ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
30, నవంబర్ 2024, శనివారం
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం - చతుర్ధశి - విశాఖ - స్థిర వాసరే* (30.11.2024)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
పంచాంగం 30.11.2024
ఈ రోజు పంచాంగం 30.11.2024
Saturday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి ⁷నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస కృష్ణ పక్ష చతుర్దశి తిథి స్థిర వాసర: విశాఖ నక్షత్రం అతిగండ యోగః: శకుని తదుపరి చతుష్పాత్ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వర
శుభోదయ:, నమస్కార:
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
*𝕝𝕝శ్లోకం 𝕝𝕝*
*"దేహీతి వచనం కష్టం*
*నాస్తీతి వచనం తథా*
*దేహీ నాస్తీతి మద్వాక్యం*
*మాభూ జ్జన్మని జన్మనీ"||*
𝕝𝕝 *భావం* 𝕝𝕝
*యాచించడం ఎంత కష్టమో,!? లేదని చెప్పడం కూడా అంతే కష్టం.!? అంతే కాదు నీచం కూడా కనుక..... ఏ జన్మ లోనూ దేహీ (అని యాచించే పరిస్థితి) , నాస్తి(లేదు అని చెప్పేపరిస్థితి) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు.పరమేశ్వరా....!!?* 🙏💖🌷
✍️🌷🌹🌺🙏
*శ్రీ కాళహస్తీశ్వర శతకము*
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🙏 *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏
*క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ములాందోళికా*
*తతు లే లెక్క విలాసినీజన సువస్త్ర వ్రాతభూషాకలా*
*ప తనూజాదిక మేమిదుర్లభము నీ పదమ్ములర్చించుచో*
*జిత పంకేరుహపాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!!!*
*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 105*
*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీ పాదపద్మములపైన సంతత చిత్తము కలిగినవాడికి* , *భూమిలో పెద్ద గుఱ్ఱములు, ఏనుగులు, పల్లకీలు, స్త్రీలు, వస్త్రములు, బిడ్డలు వంటి వ్యామోహములు ఏ పాటి.... అతనికి సమస్తములు సంపన్నమే అయి యుండును.* *రుద్రపారాయణ చేయుపుణ్యాత్ముడు ఒక నగరములోగాని, గ్రామములో గాని యున్నచో అక్కడ ఆకలి, దప్పికలతో బాధపడువారుండరు.*
✍️🌷🌹🌺🙏
శ్రీ మురుడేశ్వర ఆలయం
🕉 మన గుడి : నెం 945
⚜ఉత్తర కర్నాటక : మురుడేశ్వర
⚜ శ్రీ మురుడేశ్వర ఆలయం
💠 మురుడేశ్వర దేవాలయం, ఆధునిక కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, విశేష ప్రతిభకు ఒక ప్రముఖ నిదర్శనం.
ఎత్తైన దేవాలయాన్ని (18 అంతస్తులు) చూసినవారు, ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమయిందని ఆశ్చర్యపోతారు. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనబడే ఎత్తైన శివుని పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది.
💠 మురుడేశ్వర్ లో శివుని విగ్రహం ప్రధాన ఆకర్షణ. చుట్టూ అరేబియా సముద్రం పక్కనే 123 అడుగుల ఎత్తులో భారీ శివుని విగ్రహం సమీపంలోని రాజగోపురం 20 అంతస్తులు కలిగి ఉంది.
🔆 స్థలపురాణం
💠 మురుడేశ్వర చరిత్ర త్రేతాయుగం నాటిది.
రావణాసురుడు కైలాసం నుండి పరమేశ్వరుడిని వేడుకుని తెచ్చిన ఆత్మలింగానికి, మురుడేశ్వర క్షేత్రంలో లింగానికి సంబంధం ఉంది.
రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణక్షేత్రంలో బ్రాహ్మణవటువు రూపంలో వచ్చిన గణపతి భూమిమీద పెడతాడు.
వెంటనే ఆత్మలింగం భూస్థాపితమయింది. సాయంసమయాన ఆర్ఘ్యాన్ని వదలడానికి వెళ్ళిన రావణాసురుడు భూమిలో నుండి బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం బయటకు రాదు.
అప్పుడు రావణాసురుడు ఆగ్రహంతో ఆత్మలింగంపై ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరిపారేస్తాడు.
ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహామహిమాన్వితమయిన పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
ఆ ప్రదేశాలు, గోకర్ణక్షేత్రం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు.
💠 గోకర్ణ క్షేత్రంతో కలిపి ఈ క్షేత్రాలన్నీ పంచక్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి.
ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం మురుడేశ్వరం అయింది.
మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. "సంతోషం "అనే అర్థం కూడా ఉంది.
అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని కూడా అంటారు.
💠 ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. మురుడేశ్వరస్వామికి, శివరాత్రినాడు, బిల్వపత్రంతో పూజలు చేసిన వారికి స్వర్గ ప్రవేశం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
💠 ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీ దేవత, తూర్పున మహాదుర్గ, ఇతర దేవతలందరూ మిగతా దిక్కులలో కొలువై ఉండి రక్షిస్తున్నారట. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూజిస్తాడట.
బ్రహ్మదేవుడు ఇక్కడి పరమేశ్వరుడి విగ్రహంపై కమండలంతో చల్లిన నీళ్లతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సుగా ఏర్పడిందట.
💠 ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారని ,ఒకనాడు ధర్మరాజు, భీముడిని మురుడేశ్వరుడికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని వెంటనే తెమ్మన్నాడు. పరమేశ్వరుడిని ధ్యానిస్తే గంగాజలం వెంటనే లభిస్తుందనుకున్న భీముడు పరమేశ్వరుడిని ధ్యానం చేసాడు.
కానీ, పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. అప్పుడు భీముడు తన తలను భూమిమీద కొట్టుకున్నాడు. వెంటనే పరమశివుడు అనుగ్రహించి గంగామాతని హిమతీర్థంగా సృష్టించాడు.
భీముడు తన నెత్తిని నేలపై కొట్టిన స్థలమే ప్రస్తుతం భీమతీర్థం అని పిలుస్తున్నారు.
💠 బ్రహ్మహత్యా పాతకానికి శిక్షను తప్పించుకోవడానికి, ఇంద్రుడు స్వర్గాన్ని వదలి, మురుడేశ్వరానికి వచ్చి ఇక్కడ మురుడేశ్వరస్వామి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి పూజలు చేశాడని స్థానికులు చెబుతారు.
💠 ఇక్కడికి దేశంలో అన్ని ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామికి పూజలు చేస్తూంటారు. దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలయిన ఆరాధనలు జరుగుతాయి. అన్నసంతర్పణ సేవ, నిత్యసేవ, నందదీపసేవ, ఒక రోజు అన్నసంతర్పణం, సర్వదేవపూజ అంటూ సుమారు 50 రకాల పూజావిధానాలున్నాయి.
శివరాత్రి ఉత్సవాలు, పుష్యమాసంలో రథోత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతాయి. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కొన్ని లక్షలమంది భక్తులు వస్తుంటారు.
💠 మురుడేశ్వరంలో పవిత్రస్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి.
బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అందులో ముఖ్యమైనవి.
ఈ తీర్థాలలో, ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల, దీర్ఘకాల రోగాలు నయమవుతాయని అంటారు.
💠 మురుడేశ్వరక్షేత్రం, కందూక పర్వతం మీద అరేబియా సముద్రతీరంలో ఉంది.
ఈ పర్వతం బంతి మాదిరిగా (కందూకం అంటే బంతి ) ఉంది కాబట్టి, ఈ పర్వతానికి కందూక పర్వతం అనే పేరు వచ్చింది.
💠 మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే, ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి.
వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమయినవి.
ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం, నందిమండపం, యజ్ఞమండపం ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలోనున్న రావిచెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలను నెరవేర్చమని, చెట్టుకు ముడుపులు కడుతుంటారు.
💠 గోకర్ణం నుంచి మురుడేశ్వరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రచన
©️ Santosh Kumar
10-24-గీతా మకరందము
10-24-గీతా మకరందము
విభూతియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
పురోధసాం చ ముఖ్యం మాం
విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కన్దః
సరసామస్మి సాగరః ||
తా:- ఓ అర్జునా! పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతినిగా నన్నెఱుంగుము. మఱియు నేను సేనానాయకులలో కుమారస్వామియు, సరస్సులలో సముద్రమును అయియున్నాను.
వ్యాఖ్య:- ‘ముఖ్యమ్’ - అని చెప్పుటవలన శ్రేష్ఠత్వమే, పవిత్రత్వమే దైవత్వమునకు చిహ్నమని స్ఫురించుచున్నది.
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*
*211 వ రోజు*
*సంజయునికి ధర్మజుని స్పందన*
ధర్మరాజు " సంజయా! నా మాటలలో యుద్ధం అన్న మాట ధ్వనించిందా? మాకు మాత్రం యుద్ధమంటే ప్రియమా? యుద్ధానికి దిగకనే కార్య సాఫల్యత కలిగితే కావలసిన దేముంది. భీమార్జునులు జనహితమైన పనులే చేస్తారు కాని అప్రియములు చేయరు. దురాశకు పోయి యుద్ధానికి దిగితే యుద్ధం దుఃఖం కాక సుఖం ఇస్తుందా? సంజయా! మా పెదనాన్న ధృతరాష్ట్రుడు తాను అక్రమ మార్గాన నడుస్తూ నన్ను ధర్మ మార్గాన నడవమనడం న్యాయమా? తాము ఉత్తమ మార్గాన నడుస్తూ ఎదుటి వారికి చెబితే బాగుంటుంది. ఇప్పుడు మాకు సంపద లేదు, బలం లేదు. మమ్ము పిలిచి ఆదరించడానికి ధృతరాష్ట్రుడు వెర్రి వాడా? ఆయన ప్రవర్తన మాకు కొత్త కాదు అప్పుడే పెద్దల మాటలు వినని వాడు ఇప్పుడు వింటాడా? జూదపు సిరికి ఆశపడకూడదని విదురుడు అప్పుడు చెప్పిన మాటలు విని ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు. అతడు సుయోధనుడు విషం తాగమన్నా త్రాగుతాడు కాని మంచి మాటలు వింటాడా? దృతరాష్ట్రునికి సుయోధనుడు అత్యంత పరాక్రమ వంతుడని నమ్మకం. సుయోధనుడు కర్ణుని భుజబలంతో రాజ్యం నిష్కంటకం చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ అది అతడి భ్రమ. ఎందుకంటే ఇంతకు ముందు అనేక యుద్ధాలు జారిగాయి. అప్పుడు కర్ణుడు కౌరవులను ఎందుకు గెలిపించ లేక పోయాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు, దుశ్సాసనుడు, కర్ణాదుల మాటలు వింటాడు కాని మంచి మాటలు వినరు. అన్నీ తెలిసిన నీవు ఇలా మాట్లాడటం అవివేకమా లేక లౌకికమా? భీష్మాదులకు యుద్ధం అంటే తెలియదా? ఆశాపాశ బంధితులై కళ్ళు కానని వారికి అర్జునిని గాండీవ కాంతులు పూర్తిగా గుడ్డి వారిని చేయక మానవు . సంజయా ! మా పరాక్రమం పొగుడుతూనే వారితో పోరి గెలవలేమని చెప్తున్నావు. నీకు పక్షపాత బుద్ధి ఏల. యుద్ధంలో గెలువగలమా లేదా అన్నది విడువుము. నీవు గుణవంతుడవు కనుక మా కోపం పోయేలా మాట్లాడావు. మేము ఇప్పటి వరకూ ఎవరికీ అపకారం చేయ లేదు ఇక ముందు అలాగే సహనంగా ఉంటాము. నిజంగా ధృతరాష్ట్రుడు మంచి వాడై మా మీద ప్రేమ ఉంటే మమ్ములను పిలిచి గౌరవించి మారాజ్యభాగం మాకు ఇచ్చి బంధుత్వం నిలుపమని చెప్పు. నీవు చెప్పినట్లు నేను గూడా శాంతిని వహిస్తాను, ఇంద్రప్రస్థం నా రాజ్యంగా ఉండు గాక " అన్నాడు.*
*సంజయుని ప్రతి స్పందన*
సంజయుడు లేచి " ధర్మజా! ఎన్ని తప్పులనైనా సహించి ఓర్పు వహించగలవు కనుకే ఇన్ని మాటలు చెప్పాను. నీవు నమ్మిన సత్యం, అహింసలే నీకు సంపదలు. కౌరవులు మీకు రాజ్యభాగం ఇవ్వకున్న, మీకు ఆ నెత్తురు కూటికన్నా, భిక్షమెత్తి జీవించుట మేలు కదా? నీవు యుద్ధ రూపమైన పాపమును చేయవద్దు. రాజసూయం నిర్వహించిన నీ చరిత్రను హింసతో కళంకితం చేసుకోకు. నీతో మాయాజూదం ఆడి నిన్ను అవమానపరచిన కౌరవులను లోక నిందితులను చేసావు. అరణ్యములలో కష్టాలు అనుభవించిన నీవు ఇలా నీచమైన యుద్ధానికి తలపడి బంధు మిత్రులను చంపుట ధర్మం కాదు. ఇంతకు ముందు కూడా ఈ శ్రీకృష్ణుడు, సాత్యకి ద్రుపదాదులు, శత్రుసంహారుకులయిన నీ తమ్ములు నీ వెంట వున్నా వనాలకు వెళ్ళారు గదా! దుర్యోధన, దుశ్శాసన, భీష్మ ద్రోణ కర్ణ శల్య బాహ్లీకాడులను చంపి నీవేం సుఖ పడతావు. చెప్పు. హాలాహలం దిగమింగిన ఈశ్వరుడిలా నీవు నీ కోపాన్ని దిగమింగి నీ కీర్తిని కాపాడుకో " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కార్తీక పురాణం - 30
*🚩కార్తీక పురాణం - 30 వ అధ్యాయము🚩*_
🕉☘🕉☘🕉☘🕉☘🕉☘🕉
*చివరి రోజు*
*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*
☘☘☘☘☘☘☘☘☘
నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.
అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.
కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.
కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.
సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.
కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నె,అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.
*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయం*
🕉 *మన గుడి : నెం 516*
⚜ *కేరళ : త్రిస్సూర్*
⚜ *తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయం*
💠 తిరువంబాడి ఆలయం మరియు త్రిస్సూర్ పూరం ఉత్సవాలు నేడు సాధారణ ప్రజలకు దాదాపు పర్యాయపదాలు.
వేలాది మంది భక్తులకు శాంతి, ప్రశాంతత మరియు మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మిక వేదిక తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయం
💠 తిరువంబాడిలోని ప్రధాన దేవత ఉన్నికృష్ణ (శిశువు రూపంలో ఉన్న కృష్ణుడు).
భగవతి దేవి శ్రీకృష్ణునికి ఎడమవైపున ఉన్న మందిరంలో ప్రతిష్టించబడి, సమానమైన భక్తితో పూజించబడుతుంది.
💠 గణేశుడు, ధర్మశాస్త, మరియు ద్రావిడ పేర్లతో పిలువబడే దేవతలు - కుక్షి అయ్యప్ప, మణికండ, ఘండకర్ణ, రక్తేశ్వరి మరియు భైరవ కూడా ఇక్కడ ప్రతిష్టించారు.
💠 తిరువంబాడి శ్రీ కృష్ణ దేవాలయం భారతదేశంలోని కేరళలోని త్రిస్సూర్ నగరంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం.
💠 కేరళలో అతిపెద్ద స్థానిక పండుగ అయిన త్రిస్సూర్ పూరంలో పాల్గొనే రెండు ప్రత్యర్థి సమూహాలలో ఈ ఆలయం ఒకటి.
💠 కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన, తిరువంబాడి ఆలయ చరిత్ర యొక్క పురాతన రికార్డు 16వ శతాబ్దానికి చెందినది.
ఈ ఆలయం గతంలో త్రిచూర్ పట్టణానికి వాయువ్యంగా 15 కిమీ దూరంలో ఎడక్కలత్తూరులో ఉండేది.
🔆 ఆలయ చరిత్ర
💠 ప్రస్తుతం ఇక్కడ పూజించబడుతున్న కృష్ణుడి విగ్రహం నిజానికి త్రిస్సూర్ నుండి 15కి.మీ దూరంలో కుగ్రామమైన ఎడక్కలత్తూర్‌లోని దేవాలయంలో పార్థసారథి విగ్రహం.
ఆలయానికి అదే పేరు ఉంది - తిరువంబాడి - మరియు భగవతి, శాస్త మొదలైన అనేక మందిరాలు కూడా ఉన్నాయి.
💠 దురదృష్టవశాత్తు, సుమారు 4 శతాబ్దాల క్రితం, గ్రామంలో మత ఘర్షణలతో ప్రాణాలకు మరియు ఆస్తికి ముప్పు ఏర్పడినప్పుడు, ఎడక్కళత్తూరులోని పవిత్రమైన నంబూతిరీలు త్రిస్సూర్‌కు వలస వెళ్ళవలసి వచ్చింది, వారితో పాటు శ్రీకృష్ణుని విగ్రహం మోసుకెళ్ళారు.
💠 త్రిస్సూర్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న కాచనప్పిల్లి ఇల్లం వద్ద ఒక పవిత్రమైన నంబూద్రి దంపతులకు దానిని అప్పగించారు.
సంతానం లేని దంపతులు దీనిని శ్రీకృష్ణుడి మారువేషంలో ఉన్న ఆశీర్వాదంగా భావించారు మరియు వారు ఆరాధన కోసం విగ్రహాన్ని తమ సొంత బిడ్డగా భావించారు.
💠 తనకు కావలసిన రూపంలో భక్తుడి ముందు ప్రత్యక్షమయ్యే దయగల భగవంతుడు, విగ్రహం అకస్మాత్తుగా బాలకృష్ణుడి రూపంలోకి మారింది.
పార్థసారథిగా కొరడాను పక్కన పెట్టి, ఒక చేతిలో వేణువును పట్టుకుని, మరొక చేతిలో 'పెంపుడు తల్లిదండ్రుల' నుండి భక్తి యొక్క వెన్నను స్వీకరించడానికి ఉన్నికృష్ణన్ ( చిన్ని కృష్ణుడి) విగ్రహ రూపంగా మారిపోయాడు.
త్రిస్సూర్‌లోని అత్యంత ప్రసిద్ధ విగ్రహాలలో ఇది ఒకటి.
💠 ఆలయ చరిత్రలో భాగమైన మరో పురాణం కూడా ఉంది.
అదే జంట భగవతీదేవి యొక్క పెద్ద భక్తులు మరియు సమీపంలోని పట్టణంలోని ఆమె ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించేవారని నమ్ముతారు.
సంవత్సరాలు గడిచేకొద్దీ, దంపతులు పెద్దవారవుతుండగా, వారు ఇక ఆలయాన్ని సందర్శించలేకపోయారు మరియు ఆ సమయంలో దేవత ఒక గొప్ప భక్తుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడంతో వారితో కలిసి వారి స్థానానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకే అమ్మవారికి అంకితం చేసిన స్తంభం ఇప్పుడు ఆలయంలో భాగం.
💠 తిరువంబాడి కృష్ణ దేవాలయం దాని భౌతిక ఆకృతిలో చిన్నదైనప్పటికీ, దాని విస్తృతమైన ఆరాధనల కారణంగా మహాక్షేత్రంగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాకుండా, ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పండుగ - త్రిసూర్ పూరంలో చురుకుగా పాల్గొంటుంది.
🔅 శ్రీ కృష్ణ జయంతి : తిరువంబాడి కృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని పగలు మరియు రాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు.
ఈ రోజున, ఆలయం దీపాలతో వెలిగిపోతుంది మరియు పంచరీ మేళంతో పాటు అలంకరించబడిన 5 ఏనుగులను ఊరేగింపుగా తీసుకువెళతారు.
🔅 వైకుంఠ ఏకాదశి : ధనుర్మాసంలో వైకుఠ ఏకాదశి రోజు ఆలయంలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
ఏనుగుల ఊరేగింపులు, కళా ప్రదర్శనలు, పంచవాద్యం, డోలు కచేరీ తదితర కార్యక్రమాలు ఆ రోజు నిర్వహిస్తారు. ఏకాదశి పండుగకు ముందు 10 రోజుల పాటు సంగీతోత్సవం జరుగుతుంది.
🔅 ఋగ్వేద అర్చన : ప్రతి సంవత్సరం ఆలయంలో 8 రోజుల సుదీర్ఘ యజ్ఞంలో ఋగ్వేద మంత్రాలు మరియు పుష్ప నివాళులు అర్పిస్తారు.
🔅 లక్షార్చన: తుల మాసంలో, కృష్ణ మరియు దేవి నామాలను లక్షసార్లు జపించడం జరుగుతుంది.
🔅 కృష్ణనాట్టం : ఆలయంలో ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు సంపూర్ణ కృష్ణనాట్టం ప్రదర్శించబడుతుంది.
💠 భగవద్గీత పఠనం ఆలయాన్ని సజీవంగా చేస్తుంది. దేవస్థానం ప్రతి రోజు ప్రజలకు ఉచితంగా భోజనం అందిస్తుంది.
💠 ఆలయంలోకి కేవలం సాంప్రదాయ వస్త్రధారణ మాత్రమే అనుమతి
మరియు ప్రవేశం హిందువులకు మాత్రమే పరిమితం చేయబడింది
💠 ఈ ఆలయం వడక్కునాథన్ ఆలయానికి ఉత్తరాన 1 కిమీ , త్రిసూర్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ నుండి 10 మీటర్ల దూరం మాత్రమే
ఆధునిక నామధేయాలు
*🚩*
ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు
భాగవతం, మహాభారతం
1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.
2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.
14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.
17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.
18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.
21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.
24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.
34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.
36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.
39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.
40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.
43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.
44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.
ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.
:::::::::::::::::::::::::::::::::::::
రామాయణం
:::::::::::::::::::::::::::::::::::::
1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.
సేకరణ : - మన వేదం🙏🚩
🙏🕉️🔱🔱🕉️🙏🚩
అనుష్టానం
*
సృష్టికే ప్రతి సృష్టి చేయగల కలియుగ మానవుడు కలి దుష్ప్ర భావమును నిర్వీర్యము చేయ సంకల్పించి *ఓం సర్వేషాం స్వస్తిర్భవతు! సర్వేషాం శాంతిర్భవతు! సర్వేషాం పూర్ణ: భవతు!సర్వేషాం మంగళం భవతు!సర్వే సంతు సుఖినః!సర్వే సంతు నిరామయాః!సర్వే భద్రాని పశ్యంతు!మా కశ్చి దుఃఖ భగ్బవేత్!లోకాః సమస్తాః సుఖినో భవంతు!సర్వే జనాః సుఖీనో భవంతు!సమస్త సన్మంగళాని భవంతు* అంటూ కార్యాచరణకు పూనుకున్నాడు.
*అనుష్టానము ఒక్కటే వర్తమాన దోష నివారకము, ప్రపంచ శాంతి కారకము, మరియు సర్వారోగ్య ప్రదాయకమని మానవుడు విశ్వసించుచున్నాడు*.
భగవత్ కార్యాలలో *అనుష్టానం అను పదం వాడడం సర్వ సాధారణము. కాని, అనుష్టానం అను పదం యొక్క అర్థం విపులంగా పరిశీలిద్దాము. తోటి వారిని సంతోష పెట్టడం, తోటి వారి కన్నీరు తుడిచే కార్యమేదైనా అనుష్టానమే. ఫలానాలా చేస్తేనే అనుష్టానం అని గిటిగీసి చెప్పడానికి వీలులేని విస్తృతమైన అర్థం కల పదం అనుష్టానం*. సమాజ హితం కోసం ఏకాగ్రతతో నిరంతరం చేసేదే అనుష్టానం. *మన స్థాయిలో సమాజానికి ఉపయోగపడేలా మనం చేసే ప్రతిదీ అనుష్టానమే*.
ఆధ్యాత్మిక, పరమాత్మ, పారమార్థిక చింతనలో చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు ముందంజలో ఉండి ఇతర వర్ణాలకు మార్గదర్శకులుగా వ్యవహరించుచున్నారు. బ్రాహ్మణులంటే కుల బ్రాహ్మణులు మాత్రమే కాదు. అనేకార్థాలతో పాటు *బ్రహ్మ* పదమునకు మరియొక అర్థము *వేదము*. వేదమంటే *జ్ఞానము*. ఈ పదము నుండియే *బ్రాహ్మణ* శబ్ద ముద్భవించినదని భావించ వచ్చును. కాబట్టి వేదాధ్యయనము చేసిన వారెవరైనా బ్రాహ్మణ శబ్దమునకు అర్హులు. అనాదిగా వేదాధ్యయనము సాగించుచున్న ఆయా వంశీకులందరు బ్రాహ్మణులుగా పిలువ బడుతున్నారు. ప్రస్తుత కాలంలో అధిక శాతం బ్రాహ్మణులందరు కుల బ్రహ్మణులుగా జీవిస్తున్నారు. *అవుతే, కుల బ్రహ్మణులుగా మాత్రమే మిగిలిపోకుండా లోక కళ్యాణానికై గుణ మరియు జ్ఞాన బ్రాహ్మణులుగా ఎదగాలి*.
కొన్ని కొన్ని ముఖ్య విషయాలలో జాతి నిద్రావస్థలో ఉన్నప్పుడు జాతిని మేల్కొలిపి, సరి ఐన మార్గ దర్శనం గావించే మహానుభావులను *వైతాళికులు* అని, *సమాజోద్దారకులు* అని,
*మహాత్ములు* అని
*గౌరవంగా సంబోధించడం* వారి వృత్తి ప్రవృత్తిని యువతరం ఆదర్శంగా తీసుకోవడం అనుసరించడం
ఆనవాయితి. కులం ఏమైతే నేమి మనుసులొకటై మనుగడ సాగించిన నాడు జాతికి పునర్వైభవం ప్రాప్తిస్తుంది. గత చరిత్ర పరిశీలించినప్పుడు వైతాళికులుగా బ్రాహ్మణులతో బాటు ఇతర వర్ణం/ కులస్తులు కూడా ఉన్నారు. వీరందరూ నిరంతర సమాజ సేవా కార్యక్రమాల్లో నిష్ణాతులైందున వైతాళికులుగా కీర్తి పొందినారు. వారి మార్గదర్శకాలు మనకందరికీ అనుసరణీయములైయున్నవి.
ధన్యవాదములు.
(సశేషము)