21, జూన్ 2021, సోమవారం

పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

 *నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*


15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల గోష్టి నుంచి  ఒక పండితుడు షేర్  చేసి వారు చేసిన కృషియే ఈ  అక్షర రూపం 


1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..


పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని 

ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా


ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,

చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)

(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)


3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!


4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!


5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి

రావటం వధూవరులని ఆశీర్వదించటం..

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి

జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!


6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!


7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!


ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....

అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.

వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని ఈ వ్యాసం. అందరికి అందించండి.

అందరూ  వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం

నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

సినీవాలి పత్రికను చదవడానికి

 మిత్రమా! సినీవాలి పత్రికను చదవడానికి 


cineevaali.com 


వెబ్సైట్ ఓపెన్ చేయండి. 

ఆరు సీరియల్స్, రెండు కథలు, కవితలు, ధర్మ పథం, తెలుగు భాషా సంపద, మిరుమిట్లు, బాచీ కార్టూన్లు ఉన్నాయి. 


మీకు నచ్చితే మీ గ్రూపులలో, మిత్రులకు షేర్ చేయండి. 


ధన్యవాదములతో, 


మీ మిత్రుడు 


డాక్టర్ ప్రభాకర్ జైనీ

చీఫ్ ఎడిటర్

సైబర్‌ నేరగాళ్ల -155260ను అందుబాటులోకి

 155260ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్ర హోంశాఖ


తక్షణం ఫిర్యాదు చేస్తే డబ్బు బదిలీని అడ్డుకోవచ్చు


న్యూఢిల్లీ: మీరు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారా? వారి మాయమాటలు నమ్మి, సొమ్ము బదిలీ చేశారా? ఓటీపీలు, క్రెడిట్‌కార్డుల వివరాలు చెప్పేశారా? సాధారణంగా మీరు సైబర్‌క్రైమ్‌ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును తమ ఖాతాల నుంచి ఉపసంహరించేసుకుంటారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. మోసాన్ని గుర్తించి (మీ అకౌంట్ల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే) వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 155260 అమల్లోకి తెచ్చింది.



ఏప్రిల్‌లో నంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకొచ్చింది.


ఆర్‌బీఐసహా అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, వ్యాలెట్లు, ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ సహకారంతో ఈ హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌) హెల్ప్‌లైన్‌ అమల్లో ఉంది. డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు డబ్బు డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ నుంచి బయటకు వెళ్లక ముందే అప్రమత్తమైతే చాలావరకు వెనక్కి వస్తుందని అంటున్నారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైబర్‌ నేరస్తులు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు.. ఇలా ఐదు బ్యాంకుల ఖాతాల్లోకి మార్చినప్పటికీ సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా అధికారులు వెనక్కి రప్పించగలిగారు.

శ్రీరమణీయం* *-(184)*_

 _*శ్రీరమణీయం* *-(184)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"చైతన్యం.. ప్రాణశక్తి ఒక్కటేనా ? తేడాలు ఉన్నాయా !?"*_


_*మనలో ప్రాణశక్తిగా ఉన్నది చైతన్యమే ! జీవనం కోసం చైతన్యం మనసు ద్వారా ఐదు ఇంద్రియాలుగా మారుతోంది. నిద్రలో ఇంద్రియాల నుండి ఉపసంహరించుకొని తిరిగి ఒకే ప్రాణశక్తిగా ఉంటుంది. ఈ సృష్టి అంతటినీ ప్రేరేపించే ప్రాణశక్తిని గుర్తించటమే గాయత్రి మంత్రంలోని మర్మం. మనని, ఈ విశ్వాన్ని నడిపించే చైతన్యానికే బ్రహ్మపదార్ధమని, శివుడిని, విష్ణువని, అమ్మవారని పనిని బట్టి పేర్లు పెట్టుకుంటున్నాం. ప్రకృతి గా ఉన్నది అమ్మవారైతే అంతరంగంలో ఆధారంగా ఉన్నది శివచైతన్యమే. ప్రాణం శివుడైతే, మన దేహమే అమ్మవారు. ప్రాణానికి, దేహానికి ఉన్న తేడా తెలుసుకోవటమే ఆత్మానాత్మ వివేకం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'మనసు పవిత్రం - ఆలోచనలే వికారం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

మహానుభావుడు


#రాముడు_జన్మించిన_స్థలం_వేదాల_నుండి #ఆధారం చూపిన మహానుభావుడు!!!

#2నెలల_వయసులోనే #కంటిచూపు_కోల్పోయిన వ్యక్తి #22భాషలలో_పండితుడు!!

#80గ్రంధాలకు_పైగా_సంకలనం చేసిన కవి,రచయిత!!

 

ఈయనే రాంభద్రచార్య గారు వేద పురాణ పారాయణంతో సుప్రీంకోర్టులో రామ్‌లలాకు(అయోధ్య)

 అనుకూలంగా సాక్ష్యం ఇచ్చారు.


 ఈ అభిప్రాయం సుప్రీంకోర్టులో ఉంది ... ధర్మచక్రవర్తి, #తులసీపీఠం వ్యవస్థాపకుడు, 

#పద్మవిభూషణ్, 

#రాంభద్రచార్య , శ్రీ రామ జన్మభూమికి అనుకూలంగా  హాజరయ్యారు ... 

వీరికి అనుకూలంగా లేఖనాల నుండి ఆధారాలు ఇవ్వాలి.


న్యాయమూర్తి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ముస్లిం ...

ఆయన కోర్ట్ లోకి వెళ్ళిన వెంటనే,

"మీరు ప్రతిదానిలో వేదాల నుండి రుజువు అడుగుతారు ...కాబట్టి అయోధ్యలోని ఆ ప్రదేశంలో శ్రీ రాముడు జన్మించాడని వేదాల నుండి రుజువు ఇవ్వగలరా?"

జగద్గురు రాంభద్రచార్య గారు దానికి జవాబుగా  "నేను ఇవ్వగలను సార్" అని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అన్నాడు ... 

మరియు ఆయన #ఋగ్వేదంలోని_జైమిన్య_సంహిత నుండి కోట్ చేయడం ప్రారంభించాడు, దీనిలో ఒక నిర్దిష్ట ప్రదేశం నుండి దిశ మరియు దూరం #సరయు_నది యొక్క వివరాలు ఖచ్చితంగా ఉన్నాయి, శ్రీ రామ జన్మభూమి యొక్క స్థానం కూడా అక్కడ చెప్పబడింది.


కోర్టు ఆదేశాల మేరకు, #జైమిన్య_సంహితను తెప్పించారు ... మరియు అందులో ఆయన పేర్కొన్న పేజీ నంబర్ తెరిచి, అన్ని వివరాలు సరైనవేనా కావా అని సరిచూసుకోగా అవి సరైనవే అని గుర్తించబడ్డాయి ... అంటే ...

రాంభద్ర యొక్క ప్రకటన తీర్పును హిందువుల వైపు మళ్లించింది…

ముస్లిం న్యాయమూర్తి కూడా దీనికి అంగీకరించారు, "ఈ రోజు నేను భారతీయ జ్ఞానం యొక్క అద్భుతాన్ని చూశాను ... 

భౌతికంగా కళ్ళు లేని వ్యక్తి, 

వేదాలు మరియు గ్రంథాల యొక్క విస్తారమైన పరిమాణం ఎలా ఉటంకించబడింది అని చెప్తున్నాడు ,ఎలా? ఇది దైవిక శక్తి కాకపోతే, ఏమిటి?"అని చెప్పగా దానికి రాంభద్ర గారు

 "నేను రెండు నెలల వయస్సులో కంటి చూపును కోల్పోయాను, ఈ రోజు 22 భాషలు మాట్లాడతాను, 80 గ్రంధాలు వ్రాయబడ్డాయి నాచేత.


సనాతన ధర్మం ప్రపంచంలోనే పురాతన ధర్మం అని చెబుతారు.  వేదాలు మరియు పురాణాల ప్రకారం, దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పటి నుండి సనాతన ధర్మం ఉంది.  తరువాత దీనిని ఋషులు మరియు సన్యాసులు ముందుకు తీసుకువెళ్లారు.  అదేవిధంగా, ఎనిమిదవ శతాబ్దంలో, #శంకరాచార్య వచ్చారు,ఆయన సనాతన ధర్మాన్ని పెంపొందించడంలో సహాయపడ్డాడు.

#పద్మవిభూషణ్ రాంభద్రచార్య తన వైకల్యాన్ని ఓడించి జగద్గురు అయిన సన్యాసికి చెందినవాడు.


 1. జగద్గురు రాంభద్రచార్య చిత్రకూటం లో నివసిస్తున్నారు.అతని అసలు పేరు #గిర్ధర్_మిశ్రా, అతను ఉత్తర ప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లాలో జన్మించాడు.


 2.రాంభద్రచార్య ఒక ప్రముఖ పండితుడు, విద్యావేత్త, బహుభాషా రచయిత, ఉపన్యాసకుడు, తత్వవేత్త మరియు హిందూ దర్మ నాయకుడు.


 3. రామానంద సాంప్రాదయముకు చెందిన ప్రస్తుత నలుగురు జగద్గురు రామానందచార్యలలో ఆయన ఒకరు, 1988 నుండి ఈ స్థితిలో ఉన్నారు.


 4. జగద్గురు రాంభద్రచార్య వికలాంగుల విశ్వవిద్యాలయ స్థాపకుడు మరియు చిత్రకూటం లోని  తులసీదాస్ పేరిట స్థాపించబడిన తులసి పీఠం అనే ధర్మ మరియు సామాజిక సేవకు జీవితకాల ఛాన్సలర్.


 5. జగద్గురు రాంభద్రచార్యకు కేవలం రెండు నెలల వయస్సు ఉన్నప్పుడు, అతని కంటి చూపు పోయింది.


 6. అతను పాలిగ్లోట్ మరియు సంస్కృత, హిందీ, అవధి, మైథిలి వంటి #22భాషలతో సహా అనేక భాషలలో కవి మరియు రచయిత.


 7. నాలుగు పురాణాలు (సంస్కృతంలో రెండు మరియు హిందీలో రెండు) సహా 80 కి పైగా పుస్తకాలు మరియు గ్రంథాలను ఆయన రచించారు.  తులసీదాస్‌పై భారతదేశపు ఉత్తమ నిపుణులలో ఒకరిగా ఆయన లెక్కించబడ్డారు.


 8.చూపు రావడం కోసం రోహ ధాన్యాలు పేలడానికి డాక్టర్ గిరిధర్ కళ్ళలో వేడి ద్రవాన్ని ఉంచాడు, కాని రక్తస్రావం కారణంగా గిరిధర్ కంటి చూపును కోల్పోయాడు.


 9. వారు బ్రెయిలీ లిపిని చదవలేరు, వ్రాయలేరు లేదా ఉపయోగించలేరు.  వారు వినడం ద్వారా మాత్రమే నేర్చుకుంటారు మరియు మాట్లాడటం ద్వారా వారి కూర్పులను వ్రాస్తారు.


 10. 2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది.


Copy post;-

 జై సియరం 

SP Ram

కాలభైరవ పరశురామ్

ఈ రోజు గాయత్రి జయంతి_

 *🚩ఈ రోజు గాయత్రి జయంతి_🚩*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


గాయత్రి జయంతి తేదీ & సమయం

గాయత్రి జయంతి తేదీ - 2021 జూన్ 21 సోమవారం

ఏకాదశి తిథి ప్రారంభమైంది - 2021 జూన్ 20 న 04:21 PM

ఏకాదశి తిథి ముగుస్తుంది - 2021 జూన్ 21 న 01:31 PM



*గాయత్రి  ప్రార్ధన*


*ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః*

*యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్*

*గాయత్రీం వరదా* *భయాంకుశ* *కశాశ్శుభ్రమ్కపాలం గదామ్*

*శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే*


గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త , విద్రుమ , హేమ , నీల , ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ , చక్ర , గద , అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని , శిరస్సులో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.


అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ , మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను , సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు , ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.


నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి , అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.


*శ్రీ గాయత్రీ మాత మహాత్యం*


వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.


*ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యమ్*

*భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్*


ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.


త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏకాగ్రత , ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం , గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ , వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.  ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని , ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది.  ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి , కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ *‘ఓం నమో గాయత్రీ మాత్రే’* అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.


బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ , నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి , సృష్టి ఉత్పత్తి , వర్తన , పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి.  ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.


*గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.*

*గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:*



*01. వినాయకుడు:* సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ , జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.


*02. నృసింహ స్వామి:* పరాక్రమ శక్తికి అధిపతి , పురుషార్థ , పరాక్రమ , వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.


*03. విష్ణుమూర్తి:* పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.


*04. ఈశ్వరుడు:* సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.


*05. శ్రీకృష్ణుడు:* యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను , వైరాగ్య , జ్ఞాన , సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.


*06. రాధాదేవి:* ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి , భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.


*07. లక్ష్మీదేవి:* ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం , సంపద , పదవి , వైభవం , ధనం , యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.


*08. అగ్నిదేవుడు:* తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం , శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.


*09. మహేంద్రుడు:* రక్షాశక్తికి అధిష్ఠాత , అనారోగ్యాలు , శతృభయాలు , భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.


*10. సరస్వతి:* విద్యా ప్రదాత. జ్ఞానాన్ని , వివేకాన్ని , బుద్ధిని ప్రసాదిస్తుంది.


*11. దుర్గాదేవి:* దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి , శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.


*12. ఆంజనేయుడు:* నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి , నిష్ఠ , కర్తవ్య పరాయణ తత్వం , బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.


*13. భూదేవి:* ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని , ధైర్యాన్ని , దృఢత్వాన్ని , నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.


*14. సూర్య భగవానుడు:* ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని , సుదీర్ఘ జీవనాన్ని , ప్రాణశక్తికి , వికాసాన్ని , తేజస్సును ప్రసాదిస్తాడు.


*15. శ్రీరాముడు:* ధర్మం , శీలం , సౌమ్యత , మైత్రి , ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.


*16. సీతాదేవి:* తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి , అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమే.


*17. చంద్రుడు:* శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం , క్రోధం , మోహం , లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.


*18. యముడు:* కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.


*19. బ్రహ్మ:* సకల సృష్టికి అధిష్ఠాత.


*20. వరుణుడు:* భావుకత్వాన్ని , కోమలత్వాన్ని , దయాళుత్వాన్ని , ప్రసన్నతను , ఆనందాన్ని అందిస్తాడు.


*21. నారాయణుడు:* ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.


*22. హయ గ్రీవుడు:* సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని , సాహసాన్ని ప్రసాదిస్తాడు.


*23. హంస:* వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.


*24. తులసీ మాత:* సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి , దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.



*శ్రీ గాయత్రీ అష్టకం*



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



*ఉషఃకాలగమ్యా ముదాత్త స్వరూపాం*


*అకార ప్రవిష్టాముదారాంగ భూషామ్‌*


*అజేశాదివంద్యా మజార్చాంగ భాజాం*


*అనౌపమ్య రూపాం భజామ్యాది సంధ్యామ్‌ !!*


*సదాహంసయానాం స్పురద్రత్న వస్త్రాం*


*వరా భీతి హస్తాం ఖగామ్నాయ రూపామ్‌*


*స్ఫురత్స్వాధికామక్షమాలాంచ కుంభం*


*దధా నామహం భావయే పూర్వసంధ్యామ్‌ !!*


*స్ఫురచచంద్ర కాంతాం శరచ్చంద్ర వక్త్రాం*


*మహా చంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్‌*


*త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్యపత్నీం*


*వృషారూఢ పాదాం భజే మధ్య సంధ్యామ్‌ !!*


*సదాసామగాన ప్రియాం శ్యామలాంగీం*


*అకారాంతరస్థాం కరోల్లాసి చక్రామ్‌*


*గణాపద్మహస్తాం స్వనత్పాంచజన్యాం*


*ఖగేశోపవిష్టాం భజేమాస్త సంధ్యామ్‌ !!*


*ప్రగల్భ స్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం*


*సదాలంబ మానస్తన ప్రాంతహారామ్‌*


*మహా నీలరత్న ప్రభాకుండలాఢ్యాం*


*స్ఫురత్స్మేర వక్తాం భజేతుర్య సంధ్యామ్‌ !!*


*హృదంభోజమధ్యే పరామ్నాయనీడే*


*సుఖాసీన సద్రాజ హంసాం మనోజ్ఞామ్‌*


*సదాహేమభాసాం త్రయీవిద్య మధ్యాం*


*భజామస్తువామో వదామ స్మరామః !!*


*సదాతత్పదైస్తూయమానాం సవిత్రీం*


*వరేణ్యాం మహా భర్గరూపాం త్రినేత్రామ్‌*


*సదా దేవదేవాది దేవస్యపత్నీం*


*మహంధీ మహీత్యాది పాదైకజుష్టామ్‌ !!*


*అనాథం దరిద్రం దురాచారయుక్తం*


*శతం స్థూలబుద్ధిం పరం ధర్మహీనం*


*త్రిసంధ్యాం జపధ్యాన హీనం మహేశి*


*ప్రసన్నంచ మాంపాలయత్వం కృపార్హం !!*


*ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా*


*సమాదాయ చిత్తే సదా తాం పరాంచాం*


*త్రిసంధ్య స్వరూపాం త్రిలోకైకవంద్యాం*


*సముక్తోభవేత్సర్వ పాపైరజస్రమ్‌ !!*



*గాయత్రీస్తోత్రం*



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



*నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ |*

*అజరేఽమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || 1 ||*


*నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే |*

*బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే || 2 ||*


*అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |*

*నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే || ౩ ||*


*త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |*

*మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || 4 ||*


*పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |*

*పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః || 5 ||*


*రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |*

*ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || 6 ||*


*త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |*

*పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || 7 ||*


*త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |*

*బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ  || 8 ||*


*తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |*

*పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || 9 ||*


*చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |*

*స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || 10||*


*నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |*

*సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || 11||*


*అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |*

*మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || 12 ||*


*గాయత్రీ మంత్రం - పరమేశ్వరుడు*


గాయత్రీ మంత్రం సృష్టిస్థితి లయ కారకుడైన పరమేశ్వరునిది - శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన పరమాత్మది. నిజానికి సృష్టికి అతీతంగా చెప్పినప్పుడు


*’పరమాత్మ’* అని వ్యవహారం. అతడే సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు *’పరమేశ్వరుడు’* అని వ్యవహరింపబడతాడు.

రెండూ ఒకటే తత్త్వం. అయితే ఆ పరమాత్మను శివునిగా భావించి ఆరాధించే వారికి గాయత్రి శివస్వరూపమే. దానికి ప్రమాణంగా కొన్ని వాక్యాలున్నాయి. అలాగే విష్ణువుగా భావించే వారికి గాయత్రీ మంత్రానికి విష్ణువే లక్ష్యం. దానికీ ప్రమాణ వాక్యాలు ఉన్నాయి.  అదేవిధంగా గణపతి పరంగా , సూర్య పరంగా , శక్తి పరంగా , స్కందుని పరంగా కూడా అన్వయించే శాస్త్ర వాక్యాలున్నాయి. వీటినిబట్టి ఎవరి ఉపాస్య దైవాన్ని వారు గాయత్రీ మంత్ర స్వరూపంగా ధ్యానించి ఆరాధించి తరించవచ్చు అని భావం.

*"మాబుద్ధులను ప్రేరేపించే సృష్టికారకమైన శ్రేష్ఠమైన పరబ్రహ్మ తేజస్సును ధ్యానిస్తున్నాము"* అని మంత్రభావం.  సూర్య మండలంలోని పరంజ్యోతిని వారి వారి ఇష్ట దేవతారూపంగా భావించడం పరమార్థం. ఈ దేవతలు కూడా వేదం ప్రతిపాదించిన శివ విష్ణు శక్తి గణేశ సూర్య స్కంద రూపాలు కావాలి. ఎందుకంటే - మంత్రం కూడా వేద సంబంధి కనుక.


మరొక విశేషం - పై దేవతల మంత్రాలను సంధ్యాకాలంలో ఉపాసిస్తే అది వారికి గాయత్రి అవుతుంది. అయితే - అందరూ పఠించదగిన గాయత్రీ మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాధానమైనవి మూడు. సంధ్యాకాలాలలో వీటిని జపిస్తే *’గాయత్రి’* అవుతాయి.


*సర్వ చైతన్య రూపాం తాం , ఆద్యాం విద్యాం చ ధీమహి , బుద్ధిం యా నః ప్రచోదయాత్ !!*


*పరమేశ్వర విద్మహే , పరతత్త్వాయ ధీమహి , తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ !!*


*యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః !*

*ప్రేరయేత్తస్య తద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే !!*


*సద్బుద్ధి ప్రదాయిని.. గాయత్రి*


ఏ పనిచేస్తున్నా - *‘ఇది నేను చేయటం లేదు, నాలోని జగన్మాత చేయిస్తున్నది’* అనే సంపూర్ణ శరణాగతి , నివేదన భావంతో మంచిపని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది. జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. అద్భుతమైన ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ , ఈ శరీరం మనకూడా ఉండగానే , ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆనంద బిందువును ఆర్ద్రతతో , అప్రమత్తంగా , ఆప్యాయంగా అందుకోవాలి. అందుకు ఆధారం - త్రికాల సంధ్యా దేవత గాయత్రీమాత అనుగ్రహం.

*గాయత్త్రీ వ్యాహృతి సంధ్యా* అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి. దీనినిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే - సంధ్య ఎవరో గాదు - గాయత్త్రే. ఆ గాయత్రి కూడా ఎవరో కాదు- శ్రీలలితా పరదేవతే , మహాశక్తే. ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది. అచలమైన తత్త్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి. చలించి , పరా పశ్యంతి , మధ్యమా , వైఖరీ అని నాలుగు దశలలో కిందికి చలించి దిగి వచ్చింది. వచ్చి , అదే మనకు చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే - నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి.


మన *నాత్త్రాయతే ఇతి మన్త్రః* మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్రమంటే. *మంత్రాణా మర్థస్తిరోహితో భవతి* అని పెద్దలు చెప్తారు. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది. ఆదిభౌతికం , ఆధ్యాత్మికం , ఆది దైవికమని మూడు భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. దిగి వచ్చేటప్పుడది గాయత్రి.

*గాయత్త్రీ  త్రాయతే ఇతి గాయత్రి*. ఎవరా మంత్రాన్ని గానం చేస్తుంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్రి అయింది.

*న గాయత్య్రాః పరం మంత్రం నమాతుః* పరదైవతమ్ గాయత్రికి మించిన మంత్రము లేదు. తల్లిని మించిన దేవత లేదని దివ్య సూక్తి. ఏ మంత్రానుష్ఠానం చేసినా , ముందు గాయత్రి  మంత్రం చేస్తేనేగాని దాని ఫలితం మనకు రాదు. అదీ గాయత్రి  మంత్ర జప విశిష్టత. గాయత్రీ ఛందసామహమ్ అని ఋక్కులలో గాయత్రి మంత్రమును తానేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటం - గాయత్రీ మంత్ర మహోదాత్తత విశదమవుతుంది.  సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి. దీర్ఘాయువు , సత్సంతానం , గోవులు , కీర్తి , ద్రవ్యము, బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి , అంత్యంలో బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి *‘గాయత్రి’* అని చెపుతోంది అధర్వణ వేదం.


గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి. వాటిని మూడు భాగాలుగా చేస్తే , ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు - సృష్టి స్థితి లయాలకు సూచితం. మొదటి ఖండం - ఋగ్వేదం ; రెండవది-సామవేదం ; మూడవది - యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత.


గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలకు , వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో , వెరసి ఇరవది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని రచించారు. కనుకనే , గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణము సర్వశక్తి సమన్వితమయింది. కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి అతనికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.


*ప్రాణశక్తి గాయత్రి*


సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరంపై , మనసుపై ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడున్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు - స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం లోంచి జన్మించాడు. గర్భస్థ శిశువు నాభి , తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తిని ఇచ్చేది. బయటకు వచ్చిన తర్వాత శిశువును వేరు చేస్తారు. అలా వేరవగానే సూర్యశక్తి - ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీ మాత. పిల్లలు ఎదిగినకొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణామాయ కుండలినీ శక్తి గురించి నేర్పాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యలలో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది , పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రీమాత.


*గాయత్రీ జప సుప్రీతాయై నమః- సూర్య సహస్ర నామావళి*


మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని, జీవించటానికి ఆహారాన్ని ఇచ్చేవాడు.  కనుకనే ఆదిత్యుణ్ణి - అన్నదాత , ఆరోగ్య ప్రదాత అన్నారు. తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. సూర్యభగవాడు సమస్త జీవరాశులకు , వృక్ష లతాదులకు , ప్రకృతిలోని అన్నింటికీ పోషకుడు. పంచభూతములకు (భూమి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశము) సూర్యుడు స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకే సూర్యుణ్ణి *‘పూషణ్’* అన్నారు.

కాలభేదములు ఏర్పడటానికి సూర్యుడే కారకుడు. ఒక్క సెకన్ కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో , ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ , సూర్యాస్తమానాలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకైనా అదే సమయంలో జరుగుతుంది.  కనుక కాల నియమం , సమయ పాలన , కాలప్రాముఖ్యతకు , సూర్యుడే ఆదర్శంగా నిలుస్తాడు. ఇది లేకపోతే జ్యోతిశ్శాస్తమ్రే లేదు. నిత్యానుష్ఠాన కర్మలే లేవు. సూర్యుడు రాకపోతే రోజు గడవదు. అతడు త్యాగమూర్తి , నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు *‘‘మీరు కూడా సూర్యుని వలె ఉండండని , ఆత్మ తేజస్సుని వికసింపచేసుకోండి’’* అని చెప్పారు.


సూర్యుణ్ణి మనం దైవంగా భావించి , పరబ్రహ్మ స్వరూపంగా ఉఫాసిస్తాం, ఆరాధిస్తాం. సూర్యునిలోని సద్గుణ శక్తియే - గాయత్రి. సూర్యునికి , గాయత్రికి భేదం లేదు. మంత్రం సూర్య తేజస్సు పరంగా ఉంటుంది. సాకార రూపం - గాయత్రీమాత.


*గాయత్రీ మంత్రం.. ఆధ్యాత్మికత*


శ్రీ దేవీ నవరాత్రులలో శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మూడు పాదములు శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తి. గాయత్రీ మంత్రంలోని మొదటి చరమణమైన  *ఓం భూర్భవో స్వాహాః తత్స వితుర్వరేణ్యం* దుర్గా సప్తశతిలోని ప్రథమ భాగం. దానికి అధిష్ఠాన దేవత మహాకాళి. 


*కాళి - కాల స్వరూపం.*


 సమస్తమూ కాలం లోంచి ప్రభవించి ప్రళయకాలంలో లయమవుతాయి. కనుక, ప్రథమ పాదాన్ని సంపూర్ణంగా తెలిసికొంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి , ప్రతి ప్రభాతం ఒక సుప్రభాతం అవుతుంది.


*గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం*



 *‘భర్గోదేవస్య ధీమహి’* 


అన్నదానికి శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్ఠాత్రి శ్రీ మహాలక్ష్మి- స్థితికర్తయైన విష్ణుపత్ని. సాధకుడికి పోషణ సామర్థ్యం కలిగి , విజ్ఞానం , ఐశ్వర్యం , సత్వగుణం ప్రాప్తిస్తాయి. అనుదినం సుదినం అవుతుంది.


*గాయత్రీ మంత్ర మూడవ చరణం*


 *ధియోయోనః ప్రచోదయాత్-*


 దీని వివరణ శ్రీదేవీ సప్తశతిలో మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠానదేవత. *‘నేనెవరు?’* అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక సూర్యోదయం ఉండదు. ఎందుకంటే హృదయంలో సూర్యాస్తమయం ఉండదు గనుక. ఇది గాయత్రీ మంత్ర విశేషం.


నాభి హృత్కంఠ రసన నాసాదులయందు , ధర ఋక్యామాదులలో వర గాయత్రీ హృదయమున - అన్న త్యాగరాజ కీర్తనను మననం చేసుకొంటూ , సప్తస్వర సుందరులను భజించి , సంగీత సాధనలో గాయత్రీ మాతను ఆరాధిస్తారు నాదయోగి శిష్యపరంపర. సంధ్యాదేవీం , సావిత్రీం , వర గాయత్రీం , సరస్వతీ భజేహం అన్న దేవక్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన గాయత్రీ తత్త్వానికి దర్పణం.  దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని లోక కల్యాణానికి ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది - సద్బుద్ధి ప్రదాయిని , సంధ్యాదేవత వేదమాత గాయత్రి.

