శివ సంకల్పంలో సూత్రపరమైన నిర్ణయమును పరిశీలన చేసిన అధీశం, ఙ్ఞేయం అని తెలుపుచున్నది. అయితే ఏది ఈశ పరమైన ధాతు పూర్వక శక్తి? అది దేహము గల జీవుడు యని అదియును త్రిగుణాత్మకమైన పదార్థమే. అధి వశించినదని అనగా వ్యాప్కమైనదని వ్యాప్తమైన శివ శి అనే తత్వం. యిది తెలియుట ఙ్ఞేయం అని తెలిసినది ఏదైనా అనగా ఙ్ఞానం తెలియుట ఙ్ఞేయమైనది. ఈ అనే శక్తి సంగతి తెలియుట శక్తిని తెలియుట ఙ్ఞానమని. అన్నమయ్య వారు కూడా ఏవం ఙ్ఞాత్వా యని కీర్తనలలో వివరించారు శంకరులు కూడా ఏవం ఙ్ఞాత్వా యని తెలుసుకొనుటయే ఙ్ఞానరూపమైన ప్రజ్ఞ. ప్ర ఙ్ఞానము ప్ర హ్లాదమే. సర్వులకు కావలసినదే. అది కొందరికే కాదు. సకల జీవులకు శక్తి సమన్వయం హ్లాద మని హా లా. ఈ అక్షరములుకు పూర్ణం కలయిక హాం లం, పృధివియని యనగా పంచభూతాత్మకమైన శక్తి పదార్ధ రూపమే భూమి. భూః శబ్ద లక్షణమును తెలుపుచున్నది. ఏ దేవతా శక్తైనా భూ శక్తి కలిగియున్నందు వలననే దానిని వాటి అసలు తత్వం తెలియదు. దైవ, శకేతి తెలియాలంటే మానవ దేహమే మూలం. దీనికి సుముఖం సంపుటీకరణ చేయాలి. సత్ పూర్ణము యజ్ఞ క్రియ వలననే సంపుటీకపణ శక్తిని సూత్రపరంగా సంపుటీకపణ చెయ్యాలి. అప్పుడు విసృతమై వ్యాప్తి చెందును. అది విషు తత్వము. సత్ తెలియాలి అనగా పూర్ణమైనది ఖం ఖండనవలననే, చైతన్యమైనందువలననే తెలియాలి. అది మఖ యజ్ఞ లక్షణము. సత్ సు స్వఛ్చంగా మానవలెను. మానవదేహముకూడా అటులనే దేహము ఆత్మ స్వఛ్చంగా మానవలెను.సాధన యభ
ఙ్ఞముని కర్మ యత్నము. ఫలితం యఙ్ఞం,.అనుభవం యఙ్ఞం. అనుభవించింది తిరిగిరూపందాల్చుట యఙ్ఞమనిఅదికూడా ఏవిధమైన చెడు భావనలు లేకుండా. అదే ఙ్ఞేయము. దీనికి *పరాత్ పర తరం బ్రహ్మ తత్ పరాత్ పరతో హరిః యత్ పరాత్ పరతో అధీశం* శివం. మళ్ళీ అలాగే పైన తెలిపిన శివ తత్వమే ఙ్ఞేయమని తెలుపుచున్నది. అధీశం ఙ్ఞేయమని అదియే శివుని సంకల్పిం. మనం శివుని శక్తిని రూపంగా కర్మ చేయాలి. ఎందుకనగా మనలో కూడా అటువంటి శక్తియే వున్నది కనుక. అది చూచుట కుదరదు పదార్ధ నిరూపణ వలననే అనగా బాహ్యంగా ప్రకృతి. అంతర్ముఖంగా సంతానం. శివ శక్తియని అది బ్రహ్మ, హరి, రూపమైన పరాప్రకృతిగా తెలియాలి. పరాప్రకృతియే అమ్మ. పరా అనగా దృశ్యమానమైన దానికి మూలమును తెలియుట. చూసే పదార్ధము వెనుకనున్న శక్తి సూత్రము, అనగా దాని పరిణామము. పరా అన్న నిర్వచనంగా తెలియుట, పర ప్ర గా మార్పు తెలియుట ప్రఙ్ఞానము. పరా శక్తికి ఆదినుండి యున్నదని అది తెలియుట ఎప్పటికీ దుర్లభమైన పని. త్రిమూత్యాత్మకమైన ప్రకృతిని ఆవరించిన పరతత్వము తెలియుటకై సాధన. త్రిమూర్తులు కూడా ఎప్పటికీ తెలుసుకుంటూనే నుండుటయే సృష్టి. ముగ్గురి ప్రవృత్తి కూడా పరాప్రకృతిని ఙ్ఞానము, ఙ్ఞేయమని, ధ్యేయమని, అది ఈశ తత్వమని విశ్వవాప్తమని తెలియుచున్నది. చైతన్య లక్షణము విష్ణు తత్వము, గుణ తత్వం. గుణ తత్వం లేనియెడల లేదా వున్నది తెలియని యెడల లేక అలా ప్రయత్నం చేయనియెడల జీవితం వ్యర్ధం కదా. జీవనం వ్యర్ధం కదా. తెసుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి