11, జూన్ 2026, గురువారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ ।

ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ।। 41 ।।



ప్రతిపదార్థ:

 

 యోగ-సన్న్యస్త-కర్మాణం — కర్మ కాండలను త్యజించి, శరీరము-మనస్సు-ఆత్మ ను భగవత్ సేవకే ఉపయోగించే వారు; జ్ఞాన — జ్ఞానముచే; సంఛిన్న — పోగొట్టబడి; సంశయమ్ — సంశయములు (సందేహాలు); ఆత్మ-వంతం — ఆత్మ జ్ఞానంలో స్థితులై; న — కాదు; కర్మాణి — కర్మలు; నిబధ్నంతి — బంధించును; ధనంజయ — అర్జునా, సంపదను జయించేవాడా.



 తాత్పర్యము : 


 ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి, జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి, ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు.



వివరణ:



‘కర్మ’ అంటే విహిత ఆచారములు మరియు సామాజిక విధులు నిర్వర్తించటంలో ఉన్న అన్ని క్రియాకలాపములు; ‘సన్యాసం’ అంటే ‘త్యజించుట/విడిచిపెట్టుట’; ‘యోగ్’ అంటే ‘భగవంతునితో ఐక్యత’. ఇక్కడ శ్రీ కృష్ణుడు యోగసన్న్యస్త కర్మాణం అన్న పదం వాడాడు, అంటే ‘పూజాది అన్ని కర్మకాండలను త్యజించి, తమ శరీర-మనస్సు-ఆత్మలను భగవంతునికే అంకితం చేసేవారు’ అని. అలాంటి వారు తమ అన్ని క్రియలను భగవత్ సేవగా చేస్తారు. భక్తి యుక్తముగా వారు చేసే పనులు వారిని కర్మ బంధములలో పెనవేయవు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.


తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే వ్యక్తిని కర్మ బంధములలో కట్టివేస్తాయి. ఎప్పుడైతే పనులను కేవలం భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేసినప్పుడు, వాటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు. అంటే సంఖ్యలను 0 (సున్నా) తో గుణించినట్టే. పదిని సున్నాతో గుణిస్తే ఫలితం సున్నా; వెయ్యిని సున్నాతో గుణిస్తే ఫలితం సున్నాయే; లక్షను సున్నాతో గుణిస్తే, ఫలితం ఇంకా సున్నాగానే ఉంటుంది. అదే విధంగా, జ్ఞానోదయమైన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు, వారిని కర్మ బంధములలో పడవేయవు, ఎందుకంటే వాటిని యోగాగ్నిలో భగవత్ అర్పితము చేస్తారు, అంటే భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా, అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, మహాత్ములు కర్మ బంధములలో చిక్కుకోరు.

గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

11-06-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


ఆప్తుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక ఋణాల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  

---------------------------------------


వృషభం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దాయాదులతో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశలు సద్వినియోగం చేసుకోవాలి.

---------------------------------------


మిధునం


ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతాన విషయమై ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------


కర్కాటకం


మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చే విధంగా ఉండవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఇంటా బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వాహన అనుకూలత కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


కన్య


దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానలు అందుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------


తుల


చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. శారీరక మానసిక సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.

---------------------------------------


వృశ్చికం


నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


ధనస్సు


కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


మకరం


అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి

--------------------------------------


కుంభం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 

ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 08*


*విరావైర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం*

*పురస్తాదానమ్రే పురవిజయిని స్మేరవదనే ।*

*వయస్యేవ ప్రౌఢా శిథిలయతి యా ప్రేమకలహ-*

*ప్రరోహం కామాక్ష్యాః చరణయుగలీ సా విజయతే ॥*


*భావము :*


*ఈ వింతను తిలకించండి. జగన్మాత అలక తీర్చడానికి ఈశ్వరుడు మోకరిల్లాడు. అప్పుడు అమ్మ పాదముల అందెలు చేసిన శబ్దంతో ఆమె మాట్లాడిందని భ్రాంతి కలిగి చిరునవ్వు చిందించాడు శివుడు. వారిద్దరి మధ్య ప్రణయ కలహాన్ని తీర్చుటలో మధ్యవర్తులైన పాదములు నాలో నిత్యము వసించుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