ఈశ పరమైన ధాతు

 శివ సంకల్పంలో సూత్రపరమైన నిర్ణయమును పరిశీలన చేసిన అధీశం, ఙ్ఞేయం అని తెలుపుచున్నది. అయితే ఏది ఈశ పరమైన ధాతు పూర్వక శక్తి? అది దేహము గల జీవుడు యని అదియును త్రిగుణాత్మకమైన పదార్థమే. అధి వశించినదని అనగా వ్యాప్కమైనదని వ్యాప్తమైన శివ శి అనే తత్వం. యిది తెలియుట ఙ్ఞేయం అని తెలిసినది ఏదైనా అనగా ఙ్ఞానం తెలియుట ఙ్ఞేయమైనది. ఈ అనే శక్తి సంగతి తెలియుట శక్తిని తెలియుట ఙ్ఞానమని. అన్నమయ్య వారు కూడా ఏవం ఙ్ఞాత్వా యని కీర్తనలలో వివరించారు శంకరులు కూడా ఏవం ఙ్ఞాత్వా యని తెలుసుకొనుటయే ఙ్ఞానరూపమైన ప్రజ్ఞ. ప్ర ఙ్ఞానము ప్ర హ్లాదమే. సర్వులకు కావలసినదే. అది కొందరికే కాదు. సకల జీవులకు శక్తి సమన్వయం హ్లాద మని హా లా. ఈ అక్షరములుకు  పూర్ణం కలయిక హాం లం, పృధివియని యనగా పంచభూతాత్మకమైన శక్తి పదార్ధ రూపమే భూమి. భూః శబ్ద లక్షణమును తెలుపుచున్నది. ఏ దేవతా శక్తైనా భూ శక్తి కలిగియున్నందు వలననే దానిని వాటి అసలు తత్వం తెలియదు. దైవ, శకేతి తెలియాలంటే మానవ దేహమే మూలం. దీనికి సుముఖం సంపుటీకరణ చేయాలి. సత్ పూర్ణము యజ్ఞ క్రియ వలననే సంపుటీకపణ శక్తిని సూత్రపరంగా సంపుటీకపణ చెయ్యాలి. అప్పుడు విసృతమై వ్యాప్తి చెందును. అది విషు తత్వము. సత్ తెలియాలి అనగా పూర్ణమైనది ఖం ఖండనవలననే, చైతన్యమైనందువలననే తెలియాలి. అది మఖ యజ్ఞ లక్షణము. సత్ సు స్వఛ్చంగా మానవలెను. మానవదేహముకూడా అటులనే దేహము ఆత్మ స్వఛ్చంగా మానవలెను.సాధన యభ

ఙ్ఞముని కర్మ యత్నము. ఫలితం యఙ్ఞం,.అనుభవం యఙ్ఞం. అనుభవించింది తిరిగిరూపందాల్చుట యఙ్ఞమనిఅదికూడా  ఏవిధమైన చెడు భావనలు లేకుండా. అదే ఙ్ఞేయము. దీనికి *పరాత్ పర తరం బ్రహ్మ తత్ పరాత్ పరతో హరిః యత్ పరాత్ పరతో అధీశం* శివం. మళ్ళీ అలాగే  పైన తెలిపిన శివ తత్వమే ఙ్ఞేయమని తెలుపుచున్నది. అధీశం ఙ్ఞేయమని అదియే శివుని సంకల్పిం. మనం శివుని శక్తిని రూపంగా కర్మ చేయాలి. ఎందుకనగా మనలో కూడా అటువంటి శక్తియే వున్నది కనుక. అది చూచుట కుదరదు పదార్ధ నిరూపణ వలననే అనగా బాహ్యంగా ప్రకృతి. అంతర్ముఖంగా  సంతానం. శివ శక్తియని అది బ్రహ్మ, హరి, రూపమైన పరాప్రకృతిగా తెలియాలి. పరాప్రకృతియే అమ్మ. పరా అనగా దృశ్యమానమైన దానికి మూలమును తెలియుట. చూసే పదార్ధము వెనుకనున్న శక్తి సూత్రము, అనగా దాని పరిణామము. పరా అన్న నిర్వచనంగా తెలియుట, పర ప్ర గా మార్పు తెలియుట ప్రఙ్ఞానము. పరా శక్తికి ఆదినుండి యున్నదని అది తెలియుట ఎప్పటికీ దుర్లభమైన పని. త్రిమూత్యాత్మకమైన ప్రకృతిని ఆవరించిన పరతత్వము తెలియుటకై సాధన. త్రిమూర్తులు కూడా ఎప్పటికీ తెలుసుకుంటూనే నుండుటయే సృష్టి. ముగ్గురి ప్రవృత్తి కూడా పరాప్రకృతిని ఙ్ఞానము, ఙ్ఞేయమని, ధ్యేయమని, అది ఈశ తత్వమని విశ్వవాప్తమని తెలియుచున్నది. చైతన్య లక్షణము విష్ణు తత్వము, గుణ తత్వం. గుణ తత్వం లేనియెడల  లేదా వున్నది తెలియని యెడల లేక అలా ప్రయత్నం చేయనియెడల జీవితం వ్యర్ధం కదా. జీవనం వ్యర్ధం కదా. తెసుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*శ్రీ స్వామివారి సమాధి..ఒక పుణ్యక్షేత్రం..*


*(అరవై ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన పిదప..శ్రీ స్వామివారి పార్థివదేహాన్ని ఆశ్రమం లోని ప్రధాన గది లో ఉన్న నేలమాళిగ లోనే సమాధి చేయడం జరిగిపోయింది..శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు..


