*🚩ఈ రోజు గాయత్రి జయంతి_🚩*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
గాయత్రి జయంతి తేదీ & సమయం
గాయత్రి జయంతి తేదీ - 2021 జూన్ 21 సోమవారం
ఏకాదశి తిథి ప్రారంభమైంది - 2021 జూన్ 20 న 04:21 PM
ఏకాదశి తిథి ముగుస్తుంది - 2021 జూన్ 21 న 01:31 PM
*గాయత్రి ప్రార్ధన*
*ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః*
*యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్*
*గాయత్రీం వరదా* *భయాంకుశ* *కశాశ్శుభ్రమ్కపాలం గదామ్*
*శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే*
గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త , విద్రుమ , హేమ , నీల , ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ , చక్ర , గద , అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని , శిరస్సులో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ , మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను , సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు , ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.
నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి , అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.
*శ్రీ గాయత్రీ మాత మహాత్యం*
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
*ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యమ్*
*భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్*
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏకాగ్రత , ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం , గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ , వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని , ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి , కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ *‘ఓం నమో గాయత్రీ మాత్రే’* అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ , నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి , సృష్టి ఉత్పత్తి , వర్తన , పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
*గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.*
*గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:*
*01. వినాయకుడు:* సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ , జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
*02. నృసింహ స్వామి:* పరాక్రమ శక్తికి అధిపతి , పురుషార్థ , పరాక్రమ , వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
*03. విష్ణుమూర్తి:* పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
*04. ఈశ్వరుడు:* సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
*05. శ్రీకృష్ణుడు:* యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను , వైరాగ్య , జ్ఞాన , సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
*06. రాధాదేవి:* ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి , భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
*07. లక్ష్మీదేవి:* ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం , సంపద , పదవి , వైభవం , ధనం , యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
*08. అగ్నిదేవుడు:* తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం , శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
*09. మహేంద్రుడు:* రక్షాశక్తికి అధిష్ఠాత , అనారోగ్యాలు , శతృభయాలు , భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
*10. సరస్వతి:* విద్యా ప్రదాత. జ్ఞానాన్ని , వివేకాన్ని , బుద్ధిని ప్రసాదిస్తుంది.
*11. దుర్గాదేవి:* దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి , శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
*12. ఆంజనేయుడు:* నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి , నిష్ఠ , కర్తవ్య పరాయణ తత్వం , బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
*13. భూదేవి:* ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని , ధైర్యాన్ని , దృఢత్వాన్ని , నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
*14. సూర్య భగవానుడు:* ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని , సుదీర్ఘ జీవనాన్ని , ప్రాణశక్తికి , వికాసాన్ని , తేజస్సును ప్రసాదిస్తాడు.
*15. శ్రీరాముడు:* ధర్మం , శీలం , సౌమ్యత , మైత్రి , ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
*16. సీతాదేవి:* తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి , అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమే.
*17. చంద్రుడు:* శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం , క్రోధం , మోహం , లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
*18. యముడు:* కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
*19. బ్రహ్మ:* సకల సృష్టికి అధిష్ఠాత.
*20. వరుణుడు:* భావుకత్వాన్ని , కోమలత్వాన్ని , దయాళుత్వాన్ని , ప్రసన్నతను , ఆనందాన్ని అందిస్తాడు.
*21. నారాయణుడు:* ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
*22. హయ గ్రీవుడు:* సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని , సాహసాన్ని ప్రసాదిస్తాడు.
*23. హంస:* వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
*24. తులసీ మాత:* సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి , దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
*శ్రీ గాయత్రీ అష్టకం*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ఉషఃకాలగమ్యా ముదాత్త స్వరూపాం*
*అకార ప్రవిష్టాముదారాంగ భూషామ్*
*అజేశాదివంద్యా మజార్చాంగ భాజాం*
*అనౌపమ్య రూపాం భజామ్యాది సంధ్యామ్ !!*
*సదాహంసయానాం స్పురద్రత్న వస్త్రాం*
*వరా భీతి హస్తాం ఖగామ్నాయ రూపామ్*
*స్ఫురత్స్వాధికామక్షమాలాంచ కుంభం*
*దధా నామహం భావయే పూర్వసంధ్యామ్ !!*
*స్ఫురచచంద్ర కాంతాం శరచ్చంద్ర వక్త్రాం*
*మహా చంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్*
*త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్యపత్నీం*
*వృషారూఢ పాదాం భజే మధ్య సంధ్యామ్ !!*
*సదాసామగాన ప్రియాం శ్యామలాంగీం*
*అకారాంతరస్థాం కరోల్లాసి చక్రామ్*
*గణాపద్మహస్తాం స్వనత్పాంచజన్యాం*
*ఖగేశోపవిష్టాం భజేమాస్త సంధ్యామ్ !!*
*ప్రగల్భ స్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం*
*సదాలంబ మానస్తన ప్రాంతహారామ్*
*మహా నీలరత్న ప్రభాకుండలాఢ్యాం*
*స్ఫురత్స్మేర వక్తాం భజేతుర్య సంధ్యామ్ !!*
*హృదంభోజమధ్యే పరామ్నాయనీడే*
*సుఖాసీన సద్రాజ హంసాం మనోజ్ఞామ్*
*సదాహేమభాసాం త్రయీవిద్య మధ్యాం*
*భజామస్తువామో వదామ స్మరామః !!*
*సదాతత్పదైస్తూయమానాం సవిత్రీం*
*వరేణ్యాం మహా భర్గరూపాం త్రినేత్రామ్*
*సదా దేవదేవాది దేవస్యపత్నీం*
*మహంధీ మహీత్యాది పాదైకజుష్టామ్ !!*
*అనాథం దరిద్రం దురాచారయుక్తం*
*శతం స్థూలబుద్ధిం పరం ధర్మహీనం*
*త్రిసంధ్యాం జపధ్యాన హీనం మహేశి*
*ప్రసన్నంచ మాంపాలయత్వం కృపార్హం !!*
*ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా*
*సమాదాయ చిత్తే సదా తాం పరాంచాం*
*త్రిసంధ్య స్వరూపాం త్రిలోకైకవంద్యాం*
*సముక్తోభవేత్సర్వ పాపైరజస్రమ్ !!*
*గాయత్రీస్తోత్రం*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ |*
*అజరేఽమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || 1 ||*
*నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే |*
*బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే || 2 ||*
*అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |*
*నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే || ౩ ||*
*త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |*
*మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || 4 ||*
*పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |*
*పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః || 5 ||*
*రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |*
*ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || 6 ||*
*త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |*
*పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || 7 ||*
*త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |*
*బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || 8 ||*
*తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |*
*పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || 9 ||*
*చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |*
*స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || 10||*
*నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |*
*సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || 11||*
*అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |*
*మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || 12 ||*
*గాయత్రీ మంత్రం - పరమేశ్వరుడు*
గాయత్రీ మంత్రం సృష్టిస్థితి లయ కారకుడైన పరమేశ్వరునిది - శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన పరమాత్మది. నిజానికి సృష్టికి అతీతంగా చెప్పినప్పుడు
*’పరమాత్మ’* అని వ్యవహారం. అతడే సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు *’పరమేశ్వరుడు’* అని వ్యవహరింపబడతాడు.
రెండూ ఒకటే తత్త్వం. అయితే ఆ పరమాత్మను శివునిగా భావించి ఆరాధించే వారికి గాయత్రి శివస్వరూపమే. దానికి ప్రమాణంగా కొన్ని వాక్యాలున్నాయి. అలాగే విష్ణువుగా భావించే వారికి గాయత్రీ మంత్రానికి విష్ణువే లక్ష్యం. దానికీ ప్రమాణ వాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా గణపతి పరంగా , సూర్య పరంగా , శక్తి పరంగా , స్కందుని పరంగా కూడా అన్వయించే శాస్త్ర వాక్యాలున్నాయి. వీటినిబట్టి ఎవరి ఉపాస్య దైవాన్ని వారు గాయత్రీ మంత్ర స్వరూపంగా ధ్యానించి ఆరాధించి తరించవచ్చు అని భావం.
*"మాబుద్ధులను ప్రేరేపించే సృష్టికారకమైన శ్రేష్ఠమైన పరబ్రహ్మ తేజస్సును ధ్యానిస్తున్నాము"* అని మంత్రభావం. సూర్య మండలంలోని పరంజ్యోతిని వారి వారి ఇష్ట దేవతారూపంగా భావించడం పరమార్థం. ఈ దేవతలు కూడా వేదం ప్రతిపాదించిన శివ విష్ణు శక్తి గణేశ సూర్య స్కంద రూపాలు కావాలి. ఎందుకంటే - మంత్రం కూడా వేద సంబంధి కనుక.
మరొక విశేషం - పై దేవతల మంత్రాలను సంధ్యాకాలంలో ఉపాసిస్తే అది వారికి గాయత్రి అవుతుంది. అయితే - అందరూ పఠించదగిన గాయత్రీ మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాధానమైనవి మూడు. సంధ్యాకాలాలలో వీటిని జపిస్తే *’గాయత్రి’* అవుతాయి.
*సర్వ చైతన్య రూపాం తాం , ఆద్యాం విద్యాం చ ధీమహి , బుద్ధిం యా నః ప్రచోదయాత్ !!*
*పరమేశ్వర విద్మహే , పరతత్త్వాయ ధీమహి , తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ !!*
*యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః !*
*ప్రేరయేత్తస్య తద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే !!*
*సద్బుద్ధి ప్రదాయిని.. గాయత్రి*
ఏ పనిచేస్తున్నా - *‘ఇది నేను చేయటం లేదు, నాలోని జగన్మాత చేయిస్తున్నది’* అనే సంపూర్ణ శరణాగతి , నివేదన భావంతో మంచిపని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది. జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. అద్భుతమైన ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ , ఈ శరీరం మనకూడా ఉండగానే , ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆనంద బిందువును ఆర్ద్రతతో , అప్రమత్తంగా , ఆప్యాయంగా అందుకోవాలి. అందుకు ఆధారం - త్రికాల సంధ్యా దేవత గాయత్రీమాత అనుగ్రహం.
*గాయత్త్రీ వ్యాహృతి సంధ్యా* అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి. దీనినిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే - సంధ్య ఎవరో గాదు - గాయత్త్రే. ఆ గాయత్రి కూడా ఎవరో కాదు- శ్రీలలితా పరదేవతే , మహాశక్తే. ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది. అచలమైన తత్త్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి. చలించి , పరా పశ్యంతి , మధ్యమా , వైఖరీ అని నాలుగు దశలలో కిందికి చలించి దిగి వచ్చింది. వచ్చి , అదే మనకు చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే - నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి.
మన *నాత్త్రాయతే ఇతి మన్త్రః* మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్రమంటే. *మంత్రాణా మర్థస్తిరోహితో భవతి* అని పెద్దలు చెప్తారు. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది. ఆదిభౌతికం , ఆధ్యాత్మికం , ఆది దైవికమని మూడు భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. దిగి వచ్చేటప్పుడది గాయత్రి.
*గాయత్త్రీ త్రాయతే ఇతి గాయత్రి*. ఎవరా మంత్రాన్ని గానం చేస్తుంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్రి అయింది.
*న గాయత్య్రాః పరం మంత్రం నమాతుః* పరదైవతమ్ గాయత్రికి మించిన మంత్రము లేదు. తల్లిని మించిన దేవత లేదని దివ్య సూక్తి. ఏ మంత్రానుష్ఠానం చేసినా , ముందు గాయత్రి మంత్రం చేస్తేనేగాని దాని ఫలితం మనకు రాదు. అదీ గాయత్రి మంత్ర జప విశిష్టత. గాయత్రీ ఛందసామహమ్ అని ఋక్కులలో గాయత్రి మంత్రమును తానేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటం - గాయత్రీ మంత్ర మహోదాత్తత విశదమవుతుంది. సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి. దీర్ఘాయువు , సత్సంతానం , గోవులు , కీర్తి , ద్రవ్యము, బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి , అంత్యంలో బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి *‘గాయత్రి’* అని చెపుతోంది అధర్వణ వేదం.
గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి. వాటిని మూడు భాగాలుగా చేస్తే , ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు - సృష్టి స్థితి లయాలకు సూచితం. మొదటి ఖండం - ఋగ్వేదం ; రెండవది-సామవేదం ; మూడవది - యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత.
గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలకు , వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో , వెరసి ఇరవది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని రచించారు. కనుకనే , గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణము సర్వశక్తి సమన్వితమయింది. కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి అతనికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.
*ప్రాణశక్తి గాయత్రి*
సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరంపై , మనసుపై ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడున్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు - స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం లోంచి జన్మించాడు. గర్భస్థ శిశువు నాభి , తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తిని ఇచ్చేది. బయటకు వచ్చిన తర్వాత శిశువును వేరు చేస్తారు. అలా వేరవగానే సూర్యశక్తి - ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీ మాత. పిల్లలు ఎదిగినకొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణామాయ కుండలినీ శక్తి గురించి నేర్పాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యలలో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది , పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రీమాత.
*గాయత్రీ జప సుప్రీతాయై నమః- సూర్య సహస్ర నామావళి*
మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని, జీవించటానికి ఆహారాన్ని ఇచ్చేవాడు. కనుకనే ఆదిత్యుణ్ణి - అన్నదాత , ఆరోగ్య ప్రదాత అన్నారు. తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. సూర్యభగవాడు సమస్త జీవరాశులకు , వృక్ష లతాదులకు , ప్రకృతిలోని అన్నింటికీ పోషకుడు. పంచభూతములకు (భూమి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశము) సూర్యుడు స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకే సూర్యుణ్ణి *‘పూషణ్’* అన్నారు.
కాలభేదములు ఏర్పడటానికి సూర్యుడే కారకుడు. ఒక్క సెకన్ కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో , ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ , సూర్యాస్తమానాలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకైనా అదే సమయంలో జరుగుతుంది. కనుక కాల నియమం , సమయ పాలన , కాలప్రాముఖ్యతకు , సూర్యుడే ఆదర్శంగా నిలుస్తాడు. ఇది లేకపోతే జ్యోతిశ్శాస్తమ్రే లేదు. నిత్యానుష్ఠాన కర్మలే లేవు. సూర్యుడు రాకపోతే రోజు గడవదు. అతడు త్యాగమూర్తి , నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు *‘‘మీరు కూడా సూర్యుని వలె ఉండండని , ఆత్మ తేజస్సుని వికసింపచేసుకోండి’’* అని చెప్పారు.
సూర్యుణ్ణి మనం దైవంగా భావించి , పరబ్రహ్మ స్వరూపంగా ఉఫాసిస్తాం, ఆరాధిస్తాం. సూర్యునిలోని సద్గుణ శక్తియే - గాయత్రి. సూర్యునికి , గాయత్రికి భేదం లేదు. మంత్రం సూర్య తేజస్సు పరంగా ఉంటుంది. సాకార రూపం - గాయత్రీమాత.
*గాయత్రీ మంత్రం.. ఆధ్యాత్మికత*
శ్రీ దేవీ నవరాత్రులలో శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మూడు పాదములు శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తి. గాయత్రీ మంత్రంలోని మొదటి చరమణమైన *ఓం భూర్భవో స్వాహాః తత్స వితుర్వరేణ్యం* దుర్గా సప్తశతిలోని ప్రథమ భాగం. దానికి అధిష్ఠాన దేవత మహాకాళి.
*కాళి - కాల స్వరూపం.*
సమస్తమూ కాలం లోంచి ప్రభవించి ప్రళయకాలంలో లయమవుతాయి. కనుక, ప్రథమ పాదాన్ని సంపూర్ణంగా తెలిసికొంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి , ప్రతి ప్రభాతం ఒక సుప్రభాతం అవుతుంది.
*గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం*
*‘భర్గోదేవస్య ధీమహి’*
అన్నదానికి శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్ఠాత్రి శ్రీ మహాలక్ష్మి- స్థితికర్తయైన విష్ణుపత్ని. సాధకుడికి పోషణ సామర్థ్యం కలిగి , విజ్ఞానం , ఐశ్వర్యం , సత్వగుణం ప్రాప్తిస్తాయి. అనుదినం సుదినం అవుతుంది.
*గాయత్రీ మంత్ర మూడవ చరణం*
*ధియోయోనః ప్రచోదయాత్-*
దీని వివరణ శ్రీదేవీ సప్తశతిలో మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠానదేవత. *‘నేనెవరు?’* అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక సూర్యోదయం ఉండదు. ఎందుకంటే హృదయంలో సూర్యాస్తమయం ఉండదు గనుక. ఇది గాయత్రీ మంత్ర విశేషం.
నాభి హృత్కంఠ రసన నాసాదులయందు , ధర ఋక్యామాదులలో వర గాయత్రీ హృదయమున - అన్న త్యాగరాజ కీర్తనను మననం చేసుకొంటూ , సప్తస్వర సుందరులను భజించి , సంగీత సాధనలో గాయత్రీ మాతను ఆరాధిస్తారు నాదయోగి శిష్యపరంపర. సంధ్యాదేవీం , సావిత్రీం , వర గాయత్రీం , సరస్వతీ భజేహం అన్న దేవక్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన గాయత్రీ తత్త్వానికి దర్పణం. దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని లోక కల్యాణానికి ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది - సద్బుద్ధి ప్రదాయిని , సంధ్యాదేవత వేదమాత గాయత్రి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి