30, నవంబర్ 2024, శనివారం

ప్రోటీన్స్ గురించి

 ప్రోటీన్స్ గురించి సంపూర్ణ వివరణ  -


     ప్రొటీన్స్ ని రసాయనిక పరిక్ష చేస్తే పంచదార యొక్క , కొవ్వు పదార్దాల యొక్క మూలద్రవ్యాలు ఉన్నట్టు కనపడుతుంది. అందువలనే మాంసకృత్తులు స్వంతకార్యాన్నే కాకుండా అవసరం వెంబడి కొవ్వు , చక్కర యొక్క కార్యాన్ని కూడా పూర్తిచేస్తాయి. కాని పంచదార , కొవ్వులు మాత్రం మాంసకృత్తుల కార్యాన్ని మాత్రం చేయలేవు . ప్రొటీన్స్ ని తెలుగులో మాంసకృత్తులు అని అంటారు.


           ఈ మాంసకృత్తులు రెండు రకాలు .


   1 -  జంతు జన్యాలు ( Animal proteins ) .


   2 -  స్థావర  జన్యాలు ( vegitable Proteins ).


 

 *  జంతు జన్యాలు  -


       జంతువుల మాంసాన్ని పరీక్షిస్తే ఆ మాంసంలో మాంసకృత్తులు ఉన్నట్టు తెలుస్తుంది. కాని ముత్ర ఆమ్లం ( Uric Acid ) అనబడే ద్రవ్యం కూడా ఒకటి . ఇది మాంసాహారం వలన ఉత్పత్తి అవుతుంది. ఈ మూత్రామ్లం శరీరంలో నుంచి త్వరగా బైటికి పోవాలి . అలా జరిగితే మాంసాన్ని తిని మాంసకృత్తులుని పోషించుకోవచ్చు. బైటికి పోకుండా ఈ ముత్రామ్లం శరీరంలో నిలబడితే కొన్ని రోగాలు వచ్చును.


 *  స్థావర జన్యాలు -


       మొక్కలని పరీక్షిస్తే వాటిలో కూడా చాలా రకాల మాంసకృత్తులు ఉన్నట్టు తెలుస్తుంది. కాని అవి జంతుజన్యాల అంత శ్రేష్ఠంగా ఉండవు.స్థావర మాంసకృత్తులు చాలా బలిష్టంగా ఉండి జఠరాగ్ని సంయోగం వలన బద్దలవడానికి వీలుగా లేని ఒక గట్టి పొరలో ( cellulose ) ఇమిడి ఉన్నాయి . ఈ కారణం చేతనే గోధుమల్లో ఉండే మాంసకృత్తులు జీర్ణం అవ్వడం లేదు . జంతు మాంసాన్ని పూర్తిగా వదిలివేసి కేవలం స్థావరాలనే తినేవారి మలాన్ని పరీక్షిస్తే ప్రధానద్రవ్యం అయిన నత్రజని నలభైరెండు వంతులు జీర్ణం అవ్వకుండా పోతుందని తెలుసుకున్నారు.


               మనం తీసుకున్న మాంసకృత్తులు శరీరంలో పూర్తిగా దగ్ధం అవ్వడం లేదు . అందుచేతనే "యూరియా " అనే ద్రవ్యం ఏర్పడి మూత్రం గుండా పోతూ ఉంది.మరికొన్ని విషాలు కూడా మాంసాన్ని తింటే పుడుతున్నాయి.ఈ విషాలు పెద్దపేగుల్లో కనిపిస్తున్నాయి . ఈ విషాలు పేగుల్లోంచి రక్తంలోకి పోతే  Auto Intoxication అనే దారుణావస్థ సంభవిస్తుంది. 


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


              ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

కామెంట్‌లు లేవు: