ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
8, మే 2024, బుధవారం
శ్రీరామ నామ మంత్ర మహిమ..🙏🍃
🌹శ్రీరామ నామ మంత్ర మహిమ..🙏🍃
భగవంతుని ఎన్ని పేర్లతో పిల్చుకుంటే
మనలో తపన తీరుతుంది?
ఎన్ని లక్షల నామాలతో స్తుతిస్తే
మన తనివి తీరుతుంది?
అందుకనే విష్ణు మూర్తి వేయి నామాలని
విన్న తరువాత కూడా పార్వతీదేవికి
ఒక సందేహం కలిగింది...
‘ఈ విష్ణుసహ్రనామాలని పండితులు క్లుప్తంగా ఎలా పఠించగలరో సెలవియ్యండి’
అంటూ పరమేశ్వరుని కోరింది పార్వతీదేవి.
అందుకు పరమేశ్వరుడు...
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే ||
రామా రామా అంటూ సాగే
రాముని స్మరణ మాత్రమే
(శ్రీరామ రామ రామేతి),
సుందరాకారుడైనా ఆ రామునిపై .
మనసుని లగ్నం చేస్తుంది
(రమే రామే మనోరమే),
ఓ సుందరీ! ఆ రామ నామమే
వేయినామాలకు సమానంగా నిలుస్తుంది
(సహ్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే)
అంటూ పండితులు
పై శ్లోకానికి అర్థం చెబుతూ ఉంటారు
ఈ రెండు ప్రముఖ శబ్దాలను కలిపితే
‘రామః’ శబ్దం ఉత్పన్నమవుతుంది.
అంటే శివకేశవులిద్దరి కలయికగా
రాముని కొలుచుకోవచ్చునన్నమాట.
‘రామ’ అన్న శబ్దంలోనే
రమించడం అన్న అర్థం వస్తుంది.
భగవంతునిలో ఐక్యమవ్వాలని చెప్పే
తత్వానికైనా,
మధుర భావనతో కృష్ణుని పొందాలనుకునే
గోపికలకైనా ఈ సూత్రం వర్తిస్తుంది.
అంటే జన్మజన్మలుగా ఆత్మను
అంటిపెట్టుకుని ఉన్న కర్మఫలాలను
దగ్ధం చేయడానికైనా,
శరీరాన్ని వేధించే రోగాల నుంచి
ఉపశమనం పొందడానికైనా... ‘రామ’ అన్న శబ్దంతో మమేకం అయితే
చాలునన్నమాట!
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్🙏
*శ్రీ హిమవద్ గోపాలస్వామి ఆలయం*
🕉 *మన గుడి : నెం 310*
⚜ *కర్నాటక : బందీపూర్* -
*చామరాజనగర్*
⚜ *శ్రీ హిమవద్ గోపాలస్వామి ఆలయం*
💠 కర్ణాటకలోని బందీపూర్‌లోని గోపాలస్వామి ఆలయం 1315లో నిర్మించబడింది.
హిమవద్ గోపాలస్వామి బెట్ట భారతదేశంలోని 1450 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండ (కన్నడలో బెట్ట). బందీపురా నేషనల్ పార్క్‌లో ఇది ఎత్తైన శిఖరం కూడా.
🔆 స్థల పురాణం
💠 అగస్త్య మహర్షి తీవ్రమైన తపస్సు చేశాడని, దాని ఫలితంగా విష్ణువు ఈ ప్రదేశాన్ని ఆశీర్వదించి ఇక్కడ నివాసం ఉంటానని వాగ్దానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది ఆరాధన మరియు తపస్సు చేసే స్థలం కాబట్టి, దీనిని సంస్కృతంలో హంసల సరస్సు అని అర్థం 'హంసతీర్థ' అని పిలిచేవారు .
💠 7 శతాబ్దాల క్రితం నిర్మించిన శ్రీ హిమవద్ గోపాలస్వామి ఆలయం సుందరమైన దృశ్యాలతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి మరియు కొన్ని సమయాల్లో దీనిని దక్షిణ గోవర్ధనగిరి మరియు కమలాచల అని పిలుస్తారు.
💠 కొండ శిఖరం మేఘాలు మరియు పొగమంచుతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తుంది, అందుకే దీనికి హిమవద్ గోపాలస్వామి బెట్ట అని పేరు వచ్చింది (హిమవద్ అంటే పొగమంచుతో కప్పబడి ఉంటుంది).
💠 కొండపై 13వ శతాబ్దంలో నిర్మించబడిన పురాతన కోట ఉంది. కోట లోపల శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన గోపాలస్వామి ఆలయం ఉంది.
ఆలయ గోపురం ఒకే అంచెగా ఉంది మరియు ఆవరణ యొక్క కాంపౌండ్ గోడపై ఉంటుంది. ముఖ మంటపం యొక్క ముఖభాగం యొక్క ప్రాకార గోడలో దశావతార (విష్ణువు యొక్క అవతారాలు) శిల్పం ఉంది.
💠 గర్భగృహంలో చెట్టు కింద వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది.
ఎడమ కాలి బొటనవేలు కుడివైపున ఉండేలా శ్రీకృష్ణుని విగ్రహం అందంగా చెక్కబడింది.
శ్రీకృష్ణుడి విగ్రహం 6 అడుగుల విగ్రహం వెనుక అతని భార్యలు రుక్మిణి మరియు సత్యభామ, ఆవులు మరియు గోరక్షకుల చిత్రాలు ఉన్నాయి.
💠 ఈ ఆలయం హొయసల శకం 1315లో నిర్మించబడింది మరియు ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంది.
ఈ ఆలయాన్ని 1315లో చోళ బల్లాల రాజు నిర్మించాడు. తర్వాత మైసూర్‌కు చెందిన వడయార్‌లు వేణుగోపాల స్వామికి అత్యంత భక్తులైన వారు కొండ ఆలయాన్ని నిర్వహించడంలో ఆసక్తిని కనబరిచారు.
💠 ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఏడాది పొడవునా గర్భాలయానికి వెళ్లే ద్వారం పైన చల్లటి నీరు నిరంతరం పడుతూ ఉంటుంది. పూజారి ఓపికగా స్థలానికి సంబంధించిన పురాణాలను వివరిస్తాడు మరియు ఈ నీటిని భక్తులపై చల్లుతారు.
💠 హిమవద్ గోపాలస్వామి కొండ అడవి రోజ్‌వుడ్, టేకు చెక్క మరియు ఇతర విలువైన కలపతో కప్పబడి ఉంటుంది.
బందీపూర్ వన్యప్రాణుల అభయారణ్యంలో భాగంగా ఉన్నందున, కొండలపైకి అడవి ఏనుగులు తరచుగా వస్తుంటాయి.
ఈ కొండలు నెమళ్లు, చిలుకలు, అటవీ కోళ్లు మరియు పెలికాన్‌లతో సహా కొన్ని గొప్ప పక్షి జీవితాలకు నిలయం.
💠 ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం – శ్రావణ మాసంలో అంటే మార్చి నెల చివరి వారంలో గోపాలస్వామి బ్రహ్మ రథోత్సవం నిర్వహిస్తారు.
ఈ రథోత్సవంలో ప్రత్యేక అంశం ఏమిటంటే, అడవి నుండి సేకరించిన వెదురు-లతలతో చేసిన తాడుతో రథాన్ని లాగుతారు
💠 ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఈ ఆలయానికి పవిత్రమైన రోజులు.
ప్రతి శనివారం శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు.
💠 ఇది బందీపూర్ నేషనల్ పార్క్ ప్రధాన ప్రాంతంలో ఉంది కనుక ఇక్కడికి ఏనుగులతో సహా వన్యప్రాణులు తరచుగా వస్తుంటాయి.
బందీపూర్ నేషనల్ పార్క్ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం, పులి, చిరుతపులి, అడవి కుక్కలు మరియు ఇండియన్ గౌర్, చిట్టాల్, సాంబార్ వంటి ఇతర శాకాహార జంతువులకు కీలకమైన ఆవాసం.
💠 మీరు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కావాలనుకున్నా, ప్రకృతితో గాఢమైన సంబంధాన్ని కోరుకున్నా, లేదా ప్రశాంతమైన క్షణంలోనైనా, ఈ పవిత్రమైన కొండ నిజంగా ఒక రకమైన అనుభవాన్ని ఇస్తుంది.
💠 సమయం : హిమవద్ గోపాలస్వామి కొండకు ప్రవేశం ఉదయం 8.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
💠 సమీపంలో : బందీపూర్ టైగర్ రిజర్వ్ & నేషనల్ పార్క్ (20 కి.మీ.) మరియు నంజనగూడు (55 కి.మీ) హిమవద్ గోపాలస్వామి బెట్టతో పాటు చూడదగిన కొన్ని ప్రదేశాలు.
💠 కొండ దిగువ నుండి, సందర్శకులు హిమవద్ గోపాలస్వామి బెట్టకు చేరుకోవడానికి షటిల్ బస్సులను తీసుకోవాలి.
కొండలపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు.
💠 బస: 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్లుపేట పట్టణంలో బస చేసేందుకు ప్రాథమిక హోటళ్లు ఉన్నాయి. జంగిల్ లాడ్జెస్ & రిసార్ట్స్ నిర్వహించబడుతున్న బందీపూర్ సఫారీ లాడ్జ్ హిమవద్ గోపాలస్వామి కొండలకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.
💠 హిమవద్ గోపాలస్వామి బెట్ట బెంగళూరు
నుండి 220 కిలోమీటర్లు మరియు మైసూరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మాతృమూర్తి
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీ గురుభాష్యము
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మాతృమూర్తి
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి.
ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును.
సత్యం తల్లి. జ్ఞానము తండ్రి.
పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.
ఏ పుత్రుడు, ఏ పుత్రిక మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది.
ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధయాగాలు చేసినా పోదు.
తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది.
తల్లిని మించిన దైవం లేదు.
శ్రీ గురుభ్యోనమః!!
వైశాఖ మాసారంభం
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
*వైశాఖ మాసారంభం*
*వైశాఖ మాస విశిష్టత*
వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో *ఏక భుక్తం , నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది.* వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు , తపస్సులకు పూజాదికాలకు , దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.
ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో , వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.
ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా
పేరుపొందిన *వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.* అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే.
అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన , పూజ , దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం , పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.
వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం , నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం , చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.
సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
దుర్జనులతో
🌸 సుభాషితము🌸
శ్లో.
*దుర్జనేన సమం వైరం*
*ప్రీతిం చాపి న కారయేత్౹*
*ఉష్ణో దహతి చాంగారః*
*శీతః కృష్ణాయతే కరమ్॥*
దుర్జనులతో విరోధమూ కూడదు, స్నేహమూ కూడదు.
అగ్ని వేడిగా ఉన్నప్పుడు (అంటే నిప్పును) తాకితే చేతులు కాలిపోతాయి. చల్లగా ఉన్నప్పుడు తాకితే చేయంతా మసి చేస్తాయి.
శని త్రయోదశి
శని త్రయోదశి లో విశేష పూజలు జరుపుకుంటారు ఎందుకు.....
కృష్ణపక్షంలో త్రయోదశీ ,చతుర్దశీ ,అమావాస్య ,ఈ మూడు తిధుల్లోనూ చంద్రుడు ,సూర్యమండలపరిధిలోకి వెళ్లిపోతాడు.చంద్రికలనగా చంద్రకళలు..క్రమంగా తగ్గిపోతూ ఎప్పుడు అమావాస్య వస్తుందో అప్పుడు నశించని కళ ఒకటి చంద్రుని ప్రకాశంలో అంతర్లీనమై ఉంటుంది. దీనినే అమావాస్య అంటారు. సూర్యలోకాంతర్వర్తియైన చంద్రునిలో ఆ క్షయించని కళయే అమృతాంశ ,దీనిని విశ్వేదేవతలు (పితృదేవతలు) ఆశ్రయించి ఆ అమృతాంశను గ్రోలుతారని శాస్త్రవచనము. దీని ప్రకారంగానే అమావాస్య తిధియందు మన పూర్వీకులైన పెద్దలకు తిలోదకాలిచ్ఛి ,సంతర్పణలూ ,దానాలూ చేయటం వలన వారు ప్రేతరూపమునుండి దేవతారూపమునకు మరలి పుణ్యగతులు పొందుతారని శాస్త్రానుసరణము వాక్యము.. ఇప్పటికీ కొంతమందీ తిధుల యందు జప ,దాన ,యజ్ఞ , సంతర్పణ మొదలైన పుణ్యకార్యక్రమమలను పుణ్యక్షేత్రాలయందు ఆచరించటం కడు ముదావహమైన విషయం
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
*08-05-2024 / బుధవారం / రాశిఫలాలు*
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
---------------------------------------
వృషభం
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.
---------------------------------------
మిధునం
మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.
---------------------------------------
కర్కాటకం
సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
---------------------------------------
సింహం
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.
---------------------------------------
కన్య
ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.
---------------------------------------
తుల
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
---------------------------------------
వృశ్చికం
కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
---------------------------------------
ధనస్సు
మానసిక ప్రశాంతత కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆలోచనలో ఆచరణలో పెడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
---------------------------------------
మకరం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.
---------------------------------------
కుంభం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.
---------------------------------------
మీనం
పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🍁 *శుభం భూయాత్* 🍀
హ్యుదరనిమిత్తం బహుకృతవేషః
🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝
*గుణాశ్చ షణ్మీతభుక్తిం భజన్తే*
*ఆరోగ్యమాయుశ్చ బలం సుఖంచ*
*అనావిలంచాస్య భవత్యపత్యం*
*నచైవ మాద్యూన ఇతి క్షిపన్తి*॥
[విదురనీతి]
తా𝕝𝕝
మితముగా భుజించువాడికి ఆరు లాభములు కలుగుచున్నవి. *ఆరోగ్యము, ఆయుష్యము, బలము, సుఖము, మంచి సంతానము, మరియు "ఇతడు తిండిపోతు అనెడి ఆక్షేపణకు" ఆస్కారములేకపోవుట.
👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇
శ్లో ||
*ద్వాదశమంజరికాభిరశేషః*
*కథితో వైయాకరణస్యైషః*
*ఉపదేశో భూద్విద్యానిపుణైః*
*శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః* ॥13॥
భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు
*జటిలో ముండీ లుంఛితకేశః*
*కాషాయాంబరబహుకృతవేషః*
*పశ్యన్నపి చన పశ్యతి మూఢః*
*హ్యుదరనిమిత్తం బహుకృతవేషః*
||14||
భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.
హను మంతుడ్ని ప్రార్థిస్తే
జై శ్రీ రామ్
కంచర్ల వెంకట రమణ 🙏🐒🙏 ప్రతి మాసంలో వచ్చే అమావాస్యరోజు హను మంతుడ్ని ప్రార్థిస్తే సకలసంపదలూ చేకూరుతాయి. మహావిష్ణువుకి సేవ చేయటం కొరకు శివుడే స్వయంగా హనుమంతునిగా జన్మించాడు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడ్ని సింధూరంతో అర్చిస్తే అ ష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ప్రతి మాసంలో వచ్చే అమావా స్యరోజు నిష్టతో ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అం దుకే అమావాస్య సాయంత్రంపూట ఆంజనేయస్వామికి నేతితో దీపంపెట్టి, 18 సార్లు ప్రదక్షిణచేస్తే మనోధైర్యం, స కల సంపదలు, ఉన్నతపదవులు లభిస్తాయి.
🙏🐒🙏కార్యసిద్ధినిచ్చే మహామహిమాన్వితమైన ఆం జనేయస్వామి శ్లోకాలున్నాయి. హనుమంతుడు కార్యసా ధకుడు. భక్తితో హనుమంతుడ్ని కొలిస్తే వారి కోర్కెలు త ప్పక నెరవేరతాయి. భక్తులు వారివారి కోరికననుసరించి ఆంజనేయస్వామి శ్లోకాలనుఅమావాస్య రోజున భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధిస్తారు.
*విద్యా ప్రాప్తికి :* "పూజ్యాయ, వాయుపుత్రా య వాగ్ధోష వినాశన / సకల విద్యాంకురుమేదేవ రామ దూత నమోస్తుతే !!"
*ఉద్యోగ ప్రాప్తికి :* "హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వాపీడా వినాశినే / ఉద్యోగప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే !!"
*కార్య సాధనకు :* "అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద / రామదూత కృపాసింధో మమ కార్యమ్ సాధయప్రభో !!"
*గ్రహదోష నివారణకు :* "మర్కటేశ మహోత్సా హా సర్వగ్రహ నివారణ / శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో !!"
🙏🐒 *ఆరోగ్యమునకు :* "ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా / ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే !!"
🙏🐒 *సంతాన ప్రాప్తికి :* "పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ / సంతానం కురుమేదేవ రామదూత నమోస్తుతే !!"
🙏🐒 *వ్యాపారాభివృద్ధికి :* "సర్వకళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్ / అపార కరుణామూర్తిం ఆంజనే యం నమామ్యహమ్ !!"
🙏🐒 *వివాహ_ప్రాప్తికి :* "యోగి ధ్యేయాంఘ్రి పద్మా య జగతాం పతయేనమః / వివాహం కురుమేదేవ రామ దూత నమోస్తుతే !!"
🙏🐒ఆయా కార్యసిద్ధిని కోరేవారు 41 రోజులు నిష్ఠ తో ఈ శ్లోకాలను స్మరిస్తూ, ప్రతిరోజూ ఆంజనేయస్వామి గుడికెళ్ళి5 ప్రదక్షిణలుచేసి స్వామిని పూజిస్తే తమకార్యా ల్లో విజేతలౌతారు. సీతమ్మ ఆంజనేయస్వామికి ఉపదేశించిన కార్యసిద్ధి మంత్రముంది. సుంద రకాండలో హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి, అశోకవనంలోనున్న సీతమ్మను దర్శించిన సందర్భంలో శోకంలోనున్న సీతాదే వి హనుమంతుడికి ఒక కార్యసిద్ధిమంత్రాన్ని ఉపదేశించిం ది. ఆ మంత్రమిదే
*🥀"త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ*
*హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరోభవ ||" 🥀*
🙏🐒ఈ మంత్రాన్ని సీతాదేవి హనుమంతుడికి చెప్పి, "హనుమా! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ క ష్టాలనుండి గట్టెక్కించే సమర్థుడివి నువ్వే. ఇదిగో ఈ మం త్రసిద్దిని పొంది తద్వారా నన్ననుగ్రహించు. ఇది నీవల్లే సా ధ్యమౌతుంది" అని చెప్పింది. హనుమంతుడు సీతాదేవి చెప్పిన మంత్రాన్ని జపిస్తూ దాన్ని సిద్ధిపొంది సీతాదేవిని రావణుడి చెరనుండి విముక్తిపొందే మార్గాన్ని సులువు చే యగలిగారు. సీతమ్మ చెప్పిన ఈ మంత్రాన్ని పఠిస్తే కార్య సిద్ధి కలుగుతుంది, దుఃఖాలు తొలగిపోతాయి. దీన్ని ప్రతి రోజూ 108 సార్లు, 41 రోజులపాటు పఠిస్తే అనుకున్న ప నులు సక్రమంగా జరుగుతాయి. అన్నివిధాలా విజయం కలుగుతుంది.
వాత్సల్యము అంటే
వాత్సల్యము అంటే ఏమిటి.
ఆవు దూడను వత్స అంటారు. వాత్సల్యము అంటే దూడ మీద తల్లి ప్రేమ.
ఆవు వెంటే దూడ ఎప్పుడూ ఉంటుంది. తన దూడ తన వెంట ఉన్నదో లేదో ఆవు గమనిస్తూనే ఉంటుంది. వందల సంఖ్యలో ఉండే గోవుల మందలో కూడా ప్రతి గోవూ తన వత్సను గుర్తించ గలదు. ఆవు ఈనిన వెంటనే తన వత్సను శరీరమంతా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. దీనినే వాత్సల్యం అంటారు. తన దూడ కనిపించక పోతే చాలా తపించి పోతుంది. తన వత్సకు పాలిచ్చేవరకూ పాలు పిండడానికి చేపురాదు. గోవు వత్సలను భగవంతునికీ భక్తునికీ ప్రతీకలుగా చూడ వచ్చు. భగవంతుడు తన భక్తులను ఎల్ల వేళలా కాపాడుతూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఉండే అనురాగన్ని ఈ సూత్రంతో పోలుస్తారు. దీనినే గోవత్స న్యాయముఅంటారు.
ఈశ్వరా
ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు.
అప్పుడు పాలు.
ఈశ్వరా !!
నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి భాదపడిందట.
అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి...
ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు.
పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు.,
పెరుగుని చిలికి చల్ల ని చేస్తే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు.
అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో నెలలు తరబడి బ్రతుకుతావు.
ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు..
ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా... అని ఈశ్వరుడు ప్రశ్నించారు..
దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది...
మానవుడు కూడా అట్లాగే.. ఎవరో తమ మనస్సుని విరిచేసారు అని మనస్సుని పాడుచేసుకుని బాధపడేకంటే.. క్షీరము వలె మనస్సు లో ఆధ్యాత్మికత అనే తోడు వేసి, ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామ స్మరణతో చిలికి , దానిని దైవ చింతనం తో కాచి, దానిలోంచి వచ్చిన జ్ఞానం తో ఎప్పుడు ఎప్పుడా అని ఆ ఈశ్వరుని లో ఏకమవటానికి ఎదురు చూస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి.
*పాలల్లో చక్కెర వేసినా చెక్కరలో పాలు పోసినా కరిగేది చెక్కరే.!* *బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కొల్పోయేది మన జీవితమే. చెక్కర కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కూడా భాదపడుతూ ఉండకుండా, ఓ మంచిపాఠం నేర్చుకున్నామని ముందుకుసాగండి.*