8, మే 2024, బుధవారం

హను మంతుడ్ని ప్రార్థిస్తే

 జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ 🙏🐒🙏 ప్రతి మాసంలో వచ్చే అమావాస్యరోజు హను మంతుడ్ని ప్రార్థిస్తే సకలసంపదలూ చేకూరుతాయి. మహావిష్ణువుకి సేవ చేయటం కొరకు శివుడే స్వయంగా హనుమంతునిగా జన్మించాడు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడ్ని సింధూరంతో అర్చిస్తే అ ష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ప్రతి మాసంలో వచ్చే అమావా స్యరోజు నిష్టతో ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అం దుకే అమావాస్య సాయంత్రంపూట ఆంజనేయస్వామికి నేతితో దీపంపెట్టి, 18 సార్లు ప్రదక్షిణచేస్తే మనోధైర్యం, స కల సంపదలు, ఉన్నతపదవులు లభిస్తాయి.


🙏🐒🙏కార్యసిద్ధినిచ్చే మహామహిమాన్వితమైన  ఆం జనేయస్వామి శ్లోకాలున్నాయి. హనుమంతుడు కార్యసా ధకుడు. భక్తితో హనుమంతుడ్ని కొలిస్తే వారి కోర్కెలు త ప్పక నెరవేరతాయి. భక్తులు వారివారి కోరికననుసరించి ఆంజనేయస్వామి శ్లోకాలనుఅమావాస్య రోజున భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధిస్తారు.


*విద్యా ప్రాప్తికి :* "పూజ్యాయ, వాయుపుత్రా య వాగ్ధోష వినాశన / సకల విద్యాంకురుమేదేవ రామ దూత నమోస్తుతే !!"


*ఉద్యోగ ప్రాప్తికి :* "హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వాపీడా వినాశినే / ఉద్యోగప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే !!"


*కార్య సాధనకు :* "అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద / రామదూత కృపాసింధో మమ కార్యమ్ సాధయప్రభో !!"


*గ్రహదోష నివారణకు :* "మర్కటేశ మహోత్సా హా సర్వగ్రహ నివారణ / శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో !!"


🙏🐒 *ఆరోగ్యమునకు :* "ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా / ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే !!"


🙏🐒 *సంతాన ప్రాప్తికి :* "పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ / సంతానం కురుమేదేవ రామదూత నమోస్తుతే !!"


🙏🐒 *వ్యాపారాభివృద్ధికి :* "సర్వకళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్ / అపార కరుణామూర్తిం ఆంజనే యం నమామ్యహమ్ !!" 


🙏🐒 *వివాహ_ప్రాప్తికి :* "యోగి ధ్యేయాంఘ్రి పద్మా య జగతాం పతయేనమః / వివాహం కురుమేదేవ రామ దూత నమోస్తుతే !!"


🙏🐒ఆయా కార్యసిద్ధిని కోరేవారు 41 రోజులు నిష్ఠ తో ఈ శ్లోకాలను స్మరిస్తూ, ప్రతిరోజూ ఆంజనేయస్వామి గుడికెళ్ళి5 ప్రదక్షిణలుచేసి స్వామిని పూజిస్తే తమకార్యా ల్లో విజేతలౌతారు. సీతమ్మ ఆంజనేయస్వామికి  ఉపదేశించిన కార్యసిద్ధి మంత్రముంది. సుంద రకాండలో హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి, అశోకవనంలోనున్న సీతమ్మను దర్శించిన సందర్భంలో శోకంలోనున్న సీతాదే వి హనుమంతుడికి ఒక కార్యసిద్ధిమంత్రాన్ని ఉపదేశించిం ది. ఆ మంత్రమిదే 


*🥀"త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ*

*హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరోభవ ||" 🥀* 


🙏🐒ఈ మంత్రాన్ని సీతాదేవి హనుమంతుడికి చెప్పి, "హనుమా! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ క ష్టాలనుండి గట్టెక్కించే సమర్థుడివి నువ్వే. ఇదిగో ఈ మం త్రసిద్దిని పొంది తద్వారా నన్ననుగ్రహించు. ఇది నీవల్లే సా ధ్యమౌతుంది" అని చెప్పింది. హనుమంతుడు సీతాదేవి చెప్పిన మంత్రాన్ని జపిస్తూ దాన్ని సిద్ధిపొంది సీతాదేవిని రావణుడి చెరనుండి విముక్తిపొందే మార్గాన్ని సులువు చే యగలిగారు. సీతమ్మ చెప్పిన ఈ మంత్రాన్ని పఠిస్తే కార్య సిద్ధి కలుగుతుంది, దుఃఖాలు తొలగిపోతాయి. దీన్ని ప్రతి రోజూ 108 సార్లు, 41 రోజులపాటు పఠిస్తే అనుకున్న ప నులు సక్రమంగా జరుగుతాయి. అన్నివిధాలా విజయం కలుగుతుంది.

కామెంట్‌లు లేవు: