భగవత్ శక్తి వక పరిశీలన. ఎవరైనా చూచితిరా మానవ నేత్రములతో.అంత సూపర్ ఎటోమిక్ శక్తిని వినడం గాని చూచుట గాని మానవ దేహమునకు కలదా లేక దానిని పంచభూతాత్మకమైన దేహమునకు సులభమా.యింద్రియములకు వాటికి మూలమైన శక్తిని బాహ్యమునుండి గ్రహించుట వలననే తెలియును తప్ప మరొక దారి లేదు. కంటి చూపు, శబ్ద , స్పర్శకు, వాసనకు, దేహ సంబంధంగా పరిమితి కలదు. వీటి పరిమితి లేని తత్వమే భగవత్ శక్తి. అయితే అది తెలుసుకొనుట ఎలా సాధ్యం. పరిమితి గల వస్తుతత్వము గల దేహము ద్వారా మాత్రమే అపరిమితమైన భగవత్ శక్తిని తెలియుట సాధ్యం. దానికి ఆత్మద్వారా మూడవ నేత్రం తర్డ్ డైమెనెషన్ అని అంతః శ్శోధన ద్వారానే తెలియును. అంతశ్శోధనకు శక్తి రూపమైన ఆత్మయే. ఆత్మ యనగా ఓం కారం రూపంలో గల వాయు వుష్ణ శక్తి కలయిక. వీటికి మూలం నీరు. వీటికి మూలము వుష్ణ రూపమునకు మూలమైన శక్తి. అది జీవ లక్షణ మని జీవ లక్షణమే దేవునిగా తెలియుచున్నది. ఓ అనగా జీవ సంబంధం జీవం కలశరీరమునే ఓ యని జీవము ౦ పూర్ణమని మరొక దేనినీ యీ సంబోధనతో అనగా పిలుచుట కుదరదు. జీవం మాత్రమే ఓ అని అదియును ౦ పూర్ణమైన జీవుని ఆశ్రయించిన వానినే యని తెలియును. యిచ్చట పూర్ణమనగా నేమి. యింద్రియ ఙ్ఞానమునకు అతీతమైన శక్తిని అది ప్రణవ రూపమైన ఓంకారమని, అది దేహ సంబంధమైతే తప్ప వాయు రూపమునరూపమునమాత్రమే తెలియ బడుచున్నది. ౦ పూర్ణముగా జీవ సాధనము పూర్ణముగా. అది వక వస్తు తత్వం గాదు. కాని వస్తుతత్వమువలననే అది సాధ్యం. మూర్తి వలననే అనగా ఆకారము వలననే. వస్తు తత్వ లక్షణమే ఙ్ఞానం. అది తెలియని యెడల అజ్ఞానం. అదియే ప్ర ఙ్ఞానం. అదియే భగవత్ శక్తి. అనంతమైన దానిని వక జీవిత కాలం తెలియుట అసంభవం ప్రయత్నిస్తే గాని మానవ దేహం వలననే ఎన్నో జన్మల పరంపర యే ఙ్ఞాన సాధన వలననే తెలియును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి