4, ఫిబ్రవరి 2026, బుధవారం

జీవితం నీ ఇష్టం

  మనం బ్రతికున్నపుడే అన్ని హంగులు, ఆర్భాటాలు..

నువ్వు చచ్చాక నిన్ను 'శవం' అనే అంటారు. 'ఆ శవాన్ని ఇటు తీసుకురండి ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి' అనే అంటారు.. నువ్వు బతికినప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ నీ సంతోషాలని, నీ ఆనందాలని దూరం చేసుకున్నావో అదే జనాలు,నువ్వు చచ్చిన మరు క్షణం నుంచే నిన్ను పేరుతో పిలవటం మర్చిపోతారు. ఆ రోజు నువ్వో 'శవం'. కాల్చినాక గంట కూడా నీ కోసం ఎవరూ ఉండరక్కడ. నిన్ను పూడ్చిన పది నిమిషాలు కూడా ఎవరూ నీ కోసం వెయిట్ చేయరు. 

అందుకే నువ్వు నీ కోసం బతుకు..

నీలా బతుకు.. నీకిష్టమొచ్చినట్టు బతుకు..

నిజమే చెప్పు. ఇష్టముంటే అవునను.. లేదంటే కాదను.

నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్. నీ జీవితం నీ ఇష్టం..నీ లక్ష్యం.. నీ ఆశయంనీ జీవితం అంతే..


అనాయాసేన మరణం

వినా దైన్యేన జీవనం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పార్వతీపతి


 అనాయాసేన మరణం - ఎటువంటి బాధ లేకుండా మరణం

  వినా దైన్యేన జీవనం - ఇతరులపై ఆధారపడని జీవితాన్ని 

 దేహాంతే తవ సాన్నిధ్యం - అంతిమ సమయంలో నీ సన్నిధిని చేర్చమని 

 దేహిమే పార్వతీపతి - శివా! ఈ మూడు వరాలని ప్రసాదించమని ప్రార్థన..


✨ దేవుడు చాలా తెలివైనోడు


బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే,

తీసి స్కూల్‌లో వేస్తాడు. టెన్షన్ మొదలవుతుంది.


స్కూల్ అయిపోయి, కాలేజ్‌లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే,

బాధ్యతలు గుర్తు చేస్తాడు.


సరే, జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే,

డబ్బు మీద ఆశను పెంచుతాడు.


డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే,

ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు.


మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు,

భార్యను పంపిస్తాడు.


సరే, భార్యా పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే,

పిల్లల భవిష్యత్తు అంటాడు.


పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే,

ప్రేమను కోల్పోతున్నావని గుర్తు చేస్తాడు.


కానీ మనిషి దేవుడి మాట వినడు.

కట్టలకొద్దీ పైసలు కూడబెడతాడు.


“హమ్మయ్య!” అని ఇంటికి తిరిగి వచ్చేసరికి,

వాడితో మాట్లాడటానికి ఎవరూ ఉండరు.


పిల్లలు పెద్దవాళ్లవుతారు. సరే, పిల్లలకు పెళ్లి చేసి వాళ్ల పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాళ్లు వాళ్ల భవిష్యత్తు అని ఎగిరిపోతారు.


కొంతమంది పిల్లలు ఇంకో అడుగు ముందుకేసి

వృద్ధాశ్రమంలో పడేస్తారు.


శక్తి క్షీణించి ఏమీ చేయలేని ముసలితనంలో

జీవితం కళ్ల ముందే తిరుగుతుంది.


తెలియకుండానే కళ్లలో నీరు తిరుగుతుంది.


అప్పుడు వస్తాడు దేవుడు 

“ఏడ్చింది చాలు నాయనా!

నీ టైం అయిపోయింది వెళ్దాం పదా!”

అని తీసుకెళ్లిపోతాడు..


ఓ కనస్ట్రక్షన్ కంపెనీ సూపర్ వైజర్ 16 వ ఫ్లోర్ నుంచి క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వర్కర్ ని పిలుద్దామని ప్రయత్నిస్తున్నాడు..

ఓయ్.. వీరన్నా.. వీరన్నా.. అని గట్టిగా అరుస్తూ

కానీ.. ఆ శబ్ధాలకు.. ఈ సూపర్ వైజర్ పిలుపు అతనికి వినపడటం లేదు.


అపుడు అతని అటెక్షన్ కోసం.. ఏం చేయాలా అని ఆలోచించి.. ఓ పది రూపాయల నోటుని క్రిందకు విసిరాడు ఆ వర్కర్ మీదకు. ఆ కార్మికుడు దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని, కొద్దిగా కూడా తల పైకి ఎత్తకుండా తన పని కంటిన్యూ చేస్తున్నాడు.. 


దాంతో ఈ సారి.. పెద్ద మొత్తంగా ఓ 500 నోటుని క్రిందకి పడేసాడు.. అప్పుడు కూడా వర్కర్ ఏం పట్టించుకోకుండా సీరియస్ గా దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని పనిచేసుకుంటున్నాడు.


అప్పుడూ ఒళ్లు మండిన సూపర్ వైజర్.. ఇది కాదు అని.. ఓ చిన్న రాయి తీసుకుని వర్కర్ మీదకు విసిరాడు. ఈ సారి.. ఆ దెబ్బ తిన్న వర్కర్ తల పైకెత్తి ఎవరు విసిరారా అని కోపంగా చూసాడు. అప్పుడు పైన సూపర్ వైజర్ కనపడ్డాడు.


అచ్చం అలాగే జీవితంలో కూడా భగవంతుడు పై నుంచి మనతో కనెక్టు అవుదామని, కమ్యునికేట్ చేద్దామనుకున్నప్పుడు ఇలాగే ప్రయత్నిస్తాడు.


కానీ క్రింద ప్రాపంచిక (డబ్బు, పదవి, కీర్తి, మోహం, బంధం) అనే విషయాలతో బిజీగాఉంటాం మనం.


అప్పుడు ఆయన మనకు చిన్నవి, పెద్దవి (డబ్బు, పదవి, కీర్తి, మోహం, బంధం) అనే బహుమతులు ఇస్తాడు.. అప్పుడైనా చూస్తామేమోనని.. 


అయితే మనం వాటిని చక్కగా తీసుకుని వాటిని ఎంజాయ్ చేస్తూంటాం కానీ ఎవరు పంపారా అని పట్టించుకోం..


 భగవంతునికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పం . 

మన అదృష్టం బాగుంది. భలే లక్కి అని మనం మురిసిపోతాం..


అప్పుడు ఆయన ఆఖరి ప్రయత్నంగా ఓ రాయిని మన మీదకు విసురుతాడు. దాన్ని మనం సమస్య అంటూంటాం. 


అప్పుడు ఎవరు విసిరారా దాన్ని చూసి, అప్పుడు కమ్యూనికేట్ చేయటం మొదలెడతాం.. పూజలతో.. దేవుడా.. రక్షించు.ఆదిత్యయోగీ.

 ఈ మ్రొక్కుబడి తీరుస్తానని.. హుండీలో కోట్లు గుమ్మరించడం.. అలా కష్టాల్లో ఉన్నపుడు భక్తులుగా మారడం అనేది వ్యాపారిక భక్తి అవుతుంది..


దేవుడిచ్చినా.. ఇవ్వకపోయినా.. ఉన్న దాంతో సంతృప్తి చెంది.. నిత్యం దైవస్మరణ చేయడం అలవాటు చేసుకోవడం వలన భగవంతుడు తప్పక కనెక్ట్ అవుతాడు..


ఇదే సగటు మనిషి బతుకుతున్న జీవితం..

ఒక్కడున్నాడు! 

మనందరికి ఒక్కడున్నాడు! 

మనకై వున్నాడు! 

మన మనుగడకై వున్నాడు!! 


మన కర్మల జన్మల

అనంతమైన కష్టాలు తీర్చే!

అనంతమైన కరుణతో !! 

ఆదిదేవుడు మహాదేవుడు

 శివుడు మన కోసందక్షత' అంటే సామర్థ్యం, నైపుణ్యం, లేదా పనిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి (Efficiency/Skill) అని అర్థం. ఇది పరిపాలనలో చురుకుదనాన్ని, బాధ్యతను, మరియు పనితీరులోని పరిణితిని సూచిస్తుంది. ఇది సాధారణంగా వ్యాపార, పరిపాలనా, లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని వర్ణించడానికి ఉపయోగించే పదం. 

దక్షత గురించి ముఖ్యమైన అంశాలు:

నిర్వచనం: ఏదైనా పనిని తక్కువ సమయంలో, నాణ్యతతో, మరియు ఖచ్చితత్వంతో పూర్తి చేయగల సామర్థ్యాన్ని దక్షత (Competence) అంటారు.

పరిపాలనా దక్షత: నాయకులు లేదా అధికారులు క్లిష్టమైన పరిస్థితులను, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడాన్ని పరిపాలనా దక్షత అంటారు.

నైపుణ్యం: దక్షత అనేది కేవలం పని చేయడం మాత్రమే కాదు, దానిలో నైపుణ్యాన్ని (Skill) ప్రదర్శించడం.

మహిళా దక్షత సమితి: ఇది మహిళల సమస్యలపై పనిచేసే ఒక సంస్థ. 

దక్షత అనేది పనితీరులో చురుకుదనం మరియు పనిని సులభంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. వున్నాడు.


శివా! నీ దయ 


హర హర మహాదేవ శంభో శంకర! 

శివ శివ మహాదేవ శంభో శంకర! 


శివోహం శివోహం 🙏

కామెంట్‌లు లేవు: