4, డిసెంబర్ 2020, శుక్రవారం

త్రిపురారహస్య జ్ఞానఖండసారము**

 **దశిక రాము**


**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**


అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు 


PART-16

అంత సంవర్తుఁడు కొంతసేపు అంతర్ముఖుఁడై యుండి భార్గవుని యొక్క భవిష్యత్తు నంతను తెలిసికొని మధురముగా నిట్లనెను. ''రామా! వినుము. ఈమార్గము ఎవరికైనను సులభముగా గోచరించునది కాదు. ఇది చాల సూక్షమమైన విషయము. ఆందువలన కొండపైకి ఎక్కుటవలె, సంసారమునుండి పైకిపోవు నీమార్గమును గ్రహించుట మలినచిత్తులకు దుర్ఘటము. ఇది తెలిసికొనుటకు సులభముకాని దగుటవలననే చెప్పుటకును సులభము కాదు. ఇది ఎట్టి లోకపరిజ్ఞానమునకు అందనిది యగుటచే దుర్లభ మని చెప్పఁబడుచున్నది. ఇది త్రిపురాదేవియొక్క సేవవలన తప్ప వేఱోకవిదమున లభింపదు. ఆదేవియొక్క సేవాభాగ్యము కూడ గురువర్యుని కృపవలన తప్ప మఱియొక విధమున లభింపదు. సత్సంగమే అందులకు హేతువు. సకలశుభములకుని సత్సంగమే మూలము. కావున గరునాథుఁడైన దత్తాత్రేయుని యొద్దకు పొమ్ము. ఆయనను ఆరాధించి సంతోషపెట్టి త్వరలోనే వాంఛితమును పొందఁగలవు. రాత్రి యందు చీఁకటిలో త్రోవతప్పినవాఁడు సూర్యునివలన తప్ప ఎట్లు మరల సరియైనత్రోవకు రాలేఁడో, అట్లే ఎవ్వఁడై నను గురుసేవవలన తప్పసుఖమును పొందఁజాలడు. నేత్రరోగికి అంజనమునొసంగు వైద్యునివలె సంసారరోగికి గురువుతప్ప వేఱొకగతి లేదు. సాక్షాత్తుగా సదాశివుఁడే శిష్యులను అనుగ్రహించుటకై గురువుగా మనుష్యరూపమును పొంది ఎల్లప్పుడును పర్యటించుచుండును. ధనము కీర్తి మొదలగువానిని సమృద్ధిగా పొందియున్నను మూఁడులోకములలో ఎవ్వఁడైనను గురుదేవుని పాదాబ్జములను ఆశ్రయింపక శ్రేయస్సును ఎట్లు పొందఁగలఁడు? కావున నీవు ఇచ్చటినుండియే వెంటనే గురువు నొద్దకు పొమ్ము. ఆయనను కైతవములేని చిత్తముతో దృఢమైన భక్తితో ఆరాధింపుము. గురువు ప్రసన్నుఁడైనచో మూఁడులోకము లందును దుర్లభ మేముండును? ఆయన ఇప్పుడు గంధమాదన శైలమున సిద్ధయోగులచే సేవింపఁబడుచు ఆశ్రమమునందున్నాఁడు. నీకు శుభ మగును గాక! నేను పోవుచున్నాను.''

అంతట పరశురాముఁడు చూచుచుండఁగనే ఆయన ఈశాన్యముగ బయలుదేరి ఆకాశమార్గమునందు పోవుచు, గాలిచే తఱుమఁబడుచున్న మేఘపటలమువలె నిమేషమాత్రమున అగోచరుఁడయ్యెను. వెంటనే భార్గవుఁడును సంవర్తునిమాటలవలన కలిగిన కుతూహలముతో త్వరాన్వితుఁడై దత్తగురునియొద్దకు బయులుదేరెను. PART-16

మీ మీ గ్రూపులలో ఫార్వర్డ్ చేసి అమ్మవారి కృపా కటాక్షముల కు పాత్రులు కాగలరు 


🙏🙏🙏

సేకరణ


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA

కామెంట్‌లు లేవు: