https://m.thepaperboy.com/#
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, డిసెంబర్ 2020, శుక్రవారం
*శ్రీ శివ మహా పురాణం
**దశిక రాము**
**శ్రీ శివ మహా పురాణం**
19 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగము
ఇళాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్!
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే!!
ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణం చెప్పబడింది. ఇంక ఆయన ఔదర్యమును ఇంత అంత అని మీరు లెక్కకట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటయిన వాడు. నిరంతరం శివ పార్థివేశార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతునియందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని, తనకిదిలేదని కాని, ఎన్నడు భావన చేయనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్యపేరు సుదేహ. ఆమె మహా సౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరమూ అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలాకాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె బాధపడింది. అపుడు ఆయన భార్యతో “ఏమిటే నీ వెర్రి! ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డలకోసం ఎందుకు నీకీ అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు తరిస్తావు. నీతోపాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఎదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచిమాట చెప్పింది. ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఈమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్లి చెప్పింది. అపుడు ఆయన ‘నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేక పోతున్నావు. బిడ్డలు కలుగక పోవడానికి దోషము నీదో, నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయమును ఈశ్వరుదినే అడుగుతాను’ అని చెప్పాడు. తరువాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు.
రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. రెండు పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ‘ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది’ అని ఈశ్వరా నీ సంకల్పమును మాకు చెప్పెయ్యాలి’ అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండలలో ఒకదానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి రెండవదండను తీసింది. అపుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలుగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకొనవలసిందని చెప్పాడు. అపుడు ఆవిడ అలా వీల్లేదని ‘నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు. కానే అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమెవలన మీకు సంతానం కలుగుతారు కదా! వాళ్ళు నన్ను అమా అని పిలిస్తే చాలు. అని చెప్పింది. అపుడు ఆయన ‘ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీయందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను’ అన్నాడు. అపుడు ఆవిడ చచ్చిపోతానుఅన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఘృష్ణ. సంతోషంగా కాలం గడుస్తోంది. ఘృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకి చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజూ నూట ఒక్క పార్థివ లింగాములకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత నూటొక్క లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఇలా మూడు సంవత్సరములు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివపూజ వలన ఆయనకు నానా అనిపించుకోగల అదృష్టం కలిగింది. మూడు సంవత్సరములలో ఆవిడ దాదాపు లక్ష శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు.
ఆ పిల్లవాడికి యుక్తవయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళయితే సుదేహను గౌరవంగా చూశారు కానీ వియ్యాలవారు మాత్రం పిల్లవాని సొంతతల్లి ఎవరయితే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లు అంత ఆదరణ పొందడానికి కారణమని తలచి ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళవెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది.
ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకు వెళ్లి తన చెల్లెలు రోజూ శివలింగములను కలిపే చోటులో నీటిలో పారవేసింది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకుందుకు నదీ తీరమునకు వెళ్ళిపోయాడు. ఈవిడ నూటొక్క లింగములకు అర్చన చేస్తోంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్కబట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలి వెళ్లి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఘృష్ణ ఏడవదే అని చూస్తోంది. ఘ్రుష్ణ మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు. వాడిని ఆయన రక్షిస్తాడు. అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజచేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేక పోయాడు. అదీ విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఆవిడ నాయనా, నిన్ను కాపాడిన వాడు మహాకాలుడు. ఆయనే తీసుకెళ్ళ గలడు. ఆయనే బ్రతికించగలడు. ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లియైన ఘృష్ణ ‘నాయనా నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతోంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని ఘృష్ణా, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను’ అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అంది ఆవిడ. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత! నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వరా నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్కవలన కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలన కదా నాకు నీయందు పూనిక కలిగింది. ఈ ఔదార్యమును ఇలా అనుగ్రహించు’ అంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడిగి నిలబడి సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోవలసింది అన్నాడు. ఆమె ‘అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజూ నూటొక్క లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలవవలసినది. నీ దగ్గరకి వచ్చి నమస్కరించిన వాళ్ళందరిని ఇలాగే కాపాడు’ అన్నది. అపుడు శివుడు ‘తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను. నీపేరు మీద ఘృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినపుడు అందరూ నిన్ను తలచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం ఘృష్ణవలన గుర్తురావాలి. నా ఔదార్యం ప్రకటితం అవడానికి కారణం నువ్వు. కాబట్టి నిన్ను తలచుకుని నన్ను తలచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు ఘృష్ణేశ్వరుడు’ అని ఘృష్ణేశ్వరుడై అక్కడ వెలిశాడు.
పిమ్మట శివుడు ‘ఘృష్ణా, నూటొక్క తరాలు నీవంశంలో చెప్పుకోదగిన మహా భక్తులయిన వారు కుమారులుగా జన్మించి వెడుతుంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈవేళ నుంచి నాకు మహా భక్తురాలయిపోతుంది’ అన్నాడు. వీటన్నింటిని ఘృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చేశాడు. కాబాట్టే ఈశ్వరుడిని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు.
🙏🙏🙏
Income Tax Payers in India;*
*The big myth on Income Tax Payers in India;*
Data from a Chartered Accountants, Company Secretaries and other professional bodies and groups......
FM said during her budget speech that we are largely a tax *'non- compliant'* society and presented that only *3.7 crores* are filing ITRs in this poor country of 125 crore population .
*The reply by CAs ,CSs,CMA,s
Madam,
We have 82 crore voters out of which,
- *75% are agriculturists* ie. 61.5 crores ( You exempted them straightaway, but they can also buy cars , bungalows etc. as you quoted.. Your political colleagues are also enjoying this exemption)
*Balance remains... 20.5 crores*
*Less:24% BPL class* ( Below poverty line)
Means 15 crore population ( which is non agriculturist and non BPL) ..
*Less : Senior Citizens, Non working wives, unemployed youths, below-taxable income earners... political class.. (say 75%)* ... in a typical indian family only 1 earning member and 5/6 are dependent on him....
*Balance: (15-11.25)=3.75 crores is the earning class ... which can file ITRs and ... they are already filing it...*
.... So almost no gap as FM is stressing unnecessarily without knowing her country
if FM wants more people to come into tax net ... then... instead resorting to rampant raids, surveys, notices, scrutiny, etc etc, she should defy her negative bureaucrats and .......
1. Introduce simple Income Tax on Agricultural Income on large landlords ( Say 10 Acres plus ) - you can add 26% of Agriculturists as tax payers *( Politicians are also enjoying this exemption )*
2. Instead of introducing 5000 /10000 penalties on late filers of IT return ...
*come out with positive approach and introduce incentives to IT return filers* ( learn from Pakistan, IT assessee gets discount in purchase of Car )
3. *Introduce Privilege card to those paying taxes above certain limit.. privilege card to entitle assessee with benefits like Priority quota in railway tickets , Use of airport lounges, subsidised medical facilities, etc etc... let Tax payers feel proud*
4. *Introduce medical insurance / life insurance on basis of average ITR filled... like coverage upto twice of Gross Income in ITR filed for mediclaim and ten times risk cover in case of life insurance*
5. *Introduce Pension after 65 yrs of age on the basis of tax paid by tax payer during his/her working life..*
Let honest taxpayers get certain direct benefits....
As on today, 3.3% of Indian population is filing ITRs as compared to 8% of China...adding large agriculturists to Income Tax may shoot the figure to more than 10% .... it may help in having a tax compliant nation ...
*LET'S SPREAD THIS TO EDUCATE HONEST TAX PAYERS*
". నాభాగుడు " పాత్ర గురించి
". నాభాగుడు " పాత్ర గురించి తెలుసుకుందాం! సేకరణ:-" "వైవసత్వ మనువు యొక్క పుత్రుడైన నాభాగుడు. త్రికాల జ్ఞాని. ఇతడు బాల్యంలోనే గురుకుల ము నందు చేరి విద్యనభ్యసించారు. ఇతడు ఆత్మజ్ఞాని కావున తండ్రి యొక్క ఆస్తిని పొందుటకు ఆశ పడక పోవచ్చు నని తన సోదరులు తండ్రి ఆస్తి సమంగా పంచుకొని రి. ఫిదప గురుకులము నుండి మరలి వచ్చిన "నాభాగుడు " తన సోదరులను గూర్చి "మీరు నాకోసం ఆస్తిని పంచ లేదా? అని ప్రశ్నించెను. " అందుకు నాభాడా! నీవు ఈ విషయమును తండ్రి వద్దనే ప్రశ్నించు అని సోదరులందరూ పలికే రి. తరువాత తండ్రి వద్ద ఈ విషయమును ప్రస్తావించగా , తండ్రి ఇలా పలికెను. "నాయనా అంగీరసుడు మొదలైన ఋరుషులు యాగము నాచరించు చున్నారు . ఈ యాగం యొక్క ఆరవ రోజున విశ్వ దేవతలకు సంబంధించిన మంత్రమును వారు మరిచిపోతారు. ఆ మంత్రమును నీవు వారికి తెలిపినచో వారు నీకు ప్రతిఫలము గా మిగిలిన ధనము, ద్రవ్యము మొదలగు వాటిని ప్రసాదించేదరు. అది విన్న " నాభాగుడు" యాగమును చేరుకుని మరిచిపోయిన మంత్రమును తెలిపి, యాగమును సమాప్తి కానిస్తాడు. అలా యాగమునకు సహాయపడిన నాభాగునకు మిగిలిన ద్రవ్యమును సమర్పించారు. వారందరూ వెళ్ళిన తరువాత ఉత్తరదిక్కున కృష్ణ వర్ణము తో కూడిన రుద్రుడు మారు వేషములో అగుపించెను నాభాగుని కి, మిగిలిన ద్రవ్యమును సంగ్రహించు నా తనని శివుడు యాగమును మిగిలిన ద్రవ్యము నాకు చెందవలసిన ది అని పలికెను. శివుడు ఆదేశించినట్టు అనే తండ్రి అందులకు తండ్రి సంతోషముతో ఆ నల్లని వాడు ఎవరో కాదు సాక్షాత్తూ మనోనియమకుడు అయిన పార్వతిపతి శివుడు. ఈ చిన్న యాగము నా మిగిలిన ద్రవ్య మైనను అది ఆ శివునికి చెందినది. కావున ఆ ద్రవ్యమును తనకే వదిలిపెట్టి రమ్ము అని సెలవిచ్చెను. తండ్రి మాటను గౌరవించి శివుని వద్దకు చేరెను. తండ్రి చెప్పిన విధముగానే" ఇది మీకు సంబంధించినదే దీనిని మీరే స్వీకరించండి అని" చెప్పాను. అప్పుడు అతని ఉత్తమమైన, సత్యమైన ,నీతికి సంతోషించిన శివుడు ఆ మిగిలిన ద్రవ్యము కంటే రెట్టింపు ద్రవ్యమును, అలాగే వేదార్థమును, వేద ప్రతి పాధ్యుడైన శ్రీమన్నారాయణుని జ్ఞానమును ప్రసాదించే ను. నాభాగుడు కూడా మిక్కిలి సంతోషముతో ఇల్లు చేరుకున్నా డు.
నాకూ పెళ్లాం కావాలి
నాకూ పెళ్లాం కావాలి!
ఎదురు కట్నం ఇచ్చి మరీ ఇంటివాళ్లవుతున్న అబ్బాయిలు
అమ్మాయిలు దొరక్క కులాంతర వివాహాలు
రైతులు, పురోహితులకు కల్యాణయోగం కనాకష్టం
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ పెళ్లి కాని ప్రసాదులు
35 ఏళ్లు దాటినా సోలో బతుకులు
అప్పట్లో..
మందీమార్బలంతో అబ్బాయి తరఫువారు పెళ్లి చూపులకు వెళ్లేవారు. కాలుమీద కాలేసుకొని, అమ్మాయిని నఖశిఖ పర్యంతం చూసి.. యక్ష ప్రశ్నలేసి.. పిల్ల నచ్చినా... ‘కట్నం ఇంతిస్తేనే పెళ్లి’ అని భీష్మించేవారు!
కొంత కాలం తర్వాత..
‘కట్నం వద్దులెండి.. ఘనంగా పెళ్లి జరిపించండి చాలు’ అని అన్నారు.
మరికొంత కాలం తర్వాత
‘కట్నకానుకలు ఇవ్వకున్నా పర్లేదు, పెళ్లి కూడా మేమే చేస్తాం. పిల్లనిస్తే చాలు’ అన్నారు.
ఇప్పుడు...
‘అమ్మాయినివ్వండి.. పెళ్లి మాదే, ఖర్చులూ మావే. మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం’ అంటున్నారు.
పెళ్లివారమండీ.. మగ పెళ్లి వారమండీ..మా పాట్లు వినేది ఎవరండీ...
ఉడికీ ఉడకని వడ్డనలూ... చాలీ చాలని కట్నాలూ...
పరుగులు తీసే పద్ధతులన్నీ చాలు చాలు ఇక మార్చాలి!
సీమ చదువుల మా అబ్బాయికి లక్షల కట్నం ఏదండీ?
ఘుమఘుమలాడే పన్నీరు అత్తరు వాసనలేవండీ...?! అంటూ మగపెళ్లివారు బెట్టు చేసే రోజులు పోయాయి.
ఇక కన్యూశుల్కమేనా!
4 రోజులుపోతే మనందరి కళ్లముందే..వందేళ్లనాటి కన్యూశుల్కం మళ్లీ రావొచ్చు.
కట్నం కోసం డిమాండ్లు.. లాంఛనాల కోసం అలగడాలు అన్నీ పోయి.. ‘ఆడపిల్ల తరఫువారు ఏమడిగినా ఇస్తాం.. పిల్లనిస్తే చాలు.. అదే పదివేలు’ అని అబ్బాయి తరఫువారు సర్దుకుపోతున్న కాలం వచ్చేసింది. వివాహ యోగం లేని వాళ్లయితే.. ‘పెళ్లెప్పుడవుతుంది బాబూ..’ అంటూ విషాద గీతికలో మునిగి తేలుతున్న రోజులివి!! వరుడికి ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఆరంకెల జీతం వచ్చే ఉద్యోగం ఉన్నా.. పెళ్లి విషయంలో చివరి మాట అమ్మాయిదే! ‘అబ్బాయికి నచ్చితే చాలా? మా అమ్మాయికి నచ్చొద్దూ’ అంటున్నారు ఆడపిల్ల తరఫువారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? న్యూక్లియర్ ఫ్యామిలీయేనా? వంటి వధువుల ప్రశ్నల జాబితా అబ్బాయి తరఫువారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మ్యాట్రిమోనీ సైట్‌లో బయోడేటా పెట్టగానే అమ్మాయికి వంద సంబంధాలు వస్తున్నాయి. వాటిలోంచి అమ్మాయి దిలాసాగా తనకు నచ్చిన అబ్బాయిని సెలక్ట్ చేసుకుంటోంది. అబ్బాయిలకు అస్సలు చాయిసే లేదు. పెళ్లి కుదిరితేనే గొప్ప! 35 ఏళ్లొచ్చినా పెళ్లిళ్లు కాని ముదురుబెండల కోసం కట్నకానుకలు అడగడం తల్లిదండ్రులు ఎప్పుడో మానేశారు.
మోతుబరి రైతుకు, పురోహితులకు మరిన్ని ఇక్కట్లు!
రైతు అందరికీ అన్నం పెడతాడు. కానీ ఆ రైతుకి ఇంట్లో అన్నం పెట్టే ఇల్లాలు దొరకడంలేదు. సాగుభూములు, కోట్ల ఆస్తులు ఉన్నా.. రైతుబిడ్డలను ఈ కాలం అమ్మాయిలు దూరం పెడుతున్నారు. మంచి ఉద్యోగం చేసే అబ్బాయిని చేసుకుంటే సిటీలో సుఖపడవచ్చని భావిస్తున్నారు. దీంతో 35-40 ఏళ్లు వచ్చినా రైతుబిడ్డలకు పెళ్లిళ్లు కావడం లేదు. ఊళ్లో అందరికీ పెళ్లిళ్లు చేయించే పురోహితులదీ ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకోవడానికి ఆ వర్గానికి చెందిన వధువులు ముందుకు రావడం లేదు.
నిజానికి పురోహితులు ఉద్యోగులతో పోటీపడి సంపాదిస్తున్నారు. బైకులు, ఐ ఫోనులు, ల్యాప్‌టా్‌పలు, విదేశీయానాలతో మోడరన్‌గా మారుతున్నారు. అయినా పురోహితుల్ని పెళ్లి చేసుకునేందుకు వధువులు ససేమిరా అంటున్నారు. కరీంనగర్‌కు చెందిన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వరుడు ఓ అనాథను పెళ్లాడాడు. బీదర్‌లాంటి ప్రాంతాల్లో బ్రాహ్మణ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం మరీ కష్టమైపోతోంది.
దీంతో ఎంపిక చేసిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లిచేసుకోవచ్చంటూ అక్కడి బ్రాహ్మణ సంఘాలు అంతర్గంతంగా తీర్మానించేసినట్టుగా తెలుస్తోంది! నాటకాలు, సినీ రంగాల్లోని అబ్బాయిలకూ వెడ్డింగ్ బెల్స్ మోగడం లేదు.
లకారం ఉంటేనే లక్షణమైన అమ్మాయి
తెలుగులో ఓ ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థను నెలకు సగటున 500మంది సంప్రదిస్తూవుంటారు. వారిలో కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ కులాలకు చెందినవారే ఎక్కువమంది. ఒక్కో అబ్బాయికి పెళ్లి కుదరడానికి కనీసం ఏడాది కాలం పడుతోందంటున్నారు నిర్వాహకులు. అమ్మాయి తల్లిదండ్రులు రూ.లక్ష వేతనం ఉన్న పెళ్లికొడుకులనే మొదట చూస్తున్నారు. నెలకు రూ.50వేల కంటే తక్కువ జీతం ఉంటే పెళ్లి చేయలేమని మ్యాట్రిమోనీ నిర్వాహకులే తేల్చిచెప్పేస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో అమ్మాయికి 110శాతం డిమాండ్ ఉంటే అబ్బాయికి 60% డిమాండ్ ఉందని అంచనా.
ఉత్తరాంధ్రకు కోస్తా అబ్బాయిల పరుగు
ఎంతకూ పెళ్లిళ్లు కాకపోవడంతో కోస్తాలో అగ్రవర్ణాలలోని కొన్ని వర్గాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువ. ఆ జిల్లాల అమ్మాయిల కోర్కొల జాబితా అంతగా వుండదు కాబట్టి ఏదోలా వారిని ఒప్పించి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. కులగోత్రాల విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా పెళ్లికి ఓకే చెబుతున్నారు. హర్యానా రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కేరళతోపాటు ఇతర రాష్ట్రాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం నేటికీ జరుగుతున్నది. ఈ ట్రెండ్ త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చినా ఆశ్చర్యం లేదేమో!
హిస్టరీ రిపీట్స్
‘పెళ్లికాని ప్రసాదుల’ కష్టాలను చూస్తుంటే.. 120 ఏళ్లనాటి కన్యాశుల్కం రోజులు గుర్తుకువస్తున్నాయి. ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రంలో అమ్మాయిలు దొరక్క..తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి..ఎదురు కట్నం ఇచ్చి మరీ వధువులను తెచ్చుకునేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడవే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పెళ్లిళ్ల పేరయ్యలు! తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువ. కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయడం భారం అనుకుని అప్పట్లో అమ్మాయిని కనేందుకు వెనుకాడేవారు. దీంతో ఆడపిల్లల సంఖ్య మరీ తగ్గిందిపోయింది. అనంతపురం జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది.
తరతరాల లింగ వివక్ష కారణంగా ఆడపిల్లలు దొరక్క.. అనంతలో ఎక్కడ చూసినా పెళ్లికాని ప్రసాదులే కనిపిస్తున్నారు. కాలక్రమంలో ఆడపిల్ల భారం అనుకునే రోజులు పోయి ‘కంటే అమ్మాయినే కనాలి’ అనుకునే రోజులు వచ్చాయి. అమ్మాయిలు బుద్ధిగా చదువుకుని 22 ఏళ్లకే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఆకర్షణీయమైన జీతం అందుకుంటున్న అమ్మాయిలకు కోరుకున్న వరుడు దొరుకుతున్నాడు. తూర్పుగోదావరిజిల్లాలోని కొన్ని సామాజిక వర్గాల్లో ఎదురుకట్నం ఇస్తామన్నా ఆడపిల్లలు కనిపించడంలేదు. దీంతో కులాంతర వివాహాలకు కూడా అంగీకరిస్తున్నారు. ఎదురు కట్నం ఇచ్చి మరీ ఇంటికి కోడలిని తెచ్చుకుంటున్నారు.
ఎందుకీ పరిస్థితి?
ఏపీలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 996మంది స్ర్తీలు ఉన్నారు. అయితే ప్రతి వెయ్యిమంది బాలురకు 944మంది బాలికలే ఉండటం ఆందోళన కల్గిస్తోంది. యువతీయువకుల నిష్పత్తిలో తేడా కూడా గణనీయంగా ఉంది. ప్రతి వెయ్యిమంది యువకులకు దాదాపు 970మంది యువతులే ఉన్నారని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఫలితంగా చాలా సామాజిక వర్గాల్లో పెళ్లీడు అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. ఎదురుకట్నాలు ఇచ్చినా వధువులు దొరకని పరిస్థితి వచ్చింది. కట్న ప్రసక్తిలేని కల్యాణాలను అంతా ఆహ్వానించాల్సిందే! అమ్మాయిలకు తమ అభిరుచులకు తగ్గట్టు వరుడిని ఎన్నుకునే స్వేచ్ఛ వర్థిల్లవలసిందే! కానీ దేశవ్యాప్తంగా స్త్రీ పురుష నిష్పత్తిలో తేడా ఆందోళనకల్గిస్తోంది.
గట్టి మేళానికి బోలెడు కండీషన్స్
కాబోయే భర్త తల్లిదండ్రులకు దూరంగా నగరాల్లో ఉద్యోగం చేస్తూవుండాలి.
గ్రామాలను అంటిపెట్టుకుని ఉండే వరుడు వద్దు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సెటిలై ఉండాలి
ఎన్ని ఆస్తులున్నా వ్యాపారం చేసే వరుడి కంటే ఉద్యోగం చేసే వరుడే కావాలి
తన కంటే మంచి చదువు, కనీసం ఆరు అంకెల జీతం సంపాదిస్తూ ఉండాలి.
ఎంత ఆస్తి వున్నా వ్యవసాయం చేసే వరుడు వద్దే వద్దు.
సివిల్, మెకానికల్ ఉద్యోగాల కంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతేనే బెటర్
ఉద్యోగులతో పోటీ పడి సంపాదిస్తున్నా పురోహితుల్ని వధువులు వద్దంటున్నారు.
అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉండలేమని అమ్మాయిలు ముందుగానే చెప్పేస్తున్నారు.
వాట్సాప్ లో చూసి..ఫేస్ బుక్‌లో చదివి..
పెళ్లి చూపులకు వెళ్లడం..పెళ్లికూతురును ప్రశ్నలు అడగడం..అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలు ఆరా తీయడం.. ఇలా పెళ్లినాటి ముచ్చట్లన్నీ ఇకపై పుస్తకాల్లో చదువుకోవాలి. ఇప్పుడు వధూవరులు వాట్సాప్ లో చూసుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. వాట్సాప్ లో ఫొటోలు షేర్ చేయడం..ఫేస్ బుక్, ట్విటర్‌లో మనస్తత్వాలను అర్థం చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు కూడా స్మార్ట్ అయిపోయారు. సోషల్ మీడియా ద్వారానే సంబంధాలు కుదిర్చేస్తున్నారు.
Continuation part-2👆
బెటర్ హాఫ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉండాలి? తనకు ఎలాంటి అమ్మాయి కరెక్ట్? ఇలా నేటి యువత అన్నీ జాగ్రత్తగా విశ్లేషించుకుంటున్నారు. బెటర్‌హాఫ్ కోసం మ్యారేజ్ బ్యూరోలు, షాదీ సైట్లలో సెర్చ్ చేస్తున్నా చాలామందికి నిరాశే మిగులుతోంది. వాళ్లకోసం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందివచ్చింది. అర్హతలు, అభిరుచులకు సరిపోయే వధూవరులను స్ర్కీన్‌మీద కూర్చోబెడుతుంది. వారు చేయాల్సిందల్లా వివరాలను, అభిరుచులను నమోదుచేసి భారీ ఫీజు చెల్లించుకోవడమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ ఎంత హాట్ అంటే..ఈ ప్రాజెక్టుతో ముందుకు వచ్చిన భారతీయ స్టార్టప్ కు ఇటీవల 1200 కోట్ల ఫండింగ్ లభించింది.
అమ్మాయిలదే చాయిస్
కట్నకానుకలు తగ్గాయి. అమ్మాయిల అభిరుచులు మారాయి. వారి ఇష్టానికే తల్లిదండ్రులు కూడా ఓటేస్తున్నారు. ఆడపిల్లలు 22 ఏళ్లకే మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. తమకంటే బాగా చదువుకుని, ఆర్థికంగా స్థిరపడిన అబ్బాయిలే కావాలని కోరుతున్నారు. దీంతో కట్నాలు, కానుకల గురించి పట్టుపట్టే చాన్స్ అబ్బాయిలకు లేదు. విశాలంగా ఆలోచించే అబ్బాయిలకు ఇబ్బంది లేదు. కానీ కోరికల జాబితా పెద్దదిగా ఉన్న అబ్బాయిలకు పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి.
- శ్రీమతి వనజారావు, వనజారావు క్విక్ మ్యారేజ్‌బ్యూరో అధినేత
20 ఎకరాలున్నా పెళ్లి కావడం లేదు
క్షత్రియుల్లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వయసులోనేకాదు చదువులోనూ చాలా వ్యత్యాసం ఏర్పడింది. 1970 నుంచి 1990 మధ్య పుట్టిన అబ్బాయిల్లో చాలామంది పెద్ద చదువులు చదవలేదు. ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు తమకంటే తక్కువ చదివిన రాజులను చేసుకోలేమంటున్నారు. 20 ఎకరాలున్నా అబ్బాయిలకు పెళ్లికాని పరిస్థితి మాలో ఉంది.
- సరివళ్ల రామలింగరాజు, క్షత్రియ సేవా సమితి సలహాదారు
అమ్మాయిలు కాంప్రమైజ్ కావడం లేదు
బ్రాహ్మణుల్లో 100మంది అబ్బాయిలకు 60 నుంచి 70మంది అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిల కుటుంబసభ్యులు చాలా విషయాల్లో సర్దుకుపోతున్నా పెళ్లి చేయడం కష్టంగా మారుతోంది. అమ్మాయిలు కాంప్రమైజ్ కావడం లేదు. దీంతో పురోహితులకు ఆదాయం పెరిగినా సంబంధాలు రావడం లేదు. అమ్మాయిలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. మా అబ్బాయిలేమో పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోతున్నారు.
- డొక్కా నాగబాబు, బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు
కట్నాలకు కాలం కాదు
వైశ్యుల్లో కట్నాలు చాలావరకు తగ్గిపోయాయి. ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాలోనూ ఒకటిరెండు శాతం కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. గరిష్ఠంగా 28 ఏళ్లకు పెళ్లిళ్లు అవుతున్నాయి.
- వెగుళ్లపల్లి కుమార్, వైశ్య సంఘం నాయకుడు
- అమరావతి/హైదరాబాద్, ఆంధ్రజ్యోతి
పార్ధుడు
యుద్ధం ముగిసింది ..అర్జనుడు హుందాగా కూర్చోగా రధం నగరాని వచ్చింది...కృష్ణుడు అర్జనుడిని ఓరకంట చూస్తూ " దిగు పార్ధా" అన్నాడు.
పార్ధుడు మొహం చిట్లించాడు ..చికాకుపడ్డాడు..
ఆనవాయితి ప్రకారం ముందుగా సారధి దిగి రధం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు........
దానికి విరుద్ధంగా ముందు సారధి దిగకుండా తనను దిగమనడంతో అర్జనుడి ఇగో హర్ట్ అయింది...
ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక...రధం దిగాడు..
అర్జనుడు దిగి కొంతదూరం పోయాక అప్పుడు దిగాడు కృష్ణుడు ..
మరునిముషం రధం భగ్గున మండి బూడిద అయింది...
అదిరిపడ్డాడు అర్జనుడు...
యుద్ధం లో ఎన్నో దివ్యస్త్రాలు ప్రయోగించబడినవి వాటిని తన శక్తిద్వారా అదిమిపట్టి ఉంచాడు కృష్ణుడు ఆయన దిగగానే శక్తి విడుదలై రధం మండిపోయింది... అదే ముందు కృష్ణుడు రధం దిగిఉంటె.....?
అలానే కొన్ని నిజాలు చేదుగా ఉంటాయ్
తప్పదు...
చెప్పడం ధర్మం...మాకన్ని తెలుసనుకుంటె మన ఖర్మం....
" ఓం నమో భగవతే వాసుదేవాయ".
🙏🏻జై శ్రీ కృష్ణ 🙏🏻
కన్నీళ్లు కధ
*హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....*
*భోజనానికి ఎంత తీసుకుంటారు......*
*యజమాని చెప్పాడు...*
చేపల పులుసుతో అయితే 50 రూపాయలు,
*అవి లేకుండా అయితే 20 రూపాయలు....*
*ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....*
*నా చేతిలో ఈవే ఉన్నాయి..*
*వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...*
*కాస్త ఆకలి తీరితే చాలు.*
*నిన్నటి నుండి ఏమీ తినలేదు...*
*ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....*
*హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.*
*నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను....* ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....*
*మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,*
* ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...*
* నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి.... నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.....*
* ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి.... నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నాయవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను...*
* అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది....ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు.వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.
* ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు....*
* నేను వృద్దుణ్ణి కదా....? కనీసం
నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు...*
* వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో...*
* ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా, అని...*
*పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు...., ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఆ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు...*
* కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపంతో దొంగ అనే ముద్ర వేశారు...* కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు. *తండ్రి* పై చేయి చేసుకున్న *కొడుకు* అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను. నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి....?
*ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు..*
తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు....
యజమాని వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు....*
*ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు...*
*మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది..*
*ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు....*
చాలా సంతోషం, మీ ఉపకారానికి.... ఏమి అనుకోకండి... ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని *గమ్యంతెలియని బాటసారిలా...* వెళ్ళిపోయాడు.
ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు.
*అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని .......*
పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు..???
*కావలసింది, అక్కరలేనిది అని తేడా లేకుండా ప్రతీది షేర్ చేసి MB అవగొట్టేవాళ్ళు, దీన్నికూడా షేర్ చెయ్యండి
ఎవరైనా ఒక్కళ్ళ మనసు మారినా.....* చాలు.*
* మార్పు మననుండే ప్రారంభం కానీయండి.*
🙏🙏ధన్యవాదాలు🙏🙏
*శ్రీ ఆంజనేయస్వామి మహత్యం**
**దశిక రాము**
*శ్రీ ఆంజనేయస్వామి మహత్యం**
6 – నీలుడి కధ -2
లంకకు చేరిన నీలుడు కొంత కాలమ్ తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు .తనలో తాను ఇలా వితర్కించు కొన్నాడు ”రాజు పని వున్నా లేక పోయిన రాజ్యానికి నష్టం లేకుండా శత్రువులను భయ పెట్టాలి .శత్రు మర్దనుడు అనే బిరుదుపొందాలి .ఇలా చేయక పొతే ,శత్రువులకు తేలికై పోతాడు .మా జాతికి శత్రువు స్వర్గ లోకాది పతి ఇంద్రుడే.అతని వద్ద నుండి చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు నేను గ్రహించటం రాజ ధర్మం .నెమ్మదిగా నయం తో సాధించ టానికి ప్రయత్నిస్తా .ఇవ్వ క పొతే యుద్ధం చేసి అయినా వాటిని దక్కించు కుంటాను .ఒక దూతను రాయ బారి గా ఇంద్రుడి వద్దకు పంపితే మంచిదని తోస్తోంది .అతని వల్ల సమాచారం తెలుసు కోని ,అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలో చిస్తా”అని దీర్ఘా లోచన చేశాడు .సమర్ధుడైన దూతను పిల్చాడు .అతని తో తన మనసు లోని మాట ఇలా తెలియ జేశాడు .”నా రాయ బారి గా ఇంద్ర లోకం వెళ్లి ,నేను చెప్పే మాటలు ఇంద్రునికి తెలుపు .ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని ,మనకు కావాల్సిన చింతామణి వగైరా లను మర్యాద గా అప్ప గించి ,సంతోషం కలుగ జేయ మని చెప్పు .లేక పొతే యుద్ధానికి సిద్ధం గా ఉండ మని తెలియ జేయి ”అని వివరం గా చెప్పి పంపాడు దూతను .
దూత ,నీలుడి మాటలను మననం చేసు కొంటు, స్వర్గ లోకం చేరాడు .అక్కడ దేవ సభ లో మహేన్ద్రుని సభకు చేరాడు ..ఇంద్రుడు, భార్య అయిన శచీదేవి తో సింహాసనం పై అధివసించి వున్నాడు .దేవగురు బృహస్పతి ,దేవ లోక మహర్షులు అందరు ఉచిత ఆసనాలపై ఉపవిస్టులైనారు .అప్సరసలు నృత్యాలు చేస్తుంటే గంధర్వులు కమ్మ గా గానం చేస్తున్నారు .రాక్షస రాజ కుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించి ,మహేన్ద్రునికి నమస్కరించాడు .ఆయనా మర్యాద పూర్వ కం గా కుశల ప్రశ్నలు వేస్తూ స్వాగతించాడు .దూత నీలుడు చెప్పమన్న మాటలను ”సురాదిపా దేవేంద్రా !నేను లంకా రాజ్య పరి పాలకుడు విభీషణ మహా రాజు గారి సేవకుడిని .ఆయన కుమారుడు ,యువ రాజు నీలుని దూతను .శ్రీ మంతుడు ,సర్వ శస్త్రాస్త్ర సంపన్నుడు ,ధర్మాత్ముడు ,భగవద్ భక్తుడు అయిన నీల మహా రాజు మీకు ఒక సందేశాన్ని ,నా ద్వారా పంపించారు .సావదానం గా విని ప్రత్యుత్తరం ఇవ్వ వలసినది గా కోరు తున్నాను ”అని చెప్పి ,నీలుడు చెప్పి పంపిన విష యాలనన్నిటినీ ఏకరువు పెట్టాడు .
అన్నీ విన్న సహస్రాక్షుడు కోపోద్రేకం తో ”నీలుడు అంతటి వాడు అయ్యాడా ?మా వజ్రాయుధం సంగతి మరిచాడా ?మహా బల సంపన్ను లైన పాకాసుర ,జమ్బాసురాది రాక్ష సుల కన్నా పోటు గాడా ?అతని పరాక్రమం ఏమిటో చూద్దాం .అతను అడిగిన వేవీ ఇవ్వం అని చెప్పు” ‘అని చెప్పి దూతను చంప రాదు కనుక ,శిఖ ను కత్తిరింప జేసి ,బయటికి వెడల గొట్టాడు ఇంద్రుడు .ఇంతలో సభలో అశుభ శకునాలు కని పించాయి ,విని పించాయి .ఏదో ప్రమాదం జరుగ బోతోంది అనే సూచన గమనించాడు ఇంద్రుడు .సభ చాలించి ,అంతః పురం చేరాడు .
ఇంద్ర సభ లో జరిగిన పరాభవాన్ని మూట గట్టు కోని ,దూత నీలుని చేరి విషయం అంతా వివ రించి చెప్పాడు .నీలుడు దూత కు జరిగిన పరాభవం తనకే జరిగి నట్లు గా భావించాడు .తండ్రి విభీషణుని తో మంత్రా లోచన చేశాడు .సైన్యాన్ని సమ కూర్చుకొని స్వర్గాన్ని ముట్ట డించ టానికి సన్నద్ధు డై బయల్దేరాడు .కొద్ది కాలం లోనే స్వర్గం చేరి దేవ సైన్యం తో యుద్ధం ప్రకటించాడు .ఇంద్రుడు కూడా సమయా సమయాలు తెలీకుండా ,అహంకార బల గర్వితుడై ,మద మత్సరాలతో ఊగి పోతూ పోరు కు తల పడ్డాడు .భయంకర యుద్ధం సాగింది .ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడి పై ప్రయోగించాడు .నీలుడు దాన్ని చేదించి నిర్వీర్యం చేశాడు .పరాభవం తో రగిలిన దేవేంద్రుడు నీలుడి తో ద్వంద్వ యద్ధానికి దిగాడు .ఇంద్ర నీలు లిద్దరూ బాహా బాహి ముస్టా ముష్టి యుద్ధం చేశారు .కుప్పించి తన్ను కొన్నారు ,కాళ్ళ తో కొట్టు కొంటున్నారు .యెగిరి మాటి మాటికీ బాదు కొన్నారు .క్రమం గా ఇంద్ర బలం క్షీణించి ,రాక్షసుడు అయిన నీలుని బలంపెరిగింది . .ఇంద్రుడు కుస్తీ పోటీలో పీటీ దెబ్బ తిని నేల మీద కూలి పోయాడు .నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి ఇంద్రుని వక్షస్థలం మీద చేరి పదు నైనఖడ్గం ఇంద్రుని గుండెలు చీల్చ టానికి పైకి ఎత్తాడు .ఈ ఘోరం చూడ లేక అందరు భయ కంపితు లైనారు .అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై నీలున్ని ఆపు చేశాడు .ఇద్దరికీ సంధి చేయ టానికి తాను వచ్చానని బ్రహ్మ వారిద్దరికీ చెప్పాడు .నీలుడు ఇంద్రుని
గుండెల మీద నుంచి లేచాడు .ఇంద్రుడు నీలుడు ఇద్దరు బ్రహ్మ దేవునికి నమస్క రించారు .భక్తీ తో కీర్తించారు .నీలుడు చేసిన బ్రహ్మ స్తవానికి నాలుగు ముఖాల బ్రహ్మ సంతోషించాడు .దేవేంద్రునితో బ్రహ్మ ”పాక శాసనా !నీకు బుద్ధి ఇంకా రాలేదా ?ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాది పత్యం ,విభీషణుడి రాజాదికారం అంతా శ్రీ రాముడి దయ చేతనే ననే సంగతి మార్చి పోయావా?నీలుడు కోరిన కోరికలు అతి సాధారణ మైనవే .వాటిని మన్నించి ,అతనికి వాటిని ఇచ్చి వేస్తె మంచిది ”అని చెప్పాడు .
బ్రహ్మ ఇంద్రునికి హితోప దేశం చేస్తూ ”నీలుడు హనుమ భక్తుడు .హనుమద్దాసులకు అప జయం లోకంలోవుండదు .చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు లను ఈనీలునికి సమర్పించించు .అతని క్షమాపణ కోరి సుఖం గా వుండు .”అని బోధించాడు .బ్రహ్మ వాక్కు లకు సిగ్గు పడి నీలున్న్ని క్షమాపణ కోరి నీలునికి చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు లను
ఒసగి ,సభక్తికం గా నిల బడ్డాడు .అప్పుడు బ్రహ్మ నీలుని చూసి ”శ్రీ మంతా నీలా !నువ్వు మాకు ఇష్టుడ వైన భక్తుడవు .నా సంతోషం కోసం నీకు ఒక వరం ఇవ్వా లను కొంటున్నాను.స్వీకరించు .నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం ఇక నుంచి ”నీలా చలం ”అని నీ పేర పిలువ బడుతుంది .దీన్నే ”పురుషోత్తమ క్షేత్రం ”అనీ పిలుస్తారు .నీకు ”వనసుందరి ”అనే దేవతా స్త్రీ ని ఇస్తున్నాను .ఆమెను వివాహం చేసు కోని ,సర్వ సుఖాలు అనుభవించు .కాలాంతరం లో నువ్వే ఇక్కడ ”నీలా చలేశ్వరుడు ”అనే పేరు మీద ఈ నీలా చలం లో వెలసి భక్తుల కోర్కె లను తీరుస్తావు .”అని చెప్పి వన సుందరిని ఇచ్చి యుద్ధంలో , చని పోయిన వారందరినీ బ్రతికించిబ్రహ్మ లోకం చేరాడు బ్రహ్మ .ఇంద్ర ,నీలాదులు పరమ సంతోషం పొందారు .ఇద్దరి మధ్య వైరం ఎంత త్వరగా ప్రారంభం అయిందో ,అంత త్వరగా సమసి పోవటం ఉభయులకు ఆనంద దాయకం అయింది . .కాలం ఎంతటి వారినైనా కలుపు తుంది విడదీస్తుంది .కాల మహిమ ఎవరు తెలుసు కో లేరు .ఈ కధలను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తున్నాడని మనం ముందే తెలుసు కొన్నాం కదా .
నీలుడి కధ సమాప్తం
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి**
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
**సౌందర్య లహరి**ఆరవ శ్లోక భాష్యం -
**దశిక రాము**
**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**
**సౌందర్య లహరి**ఆరవ శ్లోక భాష్యం - రెండవ భాగం
కాముడు (మన్మథుదు), కామేశ్వరి సేవకుడే కాబట్టి, ఆమె దగ్గరున్న చెఱుకువిల్లు కూడా ఈయన ధరిస్తూ ఉంటాడనడంలో తప్పులేదు. భావాల్లో ప్రేమ, రుచుల్లో తీపి వంటిది. అయినా ఎవరితోనైనా యుద్ధం చేసేటప్పుడు మిరపకాయల వంటి ఆయుధాలుంచుకోవాలి కదా! ఈయన దానికి పూర్తి వ్యతిరేకమైన ఆయుధాలు ధరిస్తాడు.
చెట్టు కాండం గట్టిగా ఉండవచ్చు. ఆకులు, పళ్ళు కూడా అప్పుడప్పుడు గరుకుగా కోసుగా ఉండవచ్చు. పూలు సుతిమెత్తటివి. అందమైన మనిషి ఎంతటి కఱుకువాడయినా కళ్ళు సున్నితంగానే ఉంటాయి. కొంచెం దుమ్ముపడితే కందిపోతాయి. అలాగే చెట్టంతా కఠినమైనా పూలు సున్నితంగా ఉంటాయి. మరి ఈయనో ? అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం వంటి పుష్పాలు ఆయుధాలుగా పెట్టుకొన్నాడు. ఒక్క పూవు ఒక్కొక్క ఇంద్రియానికి ప్రతీక. లలితా సహస్రనామంలో కూడా అంబిక అయిదు బాణాలు అయిదు ఇంద్రియాలతో సంబంధమున్న వానిగా అభివర్ణించబడింది. “పంచతన్మాత్రసాయకా” పంచభూతములకు సూక్ష్మరూపము ఈ అయిదు తన్మాత్రలు అయిదు ఇంద్రియముల చేత గ్రహించబడతాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు పంచతన్మాత్రలు.
ఈ అయిదు పుష్పాలు అయిదు ఇంద్రియాలను సూచిస్తాయనుకొన్నాం కదా! అయిదు తన్మాత్రలకు కూడా సంబంధముంటుంది. పూవున్న చోట తేనెటీగ ఉంటుంది. పూలకు స్పర్శ రూప రస గంధ లక్షణములున్నయి. కానీ పూలకు శబ్ద లక్షణం లేదు కదా! ఈ తుమ్మెద ఆ కొరత తీరుస్తుంది. ఈ మన్మథుడు “చంపు”, “చావగొట్టు” అనే అరుపులతో యుద్ధానికి వెళతాడు. అల్లెతాడుగా ఉన్న తుమ్మెదల ఝంకారమనే సంగీతంతో కూడి యుద్ధనికి వెళతాడు.
రాజులు బలహీనులైనా విశ్వాస పాత్రులైన సామంతులు మహా పరాక్రమవంతులైతే రాజ్యం భద్రంగానే ఉంటుంది. యుద్ధాలలో విజయాలు వరిస్తాయి. మరి ఈ మన్మథరాజు సామంతులెటువంటి వారు ? “వసంత స్సామంతో” – వసంత కాలమన్నమాట. ఈ కాలంలో సమశీత ఉష్ణస్థితులతో వసంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. దీనికి పుష్పసమయమన్న పేరుకూడా ఉంది. అటువంటి ఋతువుకు అధిపతి యుద్ధం చేయబోయే మన్మథునికి తోడు. యుద్ధంలో ఆగ్నేయాది అస్త్రాలు వేసి శత్రువును క్షోభింపచేయాలి. ఈ సామంతుడు తలపులలోకి వస్తేనే మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది.
“మలయ మరుదాయోధన రథః” – “ఆయోధన” అంటే యుద్ధం కోసం అన్నమాట – మలయ పర్వతాల నుండి వచ్చే మంచిగంధపు వాసనలున్న చల్లటి గాలులు ఈయన యుద్ధం కోసం ఏర్పడిన రథము యుద్ధాలలో విషవాయువులు కదా వదిలి పెట్టాలి. మందంగా వీచే కాలుష్యత ఏమాత్రం లేని చల్లటి గాలి ఈయన రథమా?
మన్మథుని బాణాలు, విల్లు, వింటితాడు కనీసం కనులకు కనిపిస్తాయి. ఈ వసంతుడు కళ్ళకు కనిపించను కూడా కనిపించడు. ప్రకృతి పుష్పించినపుడు ఓహో వసంత్మోచ్చింది అనుకుంటాం. చల్లటి గాలులు సోకినపుడు మలయమారుతం వీస్తుంది అనుకుంటం. సామంతులు, రథము ఇంత లక్షణంగా ఉన్నాయి. పోనీ మన్మథుడు బలిష్టంగా కనిపిస్తాడా అంటే ఆయన అనంగుడు. మన్మథునకనేక పేర్లున్నాయి.
అయితే ఆచార్యులవారు ఇక్కడ సాభిప్రాయంగా అనంగుడనే నామమే తీసుకున్నారు. అనంగ అంటే అంగములు లేనివాడు. శివునిచేత భస్మం చేయబడిన మన్మథుని కామేశ్వరి పునరుజ్జీవితుణ్ణి చేసింది. కానీ శరీరమే లేకుండా ఆమే భర్త వేసిన శిక్షను పూర్తిగా మాఫీచేయడం ఆమెకు ఇష్టంలేదు. అందువల్ల శరీరాన్నీయలేదు. అయితే అతడి భార్యకు మాత్రం కనిపించే వరమిచ్చింది. “రతినయన లేహ్యేన వపుషా” అన్నారు ఆచార్యులవారు. మిగతావారందరికీ అతడు కాంతి, శబ్దము, గాలి వలె ఒక శక్తి.
(సశేషం)
కృతజ్ఞతలతో🙏🙏🙏
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
#ParamacharyaSoundaryaLahariBhashyam
🙏🙏🙏
సేకరణ
*శ్రీమద్భాగవతము**
**దశిక రాము**
*
*శ్రీమద్భాగవతము**
తృతీయ స్కంధం -26
వరహావతారుని ఎదిరించుట
అలా నారదమహర్షి చెప్పగా, హిరణ్యాక్షుడు అగ్నిహోత్రంలా మండిపడ్డాడు. కమలలోచనుడైన విష్ణువును ఎదిరించా లని ఉత్సాహపడ్డాడు. ముల్లోకాలకు భయం కలిగించేలా, తన భుజబలాన్ని ప్రదర్శించుతూ, పెద్ద గదను చేతబట్టి, అతిశయించిన తేజస్సుతో ఆ మహా సముద్రగర్భంలోనికి అతి వేగంగా వెళ్ళాడు.అలా వెళ్ళి సముద్ర మధ్యభాగంలో...హిరణ్యాక్షుడు తన ఎదుట దట్టమైన కోరలు కలిగి, దేవతలలో శ్రేష్ఠుడై, భూభారాన్ని మోయడానికి సమర్థుడై, యజ్ఞమయమై, మేఘంలాగా నల్లగా ఉన్న ఆది వరాహమూర్తిని వీక్షించాడు.ఆ సమయంలో వరాహరూపంలో ఉన్న హరి...కమలములవంటి తన కన్నుల కాంతులను ప్రసరింప జేస్తూ, తన చూపుతో ఆ హిరణ్యాక్షుని దేహకాంతిని వెంటనే నశింపజేశాడు.ఇంకా ఆ ఆదివరాహం అడ్డులేని శౌర్యంతో నిరాటంకంగా విహరిస్తూ...కొంతసేపు తుదా మొదలూ ఏకమై ముక్కలయ్యేటట్లు కులపర్వతాలను తన ముట్టెతో కూలదోస్తూ, కొంతసేపు బ్రహ్మాండభాండం పగిలి చిల్లులుపడే విధంగా తన కొమ్ములతో చిమ్ముతూ, కొంతసేపు సప్తసముద్రాలు బురదలై ఇంకిపోయే విధంగా తన గిట్టలతో మట్టగిస్తూ, కొంతసేపు చంద్రుడూ సూర్యుడూ ఒకమూలకు తోసుకుపోయేటట్లు తన పొట్టితోకను త్రిప్పుతూ...తిరుగుతూ, కుప్పించి దూకుతూ, దాటుతూ, ఇగిలిస్తూ, ఎగురుతూ, నేలను బొరియలుగా తవ్వుతూ హిరణ్యాక్షుని గుండెలు తల్లడిల్లే విధంగా ఆ వరాహం యుద్ధానికి సిద్ధమై...ఇంకా...కన్నులు నిప్పులు కురియగా వాడికోరపైన భూమిని ధరించినవాడై వరాహమూర్తి తనకు ఎదురు రాగా చూచి హిరణ్యాక్షుడు ‘అడవిలో సంచరించవలసిన ఈ జంతువు నీళ్ళల్లో విహరించేదిగా ఎలా అయింది?’...అని ఆశ్చర్య భయాలు తన మనస్సులో అతిశయించగా హిరణ్యాక్షుడు భయంకర వరాహ రూపాన్ని ధరించిన రాక్షస గర్వ నాశకుడైన ఆ హరితో ఇలా అన్నాడు. బుద్ధిలేని ఓ పెద్ద వరాహమా! బ్రహ్మ ఇచ్చిన వరదానాన్నిబట్టి చూస్తే రసాతలంతో కూడిన భూమి శాశ్వతంగా నా ఆధీనమైనదే. పూనికతో నీవీ భూమిని తీసుకువెళ్ళకు. విడిచి పెట్టు. కాదని తీసుకుపోతే నీ ప్రాణం తీస్తాను. నా మాటలను విను. మొండిపట్టు ఎందుకు పడతావు? మాయగాడివై ఇప్పుడీ భూమిని దొంగతనంగా తీసికొని పోతుంటే నిన్ను నా గొప్ప భుజబలం చేత అణచివేయకుండా చూస్తూ ఊరుకుంటానా? గొప్ప యోగమాయ యొక్క బలంచేత లభించిన అల్పమైన పౌరుషంతో ఉన్న నిన్ను పాతిపెట్టి, నా మిత్రులకు, సేవకులకు ఆనందాన్ని కలిగిస్తాను. నా గదాఘాతంతో ముక్కలైన నీ తలను చూసి దేవతలందరూ నిర్మూలంగా నశిస్తారు” అని హిరణ్యాక్షుడు చెప్పగా విని యజ్ఞవరాహ రూపంతో విలసిల్లుతున్నట్టి....శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతల కందరికీ ఆ రాక్షసుని వల్ల వచ్చే కీడును ఊహించి విచారించి వాడికోర చివర ప్రకాశిస్తున్న భూదేవితో స్థిరంగా ఉన్నాడు. ఆ రాక్షసుని మాటలు అనబడే అంకుశాల పోట్లకు మిక్కిలి కోపించిన హరి భయపడిన ఆడయేనుగుతో ఉన్న గజేంద్రుని వలె భూదేవితో కూడి అతిశయించాడు. వాడియైన తెల్లని కోరల కాంతులు ఆకాశంలో వ్యాపించగా సముద్రంనుండి బయటికి వచ్చిన భయంకరమైన యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువును....ఏనుగు వెంటబడిన మొసలి వలె ఆ హిరణ్యాక్షుడు వెంబడించి, పాపసముద్రాన్ని దాటించేవాడూ, వరాహరూపాన్ని ధరించినవాడూ, గిట్టలతో మేరుపర్వతాన్ని మట్టగించినవాడూ అయిన హరితో ఇలా అన్నాడు. “నిందించినా రోషం చెందక, సిగ్గుపడక, మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఇలా పిరికిపందలాగా పారిపోవడం నీ మగతనానికి తగిన పనేనా? అని హిరణ్యాక్షుడు ఆక్షేపంచగా శ్రీహరి మనస్సు కోపంతో రగుల్కొనగా...
పద్మనాభుడైన విష్ణువు భూమిని అనాయాసంగా భూమిని నీళ్ళపై నిలిపి, దానికి ఆధారంగా తన బలాన్ని చక్కగా పెట్టాడు. అది చూచి దేవతలు ఆనందించారు.
పూలవాన బోరున కురిసింది. దేవదుందుభులు వైభవోపేతంగా మ్రోగాయి. గంధర్వగానం వినిపించింది. అప్సరసల నాట్యాలు ఆనందాన్ని కలిగించాయి.ఆ సమయంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువు బంగారు మకరకుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాల కాంతులు ఆకాశ మంతటా వ్యాపింపగా యుద్ధానికి సంసిద్ధుడై...
పెద్ద గదాదండాన్ని చేత పట్టుకొని, మణులు పొదిగినట్టి చిత్రమైన బంగారు కవచాన్ని అందంగా ధరించి, హిరణ్యాక్షుడు పలికిన కటువైన మాటలు వాడి బాణాలై తన హృదయాన్ని కలత పెట్టగా విష్ణువు మిక్కిలి పరాక్రమం కలవాడై వస్తున్న అతణ్ణి చూచి ఆగ్రహోదగ్రుడై....కూడా నవ్వుతూ ఇలా అన్నాడు.
ఓరీ అమంగళ కార్యాలను ఆచరించేవాడా! విను. గర్వంతో నన్ను అడవిలో కనిపించే మృగంగా నీ మనస్సులో భావిస్తున్నావు. ఔను. నేను అడవి జంతువునే. నువ్వు యుద్ధరంగంలో స్థిరంగా నిలువగలిగితే బలిపశువుగా వచ్చే నీవంటి కుక్కలను ఈరోజు సంహరిస్తాను. ఓరీ దురాత్మా! నీకు శక్తి ఉన్నట్లైతే నన్ను యుద్ధంలో ఎదిరించి పోరాడడానికి సిద్ధం కా. ఈరోజు నీ కోరికలను తీరుస్తాను. ఊరికే నిన్ను నీవు పొగడుకొనడం తగదు.ఓ రాక్షస కులాధమా! విను. రణరంగ విశారదులైన సత్పురుషులు మృత్యుపాశాలలో చిక్కుకొని కూడా నీలాగా తమను తాము పొగడుకొని సంతోషించారా? ఎందుకీ ఆత్మస్తుతులు? ఎంచి చూస్తే ఇవి పౌరుషవంతుని లక్షణాలా?దేవతల శత్రువైన ఓ హిరణ్యాక్షా! చూస్తూ ఉండు. నీవు చెప్పే పాతాళలోకపు గొప్ప నిధిని నేను గ్రహించి గర్విస్తాను. నన్ను సిగ్గులేనివానిగా లెక్కించావు కనుక నేను నీతో దాగి ఉండే యుద్ధం చేస్తాను. నీ గదాదండానికి భయపడి పారిపోతున్నా నన్నావు కదా! నన్నెదుర్కో. నేను నీ కోరికలను తీరుస్తాను. నీవు సేనానాయకుడవు. శూరుడవై ఈరోజు యుద్ధభూమిలో నన్ను ఎదిరించితే నీ బలాన్నీ ఆయువునూ తీసుకొంటాను చూడు. తిరుగులేని పరాక్రమంతో నేటినుండి భూమి రాక్షసులు లేనిదై వన్నెకెక్కేలా చేస్తాను. రాక్షస కులాధమా! నన్ను ఎదిరించగల శౌర్యము, ధైర్యము, బలం నీకు ఉన్నట్లైతే యుద్ధభూమిలో నిలబడు. నీ ఆప్తులు కన్నీరు కార్చడాన్ని ఆపదలిస్తే వెంటనే వెళ్ళిపో. అనవసరమైన ప్రగల్భా లెందుకు? నన్నిక్కడ పూడ్చిపెడతా నన్నావు. అంతటివాడవే కావచ్చు. యమపురంలో కాపురానికి వెళ్ళేముందు నీకు ఇష్టమైన చుట్టాలను చివరిసారిగా చూసుకొని రా.” అని ఈవిధంగా కమలాక్షుడైన విష్ణువు హిరణ్యాక్షుని ఆక్షేపించి పలికిన పరిహాసపు మాటలకు అతడు కోపం తెచ్చుకొని, రోషమూ గర్వమూ కలగలసిన మనస్సు కలవాడై, కనుగొనల్లో నిప్పుకణాలు వెలిగ్రక్కగా, తోక త్రొక్కిన నల్లత్రాచులాగా చీకాకు కలుగగా...శరీరం కంపించగా, వేడి నిట్టూర్పులు విడుస్తూ, కనుబొమ్మలు ముడిపడగా, రోషంతో మనస్సు కలత చెందిన మనస్సు కలవాడై గదను తీసుకొని సాహసంతో విష్ణువునకు ఎదురు నడిచాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుడు అతిభయంకరమైన ఆకారం కలవాడై....మదించిన ఆ రాక్షసరాజు మిక్కిలి కోపంతో విష్ణువును గదతో దెబ్బ వేయగా, రాక్షససంహారి అయిన హరి ఆ దెబ్బను లక్ష్యపెట్టక, శౌర్యంతో ఆ గదను స్వాధీనం చేసికొని ముక్కలు చేసాడు. రాక్షసుడు వెఱ్ఱెత్తిపోయి మరొక గదతో భయంకరంగా విష్ణువును కొట్టాడు. రాక్షసవైరి అయిన హరి ఆ దెబ్బ తనకు తగలకుండా గదాయుద్ధనైపుణ్యం వెల్లడించే హస్తలాఘవంతో ఆ గదను పట్టుకొని దానితోనే శత్రువు విశాలమైన వక్షస్థలం అదిరిపోయేటట్లు కొట్టాడు. వాడు ఎంతో చికాకుపడి, అంతలోనే తెప్పరిల్లి, శత్రుమర్దనుడైన ఆ జనార్దనుణ్ణి కొట్టాడు. ఈ విధంగా తలపడి ఒకరినొకరు జయించాలనే కోరిక కలవారై ఆ ఇద్దరూ కోపంతో ఉవ్వెత్తుగా లేచే కెరటాలతో ఒకదాని నొకటి కొట్టుకొంటున్న ఉత్తర దక్షిణ సముద్రాల లాగా, పెద్ద తొండాలతో పరస్పరం ఢీకొంటున్న రెండు మత్తగజాల లాగా, రోషంతో భయంకరంగా గాండ్రిస్తూ తలపడుతున్న రెండు పెద్దపులుల్లా, పొగరుబోతుతనంతో రంకెలు వేస్తూ క్రుమ్ములాడుకుంటున్న ఆబోతుల జంటలాగా సహింపరాని సింహబలంతో పోరాటం చేస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు ఎడమ వైపుకు గిఱ్ఱున తిరగగా, విష్ణువు కుడివైపు తిరిగి గదాదండంతో శత్రువు వక్షాన్ని పిడుగుపాటు వంటి దెబ్బతో పగులగొట్టాడు. వాడు తెలివి తప్పి తెప్పరిల్లి లేచి హరి నుదుటిపై కొట్టి నొప్పించాడు. అప్పుడు ఆ ఇద్దరు వీరులు తమ శరీరాలు రక్తంతో తడిసిపోగా పూచిన అశోకవృక్షాలవలె ఉన్నారు. ఒకరికొకరు దూరంగా వెళ్తూ, సమీపిస్తూ, కొడుతూ, అరుస్తూ, ఒకరు మరొకరి రక్తాన్ని వాసన చూస్తూ, తిరస్కారంతో కూడిన హేళనలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ మహాబలుల యుద్ధాన్ని చూడాలనే కోరికతో బ్రహ్మ సమస్త మునీంద్రులను, సిద్ధులను, సాధ్యులను, దేవతల సమూహాన్ని వెంటబెట్టుకొని వచ్చి భూమి కొరకు రాక్షసునితో యుద్ధం చేస్తున్న యజ్ఞవరాహ స్వామితో ఇలా అన్నాడు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి**
🙏🙏🙏
**మహాభారతము**
**దశిక రాము**
**మహాభారతము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
90 - అరణ్యపర్వం.
శ్రీకృష్ణుడు సత్యభామతో కామ్యకవనానికి వేంచేయగా, ధర్మరాజు మొదలైనవారు వారితో ప్రియ సంభాషణలలో మునిగితేలుతుండగా, మార్కండేయమహర్షి వేంచేశారు.
మార్కండేయుని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించిన పిమ్మట, ధర్మరాజు ' మార్కండేయ మహర్షీ ! మీ రాక మాకెంతో ఆహ్లాదం కలిగించింది. మీ అమృతవాక్కులతో మమ్ములను కృతార్థులను చెయ్యండి. మా పరివారమంతా మీరు చెప్పే విషయాలు వినడానికి వుత్సాహం చూపిస్తున్నారు. ' అని వినయంగా అడిగాడు. శ్రీకృష్ణుడు కూడా,
' సత్పురుషుల జీవితగాధలు, పతివ్రతామణుల జీవనవిధానము, ఋషుల దినచర్య, మొదలైన సనాతన విషయాలను మీ మధురమైన వాక్కుద్వారా తెలియజేయండి.' అన్నాడు.
శ్రీకృష్ణుడు కూడా ఆవిధంగా అడుగగానే, మార్కండేయుని హృదయం ఆనందంతో నిండిపోయింది. ' భగవంతునికి తనభక్తుల పలుకులు అంతతియ్యగా అనిపిస్తాయా 'అని తన అదృష్టానికి పొంగిపోయాడు. అదే సమయంలో నారదమహర్షి కూడా అక్కడికి అరుదెంచారు.
' మీకు కావలసినన్ని విషయాలు విపులంగా చెబుతాను, మీరు క్షణకాలం నిశ్శబ్దంగా వుండండి. ' అన్నాడు చెప్పడానికి వుపక్రమిస్తూ, మార్కండేయుడు.
' క్షణకాలం నిశ్శబ్దంగా వుంటే, అన్ని విషయాలు క్షణకాలంలో విపులంగా యెలా జెబుతాడు యీమహర్షి. ' అని అందరూ ఆశ్చర్యపోయి. మహర్షి పలుకులలో అమృతం గ్రోలుతూ వుంటే, యెంత విపులమైన విషయమైనా క్షణమాత్రంలో విన్నట్లే వుంటుంది కదా ! ' అని వారిలోవారు ఆనందబడ్డారు.
మహర్షి వాక్ప్రవాహానికి అడ్డుపడడం యిష్టంలేక నారదమహర్షి కూడా సెలవు తీసుకున్నారు. మార్కండేయమహర్షి ధర్మరాజుతో, ' ముందుగా నీకు సందేహాలు యేమైనా వుంటే అడుగు. ' అని అన్నారు. దానికి ధర్మరాజు, ' మహాత్మా ! నాకు ఎల్లప్పుడూ ఒకటే సందేహం కలుగుతూ వుంటుంది. ఎవరెన్ని సార్లు విపులీకరించి చెప్పినా కూడా . నేను ధర్మమార్గం అనుసరిస్తూ కౌరవులచేత వంచింపబడి తమ్ములతో, భార్యతో అడవులలో కష్టాలు పడుతున్నాను. దుష్టచింతనతో, అనేక అకృత్యాలు చేసిన దుర్యోధనుడు తన సోదరులతో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. కర్మఫలాలు ఈశ్వరుడు యెలా నిర్ణయిస్తాడు. ఎప్పుడు జీవుడు వాటిని అనుభవిస్తాడు. ఇహలోకంలోనా ? పరలోకంలోనా ! ' అని అడిగాడు.
దానికి మహర్షి, ' ధర్మరాజా ! సృష్టి మొదటిలో, బ్రహ్మదేవుడు అన్ని జీవులకు, నిర్మలమైన, నిష్కల్మషమైన మనస్సును బుద్ధిని ప్రసాదించి, ధర్మమార్గము, జ్ఞాన మార్గము జతచేసి భూమిపైకి పంపాడు. అప్పుడు జీవులందరూ ధర్మ పరాయణులుగా, సత్యనిష్ఠతో వుండేవారు. వారు బ్రహ్మతేజస్సుతో, దేవతలవలె ఆకాశంలో విహరించే వారు. భయమనేది తెలీకుండా, క్రమజీవనం గడిపేవారు. '
' కాలక్రమేణా మానవుల కోర్కెలు బలీయమై, కామక్రోధాలకు వశులైనారు. కావలసినవి పొందడంలో అనేక అధర్మమార్గాలు అనుసరిస్తూ అబద్ధాలు చెప్పడం, చేయవలసిన విధులు నిర్వర్తించక పోవడం, జ్ఞానమార్గాన్ని ప్రక్కన పెట్టడం జరిగింది. దానితో వారు వచ్చిన మార్గంపై జ్ఞాపకశక్తి కోల్పోయి, తమ ఉత్కృష్టమైన మానవజన్మను గురించి తెలుసుకోలేక, ధారణాశక్తి సన్నగిల్లి, పరస్పర వైరంతో జీవితాలు గడుపుతున్నారు. ఫలితంగా దేహసంబంధమైన, మనస్సుకు సంబంధించిన రోగములు ప్రబలి, ఆయు:ప్రమాణం తగ్గిపోతున్నది. '
' ఆవిధంగా మానవులు చేసిన శుభాశుభములు వారి అంత:కరణములలో వుండిపోయి, మరియొక దేహం ధరించిన తరువాత, వాసనల రూపంలో ఆ నూతనదేహాన్ని వెన్నంటి వస్తాయి. వాటి ఫలితాలే, ప్రస్తుతం జీవుడు అనుభవించే సుఖదుఃఖాలు. ధర్మరాజా ! కొందరు ఈ లోకంలో చెడు యెక్కువచేసినా, యేకొద్ది పూర్వజన్మ పుణ్యం వలననో, యీ జన్మలో చేసిన కొద్దిపుణ్యకార్యముల వలననో, ప్రస్తుత జన్మలో సుఖాలు అనుభవిస్తారు. ఐతే, యీదేహం వీడిన తరువాత, పుణ్యశేషం లేకుండుట వలన ఆ జీవుడు చెప్ప నలవిగాని బాధలు పడతాడు. '
' మరికొందరు, ఈజన్మలో పుణ్యకార్యములు, కఠినమైన తపస్సు ఆచరిస్తూ, విపరీతమైన కష్టాలు అనుభవించి, జీవిత చరమాంకంలో, మరణానంతరము సుఖంగా వుంటారు. ధర్మరాజా ! మీరంతా రెండవకోవలోకి వస్తారు. మీకూ మంచిరోజులు వస్తాయి. ' అని మార్కండేయమహర్షి ఓదార్చాడు. ధర్మరాజు ఆ తరువాత, దానధర్మాల గొప్పదనాన్ని, మహాత్ముల నియమనిష్టలను, రాజధర్మాన్ని, మోక్షధర్మాన్ని, యిలా అనేక విషయాలను గూర్చి ప్రశ్నించి తెలుసుకున్నాడు.
అదే విధంగా, మహర్షి, యుగధర్మాల గురించి వివరిస్తూ, కలియుగ ప్రభావాన్ని చెప్పసాగాడు :
కృతయుగం ప్రమాణం 4800 దివ్యసంవత్సరాలు, త్రేతాయుగం 3600 దివ్య సంవత్సరాలు, ద్వాపరయుగం 2400 దివ్యసంవత్సరాలు, కలియుగం 1200 దివ్యసంవత్సరాలు. ఆ విధంగా కలియుగం పూర్తికాగానే, మరల కృతయుగం ప్రారంభమవుతూ, కాలభ్రమణం జరుగుతూ ఉంటుంది. దివ్య సంవత్సరమనగా, మానవ ప్రమాణంలో 360 సంవత్సరాలు.
పై నాలుగు యుగాలూ కలిపి, 12000 దివ్యసంవత్సరాలు. దీనిని ఒక చతుర్యుగము అంటారు. ఇలాంటి వేయి చతుర్యుగాలు గడిస్తే, బ్రహ్మకు ఒకపగలు గడుస్తుంది. బ్రహ్మకు పగలు గడవగానే, ప్రళయకాలం వస్తుంది. ఆ తరువాత, అంతా పెంజీకటి.
కలియుగంలో, ధర్మహాని యెక్కువగా వుంటుంది. ఆచార వ్యవహారాలపై యెవరికీ ఆసక్తి వుండదు. కలియుగాంతంలో, ధర్మం మొత్తం గాడితప్పే ప్రమాదం వున్నది. బ్రాహ్మణులు యజ్ఞ యాగాదులు వదిలివేస్తారు. నిషిద్ధ వస్తువులు భక్ష్య భోజ్యాలుగా గ్రహిస్తారు. జపతపాదులు మర్చిపోతారు. వేదపాఠశాలలు కనుమరుగవుతాయి.
ప్రజలలో యెక్కువమంది బలహీనులు, పరాక్రమం లేనివారు వుంటారు. మరుగుజ్జులు, అల్పాయుష్కులు పుడతారు. పండితులను గౌరవించరు. అసభ్య సంబోధనలతో వ్యవహరిస్తారు. అన్నాన్ని అమ్ముకుంటారు. ఇష్టాగోష్టులలో, వైదిక విషయాలకు బదులు, కామ ప్రసంగాలు, పనికిరాని విషయాలు దొర్లుతాయి. పరాన్నభుక్కులు యెక్కువగా వుంటారు. ధనికులు మదాంధులై వుంటారు. విషయభోగాలపై యెక్కువ మక్కువ కలిగి వుంటారు. ఫలపుష్పాలు రసహీనంగా వుంటాయి. చెట్లపై ఉత్తమజాతి పక్షులు కనిపింపవు. '
అని యీవిధంగా కలియుగ లక్షణాలు వివరిస్తున్నారు మార్కండేయ మహర్షి ధర్మరాజుకూ అతని పరివారానికి అని జనమేజయునకు వైశంపాయనుడు చెప్పినట్లుగా, శౌనకాది మహామునులకు సూతులవారు నైమిశారణ్యం లో చెబుతూ వున్నారు.
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి**
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
రామాయణమ్.71
రామాయణమ్.71
...
కౌసల్యా ! నా కంటిచూపు తిరిగి రావడంలేదు నా రాముడి వెనుకనే అదీ వెళ్ళిపోయింది ! రాముడి రధం వెనుక పిచ్చివాడిలా పరుగెత్తి పరుగెత్తి అలసి సొలసిన దశరథుడి ఆక్రందన అది .
.
అంతకు మునుపు సుమంత్రుడు తెచ్చిన రధమెక్కి మువ్వురూ పయనమయ్యారు .ఆబాలగోపాలమూ రధమువెంట పరుగులుతీసింది.
.
కాసేపు ఆపు సుమంత్రా ! ఆ సుందర,సుమనోహర రూపాన్ని మరల ఎన్నాళ్ళకు చూస్తామో ,అప్పటికి మేము బ్రతికి ఉంటామో లేదో కాస్త ఆపవయ్యా నీవు !
.
మరొక్కమారు కనులారా కాంచుతాము ఆ కమనీయ విగ్రహాన్ని రమణీయరూపాన్ని .
.
ఆ కైక కు అదేం పోయే కాలమొచ్చిందిరా తండ్రీ !
మా బంగారుకొండను అడవులపాలు చేస్తున్నది .
రాముడులేని అయోధ్యానగరం, అరణ్యం ఒకటే !
మాకీ నగరమొద్దు ,ఈ రాజూ వద్దు ,
నీవెక్కడుంటే అదే మా నివాసము ,మా రాజ్యము .
.
రామయ్యా ! ఒక్కసారి మాకేసి చూడవయ్యా !
సీతమ్మతల్లీ నీవయినా చెప్పవమ్మా తన కరుణార్ద్రదృక్కులు మాపై ప్రసరించనీయమని ! .
.
పురజనుల కన్నీళ్ళు కాలువలై ప్రవహిస్తుండగా రధం రేపుతున్న దుమ్ము చిత్రంగా అణిగిపోతున్నది
.
ఇంతలో ఎక్కడినుండో వచ్చినట్లుగా ఉన్నది ,ఆజ్ఞ ఇచ్చేస్వరము దీనరవము కలగలసినది, ఒక ఆర్తుడు పెట్టిన కేక అది !
.
సుమంత్రా రధమాపు ! రధమాపు ! గుర్తుపట్టాడు రాముడు అది తనతండ్రిది!సుమంత్రా ఇంకా వేగంగా తోలు ,నీవు తిరిగి వచ్చినప్పుడు నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదని మహారాజడిగినప్పుడు జనఘోషలో వినపడలేదని చెప్పు.
.
రధంవెనుక పరుగెత్తి,పరుగెత్తి కూలపడిపోయాడా కన్నతండ్రి!
.
పడిపోయిన రాజు కుడిరెక్క పట్టుకొని కౌసల్య లేపుతుండగా ఇంతలో కైక ఎడమ భుజము పట్టుకోపోగా ! పాము వంటిమీద ప్రాకినంత జలదరింపుతో ఛీ ! దుర్మార్గురాలా ! నేటినుండీ నీవు నా భార్యవూకావు ,నేను నీ భర్తనూ కాను .పెళ్ళినాటి ప్రమాణాలకు నేటితో చెల్లు. నీ విచ్చే రాజ్యం తీసుకుంటే భరతుడు వదిలే తర్పణాలు కూడా నాకు చెందవు .అని కోపావేశంతో కళ్ళెర్ర చేసి కౌసల్యాదేవి మందిరానికి చేరుకున్నాడు మహారాజు.
.
రాముడే లక్ష్యంగా ,రాముని మీదే చూపుగా రొప్పుతూ పరిగెడుతున్నారు రధం వెంట జానపదులు .దయాసాగరుడు వారిని చూశాడు, సుమంత్రుని రధం ఆపమన్నాడు .రధం దిగారు మువ్వురూ! జానపదుల పదంలో పదం కలిపి సాగుతున్నాడు రాఘవుడు.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
ధార్మికగీత - 28*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*****
ధార్మికగీత - 28*
*శ్లో:- హరిణా౽పి హరేణా౽పి ౹*
*బ్రహ్మణా౽పి సురై రపి ౹*
*లలాట లిఖితా రేఖా ౹*
*పరిమార్ష్టుం న శక్యతే ౹౹*
*****
*భా:- మనిషి పుట్టీ పుట్టగానే నుదుటిపై జననాది మరణ పర్యంతం దైనందిన కార్యా చరణ ప్రణాళిక , విధ్యుక్త ధర్మ నిర్వహణ గీతగా వ్రాయబడి యుంటుందని, దాని ననుసరించియే మన జాతక చక్రం నడిపిస్తుందని మన ప్రగాఢ విశ్వాసము. అయితే మన భావన సుఖ సంతోషాలలో మునిగి తేలేటప్పుడు ఒక రకంగాను, కష్టనష్టాలలో కూరుకు పోయినప్పుడు ఒక రకంగాను ఉంటుంది. కష్టాలలో నుదుటి రాత మారితే బాగుంటుందని అనిపిస్తుంది. విశ్వానికి సృష్టికర్తయైన " బ్రహ్మ" గాని. పోషణకర్త యైన "విష్ణువు" గాని, లయకర్త "మహేశ్వరుడు" గాని, "ముక్కోటి దేవతలు" గాని మన తలరాతను మార్చలేరు. సరిచేయలేరు. తుడిపివేసి తిరిగి తాజాగా వ్రాయలేరట. అందుకే "గీత" "ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం" అని చెబుతుంది. మనల్ని మనమే చక్క దిద్దుకోవాలి. మన నడతను మనమే మార్చుకోవాలి. సావిత్రి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు తమ అచంచల విశ్వాసము, దృఢ సంకల్పం, అనన్యభక్తి, స్థితప్రజ్ఞతలతో తమ తలరాతని తామే మార్చుకొని, కీర్తి శిఖరాన్ని అధిరోహించి, నేటికి ప్రాతఃస్మరణీయులు, చిరస్మరణీయులు కాగలిగారు. మన త్రికరణ శుద్ధి, శమ దమాది సంపత్తి, చతుర్విధ సాధనా సామాగ్రి, విషయ వాసనా వైరాగ్యము, మనోవాక్కాయిక తపముల ద్వారా ముక్తిమార్గము ను అనుసరించవచ్చును. లౌకిక వాంఛా రతులమై రక్తిమార్గాన్ని అనుసరించవచ్చును.నిర్ణయం మనదే*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
మొగలిచెర్ల అవధూత
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
పాదుకలు..ప్రకంపనలు..
ఆరేడు సంవత్సరాల క్రిందట..ఒక ఆదివారం ఉదయం తొమ్మిదిగంటల వేళ.. మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ముందు..కారు లోంచి ఒక స్వామీజీ దిగి..మందిరం లోపలికి వచ్చారు..కాషాయ వస్త్రాలు ధరించి వున్నారు..వారితో పాటు మరో నలుగురు వెంట వచ్చారు..తాము గత రెండురోజుల నుంచీ భైరవకోన లో ఉన్నామని..అక్కడ హోమం చేసామనీ..తిరిగి వెళుతుండగా..దారిలో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం అనే బోర్డ్ చూసి..ఈ మందిరాన్ని చూసి వెళదామని అనుకొని ఇలా వచ్చామని చెప్పారు..
ఆ వచ్చిన స్వామీ జీ వారు మౌనంగా అన్నీ పరీక్షగా చూస్తున్నారే కానీ..ఒక్క మాట కూడా మాట్లాడలేదు..ప్రక్కనున్న వాళ్లే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు..కుర్చీలు చూపించి..కూర్చోమన్నాను..అందరూ కూర్చున్నారు.."ఎక్కడినుంచి వచ్చారు?.." అని అడిగాను..
స్వామీజీ వారిది కృష్ణాజిల్లా అనీ..హిమాలయాల వద్ద వుంటారనీ..ప్రస్తుతం పర్యటన చేస్తూ..భైరవకోన కు వచ్చారని తెలిపారు..తాము వారికి అనుయాయులమనీ తెలిపారు..స్వామీజీ వారు మాత్రం మౌనంగానే వున్నారు..
"ఈ క్షేత్రం విశేషాలేమిటి?.." అని వచ్చిన వారిలో ఒకతను అడిగాడు..
శ్రీ దత్తాత్రేయ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే రోజుల నుంచీ..మా తల్లిదండ్రుల కు పరిచయం కావడం..తరువాత మొగలిచెర్ల రావడం..ఇక్కడ ఆశ్రమం నిర్మాణం చేయించుకోవడం..ఇక్కడ సాధన..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా..క్లుప్తంగా వివరించి చెప్పాను..విన్నారు..అంతా విన్న తరువాత.."మేము..స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చా?.." అని అడిగారు.."దర్శనం చేసుకోండి.." అని చెప్పాను..
ముందుగా ఆ స్వామీజీ వారు లోపలికి వెళ్లారు..వెళ్లేముందు..తనతోపాటు నన్నూ లోపలికి రమ్మన్నారు..వెళ్ళాను..సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు..శ్రీ స్వామివారి దేహాన్ని ఉత్తరాభిముఖంగా..పద్మాసనం ముద్రలో ఉంచి..సమాధి చేశామని తెలిపాను..అప్పటివరకూ మౌనంగా ఉన్న ఆ స్వామీజీ వారు..శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ముందు నిలబడి.."స్వామీ!..దత్తాత్రేయా..నన్ను కరుణించు తండ్రీ..నా సాధన పూర్తి కావడానికి మార్గాన్ని చూపించు.." అంటూ మోకాళ్ళ మీద వంగి..సమాధికి తల ఆనించారు..అక్కడే పెట్టబడి ఉన్న శ్రీ స్వామివారి పాదుకలను రెండు చేతులతో ఎత్తి పట్టుకొని..తన శిరస్సుపై పెట్టుకున్నారు..అప్పటివరకూ ఎంతో గంభీరంగా ఉన్న ఆయన..కన్నీరు కారుస్తూ..ఆ సమాధి వద్దే ఓ ఐదు నిమిషాల పాటు నిలబడిపోయారు..మెల్లిగా ఆ సమాధి మందిరం బైటకు వచ్చి..శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహం వద్ద నిలబడ్డారు..అర్చక స్వామి ఇచ్చిన హారతిని కళ్లకద్దుకుని..ఆ మంటపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి..ఒక ప్రక్కగా నేల మీద కూర్చున్నారు..
"నేను చాలా సంవత్సరాల నుంచీ సాధన చేస్తున్నాను..హిమాలయాల లో సుమారు పదిపన్నెండేళ్ల పాటు వున్నాను..ఎందరో యోగులను.. సిద్ధులను..కలిశాను..వారి వద్ద యోగప్రక్రియ గురించి తెలుసుకున్నాను..కానీ ఏదో తెలియని ఆవేదన నన్ను వెంటాడుతోంది..పరిపూర్ణత రాలేదు..తిరుగుతున్నాను..దేశమంతా తిరిగాను..తెలుసుకోవాల్సింది బైట ఎక్కడో లేదు..నీలోనే ఉన్నది..నిన్ను నువ్వు శోధించుకో..అని ఈరోజు ఈ క్షేత్రం లో ఈ దత్తాత్రేయ స్వామివారు నాకు బోధ చేసారు.. నా తల మీద ఈ స్వామివారి పాదుకలు ఆనించుకున్న మరుక్షణమే..నా దేహం వశం తప్పింది..వళ్ళంతా ప్రకంపనలు వచ్చాయి..ఒక్కటిమాత్రం నిజం..ఆ దత్తాత్రేయుడి తపశ్శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది.. నేను అనుభూతి చెందాను..మహిమాన్వితమైన క్షేత్రం నాయనా ఇది..శ్రీ స్వామివారి పాదుకలను జాగ్రత్తగా కాపాడండి.." అని అన్నారు..మరో అరగంట సేపు అక్కడే కళ్ళుమూసుకుని ధ్యానం చేసుకున్నారు..లేచి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చి..తనతో పాటు వచ్చిన వారిని తీసుకొని..కారెక్కి వెళ్లిపోయారు..
"బోధ చేయాలంటే..నేను జీవించే ఉండాలా?..అలా అనుకుంటే..ఇంతకుముందు సిద్ధిపొందిన మహాత్ములందరూ జీవించే ఉండాలి కదా..వారి తపోశక్తి వలన వారు సమాధి చెందిన తరువాత కూడా మన సమస్యలకు సమాధానం దొరుకుతున్నది కదా!...అదేవిధంగా ఇక్కడ కూడా నా తదనంతరం కూడా నా సమాధి వద్ద మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.." అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు అక్షరసత్యాలుగా అనిపించాయి..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).
ఋషులు కాల విభజన
మన ఋషులు కాల విభజన మహాద్భుతం. వక పరిశీలన. రవి, గురు గ్రహములు మాత్రమే వాటికి నిర్ణయించబడిన రాశులలో సింహ, కుంభములు, కన్యా, మీనములలో వాటి నక్షత్ర శక్తిని నిర్ణయించి రెండింటికి వకే గమన తత్వమును అనగా వక సంవత్సర కాలం సూర్యనికైతే అదే గురు నికి 12 సంవత్సరములు వకరాశిలో వక నిర్ణయించి యున్నారు. అతి మెల్లగా శని ఆపై రాహుకేతువులు ఆపై గురుడు యిలా వాటి గమనమే భూమి యెక్క ప్రకృతికి ముడిపజడియున్న కాల గమనంలో. కొన్నిచోట్ల సూర్యమానం, బారస్ప్యత్యమానమని కూడా కాల గణన కలదు ఆచరణలో. వక ఉదాహరణ అర్జునుడు సింహ ,కన్య సంధిలో జననం. ద్రౌపది కూడా కుంభం మీన సంధిలో జననం కన్యా రాశి లక్షణము గలవాడై మీనం అనగా మీనరాశితత్వమైన మత్స్యయంత్తమును ఛేదించుట. యిక్కడ ఛేదన అనగా ధనుస్సుయొక్క అమితమైన శక్తిని అర్జునుడే ప్రయెూగ అర్హత కలిగియుండెను. అగ్నితత్వమైన ద్రౌపది ఈశ్వర అంశ . అమ్మ తత్వమైన అర్జునుడు కన్యా తత్వం. సమ సప్తకం. అనగా సంధి కాలము 180 డిగ్రీలలో జననం కలిగియుండుట. అమ్మ తత్వం తెలియుటకై సృష్టి తత్వం. అయ్య తత్వం అగమ్యగోచరంగా ఎవరికీ తెలియదు. అది రాహు శక్తి చైతన్యమైన శక్తి రూపంగా మారిన గాని అనగా ఘనీభవించిన గాని కేతు తత్వం తెలియదు. సంధి కాలంలోనే సృష్టి జరిగినదని మనకు మత్స్యావతారం ద్వారా తెలియుచున్నది .నీరు వలననే సృష్టి అగ్ని నీరు గా మారిన గాని ఆ నీటిని సేవించినగాని నీటి లక్షణం తెలియదు. దానినే అపః ఆపః అని వేదం తెలుపు చున్నది. దీనికి గురువే కారణం కేతు శక్తి రూపంలో అందుకే అమ్మ ద్వారా అయ్యను అనగా పార్వతీ పరమేశ్వరుల అబేధమైన రూపం సృష్టి. అవి విడి విడిగా చూచుట కుదరని తత్వం. సృష్టి కూడా అంతే. మానవ సృష్టియే విశ్వ సృష్టి మూల తత్వమును తెలియ వచ్చును. మిగిలిన గ్రహములు అవి రాహు కేతు శక్తులతో కలిసిన వీటి తత్వం ఆయా గ్రహములు శక్తి ద్వారా తెలియవచ్చునని. శక్తి అంతా జ్యోతి ఉష కాంతి రరూపంలోనే తెలియును. పరిశీలన చేస్తే జీవుని లక్షణము రాకకు సంబంధించిన మరియు వెడలుటకు సంబంధించినవి తెలుపు సాధనం గ్రహ నక్షత్ర శాస్త్రం. యిది పొట్ట కూటికి కాదు. వైదిక రహస్యమైన మానవ నిర్మాణ శాస్త్రం. మృత్యువు అమృతం కావాలి. అమృతం అనగా మృతి కానిది. మృతి అనగా ౦ పూర్ణమైన ఆత్మ.తత్ ౦ పూర్ణం అక్కడ ఋక్కుగా మారిన మార్గం జీవ లక్షణం.దానికి మరణం లేదు. అది మూలతత్వంలోనికి చేరువరకు తిరిగి తిరిగి దేహంలో ప్రవేశించుచునేవిశ్వం అంతా గమనమే. ఈశ్వర తత్వం గమనమే విష్ణువని వ్యాప్తమైనదని తెలుయుతున్నది. యిదే విషు విష్ణు తత్వం మని తెలియితున్నది. యుండును. అనంతమైన ఙ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉండవలెను.
శాక్తేయ తపస్వి
శాక్తేయ తపస్వి
మహాత్మా శ్రీ అయిలావఝుల వేంకటరమణయ్య
ద్వాదశాంతేచిదాకాశే, శివశక్త్యాత్మకం గురుం
పరం తేజోమయం ధ్యాయే ద్భోగమోక్ష ఫలాప్తయే
ఓం నమః శ్రీ గురుదేవాయ, పరమపురుషాయ,
సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ,
సర్వమంత్రదోషచ్చేదనాయ, త్రైలోక్యం వశమానయ స్వాహా !
———————————————————————————————–
భారతదేశం పుణ్యభూమి. ధర్మస్థాపన కొరకు ఎందరో మహానుభావులు, అవతారపురుషులు, యోగులు, మహాత్ములెందరో ఈ భూమిపై జన్మించారు. భగవదంశభూతులైన మహా పురుషులు, ఆర్తులను అజ్ఞానులను మూర్ఖులను, మూడులను తమ కారుణ్య దృష్టితో ఉద్ధరిస్తారు. మంత్రయోగంలో సిద్ధిపొంది ఉపాస్య దేవతానుగ్రహంతో తమనాశ్రయించిన భక్తుల సమస్యలను తొలగించి, మేలు చేసిన మహానుభావులెందరో ఉన్నారు. కానీ శక్తిని ఉపాసించి, శాక్తమును సర్వావ్యాప్తము చేస్తూ జాతిని శక్తిమంతము చేయుటకు తమ తపస్సును, జీవితాన్ని అంకితం చేసిన అయిలావఝుల వేంకటరమణయ్యగారు.
జనన వృత్తాంతము : భారద్వాజ గోత్రీకులు శాక్తేయులు, శ్రీ విద్యానందనాధులు కీ.శే. బ్ర.వే. అయిలావఝుల సుబ్రహ్మణ్య శివకామమ్మలను పురాణదంపతులకు కలిగిన ద్వితీయ సంతానము. ఆంధ్ర రాష్ట్రమందలి సింహపురి ( నెల్లూరు ) పట్టణమునకు సమీపానగల పాతకోడురు వీరి జన్మస్థలము. వీరు పింగళి నామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ షష్టీ మంగళవారం ( తేది 2.10.1917 )నాడు జన్మించారు. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వేదాంత, జ్యోతిష్య,శాక్త విద్యలందు అపార విజ్ఞానం సంపాదించి ఆ ప్రాంత వాసులందరికీ ఆదర్శమూర్తిగా మార్గదర్శనం చేస్తూ దేవతాప్రతిష్టలతో పాటు శతచండీయాగాలు నిర్వహిస్తూ పెద్దశాస్త్రులని పేరు గడించారు. సింహపురి ప్రాంతీయులు నాటితరం వాళ్ళేకాక నేటితరం వాళ్ళు కూడా వారి విద్యత్తును, మహిమలను మననం చేసుకుంటున్నారంటే వారెంతో గోప్పవరో స్పష్టమవుతుంది. చండీ యాగాలలో ఆ ప్రాంతవాసులకు శ్రీ చాముండేశ్వరీమాతను దర్శనం చేయించారని ప్రతీతి. వీరి వంశీకులైన శ్రీ అప్పేశ్వర శాస్త్రిగారు “ నవద్వీప పండితుడు “.
శ్రీ వేంకటరమణయ్య తమ బాల్యం గోకులంలో శ్రీకృష్ణుని బాల్యం వలె గడించిందని అనేకమార్లు చెప్పుకునేవారు. పల్లెటూరు, పచ్చని పంటపొలాలు, పాడిపంటలు, కొబ్బరితోటలతో చక్కని వీధులతో అలరారుతున్న పాతకోడురు గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా స్వచమైన, చక్కని పాలు మీగడ పెరుగు వీరికిచ్చేవారట. టీ, కాఫీల వ్యవహారమే లేదట. వీరి అగ్రజుడు సుబ్బరాయశాస్ర్తిగారు, మరో సోదరుడు మంచి ఫోటోగ్రాఫర్. సుబ్బరాయ శాస్త్రిగారు వేదవిద్య నభ్యసించి జ్యోతిష్యం, ముహుర్తభాగము క్షుణ్ణంగా అధ్యాయనము చేసిన మేధావి. ప్రశ్న భాగంలో మంచి ప్రావీణ్యత సంపాదించి ఆ ప్రాంతవసులందరికి ఆరాధ్యమైనాడు. వారు మంచి వేణు వద్యాకులు. శ్రీ రమణయ్యగారు మాత్రం ఆలాజాలంగా గడుపుతూ తోటి మిత్రులతో పాటు కర్రసాము నేర్చుకొని బాలలలందరకూ నాయకుడుగా గడిపాడు. గ్రామీణ క్రీడయైన కబడ్డీలో చంపియన్ గా పేరొందారు. ఆయన చదువుపై అంత శ్రద్ధ కనబరిచేవారుకాదు. తండ్రిగారితో కాలినడకన ఎంతదూరమైన వెళ్ళేవారు. తండ్రి నిర్వహించే వైదిక, ధార్మిక ఉపచార కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఈ క్రమంలో ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తూ సందేహాలు తీర్చుకునేవారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా జ్ఞప్తియుంచుకుని తండ్రిగారిచె ఏకసంధాగ్రాహి అనిపించుకున్నారు. విభవ నామ సంవత్సరం వైశాఖ మాసంలో వీరికి ఉపనయన సంస్కారం జరిగింది.
శ్రీ వేంకటరమణయ్యగారు ప్రత్యేకించి ఏ పాఠశాలలో క్రమంగా విద్యనభ్యసించలేదు. కానీ వీరి చిన్నాన్న శ్రీ ఆదిశేషయ్యగారు పంచసూక్తాలు, నమక చమకాలు పూర్తి చేయించి అమరంలో శ్లోకాలను వల్లే వేయించేటప్పుడు ఉచ్చారణ సరిగా లేకపోవడం వల్ల దండింపబడ్డారు. దండనకు భయపడి ఎవరికీ చెప్పకుండా పాతకోడురు గ్రామదేవత ఆలయానికి వెళ్లి ఒక రాత్రి మొత్తం ఆ దేవాలయంలోనే గడిపి వారి వంశీకుల ఇలవేల్పు గ్రామదేవత ముక్కంటమ్మ సన్నిధిలో గడిపినట్లు, ఆ సమయంలోనే దేవ్యానుగ్రహం కలిగినట్లు వారు చెప్పేవారు. “ ఇవ్వాళ పుట్టి, రేపు చచ్చేవారు నా గురువు కాదు. నా గురువు మా ఇంటి ఇలవేల్పు శ్రీ ముక్కంటమ్మ “ అని అనేకమార్లు చెప్పారు.
శ్రీ పల్లెపూర్ణ ప్రజ్ఞాచార్యుల వద్ద వ్యాకరణ శాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని, కవిరాక్షస బిరుదాంకితులు, కర్నూలు నివాసి, ఆర్ఎంపి వైద్యులు శ్రీ పుల్లాపంతుల వేంకటరమణయ్యగారి వద్ద అవధాన విద్యనూ నేర్చుకున్నారు. గద్వాల సంస్థానంలో అవధానం చేసి, రాణిగారి మెప్పును పొందారు. ఆ తరువాత శ్రీ తిరుపతి వెంకటకవుల వలె ఒంగోలు నివాసి, కవి నరసింహ గారితో కలిసి అనేక అవధానాలు చేశారు. యువ అవధానులను ప్రోత్సహిస్తూ కవితా పిపాస కలిగిన వారందరినీ అవధానం చేయాలనీ ప్రోత్సహించేవాడు.
మాతామహుల నుండి పొందిన ఆయుర్వేద విద్యనూ వైద్యునిగా జీవితాతం వరకు ప్రజలందరికీ సేవ చేయడానికి ఉపయోగించారు. రసపాషాణ జాతులను పుటం పెట్టి అనేక దీర్ఘవ్యాదులకు ఔషధములను తయారుచేసి ఉచితంగా అవసరమైనవారికి పంచిపెట్టటం వారికీ అమితానందకరమైన విషయం. దేశ పర్యటనలో అనేకమంది గిరిజనులతో ఏర్పడిన పరిచయం వల్ల రకరకాల మూలికలు, వాటి విలువలు తెలుసుకుని అవకాశం వచ్చినపుడు వినియోగించేవారు. ఉదాహరణకు తిరుపతి సమీపంలోని తలకోన అడవిలో ఒక మొక్క ఆకును భుజిస్తే ఆరు మసాల వరకు ఆకలిదప్పికలుండవాని పూర్వపు మునులందరూ ఇటువంటి చిట్కాలను ఉపయోగింఛి నిర్విఘ్నంగా తపస్సు చేసుకోనేవారని తెలియజేసారు. నేల ఉసిరికాయ చిన్న పిల్లలకొచ్చే కామెర్ల వ్యాధిని పోగోడుతుందని చెప్పేవారు.
వీరి భూతవైద్యం చూడముచ్చటగా ఉండేది. నాకున్న అనుభవం దృష్ట్యా భూతవైద్యం అంటే నిమ్మకాయలు, మిరపకాయలు, వేపాకులు, జంతుబలులతో జరిపే తంతుగా భావించేవాన్ని. కానీ ఇవేవీ భూతవైద్యానికి పనికిరావని వేంకటరమణయ్య గారి ద్వారా తెలుసుకున్నాను. భాదితులను ముందు కూర్చోబెట్టుకొని ధూమపానం చేస్తూ మామూలు మాటలతో భాదితులను ప్రశ్నిస్తూ వారిలో ఆవాహనమై ఉన్న భూత ప్రేతలను పలికిస్తూ భయపెడుతూ ఆ దేహాన్ని వదిలి వెళ్ళండని ఆదేశిస్తూ జనం మధ్యే వేంకటరమణయ్య గారు భూతవైద్యం చేసేవారు.
కవిగా, అవధానిగా, ఆయుర్వేద వైద్యుడిగా, జ్యోతిష్యుడుగా, ములికావైద్యుడిగా అనేక విధాలుగా సేవలందిస్తున్నా వారి జీవితంలో ఏదో సాధించాలనే కోరిక ఉండేది. దీని కోసం సుమారు రెండు దశాబ్ధాలుగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు దూరంగా కనబడకుండా వెళ్లి తన 35వ ఏట ఇంటికి తిరిగివచ్చారు. ఈ మధ్య కాలంలో వారు పొందిన జ్ఞాన సంపద అమూల్యం. రెండు దశాబ్ధాల ఒంటరి జీవితంలో పట్టణాలు, పల్లెలు, అడవులు, నదులు, సముద్రాలు ఒకటేమిటి ఎన్నో, ఎన్నెన్నో వింతలను చూశారు. ఒక సంవత్సర కాలం శ్రీశైల క్షేత్రంలో నివసిస్తూ ప్రతిరోజు వేకువజామునే లేచి మట్టికుండలతో పాతాలగంగకు వెళ్లి స్నానం చేసి తడిగుడ్డలతో ఆ కుండతో నీళ్ళు తీసుకువచ్చి శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారలను అభిషేకించేవారు. మిగతా సమయంలో గిరిజనుల సహకారంతో అడవంతా తిరుగుతూ సిద్ధులను, మునులను, యోగులను, మూలికలను కనుగొంటూ వారి ఆశీర్వాదాలు, వారి యోగ విద్యలను శ్రీ ముక్కంటమ్మ దేవికృప వల్ల పొందగలిగానని చెప్పారు. నవదుర్గలను, వింధ్యాచల అడవులను, ఆ అడవులలో సంచరిస్తున్న తపోధనులను చూచి వారి ఆశీస్సులను కూడా పొందారు. శ్రీశైలంలో ప్రస్తుతం మనం చూస్తున్న భ్రమరాంబా దేవాలయపు దిగువ భాగాన అసలైన మూలవిరాట్ ఉన్నదని, ఆమె ద్విభుజ అని ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో జాంబియా ఉన్నదని, ఆమె కూడా వీరిని ఆశీర్వదినచిందని శతచండీ యాగ సందర్భాలలో సభ్యులకు, భక్తులకు ఆనాటి వారి అనుభవాలను, కష్టసుఖాలను వెల్లడించేవారు. వారి మాటల్లో శ్రీశైల భ్రమరాంబికానే నవదుర్గగా స్తుతించేవారు.
“ క్రూరాతి క్రూర విఖ్యాతా శ్రీశైల భ్రమరాంబికా |
భ్రమంరాతీతి లోకేస్మిన్ జ్ఞానదా ముక్తిదా ప్రదా || “
దేశ సంచారంలో విశేషానుభవాలను పొంది అపారమైన జ్ఞానసంపత్తిని సంపాదించి లోకోద్దరనకై తన 30 వసంతాల పైచిలుకు వయస్సులో తిరిగి లౌకిక ప్రపంచంలోకి వచ్చారు. ఈ ద్విదశాబ్దకాలంలో వారి బంధువులు వీరి ఆచూకి కోసం ప్రయత్నించమని వీరి తండ్రిగారితో చెప్పినపుడు వాడు తప్పక తిరిగివచ్చి ప్రజాశ్రేయస్సుకు పాటుపడతాడని ఆయన బంధువులకు చెప్పేవారు.
దేశ పర్యటన ముగుంచుకొని వచ్చి అన్నపూర్ణను పోలిన సుబ్బరత్నం అనే తమ దగ్గర బంధువుల అమ్మాయిని వివాహమాడారు. కొంతకాలం నెల్లూరులో గడిపి ఆ తరువాత భాగ్యనగరనికి మకాం మార్చారు. ఎవరివద్దా తన ప్రతిభాపాటవాలు బహిర్గతపరచకుండా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రాంతంలో శక్తి అన్నా, శక్తి పూజలన్నా జంకుతారనే విషయాన్ని పసిగట్టి ఫీల్ ఖానలోని బాలచంద్రయ్య దేవాలయ ధర్మకర్త శ్రీ చంచలం మాణిక్యశర్మగారిని తానే స్వయంగా పరిచయం చేసుకుని భవిష్యత్తులో తాను చేయబోయే సేవా కార్యక్రమాలకు పునాది నేర్పచుకున్నారు.
శాక్తాన్ని సర్వవ్యాపితం చేయాలనే ఏకైక లక్ష్యంతో 1968 జనవరి 22న భాగ్యనగరంలోని ఫీల్ ఖానా బస్తీలో శ్రీ బాలచంద్రయ్య దేవాలయంలో శ్రీ చంచల మాణిక్యశర్మగారి ఆధ్యక్షతన శ్రీ చాముండేశ్వరీ సేవాసమితి అనే సంస్థను స్థాపించి ప్రతినెలా పాడ్యమి నుండి అమావాస్యలోగా ఏదో ఒక తిథియందు భారతదేశంలోని ఏ ప్రాంతమైనా సమావేశం చేయాలని సంకల్పించి ఆ తరువాత వారి జీవితకాలంలో సుమారు 250 సమావేశాలు
నిర్వహించారు. సుమారు 22 సంవత్సరాలు సమితి సమావేశాలు వారి నేతృత్వంలో జరిగి లక్షలాది మంది ప్రజలకు అన్నదానం కూడా చేశారు. ఈ 22 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరపు ఆరంభ సమావేశం శతచండీ యాగంతో ఐదు రోజుల కార్యక్రమాన్ని జరిపించి ప్రజలందరినీ ఆ దేవికృపకు పాత్రుల్ని చేశారు. ఆసేతు హిమాచల పర్యంతం సమావేశ కార్యక్రమాలను నెరవేరుస్తూ ఎంతోమంది కుగ్రామ వాసులకు యాత్రాఫలసిద్ధి కలిగింప చేసిన మహనీయుడు శ్రీ వేంకటరమణయ్యగారు. వారి తరవాత కాలంలో కూడా వారి కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అధ్వర్యంలో సమావేశాలు సాగుతున్నాయి. 467వ సమావేశం శ్రీ మహా రేణుకా ( ఎల్లమ్మ ) దేవాలయం సిద్దిపేటలో 2005 సెప్టెంబర్ 18న జరిగింది.
“ అందరికీ దేవుడు కావాలి, దేవునికి అందరూ కావాలి “ అనేది శ్రీ వేంకటరమణయ్యగారి ఆంతర్యం. ప్రథమంగా శ్రీ చాముండేశ్వరీ సేవాసమితి నిర్వహించిన కార్యక్రమం 3వ సమావేశం తిరుపతి సమీపాన గల తొండవాడయందు ఐదు రోజుల కార్యక్రమం తెలంగాణ ప్రాంతంలో చాముండేశ్వరీ సేవాసమితికి గుర్తింపు తెచ్చిన సమావేశం.
బాలావారహి రాజశ్యామలా సహిత మహాత్రిపురసుందరీ ప్రతిష్ట చేశారు. ఐదు రోజుల కార్యక్రమం ఇది. ఫీలఖానా బస్తీ బాలచంద్రయ్య దేవాలయ ముందుభాగపు రోడ్లన్నీ మామూలు జనాన్ని రాకుండా రోడ్డు బంధించి వేశారు. కేవలం “ ఆశ్వపూర్వాం రథ మధ్యాం-హస్తినాథ ప్రభోదినీం “కు అనువుగా కార్యక్రమ నిర్వహణ జరిగింది.
మెదక్ జిల్లాలోని ఆనాటి ప్రముఖులు, వేదపండితులు కీ.వే. బ్రహ్మశ్రే ఆందోల్ రామయ్యగారు, వెల్దుర్తి మల్లయ్యగారి వంటి దిగ్గజాలతో వైదిక కార్యక్రమం. షోడశ కన్యాపూజ- వేలాదిమందికి షడ్రశోపేతమైన భోజన వితరణ. 1977 జనవరిలో ఆలంపూర్ జోగుళాంబ సన్నిదిలో వీరు లక్షదీపోత్సవం నిర్వహించారు. అంతేకాక అక్కడ జరిగే ప్రతి దైవిక కార్యక్రమానికి అధ్యక్ష ఉపాధ్యక్షులుగా శ్రీశైల భ్రమరాంబను, ఆలంపూర్ జోగుళాంబలను నియమించుకొని ప్రప్రథమంగా వారి దగ్గరకు వెళ్లి వారి హస్తాలకు కంకణ ధారణ చేసి వచ్చేవారు. కుకట్ పల్లిలో శ్రీ భువనేశ్వరీ మాత, హైదరాబాద్ పాతబస్తీలో శ్రీ భూలక్ష్మీ మాత, కామారెడ్డి పేట వద్ద శ్రీ మహామంగళగౌరి తేదీ 1976 మర్చి 21న సిద్దిపేటలో శ్రీ మహా రేణుకా ( ఎల్లమ్మ ), తేదీ 1983 జనవరి 22న శ్రీ మహాదేవీ చాముండేశ్వరి ప్రతిష్టలు నిర్వహించారు. 1985లో చిట్కుల్ చాముండేశ్వరీ సన్నిధానంలో లక్షదీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
మానవజాతి అంతా అల్పాయుష్కులు, మందబుద్ధులు కాబట్టి సూక్ష్మంలో మోక్షాన్ని అన్వేషించాలి అనేవారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా జన్మించిన మహనీయులు మొదలుకొని సాదారణ మనిషి వరకు మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం అసాధ్యమనేవారు. కానీ మనం చేసే ఉపాసన మంత్రం ఉచ్చ్వాస నిశ్వాసాలతో మమేకం కావాలి. దీనికై ప్రత్యేక సమయాన్ని నిర్ణయించుకుంటే
“ సూర్యోదయం సమారభ్య యాత్సూర్యో దయావధి | తావత్ జప్త్వా నిరా తంకో సర్వసిద్దీశ్వరో భవేత్ “ అనే సూత్రానికి అనుగుణంగా సూర్యోదయం మొదలుకుని మళ్ళీ సూర్యోదయం వరకు పుణ్యకాలం కాబట్టి నీ ఉపాసనా దేవతను, మంత్రన్నీ ఉపసిస్తే తప్పక మంచి కలుగుతుందని శ్రీ రమణయ్యగారు భక్తులను ఆదేశిచారు. ఆచారమే బందీఖానాలోకి నెట్టకుండా అనాచారమనే ఊబిలో కూరుకుపోకుండా స్వేచ్ఛగా ఉపాసనా కార్యక్రమాన్ని కొనసాగించాలనేవారు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. ఉపసనకు గణనం అవసరం లేదనేవారు.
శాక్తానికి గల ఒకే ఒక ఆచారం పరస్త్రీ విముఖత. ప్రతి స్త్రీలో తన ఉపాస్య దేవతను చూడగలిగే ప్రయత్నం చేయాలనీ చెప్పేవారు. నడుస్తూ ప్రయాణిస్తూ కూర్చుంటూ రకరకాల కార్యక్రమాలు కొనసాగిస్తూ నిరంతరం జపం చేయడానికి ప్రయత్నిస్తే, ఉచ్చ్వాస నిశ్వాసాలతో కూడా జప కార్యక్రమం మమేకమై దివ్యానుభూతిని పొందే అదృష్టం కలుగుతుందని చెప్పేవారు. ప్రతి వ్యక్తి శక్తి సంపన్నుడు కావాలి. అప్పుడే యావద్దేశం శక్తిసంపన్నమవుతుంది. కాబట్టి శక్తిని ఆరాధించడం అందరికీ ముఖ్యమే. దేవుడు లేక దేవత పవిత్రమైనవారు. పవిత్రమైన వ్యక్తులు మరి ఏ ఇతర వ్యక్తులకు లేదా జీవులకు అపకారం చేయరు. అపకారం చేసే వ్యక్తిత్వం దైవత్వంతో సమానం కాదు. కాబట్టి శక్తిని ఏ పద్ధతిలోనైన ఆరాధించవచ్చు. శక్తి ఉపసనం సహజంగా వామాచారమని, దక్షిణాచారమని రెండు విధాలు. వేంకటరమణయ్యగారి అభిప్రాయం ప్రకారం వామాచారమన్ని జ్ఞానాకాండ అని, శారీరకంగా దక్షిణాచారం ఆచరణీయమని వారనేక సభలు, సమావేశాలలో చెప్పేవారు.
వేంకటరమణయ్యగారి జీవన విధానం నల్లేరుపై బండి నడక కాదు.జీవిత గమనంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవిత లక్ష్యం వైపు మాత్రమే ప్రయాణిస్తూ ఎంతోమంది నాస్తికులను తన వాక్ శుద్ధి ద్వారా ప్రేమ మనస్సుతో ఆస్తికులుగా మార్చిన మహనీయ వ్యక్తిత్వం ఆయనది. కీర్తి ప్రతిష్టలకు, ధనానికి, అధికారానికి స్వార్ధచింతనకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని అద్భుత వ్యక్తిత్వం. ఎన్నో మహత్తర కార్యక్రమాలు జరిగాయనే దర్పంగానీ, గర్వంగానీ వారి మాటల్లో గానీ, చేతల్లో గానీ కనపడేది కాదు. పిల్లలతో పిల్లవాడిగా, పెద్దలతో పెద్దవాడిగా, విజ్ఞులతో విజ్ఞునిగా కలిసిపోయే బహుముఖ ప్రజ్ఞా వ్యక్తిత్వం వారిది.
ఎటువంటి మనస్తత్వపు వ్యక్తులనైనా ఒక్క ప్రేమతత్వం ద్వారా మాత్రమే ఆకట్టుకోగలమని, గురువు అనే వ్యక్తి ఒక్క ఈశ్వరుడు మాత్రమేనని, మిగతావాళ్ళంతా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోనేవరమని మాత్రమేనని వారి నిశ్చితాభిప్రాయం. దైవశక్తిని లోకకళ్యాణర్దానికే వినియోగించాలి కానీ స్వార్ధానికి కాదని, అపకారికి ఉపకారం చేయాలనే స్వభావం ఉండాలని, మనం ధరించే దుస్తులకంటే భుజించే ఆహారం కంటే మనస్సు పవిత్రంగా ఉండాలని వారి ఆదేశం, అభిమతం. శ్రీ వేంకటరమణయ్యగారు 1988 జనవరి 31న పరాశక్తిలో లీనమయ్యారు.
**హిందూ ధర్మం** - 45
**దశిక రాము**
**హిందూ ధర్మం** - 45
శాఖాహారమే బుద్ధిని వృద్ధి చేస్తుంది
పోషకాలతో నిండిన ఆహారాన్ని స్వీకరించడం ధీః
సహజంగా పండిన శాఖాహారమే బుద్ధిని వృద్ధి చేస్తుంది. ప్రపంచ మేధావులను ఒకసారి పరిశీలిస్తే, అందులో మూడువంతుల మంది శాఖాహారులే ఉంటారు. మాంసాహారం పేరుకే పుష్టికరమైనా ఆహారం. కానీ ప్రపంచంలో అత్యధికంగా రోగాల బారిన పడేది మాంసాహారులే అన్ని పరిశోధనలు చెప్తున్నాయి. మాంసాహారం త్వరగా అరగదు, ఫలితంగా మత్తును కలిగిస్తుంది. దాంతో కొత్త విషయాలను తెలుసుకునే జిజ్ఞాశ తగ్గిపోతుంది. మాంసాహారమే కాదు, శాఖాహారంలోనూ రజో గుణాన్ని, తమో గుణాన్ని కలిగించే ఆహారాలను అధికంగా తీసుకోకూడదు. మసాల దట్టించిన వంటకాలు తినడం, ఉల్లి, వెల్లులి అతిగా తినడం వలన కూడా బుద్ధి మందగిస్తుంది.
కాయకష్టం చేసుకునే కూలికి బలం కావాలంటే రోజు కాసింత ఎద్దుకూర తినాలంటాడు ఓ ప్రబుద్ధుడు. అసలు ఎద్దుకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించడు. ఎద్దు తినేది గడ్డి, అంటే శాఖాహారమే కదా. ఎవరైనా లోకంలో మాంసాహారం తినండి అని ప్రోత్సహిస్తున్నారంటే వారు ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నారని, మందబుద్ధులుగా తయారుచేయాలని కోరుకుంటున్నారని అర్దం చేసుకోండి.
స్వామి వివేకానందుడు కన్యాకూమారి వద్ద హిందూ మహాసముద్రం మధ్యలో ఒక శిలపై సామాధిలో 3 రోజుల పాటు కూర్చుని, ఆ పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు వివేకానందుడికి భవిష్యత్ దర్శనమైంది. భారతదేశం విశ్వగురు స్థానానికి చేరాడానికి ఉపయుక్తమయ్యే వాటిని స్వామీజీ దర్శించారు. భారత్‌లో ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. భారతీయులందరికి పుష్టికరమైన ఆహారం అందిన రోజునే భారత్ తిరిగి పునర్వైభావాన్ని పొందుతుందని గ్రహించారు. అది దైవసందేశం. వివేకానందుడి ద్వారా పరమాత్ముడు భారతీయులకు చెప్పిన దివ్య సందేశం.
వివేకానందుడి 150 వ జయంతి జరుపుకున్నా, ఇంకా ఈ దేశంలో అనేకమంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారంటే అందుకు కారణం బాధ్యతారహితులైన భారతీయులే. పౌష్టికారానికి అర్దం మీరు, మీ పిల్లలు రోజు గిన్నెల నిండా అన్నం తినడం కాదు. ఆహారం కోద్దిగా స్వీకరించినా, అది బలవర్ధకమైనదై ఉండాలి. అందులో పోషకాలు ఉండాలి. అది మన బుద్ధిని వృద్ధి చేయాలి. శరీరానికి మంచిబలాన్ని ఇవ్వాలి. అటువంటి ఆహారన్ని స్వీకరించడం ధీః (మన ధర్మం). ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు, తిన్న ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయన్నదే ముఖ్యం.
కానీ ఈ రోజు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన పిల్లలకు అటువంటి ఆహారం ఇవ్వడంలేదు, మనమూ తీసుకోవడంలేదు. జొన్నలు, రాగులు, సజ్జలు, పెసలు మొదలైన తృణధాన్యాలను ఎంతమందిమి తింటున్నాం? మన పిల్లలో ఎంతమందికి అసలు జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన తెలుసు?
తరువాయి భాగం రేపు......
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి**
🙏🙏🙏
https://chat.whatsapp.com/D9gWd7SgdmG2Rbh7b3VXl9
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95
*ధర్మము - సంస్కృతి* గ్రూప్
ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 1905 (౧౯౦౫)*
*10.1-887-వ.*
*10.1-888-*
*శా.కోపింపం బనిలేదు శక్రునికిఁ; దాఁ గోపించుఁగా కేమి సం*
*క్షేపం బయ్యెడి దేమి? పట్టణములున్ గేహంబులున్ దేశముల్*
*వ్యాపారంబులు మీకుఁ బోయెడినె? శైలారణ్యభాగంబులన్*
*గోపత్వంబున నుండుచున్ మనకు సంకోచింపఁగా నేటికిన్?* 🌺
*_భావము: పూర్వ జన్మలలో చేసుకున్న పాప పుణ్య రాసులతో బంధింప బడి యున్న మన భవిష్యత్తును ఎవరూ, ఆ దేవదేవుడు కూడా మార్చడు. ఇక ఈ తతిమ్మా వాళ్ళు ఏమి చేయగలరు? ఒక మాట చెప్పాలా? దేవతలు, రాక్షసులు, మానవులు - ఈ జీవ రాసులన్నీ తమ తమ సంస్కారములకు వశమై వర్తిస్తూ ఉంటాయి, అందులోనే మునిగి తేలుతూ ఉంటాయి, ఇందులో ఎటువంటి సందేహము లేదు. చేసిన కర్మములకు అధీనుడై పెద్ద, చిన్న దేహములను ఆశ్రయించి, పుట్టి, పెరిగి ఆ దేహముతోనే మరణిస్తున్నాడు. గురువు, స్వర్గవాసులు, స్నేహితులు, శత్రువులు, బంధువులు - అందరూ ఆ కర్మఫలములనే అనుభవిస్తూ జీవిస్తూ కూడా, వేరే వారికి సేవ చేయటమంటే, భార్య తన భర్తను వదలి, విటుని చేరిన విధముగ ఉంటుంది._*
*_పంచభూతాత్మకమైన ఈ జీవులన్నియు కర్మములను అనుసరించి ప్రవర్తించేవి మాత్రమే. వీరు ఆ ఇంద్రుని మూలమున భయపడనక్కర లేదు. ఈ విషయములో ఇంద్రుడు కోపగించుకోవటానికేముంది? సరే, క్రోధుడయ్యాడు, మనకి పోయేదేముంది? నగరాలా? భవనాలా? రాజ్యాలా? వ్యాపారాలా?? మీకవేవీ లేవుకదా! ఏదో ఈ కొండల్లో, కోనల్లో, ఆవులను కాచుకుంటూ ఉండే మనకి భయపడే అవసరం లేదు._* 🙏🏻
*_Meaning: Sri Krishna continued to allay the fears of Nanda and other cowherds: "As our fate is predestined according to our deeds in our earlier births, no one including the creator can change it. Then what to say about others? Please listen to me carefully. All including Devatas (Celestial Gods), Rakshasas (demons), mankind are subject to their destiny and are living within those boundaries. There is no doubt that these beings get small or big bodies, grow up and die in the form of small creatures to huge demons depending upon what they did in their previous births. When Gurus, friends, foes and relatives are experiencing the fruits of their own deeds of earlier births, they should not be indulging in service/allegiance to extraneous powers. It is like the housewife who deserts a family for personal pleasure._*
*_All the living beings are made of five primordial elements earth, water, fire, air and space and these need not fear Indra, that he would become angry. Even if he is unhappy with us, do we have big buildings, cities, empires or business to lose? Let us not fear him, as we are innocent cowherds tending our cows and calves in far-off areas like forests and hillocks._* 🙏🏻
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454).*
సౌందర్య లహరి శ్లోకము - 5
*దశిక రాము**
సౌందర్య లహరి శ్లోకము - 5
( **శ్రీ శంకర భగవత్పాద విరచితము** )
( **శ్రీ లలితాంబికాయైనమః** )
**హరిస్త్వామారాధ్య**
**ప్రణతజనసౌభాగ్యజననీం**
**పురా నారీ భూత్వా**
**పురరిపుమపి క్షోభమనయత్।**
**స్మరోఽపి త్వాం నత్వా**
**రతినయనలేహ్యేన వపుషా**
**మునీనామప్యన్తః**
**ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥**
అమ్మా! భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు. మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు.
జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.
భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి.
బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.
మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.
మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ? దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.
నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు. మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు.
శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
హిందూ ధర్మం - 5
**దశిక రాము**
హిందూ ధర్మం - 5
(మనకూ ఇతర మతాలకు ఉన్న తేడా)
ఎవరో ఏదో చెప్పడం, అందరూ దాన్ని గుడ్డిగా ఆచరించుకుంటూపోవడం, దాన్ని ప్రశ్నించడాన్ని నిషేధించడం వంటివి మతంలో కనిపిస్తాయి. మీరందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే సత్యం, నాకు వ్యతిరేకంగా చెప్తే చంపేస్తాను వంటివి మతంలోనే కనిపిస్తాయి. అది పసి పిల్లల మనస్తత్వం. అన్ని మత గ్రంధాలు చదవండి, మీకే అర్ధమవుంది, ఎవరి దృక్పధం విశాలమో, ఎవరు అందరి గురించి ఆలోచించారో మీకే స్పష్టమవుతుంది. కానీ ఈ ధర్మంలో అటువంటివి ఉండవు. ఇక్కడ భగవంతుని అనుభూతి చెందడం ముఖ్యం. హిందువుల ధృక్పదంలో భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. ఎవరో దేవుడు ఉన్నాడని చెప్తే, అందరూ అది నమ్మాలి అని ధర్మం చెప్పదు, దేవుడిని ఉనికిని నిర్ధారించుకునే మార్గం చూపిస్తుంది, భగవత్ సాక్షాత్కారాన్ని సుగమం చేస్తుంది. శాస్త్రంలో చెప్పినవాటిని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, ప్రశ్నించి, శోధించి, అనుభవంలో తెలుసుకునే ఆచరించే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక్క ఈ ధర్మానికి మాత్రమే చెల్లింది.
ఎవరో ఒక వ్యక్తి దేవుడి గురించి ఏవో కొన్ని విషయాలు చెప్తే, అవే తరాల తరబడి మూఢంగా నమ్మూతూ ఉండడం మన ధర్మంలో ఉండదు. ప్రతి ఒక్కరు మరణించేలోపు దైవాన్ని చూడాలి, దైవాన్ని ప్రత్యక్షానుభూతితో తెలుసుకోవాలి, అదే దైవంలో ఐక్యమవ్వాలి. ఇదే హిందూ ధర్మం భోధిస్తుంది. అంతేకానీ, పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు, నీ పూర్వులు నమ్మారు కనుక నువ్వు నమ్మాలని, కేవలం దేవుడు ఉన్నాడన్న మూఢనమ్మకంతో జీవించమని, అదే నమ్మకంతో చావమని చెప్పలేదు. అవసరమైతే నిన్ను నువ్వు ప్రశ్నించుకో, శాస్త్రగ్రంధాలను చదువు, దైవం ఉన్నదని నిర్ధారించుకో, ఆ తర్వాతే అతడిని చేరుకో అన్ని ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదు.
ఇవన్నీ మనకూ, ఇతర మతాలకు ఉన్న తేడా. ఇక మన ధర్మం గురించి తెలుసుకుందాం.
**ధర్మో రక్షతి రక్షితః*
“సింగినాదం - జీలకర్ర*
“సింగినాదం - జీలకర్ర*
కొన్ని సందర్భాల్లో
మనకు తెలియకుండానే
తెలుగులో కొన్ని నానుడులు
అసంకల్పితంగా
అనేస్తూ ఉంటాము....
కాని వాటి వెనుక
ఉన్న అసలు
అర్ధం చాలామంది కి
తెలియదు...
ఈ రోజు
సింగినాదం జీలకర్ర
అనే నానుడి వెనుక
దాగి ఉన్న అంతరార్ధం
తెలుసుకుందాం....
ఒకప్పుడు
ఓ రాజ్యంలో
జీలకర్రకు
విపరీతమైన
కొరత ఏర్పడింది...
ప్రజలందరూ
జీలకర్ర లేక చాలా
ఇబ్బందులు పడ్డారు..
ఇదే అదనుగా
వ్యాపారస్తులు
ఇతర దేశాల నుండి
జీలకర్రను దిగుమతి
చేసుకుని ఎక్కువ రేట్లకు
అమ్మడం మొదలు పెట్టారు....
ఈ విషయమై ప్రజలందరూ
తమ గోడును రాజు గారికి
విన్నవించుకున్నారు...
అప్పుడు రాజు గారు
మంత్రివర్గం తో
అత్యవసర సమావేశం
ఏర్పాటు చేసి
విదేశాలనుండి ఓడల
మీద జీలకర్రను తెప్పించి
మధ్యవర్తుల ప్రమేయం
లేకుండా డైరెక్ట్ గా ప్రజలకు
అమ్మే ఏర్పాటు చేశారు...
అయితే జీలకర్ర తో
కూడిన ఓడ...
రేవుకు చేరుకున్నవెంటనే
ఆ విషయం ప్రజలకు
తెలియచేయడానికి
ఓ ఏర్పాటు చేశారు...
అదే శృంగ నాదం...
శృంగ నాదం
అంటే ఒక సంగీత
వాయిద్య పరికరం...
ఒక విధంగా ఇది
బాకాను పోలి ఉంటుంది....
ఓడ, రేవుకు చేరగానే
శృంగనాదం గట్టిగా ఊదడం
ద్వారా ప్రజలకు ఆ విషయాన్ని
తెలియ చేసెడి వారు...
ప్రజలు వెంటనే
ఓడ రేవుకు చేరుకుని
డైరెక్ట్ గా జీలకర్రను
కొనుక్కునే వారు...
మధ్య దళారుల
ప్రమేయం
లేక పోవడంతో
జీలకర్ర తక్కువ
రేటుకి లభించి ప్రజలు
ఆనందించారు...
ఇక అసలు
విషయానికి వస్తాను...
జీలకర్ర లేకపోవడం వల్ల
జనజీవనం అస్త వ్యస్తం
అయ్యే అంత పరిస్థితి
ఏమి ఉండదు...
అయినా రాజు గారు
దానికి అధిక ప్రాధాన్యాన్ని
ఇచ్చి లేనిపోని హడావిడి చేశారు...
అందుకే అప్పటి నుండి
ఎవరైనా అనవసర
విషయాలకు అధిక
ప్రాధాన్యాన్ని ఇస్తే
ఆ చేశావులే
శృంగానాదం జీలకర్ర
అనడం పరిపాటి అయినది...
కాలక్రమంలో
శృంగానాదం
కాస్త సింగినాదం గా
మారి....
సింగినాదం జీలకర్ర గా
మారింది...
ఈ విషయం చెప్పడానికి
నేను ఇంత మేటర్ ను
తెలుగులో తయారు చేసి
మీకు
పోస్ట్ చేయడం అంత
అవసరం అంటారా...
*సింగినాదం*
*జీలకర్ర కాకపోతేను....*😊
సెక్యులర్ హిందువులు
_*తెలుగు రాష్ట్రాల్లో హిందువులు*_
సెక్యులర్ హిందువులు
73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.
👉_*భారత్_టుడే_సర్వేలో_వెల్లడి*_
👉అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువుల
👉ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు👇👇👇
1.అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు
2. అన్ని మతాల సారం ఒక్కటే వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా
3.అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అంటాడు వీడు అన్ని గ్రంధాలు చదివినట్లు
4.వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తిచూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు
5.వాడు మన మతాన్ని తిడితే వాడిపాపాన వాడిపోతాడు అనడం
6.క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనడం
7. క్రైస్తవుల ఇంటికి ప్రాద్దనకు కి వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు
8 హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు
9.హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు, ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని.
10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు(ఉదా, కృష్టుడికి 16 వేలమంది భార్యలు ).
11. స్వార్ధం తో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూమతాన్ని దూషించి మతం మారిపోతారు.
13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైం ని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయిమతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?
ఈ సెక్యులర్ హిందువులు
(హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి
నిజం తెలుసుకోండి
👉🇮🇳🙏🕉 గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో.మేలుకోండి హిందువులారా!లేకపోతే కొన్నిరోజుల,కొన్నిఏళ్ళతర్వాత మీ పిల్లలకి పూర్వం హిందూమతం ఉండేది అనిచెప్పే పరిస్థితి దాపురిస్తుంది.ఇది మీరు అంగీకరిస్తారా?అంగీకరిస్తే మీ మీ గ్రూపులకు పంపగలరని సవినయముగా ప్రార్థిస్తూ
సేకరణ.....
ముఖ్యమైన విషయం*
*దయచేసి చాలా ముఖ్యమైన విషయం*
మీకు తెలిసిన దగ్గరి బంధువుల లేదా మీ స్నేహితుల సర్కిల్‌లో ఎవరైనా కరోనా సోకడం వలన (కోవిడ్ -19) లేదా మరేదైన కారణం వల్ల మరణించినట్లయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో 01-04-2020 నుండి నేటి వరకు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ ఎంట్రీ కావాలని బ్యాంకును అడగండి.
ఎంట్రీ చూసి రూ.12/- లేదా రూ.330/- డెబిట్ అయివుండవచ్చు గుర్తించండి,.
బ్యాంకుకు వెళ్లి బీమా కోసం క్లైమ్ చేయండి.
మీ అందరికీ నా వినయపూర్వకమైన అభ్యర్థన
ఏమిటంటే, మీ చుట్టూ ఇలాంటి కేసులు జరిగితే, మరణం తరువాత ఖాతాను మూసివేసిన కుటుంబాలకు వెంటనే తెలియజేయండి.ఆ కాలంలో ప్రీమియం డెబిట్ చేయబడివుంటే ఆ కుటుంబానికి భీమా సొమ్ము అందుతుంది.
2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాదారులకు తక్కువ ప్రీమియంతో రెండు బీమా పథకాలను అందించింది:
*ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై) రూ.330*
*ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పిఎంఎస్‌బివై)రూ.12 లతో బీమా 2 లక్షల రూపాయలు*
మనలో చాలామంది ఈ ఫారమ్‌ను నింపివుండవచ్చు. ప్రీమియం వారి ఖాతా నుండి 31/05 న డెబిట్ చేయబడిఉంటుంది.
*మొదట, ఈ సందేశాన్ని అన్ని బ్యాంక్ ఖాతాదారులకు పంపించండి.*
రూ. 2,00,000 / అనేది మాత్రం చిన్న మొత్తం కాదు.!
*ధార్మికగీత - 29*
*ధార్మికగీత - 29*
*శ్లో:- హరే ర్నామ హరే ర్నామ ౹*
*హరే ర్నామైవ కేవలం ౹*
*కలౌ నాస్త్యేవ నాస్త్యేవ ౹*
*నాస్త్యేవ గతి రన్యథా ౹౹*
*****
*భా:- కృత త్రేతా ద్వాపర యుగాలలో ఋషులు, మహర్షులు, రాజర్షులు మునులు, యోగులు, రాజులు శమ దమాలు, నియమనిష్ఠలు కలిగి దీక్షాదక్షతలతో యజ్ఞాలు, యాగాలు చేసి భగవానుని ప్రసన్నం, ప్రత్యక్షం చేసుకున్నారు. ఆధునికత, సాంకేతికత, యాంత్రికత, హేతుకత వెల్లివిరిస్తున్న కలియుగంలో అవి అసాధ్యము కనుక కేవలము "భగవన్నామసంకీర్తన" కన్న వేరే దారి లేదు. రామ, హరి, కృష్ణ, శివ అనే రెండక్షరాల నామామృతగానం మనసారా, నోరారాచేస్తే, మానవాళి పాపాలు, తాపాలు, పాతకాలు, మహాపాతకాలు పూర్తిగా హరించుకుపోతాయి. "రా" అనగానే నోటి నుండి పాపాలు బయటికి వెళితే, అవి తిరిగి మన చెంతకు రాకుండా "మ" కవాటంలా పెదవులు మూసివేస్తుందనే కవి చమత్కారము అక్షరసత్యము. ముమ్మాటికి దైవనామమే మనకు శ్రీరామరక్ష. మనమే కాదు మన మనసులు, పరిసరాలు, వాతావరణము, , ఊరూ వాడా అన్ని నగర సంకీర్తనలో భగవన్నామగానామృత దివ్యతరంగాలతో పునీతమవుతాయి. " నామస్మరణాత్ అన్యోపాయం నహి నహి" అని రూఢిగా చెప్పబడింది. కాన మనం ప్రతి పనిని భగవదర్పణ భావంతో చేయగలగాలి. మనోవాక్కాయాలను భగవచ్చింతనలో నిమగ్నం చేయాలి*.
*****
*సమర్పణ : పీసపాటి*
ఏకదండి_ద్విదండి_త్రిదండి
ఏకదండి_ద్విదండి_త్రిదండి
#ప్ర: యతీశ్వరులుచేతిలో కర్ర ఎందుకు పట్టుకుంటారు?
వారు ఏం బోధిస్తారు? #ఏకదండి_ద్విదండి_త్రిదండి అంటే ఏమిటి?
#జ: యతీశ్వరులు (చేతిలో వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా పొడవాటి కర్రలు ఎళ్లవేళలా పట్టుకుంటారు.
ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది.
గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, యతీశ్వరులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. (దండి అనగా కర్ర అని అర్థము)
ఒక కర్రను (ఏకదండి ) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు (ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా బ్రహ్మ ఆత్మ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బ్రతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్దాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.
రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని 'ద్విదండి స్వాములు ', 'జీయరు'లని అంటారు వీరందరూ వైష్ణవ భక్తులే. వీరు దేవుడు వేరు జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే భారతయుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.
మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి ( త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతమును బోధిస్తారు (రామానుజాచార్యులు). శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యములని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ,
జీవుడు ఆజ్ఞానముతో సంసార బంధమున చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారికి భగవంతుని అణుగ్రహం వలన అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము నారాయణ సాన్నిధ్యము, మోక్షము పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్దాంతాన్ని బోధిస్తారు.....
🙏🙏🙏🙏
#
ధనప్రాప్తి
ధనప్రాప్తి
లక్ష్మీ కటాక్షం కలగాలంటే నిత్యం ఈక్రింది శ్లోకాన్ని
56 సార్లు జపించాలి.
"సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్థసాధికే
శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే"
బంగారపు..లేదా వెండి లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి.
లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్యప్రాప్తి.
ఆఫీసులో..వ్యాపారసంస్థలో తూర్పుముఖంగా
కూర్చుంటే ధనప్రాప్తి.
పన్నీరుతో కొత్త తెల్లనివస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆవస్త్రంతో వత్తులుచేసి శుక్రవారం ఆవునేతితో
మూడువత్తులతో దీపారాధన చేస్తే సకలసంపదలు కలుగుతాయి.
గురువారం ఐదు పత్తివత్తులతో ఆవునేతితో
దీపారాధన చేస్తే అఖండఐశ్వర్యం లభిస్తుంది.
శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు — శ్రీదేవీభాగవతము.
ప్రతిరోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండలక్ష్మి కరుణిస్తుంది.
కమలసప్తమీ వ్రతమును చైత్ర,వైశాఖమాసాలలో శుక్లసప్తమి నాడు శ్రీమత్స్యపురాణంలో చెప్పిన
ప్రకారము చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి.
కనకధారాస్తవము ప్రతిరోజూ త్రిసంధ్యలలోపఠిస్తే అపారసంపద చేకూరుతుంది.
శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో(కర్పూరం,కస్తూరి, పుణుగు,జవ్వాది,అగరు,పన్నీరు, అత్తరు,శ్రీగంధం) పూజిస్తే కీర్తి,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
కొత్త సంవత్సరంతర్వాత అనగా ఉగాది తరువాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడంద్వారా
ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు.
జాతకరీత్యా ఉన్నదోషాలు తొలగిపోతాయి.
శ్రీ సూక్తము నిత్యం పఠించిన ధనప్రాప్తి కలుగుతుంది.
*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*
*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*
*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.
*9494550355*
కపోతేశ్వరాలయం* - చేజెర్ల
కపోతేశ్వరాలయం* - చేజెర్ల
**మన సంస్కృతి సాంప్రదాయాలు*
మహారాష్ట్రలోని "తేర్" మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని చేజెర్ల - రెండు స్థలాలలోను ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు తరువాత హైందవ శైవాలయాలుగా మార్చబడ్డవి. చేజెర్లలోని శైవాలయాన్ని "కపోతేశ్వరాలయం" అంటారు. ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరంనుండి ఉద్భవించిందని స్థల పురాణ గాధ. శిబికి, కపోతానికి (పావురానికి) ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాధ, ఒక బౌద్ధ గాధ ఉన్నాయి.
*స్థల పురాణం*
మహాభారతంలోని కధ - మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారం వెంటబెట్టుకొని కాష్మీర దేశం విడచి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపో దీక్షనాచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. అన్న తిరిగి రానందున అతనిని వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి తానూ మరణించాడు. తమ్ముళ్ళను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు. అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షింపదలచారు. శివుడు ఒక వేటగాని వలెను, బ్రహ్మ అతని బాణం లాగాను, విష్ణువు ఒక కపోతం లాగాను అక్కడికి వచ్చారు. వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు జొచ్చింది. శిబి ఆ పక్షికి అభయమిచ్చాడు.అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. అయినా అవి సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.
*బౌద్ధ జాతక కధ* -
శిబిజాతకం కధ ప్రకారం శిబి చక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. అవసన సతకం కధ ఈ శిబిజాతక కధనూ, మహాభారత కధనూ అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కధ తరచు కనిపిస్తుంటుంది. అమరావతిలోను, నాగార్జున కొండ ఈ జాతక కధకు సంబంధించిన శిల్పాలున్నాయి.
ఆలయం నిర్మాణం గ్రామానికి వాయువ్య దిశగా ఉన్న ఈ కపోతీశ్వరాలయం తూర్పు ముఖంగా ఉంటుంది. తూర్పున ఉన్న ఒకే ఒకద్వారం పైన ఒక చిన్న గోపురం ఉంది. ఈ గోపురం అలంకరణలు లేకుండా సాదాగా ఉంది. స్తంభాలు, ద్వార బంధాలు కంచిలోని పల్లవ దేవాలయాలను పోలి చదరపు శీర్షభాగాలు కలిగి ఉన్నాయి. ఆలయం వెలుపల దక్షిణం వైపు ఒక పెద్ద boab చెట్టు ఉండేది. దాని కాండం వ్యాసం 56 అడుగులు ఉండేది. లోపల తొర్రగా ఉండేది. ఈ చెట్టు 1917లో కూలిపోయింది. దేవాలయంలో "నగర, వెసర, ద్రవిడ" నిర్మాణ రీతులు మిళితమై ఉన్నాయి. చైత్యగృహం ప్రధాన చైత్యంపై కట్టినందున ఈ ఆలయ నిర్మాణాన్ని వాస్తుశాస్త్రంలో "హస్తిప్రస్త" (ఏనుగు వీపు) విధానం అంటారు. ముందుగా బౌద్ధ చైత్యం అయిన దానిని హిందువుల పూజా విధానానికి అనువుగా మలచారు.
ప్రాకారం లోపల అనేక చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ప్రవేశ గోపురానికి ఎదురుగా ఒక చిన్న మంటపము, ధ్వజ స్తంభము ఉన్నాయి. ఆవరణ దక్షిణాన ఆరు, పశ్చిమాన రెండు, ఉత్తరాన నాలుగు చిన్న మందిరాలున్నాయి. ఇవి కాకుండా రాళ్ళలో తొలిచిన అనేక చిన్న గుడులున్నాయి. రెండు రాతి పలకాలమీద ఒక్కొక్క దానిమీద వెయ్యి చొప్పున శివలింగాలున్నాయి. ఒక పాలరాతి ఫలకంపై పద్మహస్తుడైన సూర్యుని శిల్పం ఉంది. ప్రధాన ఆలయానికి వాయువ్యాన సప్తమాతృకల శిల్పం, ప్రస్తుతం బాగా శిధిలమైనది, ఉంది. కపోతేశ్వరస్వామి గర్భగుడి ముందు ఒక చిన్న నంది మంటపం ఉంది. దాని వెనుక ఒక సన్నని దీర్ఘ చతురస్రాకారపు మంటపానికి ముందు వైపు రెండు, వెనుకవైపు నాలుగు స్తంభాలున్నాయి. ఆ నాలుగు స్తంభాల మధ్య ద్వారం ఉంది. ఈ నాలుగు స్తంభాలపై పద్మాలు చెక్కబడి ఉన్నాయి. వాటి వెనుక చదరంగా ఉన్న ముఖమంటపం ఇరువైపులా తూర్పు-పశ్చిమ దిశలలో వరుసలో స్తంభాలు, వాటిమధ్య ద్వారపాలకుల ప్రతిమలు ఉన్నాయి. ఈ మంటపం ఉత్తర-పశ్చిమ దిశలోని గోడలు గర్భగుడిని కలుస్తాయి. గర్భగుడి అసలు చైత్యగృహం అయి ఉండవచ్చును. గర్భగృహం ఇరువైపులా ఉన్న మూడేసి స్తంభాలపైన రాతి దూలాల కప్పు ఉంది. చదరపు వేదికపైన ఉన్న కపోతేశ్వరలింగం తలలేని శరీరాకృతిలో అనిపిస్తుంది. లింగం పై ప్రక్కల రెండు రంధ్రాలున్నాయి. కుడిప్రక్కనున్న రంధ్రంలో ఒక పాత్రకు సరిపడా జలం మాత్రం పడుతుంది. మరొక రంధ్రంలో ఎంత నీరు పోసినా గాని తిరిగిరాదు. (లోపల ఏదో సొరంగంలోకి వెళుతూ ఉండవచ్చును). అన్ని శివాలయాలలోను సాధారణంగా అభిషేక జలం బయటకు పోవడానికి గర్భగుడి ఉత్తర దిశలో ఒక మార్గం ఉంటుంది. కాని ఈ ఆలయంలో అలా లేదు. గర్భగుడి గోడల బయటి ప్రక్క అలంకరణలు లేకుండా సాదాగా ఉంటాయి. గోడపైన ఒక పావురాయి బొమ్మ మాత్రం ఉంటుంది. ఆ పై నిర్మాణంలో "పట్ట, త్రిపట్ట, గళ, పట్ట, త్రిపట్ట, గళ" భాగాలున్నాయి. వాటి పైన గుర్రపుడెక్క ఆకారంలో శిఖరం ఉంది. శిఖరం పైన కలశం లేదు. శిఖరం ముందుభాగంలో సింహలత అందులో ఒక మాలాకోష్టంలో క్రింది భాగాన ఆసీన దేవతా మూర్తి, ఆ పైన నందిని ఆరోహించిన ఫార్వతీ పరమేశ్వరులు ఉన్నారు.
*శాసనాలు*
శివానందలహరి 5 వ శ్లోకం
శివానందలహరి 5 వ శ్లోకం
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
ఓరీ పిచ్చి వాడా! అల్పమైన ఫలితములను ఇచ్చే దేవతలతో నీకు
ఏమిపని ? వీళ్ళు ఎప్పుడో ఫలితములు ఇస్తారట. వాళ్ళిచ్చే ఫలితం
కూడా, మన కళ్ళకు కనపడదు. ఇంతకన్నా ఒక రాజును ఆశ్రయింౘవౘ్చును
కదా ! రాజులైతే ప్రత్యక్షంగా నే ఫలితములు ఇస్తారు. దేవతలను ఆశ్రయింౘడం
కంటే, రాజులను ఆశ్రయింౘడం మేలు అనే అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని
శంకరులు ఈ శ్లోకం వ్రాశారు. రాజులను కొలిచి వారిని మెప్పించగల నేర్పు
తనవద్ద లేదనీ ఈశ్వరుడేతన్ను కాపాడాలనీ, శంకరులు ఈ శ్లోకం లో
ప్రార్థించారు.
శ్లో: 5
**స్మృతౌ శాస్త్రే వైద్యే**
**శకున కవితా గాన ఫణితౌ**
**పురాణే మంత్రేవా**
**స్తుతినటన హాస్యేష్వచతురః**
**కథంరాజ్నాం ప్రీతిర్భవతి మయి కో హోం పశుపతే**
**పశుంమాం సర్వజ్ఞ!**
**ప్రథిత కృపయా పాలయ విభో !!**
పదవిభాగం:
స్మృతౌ , శాస్త్రే, వైద్యే _ శకునకవితాగానఫణితౌ _ పురాణే _ మంత్రే _
వా _ స్తుతి నటన హస్యేషు _ అచతురః _ కొంచెం _ రాజ్నాం _ ప్రీతిః _
భవతి _ మయి _ కః _ అహం _ పశుపతే _ పశుమ్ _ మామ్ _ సర్వజ్ఞ _
ప్రథితకృపయా _ పాలయ _ విభో.
తాత్పర్యం:
సర్వజ్ఞుడైన ఓ ఈశ్వరా! మనుస్మృతి వంటి స్మృతుల యందు గానీ,
తర్కవ్యాకరణములవంటి శాస్త్ర ములయందుగానీ, వైద్యము నందుగానీ,
శకునములు చెప్పుట యందుగానీ, కవిత్వమును అల్లుటయందుగానీ,
సంగీతమును పాడుటయందుగానీ,సభల్లో వాగ్వాదము చేసే వాచా
విష్కరణము నందుగానీ, పురాణకాలక్షేపము చేయుటయందు గానీ,
మంత్ర ప్రయోగమునందుగానీ, ఇతరులను స్తుతి చేయుటయందు గానీ,
నాట్యమునందుగానీ,హాస్య ప్రసంగము నందుగానీ నాకు నేర్పు లేదు.
అటువంటి నాయందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది. వారిని
సంతోష పెట్టేందుకు అసలు నేను ఎవరిని ? నేను ఎంతటివాడను?
శ్రుతి, స్మృతి పురాణేతిహాసము లందు ప్రసిద్ధుడవైన ఓ ప్రభూ!
నేను పశువును, నీవు పశుపతివి. కాబట్టి నన్ను దయతో కాపాడు.
వివరణ:
శంకరులు కరుణాస్వరూపులు మనవంటి అల్పజ్నులకు భగవంతుని
ముందు నిలబడి ఎలా ప్రార్థన చేసికోవాలో కూడా తెలియదని , గుర్తించి
వారు ఈ స్తోత్రమును మనకందించారు. కాబట్టి " పశువు" నని మనం
భగవంతుని ముందు చెప్పుకోవాలని మనకు చెప్పడంకోసమే, వారు ఇలా
వ్రాశారని మనం గర్తింౘాలి.
అదీగాక రాజులు కొంచం గొప్పవాళ్ళైనప్పటికీ వాళ్ళు కూడా పశువులే కదా!
ఒకవైపు పాశాలను త్రెంౘుకోవాలని మనం అనుకుంటూ,మనకంటే పెద్ద
పశువులైన రాజులను మనం ఆశ్రయింౘడం అంటే పాశాలను మరింతగా
బంధింౘుకోవడమే కదా! కనుక, తనకు ఆ రాజులు ఇచ్చే ధనకనకాదులపై
ఆసక్తి లేదని శంకరులు చెప్పారు.
ధూర్జటి మహాకవి కూడా తన " కాళహస్తీశ్వర శతకము" లో ఇలానే
చెప్పారు. ౘూడండి___
" రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు,వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదు లాత్మవ్యధా
బీజంబుల్, తదపేక్ష ౘాలుఁ, బరితృప్తింబొందితిన్,జ్నానల
క్ష్మీ జాగృత్పరిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా !"
ఏ విద్యలలోనూ,నేర్పులేని తనను, రాజులు ఆదరింపరని, అన్నీతెలిసిన
ప్రభువైన ఈశ్వరుడే తనను రక్షింౘాలని, రక్షింౘమని, శంకరులు ఈశ్వరుణ్ణి
కోరారు.
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**