21, జనవరి 2021, గురువారం

Sanskrit

 






Doctor advise






 

Vinayaka






 

Gaanam




 

పంచాయతన పూజ

 🌹🙏పంచాయతన పూజా విధానం !


ఆదిత్యం అంబికామ్ విష్ణుం గణనాథం మహేశ్వరం

పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం


ఆదిత్యం – సూర్యుడు,

అంబికా – అమ్మవారు,

విష్ణుం – మహావిష్ణువు

గణనాథం – గణపతి

మహేశ్వరం – ఈశ్వరుడు

ఈ ఐదుగురినీ పంచాయతన దేవతలని అంటారు. హిందూ ధర్మశాస్త్రాలు వీరిని ప్రధాన దేవతలుగా పేర్కొన్నాయి.


‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్” అన్నారు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. కర్మ సాక్షి. యావత్ సృష్టికీ శక్తిని ప్రసాదించగల మహా తేజస్వి, ఓజస్వి. ఆయనను ఆరాధించడం ద్వారా ధృఢ ఆయురా రోగ్యాలను పొందుతారు.


‘సాహిశ్రీరమృతాసతాం – అమ్మ వారిని మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ రూపమైన లలితాంబికగా ఆరాధించాలి. అమ్మవారి ఆరాధన వలన అఖండమైన వాక్ శుద్ధి, సంపద, భాగ్యం, త్రికాల దర్శనం, దివ్యదృష్టి వంటి అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి. వీటన్నింటి కన్నా అంతఃకరణ శుద్ధి కలిగి మానసిక పరిణతి పొందుతారు.


‘మోక్షమిచ్చేత్ జనార్ధనాత్’ – మొక్షాన్నిచ్చే వాడు మహావిష్ణువు. విష్ణువు యొక్క దశావతారాలలో ప్రధానమైనది శ్రీకృష్ణా వతారం. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అని అంటారు. ఆయన ఆవిర్భావం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం. శిష్టులను రక్షించడం అంటే కేవలం దుష్టుల నుండి కాపాడడమే కాక పతనమయ్యే మార్గం నుంది వారిని రక్షించి మోక్షమార్గాన్ని ఉపదేశించే భగవద్గీతా శాస్త్రాన్ని మానవ జాతికి ప్రసాదించాడు.


‘ఆదౌపూజ్యో గణాధిప’ ఏ కార్యమును ప్రారంభించినా మొదటగా పూజించబడేది గణపతే. మహా గణపతి యొక్క ఆరాధన ప్రధానంగా యోగసాధనకు ఉపకరిస్తుంది. దీనివలన సాధనలో ప్రతిబంధకములు తొలగడమే కాకుండా ఐహిక, ఆముష్మిక వాంచలు కూడా నెరవేరుతాయి.


‘ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్’! ఈశ్వరానుగ్రహం వలన ఆయుష్షు వృద్ధి పొంది, సకలైశ్వర్యాలూ సంప్రాప్త మౌతాయి. రుద్రాభిషేకాలు, రుద్రజపం మొదలగు వాటి వాళ్ళ సకల దుహ్ఖ నివారణ కలిగి, గ్రహ బాధలు తొలగి స్వాంతన, ఐశ్వర్యసిద్ధి, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.


కావున నిత్యం ఈ దేవతలనారాధించే వారికి సకల శుభములు చేకూరు తాయని ధర్మశాస్త్రాల యొక్క ప్రతిజ్ఞానువచనం.

అయితే మనకు వంశపారం పర్యంగా, సంప్రదాయ సిద్ధంగా సంప్రాప్తమైన దైవం ఎవరైతే వారిని ప్రధానంగా మధ్యలో పెట్టి, మిగిలిన నలుగురు దేవతలను నాల్గు దిశలలో స్థాపించి ఆరాధించాలి. అంటే మన ఇంటి ఇలవేల్పు విష్ణువైతే విష్ణువుని మధ్యనుంచాలి. ఈశ్వరుడైతే ఆయనను మధ్యలో వుంచాలి..

💐🙏🌹

శతరుద్రులు

 శతరుద్రులు వారిపేర్లు!


వీరశైవంలో శతరుద్రులప్రసక్తికనబడుతున్నది.వీరుశివుని పరివారంగా చెప్పుతూ ఉంటారు.వీరంతాదశదిశలనిలచియుంటారట! వారివివరాలు ఇవి.


తూర్పునందు.

1.కపాలీశ  

2.అజ  

3.బుద్ద  

4.వజ్రదేహ  

5.ప్రమర్ధన  

6.విభూతి  

7.అద్వయ  

8.శాంత  

9.పినాకీ  

10.త్రిదశాదిపతి వీరు దశరుద్రులు.

వీరంతా మహేంద్రునిచే అర్చింపబడుచుందురు.

వీరంతా తూర్పు దిశనుండి రుద్రులుగా చెప్పబడ్డారు.

వీరు మూడున్నరకోటి భూతములతో పరివేష్ఠించియుందురు.


ఆగ్నెయమందు:

1.అగ్నిరుద్ర  

2.హుతాశ  

3.పింగళ  

4.ఖాదక  

5.హర  

6.జ్వల  

7.దహన  

8.విభు  

9.భస్మాంతక  

10.క్షయాంతక రుద్రులు కలరు.


దక్షిణమందు:

1.మృత్యుహర  

2.ధాత  

3.విధాత  

4.కర్తా  

5.కాల రుద్ర  

6.ధర్మాధర్మపతి  

7.సంయోక్త  

8.వియోక్త  

9.యమరాజ

10.మహారుద్ర .


నైరుతియందు:

1.మారణం  

2.హంత  

3.క్రూరేక్షణ  

4.భయాంతక  

5.ఊర్ద్వశేఫ  

6.ఊర్ద్వకేస  

7.విరూపాక్ష  

8.ధూమ్ర  

9.లోహిత  

10.దంష్ట్రావాన్.


పశ్చిమమందు:

1.బల  

2.అతిబల  

3.పాసహస్త  

4.మహాబల  

5.శ్వేత  

6.జయభద్ర  

7.దీర్గబాహు  

8.జలాంతక  

9.బడవాముఖ  

10.భీమ.


వాయువ్యమందు:

1.దీర్ఘబాహు  

2.జలాంతక  

3.శీఘ్ర  

4.అనర్ఘ  

5.వాయువేగ  

6.మహాబల  

7.జయభద్ర  

8.సూక్ష్మ  

9.తీక్షణ  

10.క్షయాంతక.


ఉత్తరమందు:

1.నిర్ధూమ  

2.రూపవాన్  

3.ధాన్య  

4.సౌమ్యదేహ  

5.ప్రమర్ధన  

6.సుప్రమాదో  

7.ప్రమాద  

8.కామరూపి  

9.వీర  

10:మహావీర.


ఈశాన్యంమందు:

1.విద్యాధిప  

2.ఙానభుజ  

3.సర్వఙ  

4.వేదపారగ  

5.మాతృవృత  

6.పింగళాక్ష  

7.భూతపాల  

8.బలిప్రియహ్  

9.సర్వవిద్యా విధాత  

10.సుఖ దుఖఃకరహ


ఇక అనంతుని రుద్ర గణములు.

1.అనంత  

2.పాలక  

3.వీర  

4.పాతాళీశ  

5.వృషపతి  

6.వృషభ  

7.శుభ్ర  

8.లోహిత  

9.సర్వతోముఖ  

10.ఉగ్ర.

వీరంతా అనంతునిచే పూజింపబడుదురు.


బ్రహ్మాండము ఉపరిభాగమున శంభురుద్రులు కలరు.

1.ప్రభు  

2.శక్తి  

3.శంభు  

4.విభు  

5.గణాద్యక్ష  

6.త్రక్ష  

7.త్రిదశవందిత  

8.సంవాహ  

9.వివాహ  

10.నభోలిప్స.

వీరంతా దక్షిణహస్తమున కపాలము ధరించి,

పంచముద్రా,ఖట్వాంగ శూలయుక్తులై, జటాజూటధరులై, శశాంకకృత శేఖరులై వుందురు.!

అన్నమాచార్య చరితము

 🌹 అన్నమాచార్య చరితము 🌹


అన్నమయ్యత్యంత యాత్మ తృప్తిని పొంద 

             సంసార సహచర సతుల తోడ 

శ్రీ యహోబల దివ్య క్షేత్రరాజంబున 

            వాసముండెను కొన్ని వాసరములు 

యనుదినంబున వార లా యహోబలు గాంచి 

            తరియించు చుండిరి తన్మయమున 

నగములందున్నట్టి నవనారసింహుల 

            దర్శించి వారలు ధన్యు లైరి 

భవ్యమగు క్షేత్ర మహిమకు పరవశించి 

నారసింహుని దలచియు నమ్రతగను 

దివ్య హరి కీర్తనంబు లా తీర్థమందు 

యాలాపించియు జెప్పెను యన్నమయ్య 



ధర యహోబల మఠ స్థాపనాచార్యుడౌ 

            ఆదిపణ్ శఠకోపయతుల వద్ద 

వైష్ణవాగమ దివ్య వాజ్ఞ్మయ మంతయు 

            నధ్యయనము జేసె నన్నమయ్య 

యాచార్యు బోధన లవగతం బైనంత 

            పరబ్రహ్మ రూపమున్ ప్రస్తుతించె 

హరి సర్వమయుడను యద్వైత భావంబు 

            యంతరంగమునందు నలము కొనియె 

కుల విచక్షణ గోడలుం గూలదోసి 

సర్వమును విష్ణుమయమని సన్మతొంది 

సర్వ జగతిలొ హరిబోధ స్పల్ప నెంచి

మదిని పరమాత్మ యందున మగ్న పరచె 


అన్నమయ్య పిదప నటనుండి కదలియు 

దక్షిణాది నున్న దైవ గుడుల 

దర్శనంబు పొంది తరుణుల తోడను 

చేరె తాళ్లపాక స్థిమితముగను 


             రాజాశ్రయము 


నర వరుడగు సాళ్వ నరసింహరాయలు 

క్షితిని టంగుటూరు కేంద్రముగను 

దండనాధునిగను ధరపాలనము జేసె 

విజయనగర ప్రభుత యేలుబడిలొ 


దండనాథుని పదవిలో ధరను వెలిగి 

" మూరు రాయర గండ " ను పేరు పొంది 

సాళ్వ నరసింహరాయలు సరస ముగను 

టంగుటూరును పాలించె పొంగ ప్రజలు 


విజయనగర రాజ్య విభవంబు చాటెడి 

దండనాయకునిగ ధరను నేలు 

సరసుడైన సాళ్వ నరసింహరాయలు 

యాంధ్రభోజునకును యగును తాత 


సాళ్వ నరసింహరాయలు సఖుల వలన 

యన్నమాచార్య కీర్తనల్ కొన్ని వినియు 

పాట లందున్న భక్తికి పరవశించి 

తాళ్లపాకకు వెళ్లెను తనను గలువ 


అన్నమాచార్యు దర్శించి సన్నుతించి 

యాతడుడివిన కీర్తన లాలకించి 

భక్తి భావంబు దలచియు పరవశించి 

సాన్నిహిత్యంబు పొందెను సాళ్వ నృపతి 


కాలగర్భంబు నందేండ్లు గడచిపోగ 

దండనాథుని నుండియు తదుప రతడు 

పాలకుండయ్యె పెనుగొండ ప్రాంతమునకు 

దైవ లీలలు శక్యమే తలచ నరుకు !


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ఆచమనం విశిష్టత

 *🌷ఆచమనం విశిష్టత🌷*


     మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.


    మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి.


అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి. ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొదలైనవిగా విభజించారు. ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది.


అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది.


నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.


ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. ‘కే’ శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.


మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది, మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది.


ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.


ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు.

మనసెరిగిన మాధవుడు..

 మనసెరిగిన మాధవుడు.. 


         గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. 
              ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో  తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?
              నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. 
             మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.

                 ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి?  దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు. 

                  అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు  అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.
                   ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయున్ని!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి  ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. 

                తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.

               కుమారుడు బిగ్గరగా అరుస్తూ," నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 

                     తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి  విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.

                      భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా!. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!.

                     ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.
                     ఓం మాధవాయ నమః 

బ్రాహ్మణులు

 స్వామి నాధన్ సుందరమణి అనే ఒకాయన ఫేస్ బుక్ లో తమిళంలో పెట్టిన పోస్టుకు తెలుగు అనువాదం :


నానాటికీ బ్రాహ్మణులు తగ్గిపోతున్నారు . కొన్ని సంవత్సరాల తరువాత బ్రాహ్మణ జాతి కనుమరుగై పోయినా ఆశ్చర్య పడనవసరం లేదు .

కారణం వర్ణాంతర వివాహాలు .


ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 40 సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి కాకుండా కన్యలకోసం ఎదురుచూస్తూ బ్రహ్మచారుల్లా మిగిలిపోయిన బ్రాహ్మణ యువకులు వేలల్లో ఉన్నారు .


 కారణం అమ్మాయిలు దొరకడం లేదు . అమ్మాయిలు ఎందుకు దొరకడం లేదు ? అమ్మాయిలు తగ్గిపోయారు . అమ్మాయిలు ఎందుకు తగ్గిపోయారు ? వర్ణాంతర వివాహాల వల్ల .


మన బ్రాహ్మణ సమాజం ఈ వర్ణాంతర వివాహాల వల్ల విధ్వంసమైపోతోంది . ఇతరులు బ్రాహ్మణ యువతులను ప్రేమ పేరుతో తరలించుకొని పోతుంటే బ్రాహ్మణ సమాజం నుండి ప్రతిఘటన లేకపోవడం , కనీసం గట్టిగా నిరసన వ్యక్తం చెయ్యకపోవడం , రక్షణాత్మక చర్యలకై ఉపక్రమించక పోవడంతో ... నానాటికీ బ్రాహ్మణ యువతులను మభ్యపెట్టి వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్న సంఘటనలు విపరీతంగా పెరిగి పోతున్నాయి . తల్లిదండ్రులు తమ కూతురిని పెద్ద చదువులు చదివించి ప్రయోజకురాలిని చేస్తే , ఆ అమ్మాయి తన గర్భంలో బ్రాహ్మణులను పరిహసించి దూషించి ద్వేషించేవాడికి బిడ్డలను కని ఇస్తోంది . కొంత మంది బ్రాహ్మణ యువతులకు మగవాడిలో రూపం డబ్బూ హోదా తప్ప కులం గోత్రం ఆచారం ధర్మం సంస్కృతి ఏవీ కనబడడం లేదు . క్షేత్రం ఇలా వెళ్లి పోతుంటే కులం ఏమైపోతుంది ? తను జన్మించిన కులాన్ని ధిక్కరించి వెళ్లిపోతున్న ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు ఎలా పెంచారు ? మన వర్ణాశ్రమ ధర్మాలు , ఆచారాలు కట్టుబాట్లు ఏమీ నేర్పకుండా అంటూసొంటూ లేకుండా పెంచారా ? లేక వారికే అసలు ఆచార వ్యవహారాలు లేవా ? ఇలా బ్రాహ్మణ సమాజాన్ని అవహేళన చేస్తూ వర్ణాంతర వివాహాలు చేసుకునే ఆడపిల్లలకూ , వారేమంటే దానికి తందాన తాన అంటూ దగ్గరుండి మరీ వర్ణ సంకరం పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులకూ పురోహితులు ఎందుకు సహకరిస్తున్నారు ? వారి బంధువులు స్నేహితులు ఆ పెళ్లికి హాజరై భోజనాలు చేసి ఆశీర్వదించి వస్తున్నారు ? వారికి సిగ్గూ శరం చీమూ నెత్తురూ లేవా ? ఒక అమ్మాయి నీ కులం నుంచి వెళ్లిపోయినప్పుడు పళ్లికిలిస్తూ నిలబడితే , రేపు నీ కొడుకుకో మనవడికో పిల్ల ఎక్కడినుంచి వస్తుంది ? నీ కులం విధ్వంసానికి గురౌతున్న విషయం గుర్తించవే ? క్షణికమైన విలాసాలు , డబ్బు , రూపం ఆడపిల్లలకు వారి కుల శ్రేయస్సు కంటా ఎక్కువైపోతోంది అంటే పెంపకంలో ఎక్కడో లోపం జరుగుతోంది . బ్రాహ్మణులందరూ ఏకతాటిపై నిలిచి మన సమాజంలోని ప్రతిఒక్కరినీ మన వర్ణాశ్రమ ధర్మాలను గౌరవించేలా , వాటిని పాటించేలా కృషి చేయకపోతే భవిష్యత్తు అంధకారమే . ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు అత్యాశకు పోకుండా సాటి బ్రాహ్మణ యువకుడికి కన్యాదానం చేయాలి . ఇరవై ఆరేళ్ళ కుర్రాడికి సొంత కారు , సొంత ఇల్లు ఎలా వస్తాయి ? మీరు బంగారం కొని సువర్ణ దానం చేయవచ్చు . పొలం కొని భూదానం చెయ్యవచ్చు . ఆవును కొని గోదానం చెయ్యవచ్చు . కన్యాదానం చెయ్యాలంటే కన్యని కొని చెయ్యలేరు కదా ? దయచేసి మీ అమ్మాయిలను ఒక బ్రాహ్మణ యువకుడికే ఇచ్చి వివాహం చేయండి అని ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ బ్రాహ్మణ సమాజం ఇంటింటికీ వెళ్లి అభ్యర్ధించాలి . తక్షణమే సామూహికంగా రక్షణాత్మక చర్యలకై ఉపక్రమించక పోతే బ్రాహ్మణ సమాజం ఉనికే లేకుండా పోయే ప్రమాదం అతి దగ్గరలో ఉంది.  తస్మాత్ జాగ్రత్త {Copied}

అరుణగిరి ప్రదక్షిణ

 *🙏🌺అరుణగిరి ప్రదక్షిణా మహాత్మ్యం🌺🙏*


    🌺 అరుణాచల ప్రదక్షిణం నిజానికి శివశివానీలకు చేసే సాక్షాత్ ప్రదక్షిణే! 

 ప్ర - అంటే పాపసంహారం . 

 ద - కామ్యసిద్ధి 

 క్షి - జన్మరాహిత్యం 

 ణ - జ్ఞానమార్గంలో ముక్తి 🌺

      🌺పురాణ సంస్కృతి అరుణాచలం ఒక గొప్ప స్మృతి. 

      అరుణాచలం, జీవుడికి దేవుడికి ఉన్న దివ్య ప్రబంధం. కనబడే పూల, కనబడని దారం కలిసి ఉన్నట్లు! శివ కుటుంబమంతా, కొలువుదీరిన కైలాసమే, అరుణాచలం.

         వెన్నెలలో అరుణాచల దర్శనం ఒక అపురూప ఆధ్యాత్మిక అనుభవం. మనసు నిశ్చలం చేసుకొని, నెమ్మదిగా నడుస్తూ, గిరిని చూస్తూ, వెన్నెలలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పరమశివ భంగిమలు, ఆకృతులు, అవిష్కృతమవుతూ లోచూపును విశాలం చేస్తూ, అంతరంగ స్పర్శను అనుగ్రహిస్తాయి. క్రమ వైరాగ్యాన్ని, క్రమ సన్యాసాన్ని అనుగ్రహించి, మనసును పరమేశ్వరాయత్తం చేయగల శక్తి, గిరి ప్రదక్షిణలలో ఉన్నది. 🌺

     🌺 అయిదు ముఖాలుగా గోచరించే సదాశివ స్వరూపం సాధకుణ్ణి అంతర్ముఖుణ్ణి చేసి, జ్యోతిర్మయమైన లో వెలుగును ఆత్మగా దర్శనీయం జేసి ఆత్మనిష్ఠలో నిలకడ చెందించే పరమాద్భుత సాధన, గిరి ప్రదక్షిణ! గిరి, గురువు, గురి ఏకమై నిలిచిన అరుణాచలదర్శనం ఆత్మదర్శనం కంటే భిన్నం కాదు.

      అరుణాచల స్మరణమే ముక్తి! ప్రదక్షిణ అనుగ్రహించే శాంతి, శక్తి , వైరాగ్యం , జ్ఞానం , పరమానందం అనిర్వచనీయం . అది అనుభవైక వేద్యం . హృదయంగమం. జీవాత్మ, పరమాత్మల నిత్య సంగమం! 

      ప్రయత్నమంతా కనబడుతున్నది. కనుక అది జీవ ప్రజ్ఞ. 

       ప్రేరణ కనబడటం లేదు. కానీ అంతటికీ అదే కారణమౌతున్నది. అది దైవ ప్రజ్ఞ . 

ఈ సన్నివేశంలో ఈషణ త్రయాలు నశించి ఉంటాయి. పిల్లలు, ఇల్లు, ఇల్లాలు మూడు బంధాలుగా ఉన్నా, బంధన స్థానం మాత్రం ప్రాపంచికమే .🌺   


*🌺అరుణాచల శివ! అరుణాచల శివ!🌺*

ఆత్మకు శాన్తి

 🌺సేకరణ🌺

ఇది ఆర్. శేషగిరిరావు గారి సందేశం. 


మరణించిన వారి ఆత్మకు శాన్తి చేకూరాలని ఎందుకు అంటారు? 


ముందుగా ఆత్మకు శాన్తి చేకూరడం అంటే ఏమిటి? 


నిజానికి వాసనా రహితమైన ఆత్మ పరమాత్మతో సమానమైనది. ఈ రెండింటికీ మధ్య భేదం లేదు. అట్టి స్థితిలో ఉన్న ఆత్మ సదా ఆనందమయ స్థితిలో ఉంటుంది. మరి దానికి శాన్తి చేకూరడం ఏమిటి? అనే సందేహం వస్తుంది. ఆత్మ వాసనా రహితమై యున్న నాడు మాత్రమే అది ఆనందమయ స్థితిలో పరమాత్మకు సమానమై ఉంటుంది. అయితే, ఆత్మను పలు విధాలైన వాసనలు, కామ వాంఛలు ఒక పొరవలె కప్పి ఉంచుతాయి. 


ధూమేనావ్రియతే వహ్నిర్యథాఽఽదర్శో మలేన చ ।

యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। భగీ 03-38।।

పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమున్ను, మావిచేత గర్భ మందలి శిశువున్ను ఏవిధంగా కప్పబడి యుండునో, అదే విధంగా కామము చేత ఆత్మజ్ఞానము కూడా కప్పబడి యుండును.

ఈ విధంగా కామము ద్వారా కప్పబడి యున్న ఆత్మ యొక్క సహజమైన ఉనికి ఏనాడు బహిర్గతం కాదు. 


ధ్యాయతో విషయాన్ పుంసః సజ్ఞ్గస్తేషూపజాయతే ।

సజ్ఞ్గాత్సంజాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ।।భగీ 02-62।।

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః ।

స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి ।।భగీ 02-63।।

శబ్దస్పర్శాది విషయ వాంఛల పట్ల సదా చింతించు మనుజుడు, అట్టి విషయములందు ఆసక్తి కలుగుట అధికమగు చున్నది. ఇట్టి ఆసక్తి వలన కోరిక పుట్టు చున్నది. ఇట్టి కోరిక వలన క్రోధము ఉత్పన్నమగు చున్నది. క్రోధము వలన మనుజుడు తన వివేకమును కోల్పోవు చున్నాడు. ఈ విధముగా వివేకము లేదా జ్ఞాపక శక్తి నశించుట వలన బుద్ధి నాశనము జరుగును. బుద్ధి నాశనము జరిగిన మనుజుడు పూర్తిగా నశించి పోవుట లేదా అధోగతి పాలగు చున్నాడు. 


భగవద్గీతలో సూచించిన ఈ తత్త్వమును అనుసరించి, మనిషికి మరణానంతరం కూడా తన పూర్వ జన్మ వాసనలు ఆత్మను కప్పి ఉంచుతాయి. అట్టి వాసనలకు అనుగుణంగా ఉండే విధంగా గల దేహంలో అది ప్రవేశిస్తుంది, తదనుగుణంగా జీవిస్తుంది. ‘ఆత్మకు శాన్తి చేకూరాలి’ అనగా ఆత్మను కప్పిపెట్టి ఉంచిన ఈ పొరలు తొలగిపోవాలి. అప్పుడే అది శుద్ధ తత్త్వము గా మారుతుంది. అట్టి ఆత్మకు మరియు పరమాత్మకు భేదం ఉండదు. ఈ పొరలు తొలగిపోయిన నాడు దానికి సద్గతి లభిస్తుంది. ఉత్తమ లోకాలు లభిస్తాయి. ఇంకా జ్ఞాన సాధన చేసిన ఆత్మకు పరమపద సోపానము కూడా లభిస్తుంది. అట్టి ఆత్మ సంపూర్ణ ఆనందమయ స్థితిలో ఉంటుంది. ఈ స్థితి ఆ ఆత్మకు లభించాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించుట. 


మన హిందూ సంస్కృతిని అనుసరించి దాదాపుగా 90% మరణించిన పిమ్మట శవానికి అగ్ని సంస్కారం చేస్తారు, అనగా మంత్రాగ్నితో ఆ శవాన్ని దహనం చేస్తారు. దహనం చేసిన పిమ్మట 2వ రోజు ఆస్తిక సంచయనం చేసి అట్టి అస్తికలతో అపర కర్మకాండ జరిపిస్తారు. ఇట్టి కర్మ కాండ ఎందుకు చేస్తారంటే, మరణించిన పిమ్మట కర్మకాండ సంపూర్ణంగా జరిపే వరకు ఆ జీవుడు ప్రేత రూపంలో ఉంటాడు. అట్టి ప్రేతకు విముక్తి కలిగి అది మరొక శరీరంలోకి ప్రవేశించాలి. అందుకే అపర కర్మకాండ విధిగా జరపాలి. మన శాస్త్రాలను అనుసరించి సరియైన విధంగా కర్మకాండ జరపని ఎడల అట్టి జీవుడు ప్రేత రూపంలోనే ఉండిపోతాడు. కాని ఖననం చేసిన వారికి ఈ విధమైన కర్మకాండ ఉండదు. 


స్వస్తి 


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – 

న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – 

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।

🙏🙏🙏