*కం*
పనులను కష్టం బనుచును
పనిచేయుట మానుకన్న పనిలో నెపుడున్
అనువగు సౌలభ్యమెరిగి
పనిమంతులుగా నెగడుట బాధ్యత సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పనులు కష్టం గా ఉన్నాయంటూ మానివేయడం కన్నా ఆ పనిలో సౌలభ్యాన్ని తెలుసుకుని పనులు చేస్తూ పనిమంతులుగా వర్ధిల్లడం మన బాధ్యత.
*సందేశం*:-- ప్రతీ పనిలో నూ ఖచ్చితంగా ఒక సులభమార్గం ఉంటుంది, అది తెలుసుకోవడానికి ప్రయత్నించి పనిమంతులుగా వర్ధిల్లవలెను.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
దశవిధ రిపు సంహారము
దశహర పర్వంబునందు దర్శించదగున్.
దశగుణకర విజయదశమి
దిశదెల్పును కనకదుర్గ దీవెన సుజనా.
*అందరికీ విజయదశమి శుభాకాంక్షలు*
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి