితో మాట్లాడటానికి ఎవరూ ఉండరు.


పిల్లలు పెద్దవాళ్లవుతారు. సరే, పిల్లలకు పెళ్లి చేసి వాళ్ల పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాళ్లు వాళ్ల భవిష్యత్తు అని ఎగిరిపోతారు.


కొంతమంది పిల్లలు ఇంకో అడుగు ముందుకేసి

వృద్ధాశ్రమంలో పడేస్తారు.


శక్తి క్షీణించి ఏమీ చేయలేని ముసలితనంలో

జీవితం కళ్ల ముందే తిరుగుతుంది.


తెలియకుండానే కళ్లలో నీరు తిరుగుతుంది.


అప్పుడు వస్తాడు దేవుడు 

“ఏడ్చింది చాలు నాయనా!

నీ టైం అయిపోయింది వెళ్దాం పదా!”

అని తీసుకెళ్లిపోతాడు..


ఓ కనస్ట్రక్షన్ కంపెనీ సూపర్ వైజర్ 16 వ ఫ్లోర్ నుంచి క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వర్కర్ ని పిలుద్దామని ప్రయత్నిస్తున్నాడు..

ఓయ్.. వీరన్నా.. వీరన్నా.. అని గట్టిగా అరుస్తూ

కానీ.. ఆ శబ్ధాలకు.. ఈ సూపర్ వైజర్ పిలుపు అతనికి వినపడటం లేదు.


అపుడు అతని అటెక్షన్ కోసం.. ఏం చేయాలా అని ఆలోచించి.. ఓ పది రూపాయల నోటుని క్రిందకు విసిరాడు ఆ వర్కర్ మీదకు. ఆ కార్మికుడు దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని, కొద్దిగా కూడా తల పైకి ఎత్తకుండా తన పని కంటిన్యూ చేస్తున్నాడు.. 


దాంతో ఈ సారి.. పెద్ద మొత్తంగా ఓ 500 నోటుని క్రిందకి పడేసాడు.. అప్పుడు కూడా వర్కర్ ఏం పట్టించుకోకుండా సీరియస్ గా దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని పనిచేసుకుంటున్నాడు.


అప్పుడూ ఒళ్లు మండిన సూపర్ వైజర్.. ఇది కాదు అని.. ఓ చిన్న రాయి తీసుకుని వర్కర్ మీదకు విసిరాడు. ఈ సారి.. ఆ దెబ్బ తిన్న వర్కర్ తల పైకెత్తి ఎవరు విసిరారా అని కోపంగా చూసాడు. అప్పుడు పైన సూపర్ వైజర్ కనపడ్డాడు.


అచ్చం అలాగే జీవితంలో కూడా భగవంతుడు పై నుంచి మనతో కనెక్టు అవుదామని, కమ్యునికేట్ చేద్దామనుకున్నప్పుడు ఇలాగే ప్రయత్నిస్తాడు.


కానీ క్రింద ప్రాపంచిక (డబ్బు, పదవి, కీర్తి, మోహం, బంధం) అనే విషయాలతో బిజీగాఉంటాం మనం.


అప్పుడు ఆయన మనకు చిన్నవి, పెద్దవి (డబ్బు, పదవి, కీర్తి, మోహం, బంధం) అనే బహుమతులు ఇస్తాడు.. అప్పుడైనా చూస్తామేమోనని.. 


అయితే మనం వాటిని చక్కగా తీసుకుని వాటిని ఎంజాయ్ చేస్తూంటాం కానీ ఎవరు పంపారా అని పట్టించుకోం..


 భగవంతునికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పం . 

మన అదృష్టం బాగుంది. భలే లక్కి అని మనం మురిసిపోతాం..


అప్పుడు ఆయన ఆఖరి ప్రయత్నంగా ఓ రాయిని మన మీదకు విసురుతాడు. దాన్ని మనం సమస్య అంటూంటాం. 


అప్పుడు ఎవరు విసిరారా దాన్ని చూసి, అప్పుడు కమ్యూనికేట్ చేయటం మొదలెడతాం.. పూజలతో.. దేవుడా.. రక్షించు.ఆదిత్యయోగీ.

 ఈ మ్రొక్కుబడి తీరుస్తానని.. హుండీలో కోట్లు గుమ్మరించడం.. అలా కష్టాల్లో ఉన్నపుడు భక్తులుగా మారడం అనేది వ్యాపారిక భక్తి అవుతుంది..


దేవుడిచ్చినా.. ఇవ్వకపోయినా.. ఉన్న దాంతో సంతృప్తి చెంది.. నిత్యం దైవస్మరణ చేయడం అలవాటు చేసుకోవడం వలన భగవంతుడు తప్పక కనెక్ట్ అవుతాడు..


ఇదే సగటు మనిషి బతుకుతున్న జీవితం..

ఒక్కడున్నాడు! 

మనందరికి ఒక్కడున్నాడు! 

మనకై వున్నాడు! 

మన మనుగడకై వున్నాడు!! 


మన కర్మల జన్మల

అనంతమైన కష్టాలు తీర్చే!

అనంతమైన కరుణతో !! 

ఆదిదేవుడు మహాదేవుడు

 శివుడు మన కోసందక్షత' అంటే సామర్థ్యం, నైపుణ్యం, లేదా పనిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి (Efficiency/Skill) అని అర్థం. ఇది పరిపాలనలో చురుకుదనాన్ని, బాధ్యతను, మరియు పనితీరులోని పరిణితిని సూచిస్తుంది. ఇది సాధారణంగా వ్యాపార, పరిపాలనా, లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని వర్ణించడానికి ఉపయోగించే పదం. 

దక్షత గురించి ముఖ్యమైన అంశాలు:

నిర్వచనం: ఏదైనా పనిని తక్కువ సమయంలో, నాణ్యతతో, మరియు ఖచ్చితత్వంతో పూర్తి చేయగల సామర్థ్యాన్ని దక్షత (Competence) అంటారు.

పరిపాలనా దక్షత: నాయకులు లేదా అధికారులు క్లిష్టమైన పరిస్థితులను, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడాన్ని పరిపాలనా దక్షత అంటారు.

నైపుణ్యం: దక్షత అనేది కేవలం పని చేయడం మాత్రమే కాదు, దానిలో నైపుణ్యాన్ని (Skill) ప్రదర్శించడం.

మహిళా దక్షత సమితి: ఇది మహిళల సమస్యలపై పనిచేసే ఒక సంస్థ. 

దక్షత అనేది పనితీరులో చురుకుదనం మరియు పనిని సులభంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. వున్నాడు.


శివా! నీ దయ 


హర హర మహాదేవ శంభో శంకర! 

శివ శివ మహాదేవ శంభో శంకర! 


శివోహం శివోహం 🙏

పంచాంగం 04.02.2026 Wednesday,

  ఈ రోజు పంచాంగం 04.02.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష తృతీయ తిథి సౌమ్య వాసర పూర్వఫల్గుని నక్షత్రం అతిగండ యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు. 

  


శ్రాద్ధ తిథి: తృతీయ


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 19*


*లీనస్థితిమునిహృదయే ధ్యానస్తిమితం తపస్యదుపకంపమ్ |*

*పీనస్తనభరమీడే మీనధ్వజ తంత్రపరమతాత్పర్యమ్ ॥*


*భావము :*


*అమ్మా! నీవు అంతర్ముఖ సమారాధ్యవు. కాంచీపురములో తపస్సు చేస్తున్న నిన్ను, యోగులు మానసికముగా దర్శించారు. ఆ రూపమునే నేను కూడా దర్శించి ధ్యానము చేస్తున్నాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ ।

నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 57 ।।


ప్రతిపదార్థ:


యః — ఎవరైతే; సర్వత్ర — అన్ని పరిస్థితులలో; అనభిస్నేహః — మమకారం/ఆసక్తి లేకుండా; తత్-తత్ — వాటి వాటి; ప్రాప్య — పొంది; శుభ — మంచి; అశుభమ్ — చెడు; న, అభినందంతి — హర్షింపడు; న, ద్వేష్టి — ద్వేషింపడు; తస్య — అతని; ప్రజ్ఞా — జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమైనది


 తాత్పర్యము :


ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని.

  

 వివరణ:


రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ప్రఖ్యాత బ్రిటిష్ కవి, 'స్థిత ప్రజ్ఞత' గూర్చి ఉన్న ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని తన ఈ 'If' అనే ప్రసిద్ధమైన కావ్యంలో పొందుపరిచాడు. ఆ కవిత నుండి కొన్ని పంక్తులు ఇవిగో:


If you can dream—and not make dreams your master;

If you can think—and not make thoughts your aim,

If you can meet with Triumph and Disaster

And treat those two impostors just the same…

If neither foes nor loving friends can hurt you,

If all men count with you, but none too much:

If you can fill the unforgiving minute

With sixty seconds’ worth of distance run,

Yours is the Earth and everything that’s in it,

And—which is more—you’ll be a Man, my son!


 


ఈ పద్యం యొక్క ప్రజాదరణ ద్వారా, శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ జ్ఞానోదయ స్థితిని చేరుకోవాలనే సహజమైన తపన జనులకు ఎంతగా ఉందో తెలుస్తోంది. శ్రీ కృష్ణుడు విశదీకరించిన జ్ఞానోదయ స్థితినే ఒక ఆంగ్ల కవి ఎలా చెప్పాడనే ఆశ్చర్యం మనకు కలుగవచ్చు. నిజానికి జ్ఞానోదయ వాంఛ అనేది ఆత్మ యొక్క అంతర్గత స్వభావం. అందుకే, ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో, ప్రతి ఒక్కరూ, తెలిసినా తెలవకపోయినా దానిని కోరుకొంటారు. శ్రీ కృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా, దానిని ఇక్కడ వర్ణిస్తున్నాడు.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - తృతీయ - పూర్వాఫల్గుని -‌‌ సౌమ్య వాసరే* (04.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





https://youtu.be/oc8ECG3IoGk?feature=shared




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం