8, మే 2024, బుధవారం

వాత్సల్యము అంటే

 వాత్సల్యము అంటే ఏమిటి.



 ఆవు దూడను   వత్స అంటారు.  వాత్సల్యము అంటే దూడ మీద తల్లి ప్రేమ.


ఆవు వెంటే దూడ ఎప్పుడూ ఉంటుంది. తన దూడ తన వెంట ఉన్నదో లేదో ఆవు గమనిస్తూనే ఉంటుంది. వందల సంఖ్యలో ఉండే గోవుల మందలో కూడా ప్రతి గోవూ తన వత్సను గుర్తించ గలదు. ఆవు ఈనిన వెంటనే తన వత్సను శరీరమంతా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. దీనినే వాత్సల్యం అంటారు. తన దూడ కనిపించక పోతే చాలా తపించి పోతుంది. తన వత్సకు పాలిచ్చేవరకూ పాలు పిండడానికి చేపురాదు. గోవు వత్సలను భగవంతునికీ భక్తునికీ ప్రతీకలుగా చూడ వచ్చు. భగవంతుడు తన భక్తులను ఎల్ల వేళలా కాపాడుతూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఉండే అనురాగన్ని ఈ సూత్రంతో పోలుస్తారు.   దీనినే  గోవత్స న్యాయముఅంటారు.

కామెంట్‌లు లేవు: