ఒక రోజు హిట్లర్ ఒక కోడిని తీసుకుని కేబినెట్ సమావేశానికి వచ్చాడు. ఆ కోడి తలను తన చేతి కింద బిగించి పట్టుకున్నాడు. నడుస్తూనే, కోడి ఈకలను ఒక్కొక్కటిగా పీకడం మొదలుపెట్టాడు. కోడి తీవ్ర వేదనతో కేకలు వేస్తూ, తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ హిట్లర్ దానిని వదలలేదు; దాని అరుపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈకలు పీకుతూనే ఉన్నాడు. అది చూసిన కేబినెట్ సభ్యులు అన్నారు:
“పాపం ఆ జీవిన ఆలా హింసించకండి. దానిని వదిలేయండి.”
కానీ హిట్లర్ ఎవరి మాట వినలేదు. చివరికి ఆ కోడి ఈకలన్నీ పీకేసి, దాన్ని నేల మీదకు విసిరేశాడు.
తర్వాత తన జేబులోంచి కొంత ధాన్యం తీసి, ఆ కోడికి వేయడం ప్రారంభించాడు.
ఆ స్థితిలో, ఆకలితో అలమటిస్తున్న ఆ కోడి మళ్లీ హిట్లర్ చేతి వైపే చూడటం మొదలుపెట్టింది.
హిట్లర్ దానిని దగ్గరకు పిలుస్తూ ధాన్యం చూపించాడు. కొద్దిసేపటికి ఆ కోడి అతని దగ్గరకు వచ్చి కూర్చొని, ఆ కొద్ది ధాన్యాన్ని తినడం ప్రారంభించింది.
ఇప్పటివరకు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదే కోడి, ఇప్పుడు మళ్లీ అతని పక్కనే కూర్చుంది. కేవలం కొద్దిపాటి ధాన్యం కోసం..!
దాన్ని చూసి కేబినెట్ సభ్యులు ఆశ్చర్యంతో అడిగారు:
“ఇది ఏమిటి?”
అప్పుడు హిట్లర్ అన్నాడు:
“ఓటర్లు కూడా ఇలాగే ఉంటారు. నాలుగున్నర సంవత్సరాల పాటు మనం వాళ్ల ఈకలు పీకుతాం.
ఆ తర్వాత, చివరి ఆరు నెలల్లో కొద్దిపాటి ధాన్యం వేస్తాం. ఆ కొద్దిపాటి లాభాలకోసం, నాలుగున్నర సంవత్సరాల అన్యాయాలను ఓటర్లు మర్చిపోయి, మళ్లీ మనకే ఓటేస్తారు..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి