ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
23, అక్టోబర్ 2023, సోమవారం
కలబందతో
కలబందతో వైద్యం -
* కలబంద మట్టలలోని జిగురు లొపలికి తీసుకోవడం వలన శరీరంలోని వేడిని తగ్గించును.
* లోపలి జిగురుని నీళ్లతో శుభ్రముగా కడిగి పటికపంచదార పొడితో తినిన చలువచేయును .
* సారా పటిక ని ఒక గుంట గంటె లో వేసి పొయ్యి మీద పెడితే పొంగుతుంది . చల్లారాక దానిని పొడిచేసి ఆ పొడిని కలబంద జిగురుపైన ఒత్తుగా చల్లి ఒక గుడ్డలో కట్టి దానితో దానితో కండ్లపైన అద్దుచుండిన కండ్ల ఎరుపులు , నీరు కారడం , పుసి కారడం నొప్పులు మానును .
* కలబంద రసంలో పసుపు కలిపి లొపలికి తీసుకున్న స్ప్లీన్ వృద్ధి చెంది కడుపు పెద్దగా అయ్యే రోగం నివృత్తి అగును.
* కలబంద రసంలో పాలు మరియు నీరు కలిపి ఇచ్చిన సెగరోగం మరియు గర్భాశయంలో పుండు నివారణ అగును.
* కలబంద గుజ్జుని పసుపు తో కలిపి కట్టిన వ్రణాలు మానును .
* కలబంద మట్టని కొంచం తొక్కి పసుపుతో నూరి కట్టిన పైకి కనిపించకుండా లోపల తగిలిన దెబ్బలు అనగా కవుకు దెబ్బలు నయం అగును. నొప్పి కూడా హరించును .
* కలబంద వేరు రసంతో సీసముని భస్మం చేయుదురు.
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
⚜ శ్రీ నాగేష్ మహారుద్ర ఆలయం
🕉 మన గుడి : నెం 217
⚜ గోవా : పొండా
⚜ శ్రీ నాగేష్ మహారుద్ర ఆలయం
💠 ఇది శివుని పురాతన మందిరం.
1222వ సంవత్సరంలో నిర్మించిన శివలింగం స్వయంభూ అని నమ్ముతారు.
ఈ ఆలయం 16వ శతాబ్దంలో పోర్చుగీస్ పాలకుల మతపరమైన హింసకు గురికాలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆంత్రుజ్ మహల్ (పొండా) పోర్చుగీసు అధికారంలో లేదు
💠పోర్చుగీస్ పీడన చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలోని ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా , నాగేష్ దేవాలయం పురాతన వారసత్వం.
ఈ కట్టడం 15వ శతాబ్దానికి చెందినది అయితే విజయనగర రాజవంశానికి చెందిన అప్పటి పాలకుడు వీర్ ప్రతాప్ దేవరాయ ఆధ్వర్యంలో, శివుడు, పార్వతి దేవి మరియు గణేశుడి రాతి విగ్రహాలు 7వ శతాబ్దానికి చెందినవి.
💠 శ్రీ నాగేశి దేవాలయం లేదా నగుషి దేవాలయం పోండా తాలూకాలోని డోన్షివాడోలో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం.
💠 ఈ ఆలయం పురాతన కాలంలో నాగనాథ్ అని పిలువబడే శివుని రూపమైన నాగేష్‌కు చెందింది.
ఈ దేవాలయం గోవాలోని పురాతనమైనది మరియు గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు గోవాలోని సందర్శించదగిన ప్రదేశాలలో కూడా ఒకటి.
💠 శ్రీ నాగేశి ఆలయం అద్భుత శక్తులకు ప్రసిద్ధి చెందిన శివుని ''స్వయంభూ'' క్షేత్రంగా పరిగణించబడుతుంది.
జానపద పాటల్లో ప్రస్తావన తప్ప చరిత్ర ప్రస్తుతం అందుబాటులో లేదు.
💠 నాగ్‌జార్ గ్రామం యొక్క సుదూర ప్రాంతంలో గతంలో శమీ చెట్ల తోపు ఉండేది. ఒక ఆవుల కాపరి తన మందలోని ఒక ఆవు అడవిలో ఒక రాయిపై క్రమం తప్పకుండా పాలు పొయ్యడం గమనించాడు.
ఆ విధంగా శివలింగాన్ని ప్రజలు కనుగొన్నారు.
💠 ఈ ప్రాంతం 1413లో విజయనగర సామ్రాజ్యం రాజు వీర్ ప్రతాప్ దేవరాయ పాలనలో ఉన్నప్పుడు నాగేశి ఆలయం నిర్మించబడింది.
సతారా మరాఠా పాలకుడు చత్రపతి షాహూ కాలంలో ఈ ఆలయం విస్తృతమైన పునర్నిర్మాణ ప్రక్రియకు లోనైంది.
💠 ఆలయ ప్రధాన ఆకర్షణలు ఐదు అంతస్తుల దీపస్తంభం మరియు చారిత్రాత్మకమైన పాత నీటి కొలను.
ఇది కొలను చుట్టూ ఒక నిర్దిష్ట బిందువు వద్ద నిలబడి నగేష్ విగ్రహం యొక్క ప్రతిబింబం మరియు లోపలి గర్భగుడిలో వెలిగించిన దీపాలను వీక్షించే విధంగా నిర్మించబడింది.
💠 శ్రీ నాగేశి దేవాలయంలోని సభామండపానికి ఇరువైపులా గ్యాలరీ ఉంది, ఇందులో ఒక వైపు గొప్ప రామాయణం మరియు మహాభారతం యొక్క దృశ్యాలను వర్ణించే సున్నితమైన చెక్క శిల్పాలు మరియు మరో వైపు అస్టదిక్పాలకుడు మరియు గంధర్వ చెక్క చిత్రాలు ఉన్నాయి.
💠 శివుని వాహనం నంది ప్రధాన మందిరం యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయబడింది. గర్భాలయానికి ఇరువైపులా లక్ష్మీ నారాయణుడు మరియు గణేశుని ఆలయాలు ఉన్నాయి.
💠 ఆలయంలో శివరాత్రి వేడుకలు చాలా ఉత్సాహంగా జరుగుతాయి.
💠 ఇది కౌశిక్ గోత్రం (ఇంటిపేర్లు: నాయక్, షానభాగ్, షెనాయ్, రావు, కేల్కర్ మొదలైనవి),
వత్స గోత్రం (ఇంటిపేర్లు: పాయ్, కామత్, కామత్, షెన్వీ, మాల్యా, కైకిని, అస్గేకర్ మొదలైనవి) మరియు..
భరద్వాజ్ గోత్రంలకు చెందిన పురాతన కులదేవత ఆలయం.
ధెంపో మరియు ఘర్సే కుటుంబాలు కూడా ఆరాధకులు.
💠 పనాజీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో, బండోడ్ గ్రామంలో, లార్డ్ నాగేష్ ఆలయం ఉంది.
గుడి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని నాగేషి అని పిలుస్తారు మరియు ఫార్మాగుడి నుండి పోండాకు వెళ్ళే మార్గంలో కేవలం 800 మీటర్ల దూరంలో ఉంది
శమీ వృక్షం (జమ్మిచెట్టు) గొప్పతనం*
*శమీ వృక్షం (జమ్మిచెట్టు) గొప్పతనం*
ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు.
జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.
జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.
ఆంధ్రవ్యాసుల వారిని ఒక సారి ఒకభక్తుడు జమ్మిచెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అని అడిగాడు.
దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది.
జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.
రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.
ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.
దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.
నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.
సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.
ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.
మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).
ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.
ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.
(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,
అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః |
కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)
పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు
(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం,
యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి |
తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).
జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.
అంతగా దాన్ని ఆరాధిస్తారు...
*ధర్మ యుధ్ధంలో దైవ శక్తులు, దుష్ట శక్తులపైన సాధించిన విజయానికి ప్రతీకే నేటి విజయదశమి,* 💪🪷🏹🪷🎯 శ్రీ దేవీ శరన్నవరాత్రి *🔱విజయదశమి🔱* పర్వదిన శుభాకాంక్షలతో 🙏 శ్లో𝕝𝕝 *అర్చనకాలే రూపగతా - సంస్తుతికాలే శబ్దగతా* | *చింతనకాలే ప్రాణగతా - తత్వవిచారే సర్వగతా* || తా𝕝𝕝 జగన్మాత... *పూజా సమయంలో ‘రూపం’లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’లోనూ, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా ఆ జగదంబ* నే గోచరిస్తుంది...🙏 *మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలతో..🌷🌷🌷* *సర్వేజనా సుజనో భవంతు.. సర్వ సుజనా సుఖినోభవంతు..* శివేశ్రీ *బ్రాహ్మణ చైతన్య వేదిక*
*ధర్మ యుధ్ధంలో దైవ శక్తులు, దుష్ట శక్తులపైన సాధించిన *ధర్మ యుధ్ధంలో దైవ శక్తులు, దుష్ట శక్తులపైన సాధించిన విజయానికి ప్రతీకే నేటి విజయదశమి,*
💪🪷🏹🪷🎯
శ్రీ దేవీ శరన్నవరాత్రి *🔱విజయదశమి🔱* పర్వదిన శుభాకాంక్షలతో 🙏
శ్లో𝕝𝕝 *అర్చనకాలే రూపగతా - సంస్తుతికాలే శబ్దగతా* |
*చింతనకాలే ప్రాణగతా - తత్వవిచారే సర్వగతా* ||
తా𝕝𝕝 జగన్మాత... *పూజా సమయంలో ‘రూపం’లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’లోనూ, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా ఆ జగదంబ* నే గోచరిస్తుంది...🙏
*మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలతో..🌷🌷🌷*
*సర్వేజనా సుజనో భవంతు.. సర్వ సుజనా సుఖినోభవంతు..*
శివేశ్రీ
*బ్రాహ్మణ చైతన్య వేదిక*నేటి విజయదశమి,*
💪🪷🏹🪷🎯
శ్రీ దేవీ శరన్నవరాత్రి *🔱విజయదశమి🔱* పర్వదిన శుభాకాంక్షలతో 🙏
శ్లో𝕝𝕝 *అర్చనకాలే రూపగతా - సంస్తుతికాలే శబ్దగతా* |
*చింతనకాలే ప్రాణగతా - తత్వవిచారే సర్వగతా* ||
తా𝕝𝕝 జగన్మాత... *పూజా సమయంలో ‘రూపం’లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’లోనూ, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా ఆ జగదంబ* నే గోచరిస్తుంది...🙏
*మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలతో..🌷🌷🌷*
*సర్వేజనా సుజనో భవంతు.. సర్వ సుజనా సుఖినోభవంతు..*
శివేశ్రీ
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
జమ్మిచెట్టు
శమీ శమయతే పాపం,
శమీ శత్రువినాశినీ।
అర్జునస్య ధనుర్ధర్త్రీ,
రామస్య ప్రియదర్శినీ।।
భావం-అర్జునునియొక్క ధనుస్సును ధరించినటువంటి,శ్రీరామునకు ప్రియమైనటువంటి,శత్రువులను నశింపజేసేటటువంటి,జమ్మిచెట్టు పాపమును శమింపజేయును.అనగా పోగొట్టును.
*🌷 విజయదశమిశుభాకాంక్షలు 🌷*
శమీ వృక్షం (జమ్మిచెట్టు) గొప్పతనం
*శమీ వృక్షం (జమ్మిచెట్టు) గొప్పతనం*
ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు.
జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.
జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.
ఆంధ్రవ్యాసుల వారిని ఒక సారి ఒకభక్తుడు జమ్మిచెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అని అడిగాడు.
దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది.
జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.
రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.
ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.
దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.
నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.
సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.
ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.
మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).
ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.
ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.
(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,
అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః |
కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)
పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు
(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం,
యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి |
తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).
జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.
అంతగా దాన్ని ఆరాధిస్తారు...
ఏ కలెక్షన్ ఫ్రం అడ్మిన్ బ్రాహ్మణ సమాఖ్య
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
పంచేంద్రియాలకూ అధిష్టానం మనస్సయితే, దాని కదలికలకు కారణం ఈ గుణత్రయం.
కారణగుణాలు కార్యాలలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదుగదా! మాయాపరికల్పితాలైన ఈ
గుణాలు భిన్నభిన్న స్వభావాలకు కారణాలు. శాంతుడు ఘోరుడు మూఢుడు- వీటితోనే ఏర్పడుతున్నారు.
ప్రతి మానవుడూ ఎప్పుడూ ఈ గుణత్రయంతో కలిసే ఉంటాడు. వీటికి అతీతుడుగానీ వీటిని
వివర్జించినవాడుగానీ ఎవడూ లేడు. ఉండడు. ఉండలేడు. దారాలులేకుండా వస్త్రం ఉంటుందా ?
ముట్టిలేకుండా కుండ ఉంటుందా ?
తత్సమేతః పుమాన్నిత్యం తద్విహీనః కథం భవేత్ |
న భవత్యేవ సంసారే రహితస్తంతుభిః పటః ॥
తథా గుణైస్త్రిభిర్హీనో న దేహీతి నిశ్చయః ।
దేవదేవో మనుష్యో వా తిర్యశ్చో వా నరాధిప ॥
గుణైర్విరహితో న స్యాత్ మృద్విహీనో ఘటో యథా
బ్రహ్మా విష్ణుస్తథా రుద్రస్త్రయశ్చామి గుణాశ్రయాః ॥ (31-34, 35, 36)
త్రిమూర్తులుకూడా మనలాగా ఒక్కొక్కప్పుడు ప్రీతి, మరొకప్పుడు కోపం, ఒకప్పుడు సంతోషం
ఇంకొకప్పుడు దుఃఖం ఇలా ప్రకటిస్తూనే ఉంటారు. అనుభవిస్తూనే ఉంటారు. సత్వగుణం ఆవరించినప్పుడు
బ్రహ్మదేవుడు శాంతుడై ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటాడు. సర్వభూతప్రియుడు అవుతాడు. రజోగుణం
ఆవరించినప్పుడు ఘోరరూపుడు అవుతాడు. అంతటా అప్రీతి ప్రకటిస్తాడు. తమోగుణం ఆవరించినప్పుడు
మూఢుడై విషాదం పొందుతాడు. హరిహరులూ ఇంతే. యుగయుగాలలో సూర్యచంద్రవంశాలలో
జన్మించిన మనుప్రభృతులు మొదలుకొని సకలమానవులూ ఇలాగే గుణత్రయాధీనులై స్పందిస్తూ
ఉంటారు. ప్రవర్తిస్తూ ఉంటారు. అంచేత మాయాధీనం జగత్సర్వమ్ అనేది తిరుగులేని సత్యం.
అయితే ఆ మహామాయ సంవిద్రూపమైన పరతత్వంలో లీనమై ఉంటుంది. ఆ పరతత్త్వమే
మాయను ప్రేరేపించి జీవులను ఆడింపజేస్తుంది. మాయావిశిష్టాంతమైన ఆ సంవిత్తుమాత్రమే పరమేశ్వరి.
మాయేశ్వరి. భగవతి. సచ్చిదానంద స్వరూపిణి. ధ్యానించినవారికీ ఆరాధించినవారికీ నమస్కరించినవారికీ
జపించినవారికీ ఆ తల్లి దయతలిస్తే మోక్షం ఇస్తుంది. సుఖదుఃఖరూప సంసారబంధనాలనుంచి విముక్తి
కలిగిస్తుంది. ఆమెపట్ల మనస్సును సంలగ్నం చేసినవాడికి ఈ సాంసారిక బంధనాలూ భయాలూ ఏమీ
ఉండవు. అందుచేత మాయను జయించాలంటే మాయేశ్వరినే ఉపాసించాలి. మరొక దిక్కులేదు. మరొక
మార్గంలేదు. చీకటిని పారద్రోలాలంటే సూర్యచంద్రాదులే సమర్థులు. మాయను జయించాలంటే
స్వయంప్రకాశమానురాలూ సంవిద్రూపిణి అయిన మాయేశ్వరీమాతనే ఉపాసించాలి
జనమేజయా! నువ్వు అడిగినదల్లా చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు.
ఇక్కడికిది ఈ పురాణంలో పూర్వార్థం. ఇది శ్రీమాతృరహస్యం. భక్తితో పఠించినవారికీ విన్నవారికీ
అఖిలైశ్వర్యాలూ పుష్కలంగా సిద్ధిస్తాయి. పారాయణ చేసినవారు జ్ఞానులై తరిస్తారు. దీన్ని బహూకరించిన
వారికి దేవీయజ్ఞమహాఫలం లభిస్తుంది.
(అధ్యాయం - 31, శ్లోకాలు-600)
షష్ఠ స్కంధం - శ్లోకాలు 1884 - తెలుగుసేత: బేతవోలు రామబ్రహ్మం
శుభాకాంక్షలు
*మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి సందర్భంగా మా శుభాకాంక్షలు.*
https://youtu.be/GEtZ3cqsf7Q?si=z5tJ5yohOVaKDGSo
తెలుగు పంచాంగంతో పాటు
తెలుగు పంచాంగంతో పాటు దిన/వార/వార్షిక రాశి ఫలాలు, శ్లోకాలు/స్తోత్రాలు మరియు రామాయణం, మహాభారతం, శ్రీభాగవతం, కార్తీక పురాణం, స్థల పురాణం - పుణ్యక్షేత్రాలు సరళమైన భాషలో చదువుటకు మా యాప్ ను ఇన్స్టాల్ చేసుకోగలరు.
https://pxl.to/shubamangalam
Android: https://pxl.to/telugucalendar
iOS: https://pxl.to/telugu-calendar
ఆశీస్సులు
శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని !!
అందరు తమ తమ వృత్తులలో విజయం పొందాలని చేపట్టిన ప్రతీ పని విజయం సాధించాలని,ఆ దుర్గా దేవి ఆశీస్సులు మన అందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...
అందరికీ...
విజయదశమి దసరా
శుభాకాంక్షలు
మీ
C. Bhargava Sarma
Blogger, hyderabad
జగదీశ్వరి పాహి పరమేశ్వరి
https://youtu.be/OJ-b3JJ0Nxo?si=_gGYRMnj1XBj4P0O
విజయదశమి సందర్భంగా జయ జగదీశ్వరి పాహి పరమేశ్వరి ఈ పాట చిత్రీకరించడమైనది.
అలాగే మిత్రులకు శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పాఠం చూసి ఆనందించగలరు👆👆
*శ్రీ భవానీ అష్టకం*
*దేవీ నవరాత్రులు - తొమ్మిదవ రోజు - మహర్నవమి శుభాకాంక్షలు*
*శ్రీ భవానీ అష్టకం*
న తాతో న మాతా న బంధుర్న దాతా
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
భవాబ్ధావ పారే మహాదుఃఖ భీరు
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః
కుసంసార పాశ ప్రబద్ధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
న జానామి దానం న చ ధ్యానయోగం
న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్
న జానామి పూజాం న చ న్యాసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
న జానామి పుణ్యం న జానామి తీర్థం
న జానామి ముక్తిం లయం వా కదాచిత్
న జానామి భక్తిం వ్రతం వాపి మాతా
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః
కులాచారహీనః కదాచారలీనః
కుదృష్టిః కువాక్యప్రబంధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
ప్రజేశం రమేశం మహేశం సురేశం
దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
జలే చానలే పర్వతే శత్రుమధ్యే
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
అనాథో దరిద్రో జరారోగయుక్తో
మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని
- ఆది శంకరాచార్యులు
భక్తిసుధ
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*ఓంకార పంజర శుకీం*
*ఉపనిషదుద్యానకేళి కలకంఠీమ్౹*
*ఆగమ విపినమయూరీం*
*ఆర్యామంతర్విభావయేగౌరీమ్౹౹*
తా౹౹ఓంకార మనే పంజరంలోని చిలుక. ఉపనిషత్తులు అనే ఉద్యానవన ములో కూసే కోకిల. ఆగమాలనే అరణ్యములలో నాట్యమాడు మయూరము ఐన గౌరీదేవిని నా హృదయాంతరాళమున భావిస్తాను.
(కాళిదాసు-శ్యామలా నవరత్న మాలిక)
ఆలోచనాలోచనాలు
🕉️ ఆలోచనాలోచనాలు 🕉️ Be with me, Lord- - - - -. Lord, let me be a lamp -- you the bulb inside it. Lord, let me be a fire place -- and you the glow radiating from it. Lord, let me a goblet -- and you the wine with in it. Lord, let me a black board -- and you the writing on it. Lord, let me a little boat -- and you the cargo on it. Lord, let me a big field -- and you the treasure hidden in it. Lord, let me be a furrow -- and you the seed sown in it. Lord, let me be an abyss -- and you the sea that fills it. Lord, let me be the darkness -- and you the star that wrinkles in it. Lord, let me be the stillness -- and you the word echoing through it. Lord, let me be a harp -- and you the melody played on it. Lord, let me be a tool -- you the potential hidden in it. Lord, let me be a cottage -- and you the guest staying in it. Lord, let me be a temple -- and you the LORD dwelling in it. Hanne Tschakert Dt 23--10--2023, Monday, Good morning.
శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
. శ్రీమాత్రేనమః
*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
ది:23-10-2023
శా॥
విశ్వమ్మంతయు రక్షసేయు తలపున్ వేమార్లు యత్నించి నీ
శశ్వచ్ఛుండపరాక్రమోద్ధతిని విశ్వమ్మెల్ల గాపాడితే!
విశ్వశ్రేయము గూర్చు తల్లి! కరుణాబీజమ్ములన్ నాటి మా
విశ్వాసమ్మునకున్ బలమ్మిడితివే పేర్మిన్ నమోవాకముల్ -18
శా॥
పర్వమ్మియ్యది చంద్రికాసితవిభాప్రాగల్భ్యరాత్రీయుత
మ్మర్వాచీనము గాదు నీదు జయమాస్వాదించు కాలమ్మగున్
గర్వమ్మంతయు మట్టడించి వెస సత్కార్యమ్ములన్ నిల్పు యో
సర్వారాధ్య! ప్రశాంతరూపిణి! విరాజత్కీర్తి కొండాటముల్ -19
(కొండాటము=స్తుతి, పొగడ్త)
*~శ్రీశర్మద*
8333844664
*卐స్వస్తి卐*
మూడు రోజులు దుర్గాష్టమి
🙏
*మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)*
👇
*దుర్గాష్టమి*
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ *'దసరా' లేక 'దేవీ నవరాత్రులు'* అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో *చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి.* విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.
*దుర్గాష్టమి*
దుర్గాదేవి *"లోహుడు"* అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే *మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు.* ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. *"ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము",* అని అంటారు.
*మహర్నవమి*
మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.
*విజయదశమి*
దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. *'శ్రవణా'* నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి *'విజయా'* అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. *'చతుర్వర్గ చింతామణి'* అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే *'విజయం'* అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.
*'శమీపూజ'* చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే *'జమ్మిచెట్టు'.* అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న *'అపరాజితా'* దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు.
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ *'అపరాజితా'* దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం *'పాలపిట్ట'* ను చూచే ఆచారం కూడా ఉన్నది.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
*శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |*
*అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||*
పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
🙏
*🌹సౌందర్యలహరి🌹* *శ్లోకం - 62*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 62*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*ప్రకృత్యాఽఽరక్తాయా స్తవ సుదతి దంతచ్ఛదరుచేః*
*ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |*
*న బింబం తద్బింబ ప్రతిఫలనరాగా దరుణితం*
*తులా మధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా ‖*
ఈ శ్లోకంలో అమ్మవారి పెదవులను వర్ణిస్తున్నారు. లలితా సహస్ర నామములలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి పెదవులను వర్ణిస్తూ *నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా* అని గానం చేశారు. అంటే అమ్మవారి పెదవులను నవ విద్రుమమును
అంటే క్రొత్త పగడములతోనూ, బింబమునూ అనగా దొండపండ్లతోనూ పోల్చారు. అయితే శంకరులు ఇక్కడ వర్ణన చేస్తూ పగడములూ, దొండపండ్లూ అమ్మవారి పెదవుల అరుణిమకు సరితూగవంటున్నారు.
పై పెదవిని ఓష్ఠము అనీ, క్రింది పెదవిని అధరము అనీ అంటారు. కవులు నాయికా వర్ణనము చేస్తూ మధురోష్ఠము/మధురాధరము అని చెప్పటం వినివుంటారు.
ప్రకృత్యాఽఽ రక్తాయా స్తవ సుదతి దంతచ్ఛదరుచేః = స్వభావసిద్ధముగా రక్తవర్ణములో ఎర్రగా వున్న అమ్మ పెదవులు. చ్ఛదము అంటే తెర. ఇక్కడ అమ్మవారి దంతములకు తెర వలె నున్నవి అంటున్నారు.
లలితా సహస్రనామములలో *రదనచ్ఛదా* అన్నారు. రదనము అంటే వాక్కు. వాక్కుకు తెర అని.
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా = అందరూ అనుకొనేది పగడములు తీగకు కాసి, పండి, వాటి నుండి సేకరింపబడతాయని. కానీ అవి ఆక్టోపస్ జాతికి చెందిన ఒక జలచరము యొక్క ఎముక భాగము అని కంచి మహాస్వామివారు అభిప్రాయపడ్డారు. పైగా తీగకు పండినవని అనుకొన్నా, తీగ ఆకుపచ్చగా వుండి యెర్రని అమ్మవారి శరీరకాంతికి సరిపోలేదు. అందువలన అమ్మవారి పెదవులు పగడములతో పోల్చటం సరికాదు అంటున్నారు. పగడముల కాంతిని మించినవి అమ్మవారి పెదవులు.
న బింబం తద్బింబ ప్రతిఫలనరాగా దరుణితం = బింబమంటే దొండపండు. దొండ తీగ ఆకుపచ్చతనానికీ, అమ్మవారి గౌర వర్ణానికీ సరిపోలదు.అమ్మవారి శరీర కాంతి దొండపండులో ప్రతిఫలించినదంటే ఒప్పుకోవచ్చు అంటున్నారు.
తులా మధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా = అందువలన నీ పెదవుల అరుణిమతో తులతూగలేని పగడములు, దొండపండ్లూ లజ్జాభారంతో కృంగిపోతున్నవమ్మా అంటున్నారు.
లలితా సహస్రనామాల్లో పైన చెప్పిన నామమే కాక, మరొకటి *తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా* అన్న నామాన్ని కూడా స్మరించుకోవచ్చు. తాంబూలసేవనం చేసిన నోరు దానిమ్మ పూవు వలె యెర్రని కాంతులను కలిగివున్నది అని భావం.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 72*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 72*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
దట్టంగా పెరిగిన మహావృక్షం అనేకులకు నీడనిచ్చి కాపాడుతుంది. కాని ఆ నీడలో కొత్తచెట్లు ఏపుగా పెరగవు. ఆ నీడ ప్రభావం నుండి విడివడినప్పుడే తక్కిన చెట్లు పెరగగలవు. శ్రీరామకృష్ణులనే కల్పతరువు తన నీడలో పలు మొలకలను కూడా పెరగనిచ్చింది. అయినప్పటికీ అవి ఏపుగా పెరగాలంటే ఆ తరువు తన నీడను ఉపసంహరించుకోవాలి. అందుకు శ్రీరామకృష్ణులు సంకల్పించుకొన్నారు..
1884వ సంవత్సరాంతం నుండే శ్రీరామకృష్ణుల ఆరోగ్యం క్షీణించ సాగింది. ఎక్కువగా మాట్లాడడం వలనా, పాడడం వలనా, పారవశ్య స్థితుల కారణంగా గొంతులో రక్త ప్రసరణ అధికరించడంతో ఆ నొప్పి ఏర్పడిందనీ కనుక వాటినన్నింటినీ ఆపివేయమని వైద్యులు హెచ్చరించిన ఖాతరు చేయలేదు.
జూన్ నెల తరువాత హఠాత్తుగా ఆయన గొంతులో రక్తం స్రవించింది. మామూలు గొంతు వ్రణమై ఉంటుందని భావించబడిన ఆయన రుగ్మత, అంత సామాన్యమయినదిలా కనిపించలేదు. భక్తులు కలత చెందారు. "ఎవరిని కేంద్రంగా చేసుకొని మనం ఆనందంలో తేలియాడుతున్నామో ఆయన మనలను వదలి నిష్క్రమిస్తారని అనిపిస్తున్నది.
శ్రీరామకృష్ణులకు ఉత్కృష్ట వైద్యచికిత్సకు తగిన సౌకర్యాలు దక్షిణేశ్వరంలో లేవు. కనుక కలకత్తాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొన్నారు. దక్షిణేశ్వరంలో ఆరుబయట జీవించడానికి అలవాటుపడిన శ్రీరామకృష్ణులు ఆ చిన్న ఇంట్లో ఇమడలేక బాగా ఇబ్బందికి గురి కావడంతో శ్యాంపుకూర్ అనే ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు పుచ్చుకొన్నారు.శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ కు వచ్చి మూడు నెలలు గడిచిపోయాయి.
వైద్యుల చికిత్స, మాతృదేవి పరిపోషణ, యువశిష్యుల సేవాశుశ్రూషల ఫలితానికి విరుద్ధంగా ఆయన వ్యాధి రోజురోజుకీ తీవ్రం కాసాగింది. మునుపు కాస్త సత్ఫలితాలను ఇచ్చిన మందు కూడా ఇప్పుడు నిష్ప్రయోజనమయ్యాయి. కలకత్తా కలుషిత వాతావరణ కారణంగానే వ్యాధి ప్రకోపిస్తున్నదని నిర్ధారణ చేసిన వైద్యులు, నగర ప్రాంతాన్ని వదలి బాగా విశాలంగా ఉండే నగర శివార్లకు ఆయనను తరలిస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచన మేరకు భక్తులు కాశీపూర్ అనే ప్రాంతంలో ఒక ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకొన్నారు. 1885 డిసెంబర్ 11వ శ్రీరామకృష్ణులు బసను అక్కడకు మార్చారు.
రామకృష్ణసంఘ చరిత్రలో కాశీపూర్ చెరగని స్థానం పొందింది. ఇక్కడ శ్రీరామకృష్ణులు దాదాపు ఎనిమిది నెలలు గడిపారు. అద్వితీయమైన ఆయన దివ్య జీవితంలో మరపురాని ముఖ్య సంఘటనలు ఇక్కడే జరిగాయి. ఇక్కడే ఆయన నరేంద్రుని జీవితానికి ఒక ఆకృతి కల్పించి, యువకులను అతడికి అప్పగించి రామకృష్ణసంఘానికి అంకురార్పణ చేశారు. ఈ ఎనిమిది నెలలలో ఆ వ్యాధి క్రమంగా ప్రకోపించి ఆయన శరీరాన్ని కేవలం ఒక ఎముకల గూడుగా మార్చివేసింది.
అయినప్పటికీ అచంచలమైన ఆయన మనస్సు వ్యాధినీ, తద్వారా సంక్రమించిన నొప్పినీ వైదొలగజేసింది. ఇక్కడ ఆయన శిష్యులకూ, భక్తులకూ అవసరానికి తగినట్లు విడివిడిగాను, కొన్ని సమయాల్లో సామూహికంగాను శిక్షణ నిచ్చారు. ప్రత్యేకంగా, నరేంద్రుణ్ణి ఒంటరిగా పిలిచి ఉపదేశించారు. కొన్ని సందర్భాలలో తలుపులు, కిటికీలు బిగించి, అతడికి ప్రత్యేకంగా బోధించారు. ఆయన బోధించిన దేమిటో నరేంద్రుడు ఎవరికీ వెల్లడించలేదు. కాని యువకుల బాధ్యతను అప్పగించడం గురించీ, వారికి శిక్షణను ఇవ్వడం గురించీ ఆయన నరేన్ తో చర్చించి ఉంటారని తక్కిన శిష్యులు భావించారు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
నవగ్రహా పురాణం🪐* . *62వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *62వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*సూర్యగ్రహ చరిత్ర - 5*
అల్లుడు సూర్యుడు చెప్పిందంతా విశ్వకర్మ ఆశ్చర్యంతో విన్నాడు.
*"సంజ్ఞ కోరిన విధంగా నా ప్రకాశాన్నీ , తాపాన్నీ తగ్గించుకోవడానికి సిద్ధమై మీ వద్దకు వచ్చాను. నాలోంచి వెలువడే వెలుగునూ , వేడిమినీ తగ్గించే భారం మీదే !"* అన్నాడు సూర్యుడు.
విశ్వకర్మ కాస్సేపు ఆలోచించి , అన్నాడు. *"ఈ రూపంలో నీ దేహం నుండి వేడిమినీ , వెలుగును నియంత్రించడం అసంభవం. నీ మౌలిక రూపమూ , స్థూలమూ అయిన గోళాకారాన్ని నువ్వు ధరిస్తే , 'తరణి' అనే యంత్రం సాయంతో ఆ గోళాన్ని అరగదీస్తాను ! పరిమాణం తగ్గి , వేడిమి , వెలుతురూ కూడా సన్నగిల్లుతాయి !”*
మామగారి ప్రతిపాదనను సూర్యుడు ఆమోదించాడు. యోగంలో ఆసీనుడై , సంకల్ప బలంతో సూర్యగోళాకారాన్ని ధరించాడు.
దేవశిల్పాచార్యుడైన విశ్వకర్మ మహానైపుణ్యంతో సూర్యగోళాన్ని యంత్రంతో అరగ దీయడం ప్రారంభించాడు. గోళంలో ఎనిమిదవ వంతుని తరణి సహాయంతో తగ్గించి వేశాడు. ఆ కార్యక్రమ ఫలితంగా సూర్యగోళం నుండి రజను దట్టంగా రాలిపడింది.
సూర్యుడు మామగారి అనుమతితో గోళాకారాన్ని విసర్జించి తన సహజ రూపాన్ని ధరించాడు. గోళాకారంలో ఉన్నప్పటి తన దేహం నుండి రాలి పడిన రజనను ఆశ్చర్యంగా చూశాడు. అల్లుడి ఆశ్చర్యాన్ని గమనించిన విశ్వకర్మ ఇలా అన్నాడు.
*"ఈ ధూళి మహా శక్తివంతమైంది. వృధా చేయదగినది కాదు. నా నైపుణ్యాన్ని ఉపయోగించి , 'సుదర్శనం' అనే చక్రాయుధాన్నీ , మూడు మొనలతో 'త్రిశూలం' అనే ఆయుధాన్నీ , ఏకముఖంతో 'శక్తి' అనే ఆయుధాన్నీ రూపొందిస్తాను ! ఇంకా మిగలబోయే రజనుతో 'పుష్పకం' అనే ఆకాశగమన శక్తి కలిగిన దివ్య విమానాన్ని రూపొందిస్తాను !"*
సూర్యుడు ఆశ్చర్యంగా చూశాడు. *“మామగారూ ! సుదర్శన చక్రం , త్రిశూలం , శక్తి , పుష్పక విమానం - నాలుగూ నాలుగు దివ్య వస్తువులు ! ఆ అద్భుత వస్తువులను ఏం చేస్తారు ?"*
*"నాయనా ! గోళాకారంలో ఉండే నీలో వెలిగే శక్తి - విష్ణు తేజస్సు. ఈ ధూళి అంతా విష్ణు తేజస్సులో భాగమే. పుష్పక విమానాన్నీ , సుదర్శన చక్రాన్నీ , త్రిశూలాన్నీ , శక్త్యాయుధాన్నీ నా సేవలు అందుకునే బ్రహ్మ దేవుడికి సమర్పిస్తాను. ఏది ఎవరికి ఇవ్వాలో , ఎప్పుడు ఇవ్వాలో ఆ సృష్టికర్తే నిర్ణయిస్తారు !"* విశ్వకర్మ వివరించాడు.
*"మామగారూ ! ఇప్పుడు నాలోంచి వెలువడే వెలుగూ , వేడిమి క్షీణించాయా ?”*
సూర్యుడు ముందు జాగ్రత్తతో ప్రశ్నించాడు. *“అది చెప్పవలసింది నేను కాదు , సూర్యా ! నా కూతురు సంజ్ఞ !"* విశ్వకర్మ నవ్వుతూ అన్నాడు.
సూర్యుడు మామగారికి ప్రణమిల్లి తన మందిరానికి ప్రయాణమయ్యాడు...
తాపాన్నీ , కాంతినీ క్షీణింపజేసుకుని , వచ్చిన సూర్యుడిని చూసి సంజ్ఞ సంతోషంతో. పొంగి పోయింది. భర్త సేవకూ , పిల్లల పోషణకూ ఆమె పునరంకితమైంది.
ధర్మాధర్మాలను గురించిన అవగాహనను సందర్భానుసారంగా వ్యక్తం చేస్తున్న యముడి వ్యక్తిత్వం సూర్యుడికి విలక్షణంగా తోచింది. భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని అలంకరించే లక్షణాలు యముడిలో ఉన్నట్టు ఆయన గుర్తించాడు. ఒకరోజు యముడితో ఇలా అన్నాడు -
*"నాయనా , యమా ! నీలో ఆధిపత్య లక్షణాలూ , విచక్షణా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నియమ నిష్ఠలతో తదేక దీక్షతో తపస్సు చేయి. ఆయన నీకు దిశా నిర్దేశం చేస్తాడు !".*
భర్త ప్రతిపాదనను సంజ్ఞ ఆమోదించింది. తల్లిదండ్రుల ఆశీస్సులను తోడుగా తీసుకుని యముడు తపస్సు చేయడానికి బయలుదేరాడు.
సంజ్ఞా సూర్యుల సంసారం సాగిపోతోంది.
*"ఇవీ , సూర్యుని చరిత్రలోని ప్రధాన ఘట్టాలు !"* కథనం ముగిస్తూ అన్నాడు. నిర్వికల్పానంద.
*"గురువుగారూ ! చంద్రుడి చరిత్ర ప్రారంభించే ముందు ఒక సందేహం నివృత్తి చేయండి"* విమలానందుడు అన్నాడు..
*"ఏమిటది ? అడుగు , నాయనా !"*
*"విశ్వకర్మ సూర్యుడికి చెప్పిన విధంగా , విష్ణుతేజో రూపమైన సూర్యరజనుతో ఆయుధాలూ, విమానమూ...”.*
*"రూపొందించాడు !”* నిర్వికల్పానంద అద్దిస్తూ అన్నాడు. *"సుదర్శన చక్రం విష్ణువు చేతి ఆయుధమనీ , త్రిశూలం పరమశివుడి ఆయుధమనీ , శక్తి కుమారస్వామి ఆయుధమనీ మనకు తెలిసిందే కద ! విశ్వకర్మ ఆ ఆయుధత్రయాన్నీ , పుష్పకవిమానాన్నీ , బ్రహ్మదేవుడికి సమర్పించాడు. ఆయన సుదర్శన చక్ర , త్రిశూల , శక్త్యాయుధాలను హరి , హర , సుబ్రహ్మణ్యులకు ఇచ్చివేశాడు ! పుష్పక విమానాన్ని ధనాధిపతి అయిన కుబేరుడికి ఇచ్చాడు ! దానిని ఆయన నుండి రావణాసురుడు లాక్కున్నాడు !”*
*"ఆ కథాంశాన్ని అలా వదిలేసి , చంద్రుడి చరిత్రను చెప్పుకుందాం ! తార బృహస్పతిని చేరుకుంది. ఆమెకూ , తనకూ జన్మించిన బాలుడు బుధుడు తన తండ్రి అత్రి మహర్షి పెంపకంలో ఉండిపోయాడు. తారతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ , మందిరంలో ఒంటరిగా నిస్సారమైన జీవితం గడుపుతున్నాడు చంద్రుడు. ఆ సందర్భంలో ఒకరోజు నారదుడు చంద్ర మందిరానికి వచ్చాడు !”* నిర్వికల్పానంద తన కథనం కొనసాగించాడు...
*రేపటి నుండి చంద్రగ్రహ చరిత్ర ప్రారంభం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
రుగ్వేదంలోని మన్యు సూక్తం
మహ అద్భుతం.ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు. ఇది డిలీట్ చెయ్యకండి.వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఇది రుగ్వేదంలోని మన్యు సూక్తం. దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని రుగ్వేదంలో రాయబడింది. సో మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి .
Driver less taxi
Driverless taxi service started first time in world.
పూజాకార్యక్రమాల సంకల్పము. పూర్వ పద్ధతి పంచాంగం.
**********
*శుభోదయం*
*********
సంధ్యా వందన మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ. 23.10..2023
సోమ వారం (ఇందు వాసరే)
*************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
___________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరదృతౌ
ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే
నవమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
ఇందు వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరత్ ఋతౌ ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే నవమ్యౌపరి దశమ్యాం.
ఇందు వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.5.58
సూ.అ.5.32
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం
శుక్ల పక్షం నవమి మ.3.08 వరకు.
సోమ వారం.
నక్షత్రం శ్రవణం మ.3.45 వరకు.
అమృతం ఉ.6.00 ల 7.30 వరకు.
పునరమృతం తె.4.25 ల 5.55 వరకు.
దుర్ముహూర్తం ప.12.08 ల 12.54 వరకు.
దుర్ముహూర్తం మ.2.27 లో 3.13 వరకు.
వర్జ్యం రా.7.28 ల 8.58 వరకు .
యోగం శూలం సా.6.23 వరకు.
కరణం కౌలవ మీ.3.08 వరకు.
కరణం బవ సా. 5.24 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే..
రాహు కాలం ఉ7.30 ల 9.00 వరకు.
గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు.
యమగండ కాలం ఈ.10.30 12.00 వరకు. .
.***********
పుణ్యతిధి ఆశ్వయుజ శుధ్ధ నవమి మరియు దశమి.
.**********
*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,బి
Sachivalayanagar,
Vanasthalipuram,
Rangareddy Dist, 500 070,
80195 66579.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
పంచాంగం 23.10.2023 Monday,
ఈ రోజు పంచాంగం 23.10.2023 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: నవమి తిధి ఇందు వాసర: శ్రవణా నక్షత్రం శూల యోగ: బాలవ తదుపరి కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.
నవమి సాయంత్రం 05:42 వరకు.
శ్రవణం సాయంత్రం 05:11 వరకు .
సూర్యోదయం : 06:15
సూర్యాస్తమయం : 05:45
వర్జ్యం : రాత్రి 08:53 నుండి 10:22 వరకు.
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:23 నుండి 01:09 వరకు తిరిగి మధ్యాహ్నం 02:41 నుండి 03:27 వరకు.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు
యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5124*
*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం - నవమి - శ్రవణం - ఇందు వాసరే* (23.10.2023)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/PBzCH9cd7HM?si=Z-XWHrJO-NDFxSZE
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
స్తోత్ర పఠనం
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*స్తోత్ర పఠనం..విధి విధానాలు..*
*(ఐదవ రోజు)*
శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట, ప్రభావతి గారు ఆదిత్యహృదయం స్తోత్రాన్ని రోజూ తాను పఠించే విధంగా గబ గబా చెప్పేసారు..ఈసారి ఎటువంటి తడబాటూ లేదు..ఒక్క అక్షరమూ తప్పు పోలేదు..మొత్తం ముప్పై ఒక్క శ్లోకాలూ గడ గడా చెప్పేసారు..రెండు మూడు నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది..
ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు..ప్రభావతి గారి వైపు చూసి..ఒకింత అసహనంగా.."ఏమిటమ్మా ఆ వేగం?..అమ్మా!..నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్ధమైందా?..ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా..ఇలా రోజూ పారాయణం చేస్తే ప్రయోజనము వుందా తల్లీ!..తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల నోటి నుంచి దేవభాష అయిన సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని..నువ్వు ఒక్క క్షణంలో వల్లె వేసావే.. ఆ మంత్రాల్లోని సుస్వరమూ..సంధులూ.. సమాసాలూ..ఒక నియమానుసారంగా వుండి.. ఉచ్ఛారణలో ఆ మంత్ర శక్తి ప్రాణం పోసుకుంటుంది..ఆ మంత్రోచ్ఛారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది..ఎంతో మహిమాన్వితమైన ఆదిత్యహృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం..వాల్మీకి మహర్షి వ్రాసిన ఆదికావ్యం రామాయణం లో చెప్పబడింది..అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పచెప్పుతానా అన్నట్లు చెప్పేసావే..ఇది కాదు పద్ధతి!.."
"ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు..అందులోని ప్రతి అక్షరము..సంధి..సమాసము..దానిలోని అర్ధమూ..స్పష్టమైన ఉచ్ఛారణతో.. మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే..ఆ మంత్రాధి దేవతకు నిజమైన పూజ చేసినట్లు..అంతేకానీ..ఇప్పుడు నువ్వు చదివినట్లుగా..ఇదిగో, ఇన్ని నిమిషాల లోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా..అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేసామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడి గురించిన చింత ఎక్కడుంది?..కొద్దిసేపు పూజ చేసినా..ఏకాగ్రచిత్తంతో భగవంతుడిని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి..చిత్తశుద్ధి ముఖ్యం..ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా..మెల్లిగా ఆ స్తోత్ర అర్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ..ఆ దేవీ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్టించుకొని చేయి..ఫలితం ఉంటుంది.."
"అహంకారం తొలిగిపోనంతవరకూ..మనసు వాసనారహితం కానంతవరకూ..బ్రహ్మజ్ఞానం గోచరం కాదు..అందుకు సద్గురు కృప ఉండాలి తల్లీ!..ఆత్మ సర్వ జీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెపుతారు..కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతమిద్ధంగా వర్ణించలేరు..ఆత్మ సాక్షాత్కారమూ సులభంగా పొందలేరు..గురువు అనుగ్రహమొక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది..సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యం తోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరు..నిత్య నైమిత్తిక కర్మలు యధావిధిగా ఆచరించాలి..శుద్ధమైన మనసుతో, సంస్కారయుతంగా కర్మలను చేయాలి.."
ఇలా చెపుతున్న స్వామివారి వాక్ప్రవాహం అంతటితో ఆగలేదు..శ్రీధరరావు దంపతుల కు ఉపనిషత్తుల గురించి..వాటి లోని ముఖ్యమైన శ్లోకాలు..వాటి అర్ధాలు..వాటి ఉచ్చారణ..భగవద్గీతా శ్లోకాలు..భక్తి, జ్ఞాన యోగాలు..గంగా ప్రవాహంలా ఆయన నోటినుంచి జాలువారుతున్నాయి.. ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ..సమయమెంత గడిచిందో గుర్తుకురాలేదు..సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చుని శ్రీ స్వామివారు చేసిన బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకొని పోయింది..
మాలకొండ వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద మొదటి సారి ఆ యోగిని దర్శించుకోవడం..ఆయన ఉపదేశము విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి..తాము దర్శించుకున్నది సాధారణ మానవుణ్ణి కాదనీ..సాక్షాత్ జ్ఞాన స్వరూపమే ఈ యోగిపుంగవుడి రూపంలో ఇక్కడ నడయాడుతోందనీ అర్ధమైంది..ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని బోధపడింది..
"శ్రీధరరావు గారూ..పొద్దుకూకుతోంది.. మీరు మళ్లీ మీ గ్రామం చేరాలి..బైలుదేరండి!..నాకూ జపానికి వేళయింది.." అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించాకగానీ...వాళ్ళు ఇహ లోకంలోకి రాలేదు..
దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి, పార్వతీదేవి మఠం వెలుపలికి వచ్చేసారు..శ్రీ స్వామివారు తలూపి..పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని, వీళ్లిద్దరి దగ్గరకూ వచ్చి..ఆశీర్వదించినట్లుగా చేయెత్తి ఊపి..లోపలికి వెళ్లిపోయారు..
మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగలిచెర్ల కు తమ రెండెడ్ల బండిలో పయనమయ్యారు..దాదాపు ఆరు ఏడు గంటలపాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి, తాము పొందిన అనుభూతి ని ఇద్దరూ మాట్లాడుకోసాగారు..
"స్వామి వారి పూర్వాశ్రమం గురించి మీరేమన్నా కనుక్కున్నారా?..వారిది ఏ ఊరు?..తల్లిదండ్రులెవరు?..మాలకొండకు ఎప్పుడు వచ్చారు?.." అని ప్రభావతి గారు భర్తను అడిగారు..శ్రీధరరావు గారు.."కొంత వివరం సేకరించాను ప్రభావతీ..ఇంటికెళ్లి మాట్లాడుకుందాం.."అన్నారు..
శ్రీ స్వామివారి పుట్టుపూర్వోత్తరాలు...రేపటినుంచీ తెలుసుకుందాము...
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
చండీహోమం ఎవరికి
చండీహోమం ఎవరికి సంబంధించినది..............!!
ఇది బ్రాహ్మణులకి..మాత్రమే..కాదు..
అన్ని వర్ణాల వారికి..సంబంధించినది.
దీని గురించి వేదాలలో ఎటువంటి సమాచారం సరియైనది లేదు..
చండీ ఆరాధన కలకత్తా దగ్గరలోని గిరిజన జాతులవారు ప్రారంభించారని పెద్దలు చెప్పియున్నారు,
వారి వద్ధనుండే చండీహోమం ఆరాధన,,హోమం బయల్పడినాయి.
కాలక్రమేణా బ్రాహ్మణులు,,పండితులు కూడా చండీహోమం చేయనారంభించారు.
లక్ష్మీ,,సరస్వతీ,,పార్వతీదేవి,,ఈ ముగ్గరు శక్తుల కలయికతో ఏర్పడినదే మహాచండీ..
ఈమె హోమం చేయడంవల్ల సమస్త బాధలు నివారణమవుతాయి.
వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
శత్రువులు నశిస్తారు.
పరప్రయోగాలతో బాధపడేవారు..
తరచుగా కుటుంబంలో మరణాలు సంభవిస్తున్నవారు..
అకారణంగా కోర్టు కేసులలో ఇరుక్కుంటున్నవారు.
ఇంకేమైనా ఇతరత్రా సమస్యలతో బాధపడతున్నవారు చండీహోమాన్ని చేయించుకోవడం వల్ల చండీమాత అనుగ్రహంతో త్వరితగతిని వాటినుండి బయటపడతారు,,
చండీమాత ఉగ్రరూపమే కాళికామాత,,
ఈమె శాంతరూపంలో..
మంగళచండి,
సంకటచండీ,,
రణచండీ,,
ఓరైచండీ గా
పూజలందుకుంటారు..
చండీహోమం ఈరోజున చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది,,
ప్రముఖ దేవాలయాలలో చేయించుకునే చండీహోమం వల్ల కేవలం 5% మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. ఎవరైనా చేయించుకునే ఆర్థికస్తోమత ఉన్నవారు ఎవరికివారుగా..
ఆర్థికస్తోమత తక్కువగా ఉన్నవారు నాలుగు కుటుంబాలవారు కలిసికట్టుగా గాని చండీహోమం చేయించుకోవచ్చు,,
చండీ హోమము ఎందుకు చేయాలి..!
అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే.!
చండీ మాత ఓ ప్రచండ శక్తి.
భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది.
సృష్టి జరగడానికి,
అది వృద్ధి చెందడానికి,
తిరిగి లయం కావడానికి
అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది.
ఆమె ఆదిశక్తి,
పరాశక్తి,
జ్ఞానశక్తి,
ఇచ్చాశక్తి,
క్రియాశక్తి,
కుండలినీ శక్తి!
అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.
లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి.
లోక కల్యాణం కోసం,
విశేష కార్యసిద్ధి కోసం
సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు
మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం
అనాదిగా వస్తోంది.
ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.
అది లలితా పారాయణం,
చండీ పారాయణం
అని రెండు రకాలు.
బ్రహ్మాండ పురాణం,
దేవీ భాగవతం
లలితాదేవి మహిమలను చెబితే,
మార్కండేయ పురాణం
చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది.
చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.
చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు....
చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు,
అర్థశ్లోక,
త్రిపాద శ్లోక
మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి.
బ్రాహ్మీ,
నందజా,
రక్తదంతికా,
శాకంబరీ,
దుర్గా,
భీమా,
భ్రామరీ
అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి
దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది.
ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.
దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా,
13 అధ్యాయాలుగా ఉంటుంది.
తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది.
రెండో భాగంలో మూడు అధ్యాయాలు,
మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన,
మహిషాసుర సంహారం,
శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి.
సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు.
పూజ,
పారాయణ,
హోమం.
ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు.
పారాయణలో దశాంశం హోమం,
దశాంశం తర్పణం ఇస్తారు.
చండీ హోమానికి సంబంధించి..
నవ చండీ యాగం,
శత చండీ యాగం,
సహస్ర చండీ యాగం,
అయుత (పది వేలు) చండీ యాగం,
నియుత (లక్ష) చండీ యాగం,
ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.
చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:.....
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు.
దుఃఖం అనేది రాదు.
ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు.
లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.
కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం.
ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి,
గ్రహాల అనుకూలతకు,
భయభీతులు పోవడానికి,
శత్రు సంహారానికి,
శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.
వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.
ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని,
ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని,
మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది.
ఇక, శత చండి చేస్తే కష్టాలు,
వైద్యానికి లొంగని అనారోగ్యం,
ధన నష్టం తదితరాలు తొలగుతాయి.
సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది.
కోరికలు నెరవేరతాయి.
లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది.
దీనినే నియుత చండి అంటారు.
ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు..!
ఓం నమః శివాయ..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
శుభమిడు దసరా జనులకు
కం..
శుభమిడు దసరా జనులకు
శుభ మభ్యుదయంబుల నిడు శుభమౌదసరా
శుభమౌ తెలగాణకుభువి
విభవంబది రాముడిచ్చు విజ్ఞత బెంచున్....
డా.. శేషం వేణుగోపాల శర్మ
సోమవారం, అక్టోబరు 23, 2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
సోమవారం, అక్టోబరు 23, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:నవమి మ3.08 వరకు
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:శ్రవణం మ3.44 వరకు
యోగం:శూలం సా6.21 వరకు
కరణం:కౌలువ మ3.08 వరకు తదుపరి తైతుల రా1.58 వరకు
వర్జ్యం:రా7.27 - 8.57
దుర్ముహూర్తము:మ12.08 - 12.54 & మ2.26 - 3.13
అమృతకాలం:ఉ7.28వరకు & మరల తె4.24 - 5.54
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి : తుల
చంద్రరాశి : మకరం
సూర్యోదయం:5.58
సూర్యాస్తమయం: 5.32
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
పనులను కష్టం బనుచును
*కం*
పనులను కష్టం బనుచును
పనిచేయుట మానుకన్న పనిలో నెపుడున్
అనువగు సౌలభ్యమెరిగి
పనిమంతులుగా నెగడుట బాధ్యత సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పనులు కష్టం గా ఉన్నాయంటూ మానివేయడం కన్నా ఆ పనిలో సౌలభ్యాన్ని తెలుసుకుని పనులు చేస్తూ పనిమంతులుగా వర్ధిల్లడం మన బాధ్యత.
*సందేశం*:-- ప్రతీ పనిలో నూ ఖచ్చితంగా ఒక సులభమార్గం ఉంటుంది, అది తెలుసుకోవడానికి ప్రయత్నించి పనిమంతులుగా వర్ధిల్లవలెను.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
దశవిధ రిపు సంహారము
దశహర పర్వంబునందు దర్శించదగున్.
దశగుణకర విజయదశమి
దిశదెల్పును కనకదుర్గ దీవెన సుజనా.
*అందరికీ విజయదశమి శుభాకాంక్షలు*
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
దసరా శుభాకాంక్షలు
ఈ విజయదశమి నుంచి మళ్లీ విజయదశమి వరకు అన్నీ విజయాలే కలగాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
దసరా శుభాకాంక్షలు 🎊🎉
మీ..
Bhargava Sarma
సోమవారము, అక్టోబర్, 23, 2023
సోమవారము, అక్టోబర్, 23, 2023
-----------------------------------------
మాసం: ఆశ్వీయుజ మాసం
ఆయనం: దక్షిణాయణం
పక్షము: శుక్ల పక్షము
ఋతువు: శరత్ ఋతువు
అమృతకాలము: 07:29 నుండి 08:59 వరకు, 05:50, అక్టోబర్ 24 నుండి 07:19, అక్టోబర్ 24 వరకు
సూర్యోదయము: 06:11
సూర్యాస్తమయము: 17:50
రాహు కాలం: 07:39 నుండి 09:06 వరకు
యమగండము: 10:33 నుండి 12:00 వరకు
దుర్ముహుర్తములు: 12:24 నుండి 13:10 వరకు, 14:43 నుండి 15:30 వరకు
అభిజిత్: 11:37 నుండి 12:24 వరకు
కరణం: బాలవ 06:54 వరకు, కౌలవ 17:44 వరకు
చంద్రోదయం: 13:56
చంద్రాస్తమయం: 01:30, అక్టోబర్ 24
చంద్ర రాశి: మకరము 04:23, అక్టోబర్ 24
తిథులు: నవమి 17:44 వరకు
నక్షత్రము: శ్రవణం 17:14 వరకు
గుళిక కాలం: 13:28 నుండి 14:55 వరకు
శక: 1945 శోభకృత్
వర్జ్యం: 20:56 నుండి 22:25 వరకు
యోగా: శూల 18:53 వరకు
Checkout Telugu Calendar Panchangam App:
IOS : https://itunes.apple.com/app/telugu-calendar/id1448360812
మహిషాసుర మర్దిని!
మహిషాసుర మర్దిని!
ఉ: తారకపర్వతా గ్రపరితః పరిపుష్పితసత్కదంబకాం/
తారసభాంతరస్థలసుధాకర రత్నమృ గేంద్రపీఠిపైఁ/
జేరి జగంబు లేలు శశి శేఖర గేహినివైన నిన్నుఁ జె/
న్నార భజింతునమ్మమహిషాసురమర్ధని ! పుణ్యవర్ధనీ!
దిట్టకవి రామచంద్రకవి " మహిషాసురమర్ధని శతకము" నుండి🙏🙏🙏🌷🌷🌷🌷🌷