1976 మే 7వతేదీ మధ్యాహ్నం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు..విజయవాడ నుంచి శ్రీ చెక్కా కేశవులు గారు, వారి తోడల్లుడు మెంటా మస్తాన్ రావు గారు కూడా ఆరోజు మొగలిచెర్ల చేరుకున్నారు.. మీరాశెట్టి గారు అక్కడే వున్నారు..అందరూ కలిసి..శ్రీ స్వామివారి ఆశ్రమమును నిర్వహించే బాధ్యత శ్రీధరరావు గారికి అప్పజెప్పారు..వారూ సరే నన్నారు..ప్రస్తుతానికి యెవరినైనా ఒక మనిషిని కాపలాగా ఉంచుదాము అని ఆలోచన చేశారు..కానీ వారికి ఆ నిమిషంలో తెలీదు..ఇంకో రెండు మూడు రోజుల కల్లా భక్తులు వెల్లువలా వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటారని..


"సంతానం కావాలంటే..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద మ్రొక్కుకోండి..సంతానం కలుగుతుంది.."!


"గ్రహ బాధలున్నాయా?..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద వర పడండి.. తీరి పోతాయి!.."


"దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్నారా..ఆ స్వామి వద్ద నిద్ర చేయండి..క్షణంలో బాగు పడతారు!.." 


ఇలా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడసాగింది..అందుకు తగ్గట్టే దృష్టాంతరాలు కనబడ సాగాయి..


మే 9వ తేదీ ఆదివారం నాటి నుంచి శ్రీ స్వామివారి సమాధి దర్శించడానికి భక్తులు రావడం మొదలుపెట్టారు..వెంటనే శ్రీధరరావు గారు ముందుగా అక్కడొక పూజారిని ఏర్పాటు చేశారు.. శాస్త్రోక్తంగా పూజా విధానాలు ఏర్పడ్డాయి..క్రమంగా భక్తుల రాక పెరగసాగింది..అనతి కాలంలోనే..శ్రీ స్వామివారి ఆశ్రమం కాస్తా.."శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం"  గా రూపాంతరం చెందింది..మట్టి రోడ్డు వేసారు..బస్సులు నేరుగా మందిరం వద్దకే రాసాగాయి..విద్యుత్ సౌకర్యం వచ్చింది..ఒకటి రెండు దుకాణాలు వెలిశాయి..కొంతమందికి ప్రత్యక్ష..మరికొంతమందికి పరోక్ష ఉపాధి కల్పన జరిగింది..మెల్ల మెల్లగా మొగలిచెర్ల గ్రామం పేరు.. శ్రీ స్వామివారి మందిరం వలన అందరికీ తెలియసాగింది..


"ఇది దత్తుడి భూమి!..పుణ్యక్షేత్రంగా మారుతుంది!.." అని శ్రీ స్వామివారు పదే పదే చెప్పిన మాట శ్రీధరరావు ప్రభావతి గార్ల మనసులో వినబడుతూ ఉండేది..అందుకు తగ్గట్టు గానే..మొగలిచెర్ల గ్రామ శివార్ల లో ఉన్న తమ భూమి..అదికూడా ఒకప్పుడు  ఫకీరు మాన్యం గా పిలవబడ్డ బీడు భూమి..నేడు తమ కళ్ల ముందే..వేలాది మందికి స్వాంతన చేకూర్చే పుణ్య ప్రదేశంగా మారిపోయింది..ప్రస్తుతం అన్నదానమూ జరుగుతున్నది..ఎంతో మంది భక్తులు తమ తమ బాధలు తీరిపోయాయని చెప్పుకుంటూ వుంటారు..కొంతమంది భక్తుల అనుభవాలను ముందు ముందు రోజుల్లో తెలుసుకుందాము..


ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు శ్రీ స్వామివారు సిద్ధిపొందిన వైశాఖ శుద్ధ సప్తమి తిథి నాడు శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం ఘనంగా జరుగుతాయి..(ఈ సంవత్సరం ఏప్రిల్ 22 వ తేదీ నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన..)


ప్రతి చరిత్రకూ ముగింపు తప్పనిసరి..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నేటితో సమాప్తి చేస్తున్నాను ..ఈ చరిత్ర చదివి ఎంతో మంది నన్ను ప్రోత్సహించారు...వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదములు..


అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే..


ఇది ఒక సాధకుని తపోభూమి..


ఇది ఒక అవధూత ఆశ్రమం..


అదే..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..


శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న భక్తుల అనుభవాలు..శ్రీ స్వామివారి లీలలు..రేపటి నుండి ధారావాహికంగా చదువుకుందాము..


సర్వం

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).