వేదములలో జున్ను ప్రస్తావన: శాస్త్రీయ మరియు ధార్మిక విశ్లేషణ
ఈశ్వర ప్రోక్తమయిన వేదములలో సర్వ జీవరాశుల క్షేమమును కాంక్షించే అనేక విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. కృష్ణ యజుర్వేదం, బ్రాహ్మణ భాగము (2-1-1) లోని ‘అంగీరస ప్రశ్న’లో గోసంరక్షణ మరియు దూడ హక్కుల గురించి ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. ఒక రోజు గోవు బ్రహ్మ వద్దకు వెళ్లి ఒక వరం కోరింది.
"సోబ్రవీత్ వరం వృణౖ | దశమా రాత్రీర్జాతన్నదోహన్ |
ఆసంగవం మాత్రా సహచరాణీీతి | తస్మాత్ వత్సం జాతం దశ రాత్రీ ర్నదుహంతి| ఆసంగవం మాత్రా సహ చరతి| వారే వృతగ్గుహ్యస్య | తస్మాత్ వత్సగ్o సంగ్o సృష్ట ధయగ్o రుద్రో ఘాతుకః||"
( కృ.య.బ్రహ్మణము 2-1-1)
పై మంత్రమునకు ముఖ్య భావమేమనగా...
ఆవు దేవుని ఒక వరం అడిగింది. దూడ పుట్టిన 10 రాత్రులు వరకు పాలు పిండ రాదని, దూడ ఆవుతో కలిసి ఉండాలని. అప్పుడు దేవ దేవుడు మొదటి 10 రాత్రులు పాలు పితకరని, ఆవు నుంచి బిడ్డను విడదీయరని వరం ప్రసాదించాడు. ఈ కారణం చేత పశువుకి / ఆవుకి దూడ పుట్టిన 10 రోజుల వరకు పాలు పితుకరాదు (న దోహన్). మొదటి 10 రోజుల పాలు దూడకి మాత్రమే చెందాలి. కాని పక్షంలో వారికి రుద్ర ఘాతుక దోషం వర్తిస్తుంది. దూడకు అందాల్సిన పాలను మనం తీసుకోవడం వల్ల 'రుద్రుని కోపానికి' గురికావాల్సి వస్తుందని వేదం హెచ్చరిస్తోంది. అంటే ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం వల్ల కలిగే దుష్పరిణామాలు అని అర్థం.
రుద్ర ఘాతుక దోషం
ప్రకృతి నియమాలను ఉల్లంఘించి, దూడకు చెందాల్సిన పాలను మనిషి తన స్వార్థం కోసం తీసుకుంటే, అతనికి 'రుద్ర ఘాతుక దోషం' వర్తిస్తుందని వేదం హెచ్చరిస్తోంది. అంటే, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఆ వ్యక్తికి చుట్టుకుంటాయి.
ఇది ఆవుకనేకాక అన్ని పశువులకు, క్షీరదాలకు వర్తిస్తుంది. ఆధునిక వైజ్ఞానికుల సూచన ప్రకారం మొదటి 10 రోజుల పాలు బిడ్డ ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. రోగ నిరోధక శక్తిి వృద్ధి చెందుతుంది.
ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం, దూడ పుట్టిన మొదటి 10 రోజులు ఇచ్చే పాలను కోలోస్ట్రమ్ (Colostrum) అంటారు.
రోగనిరోధక శక్తి: ఈ పాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్ (Immunoglobulins) వంటి యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దూడకు జీవితాంతం వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి.
జున్ను ఎందుకు తినకూడదు?: ఆధ్యాత్మికంగా అది దూడ వాటా కాబట్టి తినకూడదు. ఆరోగ్యపరంగా చూస్తే, జున్ను పాలు చాలా భారీగా ఉంటాయి. జున్ను పాలు చాలా చిక్కగా, ప్రోటీన్లతో నిండి ఉంటాయి (Heavy to digest). పసి దూడకు అవసరమైన ఆ పోషకాలు మనిషికి అరగడం కష్టం కావచ్చు, అందుకే పెద్దలు దీనిని నిషేధించారు.
రోగ నిరోధక శక్తి: ఈ పాలు దూడ యొక్క ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. భవిష్యత్తులో అది వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి.
ఈ కారణం చేతనే వేద పండితులు, శాస్త్ర పండితులు లేగడి పాలతో చేసిన జున్ను ని తినరు.
మనం ఎందుకు జున్ను తినకూడదు?
వేద పండితులు మరియు శాస్త్ర కోవిదులు లేగడి పాలతో చేసిన జున్నును తినకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి:
ధార్మిక కారణం: అది దూడ యొక్క ప్రాథమిక హక్కు. జీవకారుణ్య దృష్టితో చూస్తే, పసి దూడ నోరు కొట్టి మనం ఆహారం తీసుకోవడం అధర్మం.
ఆరోగ్య కారణం: అతిగా ఉండే పోషకాలు మనిషికి అరగడం కష్టమై, అనారోగ్యానికి దారితీయవచ్చు. పరాయి జీవి యొక్క హక్కును గౌరవించడం, ప్రకృతితో మమేకమై జీవించడం.
వీలయినంతలో తెలుసుకున్న విషయాన్ని పాటించడం ద్వారా ప్రకృతి నియమాలను పాటిద్దాం!
లోకాసామస్తాస్సుఖినో భవంతు||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి