*వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే౹*
*జగతఃపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥*
అని కాళిదాసమహాకవి ఆదిదంపతులను ప్రార్థనచేశాడు.
ఆ ఆదిదంపతులు ఎట్లా ఉంటారటంటే..... వాక్కు అంటే పదము ఒక పదాన్ని అంటిపెట్టుకొని దాని అర్థం ఉంటుందో... ఆ అర్థాన్ని పదం నుండి ఎలా విడదీయటం కుదరదో... అర్థం నుండి పదాన్ని
అదేవిధంగా ఎలా విడదీయటం కుదరదో... ఒకరికొకరు అవిభాజ్యంగా ఉంటారుట. అదే అర్థనారీశ్వరతత్త్వం.
ఇది ఆదిదంపతుల విషయంలో చెప్పబడినా.... ప్రతి ఒక్క మానవదంపతులకు కూడా వర్తిస్తుంది.
మీరన్నట్లు శరీరం భౌతికం అంటూ భౌతికతత్త్వంతో చూడకూడదు. మానవునిలో "చిత్" అనే పేరుకలిగిన శక్తి ఒకటి ఉంటుంది. అది అమ్మవారి/భగవంతుడి శక్తి. ఈ "చిచ్ఛక్తి" పురుషులలో హృదయంలో కుడివైపున ఉంటే స్త్రీలలో హృదయంలో ఎడమవైపున ఉంటుంది.
ఈ రెండింటి కలయికతోనే సృష్టి పరిపూర్ణమౌతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి