🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*****
ధార్మికగీత - 28*
*శ్లో:- హరిణా౽పి హరేణా౽పి ౹*
*బ్రహ్మణా౽పి సురై రపి ౹*
*లలాట లిఖితా రేఖా ౹*
*పరిమార్ష్టుం న శక్యతే ౹౹*
*****
*భా:- మనిషి పుట్టీ పుట్టగానే నుదుటిపై జననాది మరణ పర్యంతం దైనందిన కార్యా చరణ ప్రణాళిక , విధ్యుక్త ధర్మ నిర్వహణ గీతగా వ్రాయబడి యుంటుందని, దాని ననుసరించియే మన జాతక చక్రం నడిపిస్తుందని మన ప్రగాఢ విశ్వాసము. అయితే మన భావన సుఖ సంతోషాలలో మునిగి తేలేటప్పుడు ఒక రకంగాను, కష్టనష్టాలలో కూరుకు పోయినప్పుడు ఒక రకంగాను ఉంటుంది. కష్టాలలో నుదుటి రాత మారితే బాగుంటుందని అనిపిస్తుంది. విశ్వానికి సృష్టికర్తయైన " బ్రహ్మ" గాని. పోషణకర్త యైన "విష్ణువు" గాని, లయకర్త "మహేశ్వరుడు" గాని, "ముక్కోటి దేవతలు" గాని మన తలరాతను మార్చలేరు. సరిచేయలేరు. తుడిపివేసి తిరిగి తాజాగా వ్రాయలేరట. అందుకే "గీత" "ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం" అని చెబుతుంది. మనల్ని మనమే చక్క దిద్దుకోవాలి. మన నడతను మనమే మార్చుకోవాలి. సావిత్రి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు తమ అచంచల విశ్వాసము, దృఢ సంకల్పం, అనన్యభక్తి, స్థితప్రజ్ఞతలతో తమ తలరాతని తామే మార్చుకొని, కీర్తి శిఖరాన్ని అధిరోహించి, నేటికి ప్రాతఃస్మరణీయులు, చిరస్మరణీయులు కాగలిగారు. మన త్రికరణ శుద్ధి, శమ దమాది సంపత్తి, చతుర్విధ సాధనా సామాగ్రి, విషయ వాసనా వైరాగ్యము, మనోవాక్కాయిక తపముల ద్వారా ముక్తిమార్గము ను అనుసరించవచ్చును. లౌకిక వాంఛా రతులమై రక్తిమార్గాన్ని అనుసరించవచ్చును.నిర్ణయం మనదే*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి