10, మే 2026, ఆదివారం

అద్భుతమైన కథ..!! ❤️

L

                         

 *ఒక అద్భుతమైన  కథ..!! ❤️*


రాత్రి 11 గంటలకు.  తాళం వేసిఉన్న ఇనుప ద్వారం  బయట నుండి ఒక పిలుపు.  ఎవరా అని వచ్చి చూశాను.  గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు.  చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన  బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి  ఉన్నారు.  అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు.  "అవును నేనే ఆనంద్.  ఇదే చిరునామా.  మీరూ ..." అని అడిగాను.  అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో  తడుపుకుంటూ "బాబూ!  నేను మీ నాన్నగారి మిత్రుడిని.  మీ ఊరినుండే వస్తున్నాను...!


నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు..!


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను.  అందులో "ప్రియమైన ఆనంద్!  నీకు నా ఆశీర్వాదములు.  ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు.  పేరు రామయ్య.  చాలా కష్టజీవి.  కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్  లో చనిపోయాడు...!


  నష్టపరిహారం  కోసం తిరుగుతున్నాడు.  అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది.  ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి  నీకు పంపాను.  డబ్బులు Head Office  లో తీసుకోమన్నారు...!


  ఆయనకు హైదరాబాద్  కొత్త.  ఏమి తెలియదు.  నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను.  ఆరోగ్యం జాగ్రత్త.  కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది..! 


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు.  ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను.  మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను.  "లేదు బాబూ.  ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని  చెప్పారు..!


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.  "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను...!


 నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు.  నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు..!


 అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది.  కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.  సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది.  నా కళ్ళలో నీళ్లు తిరిగాయి..!


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు.  అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు.  ఇతడు మాత్రమే మాకు మిగిలాడు.  పేరు మహేష్.  కష్టపడి చదివించాను.  బాగా చదువుకుని  ఉద్యోగం సంపాదించుకున్నాడు.  మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు.  ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది...!


 అక్కడికక్కడే చనిపోయాడు.  నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము.  కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది..!


  నా భార్య ఆరోగ్యం బాగా  లేదు.  మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను.  నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన..! 


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు.. 


పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము..!


  దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము.  "ఆనంద్!  ఇక నేను చూసుకుంటాను.  నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన.  "పర్లేదండి.  నేను లీవ్ పెట్టాను" అన్నాను.  దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను...!


 చాలా థాంక్స్ బాబూ!  నేను ఊరికి బయల్దేరుతాను.  మా ఆవిడ ఒక్కతే  ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.  "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను..!


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ!  నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు.  ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి.  కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు..! 


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.  నా పేరు అరవింద్.  మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు.  ఆ చిరునామ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 km ప్రయాణం చేయాలి...!


  మీరేమో  అలసిపోయి ఉన్నారు.  అందుకే నేను నిజం చెప్పలేదు.  మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను.  ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట.  ఆ మిత్రుడికి విషయం చెప్పాను...!


అయన చాల బాధ పడ్డారు, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు.  మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది.   కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది..!


  నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను.  బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు.  ఆ మాటే చాలనుకున్నాను నేను.  పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు.  ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు..!


ఆకాశంలోకి చూశాను.  అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న.  "నాన్నా!  నా అభివృద్ధి  చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు!  ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా?  మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా!  మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను..!


సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు..!

మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి..!!


ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి....😔

*శ్రీ మహావిష్ణు పురాణం

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 10 మే 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

               *84 వ భాగం*


        *శ్రీరామావతారం-5*


సీతారామ కళ్యాణం:```

అయోధ్యలో దశరథుడు జనక మహారాజు దూత తెచ్చిన సందేశం “విశ్వామిత్ర మహర్షి ఆదేశంతో శ్రీరాముడు సీతాదేవి స్వయంవరంలో  శివధనుర్భంగం గావించి సీతాదేవి చేత వరింపబడ్డాడు” విని ఆనందపడ్డాడు.  కౌసల్య సుమిత్ర కైకేయిలకు చెప్పాడు. వారందరి ఆనందానికి అవధులు లేవు.


శుభ దినాన దశరథుడు కులగురువు వసిష్ట మహర్షి, భరత శత్రుఘ్నలు, బంధు మిత్రులు, ముఖ్య ప్రజలతో కలసి సీతరామ కళ్యాణం కోసం మిథిలానగరానికి బయలుదేరి వెళ్లారు.


జనకుడు తన బంధు మిత్ర పరివార జనంతో మిథిలానగర ముఖ ద్వారం వద్ద దశరథునికి, వచ్చిన అతిథులకి స్వాగతం పలికి  విడిది ఏర్పాట్లు చేసాడు.   విడిదిలో దశరథుడు వసిష్టునితో కలసి జనకునితో వివాహ లగ్నం గురించి చర్చిస్తున్నప్పుడు, జనకునికి మరో కుమార్తె ఊర్మిళ, జనక సోదరుడు- కుశధ్వజునికి మాండవి, శ్రుతకీర్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిసింది.  వారిని పిలిపించి దశరథుడు చూసాడు. తన కుమారులు భరత లక్ష్మణ శత్రుఘ్నలకు తగిన వధువులు అనిపించింది.


నలుగురి కుమారుల వివాహం ఒకేసారి చేయాలని తలచి జనకునితో మనస్సు లోని విషయం ప్రస్తావించాడు. జనకుని ఆనందానికి హద్దులేదు. కుశధ్వజుడు కూడా అంగీకరించాడు.   కులగురువు వసిష్టుడు, జనకుని పురోహితుడు శతానందుడు జాతకాలు పరిశీలించి భరతునికి మాండవితో, లక్ష్మణునికి ఊర్మిళతో, శత్రుఘ్నునికి శుత్రకీర్తితో వివాహం చేయవచ్చని తెలిపారు.


దశరథుడు, జనకుడు వెంటనే భరతుడు మాండవికి, లక్ష్మణుడు ఊర్మిళకు, శత్రుఘ్నడు  శుత్రకీర్తిలకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసి అభిప్రాయం అడిగారు.   

ఒకరికొకరు నచ్చి పెళ్ళి చేసుకోవడానికి వారు ఆనందంగా అంగీకరించారు. 


నాలుగు వివాహాలు ఒకే ముహుర్తానికి ఒకే వేదిక పై జరిపించాలని సుముహూర్తం నిశ్చయించారు. చైత్ర శుద్ద నవమి శ్రీరామచంద్రుని జన్మదినం. సీతారాముల కల్యాణానికి అదే శుభముహుర్తం అని పురోహితులు నిర్ణయించారు. నలుగురి అన్నదమ్ముల వివాహానికి ఆ ముహుర్తం సరైనది అని భావించి వివాహ ఏర్పాట్లు చేయసాగారు.  జనకుడు మగపెళ్ళివారి అంతస్థుకు తగినట్టు విడిది మందిరాలు ఏర్పాటు చేసాడు. 


భూలోకంలో సకల దేశ రాజులను వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు పంపారు. దేవలోక వాసులను పిలవడానికి నారద మహర్షి ఊర్ధ్వలోకాలకు వెళ్లాడు.  శ్రీ సీతరామ కళ్యాణం చూడటానికి దేవలోక భూలోక వాసులందరు ఆనందోత్సాహాలతో మిథిలకు తరలి రాసాగారు.


జనకుడు రంగ రంగ వైభవంగా వివాహ ఏర్పాట్లు చేశాడు. ఆకాశమంత పందిరి, వేదిక నిర్మించారు. వచ్చిన అతిథిలందరికి సంతృప్తి చెందేలా భోజనం, వసతి కల్పించారు. సుముహూర్తం రోజు రానే వచ్చింది. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలను  పెళ్లికుమారులుగా దశరథుని విడిది భవనంలో, సీతా ఊర్మిళ మాండవీ శ్రుతకీర్తులను జనకుని రాజభవనంలో పెళ్ళికుమార్తెలుగా  మంగళ స్నానాలు, అలంకరణలు చేసి కళ్యాణ వేదిక వద్దకు మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా నృత్య గానాలతో తీసుకువచ్చారు.


మిథిలానగర వాసులు భూమి పై, దేవ గంధర్వులు కిన్నెర కింపురుషులు ఆకాశం నుండి పెళ్లికుమారులు, పెళ్ళికుమార్తెల పై పూల వర్షం కురిపిస్తున్నారు. కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన వారిని వసిష్ట విశ్వమిత్రాది మహర్షులు, శతానందుడు వేద మంత్రాలు చదువుతూ వివాహ విధులు పూర్తి చేయించారు.


జనకుడు భార్య సునయనతో కలసి జానకిని, ఊర్మిళను శ్రీరామ లక్ష్మణులకు సాలంకృత కన్యాదానం చేశాడు. కుశధ్వజ దంపతులు మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రుఘ్నలకు సాలంకృత కన్యాదానం చేసారు. తరువాత పురోహితులు వధూవరుల చేత సప్తపది, అగ్నిహోమం మొదలైన వివాహ విధులు నిర్వర్తింప చేశారు.


చూచినవారందరికి కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం మహావైభవంగా జరిగింది. పరమేశ్వరుడు పార్వతీదేవి, బ్రహ్మదేవుడు సరస్వతీదేవి, ఇంద్రుడు శచీదేవి మరియు ఇతర దేవతలు తమ పత్నులతో అదృశ్యంగా వచ్చి నూతన వధువరులను పూలు అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. వసిష్ట విశ్వమిత్రాది మహర్షులు, అంగ వంగ కళింగ కాశీ తదితర రాజ్యాల రాజులు ఆశీస్సులు అభినందనలు తెలిపారు. కళ్యాణ మహోత్సవం తిలకించిన అతిథులందరు ఆనందంతో తమ తమ నివాస ప్రదేశాలకు తిరిగి వెళ్లారు.


మిథిలలో వివాహ తదనంతర విధులు పూర్తి చేసిన తర్వాత జనక దంపతులు, కుశధ్వజ దంపతులు తమ కుమార్తెలకు అప్పగింతలు జరిపి దశరథుడు, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నల వెంట ఒక పక్క వివాహ ఆనందం మరొక పక్క కుమార్తెలు దూరం అవుతున్నారన్న దుఖంతో వీడ్కోలు పలికారు.


నూతన వధువరులను స్వాగతం పలకడానికి అయోధ్యను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రజల హర్షధ్వానాల మధ్య, మంగళవాయుద్యాలు మధురంగా మ్రోగుతుంటే  శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలు తమ పత్నులు సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తిలతో,  దశరథుడు వసిష్టాది మహర్షులు బంధు పరివారం వెంటరాగా అయోధ్యలోకి ప్రవేశించారు.


రాచవీధులలో ప్రజలు పుష్ప వర్షం కురిపిస్తుంటే రథాలపై ప్రజలకు నమస్కరిస్తూ నూతన దంపతులు రాజభవనం చేరారు. సింహద్వారం వద్ద కౌసల్యా సుమిత్ర కైకేయిలు తమ కుమారులకు, కోడళ్ళకు మంగళహారతులతో స్వాగతం పలికి గృహప్రవేశం చేయించారు.


ఆనాటి నుండి  రాజభవనంతో పాటు అయోధ్య అంతా నిత్య పండుగ వాతావరణం నెలకొంది. దశరథుడు ఆనందోత్సాహాలతో గడుపుతున్నాడు. కొంతకాలం తర్వాత కైకేయి తండ్రి అనారోగ్యం పాలై మనవడిని చూడాలని కోరిక కలిగి తన కుమారుడిని అయోధ్య పంపాడు. మేనమామ వెంట భరతునితో పాటు శత్రుఘ్నని దశరథుడు కేకయ రాజ్యానికి పంపాడు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగం

 


హోమియోపతి వైద్యం

 ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

వాగర్థావివ సంపృక్తౌ

  


*వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే౹*

*జగతఃపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥*


అని కాళిదాసమహాకవి ఆదిదంపతులను ప్రార్థనచేశాడు. 


ఆ ఆదిదంపతులు ఎట్లా ఉంటారటంటే.....   వాక్కు అంటే పదము ఒక పదాన్ని అంటిపెట్టుకొని దాని అర్థం ఉంటుందో...  ఆ అర్థాన్ని పదం నుండి ఎలా విడదీయటం కుదరదో...  అర్థం నుండి పదాన్ని 

అదేవిధంగా ఎలా విడదీయటం కుదరదో... ఒకరికొకరు అవిభాజ్యంగా ఉంటారుట. అదే అర్థనారీశ్వరతత్త్వం. 


ఇది ఆదిదంపతుల విషయంలో చెప్పబడినా.... ప్రతి ఒక్క మానవదంపతులకు కూడా వర్తిస్తుంది. 


మీరన్నట్లు శరీరం భౌతికం అంటూ భౌతికతత్త్వంతో చూడకూడదు. మానవునిలో "చిత్" అనే పేరుకలిగిన శక్తి ఒకటి ఉంటుంది. అది అమ్మవారి/భగవంతుడి శక్తి. ఈ "చిచ్ఛక్తి" పురుషులలో హృదయంలో కుడివైపున ఉంటే స్త్రీలలో హృదయంలో ఎడమవైపున ఉంటుంది. 


ఈ రెండింటి కలయికతోనే సృష్టి పరిపూర్ణమౌతుంది. 



_అమ్మ ప్రేమ , నాన్న ఆధారం

 _మాతా గురుతరా భూమేః పితా స్వర్గస్య దుర్లభః ।_

_తయోః పూజా పరం తీర్థం త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥_


తల్లి భూమికంటే గొప్పది. తండ్రి స్వర్గానికంటే దుర్లభుడు, మహోన్నతుడు. అట్టి తల్లిదండ్రులను సేవించడం, పూజించడం మూడు లోకాలలో ప్రసిద్ధమైన పరమ పవిత్ర తీర్థయాత్రతో సమానం. తల్లి ప్రేమకు హద్దులుండవు. తండ్రి త్యాగానికి కొలమానం ఉండదు. వీరిద్దరూ కలిసే జీవితం నిర్మాణకర్తలు. వారిని విడిగా చూసే కన్నా, ఒకటిగా పూజించడం భారతీయ సంస్కృతి నేర్పిన మహత్తర ధర్మం.


చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న విషయం ఒకటి గుర్తుకొచ్చింది 


_అమ్మ ప్రేమ అయితే, నాన్న ఆధారం._

_అమ్మ కరుణ అయితే, నాన్న కర్తవ్యం._


*మాతా పితరో నిత్యం పూజనీయౌ ప్రయత్నతః ।*

*తయోః ప్రసాదసిద్ధ్యర్థం సర్వం శ్రేయః ప్రవర్తతే ॥*


🙏🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - అష్టమి - ధనిష్ట -‌‌ భాను వాసరే* (10.05.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నమో నారాయణాయ నమః

  నమో నారాయణాయ నమః


గోవిందుడు గొప్ప తనంమనం వర్ణించగలమా?


ఆ లీలా వినోది అయి పార్ద సారధి తత్వం

మామూలు వాడికి అర్దమౌతుందా?

భగవంతుడితో ఎన్నో జన్మల అనుబంధం

ఉంటేనే స్వామి యందు కించిత్ భక్తి

మొలకెత్తుతుంది.ఏది ఎందుకుఎలా

చేస్తాడో పరమాత్మ ని అర్దంచేసుకోలేము.


గోపెమ్మలకోకలు మాయం

ద్రౌపది కి కోకలు సాయం

కృష్ణా!

నువ్వు అర్దంకావు


అన్నిటికీ మనసేమూలం మనసు స్వచ్చంగా ఉంటే భౌతిక మైన పూజాదికార్యక్రమాలు. లేకుండానే 

స్వామి సాక్షాత్కారం లభిస్తుంది. 


మనసు 

పాలకడలి అయి తే 

ప్రతి భావం

కృష్ణ లీలా తరంగమే!


                     ...........

జె.ఎల్. నరసింహం,హాస్యావధాని, హైదరాబాద్.

సూర్య స్తుతి

  🌸సూర్య స్తుతి🙏


సీ. కర్మసాక్షి కపిల కమలాప్త ఆదిత్య 

కాశ్యపేయ ఖలుడా! కావు మమ్ము 

గగనమణి ఖమణి గ్రహ పతి ఖచరుడా

దినమణి !దినపతి దీనబంధు 

దినకరా తిమిరారి దిననాధ భానుడా!

ధరణుడా కావుము ధాత్రినంత

నీరజ బంధుడ నెలజోడ మిత్రుడా!

భాస్కర రావయ్యబాధ

 తీర్ప

తేగీ ..వసుధలోజనులుచలికివణుకుచు నిక

 దిక్కుతోచక యుండిరి దీనబంధు

నీదు దర్శన భాగ్యము నేడు లేదు 

కశ్యపాత్మజ కదలిరా! కమల బంధు!


సాహితీ శ్రీ జయలక్ష్మి

Mantra - 35

  Mantra - 35 ARUNAM 4 anuvaakam


‘సూర్యుడు మంచును చీల్చి ప్రకాశించినట్లు, నీ జ్ఞాననేత్రం అజ్ఞాన పొరలను చీల్చి పరమ సత్యాన్ని దర్శించాలి’ అని నిన్నటి మంత్రం ఉపదేశిస్తే, ఈ రోజు ఈ క్రిందటి మంత్రం ప్రకృతిలో సంభవించే ఋతు మార్పులను, ముఖ్యంగా శిశిర ఋతువు (శీతాకాలం చివర) నాటి వాతావరణాన్ని మరియు ఆ సమయంలో సంభవించే ఉరుములు, మెరుపుల విశిష్టతను వివరిస్తుంది.


"దుర్భిక్షం దేవలోకేషు |

మనూనాముదకం గృహే | 

ఏతా వాచః ప్రవదన్తీః। 

వైద్యుతో యాన్తి శైశిరీః||”


“దుర్భిక్షం దేవలోకేషు" - దేవలోకములలో (ఆకాశంలో) ఆహారానికి కొరత (దుర్భిక్షం) ఏర్పడినట్లుగా ఉంది.

శీతాకాలంలో మేఘాలు లేక ఆకాశం ఖాళీగా, నిర్మలంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది.


“మనూనాముదకం గృహే” - మనుష్యుల ఇళ్ళలో మాత్రం నీరు సమృద్ధిగా ఉంటుంది. అంటే వర్షాలు పడకపోయినా, భూమిలో ఇంకిన నీరు లేదా మంచు రూపంలో లభించే తేమ మనుష్యులకు అందుబాటులో ఉంటుందని అర్థం.


“ఏతా వాచః ప్రవదన్తీః” - ఈ మాటలు పలుకుతున్నట్లుగా…. అంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఉన్నాయి.


“వైద్యుతో యాన్తి శైశిరీః" - శిశిర ఋతువుకు సంబంధించిన మెరుపులు (వైద్యుతః) సంచరిస్తున్నాయి.

సాధారణంగా వర్షాకాలంలో వచ్చే మెరుపుల కంటే, శిశిర రుతువులో అరుదుగా వచ్చే మెరుపులు ఒక ప్రత్యేకమైన ధ్వనిని, కాంతిని కలిగి ఉంటాయి.


అరుణప్రశ్నలోని ఈ అనువాకం సూర్యుడు ఏ విధంగా వివిధ ఋతువులలో తన ప్రభావాన్ని చూపుతాడో వివరిస్తుంది. శిశిరంలో ఆకాశం 'దుర్భిక్షం' (మేఘరహితం) గా ఉన్నప్పటికీ, భూమిపై ప్రాణకోటి మనుగడకు అవసరమైన నీరు (మంచు లేదా భూగర్భ జలం) లభిస్తుంది. ఇది ఋతు వర్ణన.


‘వైద్యుతః’ (Lightning): మెరుపులను "వాక్కులు" (వాచః) గా వర్ణించడం ఇక్కడ విశేషం. మేఘాల ఘర్షణ వల్ల కలిగే ధ్వని, వెలుగు లోకానికి ఒక దివ్యమైన సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఋషి దర్శించాడు.


శిశిర రుతువుకు సంబంధించిన శక్తులను 'శైశిరీః' అని అంటారు. ఇవి రాబోయే వసంత ఋతువుకు సూచికలు. శైశిరీః అనేది వైదిక పదం.


ఈ మంత్రంలో "దేవలోకంలో దుర్భిక్షం" అని చెప్పడం వెనుక ఒక నిగూఢార్థం ఉంది. దేవతలు హవిస్సును (యజ్ఞ భాగాలను) ఆహారంగా స్వీకరిస్తారు. మేఘాలు లేని ఆకాశం దేవతలకు తృప్తినిచ్చే వర్షాన్ని ఇవ్వలేకపోవడాన్ని అలా వర్ణించి ఉండవచ్చు.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు ప్రకృతిని ఒక జీవకళా రూపంగా మనకు చూపిస్తాయి. 


తత్త్వ విచారణ: 

అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఈ వర్ణనను సాధకుని అంతర స్థితికి అన్వయించవచ్చు.

‘దేవలోక దుర్భిక్షం’ అంటే అధ్యాత్మలో ఇంద్రియ నిగ్రహం. అద్వైతంలో 'దేవతలు' అంటే తరచుగా మన ఇంద్రియాలకు సంకేతం. "దేవలోకంలో దుర్భిక్షం" అంటే ఇంద్రియాలకు అందవలసిన విషయ సుఖాలు నిలిచిపోవడం. సాధకుడు 'ప్రత్యాహారం' అనే స్థితిలో ఉన్నప్పుడు, ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపు వెళ్లవు. లోక విషయాల పట్ల ఈ 'దుర్భిక్షం' (వైరాగ్యం) కలగడం జ్ఞానోదయానికి మొదటి మెట్టు.


‘మనూనాముదకం గృహే’ - అంతర్ముక్తి (Inner Bliss)

'మనుష్యుల గృహం' అంటే మన హృదయం. బయట విషయాలు లేకపోయినా (దుర్భిక్షం), లోపల మాత్రం 'ఉదకం' (శాంతి/ఆనందం) నిండి ఉంటుంది. ఆత్మజ్ఞాని బాహ్య సుఖాల కోసం వెతకడు. తన హృదయమనే గృహంలోనే ఆత్మ చైతన్యమనే అమృతధారను దర్శిస్తాడు.


‘వైద్యుతః’ - చైతన్య స్ఫురణ (Flash of Awareness)

శిశిర కాలపు మెరుపులు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి మన బుద్ధిలో అకస్మాత్తుగా కలిగే 'జ్ఞానోదయం' (Flash of Realization) కు సంకేతం.

చీకటిగా ఉన్న ఆకాశంలో మెరుపు ఒక్క క్షణం మెరిసి మొత్తం ప్రపంచాన్ని ఎలా చూపిస్తుందో, అజ్ఞానాంధకారంలో ఉన్న సాధకుడికి గురువు ఉపదేశం వల్ల కలిగే 'మహావాక్య' బోధ అలా కళ్ళు విప్పేలా చేస్తుంది. బ్రహ్మ "విద్యుల్లేఖేవ భాస్వర" - మెరుపు తీగలా ప్రకాశించేది.


శిశిరము అంటే ఆకులు రాలిపోయే కాలం. పాతవి పోయి కొత్తవి రావడానికి సిద్ధమయ్యే స్థితి. సాధకుడిలో పాత సంస్కారాలు, వాసనలు రాలిపోయి (శిశిరము), జ్ఞానమనే వసంతానికి సిద్ధమవ్వడాన్ని ఇది సూచిస్తుంది. ఈ సమయంలో కలిగే మెరుపులు (జ్ఞాన స్ఫురణలు) సాధకుడిని సంపూర్ణ సత్యం వైపు నడిపిస్తాయి.


Conclusion:

బయటి ప్రపంచంలోని విషయ వాసనల పట్ల వైరాగ్యాన్ని (దుర్భిక్షాన్ని) పెంచుకో. అప్పుడు నీ హృదయ గృహంలో ఆత్మశాంతి అనే అమృతం నిండుతుంది. ఆ స్థితిలో నీ బుద్ధిలో మెరిసే జ్ఞానమనే మెరుపు (విద్యుత్), నిన్ను ఆ కాలాతీతమైన పరమాత్మతో అనుసంధానం చేస్తుంది.

అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు కేవలం వాతావరణ మార్పుల గురించి కాక, అవి మన ప్రాణ, మనో, విజ్ఞాన కోశాల్లోMantra - 35 ARUNAM 4 anuvaakam


‘సూర్యుడు మంచును చీల్చి ప్రకాశించినట్లు, నీ జ్ఞాననేత్రం అజ్ఞాన పొరలను చీల్చి పరమ సత్యాన్ని దర్శించాలి’ అని నిన్నటి మంత్రం ఉపదేశిస్తే, ఈ రోజు ఈ క్రిందటి మంత్రం ప్రకృతిలో సంభవించే ఋతు మార్పులను, ముఖ్యంగా శిశిర ఋతువు (శీతాకాలం చివర) నాటి వాతావరణాన్ని మరియు ఆ సమయంలో సంభవించే ఉరుములు, మెరుపుల విశిష్టతను వివరిస్తుంది.


"దుర్భిక్షం దేవలోకేషు |

మనూనాముదకం గృహే | 

ఏతా వాచః ప్రవదన్తీః। 

వైద్యుతో యాన్తి శైశిరీః||”


“దుర్భిక్షం దేవలోకేషు" - దేవలోకములలో (ఆకాశంలో) ఆహారానికి కొరత (దుర్భిక్షం) ఏర్పడినట్లుగా ఉంది.

శీతాకాలంలో మేఘాలు లేక ఆకాశం ఖాళీగా, నిర్మలంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది.


“మనూనాముదకం గృహే” - మనుష్యుల ఇళ్ళలో మాత్రం నీరు సమృద్ధిగా ఉంటుంది. అంటే వర్షాలు పడకపోయినా, భూమిలో ఇంకిన నీరు లేదా మంచు రూపంలో లభించే తేమ మనుష్యులకు అందుబాటులో ఉంటుందని అర్థం.


“ఏతా వాచః ప్రవదన్తీః” - ఈ మాటలు పలుకుతున్నట్లుగా…. అంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఉన్నాయి.


“వైద్యుతో యాన్తి శైశిరీః" - శిశిర ఋతువుకు సంబంధించిన మెరుపులు (వైద్యుతః) సంచరిస్తున్నాయి.

సాధారణంగా వర్షాకాలంలో వచ్చే మెరుపుల కంటే, శిశిర రుతువులో అరుదుగా వచ్చే మెరుపులు ఒక ప్రత్యేకమైన ధ్వనిని, కాంతిని కలిగి ఉంటాయి.


అరుణప్రశ్నలోని ఈ అనువాకం సూర్యుడు ఏ విధంగా వివిధ ఋతువులలో తన ప్రభావాన్ని చూపుతాడో వివరిస్తుంది. శిశిరంలో ఆకాశం 'దుర్భిక్షం' (మేఘరహితం) గా ఉన్నప్పటికీ, భూమిపై ప్రాణకోటి మనుగడకు అవసరమైన నీరు (మంచు లేదా భూగర్భ జలం) లభిస్తుంది. ఇది ఋతు వర్ణన.


‘వైద్యుతః’ (Lightning): మెరుపులను "వాక్కులు" (వాచః) గా వర్ణించడం ఇక్కడ విశేషం. మేఘాల ఘర్షణ వల్ల కలిగే ధ్వని, వెలుగు లోకానికి ఒక దివ్యమైన సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఋషి దర్శించాడు.


శిశిర రుతువుకు సంబంధించిన శక్తులను 'శైశిరీః' అని అంటారు. ఇవి రాబోయే వసంత ఋతువుకు సూచికలు. శైశిరీః అనేది వైదిక పదం.


ఈ మంత్రంలో "దేవలోకంలో దుర్భిక్షం" అని చెప్పడం వెనుక ఒక నిగూఢార్థం ఉంది. దేవతలు హవిస్సును (యజ్ఞ భాగాలను) ఆహారంగా స్వీకరిస్తారు. మేఘాలు లేని ఆకాశం దేవతలకు తృప్తినిచ్చే వర్షాన్ని ఇవ్వలేకపోవడాన్ని అలా వర్ణించి ఉండవచ్చు.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు ప్రకృతిని ఒక జీవకళా రూపంగా మనకు చూపిస్తాయి. 


తత్త్వ విచారణ: 

అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఈ వర్ణనను సాధకుని అంతర స్థితికి అన్వయించవచ్చు.

‘దేవలోక దుర్భిక్షం’ అంటే అధ్యాత్మలో ఇంద్రియ నిగ్రహం. అద్వైతంలో 'దేవతలు' అంటే తరచుగా మన ఇంద్రియాలకు సంకేతం. "దేవలోకంలో దుర్భిక్షం" అంటే ఇంద్రియాలకు అందవలసిన విషయ సుఖాలు నిలిచిపోవడం. సాధకుడు 'ప్రత్యాహారం' అనే స్థితిలో ఉన్నప్పుడు, ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపు వెళ్లవు. లోక విషయాల పట్ల ఈ 'దుర్భిక్షం' (వైరాగ్యం) కలగడం జ్ఞానోదయానికి మొదటి మెట్టు.


‘మనూనాముదకం గృహే’ - అంతర్ముక్తి (Inner Bliss)

'మనుష్యుల గృహం' అంటే మన హృదయం. బయట విషయాలు లేకపోయినా (దుర్భిక్షం), లోపల మాత్రం 'ఉదకం' (శాంతి/ఆనందం) నిండి ఉంటుంది. ఆత్మజ్ఞాని బాహ్య సుఖాల కోసం వెతకడు. తన హృదయమనే గృహంలోనే ఆత్మ చైతన్యమనే అమృతధారను దర్శిస్తాడు.


‘వైద్యుతః’ - చైతన్య స్ఫురణ (Flash of Awareness)

శిశిర కాలపు మెరుపులు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి మన బుద్ధిలో అకస్మాత్తుగా కలిగే 'జ్ఞానోదయం' (Flash of Realization) కు సంకేతం.

చీకటిగా ఉన్న ఆకాశంలో మెరుపు ఒక్క క్షణం మెరిసి మొత్తం ప్రపంచాన్ని ఎలా చూపిస్తుందో, అజ్ఞానాంధకారంలో ఉన్న సాధకుడికి గురువు ఉపదేశం వల్ల కలిగే 'మహావాక్య' బోధ అలా కళ్ళు విప్పేలా చేస్తుంది. బ్రహ్మ "విద్యుల్లేఖేవ భాస్వర" - మెరుపు తీగలా ప్రకాశించేది.


శిశిరము అంటే ఆకులు రాలిపోయే కాలం. పాతవి పోయి కొత్తవి రావడానికి సిద్ధమయ్యే స్థితి. సాధకుడిలో పాత సంస్కారాలు, వాసనలు రాలిపోయి (శిశిరము), జ్ఞానమనే వసంతానికి సిద్ధమవ్వడాన్ని ఇది సూచిస్తుంది. ఈ సమయంలో కలిగే మెరుపులు (జ్ఞాన స్ఫురణలు) సాధకుడిని సంపూర్ణ సత్యం వైపు నడిపిస్తాయి.


Conclusion:

బయటి ప్రపంచంలోని విషయ వాసనల పట్ల వైరాగ్యాన్ని (దుర్భిక్షాన్ని) పెంచుకో. అప్పుడు నీ హృదయ గృహంలో ఆత్మశాంతి అనే అమృతం నిండుతుంది. ఆ స్థితిలో నీ బుద్ధిలో మెరిసే జ్ఞానమనే మెరుపు (విద్యుత్), నిన్ను ఆ కాలాతీతమైన పరమాత్మతో అనుసంధానం చేస్తుంది.

అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు కేవలం వాతావరణ మార్పుల గురించి కాక, అవి మన ప్రాణ, మనో, విజ్ఞాన కోశాల్లో కలిగే పరిణామాలను ఎంత అద్భుతంగా వివరిస్తాయి. కలిగే పరిణామాలను ఎంత అద్భుతంగా వివరిస్తాయి.

వేదములలో జున్ను ప్రస్తావన

 వేదములలో జున్ను ప్రస్తావన: శాస్త్రీయ మరియు ధార్మిక విశ్లేషణ


ఈశ్వర ప్రోక్తమయిన వేదములలో సర్వ జీవరాశుల క్షేమమును కాంక్షించే అనేక విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. కృష్ణ యజుర్వేదం, బ్రాహ్మణ భాగము (2-1-1) లోని ‘అంగీరస ప్రశ్న’లో గోసంరక్షణ మరియు దూడ హక్కుల గురించి ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. ఒక రోజు గోవు బ్రహ్మ వద్దకు వెళ్లి ఒక వరం కోరింది. 


"సోబ్రవీత్ వరం వృణౖ | దశమా రాత్రీర్జాతన్నదోహన్ |

ఆసంగవం మాత్రా సహచరాణీీతి | తస్మాత్ వత్సం జాతం దశ రాత్రీ ర్నదుహంతి| ఆసంగవం మాత్రా సహ చరతి| వారే వృతగ్గుహ్యస్య | తస్మాత్ వత్సగ్o సంగ్o సృష్ట ధయగ్o రుద్రో ఘాతుకః||"

( కృ.య.బ్రహ్మణము 2-1-1)


పై మంత్రమునకు ముఖ్య భావమేమనగా...

ఆవు దేవుని ఒక వరం అడిగింది. దూడ పుట్టిన 10 రాత్రులు వరకు పాలు పిండ రాదని, దూడ ఆవుతో కలిసి ఉండాలని.  అప్పుడు దేవ దేవుడు మొదటి 10 రాత్రులు పాలు పితకరని, ఆవు నుంచి బిడ్డను విడదీయరని వరం ప్రసాదించాడు.  ఈ కారణం చేత పశువుకి / ఆవుకి దూడ పుట్టిన 10 రోజుల వరకు పాలు పితుకరాదు (న దోహన్).  మొదటి 10 రోజుల పాలు దూడకి మాత్రమే చెందాలి. కాని పక్షంలో వారికి రుద్ర ఘాతుక దోషం వర్తిస్తుంది. దూడకు అందాల్సిన పాలను మనం తీసుకోవడం వల్ల 'రుద్రుని కోపానికి' గురికావాల్సి వస్తుందని వేదం హెచ్చరిస్తోంది. అంటే ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం వల్ల కలిగే దుష్పరిణామాలు అని అర్థం.


రుద్ర ఘాతుక దోషం

ప్రకృతి నియమాలను ఉల్లంఘించి, దూడకు చెందాల్సిన పాలను మనిషి తన స్వార్థం కోసం తీసుకుంటే, అతనికి 'రుద్ర ఘాతుక దోషం' వర్తిస్తుందని వేదం హెచ్చరిస్తోంది. అంటే, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఆ వ్యక్తికి చుట్టుకుంటాయి.


ఇది ఆవుకనేకాక అన్ని పశువులకు, క్షీరదాలకు వర్తిస్తుంది.  ఆధునిక వైజ్ఞానికుల సూచన ప్రకారం మొదటి 10 రోజుల పాలు బిడ్డ ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి.  రోగ నిరోధక శక్తిి వృద్ధి చెందుతుంది.




ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం, దూడ పుట్టిన మొదటి 10 రోజులు ఇచ్చే పాలను కోలోస్ట్రమ్ (Colostrum) అంటారు.

రోగనిరోధక శక్తి: ఈ పాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్ (Immunoglobulins) వంటి యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దూడకు జీవితాంతం వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి.


జున్ను ఎందుకు తినకూడదు?: ఆధ్యాత్మికంగా అది దూడ వాటా కాబట్టి తినకూడదు. ఆరోగ్యపరంగా చూస్తే, జున్ను పాలు చాలా భారీగా ఉంటాయి. జున్ను పాలు చాలా చిక్కగా, ప్రోటీన్లతో నిండి ఉంటాయి (Heavy to digest). పసి దూడకు అవసరమైన ఆ పోషకాలు మనిషికి అరగడం కష్టం కావచ్చు, అందుకే పెద్దలు దీనిని నిషేధించారు.


రోగ నిరోధక శక్తి: ఈ పాలు దూడ యొక్క ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. భవిష్యత్తులో అది వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి.


ఈ కారణం చేతనే వేద పండితులు, శాస్త్ర పండితులు లేగడి పాలతో చేసిన జున్ను ని తినరు. 


మనం ఎందుకు జున్ను తినకూడదు?

వేద పండితులు మరియు శాస్త్ర కోవిదులు లేగడి పాలతో చేసిన జున్నును తినకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి:

ధార్మిక కారణం: అది దూడ యొక్క ప్రాథమిక హక్కు. జీవకారుణ్య దృష్టితో చూస్తే, పసి దూడ నోరు కొట్టి మనం ఆహారం తీసుకోవడం అధర్మం.

ఆరోగ్య కారణం: అతిగా ఉండే పోషకాలు మనిషికి అరగడం కష్టమై, అనారోగ్యానికి దారితీయవచ్చు. పరాయి జీవి యొక్క హక్కును గౌరవించడం, ప్రకృతితో మమేకమై జీవించడం.


వీలయినంతలో తెలుసుకున్న విషయాన్ని పాటించడం ద్వారా ప్రకృతి నియమాలను పాటిద్దాం!


లోకాసామస్తాస్సుఖినో భవంతు||