*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 1905 (౧౯౦౫)*
*10.1-887-వ.*
*10.1-888-*
*శా.కోపింపం బనిలేదు శక్రునికిఁ; దాఁ గోపించుఁగా కేమి సం*
*క్షేపం బయ్యెడి దేమి? పట్టణములున్ గేహంబులున్ దేశముల్*
*వ్యాపారంబులు మీకుఁ బోయెడినె? శైలారణ్యభాగంబులన్*
*గోపత్వంబున నుండుచున్ మనకు సంకోచింపఁగా నేటికిన్?* 🌺
*_భావము: పూర్వ జన్మలలో చేసుకున్న పాప పుణ్య రాసులతో బంధింప బడి యున్న మన భవిష్యత్తును ఎవరూ, ఆ దేవదేవుడు కూడా మార్చడు. ఇక ఈ తతిమ్మా వాళ్ళు ఏమి చేయగలరు? ఒక మాట చెప్పాలా? దేవతలు, రాక్షసులు, మానవులు - ఈ జీవ రాసులన్నీ తమ తమ సంస్కారములకు వశమై వర్తిస్తూ ఉంటాయి, అందులోనే మునిగి తేలుతూ ఉంటాయి, ఇందులో ఎటువంటి సందేహము లేదు. చేసిన కర్మములకు అధీనుడై పెద్ద, చిన్న దేహములను ఆశ్రయించి, పుట్టి, పెరిగి ఆ దేహముతోనే మరణిస్తున్నాడు. గురువు, స్వర్గవాసులు, స్నేహితులు, శత్రువులు, బంధువులు - అందరూ ఆ కర్మఫలములనే అనుభవిస్తూ జీవిస్తూ కూడా, వేరే వారికి సేవ చేయటమంటే, భార్య తన భర్తను వదలి, విటుని చేరిన విధముగ ఉంటుంది._*
*_పంచభూతాత్మకమైన ఈ జీవులన్నియు కర్మములను అనుసరించి ప్రవర్తించేవి మాత్రమే. వీరు ఆ ఇంద్రుని మూలమున భయపడనక్కర లేదు. ఈ విషయములో ఇంద్రుడు కోపగించుకోవటానికేముంది? సరే, క్రోధుడయ్యాడు, మనకి పోయేదేముంది? నగరాలా? భవనాలా? రాజ్యాలా? వ్యాపారాలా?? మీకవేవీ లేవుకదా! ఏదో ఈ కొండల్లో, కోనల్లో, ఆవులను కాచుకుంటూ ఉండే మనకి భయపడే అవసరం లేదు._* 🙏🏻
*_Meaning: Sri Krishna continued to allay the fears of Nanda and other cowherds: "As our fate is predestined according to our deeds in our earlier births, no one including the creator can change it. Then what to say about others? Please listen to me carefully. All including Devatas (Celestial Gods), Rakshasas (demons), mankind are subject to their destiny and are living within those boundaries. There is no doubt that these beings get small or big bodies, grow up and die in the form of small creatures to huge demons depending upon what they did in their previous births. When Gurus, friends, foes and relatives are experiencing the fruits of their own deeds of earlier births, they should not be indulging in service/allegiance to extraneous powers. It is like the housewife who deserts a family for personal pleasure._*
*_All the living beings are made of five primordial elements earth, water, fire, air and space and these need not fear Indra, that he would become angry. Even if he is unhappy with us, do we have big buildings, cities, empires or business to lose? Let us not fear him, as we are innocent cowherds tending our cows and calves in far-off areas like forests and hillocks._* 🙏🏻
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి