30, నవంబర్ 2024, శనివారం

10-24-గీతా మకరందము

 10-24-గీతా మకరందము

          విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


పురోధసాం చ ముఖ్యం మాం 

విద్ధి పార్థ బృహస్పతిమ్ | 

సేనానీనామహం స్కన్దః

సరసామస్మి సాగరః || 


తా:- ఓ అర్జునా!  పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతినిగా నన్నెఱుంగుము. మఱియు నేను సేనానాయకులలో కుమారస్వామియు, సరస్సులలో సముద్రమును అయియున్నాను. 


వ్యాఖ్య:- ‘ముఖ్యమ్’ - అని చెప్పుటవలన శ్రేష్ఠత్వమే, పవిత్రత్వమే దైవత్వమునకు చిహ్నమని స్ఫురించుచున్నది.

కామెంట్‌లు లేవు: